I కోరింథీ అధ్యయనం-3 1:18-25 సిలువలోని విభజించే తత్త్వము

 

I కోరింథీ అధ్యయనం-3  1:18-25

సిలువలోని విభజించే తత్త్వము

    జీవితాన్ని ఒక ప్రయాణముతో పోలుస్తారు. నిజమే, ఆగడం, మళ్ళీ వెళ్ళడం, ప్రమాదాలు జరగడం, కొన్ని 

అనుభవాలు తీయనైనవి, మరి కొన్ని చేదైనవి ఇలా ఎంకెన్నో.. ప్రయాణమయిపోయాక అలిసిపోయినట్టే, ఈ జీవిత 

ప్రయాణములో మీరు అలిసిపోయిఉండవచ్చు. రండి దేవుని వాక్యము ద్వారా, ఆయన సన్నిధిలో సేద 

తీర్చుకుందాం. 

         మనమంతా ఒక్క రక్తములో నుండి జన్మించామని బైబిల్ బోధిస్తున్నది. ఆపో. పౌలు ఏథెన్స్ లో మార్స్ 

కొంద మీద చేసిన ప్రసంగములో ఈ సత్యమును ప్రకటించాడు. ఆ.కా. 17:24-27 26వ వచనము మధ్య భాగములో 

“ఒకనినుండి” అనే మాటలు గమనించారా? మూల భాషలో “ఒకని రక్తమునుండి” అని తర్జుమా చేయబడింది. 

(KJVలో “from one blood”అని వ్రాయబడింది.) ఉన్నత మేధావులు తత్వవేత్త లైన వారితో పౌలు 

అంటున్నదేమిటి? మీరూ, మీరు నీచంగా చూచే మీబానిసలు అంతా ఒక్క రక్తములో నుండి వచ్చినవారే! 

తెలివితేటలు మానవులను గర్వపడేలా చేస్తాయి. ఆపో. పౌలు “జ్ఞానము ఉప్పొంగ చేయును” అని బోధించలేదా? 

సువార్త సామాన్యమైన వ్యక్తిని హెచ్చిస్తుంది, అలాగే, చీఫ్ ఎక్సెకూటివ్ ఆఫీసర్ ను తగ్గించుకునేలా చేస్తుంది. 

సిలువదగ్గర హెచ్చు తగ్గులు లేవు. అమెన్?

         సువార్త అనే మాటకు మూల పదం “evangel” అనగా మంచి వార్త అనిఅర్ధం. మీరొకవేళ సువార్త 

హెచ్చుతగ్గులు తేసివేసి ఒక్క స్థాయిలో ఉంచుతుంది, ఇదేమి మంచివార్త అంటారేమో! మనమంతా దేవుని 

సన్నిధిలో ముందేఉండవలసిన అర్హతలేమీ లేవు. మానవ చరిత్రలో వ్యక్తులు వారి జీవితాలను భంగపరచుకున్నారు, 

దేశాలు మహాదేవుని ప్రకటన సిలువను తిరస్కరించారు. ఎక్కడికక్కడ సిలువ సరిగ్గా విభజిస్తుంది. క్రీస్తు సిలువ 

విభజిస్తుంది. ఏ ఒక్కరూ  యేసు క్రీస్తు సిలువవద్ద నిటారుగా గర్వంగా నిలువబడలేరు. అమెన్! సిలువ అందరినీ 

తగ్గించుకునేలా చేసి వారిని వంచుతుంది. I కోరింథీ పత్రిక 1:18-25 చదువుకుందాం.

             18 సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు           దేవుని శక్తి.
              19
ఇందు విషయమైజ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకుల వివేకమును              శూన్యపరతును అని వ్రాయబడియున్నది.
              20
జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు తర్కవాది యేమయ్యెను? ఈలోక    జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా?
              21
దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త        ప్రకటన యను వెఱ్ఱి తనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయా పూర్వక సంకల్ప    మాయెను.
              22
యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసుదేశస్థులు జ్ఞానము వెదకు     చున్నారు.
              23
అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము.
              24
ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై             యున్నాడు.
              25
దేవుని వెఱ్ఱితనము మనుష్యజ్ఞానముకంటె జ్ఞానముగలది, దేవుని బలహీనత మనుష్యుల   బలముకంటె బలమైనది.     

    సరియైన పద్ధతిలో ప్రకటించబడినపుడు ఏ విధంగా సువార్త ఏ విభజనలు చేస్తుoదో పౌలు ఈ లేఖన భాగములో 

వివరించాడు.

    మొదటి విభజన సిలువ పునరుత్పత్తి చేసి విభజిస్తుంది.  18వ వచనంసిలువనుగూర్చిన వార్త,  

నశించుచున్నవారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.” ఆపో.  

ఒకవైపు నశిస్తున్నవారినగూర్చి, మరొకవైపు రక్షింపబడుతున్నవారిగూర్చి మాట్లాడుతున్నాడు. సిలువ మానవ 

జాతిని రెండు గుంపులుగా విభాగిస్తుంది. యేసు ప్రభువు యోహాను సువార్త 3:17-21లో ఏమి సెల విచ్చారో 

గమనించండి. 

         17 లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు            దేవుడాయనను లోకములోనికి పంప లేదు.
            18 ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని           

            అద్వితీయకుమారుని నామమందు విశ్వాస ముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు             తీర్చబడెను.
            19 ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున    మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.
            20 దుష్కార్యము చేయు4 ప్రతివాడు వెలుగును ద్వేషిం చును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు.
            21 సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును
.
    

        స్నేహితుడా, సోదరీ, ఇవి స్వయానా, యేసు క్రీస్తు ప్రభువు నోటి మాటలు. ఆటో ఇటో మనుషులను 

విభజించే మాటలు. మధ్యస్థంగా తటస్థంగా ఉండడానికి ఏమాత్రం తావులేదు. సిలువ విభజిస్తుంది. మనుషులను 

రెండు గుంపులుగా విభజిస్తూనే ఉన్నది. మీరు ఏ గుంపులో ఉన్నారో తెలుసుకున్నారా?

         రెండవ విభజన సిలువ జ్ఞానులను విభజిస్తుంది. 19-23 వచనాలు గమనించండి:

         19 ఇందు విషయమైజ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకులవివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది.
            20 జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు తర్కవాది యేమయ్యెను? ఈలోక    జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా?
            21 దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త       ప్రకటన యను వెఱ్ఱి తనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయా పూర్వక సంకల్ప    మాయెను.
            22 యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసుదేశస్థులు జ్ఞానము వెదకు     చున్నారు.
            23 అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము.

మేధావులను ముందుంచుదాం. ఆపో. అంటున్నాడు, జ్ఞాని ఏమయ్యాడు? జ్ఞానమును, తెలివితేటలను  ప్రేమిస్తూ   

జ్ఞానమును వెంటాడేవాడు జ్ఞాని. ఎంత జ్ఞానము సంపాదిస్తే అంతా సంతోషంగా ఉంటాడు. ఆ తరువాత పౌలు ప్రశ్న 

శాస్త్రి ఏమయ్యాడు? ధర్మశాస్త్రమును, మోషే ధర్మశాస్త్రమును, రోమా చట్టమునుచేత్తో ఎత్తి వ్రాసేవాడు శాస్త్రి. అనగా 

నడిచే శాస్త్రీయగ్రంధమన్న మాట. దేనికైనా జవాబు చెప్పగలవాడు. ఆ తరువాత తర్కవాది ఏమయ్యాడు? అనే 

ప్రశ్న. పరిశోధనలు చేసేవారు వీరు. పండితులు ఏమి చెప్పారో చదివి, చదివి, గ్రహించి విశదీకరించే వారు. ఈ 

ముగ్గురిని ఒకవైపు ఉంచుదాం. జ్ఞాని, శాస్త్రి, తర్కవాది. దేవుని జ్ఞానము వారందరి జ్ఞానమునకు మించినది, ఆయన 

జ్ఞానము ముందు వారి జ్ఞానము కురుచగా ఉంటుంది. సిలువ ఈ విధంగా మానవ జ్ఞానమును విభజిస్తుంది.   

         మానవ మేధస్సు, జ్ఞానము దేవుని జ్ఞానమును గ్రహించజాలదు. వెనక్కి పారిపోతుంది. నిజానికి చెప్పాలంటే 

ఎగిరిపోతుంది, అని చెప్పాలి. దేవుని మనమేమైనా తెలుసుకోవాలనుకుంటే, ఆయన తెలియచెప్పింది, 

బయలుపరచింది ఒక్కటే మార్గం. అడ్డుబండ యేసు క్రీస్తు. యూదుని సిలువ అడ్డుబండ. కానీ పాత నిబంధన 

అంతటా ఎక్కడ చూచినా ఆర్పణలు, బలులు కనిపిస్తాయి. దేనికోసం ఏ బలి ఏ అర్పణ చేయాలో ఉంటుంది. మరి, 

ఇది ఎందుకు అడ్డుబండ అయ్యింది?

         గ్రీకు వారికి, యూదేతరులందరికీ సిలువ వెర్రితనముగా ఉన్నది. యేసు క్రీస్తు సిలువమీద మర ణించాడని 

వారు నమ్మాలని ఆశించడం వారికి అర్ధoలేని మూఢత్వం అని వారికి అనిపిస్తుంది. కానీ దానికి వారివద్ద 

అంగీకరించదగ్గ జవాబు లేదు. దీనికంటే శ్రేష్టమైనదాన్ని వారు చూపించనూలేరు. శ్రోతలూ, సిలువముందు మానవ 

జ్ఞానము గందరగోళమే!

         మూడవ విభజన, సిలువ తన ప్రత్యర్డులను విభజిస్తుంది.  24-25 వచనములు ఆయన 

యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి,  

పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు. దేవుని వెఱ్ఱితనము 

మనుష్యజ్ఞానముకంటె జ్ఞానముగలది, దేవుని బలహీనత మనుష్యుల బలముకంటె బలమైనది.”   

     సిలువ ఇచ్చే పిలుపు యూదులను, యూదేతరులను, మతాసక్తి గల వారిని, తెలివిమంతులను, వారికిష్టము 

వచ్చినట్టు ఉండే వారిని, అందరినీ ఎదుర్కుంటుంది. యేసు ప్రభువు అందరినీ పిలిస్తున్నారు: “ప్రయాసపడి భారము 

మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. నేను సాత్వికుడను 

దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు 

విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి. ఇవి స్వయానా యేసు 

క్రీస్తు ప్రభువు మాటలు. అలిసిపోయినవారిని ఊరడించి సేద తీర్చే మాటలు. అందరూ అలిసిపోయి ఉన్నారు. ఇది 

ధన్యులను చేసే  పిలుపు. క్రీస్తు ముందుకెళ్లడానికి శక్తినిస్తాడు. నిన్ను బలవంతునిగా చేస్తాడు. గ్రహించగలిగే 

జ్ఞానమిస్తాడు. అమెన్! గమనించండి, శ్రోతలూ, దేవుని బుద్ధిహీనత మన బుద్ధి కంటే గొప్పదని ఆపో. 

బోధిస్తున్నాడు. పుస్తకాలన్నీ తిరగేయండి, కంప్యూటర్, సాఫ్ట్ వేర్ అంతా ముందు పెట్టుకొని అన్నీ అధ్యయనం 

చేయండి. అన్నీ నేర్చుకున్నాక, మీరు చేసినదంతా చేసిన తరువాత, మీకు తెలిసిందానికన్న తెలియనిదే ఎక్కువని 

చివర్లో తెలుసుకుంటారు. అవును, శ్రోతలూ, దేవుని బుద్ధిహీనత మన జ్ఞానము కంటే గొప్పది. దేవుని బలహీనత 

మన బలము కన్నా బలమైనది. మానవుని పరిశోధించి కనిపెట్టిన యంత్రాలన్నీ తెచ్చుకోండి, బలముతో లాగే 

యంత్రాలన్నీ తెచ్చుకోండి, మీకు తెలిసినవన్నీ తెచ్చుకోండి. వాటన్నిటినీ దేవుని బలహీనత క్షణంలోనే నెట్టివేస్తుంది. 

10 లక్షల మంది వెయిట్ లిఫ్టర్లు మోసే వాటిని దేవుడు తన చిటికెనవేలుతో అవతలికి త్రోసివేయగలడు! అవును, 

అన్నిట్లో చివరి మాట ఆయనదే! రెండు ఎదుర్కున్నపుడు దేవుని జ్ఞానం అత్యున్నతమైనది. హల్లెలూయ!

1.   సిలువ పునరుత్పత్తి చేసి విభజిస్తుంది,  

2. సిలువ జ్ఞానులను విభజిస్తుంది,  

3. సిలువ తన ప్రత్యర్థులను విభజిస్తుంది. 

     ప్రియ శ్రోతలూ, జాగ్రతగా ఆలోచించండి, సిలువ మానవుల సమస్తమైన ఆలోచనలను, ఆశలను ఎలా కొట్టి 

పారేస్తుందో అతి జాగ్రతగా ఆలోచించి మీ నిర్ణయం మేరే తీసుకొనండి. కానీ ఏ నిర్ణయమైనా, దాని ఫలితాలు 

అనుభవించేది మీరే అని గుర్తుంచుకోండి, అంతా అయిపోయాక ఎవ్వరిని నిందించడానికి వీలుండదు, 

సమయముండదు. క్రీస్తు సిలువను సమీపించి పాప క్షమాపణ కోరుకోవడానికి అవసరమైనoత కృప సర్వశక్తిగల 

దేవుడు మీకనుగ్రహించుగాక! అమెన్!!           

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...