మతగ్రంధం కానేకాదు. దేవుడే దానికి సృష్టికర్త. సృష్టికర్త అయిన
దేవుడు తన సృష్టిని ఏ విధంగా,
ఏ కార్యాల ద్వారా పాపమునుoడి విమోచించడానికి దేవుడే స్వయంగా రూపొందించిన పరిశుద్ధ
గ్రంధం బైబిల్. దాదాపు 35-40
మందిని దేవుడు వాడుకొని, 1500 ఏళ్ల కాలములో పరిశుద్ధం గ్రంధం
బైబిల్ రూపొందించబడిoది. మూలప్రతులు వివిధ భాషల్లో ఉన్నాయి. (Original
Documents in
different languages) మన భాషలో అనువదించబడడం ఆశ్చర్యం! ఇంకా ఆశ్చర్యమేమిటంటే
వాటిని భద్రoగా ఎలా కాపాడాడో అదో
అద్భుతం!! అయన చరిత్రలో చేసిన చాలా క్రియలు,
ప్రణాళికలు, ప్రవచనాలు, పలికిన మాటలు, ఆశ్చర్య క్రియలు, అద్భుతాలు, మొదలైనవి దేవుడే
స్వయంగా తన సేవకులను, ప్రవక్తలను అపోస్తలులను వాడుకొని, పరిశుద్ధాత్ముడు (నూటికి నూరు
పాళ్లు దేవుడు) వ్రాయించిన దేవుని గ్రంధమే బైబిల్.
ఎందుకంటే, యేసు క్రీస్తును స్వయంగా
చూచి, తాకి, ఆయన మాటలన్నిటిని 24/7 విని, ఆయనతోనే జీవించినవారు అపోస్తలులు;
అపోస్తలులు అంటే
“పంపపడినవారు” అని అర్ధం. దేవునిచేత పంపబడినవారు అపోస్తలులు.
అనగా ఇప్పుడు అపోస్తలులు ఇకలేరు. ఉన్నారు అని మీరనుకుంటే అది
తిరుగుబాటు
అవుతుoది. వారే స్వయంగా చెప్పిన సాక్షం ఇది: ఏలయనగా చమత్కారముగా కల్పించిన
కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క
శక్తిని ఆయన రాకడను మేము మీకు
తెలుపలేదు గాని ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచినవారమై తెలిపితివిు. ‘ఈయన
నా ప్రియకుమారుడు
ఈయనయందు నేను ఆనందించుచున్నాను’ అను శబ్దము
మహాదివ్యమహిమనుండి ఆయనయొద్దకు వచ్చినప్పుడు, తండ్రియైన దేవునివలన ఘనతయు
మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతముమీద ఆయనతోకూడ ఉండినవారమై,
ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు
ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము
మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము
చీకటిగల చోటున వెలుగిచ్చు
దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు
మేలు. ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని
మొదట
గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు
గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై
దేవుని మూలముగ పలికిరి.” 2వ పేతురు
1:16-21 యేసు క్రీస్తుప్రభువును ముఖాముఖి కన్నులార చూసి, ఆయన “నిత్యజీవపుమాటలు”
చెవులారా విని,
ఆయనను 24/7 తాకి, ఆయన మానవస్వరూపం ఎంతగా చూశారో, ఆయన మహిమ
స్వరూపము అంతగా ఆస్వాదించిన ఆయన అపోస్తలులు వ్రాసిన మాటలు
కొన్ని; ఆయన
అధికారముతో, ఆయన పర్యవేక్షణలో పాత నిబoధనలోని ప్రవక్తలు రాశారు. ఈ లేఖన భాగములో
“వేకువచుక్క” ఎవరు? చీకటిలో వెలుగును
విరజిమ్ముతూ ప్రకాశించిన వేకువచుక్క్త యేసు క్రీస్తు.
క్రొత్త నిబధనలో ఆయన జీవితం, వ్యక్తిత్వం, గుణగణాలు, పరిచర్య, ఆయన స్థాపించిన రాజ్యం
మొదలైనవన్ని రాయబడ్డాయి.
యేసు ప్రభువునకు పాత నిబంధనతో సంబంధO: యేసు ప్రభువు పాత నిబంధనను, అనగా,
అందులోని మాటలను అంగీకరించారు. యేసు క్రీస్తు ప్రభువే పాతనిబంధన గ్రంధములోని
కొందరు వ్యక్తులను, వారి
క్రియలను, వాటి అర్ధమును తన స్వంత మాటల్లో ఎత్తి చూపించడం
ద్వారా పరిశుద్ధ గ్రంధం బైబిల్ లోని చరిత్ర, సత్యములను ధృవీకరించారు. ఉదా||
అబ్రాహాము,
మోషే, నోవహు, మొదలైనవారు.
మొదటిగా పరిశుద్ధ గ్రంధం బైబిల్ ఏమైనది ఎక్కడనుండి
వచ్చింది, ఏ విధంగా వచ్చిందో మనమంతా తెలుసుకొని ఉండాలి.
1. అందులో ఏ తప్పులేదు - Inerrant
పరిశుధ్ధ గ్రంధం బైబిల్లో తప్పు దొర్లడానికి ఏ మాత్రం అవకాశo లేదు. కారణం అది దేవుని మాట.
దేవుని
స్వంత ప్రేరణ వలననే బైబిల్ రాయబడింది. మనము దేవుని వెతికినందునుబట్టి ఆయన
పరిశుద్ధ గ్రంధo బైబిల్ వ్రాయలేదు, నీవు స్వయంగా నమ్మినా,
నమ్మకపోయినా పరిశుద్ధ గ్రoధం
బైబిల్లోని మాటలు దేవునివే!! పరిశుధ్ద్ధగ్రంధం బైబిల్ ఆయనే స్వయంగా రూపించిన,
ప్రేరేపించిన ప్రేమగ్రంధం. బైబిల్
అంతటిలో దేవుని ప్రేమ కనిపిస్తుంది. ఆయన స్వయం
ప్రత్యక్షత అనగా దేవుడు ఎవరో, ఆయన ఎలాంటి వాడో, ఆయన స్వభావం, శక్తి, ప్రభావం, మహిమ,
ఆ మాటకొస్తే దేవుని గురిచి తెలుసుకోవాలని ఆశించే ప్రతి ఒక్కరికి, తెలుసుకోగలిగిన సమస్తము
బైబిల్లో ఉన్నది. అంటే తెలుసుకోలోనిది కూడా ఉందని అర్ధమే
కదా! అవును, దేవుని గూర్చి
సమస్తము తెలుసుకోవడం ఏ మానవునివల్ల కాదు. ఒకవేళ ఎవరైనా ‘దేవునిగూర్చి అంతా
తెలుసుకోవచ్చు’ అనే భావన మీలో
కలిగిస్తే, అది మోసం అని తప్పక పరిశుద్ధ గ్రంధం బైబిల్
స్పష్టంగా సెలవిస్తున్నది. రోమా 1:19,20 “ఎందుకనగా దేవునిగూర్చి తెలియశక్యమైనదేదో అది వారి
మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు,
అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి
మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను
ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.” మనము దేవుని
వెతికిననoదునుబట్టి
ఆయన పరిశుద్ధ గ్రంధం వ్రాయలేదు. ఇది అత్యంత ప్రాధమిక సత్యం.
ఆయన ప్రేరణనుబట్టి, ఆయన గురించి ఏది తెలుసుకోవడం అవసరమో అవన్నిటిని
వ్రాయించి
ఉంచాడు. మూలం అయనదే. ఏ మానవుని స్వంత మాటలు అందులో లేవు. తప్పు లేదు అని
అంటున్నపుడు ‘మరి అనేకచోట్ల పాపము
కనిపిస్తుంది’ అనే ప్రశ్న వస్తుంది.
తిరుగుబాటు(కయీను), దురాశ (ఆకాను), కామాతురత (లోతు కుమారెలు) పాత నిబంధనలో
బహుభార్యత్వము మొదలైనవి
అనేకచోట్ల కనిపిస్తున్నవి. ఎందుకంటే, మన పాపము, పాపపు
స్వభావము, తిరుగుబాటు, మొదలైనవన్ని, మనము చదివినపుడు మానవ పతన స్థితి, పాపపు
స్వభావము పాపమును బట్టి భూమి, ప్రపంచము ఎంత పతనమైందో తెలుస్తున్నది. సత్యమును
ఉన్నదున్నట్టుగా మనకు పరిశుద్ధ గ్రంధం బైబిల్
తెలుపుతున్నది.
2. పరిశుధ్ద్ధగ్రంధం బైబిల్ దేవుడే ప్రేరేపించిన గ్రంధం. Inspired by God.
మరోసారి మొదట్లో చెప్పుకున్న సత్యము జ్ఞాపకం చేసుకోవాలి. మానవుని ప్రశ్నలకు జవాబులు
ఇచ్చేది పరిశుధ్ద గ్రంధం బైబిల్ కాదు.
దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా
సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును,
ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై
యున్నది. 2వ తిమోతి 2:16.
“దైవావేశము” వలన బైబిలు గ్రంధం వచ్చింది, మానవ ప్రేరణ,
ఉద్దేశం, పరిశుధ్ధ గ్రంధములో ఉండవు. కేవలం దేవుని ప్రేరణను బట్టి బైబిల్ గ్రంధం
ఉద్భవించింది. దేవుడు ఆదాము నాసికారంధ్రములలో జీవమును ఊదినట్టే, ఇక్కడ కూడా
గ్రీకులో అదే మాటను దేవుడు వాడినాడు. కేవలం దేవుని ప్రేరణను
బట్టి, ఆయన స్వంత
ప్రణాళికతో, ఏ మానవున ప్రేరణ, ప్రమేయం లేకుండా, ఎవరు అడుగకుండా, ఆయన గురించి
తెలుసుకోవలసిన వాటిన్నింటిని
దేవుడు వ్రాయించాడు. దాన్ని “ఆవేశం” అని తెలుగులో
అనువాదం చేశారు. “God-breathed”. గ్రీకులో “తియో (ప)న్యూస్టాస్” θεόπνευστος అంటారు,
“తియో” అనగా దేవుడు, “ప్నుస్టాస్” అనగా ఊదినది అని అర్ధం. ‘ప’ అని శబ్దం నిశ్శబ్దంగా
ఉంటుంది కనుక ‘నూస్టాస్” అని పలకాలి. ప్రకటన
గ్రంధములో యేసుక్రీస్తు సైతానును తన
నోటిఊపిరితో నశింపచేస్తాడని రాయబడింది. జీవము దేవునిలో తప్ప మరెక్కడా లేనట్టే,
లేఖనములు అన్నీ పాత క్రొత్త
నిబంధనలలోని ప్రతి మాట దేవునిలో నుండి మాత్రమే
ఉద్భవించింది అని మూల భాషలో అర్ధం. ఆవేశం అనే మాటను మనము కోపావేశమని,
భావోద్రేకాలు
అనుకుంటాము. కానీ దేవుడు ఎవరో, ఆయన గుణమును ఎరిగిఉంటే ఆ అపోహ
కొట్టివేయబడుతుంది. దేవుడే స్వయంగా ప్రేరేపించింది, ఊదినది అని
అర్ధం. దేవుని మాటలు
తప్ప మరే మాటలు అందులో కలయికలేదు. మానవ రచయితలు రాసినప్పటికి, దేవుని
ముద్రలు, అధికారం బైబిల్లో ఉన్నాయి.
మానవుల మాట ఒక్కటి కూడా ఈ గ్రంధములో లేదు.
3. పరిశుద్ధ గ్రంధం బైబిల్ తప్పు పట్టలేని గ్రంధం.Infallible.
తప్పు పట్టాలని చదినవారు సత్యమును తెలుసుకొని వారి జీవితాలలో సత్యమును
తెలుసుకున్నారు. ఒకవేళదేవుని సత్యమును తెలుసుకొనకపోయినంత మాత్రాన
దేవుని సత్యము
మారదు. దేవుడు ఆదినుండి మార్పులేనివాడు. ఎల్లప్పుడు ఒకేరీతిగా ఉన్నవాడు దేవుడు. దేవుడు
పరిశుద్ధుడు, పాపము ఏ మాత్రం లేనివాడు,
తప్పులు వెతికినవారు ఎందరో మార్పు చెందారు.
కాబట్టి బైబిల్లో ఎంతమాత్రo తప్పు, పొరబాటు, అసత్యము, అక్రమము లేవు. దేవుని మాటల్లో ప్రతి
ఒక్కటి,
ప్రతి ఒక్క సంఘటన, ప్రతి ఒక్క ప్రవచనం ఒక ఉద్దేశంతో వ్రాయబడ్డాయి. దేవుడు ఎంత
పరిశుద్ధుడో, ఆయన వాక్యం అంత పరిశుద్ధమైనది.
4. దేవుడు వ్రాయించడములో ఉద్దేశము:
*దైవజనుడు బలపడి
సంపూర్ణుడు అవుట, సంపూర్ణగా సిద్ధపడుట, ప్రతిమoచి కార్యమునకు సంపూర్ణంగా సిద్ధపడుట.
దైవజనుడు అంటే ఎవరు? పాస్టరా?
అవును. సువార్తికుడా? అవును. సంఘ పెద్దలా? అవును.
అంతమాత్రాన లిస్ట్ ముగింపు కాలేదు. వీరoదరే కాదు, యేసుక్రీస్తునుదేవునిగా, రక్షకునిగా కలిగిన
ప్రతి ఒక్కరికీ దేవుని వాక్యమoతా వర్తిస్తుంది. “నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే
వెలుగుకలుగును అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును.” కీర్తన 119:130.
“వెల్లడి” అనుమాటకు
ప్రవేశించుట, తెరవబడుట, అధికారికంగా ప్రకటించడం, వాఙ్మూలం ఇవ్వడం అని అర్ధం. దేవుని
వాక్యం నిజముగా హృదయము
లోతుల్లోనికి ప్రవేశించినపుడు వెలుగు, తెలివి, వివేచన, జ్ఞానం
తప్పక కలుగుతుంది. అందుచేత బలహీనతలన్ని తొలిగిపోయి బలపడాలంటే దేవుని
వాక్యమును క్షుణ్ణంగా జాగ్రత్తగా లోతుగా సరైన రీతిగా అర్ధం చేసుకోవడం అవసరం. విధేయత
చూపడం అత్యవసరం. అప్పుడు మన బోధ వినేవారిలో వెలుగు
కలుగుతుంది. “సన్నద్ధత” అంటే
ఆయుధములు ధరించుకొని యుధ్ధము చేసి శత్రువును జయించడం అని అర్ధం. గమనిస్తున్నారా,
దేవుని వాక్యము మనకు
ఎంతటి బలము, శక్తి కలుగచేస్తుందో! సన్నధ్ధులమైనపుడు ప్రతి మంచి
కార్యము చేయడానికి సిద్ధపడి ఉంటాము.
5. పరిశుధ్ధ గ్రంధం బైబిల్ మనకు మన భాషలో అనుగ్రహించుటకు దేవుని ఉద్దేశం ఏమిటి?
ఉపదేశించుట. ఇది ప్రసంగం చేయడం కాదు. వాక్యం బోధించడం కాదు. జీవితములో
మనమెదుర్కునే క్లిష్టపరిస్థితుల్లో, ఎటు తోచని పరిస్థితులలో. ఆందోళన కలిగే సమయములో,
భయం, అనుమానం, ఎటు పోవాలో, ఏది ఎంచుకోవాలో, ఆ మాటకొస్తే ప్రతి పరిస్థితిలో దిశ నిర్దేశం,
మార్గపు ఉపదేశం, పరిశుద్ధ గ్రంధం బైబిల్ చేస్తుంది. ఒక సంఘ కాపరి, ఒక సంఘపెద్ద,
పరిచారకుడు, సువార్తికుడు, అప్పుడప్పుడు తోటివిశ్వాసి కూడా అది చేయవచ్చు. దానికిని బైబిల్
గ్రంధం అత్యవసరం.
ఖండించుట: నీవు వెళ్ళే మార్గం తప్పు అని ఖండించడం దేవుని పరిశుద్ధ
గ్రంధ బైబిల్ ద్వారా సాధ్యం. మన ప్రవర్తన, ఆలోచన, భావోద్రేకం, మాట, క్రియ, ఏవైనా
తప్పైనపుడు దేవుని పరిశుద్ధగ్రంధం బైబిల్ మనలను ఖండిస్తుంది. ప్రేమతో ఖండిస్తుంది.
చేసేవారు ప్రేమతో చేయాలి, గర్వము, అహంకారం, అహంభావం, స్వనీతితో కాదు, సానుభూతితో,
దయతో కనికరముతో చేయాలి.
తప్పు దిద్దుటకును: ఇది ఖండించడం కంటే ఎక్కువ. తప్పుడు
మార్గం ఏమిటో చూపించడమేకాక దానిని దిద్ది సరైన మార్గము చూపించడానికి పరిశుధ్దగ్రంధం
బైబిల్ మనకు అవసరం. దీనికి దీనమనసు, తగ్గింపు స్వభావం, నేర్చుకోవడానికి చిన్నపిల్లలో
ఉండే సంసిద్ధత దీనమనసు అవసరం.
నీతియందు శిక్ష చేయుటకు: యేసు క్రీస్తు ప్రభువును
హృదయములో కలిగినవారు ఆయన నీతినిబట్టి నీతిమంతులుగా తీర్చబడతారు. దేవుని నీతిలో
జీవించడానికి శిక్షణ అవసరం. దానంతట అదే కలగదు. విశ్వాసము ద్వారా, పాపము ఒప్పుకొని,
పశ్చాత్తాపపడి, యేసయ్య స్వంతనీతిని మనం పొంది నీతిమంతులుగా లెక్కించబడతాము.
ఆదికాండం 15:6 “అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను”
*బైబిల్ గ్రంధం ఒక నీతిబోధగ్రంధం కాదు, కాని, దేవుని మాటలకు విధేయత చూపడం మనలను
నీతిమంతులుగా తీర్చగలశక్తి అందులో ఉన్నది. చారిత్రకగ్రంధం అంతకూ కాదు, బైబిల్లో
చారిత్రక సత్యాలు, సంఘటనలు, స్పష్టంగా వ్రాయబడ్డాయి, కానీ చరిత్ర మాత్రం అందించే
చారిత్రక గ్రంధం కాదు. బైబిల్ అంతటిలో కేవలo దేవుని మాటలు మాత్రమే వ్రాయబడ్డాయి.
దేవుని మాటలు, గుణగణాలు, స్వభావము, మానవుని పాప క్షమాపణ, విమోచన కోసం చేసిన
క్రియలు, వాటికి మానవుల ప్రతిస్పందన మొదలైనవి వ్రాయబడ్డాయి. ఏ భేదము లేకుండ, ప్రతి
మానవుడు తన పాపమునుండి విమోచన, విడుదల, పాపము మీద విజయం పొందడానికి దేవుడు
సృష్టి నుండి చేసిన సంకల్పం, ప్రణాళిక, ఏర్పాటు అంతటినీ దేవుడు స్వయంగా మానవులకు
అర్థమయ్యే భాషలో బైబిల్లో రాయించి పెట్టాడు. తెలుగుభాషలో చదివి తృప్తి చెందడంకాదు.
మూలభాషలో ఉన్న అర్ధం, సందర్భం గమనించాలి.
ప్రియ చదువరీ, చదవడం, రాయడం
అంతరిస్తున్న ఈ దినాల్లో మీరు ఈ చిన్ని పత్రిక చదివారా? మొత్తం చదివారా? అక్కడక్కడ
మాత్రమేనా? సాంతం చదవండి. చదవడంవల్ల మీరు మేలు పొందారని ఆశిస్తున్నాను.
మీకు పరిశుద్ధ గ్రంధం బైబిల్ (పాత, క్రొత్త నిబంధనలతో కూడినది) చదవాలని ఆశ ఉందా?
అయితే, మీరు ఏ విధమైన మేలు, ధైర్యం, దీవెన, ఆదరణ, పొందారో వివరంగా ఉత్తరములో
రాయండి! బైబిల్ విలువ, రుసుము 330.00 M.O. పంపించండి. మీ చిరునామా స్పష్టంగా
రాయండి. ఇదే మా చిరునామా: (Address);
పాస్టర్ ఎస్. విజయ్ భాస్కర్ ,
రోడ్ నెం. 10, N.I. N
కాలనీ, బోడుప్పల్,
హైదరాబాద్ -500092
ఫోన్ నంబర్: 9849037535, 8143178111