దయచేసిఈ మనవిని గమనించండి: 


చాలామంది ఈ వెబ్ సైట్ లో ఇవ్వబడుతున్న బైబిల్ ధ్యానాలు, వ్యాసాలు, చదువుతున్నట్టుగా ఉన్నది, మీ అందరినీ బట్టి ఎంతో సంతోషిస్తున్నాము. దేవుని ఎంతో స్తుతిస్తున్నాము. 

నా మనవి ఏమిటంటే, చదివిన మీరు మీ అభిప్రాయాలను, దీవెనలను, ప్రశ్నలను మీలో మీరు ఉంచుకోవడం మంచిది కాదు. మీ రేడియో పాస్టర్ అయినన నాతో వాటిని నిస్సందేహంగా పంచుకోవడం మంచిది. నా ఫోన్ నంబర్ 8143178111. లేదా మీరు స్త్రీలైతే ఫోన్ నంబర్ 9866341841 - పాస్టరమ్మతో పంచుకోండి. సర్వశక్తి గల దేవుడు మిమ్మల్ని తన వాక్యపు మార్గములో నడిపించుగాక!


రెవ. S. విజయ్ భాస్కర్ & పాస్టరమ్మ శ్రీమతి విజయ్ భాస్కర్ .    

సజీవుడైన దేవుడు-ఆయన సజీవ వాక్కు Bible Tract

పరిశుద్ధగ్రంధం బైబిలు ఒక మతపరమైన గ్రంధము అనుకోవడం చాలా పెద్ద పొరబాటు. 

మతగ్రంధం కానేకాదు. దేవుడే దానికి సృష్టికర్త. సృష్టికర్త అయిన దేవుడు తన సృష్టిని ఏ విధంగా, 

ఏ కార్యాల ద్వారా పాపమునుoడి విమోచించడానికి దేవుడే స్వయంగా రూపొందించిన పరిశుద్ధ 


గ్రంధం బైబిల్. దాదాపు 35-40 మందిని దేవుడు వాడుకొని, 1500 ఏళ్ల కాలములో పరిశుద్ధం గ్రంధం 

బైబిల్ రూపొందించబడిoది. మూలప్రతులు వివిధ భాషల్లో ఉన్నాయి. (Original Documents in 

different languages) మన భాషలో అనువదించబడడం ఆశ్చర్యం! ఇంకా ఆశ్చర్యమేమిటంటే 

వాటిని భద్రoగా ఎలా కాపాడాడో అదో అద్భుతం!! అయన చరిత్రలో చేసిన చాలా క్రియలు, 

ప్రణాళికలు, ప్రవచనాలు, పలికిన మాటలు, ఆశ్చర్య క్రియలు, అద్భుతాలు, మొదలైనవి దేవుడే 

స్వయంగా తన సేవకులను, ప్రవక్తలను అపోస్తలులను వాడుకొని, పరిశుద్ధాత్ముడు (నూటికి నూరు 

పాళ్లు దేవుడు) వ్రాయించిన దేవుని గ్రంధమే బైబిల్. ఎందుకంటే, యేసు క్రీస్తును స్వయంగా 

చూచి, తాకి, ఆయన మాటలన్నిటిని 24/7 విని, ఆయనతోనే జీవించినవారు అపోస్తలులు; 

అపోస్తలులు అంటే “పంపపడినవారు” అని అర్ధం. దేవునిచేత పంపబడినవారు అపోస్తలులు. 

అనగా ఇప్పుడు అపోస్తలులు ఇకలేరు. ఉన్నారు అని మీరనుకుంటే అది తిరుగుబాటు 

అవుతుoది.  వారే స్వయంగా చెప్పిన సాక్షం ఇది: ఏలయనగా చమత్కారముగా కల్పించిన 

కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు 

తెలుపలేదు గాని ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచినవారమై తెలిపితివిు. ‘ఈయన 

నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను’ అను శబ్దము 

మహాదివ్యమహిమనుండి ఆయనయొద్దకు వచ్చినప్పుడు, తండ్రియైన దేవునివలన ఘనతయు 

మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతముమీద ఆయనతోకూడ ఉండినవారమై, 

ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము 

మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము 

చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు 

మేలు. ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట 

గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు 

గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.” 2వ పేతురు 

1:16-21 యేసు క్రీస్తుప్రభువును ముఖాముఖి కన్నులార చూసి, ఆయన “నిత్యజీవపుమాటలు” 

చెవులారా విని, ఆయనను 24/7 తాకి, ఆయన మానవస్వరూపం ఎంతగా చూశారో, ఆయన మహిమ 

స్వరూపము అంతగా ఆస్వాదించిన ఆయన అపోస్తలులు వ్రాసిన మాటలు కొన్ని; ఆయన 

అధికారముతో, ఆయన పర్యవేక్షణలో పాత నిబoధనలోని ప్రవక్తలు రాశారు. ఈ‌ లేఖన భాగములో 

“వేకువచుక్క” ఎవరు? చీకటిలో వెలుగును విరజిమ్ముతూ ప్రకాశించిన వేకువచుక్క్త యేసు క్రీస్తు. 

క్రొత్త నిబధనలో ఆయన జీవితం, వ్యక్తిత్వం, గుణగణాలు, పరిచర్య, ఆయన స్థాపించిన రాజ్యం 

మొదలైనవన్ని రాయబడ్డాయి. 


యేసు ప్రభువునకు పాత నిబంధనతో సంబంధO:  యేసు ప్రభువు పాత నిబంధనను, అనగా, 

అందులోని మాటలను అంగీకరించారు. యేసు క్రీస్తు ప్రభువే పాతనిబంధన గ్రంధములోని 

కొందరు వ్యక్తులను, వారి క్రియలను, వాటి అర్ధమును తన స్వంత మాటల్లో ఎత్తి చూపించడం 

ద్వారా పరిశుద్ధ గ్రంధం బైబిల్ లోని చరిత్ర, సత్యములను ధృవీకరించారు. ఉదా|| అబ్రాహాము, 

మోషే, నోవహు, మొదలైనవారు. మొదటిగా పరిశుద్ధ గ్రంధం బైబిల్ ఏమైనది ఎక్కడనుండి 

వచ్చింది, ఏ విధంగా వచ్చిందో మనమంతా తెలుసుకొని ఉండాలి



1. అందులో ఏ తప్పులేదు  - Inerrant

పరిశుధ్ధ గ్రంధం బైబిల్లో తప్పు దొర్లడానికి ఏ మాత్రం అవకాశo లేదు. కారణం అది దేవుని మాట. 

దేవుని స్వంత ప్రేరణ వలననే బైబిల్ రాయబడింది. మనము దేవుని వెతికినందునుబట్టి ఆయన 

పరిశుద్ధ గ్రంధo బైబిల్ వ్రాయలేదు, నీవు స్వయంగా నమ్మినా, నమ్మకపోయినా పరిశుద్ధ గ్రoధం 

బైబిల్లోని మాటలు దేవునివే!! పరిశుధ్ద్ధగ్రంధం బైబిల్ ఆయనే స్వయంగా రూపించిన, 

ప్రేరేపించిన ప్రేమగ్రంధం. బైబిల్ అంతటిలో దేవుని ప్రేమ కనిపిస్తుంది. ఆయన స్వయం 

ప్రత్యక్షత అనగా దేవుడు ఎవరో, ఆయన ఎలాంటి వాడో, ఆయన స్వభావం, శక్తి, ప్రభావం, మహిమ, 

ఆ మాటకొస్తే దేవుని గురిచి తెలుసుకోవాలని ఆశించే ప్రతి ఒక్కరికి, తెలుసుకోగలిగిన సమస్తము 

బైబిల్లో ఉన్నది. అంటే తెలుసుకోలోనిది కూడా ఉందని అర్ధమే కదా! అవును, దేవుని గూర్చి 

సమస్తము తెలుసుకోవడం ఏ మానవునివల్ల కాదు. ఒకవేళ ఎవరైనా ‘దేవునిగూర్చి అంతా 

తెలుసుకోవచ్చు’ అనే భావన మీలో కలిగిస్తే, అది మోసం అని తప్పక పరిశుద్ధ గ్రంధం బైబిల్ 

స్పష్టంగా సెలవిస్తున్నది. రోమా 1:19,20 “ఎందుకనగా దేవునిగూర్చి తెలియశక్యమైనదేదో అది వారి 

మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు, 

అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను 

ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.” మనము దేవుని 

వెతికిననoదునుబట్టి ఆయన పరిశుద్ధ గ్రంధం వ్రాయలేదు. ఇది అత్యంత ప్రాధమిక సత్యం. 

ఆయన ప్రేరణనుబట్టి, ఆయన గురించి ఏది తెలుసుకోవడం అవసరమో అవన్నిటిని వ్రాయించి 

ఉంచాడు. మూలం అయనదే. ఏ మానవుని స్వంత మాటలు అందులో లేవు. తప్పు లేదు అని 

అంటున్నపుడు ‘మరి అనేకచోట్ల పాపము కనిపిస్తుంది’ అనే ప్రశ్న వస్తుంది. 

తిరుగుబాటు(కయీను), దురాశ (ఆకాను), కామాతురత (లోతు కుమారెలు) పాత నిబంధనలో 

బహుభార్యత్వము మొదలైనవి అనేకచోట్ల కనిపిస్తున్నవి. ఎందుకంటే, మన పాపము, పాపపు 

స్వభావము, తిరుగుబాటు, మొదలైనవన్ని, మనము చదివినపుడు మానవ పతన స్థితి, పాపపు 

స్వభావము పాపమును బట్టి భూమి, ప్రపంచము ఎంత పతనమైందో తెలుస్తున్నది. సత్యమును 

ఉన్నదున్నట్టుగా మనకు పరిశుద్ధ గ్రంధం బైబిల్ తెలుపుతున్నది. 


2. పరిశుధ్ద్ధగ్రంధం బైబిల్ దేవుడే ప్రేరేపించిన గ్రంధం. Inspired by God. 

మరోసారి మొదట్లో చెప్పుకున్న సత్యము జ్ఞాపకం చేసుకోవాలి. మానవుని ప్రశ్నలకు జవాబులు 

ఇచ్చేది పరిశుధ్ద గ్రంధం బైబిల్ కాదు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా 

సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, 

ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై 

యున్నది. 2వ తిమోతి 2:16. “దైవావేశము” వలన బైబిలు గ్రంధం వచ్చింది, మానవ ప్రేరణ, 

ఉద్దేశం, పరిశుధ్ధ గ్రంధములో ఉండవు. కేవలం దేవుని ప్రేరణను బట్టి బైబిల్ గ్రంధం 

ఉద్భవించింది. దేవుడు ఆదాము నాసికారంధ్రములలో జీవమును ఊదినట్టే, ఇక్కడ కూడా 

గ్రీకులో అదే మాటను దేవుడు వాడినాడు. కేవలం దేవుని ప్రేరణను బట్టి, ఆయన స్వంత 

ప్రణాళికతో, ఏ మానవున ప్రేరణ, ప్రమేయం లేకుండా, ఎవరు అడుగకుండా, ఆయన గురించి 

తెలుసుకోవలసిన వాటిన్నింటిని దేవుడు వ్రాయించాడు. దాన్ని “ఆవేశం” అని తెలుగులో 

అనువాదం చేశారు. “God-breathed”. గ్రీకులో “తియో (ప)న్యూస్టాస్” θεόπνευστος అంటారు, 

 “తియో”  అనగా దేవుడు, “ప్నుస్టాస్” అనగా ఊదినది అని అర్ధం. ‘ప’ అని శబ్దం నిశ్శబ్దంగా 

ఉంటుంది కనుక ‘నూస్టాస్” అని పలకాలి. ప్రకటన గ్రంధములో యేసుక్రీస్తు సైతానును తన 

నోటిఊపిరితో నశింపచేస్తాడని రాయబడింది. జీవము దేవునిలో తప్ప మరెక్కడా లేనట్టే, 

లేఖనములు అన్నీ పాత క్రొత్త నిబంధనలలోని ప్రతి మాట దేవునిలో నుండి మాత్రమే 

ఉద్భవించింది అని మూల భాషలో అర్ధం. ఆవేశం అనే మాటను మనము కోపావేశమని, 

భావోద్రేకాలు అనుకుంటాము. కానీ దేవుడు ఎవరో, ఆయన గుణమును ఎరిగిఉంటే ఆ అపోహ 

కొట్టివేయబడుతుంది. దేవుడే స్వయంగా ప్రేరేపించింది, ఊదినది అని అర్ధం. దేవుని మాటలు 

తప్ప మరే మాటలు అందులో కలయికలేదు. మానవ రచయితలు రాసినప్పటికి, దేవుని 

ముద్రలు,  అధికారం బైబిల్లో ఉన్నాయి. మానవుల మాట ఒక్కటి కూడా ఈ గ్రంధములో లేదు. 

3. పరిశుద్ధ గ్రంధం బైబిల్ తప్పు పట్టలేని గ్రంధం.Infallible. 

తప్పు పట్టాలని చదినవారు సత్యమును తెలుసుకొని వారి జీవితాలలో సత్యమును 

తెలుసుకున్నారు. ఒకవేళదేవుని సత్యమును తెలుసుకొనకపోయినంత మాత్రాన దేవుని సత్యము 

మారదు. దేవుడు ఆదినుండి మార్పులేనివాడు. ఎల్లప్పుడు ఒకేరీతిగా ఉన్నవాడు దేవుడు. దేవుడు 

పరిశుద్ధుడు, పాపము ఏ మాత్రం లేనివాడు, తప్పులు వెతికినవారు ఎందరో మార్పు చెందారు. 

కాబట్టి బైబిల్లో ఎంతమాత్రo తప్పు, పొరబాటు, అసత్యము, అక్రమము లేవు. దేవుని మాటల్లో ప్రతి 

ఒక్కటి, ప్రతి ఒక్క సంఘటన, ప్రతి ఒక్క ప్రవచనం ఒక ఉద్దేశంతో వ్రాయబడ్డాయి. దేవుడు ఎంత 

పరిశుద్ధుడో, ఆయన వాక్యం అంత పరిశుద్ధమైనది.


4. దేవుడు వ్రాయించడములో ఉద్దేశము: *దైవజనుడు బలపడి 

సంపూర్ణుడు అవుట, సంపూర్ణగా సిద్ధపడుట, ప్రతిమoచి కార్యమునకు సంపూర్ణంగా సిద్ధపడుట. 

దైవజనుడు అంటే ఎవరు? పాస్టరా? అవును. సువార్తికుడా? అవును. సంఘ పెద్దలా? అవును. 

అంతమాత్రాన లిస్ట్ ముగింపు కాలేదు. వీరoదరే కాదు, యేసుక్రీస్తునుదేవునిగా, రక్షకునిగా కలిగిన 

ప్రతి ఒక్కరికీ దేవుని వాక్యమoతా వర్తిస్తుంది. “నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే 

వెలుగుకలుగును అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును.” కీర్తన 119:130. “వెల్లడి” అనుమాటకు 

ప్రవేశించుట, తెరవబడుట, అధికారికంగా ప్రకటించడం, వాఙ్మూలం ఇవ్వడం అని అర్ధం. దేవుని 

వాక్యం నిజముగా హృదయము లోతుల్లోనికి ప్రవేశించినపుడు వెలుగు, తెలివి, వివేచన, జ్ఞానం 

తప్పక కలుగుతుంది. అందుచేత బలహీనతలన్ని తొలిగిపోయి బలపడాలంటే దేవుని 

వాక్యమును క్షుణ్ణంగా జాగ్రత్తగా లోతుగా సరైన రీతిగా అర్ధం చేసుకోవడం అవసరం. విధేయత 

చూపడం అత్యవసరం. అప్పుడు మన బోధ వినేవారిలో వెలుగు కలుగుతుంది. “సన్నద్ధత” అంటే 

ఆయుధములు ధరించుకొని యుధ్ధము చేసి శత్రువును జయించడం అని అర్ధం. గమనిస్తున్నారా, 

దేవుని వాక్యము మనకు ఎంతటి బలము, శక్తి కలుగచేస్తుందో! సన్నధ్ధులమైనపుడు ప్రతి మంచి 

కార్యము చేయడానికి సిద్ధపడి ఉంటాము.


5. పరిశుధ్ధ గ్రంధం బైబిల్ మనకు మన భాషలో అనుగ్రహించుటకు దేవుని ఉద్దేశం ఏమిటి? 

ఉపదేశించుట. ఇది ప్రసంగం చేయడం కాదు. వాక్యం బోధించడం కాదు. జీవితములో 

మనమెదుర్కునే క్లిష్టపరిస్థితుల్లో, ఎటు తోచని పరిస్థితులలో. ఆందోళన కలిగే సమయములో, 

భయం, అనుమానం, ఎటు పోవాలో, ఏది ఎంచుకోవాలో, ఆ మాటకొస్తే ప్రతి పరిస్థితిలో దిశ నిర్దేశం, 

మార్గపు ఉపదేశం, పరిశుద్ధ గ్రంధం బైబిల్ చేస్తుంది. ఒక సంఘ కాపరి, ఒక సంఘపెద్ద, 

పరిచారకుడు, సువార్తికుడు, అప్పుడప్పుడు తోటివిశ్వాసి కూడా అది చేయవచ్చు. దానికిని బైబిల్ 

గ్రంధం అత్యవసరం. 

  ఖండించుట: నీవు వెళ్ళే మార్గం తప్పు అని ఖండించడం దేవుని పరిశుద్ధ 

గ్రంధ బైబిల్ ద్వారా సాధ్యం. మన ప్రవర్తన, ఆలోచన, భావోద్రేకం, మాట, క్రియ, ఏవైనా 

తప్పైనపుడు దేవుని పరిశుద్ధగ్రంధం బైబిల్ మనలను ఖండిస్తుంది. ప్రేమతో ఖండిస్తుంది. 

చేసేవారు ప్రేమతో చేయాలి, గర్వము, అహంకారం, అహంభావం, స్వనీతితో కాదు, సానుభూతితో, 

దయతో కనికరముతో చేయాలి.  తప్పు దిద్దుటకును: ఇది ఖండించడం కంటే ఎక్కువ. తప్పుడు 

మార్గం ఏమిటో చూపించడమేకాక దానిని దిద్ది సరైన మార్గము చూపించడానికి పరిశుధ్దగ్రంధం 

బైబిల్ మనకు అవసరం. దీనికి దీనమనసు, తగ్గింపు స్వభావం, నేర్చుకోవడానికి చిన్నపిల్లలో 

ఉండే సంసిద్ధత దీనమనసు అవసరం.  నీతియందు శిక్ష చేయుటకు: యేసు క్రీస్తు ప్రభువును 

హృదయములో కలిగినవారు ఆయన నీతినిబట్టి నీతిమంతులుగా తీర్చబడతారు. దేవుని నీతిలో 

జీవించడానికి శిక్షణ అవసరం. దానంతట అదే కలగదు. విశ్వాసము ద్వారా, పాపము ఒప్పుకొని, 

పశ్చాత్తాపపడి, యేసయ్య స్వంతనీతిని మనం పొంది నీతిమంతులుగా లెక్కించబడతాము. 

ఆదికాండం 15:6 “అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను” 

 *బైబిల్ గ్రంధం ఒక నీతిబోధగ్రంధం కాదు, కాని, దేవుని మాటలకు విధేయత చూపడం మనలను 

నీతిమంతులుగా తీర్చగలశక్తి అందులో ఉన్నది. చారిత్రకగ్రంధం అంతకూ కాదు, బైబిల్లో 

చారిత్రక సత్యాలు, సంఘటనలు, స్పష్టంగా వ్రాయబడ్డాయి, కానీ చరిత్ర మాత్రం అందించే 

చారిత్రక గ్రంధం కాదు. బైబిల్ అంతటిలో కేవలo దేవుని మాటలు మాత్రమే వ్రాయబడ్డాయి. 

దేవుని మాటలు, గుణగణాలు, స్వభావము, మానవుని పాప క్షమాపణ, విమోచన కోసం చేసిన 

క్రియలు, వాటికి మానవుల ప్రతిస్పందన మొదలైనవి వ్రాయబడ్డాయి. ఏ భేదము లేకుండ, ప్రతి 

మానవుడు తన పాపమునుండి విమోచన, విడుదల, పాపము మీద విజయం పొందడానికి దేవుడు 

సృష్టి నుండి చేసిన సంకల్పం, ప్రణాళిక, ఏర్పాటు అంతటినీ దేవుడు స్వయంగా మానవులకు 

అర్థమయ్యే భాషలో బైబిల్లో రాయించి పెట్టాడు. తెలుగుభాషలో చదివి తృప్తి చెందడంకాదు. 

మూలభాషలో ఉన్న అర్ధం, సందర్భం గమనించాలి. ప్రియ చదువరీ, చదవడం, రాయడం 

అంతరిస్తున్న ఈ దినాల్లో మీరు ఈ చిన్ని పత్రిక చదివారా? మొత్తం చదివారా? అక్కడక్కడ 

మాత్రమేనా? సాంతం చదవండి. చదవడంవల్ల మీరు మేలు పొందారని ఆశిస్తున్నాను. 



మీకు పరిశుద్ధ గ్రంధం బైబిల్ (పాత, క్రొత్త నిబంధనలతో కూడినది) చదవాలని ఆశ ఉందా? 

అయితే, మీరు ఏ విధమైన మేలు, ధైర్యం, దీవెన, ఆదరణ, పొందారో వివరంగా ఉత్తరములో 

రాయండి! బైబిల్ విలువ, రుసుము 330.00 M.O. పంపించండి. మీ చిరునామా స్పష్టంగా

రాయండి. ఇదే మా చిరునామా: (Address); పాస్టర్ ఎస్. విజయ్ భాస్కర్ , రోడ్ నెం. 10, N.I. N 

కాలనీ, బోడుప్పల్, హైదరాబాద్ -500092 ఫోన్ నంబర్: 9849037535, 8143178111

నిజమైన మనశ్శాంతి కావాలా?

 

 నిజమైన మనశ్శాంతి కావాలా?

ప్రస్తుతం సమాజంలో అన్నింటి కంటే కొరతగా ఉన్నది శాంతి, సమాధానం అంటే మీరు 

ఒప్పుకుంటారా? ఆహారం కొరత అనుకుంటూనే పట్టెడు అన్నం ఏదో ఒక విధంగా 

సంపాదించుకుంటున్నాం. వస్త్రాల కొరత అనే రోజులు ఎప్పుడో పోయాయి. ప్రస్తుతం మన చుట్టూ 

అనేక రకములైన రంగు రంగుల దుస్తులు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు క్రొత్త క్రొత్త 

రోగములకు మందులు లేవని చెప్పేవారు. ఇప్పుడైతే అన్ని రోగములకు మందులు 

దొరుకుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతుంటే దాదాపు అన్ని దొరుకుతున్నాయని చెప్పవచ్చు. 

న్ని దొరుకు తున్నాయి గానీ శాంతి, సమాధానం, నెమ్మది దొరకడం అతి కష్టంగా ఉంది. మన 

జీవితాలు పైపైనే చూస్తే అన్నీ సవ్యంగా ఉన్నట్లే కనిపిస్తున్నది. కాని శాంతి, సమాధానం, నెమ్మది 

మనకు దొరకడం లేదు. మనలో శాంతి సమాధానం ఉన్నట్లైతే ఆత్మహత్మలు ఇంతగా ఎందుకు 

ఎక్కువైపోతాయి? ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్య 

చేసుకుంటున్నారు. ఒక సంవత్సరములో దాదాపు 8 లక్షల మంది ఆత్మహత్య 

చేసుకుంటున్నారు. 

పరిస్థితి ఎందుకు?

ఎందుకు శాంతి, సమాధానం, నెమ్మది కొరతగా ఉన్నది?

ప్రస్తుతం మానవుని జీవితం ఒత్తిడితో (టెన్షన్‌) నిండిన జీవితం. ‘టెన్షన్‌ పడవద్దు అనే మాటి 

ప్రతిరోజూ అక్కడో, ఇక్కడో వింటూనే ఉంటాం. మన శ్రేయోభిలాషులు ఇవే మాటలు మనకు 

చెపుతూ ఉంటారు. ఎంత చెప్పినా, ఎంత విన్నా టెన్షన్ తగ్గదు. ఒత్తిడిలో ఉన్న ప్రపంచంలో 

మనం జన్మించాము, బ్రతుకుతున్నాము అనే సంగతి తెలుసుకునే లోపే సగం జీవితం 

అయిపోతుంది. పిల్లవాడికి స్కూల్లో మొదలవుతుంది అభద్రతాభావం (INSECURITY). 4 ఏళ్ల 

పిల్లలు సెల్ ఫోన్ వాడడం చూస్తున్నపుడు మన చిన్నారులు సెల్ ఫోన్ కు ఎంతటి బానిసలు 

అవుతున్నారో తెలుసుకున్నామా? ప్రస్తుతం చిన్నారులను, వారి స్థితిని గమనించి చూస్తే, బాల్యం 

అంతరించి పోయిందనే భావన కలుగుతూ ఉన్నది. 9, 10 వ తరగతి చదువుతున్న మైనర్లు 

హత్యలు చేయడం, లైంగిక బలవంతం చేయడం, వింటున్నపుడు ఈ తరం ఎటువైపు 

ప్రయాణిస్తున్నది అని ఆలోచించవలసిన ఘడియ వచ్చింది. ఎంతోమంది టీచర్లు పిల్లలను 

అమానుషంగా కొట్టడం ఈ దినాలలోనే గమనిస్తున్నాము. పెద్దవారైన టీచర్లకు, తల్లితండ్రులకు 

శాంతి సమాధానాలు లేకపోవడం వల్ల దాని ప్రభావం స్కూల్లో ఉన్న పిల్లలమీద పడుతున్నది.


యువతరమును గూర్చి ఆలోచిద్దాం. తోటివారి నుండి కలిగే ఒత్తిడి (PEER PRESSURE)

చదువులలో ఉండే పోటీతత్వం యువతరమును ఎంతో బాధపెడుతుంది. ర్యాంకు కోసం 

పోటిపడుతూ ఉన్నందుచేత నిరుత్సాహం, నిరాశ, నిస్పృహలు మనస్సులో నిండుతాయి. 

గతించిన కొద్ది కాలంలో ఎంతో మంది యువతీయువకులు హఠాత్తుగా  ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

చిన్నారులు చిన్నవయస్సులో, యువతీయువకులు నిండు యవ్వనంలో మారక ద్రవ్యాలకు

మత్తు పానీయలకు, సిగరెట్, మద్యపానం, సెక్స్, డ్రగ్స్ ఇలా అనేకమైన వ్యసనాలకు 

 బానిసలవుతున్నారు. మరి కొందరు ఇతర వ్యసనాలకు బానిసలయ్యారు. ఇంటర్నెట్‌లో బూతు 

వీడియోలు, అశ్లీలత, ఫోర్నోగ్రఫి - ఈలాంటివి యౌవన తరమును చుట్టుముట్టాయి. ఫేస్‌బుక్‌, 

ట్విట్టర్‌, చలన చిత్రాలు ఈలాంటివి మరెన్నో నెమ్మది, శాంతి, సమాధానాలు లేకుండా 

చిన్నవయస్సులోనే తప్పు త్రోవ పట్టిస్తున్నాయి. యువతరం విచ్చలవిడిగా జీవంచటం 

సాంప్రదాయంగా మారింది. ఎన్నోచోట్ల ఇవి హత్యలకు, ఆత్మహత్యలకు, చెడు వ్యసనములకు 

దారితీయటం వింటున్నప్పుడు శాంతి, సమాధానాలు ఎంతగా కరువై పోయాయో స్పష్ట మౌతుంది.

ఉద్యోగాలు చేస్తూ బ్రతికే వారికి కూడా శాంతిగా ఉండే పరిస్థితులు లేవు. అందులో ఉండే 

సాధక బాధకాలు వారిని ప్రశాంతంగా ఉండనీయటం లేదు. ఇతరులతో సఖ్యంగా ఉండ

లేనివారు కొందరు. మరికొందరు తోటివారిపై అసూయ ద్వేషాలను బట్టి నెమ్మదిగా ఉండ

లేరు. పనిఒత్తిడి ఇప్పటి ఉద్యోగాల్లో హెచ్చుగానున్నది. పైకి ఎదగాలనే తాపత్రయంతో, 

ఆర్థిక అవసరాలు తీరాలని తపన పడుతూ నెమ్మదిని కోల్పోయేవారు చాల మంది 

ఉన్నారు. 

ఆటెన్షన్‌ కుటుంబంలో జొరబడుతున్నది. శాంతి సమాధానాలను ఆ ఒత్తిడి, టెన్షన్ 

దొంగిలిస్తున్నది. ఎంతోమంది సాఫ్ట్‌ వేరు ఇంజనీర్లు, ఐ. పి. ఎస్. లు ఆత్మహత్యలకు 

పాల్పడటం ఎంతో బాధ కలిగిస్తున్నది. మరోప్రక్క ఉద్యోగాలు, ఉద్యోగ అవకాశాలు లేక 

యువతి యువకులు ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. కోవిడ్  తరువాత నిరుద్యోగం 

మితిమీరింది. వేలకు వేల ఉద్యోగాలు ఊడిపోయాయి.

లాభం కలుగుతుందని గంపెడు ఆశతో చిన్న వ్యాపారం మొదలుపెట్టి చివరకు నష్టాల పాలై 

అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకునే వారు ఎందరో. వ్యాపారంలో, ఉద్యోగాల్లో, చదువుల్లో 

ఎంతో పోటీతత్వం ఉన్నందుచేత ఆ టెన్షన్‌ తట్టుకోలేక మద్యపానం అలవాటుగా మారి, 

వ్యభిచారమునకు, అక్రమ సంబంధాలకు బానిసలైన వారు చాలామంది ఉన్నారు. ఏ 

ఉద్యోగం, వ్యాపారం అన్న వస్త్రాలు ఇస్తుందని ఆశిస్తారో అదే భారమై కృంగదీసి 

మనశ్శాంతి లేకుండా చేస్తుంది.

కుటుంబం ఈ భూమ్మీద రలోకంలాగా సంతోషంతో ఉల్లాసవంతంగా ఉండాలని 

ఆశించినప్పుటికి, కుటుంబంలో కూడా ఏదో ఒక కారణమును బట్టి శాంతి లేకుండా 

పోతుంది. భార్య భర్తలు నఖ్యంగా సంతోషంగా ఉండే పరిస్థితులు అరుదుగానున్నాయి. 

ఇద్దరు వేర్వేరు చోట్ల పనిచేస్తున్నందు చేత పని చేస్తున్న స్థలంలో కలిగే ఒత్తిడి వారిద్దరి 

మధ్య చొరబడుతుంది. ఎందరో యవ్వన భార్యభర్తలు గొడవలు చేసుకుంటూ 

బ్రతుకుచున్నారు.

ఇద్దరూ వేర్వేరు చోట్ల పనిచేయటం చేత ఎవరిలోకం వారిది, ఎవరి భారం వారిది, ఎవ్వరి 

స్నేహితులు వారికి ఎవ్వరి సెల్‌పోను వారికి. పేరుకు మాత్రం కలిసి జీవించడమే తప్ప 

ఒకరితో ఒకరికి అన్యోన్యత ఎక్కడుంటుంది? ఈ దినాలలో చోటు చేసుకున్న మరొక 

బానిసత్వం ధన సంపాదన మీద ఎగబడడం. భార్య భర్తలకు ధనసంపాదన ఒక్కటే గురిగా 

మారిపోయింది. నెలవారి చెల్లింపుల పద్దతిపైన (EMI-INSTALMENTS) అన్నీ కొనేసి వాటి 

కోసం నెలసరి బ్బు కట్టడానికి డబ్బు సంపాదన, ఆర్థిక ఎదుగుదల ఇద్దరి ముందు గురిగా 

ఉంటుంది. దాని ఆందోళనతో మరేది ఆలోచించే సమయం ఉండదు, సందర్భంరాదు. 

మరికొన్ని కుటుంబాల్లో భర్త ఒక దేశములో, భార్య మరొక దేశంలో పని చేసే వారు కూడా 

ఉన్నారు. కుటుంబమంతా కలిసేది వారాంతంలోనే, లేదా ఎప్పుడో ఒకసారి. ఇక 

కుటుంబంలో శాంతి, నెమ్మది ఉండాలంటే అదెలా సాధ్యం?

యువతీ యువకుల సంగతికొస్తే వారికి జీవిత విలువలు నేర్పించటం అతికష్టంగా 

మారింది. యువకులు బైక్‌ కోరుకుంటారు, స్పీడు కోరుకుంటారు. వాటి వలన కలిగే 

అనర్ధాలు ఎవరు వారికి చెప్పగలరు? తల్లి దండ్రులు చెప్పాలి కాని వారికి అంత టైముందా? 

నచ్చజెప్పే ఓపిక ఉందా? విలువలు నేర్చించాలంటే విలువలు జీవించాలి. ఇటీవల ఒక 

విషయం నామనస్సును కలిచివేసింది. తల్లిదండ్రులు అదే యింట్లో తనగదిలోనున్న 

వాళ్ళ కూతురితో సెల్‌ఫోన్లో  మాట్లాడుతున్నారని వినవచ్చింది. సంబంధ బాంధవ్యాలు 

ఎలా ఉన్నాయో చూడండి. ఇదంతా చూస్తున్నప్పుడు మన ప్రపంచంలో ఏమి 

జరుగుతుంది? శాంతి, సమాధానం, నెమ్మది, నిబ్బరం, నిలుకడ ఎందుకు లేకుండా 

పోతున్నాయి? కారణాలు ఏమిటి? కొన్నింటిని పరిశీలించుకుందాము.

మొదటి కారణము: మానవునికి తన సృష్టికర్తతో సంబంధం తెగిపోయింది.

నృష్టినంత గమనించి చూన్తున్నప్పుడు నృష్టిని సమస్తమును సృష్టించిన దేవుడు, నిర్మించిన 

నిర్మాత తప్పని సరిగా ఉన్నాడని తెలుస్తున్నది. పరిశుద్ధ గ్రంథం బైబిలు సృష్టి గురించి సృష్టికర్త 

గురించి ఈ విధంగా సెలవిస్తుంది. రోమా 1:19-20: “ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో 

అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య 

లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని 

సృష్టింపబడిన  వన్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు 

నిరుత్తరులైయున్నారు”. సృష్టికి సృష్టికర్తకు ఉన్న సంబంధం కుమ్మరికి కుండకు ఉన్న 

సంబంధం లాంటిది. కుమ్మరి, కుండ ఎప్పటికి ఒక్కటి కానేరవు. కుమ్మరి కుమ్మరే, కుండ కుండే

కుండపైన కుమ్మరికి సర్వాధికారం, సర్వహక్కులు ఉన్నట్లే  సృష్టికర్తయైన దేవునికి సృష్టిపైన 

సర్వాధికారం, సర్వహక్కులు ఉన్నాయి. మనకు కనిపించేదంత, ఇంకాకనిపించని 

అంతరిక్షములోనివికూడ దేవుని శక్తిని, మహిమను చాటిచెబుతున్నవి. సజీవుడైన దేవుడు తన 

సృష్టిలో జీవము లేని వాటినెన్నింటినో సృష్టించినా జీవము కలిగిన వాటిని, జీవము కలిగిన వారిని 

సృష్టించాడు. అంతేకాదు, తన సృష్టిని దేవుడు ప్రస్తుతం కూడా నిర్వహిస్తూ, దానిలో ఉన్న 

జీవమునకు ఈనాడు కూడా ఆధారమైన వాడు. నీవు, నేను ఆయన సృష్టించిన భూమి మీద జీవిస్తూ 

ఉన్నాము. ఆయన సృష్టించిన ఆకాశమునుండి  ఆయన కురిపించే వర్షము, మంచు వల్ల కలిగే 

సస్యము, పంటలు, కూరగాయలు, పళ్ళు, సమస్తవిధములైన ఆహారమును ఆయనే నీకు ఈనాడు 

అనుగ్రహిస్తూ ఉన్నవాడు. ఆ సృష్టికర్తయైన దేవుడు పరిశుద్దుడు, నీతి మంతుడు, సత్యవంతుడు, 

న్యాయవంతుడు. తాను చేసిన సృష్టి అంతటికి మానవుణ్ణి కిరీటములాగా దేవుడు నిర్మించాడు. 

సృష్టి అంతటిలో మానవుణ్ణి ఒక్కడినే తన స్వరూపంలో తన పోలిక చొప్పున నిర్మిoచాడు. ఆది 

కాంము 1: 26-27 “దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను 

చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని 

భూమి మీ ద  ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన 

స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్రీనిగాను 

పురుషుని గాను వారిని సృజించెను. మానవుని యందున్న దేవుని స్వరూపము భౌతికమైనది 

కాదు, శారీరకమైనది కాదు. ఎందుకనగా దేవుడు ఆత్మ స్వరూపి. దేవుడు మానవుని 

సృష్టించినప్పుడు నిత్యం జీవించే ఆత్మ, హేతుబద్ధమైన ఆలోచనాశక్తి, స్వేచ్చగా నిర్ణయం 

తీసుకునే శక్తి ఆ స్వరూపంలో ఇమిడ్చి యిచ్చాడు. జంతువులకు మనకు ఎంత భేదమున్నది? 

ఆదికాండము 2:7: “దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని 

నాసికారంధ్రములలో జీవనాయువును ఊదగానరుడు జీవాత్మ ఆయెను”. “నేలమంటితో 

నరుని నిర్మించి అనే మాటలలో దేవుడు ఎంత శ్రద్ధతో నిర్ధిష్టమైన ఉద్దేశ్యంతో నిర్మించాడో 

స్పష్టమౌతుంది.

 

ప్రియ చదువరులారా, దేవునికి మానవునితో ఉన్న ఈ సంబంధం ఒకానొక దినమున 

తెగిపోయింది. ఎందుకు ఏవిధంగా తెగిపోయింది? దేవుడు యిచ్చిన స్పష్టమైన ఆజ్ఞను 

మొదటి మానవుడైన ఆదాము అతని భార్యమైన హవ్వ జవదాటి అతిక్రమించి పాపం 

చేశారు. దేవుడు ఇచ్చిన హెచ్చరికను లెక్క చేయలేదు. సాతాను శోధించినప్పుడు 

దేవునియందు వారికి ఉన్న విశ్వాసము సన్నగిల్లింది. మాటలను అతిచులకనగా మాట్లాడే 

మనకు, అసలు మాట్లాడిన మాటకు విలువనివ్వని మనకు దేవుని మాటల విలువ ఎలా 

తెలుస్తుంది? దేవుని మాటకు ఎంత శక్తి, విలువ, మహత్తు, ప్రభావము ఉందంటే, ఆయన 

తన మాట చేత సమస్త సృష్టిని సృష్టించాడు. దేవుడు అతి అద్భుతమైన సృష్టిని సృష్టించి, 

దానంతటికి కిరీటములాగా ఆదాము హవ్వ అనే మొదటి దంపతులను నిర్మించి, ఒక్కటే 

ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఆమాటలు జాగ్రత్తగా గమనించాలి. ఆదికాండము 2:15-17 లో 

దేవుని మాటలు వ్రాయబడ్డాయి. “మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను 

తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన 

యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; 

అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను 

దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.”  పది ఆజ్ఞలు దేవుడు 

ఇవ్వకముందే, సృష్టి ఆరంభములోనే ఈ ప్రాముఖ్యమైన మొదటి ఆజ్ఞను ఆనాడు ఆదాము 

హవ్వలకు ఇచ్చాడు. ఈనాడు పరిశుద్ధ గ్రంధం బైబిలోని మాటలన్నిటిని మనకు తన 

ఆజ్ఞలుగా ఇచ్చాడు. ఇంతలో సైతాను ఆదాము హవ్వలను  సమీపించి వారిని మోసవగించి 

దేవుని మాటకు వ్యతిరేకమైన అబధ్ధమును కుట్రపూరితంగా వారితో మాట్లాడాడు. దేవుని 

ఆజ్ఞను అతిక్రమించిన వెంటనే సరిగ్గా దేవుడు చెప్పినట్టే  ఈనాటి సమాజoలో పాపమును, 

దోషమును, అపరాధమును అతిచులకనగా భావించటానికి కారణము పాపమే. సజీవుడైన 

దేవుడు న్యాయవంతుని మర్చిపోకూడదు. దేవుడు పాపమునకు తప్పని సరిగా శిక్ష 

విధిస్తాడు. దేవుడు పరిశుద్దుడు. పాపమును చూసి సహించలేడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ 

మంటుందో తెలుసుకుందామా! హబక్కూకు 1:18లో దేవుని పరిశుద్ధత గూర్చి ఇలా 

వ్రాయబడింది. “నీకనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్మళంకమైనది గదా.” 

కీర్తన 5:4-5లో దేవుని స్వభావం గూర్చి స్పష్టముగా వ్రాయబడింది. “నీవు దుష్టత్వమును 

చూచి ఆనందించుదేవుడవు కావు. చెడుతనమునకు నీయొద్ద చోటులేదు. 

డాంబికులు నీసన్నిధిని నిలువలేరు పాపము చేయువారందరు నీకసహ్యులు”.


దేవుని సింహాసనము పరిశుద్ధమైనది. సృష్టికర్తయైన దేవునికి పాపమును శిక్షించే 

అధికారమున్నది. కీర్తన 11:4-6 వచనములలో దేవుని పరిశుద్ధతను గూర్చి ఏమని 

వ్రాయబడిందో తెలుసుకుందాం. “యెహోవా తన పరిశుద్దాలయములో ఉన్నాడు. 

యెహోవా సింహసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులార 

చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించు చున్నాడు. 

యెహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులును బాలాత్కారాసక్తులును 

ఆయనకు అసహ్యులు, దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. అగ్ని 

గంథకములును వడగాలియు వారికి పానీయ భాగము”.


అపరాధము చేసిన ఆదిమానవడిని దేవుడు తన సన్నిధిలో నుండి వెళ్ళగొట్టాడు. 

(ఆదికాందము 2:24) దేవుని నుండి వేరువడిన మానవ జాతి ఆనాటి నుండి పాపముతో 

నిండి పోతూఉన్నది. ఆదాము నుండి వ్యాపించిన మానవజాతి ద్వారా భూమి మాద ఉన్న 

ప్రతి ఒక్కరికి పాపము ప్రాకిపోయింది.  మానవజాతి అంతా పాపపు  లితాలను కూడా 

అనుభవిస్తున్నది.

పాపము వలురీతులుగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకనగా ఆది హృదయంలో నుండి 

వచ్చేది, ప్రవర్తనలో కనిపించేది. హృదయంలో దాగియుండే పాపము ఎవ్వరికి కన్పించదు. 

కాని దానివల్ల మానవాళి చేసే క్రియలు స్పష్టంగా కన్పిస్తూ ఉంటాయి. మనుష్యుని లోపలి 

నుండి, అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలును జారత్వములును 

దొంగతనములును నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడు తనములును 

కృత్రిమమును కామ వికారమును అవివేకమును వచ్చును. (మార్ము 7:20-22). దేవుని నుండి 

వేరుపడిన మానవుడు శాంతి, సమాధానంతో, నెమ్మది, నిలుకడతో జీవించలేడు.

రెండవ కారణము, పాపముతో నిండినలోకంలో మనశ్శాంతి దొరకదు: అభద్రతా భావమే నిండియున్నది.


ప్రస్తుతం లోకంలో ఏదేశపు వారమైనా, ఏజాతి వారమైనా ఏ కులమైనా, ఏ మతమైనా, 

స్వభావమంతా ఒక్కటే! ఇప్పటికే అస్తవ్యస్తంగా నున్న లోకములోనికి ఒకవ్యక్తి తన జన్మద్వారా 

వస్తాడు. కొద్ది సంవత్సరములు అంతా బాగానే ఉన్నట్లు అనిపించినా త్వరలోనే లోకములో ఎంత 

క్రూరత్వ ముందో, ఎంత మోసముందో, ఎంత స్వార్థముందో గ్రహించుకుంటాదు. అనేక సార్లు కొద్ది 

మంది నీతిగా, నిజాయితీగా జీవించాలని చిన్న చిన్న ప్రయత్నాలు చేసి విఫలమౌతారు. తాను ఈ 

లోకంలో సత్యముతో, న్యాయంగా, నిస్వార్థంగా బ్రతుకలేనని తెల్సుకుంటాడు. పాపము చేసి 

దేవునికి తిరుగుబాటుచేసే స్వభావం పుట్టుకతోనే కలుగుతుంది. మోసగించవద్దు అని ఆలోచన 

కలిగియుండి ఒకవేళ కొన్ని సార్లు తన క్రియలలో మోసము లేకుండా ప్రవర్తించటానికి 

ప్రయత్నిస్తూ ఉండవచ్చు. కాని అతి త్వరలో తనకే మోనం జరుగుతుందని తెలుసుకుంటాడు. 

ఇంకో మాటలో చెప్పాలంటే ఏ మానవుడు కూడా స్వభావసిద్ధంగా ఈ లోకపు పతనమునకు, 

అవినీతికి దూరంగా ఉండలేడు, అది అసాధ్యం. “వీర్రి మంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుని 

వెదకు వాడెవడును లేడు” రోమా 8:11 పాపముతో నిండిన హృదయం పాపములో నిండిన 

లోకములో పాపము దోషము అపరాధము, అతి క్రమము జీవన విదానంగా మారిపోయింది.

ప్రస్తుతం ఈలాంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నట్లు మనం చూసి గ్రహించుకొంటున్నాము. కానీ 

దేవుని లేఖనములు అనగా పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ సత్యమును మొదటినుండి చూపిస్తూనే 

ఉంది. ఆదాము కుమారులైన కయీను హేబేలు అనే ఇద్ధరిలోనే విభేదాలు మొదలై కయీను 

దేవునిపై తిరుగుబాటు చేసి, చివరికి తన స్వంత తమ్ముడిని హత్య చేశాడు.


ఆదాములో ఉండినపావము, అవిధేయత, తిరుగు బాటు తన కుటుంబంలో ప్రవేశించింది. ఇక 

ఆనాటి నుండి జన్మించిన ప్రతి ఒక్కరికి పాపపు స్వభావం సంక్రమించింది.

క్రమేణా జనము విస్తరించింది. దేశాలు, రాజ్యాలు ఏర్పాడ్డాయి కానీ మానవ స్వభావం మారలేదు. 

నోవహు దినాలలో దేవుడు తన తీర్పుగా పంపించిన జళప్రళయం ద్వారా మానవజాతి నంతటిని 

పరిశుద్ధుడైన దేవుడు ఊడ్చి వేసి, తుడిచి వేయాలనుకున్నా ఆయన కరుణను బట్టి నోవహు 

కుటుంబమును ఏర్పాటు చేసుకున్నాడు నోవహు ముగ్గురు కుమారుల కుటుంబములద్వారా 

భూమి నిండా అనేక జనములు, అనేక జాతులు నిండి పోయాయి. మానవస్వభావం మట్టుకు 

మారలేదు. ఒక్క నోవహు కుటుంబం తప్ప మానవాళినంతటిని సత్యవంతుడైన దేవుడు, 

న్యాయవంతుడైన సృష్టికర్త తుడిచిపెట్టాడంటే దేవుని న్యాయము, సత్యము ఎంత 

అత్యున్నతమైనదో, ఊహించలేనిదో మనం తెలుసు కోవాలి. విత్తనము వేప విత్తనమైతే 

మొలకెత్తేది వేప చెట్టులాగే మానవులందరూ పాపపు ఊబిలో చిక్కుకుపోయారు (కీర్త 51:4 ఈ 

వడిపోయిన లోకంలో శాంతి సమాధానాలు లేక తల్లడిల్లుచున్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్‌ 

నోవహు నాటి జనమును గూర్చి ఇలా సెలవిస్తుంది, ఆది కాండము 6:11-12: “భూలోకము దేవుని 

సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్మారముతో నిండి యుండెను, దేవుడు 

భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను; భూమి మాద సమస్త శరీరులు తమ 

మార్గమును చెరిపి వేసికొని యుండిరి” దేవుని వాక్కు ఎంత స్పష్టముగా సెలవిస్తున్నదో 

గమనించండి. ఈమాటలు గమనించి చూస్తే చెడిపోయి యుండెను” అనే మాట రెండు సార్లు, 

“చెరిపి వేసికొనియుండిర అని ఒకసారి లేఖనము తెలియచేస్తున్నది. దేవునివాక్యం ఒక్కసారి 

చెబితేనే అదిసత్యము, యధార్థం! మరి ఇక్కడ మూడు సార్లు చెబుతుందంటే ఎంతటి పతనమైన 

స్థితియో అర్ధమవుతుంది. దేవుడు సత్యవంతుడు, న్యాయవంతుడని చెప్పటానికి ఇది 

నిశ్చయమైన నిదర్శనం కాదా? చెడిపోయిన ఆహారం కాని, పండుకాని మనం తీసుకుంటామా? 

కుళ్లు, మురుగు వాసన వచ్చేది మనం దాచుకుంటామా? ఈ విధంగా దేవుడు బలాత్మారంతో 

నిండియున్న జనములన్నింటికి తీర్చు తీర్చాడు.


దేవునితో సంబంధం తెగిపోయిన మానవాళి ఎన్నడూ శాంతి, సమాధానాలు అనుభవించలేదు. 

దేవుడు మటుకు తన నిత్యమైన ప్రేమనుబట్టి ఆయన కరుణా, వాత్సల్యమును బట్టి మానవాళిపైన 

మొదటి నుండి దయచూపిస్తూనే వచ్చాడు. ప్రజలు ఎవరికి తోచినట్లు వారు జీవించారు. ఎవరు 

ఏది దేవుడు అని చెపితే అదినమ్మారు. అయినప్పటికి దేవుడు తన సృష్టిని, తాను నిర్మించిన 

మానవ జాతిని ఎన్నడూ మరువలేడు. దేవుని కరుణ, కృప మారలేదు. పరిశుద్ధ గ్రంథం బైబిలు ఈ 

విధంగా సెలవిస్తుంది. “మనమందరము గొజ్జెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తన 

కిష్టమైన త్రోవకు తొలిగెను... యెషయా58:6 అంతటి భయంకర పతనావస్థలో కూడా దేవుడు 

ఒకవ్యక్తిని లేవదీశాడు. ఆయనే నోవహు, ఆయన తండ్రి పేరు లెమెకు. ‘లెమెకు... భూమిని 

శపించినందు వలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను 

ఇతడు మనకు నెమ్మది కలుగ జేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను. (ఆదికాండము 

5: 28-29). నోవహు అంటే అర్ధం ఆదరణ లేదా విశ్రాంతి లేదా నెమ్మది. లెమెకు దేవుని ప్రేరేపణ 

చేత తనకుమారునికి ఆపేరుపెట్టడం గమనార్హం.


లెమెకు జీవించినతరం చెడ్డదైనా అవిధేయతకుతిరుగు చాటుకు బలాత్మారమునకు మారుపేరైనా 

ఆయన దేవుని నుండి ఆదరణ, నెమ్మది శాంతి, సమాధానాలు పొందాలని ఆశించి, విశ్వసించాడు.

అవినీతి, అక్రమము భూమి మాద ప్రతిచోట విపరీతంగా ఉన్నప్పటికి నోవహు మాత్రం దేవునివైపు 

తిరిగి విధేయత చూపాడు. “నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను 

అప్పటికి వర్షమును ఆయన ఎన్నడూ చూడక పోయినా ఆయన నమ్మాడు. నోవహు దేవునితో 

కూడా నడచినవాడు (ఆదికాందము 6:9) దేవుడు నోవహుతో ఏమన్నాడో గమనిద్దాం అదికాందము 

6:18 “ దేవుడు నోవహుతో- నమస్త శరీరుల మూలముగా భూమి బలాత్మారముతో నిండియున్నది 

గనుక నాసన్నిధిని వారి అంతము వచ్చియున్నది; ఇదిగో వారిని భూమితో కూడా నాశనము 

చేయుదును”. ఈ తీర్చు నుండి నాశనము నుండి తప్పించుకున్నది నోవహు, ఆయన కుటుంబం 

మాత్రమే. అంతకు ముందు ఎన్నడూ లేని అతి భయంకరమైన జళప్రళయం దేవుడు 

పంపించాడు. దాని నుండి తప్పించు కోవటానికి దేవుడు నోవహును ఒకపెద్ద ఓడ నిర్మించమని 

ఆజ్ఞ యిచ్చాడు. కేవలము దేవుని మాటను ఫఘనవరచి, విశ్వసించి నోవహు ఆఓడను కట్టాడు. 

భూమి మిద ఉన్న సృష్టి అంతటిలోఉన్న జీవరాశులలో నుండి దేవుని ఆజ్ఞ మేరకు ప్రతిజంతువు 

ప్రతి పక్షి జీవము కలిగిన ప్రతిదాని జంట ఆ ఓడలో ప్రవేశించింది. ఆసమయంలో దేవుడు 

నోవహుతో యిలా సెలవిచ్చాడు. ఆదికాండము 7:1: “యెహోవా- ఈ తరము వారిలో నీవే 

నాయెదుట నీతి మంతుడవైయుండుట చూచితిని గనుక నీవును నీయింటివారును ఓడలో 

ప్రవేశించుడి. ఆ జళప్రళయం వస్తున్న సమయంలో ప్రజల ఆర్తనాదాలు, భయ భ్రాంతులు 

ఒక్కసారి ఊహించండి. అవిధేయత, తిరుగు బాటునకు ఫలితము ఇదే కాని దేవుని మాటకు 

విధేయత చూపి “ఆయనతో నడచిన” వారందరికి శాంతి సమాధానం నెమ్మది, విశ్రాంతి దొరికింది. 

ఆ తరువాత పరిశుద్ధుడైన దేవుడు అబ్రహాము అనే వ్యక్తిని పిలిచాడు. అప్పటికి అబ్రహాము 

తండ్రియైన తెరహు దేవుని తెలుసు కోలేదు.


సర్వసృషికర్తమయైన దేవుడు అబ్రాహామును పిలిచినపుడు అబ్రహాము తన దేశమును, 

బంధువులను తండ్రియింటిని విడిచిపెట్టి సజీవుడైన దేవుడు ఆయనకు చూపించిన దేశానికి 

వెళ్ళాడు.

                 అబ్రహాము విగ్రహాలను విడిచి ఆయనను సృష్టించిన దేవుని వైపు మళ్ళాడు. సజీవుడైన 

దేవునితో సంబంధం కావాలని ఆశించిన అబ్రహాము స్వచ్చందంగా, హృదయ పూర్వకంగా 

విగ్రహాలను విడిచిపెట్టి తనను నిర్మించిన దేవుని వెంబడించాడు. దేవుడు సృష్టికర్త మహిమ 

కలిగిన వాడని నమ్మినప్పుడే అబ్రహాము తనసృష్టి కర్త వైపు మళ్ళగలిగాడు. ఈనాడు కూడా 

విగ్రహారాధన దేవునికి వ్యతిరేకమైనదని మనము గ్రహించాలి. దేవుని వాక్యం విగ్రహారాధన ద్వారా 

ఏమి జరుగుతుందో సెలవిస్తుంది. రోమాపత్రిక 1:23: “వారు అక్షయుడగు దేవుని మహిమను 

క్షయమగు మనుష్యుల యొక్కయు, వక్షులయొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, 

పురుగుల యొక్కయు, ప్రతిమా స్వరూపముగా మార్చిరి”.


                  అబ్రహామునకు దేవుడు యిచ్చిన వాగ్భానములలో ఒక భాగము “భూమి యొక్క 

సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడును” (ఆదికాండము 12:8) దేవుడు అదబ్రహాముతో 

వాగ్దానం చేసి ఆవాగ్భానమును సంపూర్ణముగా నెరవేర్చాడు. అబ్రహాము దేవున్ని ఎంత 

సన్నిహితంగా వెంబడించాడంటే ఆయనను దేవుడు తన స్నేహితుడని పిలిచాడు. దేవుడు 

అబ్రహామునకు ఇచ్చిన వాగ్ధానం ఆయన సంతానమంతటికి ఇచ్చి ఆయనలో నుండి ఇశ్రాయేలు 

అనే జాతీ ప్రజలను కలుగజేశాడు. దేవుడు వారిని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా 

లోకమంతటిని నిజంగానే ఆశీర్వదించాలని ఉద్దేశించాడు. కాని వారి అవిధేయత, తిరుగుబాటు, 

ధిక్కా ర ములను బట్టి ఆగొప్ప వరమును పోగొట్టుకున్నారు. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో 

సర్వశక్తిగల దేవుడు రాజుగా, న్యాయాధిపతిగా, రక్షకుడిగా ఉండి అద్భుత కార్యములు చేసి వారి 

ద్వారా తన రక్షణను, శాంతి, సమాధానాలను అను[గ్రహించాలని సంకల్పించాడు. కానీ 

మునుపటి  తరముల లాగే వారు కూడా అవిధేయత చూపి తిరుగుబాటు చేని దేవుని 

లేఖనములను ధిక్కరించి పతనమయ్యారు. ఎందరో ప్రవక్తల చేత వారిని గద్దించినా ప్రయోజనం 

లేదు. విగ్రహారాధనకు బానిసలయ్యారు. కన్పించిన ప్రతి దేవతను, విగ్రహమును పూజించి 

ఆరాధించి దేవునికి కోపము రేపారు. న్యాయాధిపతుల గ్రంథంలో వారి పతనావస్థ స్పష్టంగా 

వ్రాయబడింది. “ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల యెదుట కీదుచేసి, ఐగుప్తు దేశములో 

నుండి వారిని రప్పించిన తమపితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను 

పూజించి తమ చుట్టునుండు జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి 

నమస్మరించి యెహోవాకు కోపము పుట్టించిరి”. (న్యాయాధిపతుయలు 2:11-12) లేఖనము ఇంకా 

వారి దౌర్భల్యమును గూర్చి ఈ విధంగా సెలవిస్తున్నది. “ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని 

దుష్ ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మాని వేసి, బయలులు 

అష్టారోతులు అనుసిరియనుల దేవతలను సీదోనియుల దేవతలను మోయాబీయుల దేవతలను 

అమ్మోనీయుల దేవతలను ఫిలిష్తీయుల దేవతలను పూజించుచువచ్చిరి. యెహోవా కోపాగ్ని 

ఇశ్రాయేలీయు మిద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని 

వారినప్పగించెను” (న్యాయాధిపతులు 10:6-7)

           కాని దేవుని నిత్యప్రేమ నత్య వాగ్భానం, కృపా వాత్సల్యతలు వారిని విడువలేదు. దావీదు 

అను ఆయన సేవకుణ్ణి దేవుడు వారికి రాజుగా అభిషేకించి నియమించాడు. దావీదు దేవుని 

హృదయా నుసారుడైన మనుష్యుడుగా జీవించి దేవుని వెంబడించాడు.


నమ్మకమైన సేవకుడిగా ఆయన ప్రేమ పొంది దేవుణ్ణి సంతోష పెట్టాడు. అందు చేత సజీవుడైన 

దేవుడు ఆయనను ఆశీర్వదించి కాపాడి స్థిరపరచి చివరకి ఆయన వంశములో సర్వశక్తి గల దేవుడే 

మానవునిగా జన్మించాడు. దావీదు దేవుని వెంబడించిన వాడు కనుక ఆయనకు శాంతి 

సమాధానాలు అనుగ్రహించాడు. తన శత్రువుల మధ్యలో దావీదు ఈ విధంగా సాక్ష్యమిచ్చాడు 

“యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను 

సురక్షితముగా నివసింప జేయుదువు”. (కీర్తనలు 4:8) దావీదులాగా దేవునితో సంబంధం కలిగి 

యుండి క్రియా శీలక విశ్వాసంతో దేవుని వెంబడించిన వారందరూ శాంతి సమాధానాలు పొందారు.


మూడవ కారణము: ఈ లోకమంత దుష్టుడైన సాతాను యొక్క అధికారం క్రింద ఉన్నది.

ఈ అంశం 1 యోహాను 5:19లో స్పష్టంగా ఉన్నది: చదవండి. 

ఇంకా ముందుకు సాగిపోకముందు ఈ ప్రాముఖ్యమైన విషయం గమనించాలి. దేవుడు సర్వశక్తి 

కలవాడు సర్వాధికారము కలిగినవాడు, సర్వ సౌర్వభౌమ అధికారం ఆయనది. సాతాను 

అధికారము దేవుని క్రింద ఉన్న అధికారమే. సాతాను దేవుని సెలవు లేకుండా లోకములో ఏదీ 

చేయలేదు, చేయజాలడు. ఉదాహరణకు యోబును 'శ్రమలపాలు చేయటానికి దేవుడు సాతానును 

అనుమతిస్తే తప్ప చేయలేకపోయాడు. దేవుడు ఒకే సారి ఎన్ని చోట్లనైనా దేవుడు ఉండగలడు, 

కాని  సాతాను ఒకసారి ఒక్కచోటనే ఉండగలడు. ఈ లోకము ప్రస్తుతము సాతాను అధికారము 

క్రింద ఉన్నది. “..లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. (1 యోహాను 5:19) 

దుష్టుని యందున్నది అనే మాటకు అంతరార్థం “దుష్టుని యందు పడియున్నదని” అర్థం. 

అనగా వతనమైన లోకమని అర్థం. లోకమంతా కూడా దుష్టుని అధికారము క్రింద ఉన్నందుచేత 

ప్రస్తుతము వాడు విచ్చల విడిగా చెలరేగుతూ ఉన్నాడు. దేవున్ని ధిక్కరించిన సాతాను తన 

రాజ్యమును కట్టు కోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. వాడు అది చేయలేడు, కానీ 

ప్రయత్నం చేస్తున్నాడు.

కుళ్ళిపోయినటు వంటి పండువలె, చెడిపోయిన ఆహారం వలె ఈ లోకంలో ప్రస్తుతం అవినీతి 

అక్రమము, క్రూరత్వము, మోసము ఈ విధమైన దుష్ట కార్యములతో నిండి ఉన్నది. ఏ వార్తలు 

మనం చూసిన మనకు కనిపించేవి ఇవే. సాతాను ఈ లోకమును ఎంతగా ప్రభావితం చేస్తున్నాడో 

లేఖనము తెలియచెప్తుంది... “ఈ యుగసంబంధవమ్లైన దేవత అవిశ్వాసులైన వారి మనో 

నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసియున్నాడు”. (2 కోరింథీ 4:4).

ఇది లోకము విషయమైతే, మనలోనే, అనగా విశ్వాసము కలిగిన వారిలో శత్రువు నివాసము 

చేస్తున్నాడు. విశ్వాసులలో కూడానా? అవును, ఏ విధంగా?? మన ప్రాచీనస్వభావము చేత. మన 

హృదయములోనే ఉన్న ప్రాచీనస్వభావమును బట్టి చీకటి అనేక "విశ్వాసులలో" ఏలుతున్నది.  

దేవుడు లోకమును రక్షించాలని మొదటి నుండి అనగా ఆది మానవుడు ఆదాము పాపం చేసిన 

నాట నుండి తన రక్షణ సంకల్పమును నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయనను వెంబడించిన 

వారందరు ఆది నుండి రక్షణ, విమోచన, శాంతి, సమాధానాలు పొందుతునే వచ్చారు. కానీ దేవుని 


రక్షణ ప్రణాళిక లెక్క చేయక తమస్వంత ప్రయత్నాల చేత శాంతి సమాధానాలు పొందవచ్చని 

సాతాను భ్రమింప చేస్తున్నాడు. ఈ లోకములో ఉన్న దుష్ట అధికారము, ప్రాచీన స్వభాము , 

అన్యాయమును అనుసరించి జీవించేవారికి మనశ్శాంతి ఉండదు. యోహాను సంవార్త 8వ 

అధ్యాయంలో సాతాను స్వభామును యేసుక్రీస్తు ప్రభువువారు తేట పరిచారు. “...ఆది నుండి వాడు 

నరహంతకుడై యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు; వాని యందు సత్యమే లేదు; వాడు 

అబధ్ఢమాడునప్పుడు తననస్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్దికుడును 

అబద్ధమునకు జనకుడునై యున్నాడు. (యోహాను 8:44) పరిశుద్ధ లేఖనం సాతాను ఎటువంటి 

వాడో వానికేమి జరుగుతుందో స్పష్టంగా సెలవిన్తుంది”. “కాగా  సర్వలోకమును మోన పుచ్చుచు, 

అపవాదియునియు సాతానానియు పేరుగల ఆది సర్పమైన ఆమహాఘట సర్పము 

పడద్రోయబడెను. అది భూమి మాద పదద్రోయబడెను; దానిదూతలు దానితో కూడా 

పదద్రోయబడిరి. (ప్రకటన గ్రంథం12:9).

సాతాను వానిస్వభావమును బట్టి ఈ లోకమును మోసపుచ్చుతూ ఉన్నాడు. అందు చేత ఈ 

లోకంలో శాంతి సమాధానాలు దొరకవు వాడు దొరకనివ్వడు.

శాంతి సమాధానం అంటే ఏమిటి?

సాధారణంగా మన అవగాహన ప్రకారం మనశ్శాంతి అంటే నెమ్మదిగా, నిమ్మళంగా ఏ ఆందోళన 

లేకుండా ఉండే పరిస్థితి. పరిశుద్ధ గ్రంథంలో సమాధానం అనే మాటకు హెబ్రీభాషలో “షాలోమ్‌” 

అని వ్రాయబడింది. దాని అర్ధము సంపూర్ణమైన నెమ్మది, నిమ్మళము, విజయము, క్షేమము 

కలిగిన స్థితి. ఏ పరిస్థితి కలిగినా దానిని ధైర్యంగా ఎదుర్కో గలిగే   స్థితి. యూదులు ఒకరినొకరు 

కలుసుకున్నప్పుడు “షాలోమ్‌” అని ఒకరి కొకరు శుభము చెప్పుకొనేవారు.


ఈ లాంటి నమాధానం పొందటం ఈ లోకంలో పొందటం సాధ్యమా? ఇది కేవలం దేవునికి 

మాత్రమే  సాధ్యం, సామాన్య మానవునికి అనుదిన వ్రయానలలో, జీవితపోరాటములలో 

చిక్కుబడిన వారికి అసాధ్య మనిపిస్తుంది. సాతాను అధికారం క్రింద ఉన్న ఈ లోకంలో 

క్లిష్టపరిస్థితులలో శాంతి సమాధానం పొందటం కష్ట సాధ్యం.

అనుదిన జీవితంలో పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు. మనము పరిస్థితుల ఆధీనంలో ఉంటాం. పరిస్థితులు ఏవిధంగా ఎప్పుడు మారతాయో మనం చెప్పలేము. కానీ వాటిని ఎదుర్కోవాలి.

వాటిని ఎదుర్కొంటూనే నెమ్మదిగా, నిబ్బరంగా ఉండటం సాధ్యమా? యధార్థంగా మాట్లాడితే ఎక్కువ సార్లు అసాధ్యం గానే ఉంటుంది. ఏదోఒక సమయంలో ఆవేశమునకు లోనై ఆందోళనలో పడిపోవచ్చు, నిరాశలో మునిగిపోవచ్చు. ఒక బలహీనమైన ఘడియలో ఆత్మహత్య తలంపులు కలుగవచ్చు. బలహీన ఘడియలో ఎవరూ థైర్యపరచకపోతే. ప్రాణం పోగొట్టుకున్న వారెందరో ఉన్నారు.

ఆత్మహత్మ దేనికి పరిష్మారంకాదు. అది ఒకవ్యక్తిని నిత్యనరకంలో పడేలా చేస్తుంది. బలహీనమైన ఘడియలో నీసృష్టికర్తయైన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని గ్రహించు.

నీ జీవితంలో కూడా షాలోమ్‌” పొందే అవకాశం ఉంది.

నకిలీ శాంతి నిజమైన శాంతి:

ప్రస్తుతం ఈలోకంలో ప్రతిదానికి నకిలీ ఉన్నది నిజమైనది ఉన్నది. చాలా సార్లు రెండూ ఒకేలా అన్పిస్తాయి, కనిపిస్తాయి. గుర్తుపట్టటం కఠినసమస్య కానీ జాగ్రత్తగా పోల్చుకుంటే, పరీక్షిస్తే గుర్తుపట్టవచ్చు.

24
                  
నకిలీ శాంతి                                                              నిజమైన శాంతి

1. బలహీన పరిస్థితులలో నిలువదు.      1. అన్ని పరిస్థితులలో నిలుకడగా ఉంటుంది.

2. ఏదో ఒక వ్యసనంపైన, వస్తువుపైన 

లేదా ఆలోచనపైన ఆధారపడి ఉంటుంది. 2. ఇది నిజమైన శాంతి దేవుడు అనుగ్రహించేది కనుక దేవుని పైననే ఆధారపడి ఉంటుంది. దేవునిలో ఉన్నంత సేపు నిలుకడగా ఉంటుంది.

ఉదా:- పొగత్రాగటం, మధ్యపానం, డ్రగ్స్‌,టీవి, వ్యభిచారం మొ||వి

3. నకిలీ శాంతి కొంచెం కాలమే నిలుస్తుంది.   3. దైవికమైన శాంతి చాలా కాలం నిలుస్తుంది. నిత్యజీవం లోనికి దారితీయగలదు

4. నకిలీ శాంతి పరీక్షింపబడినప్పుడు 

ఓడిపోతుంది.                                                   4 నిజమైన శాంతి పరీక్షల్లో నెగ్గుతుంది.

5. నకిలీశాంతి మానవ ప్రేరేపితమైనది.        5. నిజమైన శాంతి దేవుని మూలముగా జన్మించి ఆయన చేత పేరేపించబడుతుంది.

పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈరెంటిని గూర్చి తేటపరుస్తుంది. “శాంతి మీకను గ్రహించి వెళ్ళుచున్నాను; నాశాంతినే మీకనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్లుగా

25
నేను
మీకనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవర పడనియ్యకుడి, వెరవనియ్యకుడి. (యోహోను 14:27). ఈ లేఖనంలో రెండు విధములైన సమాధానం శాంతి కనిపిస్తుంది. లోకమిచ్చే శాంతి, ప్రభువైన యేసుక్రీస్తు అను గ్రహించే శాంతి. యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహించే శాంతి లోకమిచ్చే శాంతి లాగా ఉండదు. ఈమాటలు ప్రభువు వారు తాను సిలువ మీదకు వెళ్ళక ముందు తన శిష్యులతో చెప్పిన మాటలు. ఆ ఎడబాటు సమయంలో తన శిష్యులతో పలికిన ఆదరణ మాటలలో ఒక భాగం.

లోకమిచ్చే శాంతి క్షణికమైన శాంతి అది పరిస్థితుల పైన, మనుష్యుల పైన, వస్తువులపైన, అనుభవంపైన ఆధారపడే శాంతి. యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహించే శాంతి తనస్వంతదీ అని స్పష్టంగా “*నాశాంతి” అనే మాటల్లో కనిపిస్తుంది.

ఆయన స్వంత సమాధానం వలాంటిదో బైబిలు గ్రంథం స్పష్టపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు నూటికి నూరుపాళ్ళు దేవుడైయుండి, ఆయన పాపము లేనటువంటి మానవ శరీరం, దాని స్వభావంతో ఈ లోకంలో 33 సం॥లు జీవించాడు. మూడేండ్ల పాటు ప్రభువువారు యూదయ, గలిలయ, సమరయ ఆపరిసర ప్రాంతాల్లో పట్టణాలు, గ్రామాలు అన్నీ తిరిగి వేలాది మందికి దయాకనికరం చూపించారు. వందలాది 26
మందిని స్వస్థపరిచారు. కానీ ప్రభువు ఎదుర్శొన్నటువంటి ఫోరమైన నిందలు, అపనిందలు, అభియోగాలు చాలా మందికి తెలియవు. ఆయన స్వంత గ్రామస్థులు “ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి, ఆయనను తల్లక్రిందుగా పదద్రోయవలెనని తమపట్టణము కట్టబడిన కొండపేటువరకు ఆయనను
తీసుకొనిపోయిరి ”. (లూకా 4: 29) అట్టి పరిస్థితులలో ఆయన శాంతి చెక్కు చెదరలేదు. యూదా మత నాయకులు, పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ప్రభువును వేధించాలని చిక్కు ప్రశ్చలు వేసేవారు, తప్పు పట్టాలని ప్రశ్నలు వేసే వారు. అయినా ప్రభువు తన శాంతిని ఎన్నడూ పోగొట్టు కోలేదు. ఆయన సముద్రము మాద ప్రయాణిస్తున్నప్పుడు సముద్రము చెలరేగింది. ప్రభువు అట్టి పరిస్థితులలో శాంతి మూర్తిగా నిలిచాడు. భయపడిన శిష్యులకు ధైర్యం చెప్పాడు. తుఫానును నిమ్మళింప చేశాడు. ప్రభువు తన దైవ శక్తి చేత దయ్యములు వెళ్ళగొడితే ఆయన దయ్యముల అధిపతి శక్తి చేత దయ్యములను వెళ్ళ గొట్టాడని ఘోరమైన అపనిందలు వేశారు. (మార్కు 3:22) వ్యభిచారము వలన పుట్టిన వాడని ప్రభువుపైన అత్యంత ఘోరమైన అపనింద వేశారు. (యోహోను 8:41). ఇలా చెప్పాలంటే ప్రభువును అనుదినము సాధించి వేధించారు. అయినా ప్రభువు ఎల్లప్పుడు శాంతి, సమాధానాలతోనే నిలిచియున్నాడు. చివరికి అన్యాయపు తీర్పు

27
ఆయన మిద చేయడానికి ప్రధానయాజకులు, పెద్దలు విశ్వప్రయత్నాలు చేసి ప్రభువును సిలువ మీదికి ఎక్కించేవరకు ఊరుకోలేదు. న్యాయాధిపతి పిలాతునహితము “
నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అని చెప్పాడు. మత్తయి 27:24

యేసుక్రీస్తు ప్రభువునకు సమాధానమునకు అధిపతి అని పేరు “Prince of Peace ” అంతే కాదు, యేసుక్రీస్తు ప్రభువు శిష్యులలో పదకొండు మంది వారి జీవితములను ప్రభువు సేవలో సంపూర్ణంగా ఖర్చుపెట్టారు. వారిలో యోహాను తప్ప ప్రతి ఒక్కరు ప్రభువు కోసం తమ ప్రాణాలు సంతోషంగా అర్చించారు.

వీటన్నిటిని బట్టి గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు సమాధానమునకు కర్త, అధిపతి.

నిజమైన శాంతి సమాధానాలు ఎలాగు పొందగలము?

ఇంతవరకు గమనించిన రీతిగా పాపముతో నిండి, పతనమైన లోకములో శాంతి, సమాధానాలు దొరకటం లేదు. సాతాను రాజ్యమేలుతున్న ఈ భూమిమిద శాంతి, సమాధానాలు కన్పించటం లేదు. తన సృష్టి కర్తతో సంబంధం తెగిపోయిన మానవనికి తిరిగి సంబంధం కలిగే వరకు శాంతి,

28
సమాధానం దొరకదు. మరి ఈ లోకంలో శాంతి, సమాధానాలు దొరకడం అసాధ్యమేనా? ఎంతమాత్రం కాదు. శాంతి సమాధానాలు, నెమ్మది, నిబ్బరం పొందటానికి మార్గము ఉన్నది. అదేమిటనగా సృష్టికర్తతో తెగిపోయిన సంబంధాన్ని తిరిగి బాగు చేసుకొని ఆసంబంధం ద్వారా దేవుడిచ్చే శాంతిని పొందటమే! “దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే ఆయన యేసుక్రీస్తను నరుడు. ఈయనే అందరి కోరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించు కొనెను”. 1 తిమోతి 2 :5.6. ఈ మధ్యవర్తి ద్వారా నీ సృష్టకర్తతో సంబందాన్ని సరిచేసుకొని విశ్వాసము ద్వారా శాంతి పొందవచ్చు.

ప్రస్తుతం లోకములో శాంతి లేదని అందరికి తెలుసు. అయినా శాంతి శాంతి అంటూనే ఉంటారు. ప్రపంచదేశాల మధ్యలో శాంతి ఒడంబడికలు చేస్తూ ఉంటారు. వాటిని కొట్టివేస్తూ ఉంటారు. ఎప్పుడు ఎక్కడ యుధ్ధం జరుగుతుందో తెలియనిరోజులివి.

“సమాధానము లేని సమయమున- సమాధానము సమాధానమని చెప్పుచు, నాప్రజల కున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. (యిర్మీయా 6:14). నిజమైన సమాధానం పొందగలిగే మార్గం యేసు క్రీస్తు ద్వారా రక్షణ దొరికే పాపక్షమాపణ. ఆయనే  నీకు              
దేవునితో నీకు సరియైన, నిజమైన, వ్యక్తిగతమైన సంబంధం మొట్ట మొదటిగా ఏర్పడాలి. ఎందుకనగా సమాధానం ఆయన ఇస్తే తీసుకునే కానుక లాంటిది కాదు. చేతిలో నుండి ఇచ్చే వస్తువు కాదు. ఇంకాస్పష్టముగా చెప్పాలంటే యేసుక్రీస్తే సమాధానం, శాంతి. సృష్టికర్తయైన దేవుడు పాపిలైైన మానవునితో సంబంధం కలపలేడు. ఎందుకనగా “ఆయన కనుదృష్టి ద్యుష్టత్వము చూడలేనంత నిష్మళంకమైనది”. (హబక్కూకు 1:13) దేవునితో మానవులకున్న సంబంధం శతృత్వంగా మారిపోయింది. రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఈ విదంగా
వ్రాయబడింది. “ఏలయనగా శత్రువులమైయుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా వునము దేవునితో నవూధానవఠరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుమూ. (రోమా 5:10) దేవునికి నీకు అద్దుగా ఉండేది ఒక్కటే. అదేమిటో పరిశుద్ధ గ్రంథం బైబిల్ స్పష్టముగా తెలియపరుస్తుంది.

మీదోషములు మాకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీపావములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. (యెషయా 59:1-2)

30
పాపములు క్షమించబడటానికి ప్రతిజాతి, ప్రతితరం, ప్రతి ఒక్కరు ఎవరికి తోచినట్టు వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, వారి పావము నిజంగా క్షమించబడిందో లేదో ఖచ్చితంగా తెలుసుకొనే మార్గము లేదని కొందరను కుంటారు.

కాని పరిశుద్ధ గ్రంథం బైబిలు పాపములు క్షమించబడటానికి ఖచ్చితమైన మార్గమును బోధిస్తుంది. ఈ మార్గములో కోట్లాది మంది వారి పాపములు శుద్ధి చేసుకుని దేవునితో సంబంధం పోందారు. నిజమైన శాంతి, సమాధానం, నెమ్మదిని పొందారు. ఈనాడు మికు కూడా ఈ ఆహ్వానం దేవుడు ఇస్తున్నాడు. “యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రండి, మన వివాదము తీర్చు కొందము మీపాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొట్టి బొచ్చువలె తెల్లనివగునుూ. (యెషయా 1:18). సాతాను తెచ్చే మరొక అనుమానం 'నాపాపములకు మరొకరు ఎలా ప్రాయశ్చిత్తం చేస్తారు? దీనికి సమాధానం ఉంది.

పాపములో పడిపోయిన వ్యక్తి తన పాపం కోసం తానే ఏప్రాయశ్చిత్తం చేయలేడు చేసినా ఏప్రాయశ్చిత్తమును, పరిహారమును దేవుడు అంగీకరించడు.

31
ఒక గ్రుడ్డివాడు చూడగలడా ? పాపము గ్రుడ్డి తనాన్ని కలిగిస్తుంది. చనిపోయిన వ్యక్తి ఏదైనా చేయగలడా ? పాపము మనలను ఆత్మీయ దీతిగా మరణింప చేసిందని దేవుని
వాక్యం సెలవిస్తుంది. “మీ అపరాధముల చేతను పాపముల చేతను మారు చచ్చిన వారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రదికించెను? (ఎఫెసీ 2:1). దేవుడు పాపమును శిక్షించకుండా ఉందలేడని గతంలో తెలుసుకున్నాం. అంతటి వరిశుద్దుడని మనం గ్రహించాలి. మన పాపపు శిక్ష సమస్తమును భరించటానికి, సహించటానికి పాయశ్చిత్తం చేయటానికి దేవుడే మానవుడిగా దిగివచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. అత్యంత కిరాతకమైన, అత్యంత క్రూరమైన రోమా ప్రభుత్వపు సిలువ మాద ఆయన నీపాపముల కోసమే పరిహారం చెల్లించాడు. “రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదని”. లేఖనము స్పష్టపరుస్తుంది. (హెబ్రీ 9:22).

నీకు బదులుగా నీస్థానములో నీపాముల ప్రాయశ్చిత్తం కోసం యేసుక్రీస్తు ప్రభువు మరణించాడని నీవు నమ్మితే నీకు దేవునితో సంబంధం కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువు మూడవ నాడు సజీవుడై తిరిగి లేచాడు. ఆయన పాపమును, లోకమును, మరణమును సాతానును జయించి తిరిగి లేచాడు. ఆయన సర్వాధి కారంగల దేవుడు. నీకు దేవునితో సంబంధం కావాలంటే నీవు చేయవలసిందల్లా ఒక్కటే, 32
“మనపాపములను మనము ఒప్పుకొనిస యెడల, ఆయన నమ్మదగిన వాడును. నీతిమంతుడును గనుక ఆయన మనపాపములను క్షమించి సమస్త
దుర్నితి నుండి మనలను పవిత్రులనుగా చేయును” (1 యోహాను 1:9). దేవునితో నీకు సంబంధం కలిగిన తరువాత ప్రభు విచ్చే వాగ్ధానం ఏమిటో తెలుసా? “వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసికొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. (హెబ్రీ 8:12) పరిశుద్ధ గ్రంథం బైబిల్ వ్రకారము శాంతి ఒకవస్తువుకాదు. ఏదైనా అర్పణ చేసి సమాధానం పొందలేము కానీ యేసుప్రభువు హృదయంలో ఉంటే శాంతి సమాధానం, నెమ్మది నిలుకడ కలుగుతుంది. “ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు” (ఎఫెస 2:16). మూల భాష గ్రీకులో ఆయనే మన సమాధానము అయి ఉన్నాడు అని అర్థం

గమనించారా! శాంతి సమాధానం పొందాలంటే యేసు క్రీస్తు ప్రభువును హృదయంలో జీవితంలో కలిగియుండాలి. అందు చేతనే యేసు క్రీస్తు ప్రభువు వారు “నాయందు నిలిచియుండుడి అని యోహోను సువార్తలో, చెప్పాడు. “క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి”. (కొలస్సీ 3:15). దేవుడు అనుగ్రహించే ఈ నవాదధానము మనలో

33
ఏలుచుండాలి. అనగా ఆదివత్యవము వపొాంచాలి. నీహృదయంలో యేసు ప్రభువు జీవిస్తున్నట్లయితే అనుదిన జీవితములో ఎదుర్శొనే ప్రతిపరిస్థితిలో,
ప్రతి శోధనలో పరిశుద్ధాత్ముడు నిన్ను తన శక్తి చేతనడిపిస్తాడు. పరిశుద్దాత్ముడు పనిచేసేది దేవునివాక్యం ద్వారా. మరి నేను చేయవలసింది ఏదీ లేదా? అని అనుకోవచ్చు దేవుని వాక్యం దానికి సమాధానం చెపుతుంది. “ఎవని మనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గల వానిగా కాపాడుదువు. వలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు. (యెషయా 26:3). నీ మనస్సు నీ ఆధీనంలో ఉంటుంది కానీ వేరే వారి ఆధీనంలో కాదు. నీవు నీ హృదయంలో ఉన్న యేసు ప్రభువు మిద ఆధారపడటం నేర్చుకుంటే అప్పుడు నీకు సంపూర్ణమైన నమాధానవు దొరుకుతుంది. “దేనిని గూర్చియు చింతవడకుడిగాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతా పూర్వకముగా మా విన్నపములు దేవునికి తెలియ చేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేను క్రీన్తువలన మీహృదయములకును మాతలంపులకును కావలి యుండును. మెట్టుకు సహోదరులారా, యేయోగ్యతమైనను మెప్పైనను ఉండిన యెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి, పవిత్రమైనవో, ఏవిరమ్యమైనవో, ఏవి

34
ఖ్యాతిగలవో వాటి మాద ధ్యానముంచుకొనుడి. మరియు మిరు నా వలన ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధాన కర్తయగు దేవుడు
మీకు తోడైయుండును.” (ఫిలీప్పి 4:6 9). ఈ లేఖన భాగములో “అప్పుడు అనే చిన్న మాటను గమనించారా !

చింతకు నీమనస్సులో తావు యివ్వకుండా ప్రతి విషయము గురించి ప్రార్థనద్వారా నీకు దేవునితో ఉన్న సంబంధం బలవర్చుకొంటే అవ్పుడు దేవుని నమాధానం మీ హృదయములకును, మీతలంపులకును “కావలిగా” ఉంటుంది.

కావలిని ఎందుకు ఉంచుతారు? ఎవరూ రాకుండా ఉండటానికి కదా! మన హృదయములకు మన తలంవులకు కూడా ఒకకావలి అవసరం. అదే దేవుని సమాధానం. ఎవరిష్టంవచ్చినట్టు వారు తలంచుతూ దేవుని సమాధానం కావాలి అంటే అది అసాధ్యం. నీ హృదయమును, తలంపులను దేవుని అధికారం క్రిందికి ప్రార్ధనా విన్నపముల ద్వారా నీవు తీసుకొని వచ్చినట్రెతే దేవుని సమాధానం నీస్వంత మౌతుంది.

అంతేకాదు ఏరీతిగా నీమనస్సును, తలంపులను ఉంచాలో అది కూడా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. 35
సత్యమైనవి, మెచ్చ తగినవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, అందరికి ఉపయోగకరమ్రైనవి, మంచి పేరు తీసుకు రాగలిగినవి ఈలాంటి వాటి గూర్చి నీమనస్సును ఆలోచింప చేయాలి. తలంపులతో ఆగిపోవద్దు. వాటికి సంబంధించిన క్రియలు చేయాలి. “అప్పుడ” సమాధానమునకు ప్రభువైన దేవుడు మాకు తోడైయుంటాడు.

యేసుక్రీస్తు ప్రభువే శాంతి, సమాధానం నిమ్మళం నిబ్బరం యివ్వగలిగిన శక్తిమంతుడు, అందుచేత ఆయనపైన హృదయపూర్వకంగా, సంపూర్ణంగా ఆధారపడేవారు, ఆయన అధికారములోనికి వారి జీవితాలను హృదయములను తీసుకొని వచ్చేవారు ఆయన సమాధానమును పొందగలరు.

నీసమాధానాన్ని ఎవరైనా దొంగిలించగలరా?

“దొంగ దొంగ తనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికినిరాడుూ. (యోహాను 10:10) నమాదధానమును కూడా దొంగిలించేవాడు ఒకడున్నాడు. వాడే దుష్టుడు, సాతాను. ఈ మాటలు స్వయానా యేసు ప్రభువు చెప్పిన మాటలు. సాతాను దొంగ. వాడు ఈ లోకాధికారి. నీలో ఉన్నటువంటి శాంతిని దొంగిలించటానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. మొదటి ప్రయత్నం నిన్ను పాపంలో పదేలా చేయటం. పాపము చేసినప్పుడు శాంతి సమాధానాలు

36
పోగొట్టుకుంటావు అని లేఖనము సెలవిస్తుంది. “దుష్టులకు నెమ్మది
యుండదని యెహోవా సెలవిచ్చుచునాడు”. (యెషయా 48 : 22) ఇవేమాటలు యెషయా 57 : 21 లో కూడా ఉన్నవి. నీవు పాపంలో పడినప్పుడు వెంటనే వినయముగా ప్రభువు సన్నిధిలో ఒప్పుకొని శుద్ధి చేయబడాలి. లేనట్లైతే నీవు పొగొట్టుకొన్న శాంతిని తిరిగి పొందలేవు (1 యోహాను 1:9).

అంతే కాదు సాతాను శారీరక అనారోగ్యతలు, రుగ్మతలు, బలహీనతల చేత నిన్ను శోధిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో నీవు ధైర్యము కోల్పోయే ప్రమాదం ఉన్నది. విశ్వాసము సన్నగిల్లవచ్చు. అట్టి సమయాల్లో దేవుని సమాధానం దొంగిలించబడక ముందే నీవు దేవుని సన్నిధిలో వేచియున్నట్లయితే నీ సమాధానాన్ని దుష్టుడు దొంగిలించలేడు. సాతాను మన మనస్సులో శాంతి ఉండటాన్ని చూసి ఓర్వలేక దేవుని వాక్యం గురించి, ఆయన గుణ గణముల గురించి అనేక అబద్ధపు మాటలు, తలంపులు నీలో పుట్టించాలని ప్రయత్నం చేస్తాడు. అట్టి సమయంలో దేవుని వాక్యమే నిన్ను స్థిరమైన విశ్వాసంలో ఉంచగలదు. “నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరచితివని నేను పూర్వము నుండి వాటి వలననే తెలిసి కొనియున్నాను”. (కీర్తనలు 119: 152) స్వయాన యేసుక్రీస్తు ప్రభువే లేఖనము చేత దుష్టుని నోరు మూయించాడు. (మత్తయి 4:3-11).

37
దు
ష్టుడు సహోదరులు, విశ్వాసుల మధ్య శాంతిని దొంగిలించటానికి ప్రయత్నం చేస్తాడు. అబద్దాలు, అసూయ, మత్సరం, వివాదము, స్వార్థం మొదలైన దుర్భీజాలను విత్తడానికై ప్రయత్నిస్తాడు. అందుచేత దేవుని కృపా వాక్యమును బట్టి విశ్వాసుల మధ్య ఉన్న సమాధానమును నీ చేతనైనంత మట్టుకు కాపాడు కోవాలి, లేదా నీ మట్టుకు నీవు నీ సమాధానమును కాపాడుకోవాలి. “శక్యమ్రైతే సమస్త మనుష్యులతో మా చేత సైనంతమట్టుకు సమాదానముగా ఉండుడి” రోమా 12 :18 ఎంత వరకు సాధ్యమో అంతవరకు చేయగలము. “శరీరానుసారమైన మనస్సు మరణము; ఆత్మాను సారమైన మనస్సు జీవము సమాధానమునై యున్నది”. (రోమా 8:56).

యేసుక్రీస్తు ప్రభువును హృదయంలో కలిగియున్న వారి జీవితాలలో పరిశుద్దాత్ముడు నివసిస్తాడు. (1 కొరింధీ 3:16). దేవుని ఆత్మ నదిపింపు ప్రకారం అనగా తలంపుల ప్రకారం జీవించి నప్పుడు సమాధానము కలుగుతున్నది. “శరీరానుసారమైన మనస్సు” అనగా పాపపు స్వభావము అని అర్థము. పాపపు స్వభావమును బట్టి జీవించినప్పుడల్ల శాంతిని కోల్పోతావు.

చాలా మంది క్రైస్తవలైనా, వారి జీవితాల్లో దేవుని సమాధానమును అనుభవించలేక పోతున్నారు. ఎందుకనగా 38
వారి తలంపులు దేవుని పరిశుద్ధ వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్నవి.

ప్రభువుపైన ఆయన శక్తివంతమైన వాగ్ధానంపైన మనస్సును కేంద్రీకరించటం ప్రక్కను బెట్టి, వారు వారి సమస్యలు ఎంత పెద్దవో, ఎంత బలవ్టైనవో, దానిపైన తలంపులను కేంద్రీకరిస్తారు. ఇది దుష్టుడు ప్రేరేపించిన దుశ్చర్య. వాడు ద్వేషంతో చిమ్మేవిషం. దేవుని వాక్యంతో, విశ్వాసంతో, దుష్టుడిని వాడి కుతంత్రములను, కుట్రలను త్రిప్పికొట్టవచ్చు. పరిశుద్ధ జీవితమే సమాధానానికి మూలాధారం. “నీతి, సమాధానము కలుగ జేయును నీతివలన నిత్యమును నిమ్మళమును నిబ్బరము కలుగును. అప్పుడు నాజనులు విశ్రమ స్థలమందును ఆశ్రయ స్థానమునందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు”. (యెషయా 32 :17) అంతరంగంలో దేవుని వాక్యమునకు విధేయత చూపే జీవితం అంతరంగంలోనే శాంతిని పుట్టిస్తుంది.

ఒకవ్యక్తి ప్రశాంతంగా నెమ్మదిగా, నిబ్బరంగా ఉండటం ఆయన జీవితంలో పరిశుద్ధతకు, విధేయతకు బుజువు.

అతని మనసాక్షిలో కల్మషము లేనపుడు శాంతి సమాధానాలు హృదయములో ఉందగలవు

39
ప్రియ చదువరీ నీకు దేవునితో సంబంధం తెగిపోయిందని గ్రపాంచావా ? ఆనంబందాన్ని పునరుద్ధించుకోవటానికి ఇదే అనుకూల సమయం. దేవుని గొట్టెపిల్ల యేను క్రీస్తు ప్రభువు వరిశుద్ధ రక్తములో నీపాపములను, దోషములను శుద్ధి చేసుకున్నట్లెతే నీ నీ సృష్టికర్తతో నీకు మంచి సంబంధం ఏర్పడుతుంది. అంత మట్టుకు నీ జీవితంలో నెమ్మది. నిమ్మళం పొందలేవు. సంబంధం ఏర్పడిన తరువాత నీవు దేవుని కుమారుడవు లేదా కుమార్తెవు అవుతావు (యోహాను సువార్త 1: 12)

నీకు మంచి సంబంధము ఏర్పడుతుంది. అంత మట్టుకు నీజీవితంలో నెమ్మది నిమ్మళం పొందలేవు. దీనమునన్సుతో యిప్పుడే దేవునితో నీసంబంధాన్ని సరిచేసుకున్నట్లయితే, నీవు దేవుని సమాధానమును నీజీవితమంతా పొందగలవు. సాతాను దొంగిలించటానికి ప్రయత్నించినా, దేవుని వాక్యమనే అత్యంత శక్తి వంతమైన ఆయుధంతో నీవు వాణ్ణి జయించగలవు.

ఒకవేళ సాతాను నీ శాంతిని దొంగిలించినా తిరిగి దేవుని సమాధానాన్ని ఆయన కృపతో పొందవచ్చు. వలాగనగా కారణము, ఏవిషయము, ఏపరిస్థితి దానికి కారణమో పరిశీలించుకుని క్షమాపణ పొందటం ద్వారా సాతాను దొంగిలించిన సమాధానాన్ని నీవు తిరిగి సంపాదించుకోగలవు.
పరిశుద్దాత్ముని అధికారంలో నీవు జీవించినంతసేపు నీ సమాధానాన్ని నెమ్మదిని, శాంతిని వాడు దొంగిలించలేడు ఇంకో విషయం! దేవుని సమాధానం పొందిన వారు వారి కుటుంబంలో, బంధువులతో, ఇరుగు పొరుగువారితో, సాటివారందరితో సమాధానంగా ఉంటారు. అట్టి వారిని యేసుక్రీస్తు ప్రభువు రెండవసారి వచ్చినప్పుడు తన రాజ్యములో చేర్చుకుంటాడు. అక్కడ నిత్య సంతోషం, నిత్య సమాధానం, నిత్యమైన నెమ్మది నిరంతరము ఉంటుంది. “కాగా మారు పరిశుద్దాత్మ
శక్తిపొంది , విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయుగు దేవుడు విశ్వానవు ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపును గాక”. (రోమా 15:18).
ప్రార్ధన:- సృ
ష్టికర్తయైన దేవా, నీతో నా సంబంధం తెగిపోయిందని తెలుసుకున్నాను. అందుచేత నాకు శాంతి సమాధానాలు లేవు. యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ రక్తంలో నా పాప దోషములను క్షమించి కడిగి, నీతో నా సంబంధము సరిచేయండి. నీ శాంతి సమాధానమును గ్రహించండి. క్రీస్తు నామమున వేడు కుంటున్నాను తండ్రీ ఆమెన్‌.

ఈ ప్రార్థన నీవు హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా చేసినట్లయితే, మమ్మును సంప్రదించండి. మీ కోసం ప్రార్ధన చేస్తాము.

ఇంకా ఆత్మీయ సహాయం ప్రార్ధన, కౌన్సెలింగ్‌ కోరినట్లయితే సంప్రదించడానికి : 

Pastor S. Vijay  Bhaskar, 

Road No.10, N. I. N Colony

Boduppal, Hyderabad- 500 092

Ph: 9849037535, 8143178111

Email : pastorvijay.livinghope@gmail.com

42


  దయచేసిఈ మనవిని గమనించండి:  చాలామంది ఈ వెబ్ సైట్ లో ఇవ్వబడుతున్న బైబిల్ ధ్యానాలు, వ్యాసాలు, చదువుతున్నట్టుగా ఉన్నది, మీ అందరినీ బట్టి ఎంతో ...