- దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు పొందండి. మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్ లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి.
- Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com.
- Or send a message by Whats App to 98663 41841
రోమా పత్రిక అధ్యయనం – 17
నిరీక్షణలో ప్రకాశించడమెలాగు?
హల్లెలూయ! ఆనందంగా ఉన్నారా? పరిస్థితులను, ప్రజలను చూస్తే ఆనందం కలుగదు. దేవుని కృప, ఆయన ఆయన ప్రేమను అనుమానములేకుండా విశ్వసించినట్లయితే, ఎట్టి పరిస్థితులలోనైనా ఆనందంగా ఉండగలము. పౌలు జైల్లో ఉండి ఆనందించాడు, ఆనందించమని హెచ్చరించాడు. నీవు జైల్లో ఉండి చదువుతూ ఉండచ్చు. ప్రభువులో ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందం ఉంటుంది. మీ మెసేజెస్, వాట్సప్ మెసేజెస్, ఫోన్ కాల్స్ పంపుతున్నవారికి వందనాలు. మీ బైబిల్, నోట్ బుక్ పెన్, తెచ్చుకొని ప్రశాంతంగా రోమా పత్రిక అధ్యయనం చేసుకుందాం.
మన అంతరంగంలోనికి మనము చూసుకుంటూ, జరిగినవాటిని గూర్చి తలపోసుకుంటూఉంటే క్రుంగిపోవచ్చు. మన చుట్టూ చూసి, దేశములలో, సమాజములలో, కుటుంబాలలో జరుగుతున్నవాటినికి గమనిస్తే, మనసులో ఒత్తిడి, నిరాశ కలుగుతుంది.
కానీ మనము దేవుని వైపు చూస్తే మనకు ఆశ, నిరీక్షణ కలుగుతుంది. ప్రియ స్నేహితుడా, సోదరీ, ఉన్నదంతా ఈ లోకమే కాదని నీకు చెప్పాలనుకుంటున్నాను. అందుకే మనము దేవుని వైపు చూచి నిరీక్షణ పొందుదాం. యేసులో నమ్మిక ఉంచినవారు దేవునివైపు చూసినపుడు ఉజ్వలమైన నిరీక్షణ పొందుతారు. ఆయన మనకు దుష్టుని కీడు నుండి విమోచన, వానిపై విజయమును వాగ్దానము చేశాడు. యేసు క్రీస్తు ప్రభువు తన వద్ద మనకు నివాసమును వాగ్దానము చేశాడు. అందుకే మనకు ఉత్సాహపు నిరీక్షణ ఉంది. కాబట్టి మనము నిరీక్షణతో ప్రకాశించవచ్చు.
ఈ నాటి మన అంశం నిరీక్షణతో
ప్రకాశించడం ఎలాగు?
ఈనాటి లేఖన భాగం రోమా. 5:1 - 5 ద్వారా ఆపో. పౌలు క్రైస్తవ అనుభమును వివరిస్తున్నాడు. దాని ఫలితమే నిరీక్షణలో ప్రకాశించడమంటే!
1.
కాబట్టి విశ్వాసమూలమున మనము
నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన
యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము
2 మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు
ప్రవేశముగలవారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయపడుచున్నాము.
3 అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి
4 శ్రమలయందును అతిశయపడుదము.
5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను
సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.
క్రైస్తవ జీవితములోని వేరువేరు
స్థాయిలను బోధిస్తూ నిరీక్షణలో ప్రకాశించుటకు ఆపో.పౌలు
మనలను నడిపిస్తున్నాడు.
దేవుని
కృపలో ప్రవేశించడం క్రైస్తవ జీవనంలోని మొదటి స్థాయి. మొదటి వచనం ప్రకారం ఇది
సమాధానమునకు, నెమ్మదికి మూలాధారము. “మనము నీతిమంతులముగా
తీర్చబడి, మన ప్రభువైన
యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము” ఇది అద్భుతం కదూ! నీతిమంతులముగా తీర్చబడడం మూలాన
సమాధానం పొందగలము. మరో ముఖ్యమైనమాట, దానికిది ఒక్కటే మార్గము. సమాధానము, నెమ్మది పొందటానికి
ఒకే ఒక్క మార్గము విశ్వాసము. గమనించండి, మన ప్రభువు యేసు క్రీస్తు ద్వారా మనకు దేవునితో సమాధానము కలుగుతుంది అని
మనకు చెప్పబడుతూఉంది. యేసు క్రీస్తు ప్రభువు నందు విశ్వసించడం ద్వారా పాపక్షమాపణ పొందడం, శాంతి నెమ్మది
పొందటానికి మూలాధారం.
దేవుని కృపలో ప్రవేశించడానికి ఒకేఒక్క మార్గం. అది యేసు క్రీస్తు ద్వారా. “ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగలవారమై, అందులో నిలిచియుండి...” అని చదువుకున్నాము కదా! యేసు ప్రభువునందు విశ్వసించడం ద్వారా నీవు దేవుని కృపలో ప్రవేశిస్తావు. ఒక గేట్లో గుండా ఇంటిలోనికి వెళ్ళినట్టు, విశ్వాసము ద్వారా దేవుని కృపలో ప్రవేశిస్తాము. దేవుని కృపలో ప్రవేశించడమే కాదు, అందులో నిలిచి ఉంటాము. ఈ కృపలో జీవించడానికి స్థానము, అవకాశము ఉన్నాయి. యేసులో ఆనందము కూడా ఉన్నది. “దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము” "అతిశయ పడుచున్నాము" అనగా ఆనందిస్తున్నామని అర్ధం. గమనించండి, యేసు నందు విశ్వాసముంచుతాము, ఆయనలో జీవిస్తూ ఉంటాం, ఆయనలోనే ఆనoదిస్తూఉంటాము. క్రైస్తవ జీవనంలోని మొదటి స్థాయి ఇదే! అది ఆయన కృపలో ప్రవేశించడం.
క్రైస్తవ జీవనంలోని రెండవ
స్థాయి శ్రమలు సహించడం. 3-4 వచనాలలో ఈ తలంపు తేటతెల్లమవుతుంది. “అంతే
కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను
కలుగజేయునని యెరిగి శ్రమలయందును
అతిశయపడుదము.” విశ్వాసపు జీవితములో
శ్రమలు కూడా ఉన్నాయి. విశ్వసిoచిన ప్రతి ఒక్కరూ త్వరలోనే కొన్ని కష్టాలు, ఇబ్బందులు
ఎదుర్కుంటారు. వాటిలో కూడా ఆనందిస్తామని పౌలు అంటున్నారు.
ఈ సందర్భములో పౌలు గారు వాడిన గ్రీక్ మాట ఏమిటో తెలుసుకుందామా? ఆయన వాడిన మాట “థ్లిప్సిస్.” దాని అర్ధం కొరడా ఝలిపించడం. మన రక్షకుడు కొరడా దెబ్బలు సహించడం మర్చిపోకండి! యోహాను సువార్త 16:33లో ప్రభువు తన శిష్యులతో చెప్పిన మాటలు గుర్తు చేసుకుందాం. “లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను.” విశ్వాసపు జీవితములో శ్రమలు, హింసలు ఉంటాయి.
శ్రమలను ప్రభువు తన క్రియ చేయటానికి ఉపయోగించుకుంటాడు గనుక క్రైస్తవ
విశ్వాసి శ్రమలలో ఆనందించవచ్చు. శ్రమ ఓర్పును కలిగుస్తుందని నేర్చుకున్నాము కదూ!
ఓర్పు అనగా సహించుట. హృదయములో నిశ్చలముగా ఉండి,
పట్టుకున్నదాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి. ప్రియా సోదరుడా,
సోదరీ! శ్రమలు సహిస్తున్నావా? ధైర్యముగా ఉండు! విశ్వాసమును
విడిచిపెట్టవద్దు! ఓర్పు పరీక్షను కలిగుస్తుందని తెలుసుకుంటున్నాం. పరీక్ష అనే
మాటకు మూలభాషలో అర్ధం శీలం లేదా గుణం. శ్రమలు సహిస్తే కలిగే శ్రేష్టమైన మేలు
స్వభావము మార్చబడుతుంది. శ్రమలు అనే మాటకు అంతరార్ధం మామూలుగా జీవితంలో ఎదుర్కొనే
బాధలు కాదు, అతి బలమైన శ్రమ. ద్రాక్షలను
త్రోక్కి రసము తీసినట్టు ఒత్తిడి సహించడం. మన భాషలో చెప్పాలంటే, మిక్సీలోవేసి పిండిచేయడం వంటి శ్రమలు. గానుగలో వేసి నూనె తీయడంలాంటి కఠినమైన
బాధలు, క్లిష్టమైన వేదనలు. వీటన్నిటి ద్వారా కలిగే
శ్రేష్టమైన ఫలితం నిరీక్షణ.
సోదరీ సోదరులారా, యేసు క్రీస్తునందు
విశ్వసించడం ద్వారానే ఇది సాధ్యమని మీకు మళ్ళీ చెప్పాలని ఆశిస్తున్నాను. “ఆయనద్వారా మనము
విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగలవారమై, అందులో నిలిచియుండి…….” ఈ మాటలు మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. జీవితపు శ్రమలు, హింసలు, కష్టాలు, ఇబ్బందులు దేవుని కృపను పొందడానికి మచి
అవకాశాలు. క్రైస్తవ జీవనంలోని ఈ రెండవ స్థాయి జీవితపు శ్రమలు ఎదుర్కొని జయించడం. మేలు
కలుగడానికి ఇది దారి చూపుతుంది. ఎదగడానికి ఇది దోహదపడుతుంది. నిరీక్షణలో ప్రకాశించడానికి
చక్కని అవకాశం. “థ్లిప్సిస్” ద్వారా నిరీక్షణలో ప్రకాశించుదామా మరి!
క్రైస్తవ
జీవిత అనుభవములోని మూడవ స్థాయి, కిరీటంలాంటిది. అది పరిశుద్ధాత్మ అనే వరముతో ఆనందించడం. ఇది అద్భుతమైనది, నిరీక్షణ అనే శ్రేష్టమైన
కానుక. గమనించారా? సోదరీ సోదరులారా, ఈ శ్రమలన్నిటికి నిరీక్షణ ముగింపుగా ఉంటుంది
అని చెప్పడమే కాకుండా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని పౌలు నిర్ధారిస్తున్నాడు.
చాలామంది దేవునిని ఎరుగనివారు ఈ శ్రమలు, హింసలు, పోరాటాలు, వేదనలు దుఖ:ములు సహించటం
నిష్ప్రయోజనమని భావిస్తారు. కానీ ఈ అనుభవాలు
నిరీక్షణ అనే వరమును మనకు అందిస్తాయని మనకు తెలుసు.
విశ్వాసులు వీటిలో ఆనందాన్ని కనుక్కుంటారు.
మనకున్న నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈలాటి నిరీక్షణ ఉన్నందుచేత మనము సిగ్గుపడనవసంర లేదు, ముఖము దాచుకోనవసరం లేదు. మన నిరీక్షణ దేవుని శ్రేష్టమైన వాక్యము, వాగ్దానములమీద ఆధారపడిఉంది. వీటన్నిటికి పైగా మన నిరీక్షణ దేవుని ప్రేమమీద ఆధారపడిఉంది. “మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.”
నా స్నేహితులారా, దేవుడు తన ప్రేమతో
మనలను సమీపించి, మనవరకు దిగిరావడం ఎంతో అద్భుతమైన సంగతి. క్రైస్తవ జీవితంలోని ఈ మూడవ
స్థాయిలో ఉన్నవారిని, నీవు, నేను అనే తారమమ్యం లేకుండా ప్రభువు గమనిస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని ప్రేమ మన
హృదయములలో కుమ్మరింపబడిoది. కుమ్మరించుట అనే మాటకు ఒక నీటిఊటలో నుండి నీరు ఉబికివచ్చినట్టు అని
అర్ధం. ధారావాహికంగా ప్రవహించినట్టే నదిలాంటిది. మనకు అనుగ్రహించబడిన
పరిశుధ్ద్ధాత్ముని వల్ల ఇది కలుగుతుంది. మన జీవితాల్లో పరిశుద్ధాత్ముని శక్తికి
దేవుని ప్రేమకు విడదీయరానిసంబంధం ఉన్నది. దేవుడు మనకు తన ఆత్మను వాగ్దానము
చేశాడు, యెసయ్య మనకు ఆత్మను వాగ్దానము చేశాడు. మనము పరిశుద్ధాత్మ వరమును
పొంది ఆ ఆనందముతో నిండిఉండడం సాధ్యమా? సాధ్యమే!
మూడవ స్థాయిలో మనము ఉప్పొంగే
దేవుని ప్రేమతో పరిశుద్ధాత్మయందు ఆనందిస్తూఉంటాము. దేవుని నిరీక్షణలో ఆనందముతో
సంతోషించండి, నిరీక్షణలో ప్రకాశించండి! క్రైస్తవ జీవితంలోని ఈ స్థాయిలను లోతుగా
ధ్యానించండి: దేవుని కృపలో ప్రవేశించండి, జీవితపు శ్రమలను సహించండి, పరిశుద్ధాత్మ అనే వరములో ఆనందించండి. ఈ జీవితంలో నిరీక్షణలో ప్రకాశించండం
మనలను నిత్యత్వానికి సిద్ధపరుస్తుంది. మీ శ్రమల్లో దేవుని వాక్యమేలాగు
ధైర్యపరుస్తుందో మాతో పంచుకోండి.
మన పరమతండ్రి దేవుని నిత్య ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు శాశ్వతమైన కృప, పరిశుధ్ద్ధాత్ముని ద్వారా దేవునితో సహవాసము, నిత్య ఆదరణ, ధైర్యము, కంచె కాపుదల మనకందరికీ తోడుగా ఉండుగాక! అమెన్!!
No comments:
Post a Comment