- దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు పొందండి. మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్ లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి.
- Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com.
- Or send a message by WhatsApp to 98663 41841
రోమా పత్రిక అధ్యయనం – 16 (4:19-25)
విశ్వాసము ఎలా పని చేస్తుంది?
Praise The Lord! మీ తలంపులు తడబడుతూ ఎటుతోచని స్థితిలో ఉన్నారా? హృదయ వేదన, బాధ, శాంతి
నెమ్మది లేకుండా చేస్తున్నాయేమో! “ఎవని మనస్సు నీమీద అనుకొనునో వానిని నీవు
పూర్ణశాంతిగల వానిగా కాపాడుదువు” అని సర్వశక్తిగల సత్యదేవుడు పరిశుద్ధ గ్రంధం
బైబిల్లో సెలవిచ్చాడు. కొంచెం కాదు, పూర్ణ శాంతి. మెసేజెస్, వాట్సప్, ఫోన్ ద్వారా,
మీరు పంచుకుంటున్న ప్రార్ధన అంశాలను ప్రభువు కృపాసనంవద్ద జ్ఞాపకం చేస్తున్నాం.
మీరు కూడా ప్రార్ధనలో పట్టుదలగా ఉండండి.
ప్రతి దినం, ప్రతి క్షణo, మనము ఏదో ఒక నిర్ణయం చేయవలసి ఉంటుంది, అవునా? మన భవిష్యత్తు మనము చేసే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుoది. మనము ఈదినము చేసే నిర్ణయాలను బట్టి రేపటి ఫలితాలు ఉంటాయి. రేపేమి జరుగుతుందో మనకు తెలియదు గనుక మనము అనుమానపడుతూ ఉంటాము. కానీ సరియైన నిర్ణయం తీసుకుంటే మనము దాని ఫలితాలగురించి సoతోషిస్తాము. సాధారణ జీవితంలో ఉన్నట్లే, అధ్యాత్మికజీవితం, నడవడిలో కూడా అంతే. మంచి నిర్ణయాలు తీసుకున్నపుడు మనకు నెమ్మది కలుగుతుంది.
మన తండ్రి అబ్రహాము చాలా సంవత్సరాలక్రితం తన జీవితములో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఆపో. పౌలు ఈ నిర్ణయాలగురించి వ్రాశాడు. రోమా. 4:19-25 చదివి, అధ్యయనం చేసి విశ్వాసము ఎలా పని చేస్తుందో మనము గ్రహించటానికి తగిన సహాయము పొందుదాo, రండి. బైబిల్, నోట్బుక్, పెన్ తెచ్చుకున్నారా? రోమా 4:19-25.
19 మరియు అతడు
విశ్వాసమునందు బలహీనుడుకాక, రమారమి
నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,
20
అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక
21 దేవుని
మహిమపరచి, ఆయన వాగ్దానము
చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.
22 అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.
23 అది అతనికి
ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదుగాని
25 ఆయన మన
అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.
ఈ లేఖన భాగములో విశ్వాసము పనిచేసి కొన్ని
గూఢమైన మార్గాలు స్పష్టపరచబడ్డాయి. ఈ సుబోథ మంచి నిర్ణయాలు తీసుకోవడంలో మనకు సాయపడుతుంది.
మొదటి మార్గం, శరీరపు
బలహీనత ద్వారా విశ్వాసము పని చేస్తుంది: మనమంతా మరణించేవారమే. వయసు మీదపడుతూఉండగా శరీరము ఉడిగిపోతుంది, మరణం సమీపమౌతుంది. ఈ శరీరంలో
మనము ఎల్లకాలం జీవించలేము. తప్పనిసరిగా ఎప్పుడో ఒకప్పుడు చివరి ఘడియ రానేవస్తుంది.
ఇక్కడ మనకు అబ్రహాము
ఆయన భార్య శారా కనిపిస్తున్నారు. వారు శరీరంలో బలహీనులైనాగాని, విశ్వాసములో బలహీనులు
కాలేదు. అబ్రహాము శారాలు శరీరమును బట్టిచూస్తే, పిల్లలుకనే వయసులో
లేరు. మన లేఖన భాగములో అబ్రహాము వయసు నూరేళ్ళు అని చెప్పబడింది. శారమ్మ 90ఏళ్ల
వయసులో ఉంది, ఎప్పుడూ పిల్లలు కనని గొడ్రాలు. వారి శరీరాలు బలహీనముగా ఉన్నందుచేత వారి
విశ్వాసము బలముగా ఉండవలసిన అగత్యత ఉన్నది. ఆ శరీరపు బలహీనత అబ్రహామును
జయించలేకపోయింది. బైబిల్ గ్రంధం 19వ వచనంలో “అతడు
విశ్వాసమునందు బలహీనుడు కాక... తన శరీరము మృతతుల్యమైనట్టును …. ఆలోచించెను” అని సెలవిస్తుంది. ఆయన శరీరము బలహీనమైనప్పటికీ, ఆయన విశ్వాసము బలహీనము
కాలేదు. విశ్వాసము పనిచేసే మార్గమిది.
గమనించండి, మన బలహీనతలు నిజమైనవే, అయినగాని, అవి మనలను
బలహీనపరచగూడదు. అబ్రహాము బలహీనత ఆయన విశ్వాసమును బలహీనపరచలేదు. ఆయన విశ్వాసము
బలమైనది. ఆయన దేవుని వాగ్దానము విషయములో తొణకలేదు. ఆయన శరీరము బలహీనమైనా, తన
విశ్వాసము మట్టుకు బలమైనది.
హృదయపుసమ్మతి విశ్వాసము
పనిచేసే రెండవ మార్గము. అబ్రహాము
విశ్వాసమును ఎలా స్వంతం చేసున్నది గమనించండి. ఆయన దేవుని వాగ్దానమును నమ్మడంలో
తటపటాయించలేదు, కానీ ధృఢoగా నమ్మాడు. వారి శరీరపు శక్తిని బట్టి చూస్తే, ఏమాత్రం దేవుని
వాగ్దానానికి విరుద్ధమైనా, అబ్రహాము ఊగిసలాడలేదు, తొణకలేదు. అబ్రహాము అనుమానించలేదు, గాని దేవుని
వాగ్దానమును స్వంతం చేసుకొన్నాడు. తాను వాగ్దానము చేసినదానిని దేవుడు చేస్తాడని
విశ్వసించాడు. ఇదే అబ్రహాము హృదయపు సమ్మతి అంటే అర్ధం.
21వ వచనంలో
వ్రాయబడ్డట్టు, “రూఢిగా” విశ్వసించాడు. ఆ మాటను గమనించండి. అనగా అనుమానమునకు ఏమాత్రం
అవకాశము లేదు. తన మనసులో ఇసుమంత అనుమానమునకు తావియ్యలేదు. దేవుడు వాగ్దానము చేసిన
దాన్ని ఆయన చేయగల “సమర్ధుడని” సంపూర్ణంగా నమ్మాడు. ఈ మాటనుకూడా మీ బైబిల్లో
గమనించండి. సమర్ధుడే కాదు గాని చేస్తాడని రూఢిగా నమ్మాడు. అబ్రహాము మనసులో ఏ
విధమైన అనుమానము, ఆందోళన లేదు. ఆ సిద్ధమనసులో విశ్వాసము పని చేసింది.
ఆయన విశ్వాసము నీతిగా
ఎంచబడిందని 22వ వచనంలో పౌలు స్పష్టంగా చెబుతున్నాడు. “అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను” అబ్రహామునకున్న విశ్వాసము ఆయనకు లేని నీతికోసం
ఎంచబడింది. దేవుడు పనిచేసి పధ్ధతి, విధానము ఇది. హృదయపు సమ్మతి, సంసిధ్ద్ధత ద్వారా
పనిచేస్తుంది. అబ్రహామునకున్న అవసరత అది, అదే ఆయన కోరుకున్నది కూడా! ఆయన సిద్ధమైన హృదయంను బట్టి అది సాధ్యమయ్యింది.
దేవుడు అబ్రహాము విశ్వాసమును ఆయనకు నీతిగా ఎంచాడు.
గమనించండి, అబ్రహాము హృదయపు
సంసిధ్ద్ధత దేవునియందు ధృడంగా ఉన్నట్టు, మన హృదయపు సంసిద్ధత దేవునియందు ధృడంగా ఉండాలి. దేవుడు వాగ్దానము
చేసినది ఆయన తప్పనిసరిగా నెరవెర్చే విషయంలో అబ్రహాము మనసులో ఇసుమంత కూడా అనుమానము, సందేహము లేదు.
మూడవది, అద్భుతమైన ప్రణాళిక ద్వారా విశ్వాసము పనిచేస్తుంది. దేవుని ప్రణాళికలో
అబ్రహాము విశ్వాసము పనిచేసిన క్రమమును ఆపో. పౌలు వివరించిన పద్ధతి చాలా ఆశాజనకంగా
ఉంది. దేవుడు అబ్రహామును గూర్చి వ్రాసింది ఆయనకోసమే కాదు, మనకోసం కూడా అని పౌలు
బోధ. ఇది ఎందుకు రాయబడిందంటే, మనము ఈనాడు దేవుని ప్రణాళికను క్షుణ్ణంగా పరీక్షించి, నేర్చుకోవాలనే!
ఎందుకంటే, విశ్వాసము ఎలా
పనిచేస్తుందో మనము తెలుసుకోవడానికి అబ్రహాము విశ్వాసమును నిరూపించాడు. అది
అద్భుతమైన ప్రణాళిక. దాని ఫలితము 24వ వచనములో స్పష్టంగా ఉన్నది. “ మన
ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన
నిమిత్తముకూడ వ్రాయ బడెను” సోదరీ సోదరులారా? విన్నారా? మనము విశ్వసిస్తే,
అబ్రహామునకు చేసినట్టే మనకు కూడా దేవుడు చేయగలడు. మనము యేసు క్రీస్తును
మృతులలోనుండి లేపిన దేవుని విశ్వసించినట్లయితే, మన విశ్వాసము
మనకు నీతిగా ఎంచబడుతుంది. దేవుని అద్భుతమైన ప్రణాళికలో యేసు క్రీస్తు ప్రభువు
పునరుధ్ధానము ప్రాముఖ్యమైన పునాది.
25వ వచనములో పౌలు రక్షించబడే పద్ధతిని
వివరిస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభువు “ఆయన మన అపరాధముల నిమిత్తము
అప్పగింప”బడ్డాడు. అనగా మన పాపములకోసం. “మనము నీతిమంతులముగా
తీర్చబడుటకై లేపబడెను” ఇది దేవుని
అద్భుతమైన ప్రణాళిక. ఇది ఆశ్చర్యమును కలిగిస్తున్నది. ఇది ఎలా సాధ్యపడిందో అని
మనము అనుకుంటాముగాని, అయినా, దేవుడు అది చేశాడు.
ఈ గూఢమైన సత్యాలు మన విశ్వాసమును మేల్కొలపాలి. మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, విశ్వాసము శరీరపు బలహీనతల ద్వారా పనిచేస్తుంది. ఇది సత్యం. రెండవది, హృదయపు సంసిధ్ద్ధత ద్వారా విశ్వాసము పనిచేస్తుంది, దీనికి నిర్ణయం అవసరం. మూడవది, దేవుని అద్భుతమైన ప్రణాళిక ద్వారా విశ్వాసము పనిచేస్తుంది. ఇది ప్రభువుతో మన జీవితమును బలపరుస్తుంది. ఈ విశ్వాసపు ప్రక్రియ మహత్తరమైన సత్యం. ప్రియ స్నేహితుడా, సోదరీ, దీని ఔన్నత్యము నీవు గ్రహించాలని ఆశిస్తూన్నాను.
మన పరమ తండ్రియైన దేవుని నిత్య ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు శాశ్వతమైన కృప, పరిశుధ్ద్ధాత్ముని నిత్య ఆదరణ, నెమ్మది, సహవాసము, కంచె, కాపుదల మనకందరికీ సదకాలము తోడుగా ఉండుగాక!
No comments:
Post a Comment