2 కొరింధీ-3 1:3-7 మొదటి భాగము ఆదరణలోని మొదటి మెట్టు

 

II కొరింధీ-3   1:3-7 మొదటి భాగము 

 ఆదరణలోని మొదటి మెట్టు

మానవులము కాబట్టి కొన్ని విషయాలు, కొన్ని అనుభవాలు మనకు కొంత 

సుఖశాంతులు ఇస్తాయి. దినమంతా కష్టపడి పనిచేసిన తరువాత ఒక మెత్తని కుర్చీలో 

కూర్చొని సేద తీరడం. లేదా ఎంతో సౌకర్యంగా ఉండే మెత్తని పరుపు మీద పడుకొని 

హాయిగా నిద్రపో వడం శరీరం కోసం సుఖం కలిగిస్తుంది. లేదా అది మానసికమైన విశ్రాంతి 

కావచ్చు. ఎంతో తృప్తిగా  సంతోషంగా ఉండే పరిస్థితి కావచ్చు.

 ఇంకా చెప్పాలంటేమీకిష్టమైన ఆహారం, భోజనం కావచ్చు ! శారీరికమైన మానసికమైన 

తృప్తి, సుఖశాంతులు ఇచ్చే వస్తువులు, పరిస్థితులు అన్ని కలిసి మరింత సుఖంగా 

మిమ్మల్ని ఉంచవచ్చు. తెలిసినవి ఎక్కువ, తెలియనివి కొన్ని మాత్రమే ఉన్నందున 

కొంత సుఖంగా ఉన్నామనుకోవచ్చు. క్లిష్ట పరిస్థితి, ఇంతకుముందు తెలియని, 

ప్రతికూలమైన పరిస్థితిలో మనకు భయం, ఆందోళన కలుగుతుంది. ఆలాటి పరిస్థితుల్లో 

గుండె వేగంగా కొట్టుకోవడం, కడుపులో మితిమీరిన ఇబ్బంది ఈలాటివి మనలో ప్రతి 

ఒక్కరం ఏదో ఒక సమయములో రుచిచూచే ఉంటాము. ఆ సమయాలు మనకు     

సుఖవంతమైన పరిస్థితులు కావని మనకు అర్థమవుతుంది. అందుకే మన ఇంట్లో ఉండే 

సౌకర్యం, నిమ్మళం, నెమ్మదిని కోరుకుంటాము. ఇంట్లో ఏమి 

జరుగుతుందో మనకు తెలుసు. ఎక్కడ ఏమి ఉన్నదో, ఎవరి అలవాట్లు ఏమిటో, ఇంటివారు ఏ 

పరిస్థితుల్లో ఎలా స్పందిస్తూ ఉంటారో మనకు తెలుసు.

          మరి మన ఆత్మీయ జీవితములో ఉండే ఇబ్బందులకు పరిమితులేమిటి? అవి ఎలా 

ఉంటాయి? నీవు మారుమనసు పొంది తిరిగి జన్మించిన విశ్వాసివి అయితే, దేవుని ఆత్మ నిన్ను 

ఆయనవైపు మళ్లించిన సంఘటనలు, దినాలు కొన్ని ఉంటాయి. అవి జ్ఞాపకం తెచ్చుకోండి. నీ 

పాపపు జీవితమును తిరుగుబాటును, మూర్ఖత్వమును ఆయన నిలదీసి అడిగిన జ్ఞాపకాలు 

ఉన్నాయా? దేవుని ఉన్నతమైన నీతి ప్రమాణాలకు నీవు ఎంతో దూరములో ఉన్నావని ఆయన 

నిన్ను ఖండించిన వాస్తవాలు మదిలో మెదులుతున్నాయా?

         

నా జీవితములో అప్పుడు, ఇప్పుడు నేనెదుర్కునే పాపములు నాకు తెలుసు. వాటి వల్ల 

శారీరక సుఖశాంతులు పోగొట్టుకున్నాను. రోగాల పాలయ్యాను. ఎంతో సంఘర్షణ తరువాత నేను 

ఘోర పాపస్వభావముతో పోరాడుతున్నానని, రక్షకుని అవసరత నాకెంతో ఉన్నదని, 

నేనొప్పుకోవడo ఎంతోకష్టమయ్యింది. ఎంతో పెనుగులాట తరువాత ఒప్పుకున్నాను. అప్పుడు నా 

గుండె బరువయ్యిందిచేతులు చెమటతో తడిచాయి. నా గుండె మితిమీరిన వేగంతో కొట్టుకుంది. 

పరిశుద్ధాతుని స్వరమునకు విధేయుడనై నేనాయనకు లోబడినతరువాత చెప్పలేనంత శాంతి, 

నెమ్మది, సుఖశాంతులు నా హృదయములో నిండాయి. ఒకవేళ మీకు కూడా నాలాంటి 

అనుభవం కలిగిందేమో! ఇదేమీ క్రొత్తకాదుకదా! ఇందుకే యోహాను 14:16లో మన ప్రభువు 

పరిశుధ్ద్ధాత్ముని విషయం ప్రస్తావిస్తూ, ఆయనను “అదరణకర్త” అని పిలిచారు.

         

అపో. పౌలు తన రెండవ కొరింథీ పత్రిక ఆరంభములో “ఆదరణ” అనే మాటను చాలా నొక్కి 

చెప్పాడు. ఏదో ఒక ఆదరణ కాదు సుమీ! ఈనాటి మన అధ్యయనo కోసం మొదటి 5 వచనాలు 

చదువుకుందాం. 

II కొరింథీ 1:3-7

         3. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తుతండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక.

            4. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో     ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మాశ్రమ అంతటిలో మమ్మును     ఆదరించుచున్నాడు.

            5. క్రీస్తుయొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో, ఆలాగే క్రీస్తుద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది.

            6. మేము శ్రమ పొందినను మీ ఆదరణకొరకును రక్షణకొరకును పొందుదుము; మేమాదరణ          పొందినను మీ ఆదరణకొరకై పొందుదుము. ఈ ఆదరణ, మేముకూడ పొందుచున్నట్టి ఆ    శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై యున్నది.

            7. మీరు శ్రమలలో ఏలాగు పాలివారైయున్నారో, ఆలాగే ఆదరణలోను పాలివారైయున్నారని      యెరుగుదుము గనుక మిమ్మునుగూర్చిన మా నిరీక్షణ స్థిరమైయున్నది.

ప్రార్థించుకుందాం, ప్రార్థన:

         ఈ 5 కొన్ని వచనాల్లో “ఆదరణ” కు సమానమైన గ్రీక్ మాటను పౌలు 10 సార్లు అపో. వాడాడు. ఈ అధ్యయనం యొక్క శీర్షిక : “మీరు ఎంతవరకు కష్టం, ఇబ్బంది సహించగలరు?” ఈ లేఖన భాగములో వేరువేరు ఆదరణ పొందే మెట్లు మనకు కనిపిస్తున్నాయి. ఇవి మన జీవితాన్ని మన సంబంధాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో నేర్చుకుందాం.

మొదటి ఆదరణ మెట్టు, ఆదరణకుండే మూలాధారం.  మనకందరికి సుఖంగా 

ఉండడం ఇష్టం. కానినిజమైన సుఖం, ఆదరణ మనకు ఎక్కడనుండి, ఏ విధంగా దొరుకుతుంది? 

ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం ఎందుకు ఇంత ప్రాముఖ్యం? ఈ ప్రశ్నకు సమాధానం 

తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యమoటే, అది తెలుసుకునేవరకు మనము అదరణ కోసం నకిలీ 

మూలాధారాలను వెతుక్కుంటూ ఉంటాం! ఆగస్టీన్ అనే గతకాలపు భక్తుడు చెప్పిన మాటలు 

గమనించాలి. ఆయనను “హిప్పోకు చెందిన ఆగస్టీన్” అని కూడా పిలుస్తూ ఉంటారు. “మా 

హృదయం నీ యందు విశ్రాంతి, ఆదరణ పొందేవరకు ఏ విధంగా కూడా దేనివల్లకూడా ఆదరణ, 

విశ్రాంతి పొందదు”,  అని ఆగస్టీన్ ఆఫ్ హిప్పో అన్నారు. విశ్రాంతి, ఆదరణ నెమ్మది లేకపోవడం 

టెన్షన్ కలిగిస్తుంది. ఆదరణ, నెమ్మదికి అది విరుధ్ధం, వ్యతిరేకo. ఆగస్టీన్ నమ్మిందేమిటంటే, 

నిజమైన ఆదరణ యేసు క్రీస్తు ద్వారా దేవునితో సంబంధం ఏర్పరచుకొన్నపుడే దొరుకుతుంది. 

ఇది ముమ్మాటికి నిజం!

         పౌలు ఈ రెండవ కొరింథీ పత్రికను తండ్రి అయిన దేవుణ్ణి, యేసు క్రీస్తు ప్రభువును స్తుతిస్తూ, 

ఆరాధిస్తూమొదలు పెట్టాడు. ఆయన తండ్రిని “కనికరము చూపు తండ్రి” అని పిలుస్తున్నాడు. 

ఆయన ఈ మాటలను యూదుల సునగోగులో చేసే ప్రార్ధనలో నుండి అరువు పుచ్చుకున్నాడు. ఆ 

ప్రార్ధనలో పాపిగా ఉన్నమనుషునిపట్ల దేవుడు దయ, ప్రేమ, మృదువైన జాలి చూపాలని 

విన్నపము ఉంటుంది. II సమూ. 24వ అధ్యాయములో దావీదు తాను ఏ శిక్షను కోరుకుంటాడో 

దేవుడు చెప్పమన్నాడు. అప్పుడు ఆయన దేవుని కరుణను ఆశ్రయించడమే ఉత్తమమని 

గ్రహించాడు. ఆయన అన్న మాటలు ఇవే: “నాకేమియు తోచకున్నది, గొప్ప చిక్కులలో 

ఉన్నాను. యోహోవా బహు వాత్సల్యత గలవాడు. గనుక మనుష్యుని చేతిలో పడకుండ యెహోవా చేతిలోనే పదుడుముగాక 

అనెను”

            

యేసు క్రీస్తును మన రక్షణ కోసం తండ్రి అప్పగించినందుచేత ఈనాడు జీవిస్తున్న మనకు, 

తండ్రి కరుణ, వాత్సల్యతలు ఏమిటో బాగా తెలుసు. తీతు పత్రిక 3:4-7 గమనించండి.

         4. మన రక్షకుడైన దేవునియొక్క దయయు, మానవులయెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు

            5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరముచొప్పుననే

పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము

            కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.

            6. మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి,

            7. నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరించెను.”

హల్లెలూయ! ఈ ఆశీర్వాదము దేవుని ద్వారా కలిగిందని పౌలు స్పష్టం చేస్తూ ఉన్నాడు. 

ఆయనే సమస్త అదరణకు మూలాధారం! కొంచెము కాదు, సమస్తమైన ఆదరణ!! క్రొత్త 

నిబధనలో  ఆదరణ అనే ఈమాట దేవునికి అన్వయించబడo ఇదే మొదటిసారి. పాత 

నిబంధనలో దేవుని ఆదరణను గూర్చిన ఎన్నో లేఖన భాగాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒకటి

యెషయ 66:13 లో ఉన్న మాటలు ఎంతో ఆదరణనిచ్చే మాటలు: “ఒకని తల్లి 

వానిని  ఆదరించునట్లు నేను మిమ్మిను అదరించెదను యెరూషలేములోనే మీరు 

ఆదరింపబడెదరు.”  ఈ భూమి మీద దొరికే అన్ని అదరణలలో తల్లిదే శ్రేష్టం. ఆ విధంగా 

చేయడానికి తల్లులకు సహాయము చేసేవాడు దేవుడే! ఏ రీతిగానైనా దేవుడు సమస్త అదరణకు 

మూలాధారమని పౌలు దేవుని స్తుతిస్తునాడు.


         మన ప్రభువు యేసు క్రీస్తు యోహాను సువార్త 14:16 లో “వేరొక అదరణకర్త” ను 

పంపిస్తానని వాగ్దానమిచ్చాడు. అక్కడ “పారక్లెటాస్” అనే గ్రీక్ మాట వాడారు. ఇక్కడ ఈ 

పత్రికలో “పారక్లేసిస్” అనే మాట అదరణకోసం వాడారు. మన అదరణకర్త పరిశుధ్ద్ధాత్ముడు.

 

తండ్రితో, యేసు క్రీస్తు ప్రభువుతో ఆయనకున్న సంబంధమునుబట్టి ఏ మానవుడు ఇవ్వలేని

 

ఆదరణను ఆయన మనకు ఇవ్వగలడు.

         ఆదరణ అనగానే మనము ఇబ్బందిలేకుండా, సుఖశాంతులు ఉంటాయనుకుంటాము.

కాని, ఈ పత్రికంతా ధ్యానించిన తరువాత నిజమైన ప్రోత్సాహం, బలం, ధైర్యం, స్ఫూర్తి,  

 

దేవుని వలన కలిగే ఆదరణ ఇస్తుందని అర్ధం  చేసుకుంటాం. కఠిన సమయాల్లో,

 

పరీక్షాకాలములలో మనకు ఈ ఆదరణ సహాయం చేస్తుందని గ్రహిస్తాము. మన 

నిరుత్సాహం, శ్రమలకంటే దేవుని ధైర్యమిచ్చే ఆదరణ అతున్నతమైనదని

 

తెలుసుకుంటాం. ప్రియ శ్రోతలూ, మీ అదరణకు దేవుడే మూలాధారమని

 

అనుభవపూర్వకంగా తెలుసుకున్నారా?  లేనట్లయితేఅలా జరిగేవరకు మీరు 

నిరాశ చెందుతారు.     

ప్రార్థన: మీ స్వంత మాటల్లో చేసుకోండి.  

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...