2 Cor-4 1:3-7 Part 2 ఆదరణలోని రెండవ మెట్టు – ఆదరణ అనే బడి

 

2 కొరింధీ - 4   1:3-7  Part 2

ఆదరణలోని రెండవ మెట్టు – ఆదరణ అనే బడి

         మీ పిల్లలను బడికి పంపించారా? కొందరు వారి మనవళ్లను బడికి పంపిస్తూ ఉండవచ్చు. బడిలో 

నేర్చుకోవడం జరుగుతుంది. ఏదో ఒకటి పదే పదే బోధించడం, ఏ రకమైన విమర్శనాత్మకమైన తలంపులు లేకుండా 

చేయడం సరైన నేర్చుకోవడం కాదు. వారికిష్టం లేకపోయినా, బలవంతగా వారిమీద రుద్దడం నేర్చుకోవడం కాదు. 

జీవితములో జరిగే సంఘటనలు, చేసే క్రియలు జీవిత పాఠాలు నేర్చుకోవడానికి ఎంతో ఉపకరిస్తాయని 

పౌలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు.

         మనతో మామూలుగా మాట్లాడే ధోరణిలో దేవుడు మనలను మన శ్రమలు, బాధలన్నిటిలో అదరిస్తాడని 

చెబుతున్నాడు. పౌలు జీవితములో ప్రతి సమయములో ఎవరో ఒకరు ఆయనను నిరుత్సాహపరిచేవారు. మరి 

కొందరు అడ్డుగా ఉండేవారు, మరొకరు ఆయన పరిచర్యకు ఆటంకాలు, హద్దులు పెట్టేవారు. మరి కొందరు ఆయన 

ప్రాణాన్ని తీయడానికి కూడా ప్రయతించేవారు. కాని, దేవుడు ఆయనను ఆదరించగల శక్తిమంతుడని, బలపరచి 

సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని, ఆయనను నిలబెట్టడానికి సమర్ధుడని పౌలు నమ్మాడు.  

         శ్రమలంటే ఒత్తిడిని పెంచి, మనలను పిండిచేసే అనుభవాలు. మన చుట్టూ ఉన్న లోకమునుండి కలిగే 

తిరగుబాటు, వ్యతిరేకత ఒక శ్రమ. సైతాను కలికిచే శ్రమలు మరి కొన్ని. ఒక నూనె గానుగలో గింజలు పోసి 

నలగగొట్టి ఏవిధంగా నూనె, లేదా రసం తీస్తారో, దానికి చెందిన మాట ఇది! ఇదే పత్రిక 4వ అధ్యాయములో ఈ 

ఉపమానమును పౌలు వాడాడు. 8వ వచనం. “ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారముకాము; 

అపాయములో ఉన్నను ఉపాయము లేనివారము కాము.”  దీనికి మూలాధారం ఏమిటి? ఇంతటి క్లిష్టపరిస్థితులలో 

ఉన్నా, ఒత్తిడి అధికమౌతున్నా, నిలదొక్కుకోవడం దేనివల్ల జరుగుతుంది? కేవల దేవుడనుగ్రహించిన కరుణ 

అదరణవల్లనే!

         ఈ అదరణను దేవుడు ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? మొట్ట మదటిగా, ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. 

మనలను తనకు అత్యంత దగ్గరగా ఉంచుకోవాలనుకుంటున్నాడు. రెండవది, మొదటి కారణమంత 

ప్రాముఖ్యమైనదే! మనము ఇతరులకు ఆదరణను పంచి ఇవ్వడం నేర్పించడానికి. ఇదే విషయం లేఖన భాగం 

చెబుతున్నది. మనము ఆదరించబడడము కేవలము మన కోసం కాదు. దేవుని ఆదరణ పొందిన మనము, ఇటు 

తిరిగి మన తోటివారిని ఆదరించడానికి దేవుడు మనలను ఆదరిస్తున్నాడు! మన జీవితములో మనమే దేవుని 

ఆదరణ రుచి చూడనపుడు మనము ఇతరులను ఏవిధంగా అదరిచగలము?

         పౌలు స్వానుభవమును ఒక్కసారి ఆలోచించండి. దమస్కుకు వెళుతున్న మార్గములో దేవుడు ఆయన 

అహంకారపు హృదయమును అణిచి, తాను యేసు క్రీస్తును హింసిస్తున్నాడని ఒప్పించాడు. దేవుడు ఆయన 

దగ్గరికి అననీయాను పంపించి ఆదరించి, బలపరచి ప్రోత్సహించాడు. అదేరీతిగా పౌలుకున్న అపోస్తలుని అధికారము 

గురించి కొరింథీ సంఘస్తులను దేవుడే ఒప్పించాడు. ఇప్పుడు దేవుడు పౌలు ద్వారా ఒక వర్తమానము వారికి 

పంపించి వారిని బలపరచి ప్రోత్సహిస్తున్నాడు.

         మనలో ప్రతి ఒక్కరము కఠినమైన పరిస్థితులను రుచిచూస్తున్నాము. క్లిష్టపరిస్థితులలో 

ఎదురీదుతున్నాము. ఒకవేళ అది కాన్సర్ లాంటి వ్యాధి కావచ్చు, ఇతరులచేత కలిగే అవమానం, నింద, హింస, 

కావచ్చు. ఆర్ధికకొరత కావచ్చు, కోర్టు కేసు కావచ్చు. కుటుంబములోని వారితో సంబంధములో విఘాతం ఏర్పడి 

ఉండవచ్చు. మరి కొందరికి, వారి సంఘాల్లో అవమానము కలిగి ఉండవచ్చు. ఈ అనుభవాలను మనము కొట్టి 

పారేయకూడదు. అవి లేవని భ్రమ పడకూడదు, భ్రమ పెట్టకూడదు. కాని వాటి ద్వారా, మంచి గుణపాఠం నేర్చుకొని, 

ఈలాటి శ్రమలవల్ల క్రుంగినవారిని మనము ఆదరించాలి. ఇది మనము చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడని 

జ్ఞాపకముంచుకోవాలి. దేవుని ఆదరణను మనము మొదట అనుభవిస్తే తప్ప దాన్ని ఇతరులకు మనము 

ఇవ్వలేము.

         ఈనాటి క్రైస్తవ సంఘాల్లో చాలామంది, యేసుక్రీస్తును వెంబడిస్తే జీవితం సుఖమయంగా హాయిగా 

ఉంటుందని అపోహపడుతున్నారు. లేఖనమంతటిలో, అనగా పరిశుద్ధ గ్రంధమంతటిలో ఈ బోధ ఎక్కడా 

కనిపించదు. అంతా మన అపోహలు, పరిశుద్ధగ్రంధాన్ని వక్రీకరించిన బోధలు! ప్రత్యేకించి, మన ప్రభువు యేసుక్రీస్తు 

మాటలలో, అపోస్తలుల బోధలో ఇది ఇక్కడ కనిపించదు. కొలస్సీ 1:24 ఒక్కసారి గమనించి చూడండి: ఇప్పుడు 

మీకొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు 

పడినపాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను.”  క్రీస్తు పడిన 

పాట్లలో కొదువైన వాటిని సంపూర్ణం చేయుచున్నాను అనడంలో అర్ధం ఏమిటి? యేసు క్రీస్తు ప్రభువు మన రక్షణ 

కోసం పడిన శ్రమలలో ఇంకా ఏదో తక్కువ ఉన్నదని ఎంతమాత్రంకాదు. ఈలాటి అర్ధం ఈ లేఖన భాగానికి సరిపడదు. పరిశుద్ధగ్రంధంలోని అనేక భాగాలు మన ప్రభువు యేసు క్రీస్తు సిలువ శ్రమలనుబట్టి ఆయన పరిపూర్ణమైన పరిహారం చేశాడని సాక్ష్యమిస్తున్నాయి. జాగ్రతగా గమనించండి, అపార్థం చేసుకోవద్దు, అపోహలు 

పెట్టుకోవద్దు. పౌలు ఇక్కడ వాడిన మాట మనప్రభువు మనలను తండ్రితో సమాధానపరచడానికి పడిన 

శ్రమలగురించి పౌలు ఎప్పుడు వాడలేదు. ఇక్కడ పౌలు వాడిన మాట యేసు క్రీస్తు ప్రభువు ఈ భూమిమీద 

జీవించిన కాలములో, ఆయన పరిచర్యలో, ఎదుర్కున్న శ్రమలు, హింసలు, నిందల విషయములో వాడిఉన్నాడు. 

ఈలాటి శ్రమలు, హింసలు, బాధలు, వేదనలు ప్రభువును నిజముగా వెంబడించే ప్రతి ఒక్కరు ఎదుర్కుంటారు. 

హెబ్రీ. 5:8 గమనించండి. “ఆయన, కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను.” 

శ్రమలు, హింసలు, నిందలు, అపనిందలు, బాధలు ఇవన్నీ ఒక బడిలాంటివి. ఇవన్నింటినీ ప్రభువు సహించి, 

భరించినందుచేత, యేసు క్రీస్తు ప్రభువు మన నమ్మకమైన ప్రధాన యాజకునిగా ఉండడానికి సిద్ధపాటు పడ్డాడు. 

         ప్రియ సోదరీ, సోదరుడా, ప్రస్తుతం నీవు అనుభవిస్తున్న శ్రమలు, హింసలు, బాధలు, ఆందోళనలు, శోధనలు 

నిన్ను క్రుంగదీస్తున్నాయా? నీవు దేవుని చేతిలోనే ఉన్నావన్న విషయమును మీకు జ్ఞాపకం చేస్తున్నాము. మీరు 

మనుషుల ఆదరణ ఆశించి నిరుత్సాహపడ్డారేమో. దేవుడు ఎన్నడూ విడువడు. ఆయన నిన్ను ఎన్నడూ 

విడువడు, ఏమాత్రం ఎడబాయడు. ఆయన వైపు మళ్లుకో. ఆయన వాక్యమే గొప్ప ఆదరణ. II కొరింథీ 4:7-11 

వరకు కంఠస్థం చేయండి. కంఠస్థం చేయడానికి మరొక శ్రేష్టమైన లేఖన భాగము కూడా ఉన్నది. 

వ్రాసుకుంటున్నారా?  మీ కోసం మళ్ళీ చెబుతున్నాను. రోమా పత్రిక 5:1-5. ఈ రెండు లేఖన భాగములు అతి 

ప్రాముఖ్యమైనవి, ఎటువంటి శ్రమలో మీరున్నా, మిమ్ములను బలపరిచే శక్తి కలిగినవి. వ్యక్తిగతంగా నేనెంతో ప్రేమించే 

లేఖన భాగములు ఇవి! జాగ్రత్తగా వ్రాసుకోండి. II కొరింథీ 4:7-11 ; రోమా పత్రిక 5:1-5.

         1 కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన    యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము
              2
మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై,      అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము.
              3
అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి
              4
శ్రమలయందును అతిశయపడు దము.
              5
ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా      దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.

II కొరింథీ 4:7-11 గమనించండి:

              7 అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదైయుండునట్లు మంటి ఘటములలో          ఈ ఐశ్వర్యము మాకు కలదు.
              8
ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములో నున్నను             కేవలము ఉపాయము లేనివారము కాము;
              9
తరుమబడు చున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము.
              10
యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసుయొక్క    మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించు కొని పోవుచున్నాము.
              11
ఏలయనగా, యేసుయొక్క జీవముకూడ మా మర్త్య శరీరమునందు ప్రత్యక్ష పరచ బడినట్లు,    సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము.

ప్రతి తీరిక సమయములో ఈ దేవుని వాక్యమును ధ్యానించండి. ఫోన్ లో పాటలు వింటే వచ్చే ప్రయోజనమేమీ 

ఉండదు. క్షణికమైన సంతోషమే. ఫీలింగ్స్ కాదు, మనసు నిబ్బరపడాలి. హృదయములో దేవుని వాక్యము నిండి 

ఉండాలి. హృదయము, మనస్సు విశ్వాసములో స్థిరపడాలి, బలపడాలి. ఇది జరిగేది కేవలం దేవుని శక్తివంతమైన 

వాక్యము వల్లనే! ప్రార్ధించుకుందాం. ప్రార్థన: మీ స్వంత మాటల్లో ప్రార్ధన చేసుకొండి. 

 

 

 

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...