2 కొరింధీ-7 1~8-14 - రెండవ భాగము - మరణము నుండి విడుదల – రెండవ భాగము

 

2 కొరింధీ-7  1~3-7 - II

మరణము నుండి విడుదల – రెండవ భాగము

         శ్రోతలందరికి ప్రభువు నామములో శుభములు! రండి రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి. 

మీ ఇంట్లో పరిశుద్ధ గ్రంధం బైబిల్ ఉన్నట్లయితే తెరిచి ఉంచండి. క్రొత్త నిబంధనలోని 8వ 

పుస్తకంII కొరింథీ పత్రిక మొదటి అధ్యాయములోని కొన్ని వచనాలు ఈ సమయములో 

అధ్యయనం చేద్దాం. పౌలును మరణము నుండి విడుదల చేయడానికి దేవుడు జోక్యం చేసుకొని 

కాపాడిన విషయమును మునుపటి అధ్యయనంలో క్షుణ్ణంగా తెలుసుకున్నాము. అది మొదటి 

ఆధారము. ఇప్పుడు రెండవ ఆధారము  తెలుసుకుందాం. 

         మరణము నుండి విడుదల పొందడానికి రెండవ ఆధారం మానవుని విజ్ఞాపన. 

లేఖనభాగములో అనగా II కొరింథీ 1:10లో “మాకొరకు ప్రార్థన చేయుటవలన మీరుకూడా 

సహాయము చేయుచుండగా...” అని వ్రాయబడింది. పౌలు తన దేవునిమీద సంపూర్ణంగా 

ఆధారపడినప్పటికి, దేవుని ప్రజలు ఆయనకోసం చేసిన ప్రార్ధనలను గుర్తించి సంతోషిస్తున్నాడు. 

దేవుని శక్తిని బహిర్గతం  చేయడములో, ఆయన సర్వాధికారపు ఉద్దేశ్యపు నెరవేర్పులో 

ఇతరులకోసం ప్రార్థన చేయడం ప్రాముఖ్యమైనది. మీరు నేను ఇతరులకోసం ప్రార్ధించినపుడు 

వాటి వల్ల ఏమి ఫలితాలు కలిగాయో మనకు తెలియదు. కాబట్టి ఆలాటి ప్రార్ధనలద్వారా కలిగే 

అనుభవమునుబట్టి, దేవుడు మౌనంగా ఉన్నాడే మో  అని ప్రార్ధించిన మనకు  అనిపించినా, 

మనము ప్రార్థన చేయడం ఆపకూడదు. పౌలు మరణాపాయపు పరిస్థితుల్లో ఉన్నపుడు కొరింథీ 

సంఘపువారికి దానిగురించి ఏమి తెలిసిఉండకపోవచ్చు. అయినా, ఆయన వారి 

హృదయాల్లో ఉన్నందుచేత ఆయనకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వారు అపో. పౌలును 

ప్రేమించినందుచేత ఆయన కోసం విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు. ఆయనకోసం దేవుని కృపాసనం 

దగ్గర మొర్ర పెడుతూనే ఉన్నారు. 


         దాని ఫలితమేమిటి? 11వ వచనం. “ మాకు కలిగిన కృపావరముకొరకు అనేకులచేత 

మావిషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.” ఇక్కడ అపో. పౌలు కళ్ళముందు 

జరుగుతున్నట్టు మాట్లాడుతున్నాడు. అనేకులు వారి ముఖాలు, కన్నులు పైకెత్తి, దేవునివైపు 

చూస్తూ ప్రార్థించినందు చేత మా పక్షంగా దేవునికి కృతజ్ఞత వందనాలు చేరాయి, అని 

సంతోషిస్తున్నాడు. ఇక్కడ “కృపావరము” అంటే అంత భయంకరమైన మరణాపాయమునుండి 

దేవుడు ఆయనను తప్పించడం. పౌలు ఎదుర్కున్న మరణాపాయము నుండి ఆయనను 

తప్పించమని కొరింథీ సంఘస్తులు విజ్ఞాపన చేసినందు చేత ఆయన పొందిన విడుదల విషయం 

ఆయనతో బాటు వారు సంతోషిస్తున్నారు. ఎవరి కోసమైన నీవు ప్రార్థన చేసి వారికి కలిగిన 

జవాబును బట్టి నీవు సంతోషించకపోతే చాలా పోగొట్టుకుంటున్నావు.

         గమనించండి శ్రోతలూ, దేవుని ప్రణాళికను మార్చమని అడగడం ప్రార్థన ఉద్దేశ్యం 

కాదు. కానిఆ ప్రణాళికలలో దేవునికి మహిమ కలగాలని, దాన్నిబట్టి దేవునికి కృతజ్ఞత 

చెల్లించడం మంచిది. మానవులమైన మనము ఇతరులకోసం చేసే ప్రార్ధనలు ఒకవైపు ఉంటే, 

వాటిలో ఏవి దేవుని సార్వభౌమపు ప్రణాళిక ప్రకారం ఆయన నెరవేరుస్తాడో వాటిని బట్టి మనము 

సంతోషించాలి. కొరింథీ సంఘస్తుల్లాగా మనకుకూడా ఇతరులు ఎదుర్కుంటున్న వేదనలు, 

బాధలు, శ్రమలు తెలియకపోయినా  కాని, వారి కోసం మనము చేసే విజ్ఞాపన ప్రార్ధనలు ప్రభువు 

విని సమాధానమిస్తాడనే ధైర్యముతో మనము ప్రార్థించాలి. మరణాపాయము లాంటి క్లిష్ట పరిస్థితి 

అయినా, అది శారీరిక మరణమైనా, ఆత్మీయమైన మరణమైనా, మన విజ్ఞాపనలను బట్టి 

సర్వశక్తిగల దేవుడు, మన ప్రభువు విడుదల చేస్తాడని మనము ధైర్యంగా ఉండవచ్చు.

         ఇక మరణము నుండి విడుదల కోసం మూడవ ఆధారం, ధైర్యవంతమైన పరిభాష ప్రకటన    

          ఇదేంటి అని అనుకుంటున్నారేమో! 12వ వచనము చివరి భాగము గమనించండి. “మా 

మనస్సాక్షి సాక్షమిచ్చుటయే” అ. కా. 24:16 “నేనునూ దేవుని యెడలను మనుష్యుల యెడలను  

నా  మనస్సాక్షి నిర్దోషమైనదిగా  నుండునట్లు ఎల్లప్పుడు అభ్యాసము చేసుకొనుచున్నాను.”  పౌలు 

వ్యక్తిగత సాక్షమిది. మనస్సాక్షి నిర్దోషంగా ఏవిధంగా ఉంచుకోవాలో పౌలు నేర్చుకున్నాడు. II 

కొరింథీ 1:12వ వచనము “మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానముననుసరింపక, 

దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి 

లోకములో నడుచుకొంటిమనియు, విశేషముగా మీ యెడల నడుచుకొంటిమనియు, మా 

మనస్సాక్షి  సాక్షమిచ్చుటయే.” దేని విషయములోనైనా మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తుందా? 

నన్ను అనేక విషయాలలో గద్దిస్తుంది, తప్పు, పాపము ఎత్తి చూపిస్తుంది. అది ఇతరులకు 

తెలియదు. ఎవరి మనస్సాక్షిని పరిశుద్ధాత్ముడు వెలిగిస్తాడో వారిని ఆయన గద్దించి, సరిచేసి, 

బుద్ధిచెప్పి, దేవుని కృపవలన దేవుని సత్య మార్గములో నడిపిస్తాడు. కాని ఆయన చెప్పే 

మాటలను విని దీనమనసుతో ఒప్పుకొని సరిచేసుకునే మనసు మనకుండాలి. అది 

లేకపోతే, ఆయన చెప్పడు, బోధించడు. అంతే కాదు. పదే, పదే, పదే, ఎన్ని సార్లు ఆయన నీతో 

మాట్లాడినా నిర్లక్ష్యము చేసి పెడచెవిని బెట్టి, తప్పించుకొని తిరుగుతుంటే, ఇక ఆయన స్వరము 

నీకు వినబడదు. ఒక సంఘములో పాస్టర్ వాక్యపరిచర్య చేస్తూ, “ఎన్ని సార్లు గద్దించినను 

లోబడనివాడు మరి తిరుగు లేకుండా హటాత్తుగా నాశనమగును.” అనే లేఖన భాగమును 

చెబుతుండగా అతని మనస్సాక్షిని పరిశుధ్ద్ధాత్ముడు గృచ్చి ఒప్పించాడు. 

ఆనాటినుండి అతడు మద్యపానమును మానివేశాడు. 

ప్రియ సోదరుడా, సోదరీ, నీ పాపమేమిటో నీకు మాత్రమే తెలుసు. భార్య పాపము భర్తకు 

తెలియదు, భర్త పాపము భార్యకు తెలియదు. వారిద్దరివి వారి పిల్లలకు తెలియదు. 

కాని సమస్తమెరిగిన పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమారులతో సరిసమానమైన ఆత్మదేవుడు 

సమస్తము నెరిగిన వాడు. ఆయన పాపమును ఒప్పిస్తాడని యోహాను 16:8వ వచనములో ఈ 

విషయం స్పష్టగా మన ప్రభువు బోధిస్తున్నాడు. 

ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు 

లోకమును ఒప్పుకొనజేయును.”  

ఆయన ఒప్పించినపుడు ఒప్పుకున్నవారు నిజమైన దేవుని పిల్లలు. యేసు క్రీస్తు 

ప్రభువు వారికోసం తన రక్తం చిందించి పాపములన్నింటికి ప్రాయశ్చిత్తం చేసి తన ప్రాణముతో 

పరిహారము చెల్లించాడు. సమస్తమైన పాపములన్నింటి కోసం, దోషములన్నింటి కోసం ఒక్కటే 

సారి ఈ విమోచన ప్రక్రియ చేశాడు. పరిశుద్ధాత్ముడు ఒప్పించిన ప్రతి పాపమును ఒప్పుకొని, శుద్ధి 

చేసుకొని విడిచిపెట్టి ఆయన శక్తితో విజయము పొందేవారు దేవుని పిల్లలు. మనస్సాక్షిని శుద్ధి 

చేసుకుందాం. దేవుని యెదుట, మనుష్యుల యెదుట మన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలని 

దేవుని చిత్తము. ప్రతి ఒక్కరి మనస్సాక్షి! 

    ఒకవేళ నీ జీవితములో నీవెల్లప్పుడు నీ మనస్సాక్షిని చంపుకున్న వ్యక్తి వైతే, ప్రియ 

స్నేహితుడా, యేసు క్రీస్తు ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన తన నిత్యమైన నిస్వార్ధమైన 

ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్న రక్షకుడు, దేవుడు. మనస్సాక్షిని చంపుకొనే వారు పాపములోనే 

జీవిస్తూ ఉంటారు. వారికి మొదట కావలసింది దేవునితో యేసు క్రీస్తు రక్తము ద్వారా సంబంధం. 

ప్రభువు నీతో మాటలాడుతున్నాడు. ఆయన నీ పాపమును ఒప్పిస్తున్నాడు. మనసారా, 

హృ దయపూర్వకంగా ఒప్పుకొంటే, వెంటనే, క్షణం ఆలస్యం లేకుండా నీ పాపములు 

తుడిచి వేస్తాడు. నిన్ను శుద్ధి చేస్తాడు. నిన్ను దేవుని కుమారునిగా/కుమార్తెగా చేస్తాడు. నీలో 

పరిశుద్ధాత్ముడు జీవిస్తాడు. నీ మనస్సాక్షిని వెలిగించి నిన్ను పరిశుద్ధ జీవితములోనికి నడిపిస్తాడు. 

హల్లెలూయ!        

ప్రభువు నీ మనస్సాక్షిని నిర్దోషంగా చేయగల పరిశుద్ధుడు ఆయన. నీ ప్రతి పాపమును, 

దోషమునుఅపరాధమును క్రీస్తు రక్షకుని యెదుట ఒప్పుకో, క్షమాపణ కోరుకో.  నీ పాపము, 

దోషముఅపరాధము, తిరుగుబాటు, సమస్తమును యేసు క్రీస్తు ప్రభువు క్షమించి, సమస్తమును 

కడిగి శుద్ధి చేసి నీకు నిర్దోషమైన మనస్సాక్షిని, క్రొత్త హృదయమును ఇస్తాడు. నీవు దేవుని 

కుమారుడవు అవుతావు. ఇది ఆయన వాగ్దానము. “తన్ను ఎందరంగీకరించిరో 

వారికందరరికి  తన పిల్లలగుటకు అధికారమిచ్చాడు.”  దేవునితో నీ సంబంధమును మొదట 

సరిచేసుకుంటే అన్ని విషయాల్లో యేసు క్రీస్తు ప్రభువుతో నీ హృదయం ఐక్యపరచబుడుతుంది. 

ప్రభువు అన్ని పరిస్థితుల్లో నీకు నాయకుడుగా, రక్షకుడుగా, ప్రభువుగా, విమోచకుడుగా నిత్యము 

నిలిచిఉంటాడు. తన ఆత్మతో నిన్ను ముద్రించి తన శక్తితో నడిపిస్తాడు. మారు మనస్సు, రక్షణ 

అనేది దేవునితో సంబంధం. అడుగు, అడుగు వేస్తూ, విశ్వాసముతో దేవుని వాక్యపు వెలుగులో 

నడవాలి. పరిశుధ్ద్ధాత్ముడు నిన్ను ఆదరించి, కష్టాల్లో ఓదార్చి, సేద దీర్చి నీకు కాపరిగా ఉంటాడు. 


ప్రార్థన:  మీ స్వంత మాటల్లో మీరు ప్రార్ధన చేసుకోండి. వచ్చి రాని ప్రార్ధన అయినా పరవాలేదు. 

యాధార్ధమైనవైతే మీ మాటలు దేవునికిష్టమైన మాటలు. 


 

 

 

 

2 కొరింధీ-6 1~8-14 - మరణము నుండి విడుదల మొదటి భాగము

 

2 కొరింధీ-6    1~8-14 మొదటి భాగము 

మరణము నుండి విడుదల మొదటి భాగము

శ్రోతలందరికి, ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికీ మన ప్రభువు యేసు క్రీస్తు నామమున శుభములు! 

సర్వాధికారి అయిన దేవుని కృప సమాధానములు మనకందరికి విస్తరించునుగాక! అమెన్!!

మీరెప్పుడైనా మరణాపాయమునుండి తప్పించుకున్నారా? ఆలాంటి పరిస్థితులు మన 

మెన్నడు మరచిపోలేము కదూ! మీలో చాలా మందికి అలాంటి అనుభవాలు ఉండి ఉంటాయి. 

అపో. పౌలు జీవితము మీద ఆశను పోగొట్టే ఎన్నో సంఘటనలు సందర్భాలు ఎదుర్కున్నాడు. 

ఆలాటి వాటిలో ఒక సందర్భమును రెండవ కొరింథీ బైబిల్ అధ్యయనాల్లో భాగంగా మనము 

తెలుసుకుందాము. 

ఈనాటి అధ్యయనము శీర్షిక “మరణము నుండి విడుదల” లేఖన భాగము 2 కొరింథీ 1:8-14.

            8. సహోదరులారా, ఆసియ లో మాకు తటస్థించిన శ్రమనుగూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు; అదేదనగా మేము బ్రదుకుదుమను నమ్మకములేక యుండునట్లుగా, మా శక్తికి మించిన అత్యధిక భారమువలన క్రుంగిపోతివిు.

            9. మరియు మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మిక యుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను.

            10. ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును     తప్పించును. ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ       గలవారమై యున్నాము. ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము. మరియు మాకొరకు ప్రార్థనచేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము.

            11. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా, మాకు కలిగిన కృపావరముకొరకు అనేకులచేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. 

            12. మా అతిశయమేదనగా, లౌకిక జ్ఞానము ననుసరింపక, దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటి మనియు, విశేషముగా మీయెడలను నడుచుకొంటిమనియు, మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే

         13. మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప, మరేవియు మీకు వ్రాయుట లేదు;     కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము.

            14. మరియు మన ప్రభువైన యేసు యొక్క దినమందు మీరు మాకేలాగో, ఆలాగే మేము మీకును అతిశయకారణమై యుందుమని, మీరు కొంత మట్టుకు మమ్మును ఒప్పుకొనియున్నారు.

ఈ లేఖన భాగములో మరణము నుండి మనము విడుదల ధైర్యంగా పొందడానికి గల ఆధారాలు స్పష్టమవుతున్నాయి.

            మొదటి ఆధారం, దేవుడు కలుగచేసుకోని జోక్యం చేసుకోవడం  గతించిన 

3,4 అధ్యయనాల్లో మనమెదుర్కొనే అన్ని శ్రమలకు బాధ వేదనలకు సరిపడా ఆదరణను దేవుడు 

అనుగ్రహిస్తాడని బోధించాడు. ఈ సత్యమును ఇంకా హృదయపు లోతుల్లో స్థిరపరచడానికి పౌలు 

తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటున్నాడు. ఆసియాలో తనకు సభవించిన దాన్ని 

ప్రస్తావిస్తున్నాడు. దాని వివరాలు మనతో చెప్పడం లేదు, కాని కొరింథీయులకు అది 

తెలిసిఉండవచ్చు. ఎఫెసిలో జరిగిన అల్లరిమూక దాడి కావచ్చు. లేదా ఆకుల ప్రిస్కిల్ల ఆయన 

ప్రాణానికి తన ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నది కావచ్చు. లేదా ఆయనకు కలిగిన మరణపు 

బెదిరింపులు కావచ్చు. ఇవి ఏవో చిన్న చిన్న బెదిరింపులు కావుగదా!

         ఈ మాటల ద్వారా మించిన హింసకాండ జరిగించడానికి పన్నాగం చేయడం 

జరిగినట్టుగా భావించవచ్చు. నలుగగొట్టాలని చేసిన ప్రయత్నాలు, సాధారణ పరిస్థితులకు 

మించిన పరిస్థితులు అక్కడ ఉన్నట్టు తెలుస్తున్నది. ఇవి ఎంత ఘోరమైన పరిస్థితులంటే, పౌలు 

తన ప్రాణం తనకు దక్కుతుందనే ఆశను పోగొట్టుకున్నాడు. వాడబడిన గ్రీక్ మాటకు అర్ధం 

డెడెండ్. లేదా దారిలేదు, మార్గములేదు, ఇరుక్కుపోయిన పరిస్థితి. ఈ పరిస్థితి ఇంతకుముందు 

పౌలు ఎదుర్కొన్నప్పటికి, ఇప్పటి పరిస్థితి ఇంకా క్లిష్టపరిస్థ్థితి. నాకు మీకు ఈలాటి పరిస్థ్థితి 

కలిగిఉండవచ్చు.

         కాని, అక్కడ ఏమి జరుగుతున్నదో గమనించండి. మునుపటి వచనాల్లో పౌలు వ్రాసినట్టుగా 

దేవుడు తన క్రియతో కలుగజేసుకున్నాడు, జోక్యం చేసుకున్నాడు. పౌలు ఉన్నది 

మరణాపాయమైనప్పటికి, దేవుడు కలుగజేసుకున్నాడు. ఇది పౌలు ప్రాణము కాపాడింది. 

ఆయనకు ఒక గొప్ప పాఠము నేర్పించింది. ఈ పాఠము మీరు, నేను కూడా నేర్చుకోవాలి. 

అదేమిటిపైపైకి అసాధ్యంగా కనిపించే పరిస్థితులను దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తాడు. 

ఎందుకంటే, మన మేధస్సు, శక్తియుక్తులు, గొప్పవారితో మన సంబంధాలు, పలుకుబడి, మన 

ఆస్తి, అంతస్థు, ఏమీ చేయలేవని మనము నేర్చుకోవాలి. పౌలు లాగా దేవుణ్ణి సంపూర్ణంగా 

నమ్మడం మనము నేర్చుకోవాలి. యేసు క్రీస్తు ప్రభువును మరణపు కోరలలోనుండి బ్రతికించిన శక్తి 

మన క్లిష్టపరిస్థితులలో మనకు అందుబాటులో ఉంది. హల్లెలూయ!

         వేధించే పరిస్థితులలో పౌలు జీవితములో దేవుడు కలుగజేసుకున్నాడు. కాని, ఇంతకంటే 

గొప్ప విషయం జరిగింది. 10వ వచనం గమనించండి. “ఆయన అట్టి గొప్ప మరణమునుండి 

మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును...... ఆయన ఇక  ముందుకును 

మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము.” 

 జాగ్రతగా వింటున్నారా? పౌలు అంటున్నాడు, దేవుడు మమ్ములను  గతములో తప్పించాడు, 

ఇప్పుడు తప్పిస్తున్నాడు, ఇక ముందుకు కూడా తప్పిస్తాడు.  ఎంత ధైర్యం, స్ఫూర్తి, చొరవ 

కలిగించే మాటలు కదూ! ప్రియ శ్రోతలారా, మీరు కూడా ఇటువంటి, ధైర్యముతో, నిరీక్షణతో 

జీవితాన్ని ఎదుర్కోవచ్చు! మందులమీద, మనుషుల మాటల మీద, ఇతరులు మీకు చెప్పే నీతి 

బోధలమీద, ఆధారపడకండి!

         ఈలాటి పరిస్థితులు ఎదురైనపుడు ఏ విధంగా స్పందిస్తున్నామో అది ప్రాముఖ్యం. 

కోపావేశాలతో నశించిపోవచ్చు. నిరాశకు బానిస కావచ్చు. ద్వేషం అసూయఅనే చేదుతో  

మనసును నింపుకోవచ్చు. కాని పౌలు మాత్రం ఆలాచేయలేదు. కొందరు వారి హృదయ వేదన, 

అపాయము, శ్రమలు అనుభవిస్తున్న సమయమంతా ప్రభువును హత్తుకొని, శ్రమల కొలిమిలో 

కూడా యేసయ్యకు బలమైన సాక్షిగా నిలువబడ్డారు. పౌలు లాగా దేవుడు వారి పరిస్థితుల్లో జోక్యం 

చేసుకొని వారి కొలిమి  అనుభవాలను బట్టి దేవుని మహిమ కలుగుతుందని ఆనందించారు.

         ప్రియ శ్రోతలూ, మీరు కూడా తీవ్రమైన భయపెట్టే శోధనలో, వేదనలో ఉన్నారా? ఇక ఈ 

పరిస్థితి మారదు అని అనుకుంటున్నారా? వాటిలో దేవుడు జోక్యం చేసుకొని కలుగజేసుకుంటాడని 

ఎదురు చూస్తున్నారా? లేదా మీ స్వంత ప్రయత్నాలు చేస్తూ వాటి మైకములో ఉన్నారా? ప్రభువు 

ఇంకా ఎందుకు చేయడం లేదు అనుకుంటున్నారేమో! మీరు, నేను పరిపూర్ణంగా ఆయనమీద 

ఆధారపడాలని ప్రభువు ఎదురుచూస్తున్నాడు. నీ సహాయం, ప్రమేయం ఏమి లేకుండా దేవుని శక్తి 

మాత్రమే చాలని నీవు, నేను తెలుసుకోవాలని మనము గ్రహించాలని ఆయన ఉద్దేశ్యం. ప్రియ 

సోదరీ, సోదరులారా, ఆయన శక్తి, జ్ఞానము, అధికారము, బలము అపరిమితమైనది. నీవు, నేను 

పరిపూర్ణంగా ఆయనమీద ఆధారపడేవరకు ఆయన ఎదురుచూస్తున్నాడు. ముగింపులో 

మరోమాట! శోధన, పరీక్షలోనుండి మీరు నేను బయటికి రాకపోవచ్చు కూడా! ఆపో. పౌలుకు అదే 

జరిగిందికదా. ఆయన చివరికి తన ప్రాణము సువార్త కోసం హతసాక్షిగా ఇచ్చివేసిన విషయం 

మనకు తెలుసు.  అందులోకూడా ఆయన దేవుని పూర్తిగా  నమ్మాడు. మరణమునకు 

అప్పగించినా, మరణమునుండి విడిపించినా, ఏదైనా సరే, ఆయన మార్గములో నడవడానికి మీరు, 

నేను సిధ్ధమా? 

ప్రార్థన: మీ స్వంత మాటల్లో అవి, ఏ ఏవైనా ఫరవాలేదు, మీ మనస్ఫూర్తిగా దేవునితో మాట్లాడండి. ప్రార్ధనలో మీ హృదయములో ఉన్నదున్నట్టుగా దేవునికి మీ మనసు తెలియచేయండి. దేవుడు తప్పక మీ మనవి అలకిస్తాడు, కాని, మొట్ట మొదటిగా పరిశుద్ధుడైన దేవునితో నీవు సమాధానపడాలి. 'నేనెందుకు సమాధానపడాలి?'  అనుకుంటున్నారేమో! నా ప్రియమైన స్నేహితుడా, నీవు, నేను దేవునికి శత్రువులము. నేను దేవునితో యేసు క్రీస్తు ప్రభువు రక్తమును బట్టి నా పాపమును శుద్ధి చేసుకొని సమాధాన పడ్డాను. నీవు కూడా సమాధాన పడితే నీ ప్రార్ధన కూడా వింటాడు. 'నన్ను క్షమించు, ప్రభువా, నేను పాపిని,' అని నీవు నీ పాపమును ఒప్పుకుంటే, దేవునితో ఇప్పుడే సమాధానపడవచ్చు. 

              

 

 

2 కొరింధీ-5 1:3-7 - మూడవ భాగము దేవుని ఆదరణ యొక్క పరిమితి, హద్దు, పరిధి

 కొరింధీ-5   1:3-7 - మూడవ భాగము 

దేవుని ఆదరణ యొక్క పరిమితి, హద్దు, పరిధి

          వచ్చేశారా? చాలా సంతోషం! నెమ్మదిగా, ప్రశాంతంగా దైవసన్నిధిలో రేడియోకు దగ్గరగా 

వచ్చి కూర్చోండి. దేవుడు అనుగ్రహించే అదరణ విషయం అధ్యయనం చేస్తున్నాము. మనము 

ఎంతవరకు కష్ట నష్టాలు, వేదన బాధలు సహించగలమో తెలుసుకోవాలని ప్రభువు మనలను 

పరీక్షిస్తూ ఉంటాడు. శ్రమలు లేని క్రైస్తవ జీవితం ఉండదు. ఎవరైనా, శ్రమలు లేకుండా క్రైస్తవ 

విశ్వాసo ఉంటుందని ఊహించు కుంటున్నా, అపోహ పడుతున్నా, చివరికి అది అసత్యం, 

అబధ్ధం, అపోహ అని తెలుసుకుంటారు. అది తెలుసుకునేవరకు ఎన్ని బహుమానాలు 

పోగొట్టుకుంటామో కాస్త ఆలోచించండి. శ్రమలు అనుభవిస్తున్న సహోదరీ, సహోదరుడా, 

ధైర్యంగా ఉండు! విశ్వాసమును గట్టిగా పట్టుకో! దేవుని వాక్యం శ్రమలు తప్పని సరిగా 

అనుభవిస్తామని స్పష్టంగా సెలవిస్తున్నది. కాని ఒక్క మాట! ప్రభువు నిన్ను విడువడు! నిన్ను 

తప్పనిసరిగా ఆదుకుంటాడు. అదరిస్తాడు. నిన్ను లపరుస్తాడు. అంతేకాదునీవు సహించగలిగిన 

దానికంటే ఎక్కువ శ్రమలు నీకు ఇవ్వడు. నీకు కొన్ని బాధ, వేదనలు, 

కష్ట నష్టాలు ఇస్తున్నాడంటేనేఅవి అనుభవించడానికి కావలసిన శక్తి, బలము, విశ్వాసము నీకు 

ఇస్తాడని అర్ధం. కాబట్టిశ్రమలు ఎంతవరకు సహించగలవో పరీక్షించుకొని వాటికి సిధ్ధంగా 

ఉండడం నిజమైన క్రైస్తవ విశ్వాసి లక్షణం.

         

మనము అధ్యయనం చేసిన రెండవ అంశము దేవుని అదరణకు మూలాధారం ఏమిటి? 

దేవుడు తప్ప ఏ మూలాధారం లేదు. ఆయన నమ్మకమైనవాడు. నమ్మదగినవాడు, మాట 

తప్పనివాడు. కరుణ, వాత్సల్యములలో పరిపూర్ణుడు. కొరత, తక్కువ లేని వాడు. ప్రభువు నిన్ను, 

నన్ను నిత్య నరకం, నిత్య నాశనం నుండి రక్షించింది తన అత్యంత కరుణను బట్టి మాత్రమే! ఇక 

ఏ కారణము లేదు. తీతు పత్రికలోని 3వ అధ్యాయము 5వ వచనములో తన కనికరము 

చొప్పుననే”  అని స్పష్టంగా బోధించాడు. ప్రభువే స్వయంగా అదరిస్తాడు, అక్కున 

చేర్చుకుంటాడు, తల్లి ఆదరించిన విధంగా ప్రభువు అదరిస్తాడు. గమనించండి శ్రోతలూ, 

పరిశుద్ధాత్మను మనకనుగ్రహించాడు. ఇది వినగానేక్రిందపడిపోవడం, చప్పట్ట్లు కొడుతూ 

ఊగిపోవడం, ఇలాంటివి కాదని దయచేసి గమనించండి. 

పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ. ఆయన మొదట కలిగించేది పరిశుద్ధత. పరిశుద్ధ పరచబడేది 

శ్రమలు, బాధలు, నిందలు, కష్టాలునష్టాలలోనే! రోమా పత్రిక 5:1-5 కంఠస్థం చేశారా? శ్రమలు 

మన విశ్వాసమును ధృడపరచి, స్థిరపరచి విశ్వాసములో నిలబెడతాయి. అందుకే పౌలు తన 

శ్రమలలో ఆనందిస్తున్నానని కొలస్సీ 1:24లో సాక్షమిచ్చాడు. మనకు శ్రేష్టమైన మాదిరి మన 

ప్రభువే! హెబ్రీ పత్రిక 5: 8లో “ఆయన కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన 

విధేయత నేర్చుకొనెను అని పరిశుద్ధ గ్రంధం స్పష్టంగా బోధిస్తున్నది.  దేవునికే శ్రమలు 

విధేయత నేర్పించినపుడు, ఇక మనమెంత నేర్చుకోవాలో ఒక్కసారి ఆలోచించండి!

ఇక ఈ పూట అధ్యయనం చేసే అంశం, మూడవ భాగము : దేవుని ఆదరణ 

యొక్క పరిమితి, హద్దు, లేదా పరిధి. 

II కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం గమనించండి: మేము 

శ్రమ పొందినను మీ ఆదరణకొరకును రక్షణకొరకును పొందుదుము; మేమాదరణ 

పొందినను మీ ఆదరణకొరకై 

పొందుదుము. ఈ ఆదరణ, మేముకూడ పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో 

సహించుటకు కార్యసాధకమై 

యున్నది. 


అపో. పౌలు ద్వారా ప్రభువు బోధిస్తున్నదేమిటి? దేవుడు అనుగ్రహించే ఆదరణ కేవలo 

ఈభూమి మీద జీవించే జీవితానికి మాత్రమే పరిమితం కాదు. ఇది మనకెలా తెలుసు? లేఖన 

భాగములోని “రక్షణ” అనే మాటకు అర్ధం మొదట తెలుసుకోవాలి. ఈ సందర్భములో “రక్షణ” అనే మాటకు 

ఈ జీవితము దాటినతరువాత ఉండే నిత్యత్వములో కూడా ఈ అదరణయొక్క ఫలితం ఉంటుంది. ప్రియ 

సోదరుడా, సోదరీ, దుఃఖముతో బాధతో నిండిన మనసుతో ఉన్నారా? మన దేవునికి మన పట్ల ఎంత 

ఉన్నతమైన ఉద్దేశము ఉన్నదో గమనించండి. ప్రస్తుతం మీరు, నేను అనుభవిస్తున్న శ్రమలను ఏ 

దృక్పథముతో చూడాలి? కేవలము ఈ జీవితములో, ఈ క్షణికమైన జీవితములో ఇన్ని శ్రమలా? 

అనుకుంటున్నారా? అసలు ఎందుకు ఈ శ్రమలు అనుభవించాలి? మనము చేరవలసిన గమ్యస్థానము 

చేరకుండా ఈ శ్రమలు మనలను దారి మళ్లిస్తున్నాయి అని కొందరు అనుకోవచ్చు. మరి కొందరు ఈ 

శ్రమలవల్ల ఏమి జరుగుతుంది? వీటికేమైనా ఉద్దేశముందా?’ అని అనుకోవచ్చు. రోమా. 8:28లో ప్రభువు 

వాగ్దానం చేసినట్టు, దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి

మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.  

         తాను అనుభవిస్తున్న శ్రమలు కొరింథీ సంఘపువారి అదరణకు ఒక మార్గమని ఆపో. పౌలు వారికి 

బోధిస్తున్నాడు. అంతేకాదు, వారి రక్షణను బలపరుస్తాయని అర్ధం. ఇక్కడ రక్షణ అంటే కేవలం పాప క్షమాపణ 

మాత్రమే కాదు, పునరుత్ధానo తరువాత మనము ప్రభువును ముఖాముఖి కలుసుకునే సమయం వచ్చేవరకు, 

అంతమట్టుకు మనము పరిశుద్ధపరచబడే ప్రక్రియలో మన శ్రమలకు గొప్ప పాత్ర ఉన్నది.


కాబట్టి మన ధ్యాస, దృష్టి దేనిమీద ఉండాలి? శ్రమలమీద కాదు, ఆదరణ మీద కూడా కాదు. మరి దేనిమీద 

ఉండాలి? మీరు నేను అనుభవిస్తున్న ప్రతి శ్రమ, అనుభవము మనలను ఆత్మీయ జీవితములో పరిపూర్ణ

తలోనికి నడిపించి “పైనున్నవాటిని వెదకడానికి” ఉన్నతమైన గురి చేరడానికి మనలను సిద్ధపరు

స్తున్నాయని దృష్టించాలి. అంతేకాదు, మనము అనుభవిస్తున్న శ్రమల కారణంగా తోటి సహోదరులు వారి 

విశ్వాసములో బలపడుతున్నారని సంతోషించాలి. మన రక్షణ వారి రక్షణ స్థిరపడుతున్నదని  

సంతోషించాలి. అపో. పౌలు రోమా. 8:17లో యేసుప్రభువుతో మనము శ్రమ పడితేనే, ఆయన మహిమలో 

మనకు భాగముంటుందని స్పష్టం చేశారు. “క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల

క్రీస్తుతోడి వారసులము.”  అపో. పేతురు ఇదే బోధ చేయడం లేఖనాల్లో కనిపిస్తున్నది. క్రీస్తు మహిమ 

బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతో షించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై `యున్నంతగా సంతోషించుడి.1 పేతురు 4:13 శ్రమలు అనుభవించడం మనకెంత సంతోషంగా ఉండాలంటే, 

ప్రభువుతో పాటు శ్రమపడుతున్నట్టు భావించుకోవాలి. ఎంత శ్రమపడితే అంత మహిమ కలుగుతుంది అని భావము. ఈ సత్యమును సరిగ్గా అర్ధం చేసుకుంటున్నారా? లేఖనములు బోధిస్తున్న సత్యమును ఎంతో 

మంది తప్పుడు బోధకులు, పేరు ప్రఖ్యాతులకోసం, మీ కానుకలకోసం సత్యమును ఎంత వక్రీకరిస్తున్నారో 

గమనిస్తున్నారా?

         ఇక ఈ వాక్యభాగములోని చివరి మాటల్లో అపో. పౌలు కొరింథీ సంఘపువారి విషయం  తన నిరీక్షణ స్థిరంగా 

ఉన్నట్టు సాక్ష్యమిస్తున్నాడు. 7వ వచనము చివరి భాగము గమనించండి. మిమ్మునుగూర్చిన మా నిరీక్షణ 

స్థిరమైయున్నది.”  మరో మాటలో చెప్పాలంటే ఫీలింగ్స్ మీద ఆధారపడనని అర్ధం. వారు శ్రమలను ధైర్యంగా

బలముతో దేవుని అదరణతో ఎదుర్కుంటే,పైనున్న వాటిని వెదుకుతూ” ఉంటే, వారి జీవితాలు మన 

జీవితాలు సార్ధకమవుతాయి. పరిశుద్ధతలో అభివృద్ధి చెంది ఫలమిస్తాము. ఈలాటి అనుభవాలు కలిగినవారు 

చాలామంది ఉన్నారు. వారు ఇతరులకు ఆశీర్వాదంగా ఉన్నారు. మీరు కూడా ఆశీర్వాదంగా ఉండడo సాధ్యమే!

         నిరీక్షణ లేదా ఆశ అని మనము వాడుకభాషలో పలికే మాటకు, పరిశుద్ధ గ్రంధంలో నిరీక్షణ అనే మాటకు చాలా భేదమున్నది. “ఆశిస్తున్నాము” అనేటపుడు అది సాధ్యమవుతుందా లేదా అనే అనుమానపు భావముతో మనము మాట్లాడుతూ ఉంటాము. అనేక సందర్భాల్లో పరిస్థితులు ప్రతికూలించి అవి జరగవని మనకు తెలుసు. 

కాని, పరిశుద్ధ గ్రంధంలో “నిరీక్షణ” అంటే ఓపికగా, ధైర్యంగానిశ్చయంగా జరుగుతాయని ఎదురు చూస్తూ 

ఉండడం! పౌలు “ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు” అని ఎంత ధైర్యగా చెప్పాడు కదూ! ఈ స్థిరమైన, సిగ్గుపరచని 

నిరీక్షణ ఎలాంటిదో కీర్తన 16 చివరి వచనములో స్పష్టంగా ఉన్నది: జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు. నీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.”  కీర్త. 16:11. 

 ఇంతకంటే కావలసిందేముంది?

         ప్రియ శ్రోతలూ, “సమస్త ఆదరణ” నిచ్చే ప్రభువుతో మీకు వ్యక్తిగత సంబంధం ఉందా? లేనట్లయితే నీవు 

కోరుకునేది పొందలేవు. యేసు క్రీస్తులో తప్ప నిజమైన ఆదరణ, నిరీక్షణ ఎక్కడ లేదు. దేవుడు నీకు వ్యక్తిగతముగా 

తండ్రి అయితే, నీవు ఆదరణ బడిలో చేరి అందులో ఉన్నావన్నమాట! నీవు అనుభవిస్తున్న శ్రమలు అనుభవిస్తూ, 

ఆదరణ బడిలో పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతావా? వీటి ద్వారా, ప్రభువు అత్యంత విలువైన పాఠాలు 

మీకు నేర్పాలని కొరుతున్నావా? నీ  కష్ట నష్టాలు, వేదన బాధలు నీ చుట్టూ ఉన్న ఇతరులకు ఆశీర్వాదకరంగా 

ఉంటాయని మీరు తెలుసుకున్నారా?  అదరణయొక్క పరిధి, లేదా హద్దు ఎంతవరకు ఉందో ఈ దినపు 

అధ్యయనములో తెలుసుకున్నారా? ప్రియ సోదరీ సోదరులారా, మీకు, నాకు కలుగుతున్నవన్ని, మన రక్షణ 

పరిపూర్ణం కావటానికి ఏర్పాటు చేయబడ్డాయని తెలుసుకోవడం అతిప్రాముఖ్యం. కీస్తుప్రభువు నిన్నెన్నడు 

నిరుత్సాహపరచడు. ప్రార్థన:   మీ స్వంత మాటల్లో ప్రార్ధన చేసుకోండి. 

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...