I కొరింథీ-73 16:5-9 స్థానిక సంఘానికి సలహాలు, సూచనలు, హెచ్చరికలు-2

 

 I కొరింథీ-73  16:5-9  

స్థానిక సంఘానికి సలహాలు, సూచనలు, హెచ్చరికలు-2

       శ్రోతలందరికి సర్వాధికారి యేసు క్రీస్తు ప్రభువు పేరట శుభములు వందనములు! చింతతో, ఆందోళనతో క్రుంగి 

ఉన్నారాజీవితపు సమస్యలు, బాధలు, భయములు ఆవైపుకు నడిపించడం సహజమే! ఒక భక్తిగల దైవజనుడు 

ఇలా అన్నాడు.  

      లోకము చింత అదోళనలను ఎలా తగ్గించుకోవాలో చూపిస్తుంది, మందులు చూపిస్తుంది, కాని యేసుక్రీస్తు 

రక్షకుడు ఏ విధంగా చింత ఆందోళన భయములను పూర్తిగా నశింపచేసుకోవచ్చో చూపిస్తాడు. అవును, ప్రభువు చేసేది 

అదే! సువార్తలో ఉన్న శక్తి అదే! మత్తయి సువార్త 6:27లో ప్రభువు ఈ శ్రేష్టమైన మాటలు సెలవిచ్చారు:

          మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు? 28. వస్త్రములను గూర్చి మీరు 

చింతింప నేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలో చించుడి. అవి కష్టపడవు, ఒడకవు. 29. అయినను తన 

సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు. 30. నేడుండి 

రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంక రించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయ 

ముగా వస్త్రములు ధరింపజేయును గదా. 31. కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని 

చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు.” 34. రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని 

సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.”

ప్రార్ధన చేసుకుందాం. ప్రార్ధన:

      ఈనాటి అంశం: ప్రయాణపు ప్రణాళికలను సర్దుకోవడం, మార్చుకోవడం. ఇది స్థానిక సంఘానికి     

సలహాలు, సూచనలు, హెచ్చరికలు అనే శీర్షికలో 2వ భాగము. లేఖన భాగము 1 కొరింథీ 16:5-9.

         5. అయితే మాసిదోనియలో సంచారమునకు వెళ్లనుద్దేశించుచున్నాను గనుక మాసిదోనియలో సంచారమునకు 

వెళ్లినప్పుడు మీయొద్దకు వచ్చెదను. 6. అప్పుడు మీయొద్ద కొంతకాలము ఆగవచ్చును, ఒక వేళ శీతకాలమంతయు 

గడుపుదును. అప్పుడు నేను వెళ్లెడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును. 7. ప్రభువు సెలవైతే మీయొద్ద 

కొంతకాలముండ నిరీక్షించుచున్నాను 8. గనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనస్సులేదు. 9.  

కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది; మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక 

పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును.”

       ‘ఈ లేఖన భాగములో స్థానిక సంఘము గూర్చి ఏముంది?’ అని మీరనుకుంటున్నారేమో! ఒక్క నిమిషం 

ఆగండి! అపో. మాసిదొనియా వెళ్తానంతున్నాడు గదా! ఆయన ఎఫెసులో ఉన్నాడు కాబట్టి మాసిదొనియా అంటే అది 

ఆయనకు 

ఉత్తరాన ఉంటుంది. పెంతెకొస్తు వరకు ఎఫెసులో ఉంటా నంటున్నాడు. మాసిదొనియా ఎఫెసునకు వాయవ్యంలో, 

ఎజియన్ సముద్రపు ఎదురుగా ఉంటుంది. ఒక్కసారి రెండవ మిషనరీ ప్రయాణమును జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు 

త్రోయ మీదుగా ప్రయాణం చేస్తున్నపుడు ఒక మాసిదొనియా దేశస్థుడు ఆయనకు దర్శనములో కనిపించి 

మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని” అడిగినట్టు మనకు తెలుసు కదా! ఇది అ. కా. 16:9లో ఉంది. 

ఇక వారు వెంటనే అక్కడికి బయలుదేరారు. ఆ ప్రాంతపు మాప్ ను చరిత్రను ఆకళింపు చేసుకుంటే, మాసిదొనియా 

ప్రాంతములో, ఫిలిప్పీ, థెస్సాలోనీక, బెరయ అనే పట్టణాలు ఉన్నాయి.

         పౌలు ఆ తరువాతి కాలములో ఫిలిప్పీ సంఘానికి, థెస్సాలోనీక సంఘానికి పత్రికలు రాశాడు. ఆ సంఘాలను 

పౌలు తన రెండవ మిషనరీ ప్రయాణములో స్థాపించాడు. ఆ పట్టణాల్లో సంఘాలు ఉన్నందుచేత, మాసిదొనియ గుండా 

ఫిలిప్పికి వెళ్ళడం సరియైన మార్గము. ఆయన ఎఫెసి నుండి ఓడ ఎక్కి మాసిదొనియాకు వెళ్ళి, అక్కడనుండి 

భూమ్మీద ప్రయాణం చేస్తూ, ఫిలిప్పి, థెస్సలోనీక, బెరయలకు వెళ్ళి. అక్కడనుండి ఏథెన్స్ వెళ్ళి ఉండాలి. 

అక్కడికెళ్లడానికి ఇది అన్నింటికంటే శ్రేష్టమైన మార్గము. ఆ తరువాత భూమ్మీద కొరింధు వెళ్ళాడు.

         గమించండి, పౌలు ఎఫెసులో పెంతెకొస్తును గడుపుతానని చెప్పాడు గదా! ఈ మాటలు ఆయన గురించి కొన్ని 

విషయాలు చెబుతున్నాయి. ఆయన విశ్వాసపరమైన క్యాలెండర్ ను అనుసరించాడు. పెంతెకొస్తు అంటే ఏమిటి? అది 

పాత నిబంధన కాలములో వారి ప్రధమ ఫలములను దేవుని మందిరములోని తీసుకొని వచ్చిన పర్వదినము. 

పరిశుధ్ద్ధాత్ముడు లోకములోనికి అవతరించిన తరువాత అది క్రైస్తవ పండుగదినం, సెలవుదినముగా మారింది. అ. కా. 

2వ అధ్యాయములో పెంతెకొస్తు దినాన పరిశుధ్ద్ధాత్ముడు దిగి వచ్చిన సంఘటన గుర్తుకు వస్తుందా?

         పౌలు ఎఫెసులో ఉండడానికి మరో కారణం ఉంది. ఒక తెరిచిన తలుపు ఆయన ఎదుట, ఎదుట ఉన్నది. 

కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది;”  పౌలు దృష్టిలో ఎఫెసి చాలా ప్రాముఖ్యమైన సువార్త 

కేంద్రo. ఎఫెసి పట్టణస్తులకు డయానా అనే దేవత ఆ నగరములో పేరు గాంచిoది. అయిన, ప్రభువు అపోస్తలునికి 

కార్యనుకూలమైన మంచి తెరచిన ద్వారమిచ్చి ఆ నగరములో ఒక బలమైన సంఘమును స్థాంపించడానికి శక్తిని, 

కృపను ఇచ్చాడు.  అక్కడికి పౌలు మొదటిసారి వెళ్ళినపుడు పెద్ద కల్లోలమే జరిగింది. అయినా, అక్కడ ఇప్పుడు 

మంచి ద్వారము తెరిచి ఉండడాన్నిబట్టి, మళ్ళీ అక్కడికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ఈ లేఖన భాగము ద్వారా 

పౌలు హృదయములో సువార్త కోసం ఉన్న ఆసక్తి, ఉత్సాహం ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయి కదూ! ఏ పరిస్థితి 

పౌలును నిరుత్సాహపరచదు. ఏ పరిస్థితి ఆయన్ను వెనక్కి తిప్పలేవు. ఇది నాకు, మీకు ఒక సవాలుగా ఉంది. యేసు 

క్రీస్తు రక్షణ సుర్వార్త పట్ల మన ఆసక్తి, ఉత్సాహం ఆయనతో పోల్చి చూసుకుంటే ఎంత అధమ స్థాయిలో ఉందో 

మనమంతా గ్రహించవలసిన సమయం ఆసన్నమయ్యింది. మీ ప్రక్కింటి వాళ్ళతో ఎప్పుడైనా నీ విశ్వాసము గురించి 

చెప్పారా? మీరు నమ్మి ఆరాధిస్తున్న ప్రభువు ఎవరో ఎటువంటి అద్వితీయుడో మీకు తెలుసా? దేవుని సజీవమైన 

మాటలను మీరు నమ్ముతున్నారా? ఒక్కసారి పరీక్షించుకోమని రేడియో వద్ద కూర్చొన్నా ప్రతి ఒక్కరినీ ప్రేమతో 

బ్రతిమాలుతున్నాను. నీ విషవాసం నీ హృదయములో ఉంచుకుంటే సరిపోదు, అది బహిర్గతం కావాలి, ప్రార్థన 

పూర్వకంగా సాక్షమివ్వాలి. ప్రార్థన:

         పాట:

 

 

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...