I కొరింథీ-72 16:1-4 స్థానిక సంఘానికి సలహాలు, సూచనలు, హెచ్చరికలు-1

 

 I కొరింథీ-72  16:1-4  

స్థానిక సంఘానికి సలహాలు, సూచనలు, హెచ్చరికలు-1

      రేడియో దగ్గరికి వచ్చిన మీకందరికి యేసు రక్షకుని పెరట శుభములు, వందనములు! మీరు ఏ సంఘమునకు 

చెందినవారు? మీ సంఘము పేరు ఏమిటి? మీ సంఘ కాపరితో మీకు దగ్గరి సంబంధం ఉందా? కొందరిని మీ సంఘ 

కాపరి ఎవరు?’ అంటే పేరు తెలియక తడుముకోవడం చూశాను. సంఘములో మీకొక ప్రార్థన భాగస్వామి ఉన్నారా?  

oఘమంటే ఏమిటి? ఒక బిల్డింగ్ అనుకోవచ్చా? సంఘమంటే అది యేసు క్రీస్తు ప్రభువు రక్తముతో కొనబడి, 

లోకములోనుండి బయటికి పిలువబడిన దేవుని ప్రజల సమూహం, సహవాసం. ఆదిమ విశ్వాసులకు అసలు ఒక 

బిల్డింగ్ అంటూ లేదు. క్రైస్తవ్యం ఒక విశ్వాసముగా, మార్గముగా ఉన్నంత సేపు ఇళ్లలోనే కలుసుకుని సహవాసం చేసే 

వారు. కాలక్రమేణ అది మతముగా మారి, బిల్డింగ్ నకు పరిమితమై జీవాన్ని కోల్పోయింది.

         అపో. పౌలు స్థానికీ సంఘానికి ఇచ్చిన సలహాలు, సూచనలు, హెచ్చరికలు ఈ పూట అధ్యయనం చేద్దాం. I 

కొరింథీ 16:1-12 వచనాలు పరిశుద్ధ గ్రంధములోనుండి చదువుకుందాం, రండి రెండి రేడియోకు దగ్గరగా వచ్చి 

కూర్చోండి. మీ సెల్ ఫోన్ మీకు అభ్యంతరంగా ఉన్నట్లయితే కొద్ది సేపు సైలెంట్లో పెట్టండి. ప్రశాంతంగా దేవుని వాక్యం 

అధ్యయనం చేయవచ్చు. ముందుగా ప్రార్ధన చేసుకుందాం. ప్రార్థన:

         1 కొరింథీ 16:1-3 వచనాలు.

1. పరిశుద్ధులకొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి.

2. నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను.

3. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని యెంచి పత్రికలిత్తురో, వారిచేత మీ ఉపకార ద్రవ్యమును యె రూ ష లేము నకు పంపుదును.

        అపో . పౌలు ఈ అధ్యాయమును ఎలా ఆరంభించాడో చూశారా?  పరిశుద్ధులకొరకైన చందా విషయమైతే”  ఒక విషయం గమనించారా? ప్రభుత్వమునుండి వారికి ఏలాటి సంక్షేమపధకాలు లేవు. సంక్షేమం, శ్రేయస్సు కోసం ఏవో కొన్ని వసతులు, పధకాలు ఉంది వారి భారము వాటి మీద వేసే అవకాశము వారికి లేదు. రాజకీయాలతో సంబంధము కానీ, రాజకీయపార్టీలనుండి కానీ వారికి ఏ విధమైన సహాయం, సంక్షేమం అందుబాటులోలేదు.  క్రైస్తవ విశ్వాసులు ఇతర క్రైస్తవ విశ్వాసులకు సహాయం చేసుకోవాలి, ఒకరికొకరు అనమాట. ఈనాటికి కూడా ఇది ఆమోదయోగ్యమే, పాటించదగ్గదే! సంఘాలు పాటించవచ్చు. కొరింధులో ఉన్న సంఘము యెరూషలేములో ఉన్న సంఘమునకు సహాయము చేయాలి. వారి ప్రాంతమును దాటి సహాయం చేయడానికి వారు ముందుకు వచ్చారు. యెరూషలేములో ఉన్న సంఘపు పరిశుద్ధులకు ఆర్ధికసహాయo చేయడానికి వారు సుముఖంగా ఉన్నారు.  మనకు తెలిసిననతవరకు రోమా ప్రభుత్వములో పన్నుల విధానము ఉండేది. పన్నుల విషయమైతే రోమా. 13వ అధ్యాయములో ప్రత్యేకించి 5-7 వచనాల్లో స్పష్టంగా బోధించారు. ఆ మాటలు చదువుకుందాం.

          5. కాబట్టి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము.

            6. ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు.

            7. ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండ వలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మాన ముండవలెనో వాని యెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి.

     రోమా ప్రభుత్వము చట్టము ప్రకారం కొరింథు పట్టణములో ఉన్న విశ్వాసులు కట్టవలసిన పన్నులు కడుతూనే, వారి స్థానిక సంఘములో ఒక్క శరీరముగా ఉన్న సంఘములో కూడా వారి బాధ్యతలు నెరవేర్చారు. ఇక్కడ బాధ్యత, జవాబుదారీతనము, గురించి బోధించబడుతుంది. కొన్ని సూత్రాలు, సూచనలు వారు పాటించినట్టు తెలుస్తున్నది. లేఖనం బోధించే సూచన ఏమిటి? ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును ..కొంత సొమ్ము నిలువ చేయవలెను. ఈ విధంగా ఒక క్రమపద్ధతిలో ఒక లెక్క ప్రకారము ఆదివారమున జమచేసి పెట్టుకునేవారు.

         మరొక సూచన, ఎంత ఇవ్వవలసిఉన్నది? “తాను వర్ధిల్లినకొలది” ఒక క్రైస్తవ విశ్వాసికి దేవుడు ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి ఆ వ్యక్తి తన దేవునికి ఎంత ఇస్తారో నిర్ణయించుకోవాలి. ఇక్కడ దశమభాగము, మనకున్న దానిలో పదవభాగము, లేదా పది శాతము అని స్పష్టంగా చెప్పక పోయినా, కనీసం అంత ఇవ్వవలసిన బాధ్యత ఉన్నది. పౌలు అక్కడికి రాకముందే అందరూ ఎవరికి వారు పోగుచేసుకున్న మొత్తమును సిద్ధంగా ఉంచుకోవాలని సూచన చేశారు. ఆయన వచ్చాక పోగుచేయడం జరగకూడదని భావన. దేవుడు మనకిచ్చిన దానిని ఎంత జాగ్రతగా, క్రమపద్ధతిలో పోగొచెసి, తోటివిశ్వాసులకోసం కొరింధు విశ్వాసులు కానుకగా పంపిస్తున్నారో గమనిస్తున్నారా? అనగా ప్రతి ఆదివారమున ప్రతి సహోదరుడు, సహోదరి దేవుని సన్నిధానమునకు వచ్చినపుడు వారు వారమంతా తమ ఇంటిలో పోగుచేసిన మొత్తాన్ని తీసుకుని వచ్చి సంఘము ఖజానాలో ఉంచారు.  ఒక్కొక్క కుటుంబములో ఉన్నవారు అందరు ఆలోచించి మాట్లాడుకొని, ఎవరికి ప్రభువు ప్రేరణ ఇచ్చినట్టుగా వారు పోగుచేసుకుంటారు. అందరూ కుటుంబము యజమాని లేదా తండ్రికి వారి వారి మొత్తాని అందచేస్తారు. ఆయన అందరి పక్షంగా  ఆ కుటుంబపు కానుకను ప్రతి ఆదివారము దైవసన్నిధికి తీసుకొచ్చారని  కొందరు వేదపండితులు భావిస్తున్నారు.

         అంతేకాదు, ఒకరికి దీని బాధ్యతను అప్పగిస్తునట్టుగా పౌలు తేటపరుస్తున్నాడు. కొరింథు సంఘపు వారు ఎంచుకున్న వ్యక్తికి వారి దాతృత్వపు ధారాళత్వమును అప్పగిస్తానని తేటపరుస్తున్నాడు.  యెరూషలేము సంఘపు వారికి పంపిస్తానని చెబుతున్నాడు. వారి ఇష్టప్రకారమైన వ్యక్తితో ఆ కానుకను పంపిస్తానని ఆయన మనసులోని మాటను వ్యక్తం చేస్తున్నాడు. ఆవసరమనుకుంటే, తాను స్వయంగా వారితో వెళ్తానని అంటున్నాడు. కాని స్థానికీ సంఘపువారు వారి ఇష్ఠo వచ్చిన వారిని, సంఘములో నమ్మకస్థులైన ఆ వ్యక్తితో బాటు యెరూషలేముకు పంపిస్తారని ఆశించాడు.

         ఈనాడు మన సంఘాల్లో కానుకలు సేకరించి పoపించే వారికి ఈ లేఖన భాగములో శ్రేష్టమైన సూచన ఉన్నది. ఒక నిర్దిష్టమైన ఉద్దేశం కోసం సేకరించి పోగుచేయండి. చాలా సార్లు పోగుచేయబడిన కానుకలు ఎక్కడికి పంపబడతాయో, దేని కోసం వినియోగిస్తారో, సంఘపు వారికి తెలియదు. దేవుని నామములో ఇవ్వబడిన కానుకలు ఏ విధంగా, ఏ ఉద్దేశం కోసం ఎక్కడ వినియోగించబడుతున్నాయో  ఇచ్చిన సంఘపువారికి తెలియచేయండి. ఈ కానుక యెరూషలేములేము లోని సంఘపు విశ్వాసులకోసం అని పౌలు స్పష్టం చేసి, వారికి భద్రంగా అందేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు లేఖనం స్పష్టం చేస్తుంది.

         సంఘమునకు చెందిన మనము దేవునికి, దేవుని ప్రజల అవసరాలకోసం ఇవ్వటానికి వెనుదీయకూడదు. ధారాళంగా ఇవ్వాలి. శక్తికొలది అనగా చేతనైనంతగా ఇవ్వటానికి సంతోషించాలి. దేనికోసం, ఎవ్వరికోసం ఇస్తున్నామో అది స్పష్టంగా తెలుసుకొనిఉండాలి. ఆ ఉద్దేశం కోసం వాడబడుతుందో లేదో, జాగ్రత్తగా చూడాలి. బాధ్యత, జవాబుదారీతనము అందరికి కనిపించేలా, దాపరికం లేకుండా, అందరి ప్రశ్నలకు సమాధానము ఇస్తూ, అందరు ధారాళంగా ఇవ్వటానికి అవసరమయ్యే పరిస్థితులు, అవసరతలు జాగ్రత్తగా కనిపెట్టాలి. దేవునికి, ఆయన ప్రజలకు, ఆయన పనికి ఆయన రాజ్యపు పరిచర్యకు ఇవ్వటానికి సంకుచితమైన మనసుతో కాకుండా ధారాళంగా ఇవ్వటానికి మనమంతా సిధ్ధంగా ఉందాం. ప్రభువు మనలో ప్రతి ఒక్కరికీ దాతృత్వపు ధారాళత్వమును అనుగ్రహించుగాక! అమెన్!!

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...