I కొరింథీ-70 15:51-57
రహస్యం ఇదే! వినండి! విజయం మళ్ళీ సంపాదించబడిoది
శ్రోతలందరికీ యేసు రక్షకుని పరిశుద్ధ నామములో శుభములు! బాగున్నారా? చాలా అద్భుతమైన అంశాలు ఈ
దినాల్లో అధ్యయనం చేస్తున్నాము కదా! మీకెలా అనిపిస్తున్నది? మీ విశ్వాసము బలపడు తుందా? ఆనందముతో
నింపబడుతున్నారా? ఇతరులతో ఆనందం పంచుకుంటే ఎక్కువ అవుతుందంతారు కదా! మాతో పంచుకోండి, మీ
తోటివారితో పంచుకోండి! మీ ఆప్తులతో, కుటుంబపువారితో, స్నేహితులతో పంచుకోండి! ఇది సంతోషానికి
చిటారుకొమ్మ! శిఖరాగ్రం! ఎంత మందితో పంచుకుంటే అంతా మంచిది! ముందుగా ప్రార్థన చేసుకుందాం, రండి,
రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి. ప్రార్థన:
ఈ నాటి మన ధ్యానాంశం “రహస్యం ఇదే! వినండి!!” లేఖన భాగము. 1 కొరింథీ 15:51-53.గమనించండి.
51 ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము.
52. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము.
53. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసి యున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది.
రహస్యం అంటే పరిశుద్ధగ్రంధం బైబిల్ లో ఎవరికి అర్ధం కానిది అనుకోవద్దు. ఇంతవరకు మరుగుపరచబడింది,
ఇప్పుడు స్పష్టంగా బోధించబడుతుంది, అని అర్ధం. కాని మానవ చాతుర్యానికి, మేధస్సుకు అందక పోవచ్చు. వివాదం
పెట్టుకుంటే కంటికి కనిపించే రుజువు ఉండకపోవచ్చు. దేవుని వాక్యం మట్టుకు స్పష్టంగా నిర్దిష్టంగా బోధిస్తుంది.
ఈ రహస్యమును బోధించడానికి అపో. పౌలు మానవ మేధాశక్తిని కాదు, తర్కవాదాన్ని కాదు, కాని దేవుని
ప్రత్యక్ష్తను వినియోగిస్తున్నాడు. ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉన్నది. ఈ వ్యత్యాసం ఏమిటంటే, మార్పు దేవుని వల్ల
కలుగుతుంది, మానవ శక్తి, యుక్తి, జ్ఞానం, విద్య వల్ల కాదు. నశించిపోయేది అకస్మాత్తుగా నశించే లక్షణం లేనిదిగా
మారదు. మరణమయ్యే శరీరము దేవుదు కలుగచేసుకుంటే తప్ప అమర్త్యతను ధరించుకోలేదు. ఇది మనము
గ్రహించవలసిన విషయం. ఇది క్రమేపి, క్రమక్రమoగా, కొంచెము కొంచెముగా జరిగేది కాదు. ఒక్క క్షణములో,
రెప్పపాటులో జరుగుతుంది. లేఖనములో వాడబడిన మాట, “నిమిషములో, రెప్ప పాటున” ఈ మాటలకు వాడబడిన
గ్రీకు మాటకు “అణువు” అని అర్ధం. అణువు లేదా రేణువు ఎంత స్వల్పమైనదో మనకందరికి బాగా తెలుసు. ఒక ఇసుక
రేణువు అంతా. ఒక అణువు ఎంతో అంతా సమయములో ఈ మార్పు కలుగుతుంది. కడ బూర, అనగా చివరి బూర
మ్రోగగానే, ఏ హెచ్చరిక, గుర్తు లేకుండానే, మనము రెప్ప కొట్టే అంతలోనో మనము మార్పు చెందుతాము. ఒక గొప్ప
భక్తుడు ఏ విధంగా దీన్ని బోధపరుస్తున్నాడో గమనించండి. “మర్మము” అని పిలువబడుతున్న ఈ సంగతి అర్ధం
కానిదనికాదు. తెలుసు కోలేనిదనికాదు. ఇంతవరకు తెలియనిది అని అర్ధం. ఈ విషయం గురించి ఇంతవరకు మనము
తెలుసుకోలేదు, మనకు ప్రత్యక్షత కలుగలేదు. పరిసయ్యులు పునరుధ్ధానమున్నదని, చనిపోయినవారు మళ్ళీ
బ్రతుకుతారని నమ్మినప్పటికి, చనిపోయినవారు తిరిగి లేచినపుడు, అప్పటికి బ్రతికు ఉన్నవారి సంతెమిటి? అనే
విషయము గూర్చి వారేమి చెప్పలేదు. అపోస్తలులు దాని గురించి పెద్దగా ప్రస్తావించలేదు. మన ప్రభువు యేసు క్రీస్తు
స్వయానా దీని గూర్చి ప్రత్యక్షంగా చెప్పలేదు. ప్రస్తుతం అపో. పౌలు ఇప్పుడు ఇంతవరకు తెలియనిది, ఒక గొప్ప
విషయమును తేటతెల్లం చేస్తున్నానని బోధిస్తున్నాడు. ఇంత వరకు ప్రత్యక్షత లేని ఒక గొప్ప సంగతిని ఇప్పుడు
స్పష్టపరుస్తానని చెబుతున్నాడు. కాబట్టి మొదటి ప్రేరక, ప్రోత్సాహకం రహస్యం ఇదే! ఇప్పుడు స్పష్టమయ్యింది.
ఇక రెండవ ప్రోత్సాహకం, ప్రేరకం, విజయం మళ్ళీ సంపాదించబడింది. 54-57 వచనాలు చదువుకుందాం.
54. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు,ఈ మర్త్య మైనది అమర్త్యతను ధరించు కొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.
55. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?
56. మరణపు ముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే.
57. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.
హల్లెలూయ! ఎంత శక్తివంతమైన సత్యము మన వినికిడిలో ఉన్నదో గమనిస్తున్నారా? దేవుని మాటలు ఎంతో
బలమైనవి, ధైర్యము, జీవమును పుట్టిస్తాయి. “ధరించుకొనినప్పుడు” అనే మాటలు కీలకమైనవి. వీటిల్లో
చేప్ప్బడుతున్న విషయం జరగబోతున్నది! ఇప్పుడు మరణము మన గొంతు పట్టుకుని కూర్చొన్నది. రెస్త్లింగ్
చేసేటప్పుడు శత్రువును ఓడించాలని తన ఎదుట నున్నవారి గొంతు పట్టుకున్నట్టే. కాని, యేసు నందు
విశ్వాసముంతున్న వారoదరికి, ఏ భేదము లేకుండా, మర్త్యతనుండి అమర్త్యతకు మార్చబడేటప్పుడు ఆ పట్టు
ఊడిపోతుంది. అపో. దేవుని మాటలను చెబుతూ, మనము మార్పు చెండుతాం అని ఎంత స్పష్టంగా రహస్యము మన
చెవుల్లో చెబుతున్నాడో వినండి! రహస్యం ఇదే! ప్రియులారా, మన పితరులు ఆదాము, హవ్వలు పాపము
చేసినప్పుడు ప్రవేశించిన మరణపు పాశములు మనలను చుట్టేశాయి. మంచి చెడ్డల తెలివి నిచ్చే చెట్టు పండు తిన్న
దినాన్న వారు ఖచ్చితంగా చనిపోతారని చెప్పాడా లేదా? దానిలో ఎవ్వరికి మినహాయింపు లేదు. ఈ సమయములో
రోమా 5:12-18 వచనాలు జాగ్రత్తగా చదవాలి. గమనించండి.
12. ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.
13. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు.
14. అయినను ఆదాముచేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారిమీదకూడ, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను; ఆదాము రాబోవువానికి గురుతై యుండెను,
15. అయితే అపరాధము కలిగినట్టు కృపా వరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయినయెడల మరి యెక్కువగా దేవుని కృపయు, యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును, అనేకులకు విస్తరించెను.
16. మరియు పాపము చేసిన యొకనివలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగ లేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను; కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను.
17. మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే యేలిన యెడల కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తను ఒకని ద్వారానే యేలుదురు.
18. కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యుల కందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్య కార్యమువలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను.
ఆ మొదటి పాపపు వేరు నీలో నాలో ఉండి, ఏ విధoగా పెద్ద వృక్షమైందో గమనిస్తున్నారా? అది యేసు క్రీస్తు
ద్వారా నీ జీవితములోనుండి కొట్టివేయబడగలదు! ఆ పాపపు వృక్షమును అలాగే నీవుంచుకుంటే, ఇంకా పెంచి
పోషిస్తుంటే, శిక్ష తప్పదు, నరకము నిన్ను విడిచిపెట్టదు. కాని యేసు క్రీస్తులో విజయము మరణమును మింగేసింది!
హల్లెలూయ! నీ పాపములోనే ఉంటాననుకుంటే, ఉండవచ్చు, నిన్నేవారూ అభ్యoతర పెట్టరు. నిత్య నరకమునుండి
నిన్ను ఎవ్వరు విడిపించలేరు. మరణమును జయించిన యేసు క్రీస్తు ప్రభువు నీ రక్షకుడు, విమోచకుడుగా నీవు
మరణించే వరకు ఉండాలని నీవు ఇప్పుడు మనసారా కోరుకుంటే, నిత్య జీవము, నిత్య సంతోషము, నిత్య విమోచన,
నిత్యత్వమంత నీదే! అది ఇప్పుడే ఆరంభం అవుతుంది. నీవు సిధ్ధమా! ప్రార్థన:
No comments:
Post a Comment