I కొరింథీ-73 16:5-9 స్థానిక సంఘానికి సలహాలు, సూచనలు, హెచ్చరికలు-2

 

 I కొరింథీ-73  16:5-9  

స్థానిక సంఘానికి సలహాలు, సూచనలు, హెచ్చరికలు-2

       శ్రోతలందరికి సర్వాధికారి యేసు క్రీస్తు ప్రభువు పేరట శుభములు వందనములు! చింతతో, ఆందోళనతో క్రుంగి 

ఉన్నారాజీవితపు సమస్యలు, బాధలు, భయములు ఆవైపుకు నడిపించడం సహజమే! ఒక భక్తిగల దైవజనుడు 

ఇలా అన్నాడు.  

      లోకము చింత అదోళనలను ఎలా తగ్గించుకోవాలో చూపిస్తుంది, మందులు చూపిస్తుంది, కాని యేసుక్రీస్తు 

రక్షకుడు ఏ విధంగా చింత ఆందోళన భయములను పూర్తిగా నశింపచేసుకోవచ్చో చూపిస్తాడు. అవును, ప్రభువు చేసేది 

అదే! సువార్తలో ఉన్న శక్తి అదే! మత్తయి సువార్త 6:27లో ప్రభువు ఈ శ్రేష్టమైన మాటలు సెలవిచ్చారు:

          మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు? 28. వస్త్రములను గూర్చి మీరు 

చింతింప నేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలో చించుడి. అవి కష్టపడవు, ఒడకవు. 29. అయినను తన 

సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు. 30. నేడుండి 

రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంక రించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయ 

ముగా వస్త్రములు ధరింపజేయును గదా. 31. కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని 

చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు.” 34. రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని 

సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.”

ప్రార్ధన చేసుకుందాం. ప్రార్ధన:

      ఈనాటి అంశం: ప్రయాణపు ప్రణాళికలను సర్దుకోవడం, మార్చుకోవడం. ఇది స్థానిక సంఘానికి     

సలహాలు, సూచనలు, హెచ్చరికలు అనే శీర్షికలో 2వ భాగము. లేఖన భాగము 1 కొరింథీ 16:5-9.

         5. అయితే మాసిదోనియలో సంచారమునకు వెళ్లనుద్దేశించుచున్నాను గనుక మాసిదోనియలో సంచారమునకు 

వెళ్లినప్పుడు మీయొద్దకు వచ్చెదను. 6. అప్పుడు మీయొద్ద కొంతకాలము ఆగవచ్చును, ఒక వేళ శీతకాలమంతయు 

గడుపుదును. అప్పుడు నేను వెళ్లెడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును. 7. ప్రభువు సెలవైతే మీయొద్ద 

కొంతకాలముండ నిరీక్షించుచున్నాను 8. గనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనస్సులేదు. 9.  

కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది; మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక 

పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును.”

       ‘ఈ లేఖన భాగములో స్థానిక సంఘము గూర్చి ఏముంది?’ అని మీరనుకుంటున్నారేమో! ఒక్క నిమిషం 

ఆగండి! అపో. మాసిదొనియా వెళ్తానంతున్నాడు గదా! ఆయన ఎఫెసులో ఉన్నాడు కాబట్టి మాసిదొనియా అంటే అది 

ఆయనకు 

ఉత్తరాన ఉంటుంది. పెంతెకొస్తు వరకు ఎఫెసులో ఉంటా నంటున్నాడు. మాసిదొనియా ఎఫెసునకు వాయవ్యంలో, 

ఎజియన్ సముద్రపు ఎదురుగా ఉంటుంది. ఒక్కసారి రెండవ మిషనరీ ప్రయాణమును జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు 

త్రోయ మీదుగా ప్రయాణం చేస్తున్నపుడు ఒక మాసిదొనియా దేశస్థుడు ఆయనకు దర్శనములో కనిపించి 

మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని” అడిగినట్టు మనకు తెలుసు కదా! ఇది అ. కా. 16:9లో ఉంది. 

ఇక వారు వెంటనే అక్కడికి బయలుదేరారు. ఆ ప్రాంతపు మాప్ ను చరిత్రను ఆకళింపు చేసుకుంటే, మాసిదొనియా 

ప్రాంతములో, ఫిలిప్పీ, థెస్సాలోనీక, బెరయ అనే పట్టణాలు ఉన్నాయి.

         పౌలు ఆ తరువాతి కాలములో ఫిలిప్పీ సంఘానికి, థెస్సాలోనీక సంఘానికి పత్రికలు రాశాడు. ఆ సంఘాలను 

పౌలు తన రెండవ మిషనరీ ప్రయాణములో స్థాపించాడు. ఆ పట్టణాల్లో సంఘాలు ఉన్నందుచేత, మాసిదొనియ గుండా 

ఫిలిప్పికి వెళ్ళడం సరియైన మార్గము. ఆయన ఎఫెసి నుండి ఓడ ఎక్కి మాసిదొనియాకు వెళ్ళి, అక్కడనుండి 

భూమ్మీద ప్రయాణం చేస్తూ, ఫిలిప్పి, థెస్సలోనీక, బెరయలకు వెళ్ళి. అక్కడనుండి ఏథెన్స్ వెళ్ళి ఉండాలి. 

అక్కడికెళ్లడానికి ఇది అన్నింటికంటే శ్రేష్టమైన మార్గము. ఆ తరువాత భూమ్మీద కొరింధు వెళ్ళాడు.

         గమించండి, పౌలు ఎఫెసులో పెంతెకొస్తును గడుపుతానని చెప్పాడు గదా! ఈ మాటలు ఆయన గురించి కొన్ని 

విషయాలు చెబుతున్నాయి. ఆయన విశ్వాసపరమైన క్యాలెండర్ ను అనుసరించాడు. పెంతెకొస్తు అంటే ఏమిటి? అది 

పాత నిబంధన కాలములో వారి ప్రధమ ఫలములను దేవుని మందిరములోని తీసుకొని వచ్చిన పర్వదినము. 

పరిశుధ్ద్ధాత్ముడు లోకములోనికి అవతరించిన తరువాత అది క్రైస్తవ పండుగదినం, సెలవుదినముగా మారింది. అ. కా. 

2వ అధ్యాయములో పెంతెకొస్తు దినాన పరిశుధ్ద్ధాత్ముడు దిగి వచ్చిన సంఘటన గుర్తుకు వస్తుందా?

         పౌలు ఎఫెసులో ఉండడానికి మరో కారణం ఉంది. ఒక తెరిచిన తలుపు ఆయన ఎదుట, ఎదుట ఉన్నది. 

కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది;”  పౌలు దృష్టిలో ఎఫెసి చాలా ప్రాముఖ్యమైన సువార్త 

కేంద్రo. ఎఫెసి పట్టణస్తులకు డయానా అనే దేవత ఆ నగరములో పేరు గాంచిoది. అయిన, ప్రభువు అపోస్తలునికి 

కార్యనుకూలమైన మంచి తెరచిన ద్వారమిచ్చి ఆ నగరములో ఒక బలమైన సంఘమును స్థాంపించడానికి శక్తిని, 

కృపను ఇచ్చాడు.  అక్కడికి పౌలు మొదటిసారి వెళ్ళినపుడు పెద్ద కల్లోలమే జరిగింది. అయినా, అక్కడ ఇప్పుడు 

మంచి ద్వారము తెరిచి ఉండడాన్నిబట్టి, మళ్ళీ అక్కడికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ఈ లేఖన భాగము ద్వారా 

పౌలు హృదయములో సువార్త కోసం ఉన్న ఆసక్తి, ఉత్సాహం ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయి కదూ! ఏ పరిస్థితి 

పౌలును నిరుత్సాహపరచదు. ఏ పరిస్థితి ఆయన్ను వెనక్కి తిప్పలేవు. ఇది నాకు, మీకు ఒక సవాలుగా ఉంది. యేసు 

క్రీస్తు రక్షణ సుర్వార్త పట్ల మన ఆసక్తి, ఉత్సాహం ఆయనతో పోల్చి చూసుకుంటే ఎంత అధమ స్థాయిలో ఉందో 

మనమంతా గ్రహించవలసిన సమయం ఆసన్నమయ్యింది. మీ ప్రక్కింటి వాళ్ళతో ఎప్పుడైనా నీ విశ్వాసము గురించి 

చెప్పారా? మీరు నమ్మి ఆరాధిస్తున్న ప్రభువు ఎవరో ఎటువంటి అద్వితీయుడో మీకు తెలుసా? దేవుని సజీవమైన 

మాటలను మీరు నమ్ముతున్నారా? ఒక్కసారి పరీక్షించుకోమని రేడియో వద్ద కూర్చొన్నా ప్రతి ఒక్కరినీ ప్రేమతో 

బ్రతిమాలుతున్నాను. నీ విషవాసం నీ హృదయములో ఉంచుకుంటే సరిపోదు, అది బహిర్గతం కావాలి, ప్రార్థన 

పూర్వకంగా సాక్షమివ్వాలి. ప్రార్థన:

         పాట:

 

 

I కొరింథీ-72 16:1-4 స్థానిక సంఘానికి సలహాలు, సూచనలు, హెచ్చరికలు-1

 

 I కొరింథీ-72  16:1-4  

స్థానిక సంఘానికి సలహాలు, సూచనలు, హెచ్చరికలు-1

      రేడియో దగ్గరికి వచ్చిన మీకందరికి యేసు రక్షకుని పెరట శుభములు, వందనములు! మీరు ఏ సంఘమునకు 

చెందినవారు? మీ సంఘము పేరు ఏమిటి? మీ సంఘ కాపరితో మీకు దగ్గరి సంబంధం ఉందా? కొందరిని మీ సంఘ 

కాపరి ఎవరు?’ అంటే పేరు తెలియక తడుముకోవడం చూశాను. సంఘములో మీకొక ప్రార్థన భాగస్వామి ఉన్నారా?  

oఘమంటే ఏమిటి? ఒక బిల్డింగ్ అనుకోవచ్చా? సంఘమంటే అది యేసు క్రీస్తు ప్రభువు రక్తముతో కొనబడి, 

లోకములోనుండి బయటికి పిలువబడిన దేవుని ప్రజల సమూహం, సహవాసం. ఆదిమ విశ్వాసులకు అసలు ఒక 

బిల్డింగ్ అంటూ లేదు. క్రైస్తవ్యం ఒక విశ్వాసముగా, మార్గముగా ఉన్నంత సేపు ఇళ్లలోనే కలుసుకుని సహవాసం చేసే 

వారు. కాలక్రమేణ అది మతముగా మారి, బిల్డింగ్ నకు పరిమితమై జీవాన్ని కోల్పోయింది.

         అపో. పౌలు స్థానికీ సంఘానికి ఇచ్చిన సలహాలు, సూచనలు, హెచ్చరికలు ఈ పూట అధ్యయనం చేద్దాం. I 

కొరింథీ 16:1-12 వచనాలు పరిశుద్ధ గ్రంధములోనుండి చదువుకుందాం, రండి రెండి రేడియోకు దగ్గరగా వచ్చి 

కూర్చోండి. మీ సెల్ ఫోన్ మీకు అభ్యంతరంగా ఉన్నట్లయితే కొద్ది సేపు సైలెంట్లో పెట్టండి. ప్రశాంతంగా దేవుని వాక్యం 

అధ్యయనం చేయవచ్చు. ముందుగా ప్రార్ధన చేసుకుందాం. ప్రార్థన:

         1 కొరింథీ 16:1-3 వచనాలు.

1. పరిశుద్ధులకొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి.

2. నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను.

3. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని యెంచి పత్రికలిత్తురో, వారిచేత మీ ఉపకార ద్రవ్యమును యె రూ ష లేము నకు పంపుదును.

        అపో . పౌలు ఈ అధ్యాయమును ఎలా ఆరంభించాడో చూశారా?  పరిశుద్ధులకొరకైన చందా విషయమైతే”  ఒక విషయం గమనించారా? ప్రభుత్వమునుండి వారికి ఏలాటి సంక్షేమపధకాలు లేవు. సంక్షేమం, శ్రేయస్సు కోసం ఏవో కొన్ని వసతులు, పధకాలు ఉంది వారి భారము వాటి మీద వేసే అవకాశము వారికి లేదు. రాజకీయాలతో సంబంధము కానీ, రాజకీయపార్టీలనుండి కానీ వారికి ఏ విధమైన సహాయం, సంక్షేమం అందుబాటులోలేదు.  క్రైస్తవ విశ్వాసులు ఇతర క్రైస్తవ విశ్వాసులకు సహాయం చేసుకోవాలి, ఒకరికొకరు అనమాట. ఈనాటికి కూడా ఇది ఆమోదయోగ్యమే, పాటించదగ్గదే! సంఘాలు పాటించవచ్చు. కొరింధులో ఉన్న సంఘము యెరూషలేములో ఉన్న సంఘమునకు సహాయము చేయాలి. వారి ప్రాంతమును దాటి సహాయం చేయడానికి వారు ముందుకు వచ్చారు. యెరూషలేములో ఉన్న సంఘపు పరిశుద్ధులకు ఆర్ధికసహాయo చేయడానికి వారు సుముఖంగా ఉన్నారు.  మనకు తెలిసిననతవరకు రోమా ప్రభుత్వములో పన్నుల విధానము ఉండేది. పన్నుల విషయమైతే రోమా. 13వ అధ్యాయములో ప్రత్యేకించి 5-7 వచనాల్లో స్పష్టంగా బోధించారు. ఆ మాటలు చదువుకుందాం.

          5. కాబట్టి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము.

            6. ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు.

            7. ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండ వలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మాన ముండవలెనో వాని యెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి.

     రోమా ప్రభుత్వము చట్టము ప్రకారం కొరింథు పట్టణములో ఉన్న విశ్వాసులు కట్టవలసిన పన్నులు కడుతూనే, వారి స్థానిక సంఘములో ఒక్క శరీరముగా ఉన్న సంఘములో కూడా వారి బాధ్యతలు నెరవేర్చారు. ఇక్కడ బాధ్యత, జవాబుదారీతనము, గురించి బోధించబడుతుంది. కొన్ని సూత్రాలు, సూచనలు వారు పాటించినట్టు తెలుస్తున్నది. లేఖనం బోధించే సూచన ఏమిటి? ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును ..కొంత సొమ్ము నిలువ చేయవలెను. ఈ విధంగా ఒక క్రమపద్ధతిలో ఒక లెక్క ప్రకారము ఆదివారమున జమచేసి పెట్టుకునేవారు.

         మరొక సూచన, ఎంత ఇవ్వవలసిఉన్నది? “తాను వర్ధిల్లినకొలది” ఒక క్రైస్తవ విశ్వాసికి దేవుడు ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి ఆ వ్యక్తి తన దేవునికి ఎంత ఇస్తారో నిర్ణయించుకోవాలి. ఇక్కడ దశమభాగము, మనకున్న దానిలో పదవభాగము, లేదా పది శాతము అని స్పష్టంగా చెప్పక పోయినా, కనీసం అంత ఇవ్వవలసిన బాధ్యత ఉన్నది. పౌలు అక్కడికి రాకముందే అందరూ ఎవరికి వారు పోగుచేసుకున్న మొత్తమును సిద్ధంగా ఉంచుకోవాలని సూచన చేశారు. ఆయన వచ్చాక పోగుచేయడం జరగకూడదని భావన. దేవుడు మనకిచ్చిన దానిని ఎంత జాగ్రతగా, క్రమపద్ధతిలో పోగొచెసి, తోటివిశ్వాసులకోసం కొరింధు విశ్వాసులు కానుకగా పంపిస్తున్నారో గమనిస్తున్నారా? అనగా ప్రతి ఆదివారమున ప్రతి సహోదరుడు, సహోదరి దేవుని సన్నిధానమునకు వచ్చినపుడు వారు వారమంతా తమ ఇంటిలో పోగుచేసిన మొత్తాన్ని తీసుకుని వచ్చి సంఘము ఖజానాలో ఉంచారు.  ఒక్కొక్క కుటుంబములో ఉన్నవారు అందరు ఆలోచించి మాట్లాడుకొని, ఎవరికి ప్రభువు ప్రేరణ ఇచ్చినట్టుగా వారు పోగుచేసుకుంటారు. అందరూ కుటుంబము యజమాని లేదా తండ్రికి వారి వారి మొత్తాని అందచేస్తారు. ఆయన అందరి పక్షంగా  ఆ కుటుంబపు కానుకను ప్రతి ఆదివారము దైవసన్నిధికి తీసుకొచ్చారని  కొందరు వేదపండితులు భావిస్తున్నారు.

         అంతేకాదు, ఒకరికి దీని బాధ్యతను అప్పగిస్తునట్టుగా పౌలు తేటపరుస్తున్నాడు. కొరింథు సంఘపు వారు ఎంచుకున్న వ్యక్తికి వారి దాతృత్వపు ధారాళత్వమును అప్పగిస్తానని తేటపరుస్తున్నాడు.  యెరూషలేము సంఘపు వారికి పంపిస్తానని చెబుతున్నాడు. వారి ఇష్టప్రకారమైన వ్యక్తితో ఆ కానుకను పంపిస్తానని ఆయన మనసులోని మాటను వ్యక్తం చేస్తున్నాడు. ఆవసరమనుకుంటే, తాను స్వయంగా వారితో వెళ్తానని అంటున్నాడు. కాని స్థానికీ సంఘపువారు వారి ఇష్ఠo వచ్చిన వారిని, సంఘములో నమ్మకస్థులైన ఆ వ్యక్తితో బాటు యెరూషలేముకు పంపిస్తారని ఆశించాడు.

         ఈనాడు మన సంఘాల్లో కానుకలు సేకరించి పoపించే వారికి ఈ లేఖన భాగములో శ్రేష్టమైన సూచన ఉన్నది. ఒక నిర్దిష్టమైన ఉద్దేశం కోసం సేకరించి పోగుచేయండి. చాలా సార్లు పోగుచేయబడిన కానుకలు ఎక్కడికి పంపబడతాయో, దేని కోసం వినియోగిస్తారో, సంఘపు వారికి తెలియదు. దేవుని నామములో ఇవ్వబడిన కానుకలు ఏ విధంగా, ఏ ఉద్దేశం కోసం ఎక్కడ వినియోగించబడుతున్నాయో  ఇచ్చిన సంఘపువారికి తెలియచేయండి. ఈ కానుక యెరూషలేములేము లోని సంఘపు విశ్వాసులకోసం అని పౌలు స్పష్టం చేసి, వారికి భద్రంగా అందేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు లేఖనం స్పష్టం చేస్తుంది.

         సంఘమునకు చెందిన మనము దేవునికి, దేవుని ప్రజల అవసరాలకోసం ఇవ్వటానికి వెనుదీయకూడదు. ధారాళంగా ఇవ్వాలి. శక్తికొలది అనగా చేతనైనంతగా ఇవ్వటానికి సంతోషించాలి. దేనికోసం, ఎవ్వరికోసం ఇస్తున్నామో అది స్పష్టంగా తెలుసుకొనిఉండాలి. ఆ ఉద్దేశం కోసం వాడబడుతుందో లేదో, జాగ్రత్తగా చూడాలి. బాధ్యత, జవాబుదారీతనము అందరికి కనిపించేలా, దాపరికం లేకుండా, అందరి ప్రశ్నలకు సమాధానము ఇస్తూ, అందరు ధారాళంగా ఇవ్వటానికి అవసరమయ్యే పరిస్థితులు, అవసరతలు జాగ్రత్తగా కనిపెట్టాలి. దేవునికి, ఆయన ప్రజలకు, ఆయన పనికి ఆయన రాజ్యపు పరిచర్యకు ఇవ్వటానికి సంకుచితమైన మనసుతో కాకుండా ధారాళంగా ఇవ్వటానికి మనమంతా సిధ్ధంగా ఉందాం. ప్రభువు మనలో ప్రతి ఒక్కరికీ దాతృత్వపు ధారాళత్వమును అనుగ్రహించుగాక! అమెన్!!

I కొరింథీ-71 15:58 చేతికందిన బహుమానం

 

I కొరింథీ-71  15:58

 చేతికందిన బహుమానం!

 

      శ్రోతలూ, బాగున్నారా? ఇవి చాల కఠినమైన దినాలే, అయినా మనమంతా బాగా ఉండాలని దేవుని ప్రణాళిక, 

ఉద్దేశ్యం. కాని అంత మాత్రాన, ఆరోగ్యం సవ్యగా ఉంటుందని కాదు, అన్ని అవసరాలు తీరాయాని కాదు, కాని, దేవుని 

చిత్తం చేయాలని ఆశ మీకుందా? అలాగైతే, నాతో బాటు ఒక బైబిల్ వచనం తీయండి. I థేస్స. 5:16. “ ప్రతి 

విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని 

చిత్తము.” మీరు నిజంగా దేవుని చిత్తము చేయాలని ఆశించేవారైతే, మీ మనసు ఇప్పుడే మారుతుంది. సణుక్కుంటూ, 

గొణుక్కుంటు, ఉండడం మానేసి ఇప్పుడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి! మీతో బాటు నేను కూడా రేడియోలో 

“దేవునికి స్త్రోత్రం అని చెబుతున్నాను. ప్రార్థన:

         దేవుని పరిశుద్ధ లేఖనం చదువుకుందాం, రండి, రేడియోకు దగ్గర వచ్చి కూర్చోండి. I కొరింథీ 15:58 కాగా నా 

ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు 

కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.”   

         ఈనాటి మన అంశం: చేతికందిన బహుమానం. చాలా ఆసక్తికరంగా ఉండే అంశం కదూ! నిజమే! 

బహుమానం చేతికందినపుడు ఎంత సంతోషంగా ఉక్కిరి బిక్కిరి అవుతాము కదా! ఈ ఒకే వచనం చాలా అద్భుతమైన 

సత్యములతో నిండిఉన్నది.

మొదట మన ఆలోచనలను ఆకట్టుకునే మాట, “స్థిరులు” ఈనాడు మనము జీవిస్తున్న భూమి మీద మనకు 

కనిపించేది ఎక్కువ శాతం రాజీ పాడేవారు, ఏదైనా ఫరవాలేదు ఎవరైనా ఫరవా లేదు అనుకునే మనస్తత్వం. 

ఎన్నో ఏళ్ల క్రితం ఒక వ్యక్తితో మాటలాడుతుండగా, ఆయన అన్న మాట ఏమిటంటే, “సత్యముకంటే ప్రేమ 

ముఖ్యం”. ఇది సరైనందని మీరనుకుంటున్నారా? కాదని నా అభిప్రాయం. ఎందుకంటే, ప్రేమలో సత్యము, 

యధార్ధత, నిష్కాపట్యం లేకపోతే, అది ప్రేమ ఎలా అవుతుంది? ప్రస్తుతం ప్రతిచోట మనకు కనిపించేది       

ఇదేకాదా? సత్యమును  సహనము అనే సిలువకు  ఎక్కించి బలిచేస్తున్నారు. దాదాపు ప్రతి చోట ఇది మనకు 

ఎదురవుతూనే ఉంటుంది. కాని పౌలు భద్రతను, హామీని కోరుకుంటున్నాడు. స్థిరులు అనే మాటలో 

పాతుకుపోయిoది అనే భావన ఉన్నది. అటుఇటు ఊగిసలాడకుండా ఉన్నది 

అని అర్ధం. దానిలాంటిదే మరోమాట తరువాత ఉన్నది. “కదలనివారు” స్థిరులు అంటే నిశ్చలంగా కూర్చొన్

నవారు అని అర్ధం. నిశ్చలంగా కూర్చోండి, దేవుని పరిశుద్ధ లేఖనాలు అధ్యయనం చేస్తున్న ఈ సమయములో 

అటు ఇటు తిరగకండి, అటు ఇటుచూడకండి! మనసు సంపూర్ణంగా దేవుని మాట మీదే ఉంచండి. అదే రీతిగా 

సిద్ధాంతం, సత్యము, విషయాల్లో తొణకకుండా ఉండండి. కొందరు గాలిపటం లాగా, ఏ సిద్ధాంతం, సత్యమని 

ఎవరు చెప్పినా అటువైపు మొగ్గుతూ ఉంటారు. గాలి ఎటు కొడితే అటు వారు కూడా కొట్టుకుపోతారు. వీరు 

ఊసరవెల్లి లాగా పరిస్థితిని బట్టి, చుట్టూ ఉన్న మనుషుల హావ భావాలను బట్టి వారి అభిప్రాయాలు 

మార్చుకుంటూ ఉంటారు. ఇక్కడ పౌలు బోధించే సత్యము అది కాదు. “మీరు స్థిరంగా, అటు ఇటు 

కదలకుండా, నిబ్బరంగా ఉండండి అని మనకు హెచ్చరిక!

          ఇక రెండవ హెచ్చరిక “ప్రభువు కార్యభివృధ్ధి యందు ఎప్పటీని ఆసక్తులునై యుండుడి” ప్రస్తుతము యేసు క్రీస్తు ప్రభువునకు మన రెండు కాళ్ళు, చేతులు, మన నోరు అవసరం. ప్రభువు తన లేఖనములను మన చేతులో పెట్టాడు. మన చుట్టూ ఉన్న వారికి మీరు, నేను యేసయ్య చేతులలాగా, కాళ్లలాగా, నోటిలాగా, మనము ఉండాలి. లేఖనమేమి సెలవిస్తున్నది? ఎల్లప్పుడ్ ప్రభువు కార్యపు అభివృధ్ధి విషయం మనలో ఆసక్తి ఉండాలి. ప్రభువు పరలోకానికి ఎక్కి వెళ్తూ ఏమని ఆజ్ఞ మనకిచ్చారో గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది. 19. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగాచేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు 20. నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను”  సమస్త సృష్టి మీద సర్వాధికారము కలిగిన ప్రభువు ఇచ్చిన మెగా ఆజ్ఞ, గొప్ప ఆజ్ఞ ఇది. ఆయనకు సర్వాధికారము ఉన్నదని మనము నమ్మినపుడు అది మన మీద కూడా ఉన్నదని అర్ధం. మన జీవితాల మీద యేసయ్యకు సర్వాధి కారమున్నది. అంత మాత్రాన మనమడిగినవన్ని ఇస్తాడని అనుకోవద్దు. ఆయనకిష్టమైన జీవితం, విధేయత ప్రవర్తన, మనలో ఉన్నట్లయితే ఆయన చిత్త ప్రకారం మంచివైన వాటిని ఇస్తాడు. కాని, దానికంటేకూడా, నిజమైన దేవుని బిడ్డలకు ఆయన రాజ్యమును గూర్చిన చింత ఉంటుంది. ఎక్కడికో దూరం వెళ్లవలసిన అగత్యత లేదు. మీ చుట్టే, మీ కుటుంబములోనే, మీ బంధువులు స్నేహితులలోనే, మీరు దేవుని సత్యమునకు బలమైన సాక్షిగా ఉండాలని ఆసక్తి కలిగిఉండాలి. మీరు ఏది నమ్ముతున్నారో, అది జీవిస్తున్నట్లయితే మీ జీవితమే ఒక సాక్షిగా ఉంటుంది. ఒక్క నోటి మాట చెప్పకపోయినా, సువార్త చెప్పకనే చెప్పినట్టు. ఈ సందర్భములో సత్యము కోసం స్థిరంగా, కదలకుండా నిశ్చలంగా నిలబడాలనే హెచ్చరిక ఇప్పటికే చెప్పుకున్నాము కదా! యేసయ్యకు మత క్రైస్తవులు అవసరం లేదు, ఆయనను వెంబడించే శిష్యులు కావాలి. ప్రభువు శిష్యులు సమస్తమును విడిచి పెట్టి వెంబడించారు. ఆయన వెంటే ఉన్నారు. ఆయనను చూస్తూ ఆయనలాగే జీవించారు. అప్పుడు ప్రభువు వారికి తన అధికారమిచ్చి గ్రామాల్లోనికి పంపాడు. దయ్యాలు వారు ఉచ్చరించి నమ్మి, వెంబడిoచిన ప్రభువు పేరుతోటే, దయ్యాలు విడిచిపారిపోయాయి. మహా అద్భుత క్రియలు జరిగాయి. కారణం? ప్రభువు నామం, ఆయన అధికారం! రోజుల్లో చాలామంది ఊరికే బైబిల్ చేత పట్టుకున్న ప్రతి ఒక్కరికీ, అడిగినప్రతి ఒక్కరికీ ఇస్తూ బాప్తిస్మాలు ఉన్నారు. ప్రభువే స్వయంగా ఇచ్చిన శిష్యరికపు షరతులు బాప్తిస్మాలు అడిగేవారు నెరవేర్చే  వరకు ఆగండి. వారి విశ్వాసమును ప్రభువే పరీక్షిస్తాడు. విత్తువాని ఉపమానములో మనము గ్రహించేది ఆదేకదా! శ్రమలు, పరీక్షలు, నిందలు, వారు ఎదుర్కునే పరిస్థితుల్లో వారి విశ్వాసము పరీక్ష బడుతుంది. పరీక్షల్లో వాళ్ళు నెగ్గేవరకు ఆగండి. వారి కొరకు ప్రార్థన చేయండి, వారితో కలిసి ప్రార్థన చేసి మీ జీవితములో ప్రభువు ఏవిధంగా మిమ్మల్ని బలపరిచాడో వారితో పంచుకోండి. వారి విశ్వాసమును బలపరచండి. తరువాతనే బాప్తిస్మము గురించి ఆలోచించండి.

         ఇక చివరిది చాలా ప్రాముఖ్యమైన విషయం, మన ప్రయాస ప్రభువునందు ఉన్నoతవరకు వ్యర్ధం 

కాదు. “ప్రభువునందు” అన్న మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రభువు నందు మనము ఉన్నామని అపో. పౌలు 

ఎఫెసీ పత్రికలో అతిస్పష్టంగా బోధించారు. 2:7 గమనించండి. “క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడా లేపి, 

పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను ఈ మాటలు భూత కాలములో అనగా జరిగినట్టి భాషలో ఉండడం 

గమనార్హం.  ఇది మన స్థాయి, స్థితి, గతి. మీరు, నేను పడుతున్న ప్రయసం, అది శ్రమకాని, హింస కాని, నింద, 

అపనిందలు కాని, వెలివేత, త్రోసివేతలు కాని, ఇంకా ఏదైనా సరే, ఇవన్నీ ప్రభువు నందు భరిస్తున్నవని, వాటి భారము,  

నొప్పి, అవమానము, అన్నింటినీ ప్రభువు నీతో ఉండి, ఆయనకూడ భరిస్తున్నాడని గుర్తుoచుకోండి. ఆ విధంగా 

శ్రమపడుతున్న క్రొత్త విశ్వాసులు, లేదా సత్యమును అన్వేషిస్తున్న వారు మీతో ఉంటే వారిని ఆదరించి, 

పరామర్శించండి. యేసయ్య పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీ ఫలము పోనప్పుడు మీరు చేస్తున్న దేనికీ ఫలము 

పోగొట్టుకోరు. మీరు మీ కుటుంబములో, సమాజములో, బంధువులలో, ఎదుర్కుంటున్న శ్రమలకు ఫలితం తప్పక 

ఉంటుంది. మత్తయి సువార్త 25:21 గమనించండి. అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ 

కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో  

పాలుపొందుమని అతనితో చెప్పెను.”  యేసయ్య హీరోలను ఎన్నుకోడు, నమ్మకమైనవారిని 

బహుమానములిచ్చేటపుడు ఎన్నుకుంటాడు. హీరోలు ఉండవచ్చు, కాని విశ్వాసములో, కోపావేశాల్లో కాదు, 

జగడాలు, కొట్లాటలు ఈలాటి వాటిలో హీరోలను కాదు. ఆయన యెదుట దీనమనసుతో, సహనముతో ఓపికతో ఆయన 

సమయం, ఆయన, విధానం, ఆయన శక్తి కోసం ఎదురుచూచేవారు ఆయన సహాయం తప్పక పొందుతారు, అంత్య 

దినాన బహుమానము తప్పనిసరిగా పొందుతారు. పేతురు, ప్రభువు శిష్యుడు ప్రభువును అడిగిన ప్రశ్నకు ఏమి 

సమాధానం చెప్పారో జ్ఞాపకం తెచ్చుకోండి. “అందుకు యేసు ఇట్లనెను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును 

ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు 

ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను 

భూములను, రాబోవు లోకమందు నిత్య జీవమును పొందు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి వారు 

అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటి వారగుదురు అనెను.” మార్కు సువార్త 10:30 యేసు రక్షకుడు 

ఇచ్చే బహుమానము కోరుకుంటారా? లేదా ప్రభువు పరలోకమునుండి వెలివేయడము కోరుకుంటారా? ఇది మీ 

నిర్ణయము మీద ఆధారపడి ఉంటుంది. ప్రార్థన: 

       

 

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...