I కోరింథీ-62 15:9-11
సువార్తకున్నప్రేరణ ప్రభువు పునరుధ్ధానము
యేసు క్రీస్తు మహిమగల నామములో మీలో ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి శుభములు! II దిన. 16:9
చదువుకుందాము. “తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట
సంచారము చేయుచున్నది;” ఇప్పుడు, ఈ సమయములో దేవుని కనుదృష్టి మీ దగార సంచారము చేస్తున్నది.
మీరున్నది ఎంత చిన్న మారుమూల గ్రామమైనా, మీ చుట్టూ పట్ల ఒక్క నిజమైన విశ్వాసి లేకపోయినా, మీరు
యధార్ధమైన పరిపూర్ణమైన శ్రథ్ధతో విశ్వాసముతో, ప్రభువును నిజముగా వెంబడించాలనే మనసుతో మీరు
ఉన్నట్లయితే ప్రభువు కనుదృష్టి మీమీద ఉంటుంది. గమనించండి, మీ హృదయము ఆయనకు బాగా తెలుసు. ప్రార్థన:
ఈ నాటి లేఖన భాగము:
“9 ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను.
10. అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.
11. నేనైననేమి వారైననేమి, ఆలాగుననే మేము ప్రకటించుచున్నాము, ఆలాగుననే మీరును విశ్వసించితిరి.”
పౌలు తనకు తాను అపోస్తలులందరిలో తక్కువవాడుగా ఎంచుకుంటున్నాడు. తాను చిట్ట చివరివాడని
భావించుకుంటున్నాడు. ఆయన సంఘమును హింసించిన వాడు, శ్రమపెట్టినవాడు. ఒకప్పుడు హింసించడమే తన
ఊపిరి అన్నoతగా యేసు క్రీస్తును ద్వేషించినవాడు. ప్రభువు శిష్యులను హింసించాలని పట్టుపట్టినవాడు. కాని ప్రభువు
కృపనుబట్టి, ఇప్పుడు ఏ రీతిగా రూపాంతరం చెందాడో అంతగా ప్రభువు కృపనుబట్టి రూపాంతరం చెందాడు. అవును,
సోదరుడా, సోదరీ, ప్రభువు కృప చేత రూపాంతరం చెందుతున్నట్లయితే, మనలో ప్రతి ఒక్కరము ఆయనకు
ఇష్టులముగా ఉంటాము. ప్రభువు దృష్టిలో యధార్ధవంతులమైతే ఆయన కృప పొంది ఆయన దీవెన
పొందగలుగుతాము. ప్రతి దినము కొంచమైనా, మార్పు చెందకపోతే ఒక వ్యక్తి నిజముగా ప్రభువును ఎరిగిన వ్యక్తియా
కదా అనే ప్రశ్న కలుగుతుంది. పౌలులో ఎంతటి తగ్గింపు, దీనత్వము కనిపోస్తున్నదో చూస్తున్నాము కదా! మనమెంత
తగ్గించుకోవాలో పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు.
పౌలు లాగా మనమంతా ఉన్నదున్నట్టు ఒప్పుకుంటే ఎంతో మంచిది. ఈ విషయమే పదే పదే హెచ్చరిస్తూ
ఉన్నాము. యధార్ధముగా మన స్థితిని, మన గతము, మన వర్తమానమును ఒప్పుకుంటే అది నిజమైన దీనత్వము.
పౌలు యధార్ధముగా నేను సంఘమును హింసించిన వాడను, శ్రమ పెట్టిన వాడను, అని ఒప్పౌకుంటున్నాడు. అది
తన గతమైనప్పటికి దాచుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నించడం లేదు, గమనించారా, శ్రోతలూ? పేతురు నేను
ప్రభువును ముమ్మారు బొంకాను అని చెప్పవచ్చు. యోహాను నేను పారిపోయాను అని చెప్పవచ్చు. పౌలు
మారుమనసు ఆయనకు ప్రేరణను ఇచ్చింది. యేసు క్రీస్తు ప్రభువు ఆయనను కలుసుకున్నపటి నుండి ఆయన
మార్పు చెందుతూనే ఉన్నాడు. మారు మనసు అంటే ఇదే! ఆయనకున్న ప్రేరణ అదే! అందరికన్న తానే ఎక్కువ
ప్రయాస పడ్డానని చెబుతున్నాడు కదా! ఏమిటది? తెలుసుకుందాం. II కొరింథీ 11:22-27 వచనములు జాగ్రతగా
గమనిద్దాము.
“వారు హెబ్రీయులా? నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయులా? నేనును ఇశ్రాయేలీయుడనే. వారు
అబ్రాహాము సంతానమా? నేనును అట్టివాడనే. 23. వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడు చున్నాను,
నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు
చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని.
24. యూదులచేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని;
25. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక
రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని.
26. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను,
నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో
ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరులవలని ఆపదలలోను ఉంటిని
27. ప్రయాస తోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలి తోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్ప వలసినవి అనేకములున్నవి.
అవును, పౌలు వారందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాడు. అపోస్తలులలో ఒక్క యోహాను తప్ప అందరు
హతసాక్షులయ్యారు, వారి ప్రాణాలను సువార్త కోసం ఇచ్చారు. పౌలు కూడా హతసాక్షిగా తన ప్రాణమును సువార్త
కోసం ఇచ్చాడు.
గమనించండి, మనము ఎవరు అనేది ముఖ్యము కాదు. ఏమి చేశాము అనేది ముఖ్యము. వారైనా, నేనైనా,
అందరమూ సువార్తను ప్రకటించాము, మీరు నమ్మారు, అని తన దీనమనసును అపో. చూపిస్తున్నాడు. అప్పుడైనా,
ఇప్పుడైనా, మన ప్రేరణ సువార్త మాత్రమే. బోధించవలసినది సువార్త. ఎందుకంటే సువార్త ద్వారా మాత్రమే మన
పాపములకు క్షమాపణ దొరుకుతుంది. సర్వశక్తుడైన దేవుడు యేసు క్రీస్తు ప్రభువు పునరుధ్ధానము ద్వారా అది చేస్తూ
ఉన్నాడు.
ఈ ప్రేరణను ఈనాడు ప్రతి సంఘము గ్రహించాలి. మరే తరము చేయలేనంతగా మనము ఈ తరములో మన
తెలుగు వారందరికి యేసు క్రీస్తు ప్రభువు రక్షణ సువార్తను అందించవచ్చు. కాని మన వ్యక్తిగత ఇష్టాలు మనలను అలా
చేయకుండా అడ్డగిస్తున్నవి. అవే మన సమయమంతటినీ తీసుకుంటున్నవి. మన ప్రభువు చెప్పిన తలాంతుల
ఉపమానములో ఉన్న ఒక్క తలాంతు గల వానిలాగా మానమున్నమేమో! అంత విలువైన తలాంతు తన వద్ద
ఉన్నప్పటికి, దాన్ని వాడుకోకుండా, భూమిలో పూడ్చి పెట్టినట్టే, మనము కూడా చేస్తున్నాము. మీకు ఏది
ప్రేరణనిస్తుంది? సువార్త నీకు ప్రేరణ నిస్తుందా? యేసు క్రీస్తు ప్రభువు సజీవుడై తిరిగి లేచిన రక్షకుడు. ఈ సత్యమును
మన ప్రక్కనున్న ప్రతి ఒక్కరితో పంచుకుందాం!
యేసు క్రీస్తు ప్రభువు పునరుధ్ధానo సువార్తకు పునాదిరాయి. ప్రభువు రక్షించే ప్రక్రియకు ఇది ఆధారం.
యేసు క్రీస్తు ప్రభువు పునరుధ్ధానము సువార్తను స్థిరపరచి నిర్ధారణ చేస్తుంది. యేసు క్రీస్తు ఒక్కడే పాపములను
క్షమించగల అధికారముగాల రక్షకుడని చెప్పడానికి ప్రభువు పునరుధ్ధానము చారిత్రక రుజువు.
సువార్తకు ప్రేరణ నిచ్చేది యేసు క్రీస్తు ప్రభువు పునరుధ్ధానము. నశించి పోతున్న ఈ లోకానికి మరణపు కోరల్లో ఉన్న
ఈ లోకాన్ని రక్షించే ఏకైక వార్త సువార్త, ప్రభువు పునరుధ్ధానము.
ప్రియ సోదరీ, సోదరుడా, మీరు యేసు క్రీస్తు ప్రభువు పునరుధ్ధాన శక్తిని రుచి చూశారా? ఆయన మీలో
సజీవుడుగా జీవిస్తున్నాడా? అయితే, ఈ సందేశమును దాచవద్దు. ప్రకటించండి, పంచుకోండి. ప్రార్థన: Pప్రభువు మీకు
ప్రేరణనిచ్చిన రీతిగా మీ స్వంత మాటలలో ప్రార్ధన చేసుకొనండి.
> II Cor-15 2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...
No comments:
Post a Comment