I కోరింథీ-51 14:4-6
ప్రేమ అనే మాట మన నోటినుండి బయటికి రాగానే, ఎవరికి తోచిన రీతిగా వారు అర్ధం చేసుకుంటారు. ఆ
మాటకొస్తే ఏ మాటనైనా అలాగే అనుకోండి, కాని ప్రేమ అని మాటకు చాలా ఎక్కువ. I కొరింథీ 13వ అధ్యాయము
నిదానంగా జాగ్రతగా చదవండి. నిజమైన ప్రేమ లోకములో ఎక్కడా దొరకదు అని చెప్పడం అతిశయోక్తి కాదేమో! కాని
నా అనుభవములో నేను నిజమిన ప్రేమైన ప్రేమను ఒక్క చోట చూశాను. అదే నా రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువు నా
కోసం సిలువమీద మరణించిన చారిత్రక సంఘటన. మీరు నాతో బాటు “అమెన్” అని చెప్పగలరా? అయితే నాతోబాటు
మీరు కూడా బిగ్గరగా మీరున్నచోటనే “అమెన్” అని చెప్పండి. హల్లెలూయ! ఆయనకే అత్యంత మహిమ ఘనత, స్తోత్రం
నిరంతరం కలుగుగాక! అమెన్!! ప్రార్థన:
I కొరింథీ 14: 4-6 చదువుకుందాం, గమనిస్తున్నారా? మీకు వీలయ్యే పరిస్థితిలో మీరు ఉన్నట్లయితే మీరు కూడా చదవoడి:
“4. భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసికొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును.
5. మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందునిమిత్తము భాషలతో మాట లాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు. 6. సహోదరులారా, ఆలోచించుడి; భాషలతో మాటలాడుచు నేను మీయొద్దకు వచ్చి సత్యమును బయలు పరచవలెననియైనను జ్ఞానోపదేశము చేయ వలెనని యైనను ప్రవచింపవలెననియైనను బోధింపవలెనని యైనను మీతో మాటలాడకపోయిన యెడల, నావలన మీకు ప్రయోజనమేమి?”
ఈనాటి ధ్యానాంశం: ప్రవచించడానికి, లేదా బోధించడానికి అవసరమైనషరతులు:
ప్రవచించడానికి ఉండవలసిన పరిస్థితులుల గూర్చి మనమంతా ఆలోచిస్తూ ఉండగానే ఆపో. పౌలు దేవుని
సంఘముతో మాట్లాడడం మనము గమనిస్తూ ఉన్నాము. సమావేశమయ్యింది దేవుని పరిశుద్ధ సంఘం. యేసు క్రీస్తు
శరీరం. వెంటనే మనమిక్కడ గమనించి గ్రహించే విషయం ఏమిటంటే,సంఘమునకు క్షేమము, అభివృధ్ధి, సవరణ,
సంఘములో ఉండే సహోదర సహోదరీలకు ఈ మూడు మెళ్ళు కలగడానికి ప్రవచనం లేక లేఖనములబోధ అవసరం.
సవరణ, అభివృద్ధి, క్షేమము అనే మాటలలో కట్టుకోవడం, అనే భావనా ఇమిడి ఉంటుందని ఇప్పటికే తెలుసుకున్నాం
కదా! లేఖనముల బోధకున్న గురి, ఉద్దేశ్యం ఏమిటంటే, సంఘము సామూహికంగా, లేదా సంఘములో అందరూ ప్రతి
ఒక్కరూ, కలిసి ఉన్నందుచేత, అందరికి మేలుకరముగా ఉండాలి. ఒక్కరికి కాదు. అందరికి మేలు, సవరణ, అభివృద్ధి,
క్షేమము కలగాలి.
పౌలు ఇంకా ముందుకు సాగి పోతూ బోధిస్తున్నది ఏమిటి? లేఖనముల బోధ భాషలకoటే ప్రాముఖ్యమైనది.
5వ వచనం గమనించాలి: “5. మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు ప్రవచింపవలెనని మరి
విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందునిమిత్తము భాషలతో మాట లాడువాడు అర్థము
చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు.” “కంటే” అనే మాటను “మరి విశేషముగా” అన్న మాటలను
గమనించారా? ఒకదానికంటే మరొకటి శ్రేష్ఠమైనది అని పౌలు బోధ. 6వ వచనమును జాగ్రత్తగా గ్రహించండి. కొరింథీ
సంఘములోని విశ్వాసులను కాస్త ఆలోచించమని బుజ్జగించడం చూశారా? “భాషలతో మాటలాడుచు నేను
మీయొద్దకు వచ్చి సత్యమును బయలు పరచవలెననియైనను జ్ఞానోపదేశము చేయవలెనని యైనను
ప్రవచింపవలెననియైనను బోధింపవలెనని యైనను మీతో మాటలాడకపోయిన యెడల, నావలన మీకు
ప్రయోజనమేమి?” ఇక్కడ 4 అంశములు దాగి ఉన్నాయి: సత్యమును బయలు పరచడం, జ్ఞోనోపదేశం, ప్రవచించడం,
బోధన, నాలుగు అంశాలు ఉన్నాయి.
సత్యమును బయలు పరచడమంటే, తెలియని క్రొత్త విషయమును తెలియచెప్పడం. జ్ఞోనోపదేశమంటే, ఎలా
నడుచుకోవాలో, ఏది సరియైన విధానమో, పద్ధతో సూచించడం, ఆదేశించడం. ప్రవచనమంటే, ఇప్పటికే చాలా
తెలుసుకున్నాం, లేఖనములను బోధించి గ్రహింపు కలిగేలా చేయడం. బోధన అంటే, ఇక్కడ అర్ధం సిద్ధాంతం. ఇంగ్లిష్
లో “doctrine” అనే మాట ఉన్నది. ఈ నాలుగు క్రియలు యెసు క్రీస్తు ప్రభువునకు చెందిన సంఘములోని
విశ్వాసులను, వారి క్రైస్తవ జీవితములో క్రీస్తుతో వారి నడకలో సరిదిద్ది, సవరించి, బాగుచేసి, కట్టి, బలోపేతం చేస్తాయి.
ఒక ప్రసిద్ధమైన బోధకుని మాటలు గమనించండి: “మనకు తెలియని భాషలో మాట్లాడడం చూడ్డానికి, వినడానికి,
కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది, గాని, లేఖన బోధ లేదా ప్రవచనం అని పిలువబడుతున్న దేవుని వాక్యబోధన
సులభశైలిలో ఉండి, అదే మొదటి దానికంటే విలువైనదిగా ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ అంతే! భాషల్లో మాట్లాడ్డం
అద్భుతంగా అనిపించవచ్చు, ఘనతనివ్వవచ్చు, గొప్పదనమునుకలిగించవచ్చు, కాని అది చేసే వ్యక్తికంటే దీనంగా
దేవుని లేఖనములను బోధించే వ్యక్తికి ఎక్కువ విలువ ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరికి తెలియని ఓ మూలకున్న వ్యక్తి
కావచ్చు, కాని ఒక చిన్న మారుమూల గ్రామములో దేవుని పరిశుద్ధ లేఖనములను భారముతో, వేదనతో,
ప్రభువుపట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో బోధించే వ్యక్తి అందరికి ఉపయోగకరంగా, దేవునికి మహిమకరముగా ఉంటాడు. ఆ
వ్యక్తి నీవే అయిఉండవచ్చు.
దేవుని పరిశుద్ధ గ్రంధం బైబిల్ స్పష్టంగా, నిర్మొహమాటంగా, నిర్దిష్టంగా సెలెవిస్తున్నదేమిటి? ప్రవచనం అని
పిలువబడుతున్న ఈ పరిచర్య, లేఖనముల బోధన జీవము గల దేవుని సంఘములో జరగాలని దేవుని ఉద్దేశ్యం.
సంఘములోని విశ్వాసనులందరూ చేరి ఉన్నపుడు, అటువంటి సంఘములోని నిరుపేదలైన విశ్వాసులైనా, వారి
విశ్వాసము వృద్ధి చేయడానికి, వారిని సరిదిద్దడానికి, సవరించడానికి వాక్య బోధన అవసరం. అది మీరు చేస్తున్నారా?
దేవుని లేఖనములను సంఘములోని ప్రతి ఒక్కరికి క్షేమము, విశ్వాసములో వృద్ధి కలిగించడానికి దేవుని పరిశుద్ధ
లేఖనములలోనుండి, పరిశుద్ధాత్మ శక్తి, నడిపింపుతో, దేవుని చిత్త ప్రకారము ఆయనను సేవించే వారి జాబితాలో
మీరు ఉన్నారా? సంఘ కాపరి, పాస్టర్ అయినా, సంఘ పెద్ద అయినా, సర్వశక్తి గల దేవుడు మీకు అప్పగించిన
పరిచర్యను, మీరున్న చోటనే మిమ్ములను ప్రభువు చూస్తున్నాడని విశ్వసించి, నమ్మి, భయంతో వణకుతూ, జాగ్రత్తగా
లేఖనములను బోధించే వారంటే దేవునికి ఎంతో ప్రియమైన వారు. అటువంటి వారి కోసం ప్రార్థిస్తున్నాము. మీరు
ఎక్కడ, ఏ ప్రాంతములో ఎలాంటి పరిచర్య చేస్తున్నది, ప్రార్థన అవసరతలు, మాకు ఉత్తరం రాస్తూ తెలియచేస్తే, మీ
కోసం, ప్రార్థన విజ్ఞాపన చేస్తాము. ఆర్ధిక అవసరాలు తీర్చే వారము మేము కాదు, ఈ విషయం గ్రహించి, గమనించాలని
మనవి చేస్తున్నాను. ఆర్ధిక అవసరాలు తీర్చే వాడు మిమ్ములను పిలిచిన దేవుడే, మిమ్మలను చూస్తున్న పరిశుద్ధుడే!
విశ్వాసముతో ప్రభువుమీద ఆధారపడిన ప్రతి ఒక్కరిని ప్రభువు విడిచిపెట్టడు. ఆయనే ఏ విధoగానైనా, అలాంటి వారి
అవసరతలు సర్వశక్తిగల నా దేవుడు తప్పక తీరుస్తాడని నేను నా స్వానుభవముతో చెప్పగలను. ఫిలిప్పీ 4:19 రుచి
చూసే కృప ప్రభువు నాకనుగ్రహించాడని సాక్ష్యమివ్వగలను. మీకు ఆత్మీయ జీవితములో, మీ విశ్వాస జీవితంలో
మీకు అండగా ఉండి, మిమ్ములను బలపరచి, ప్రభువువైపు మీరు మళ్లడానికి మీకు ఆత్మీయ సహాయం మాత్రమే
చేయగలము. మీ కోసం ముఖ్యంగా ప్రార్థన విజ్ఞాపన చేయగలం. ప్రార్థన:
> II Cor-15 2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...
No comments:
Post a Comment