"క్రొత్త సంవత్సరమా? క్రొత్త హృదయమా?? క్రొత్త స్వభావమా???"

2023 నూతన సంవత్సర సందేశం

క్రొత్త సంవత్సరమా? క్రొత్త హృదయమా?? క్రొత్త స్వభావమా???

         సజీవ నిరీక్షణ శ్రోతలందరికీ న్యూ ఇయర్ శుభములు! సర్వ శక్తిమంతుడు అయిన మన 

దేవుడు, మనలో ప్రతి  ఒక్కరినీ 2023 అంతటిలో కీడు నుండి, దుష్టునినుండి, శోధననుండి నిత్య 

నరకమునుండి తప్పించాలనేదే మా ప్రార్థన! మనకందరికీ శాంతి సమాధానము, నెమ్మది, 

నిరీక్షణ యేసు క్రీస్తు ప్రభువు ద్వారా అనుగ్రహించుగాక! 

ప్రార్దించుకుందాం. ప్రార్థన:  

         దేవుడు సృష్టికర్త. మన కంటికి కనిపించే సమస్తమును మహా విశాలమైన ఆకాశ మహాకాశ 

ములనుఅంతరిక్షమును, అందులోని జ్యోతులను, నక్షత్ర సముదాయాలను సమస్తమును 

శూన్యములో నుండి తన మాట చేతచేత సృష్టించాడు. హెబ్రీ 11:3లో లేఖనం ఈ విషయమును 

స్పష్టపరుస్తుంది. ప్రపంచములు దేవుని వాక్యమువలన నిర్మాణమైనవనియు

అందునుబట్టి దృశ్యమైనది కనబడెడు పదార్ధములచే నిర్మింప బడలేదనియు 

విశ్వాసముచేత గ్రహించుకొనుచున్నాము.”  గమనించారా, శ్రోతలూ? ఏ రకమైన పదార్ధము 

లేకుండా కేవలం తన నోటి మాటచేత లేనివాటిని ఉన్నట్టుగా కలుగచేసిన దేవునికి స్తోత్రం! 

హల్లెలూయ! బైబిల్ గ్రంధంలో మనకు తారసపడుతున్న దేవుడు మహా సృష్టికర్త. దేవుని 

సృష్టిలోనుండి క్రొత్తవి పుడుతూనే ఉన్నాయి. ఒక చెట్టు ఎండిపోతుంది, దాని విత్తనాల్లోనుండి 

మరెన్నో చెట్లు మొలకెత్తి పెరుగుతూ ఉంటాయి. ఒక క్రొత్త మొలకను చూసినపుడు, అప్పుడే 

జన్మించిన శిశువును చూచినపుడు, మీరు సంతోషించి సృష్టికర్త అయిన దేవుణ్ణి స్తుతిస్తారా? 

లేనట్లయితే, ఇప్పుడే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి! ఆ మొట్ట మొదటి పాపరహితమైన 

భూమ్మీద ఆదాముతో మీరున్నట్లయితే మీకు అంతా క్రొత్తగా ఉండేది! ఏ చెట్టు అయిన, ఏ కొండ 

అయిన, ఏ జంతువైనా, ఏ వస్తువైనా, అంతా, అన్నీ క్రొతవే! దేవునికీ క్రొత్తదనానికి చాలా దగ్గరి 

సంబంధం ఉంది. క్రొత్తదనం దేవునిచేతనే జన్మించింది. క్రొత్తవన్నీ దేవుని శక్తి చేతనే సాధ్యం! 

మొదటి దేవుడు సృష్టించిన సృష్టిలోనుండి ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ప్రతి ప్రతిసృష్టి 

వచ్చింది. అందుచేత ప్రతి క్రొత్తది దేవునినుండి వచ్చిందని చెప్పక తప్పదు. అది చెప్పడానికి 

నేనెంతో సంతోషిస్తున్నాను. మీరు కూడానా?

 

      ఆది మానవుడు ఆదాము దేవుని మాటను అనుమానించి, అవమానించి, సైతాను మాటను విని, 

దాన్ని అనుసరించి, చెప్పలేనంత ఘోరమైన పాపము చేశాడు. “పాపము వలన వచ్చే జీతము  

మరణమని” రోమా 6:23 తేటగా బోధిస్తున్నది. పాపము శాపమునకు, మరణమునకు, నాశనమునకు 

మార్గము తెరిచింది. పతనం ఆరంభమయ్యింది. అప్పుడే, పాపమువల్ల అత్యంత ఘోరమైన 

వినాశనం కలిగినప్పుడే, దేవుడు రక్షకుణ్ణి పంపిస్తానని విమోచిస్తానని వాగ్దానము ఆది. 3:15లో 

చేశాడు. ఆ తరువాత దేవుడు అబ్రహాము ద్వారా, ఒక ప్రత్యేకమైన జనమునుతనకోసం 

ఎన్నుకొనివారిద్వారా రక్షణను విమోచనను కలిగించాలని ఆశపడ్డాడు. కానీ వారు, వారి రాజులు, 

ప్రజలు అందరూ పనికి మాలినవారయ్యారు, దేవుని ప్రణాళికను నెరవేర్చలేదు. అవిధేయతలో 

మునిగి తేలారు. ప్రవచనo  తరువాత ప్రవచనం, ప్రవక్త తరువాత ప్రవక్తను దేవుడు తన మాటతో 

పంపించి తన వైపు మళ్లాలని, ఆయన ధర్మ శాస్త్రము ప్రకారం జీవించి, ఆయన కృప పొందాలని 

పదే పదే హెచ్చరించాడు. కానీ ఏ ప్రయోజనము లేదు. ఒకానొక సమయములో ఇశ్రాయేలీయులు 

చెరగొనిపోబడ్డారు. దేవుని మందిరం నేల మట్టం చేయబడింది. దాదాపు యూద ప్రజలు 

నశించిపోయినట్టే, కానీ దేవుడు ఒక శేషమును మిగిల్చి వారిని తిరిగి వారి స్వదేశానికి, అనగా 

ఇశ్రాయేలీయుల దేశానికి, ఎజ్రా నెహేమ్యాల నాయకత్వములో  తీసుకువచ్చాడు. 400 ఏళ్ల 

మౌనము తరువాత తిరిగి దేవుడు తన మహా కృపను చూపించాడు. దేవుడు తన ఏకైక కుమారుడు 

యేసు క్రీస్తు ప్రభువును రక్షకునిగా, విమోచకునిగాదేవుని గొర్రెపిల్లగా పంపించాడు. ప్రభువు 

మార్గమును సిద్ధపరచడానికి బాప్తిస్మమిచ్చే యోహాను అనే బలమైన ప్రవక్తను పంపాడు. 

యేసయ్య రెండవ ఆదాముగా, మరణమును లోకమును, సైతానును, పాపమును జయించిన 

పరమ రక్షకుడుగా పరలోకమునుండి వచ్చి, తండ్రి చిత్తమంతటినీ భూమి మీద నెరవేర్చి 

అత్యంత కిరాతకమైన సిలువ మ్రాను మీద మన పాపపు శిక్షను, శాపమును భరించి, పాపమునకు 

పరిహారము చేశాడు. ఆయనే యేసు క్రీస్తు ప్రభువు,  దేవుని గొర్రెపిల్ల. ఆయన అదియందున్న 

సృష్టికర్త మాత్రమే కాదు, మొదటి ఆదాము వల్ల మనకు సంక్రమించిన పాపము నుండి “రెండవ 

ఆదాము”గా క్రొత్త జనమును ఈ లోకములో సృష్టిస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభువును పరిశుద్ధ 

గ్రంధం “రెండవ ఆదాము” అని పిలుస్తుంది. ఆయన ద్వారా క్రొత్త జనము, క్రొత్త తరము, క్రొత్త 

జీవితము, క్రొత్త హృదయము సృష్టించబడుతుంది. II కోరింథీ 5:17లో పరిశుద్ధ గ్రంధం బైబిల్ 

ఏమని బోధిస్తున్నది? “కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;” యేసుక్రీస్తునందు ఉండాలి, 

అప్పుడు నూతన సృష్టిగా మార్చబడతాము. పాతవి అన్ని గతించి పోతాయి. అవన్నీ క్రొత్తవిగా మారతాయి.

 

            క్రొత్త సంవత్సరము ఆరంభించినంత మాత్రాన అన్ని క్రొత్తవి కావు. ఒక రోజో లేదా కొన్ని గంటల పాటు 

క్షణికమైన సంతోషంతో గడపవచ్చు. కానీ సంవత్సరమంతా క్రొత్తగా జీవిస్తామా? అది యేసు క్రీస్తు నందు ఉంటేనే 

సాధ్యం. ఇది మాటలతో వర్ణించే విషయం కాదు. పరిశుద్ధాత్ముడు చేసే మహాగొప్ప క్రియ. శరీరానికి 

సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించినది. యోహాను సువార్త 3వ అధ్యాయములో యేసు 

క్రీస్తు ప్రభువు నికోదేముతో చెప్పిన మాటలు శ్రద్ధగా అలకించండి: 3వ వచనం. “అందుకు యేసు 

అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో 

నిశ్చయముగా చెప్పుచున్నాననెను.” నికోదేము అనే ఈ మత నాయకుడు యేసు క్రీస్తును అడిగిన 

ప్రశ్న 4వ వచనములో ఉంది.  అందుకు నికోదేము ముసలి వాడైన మనుష్యుడేలాగు 

జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్బమందు ప్రవేశించి జన్మింపగలడా అని 

ఆయనను అడుగగా యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలము గాను 

జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర 

మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది. 

మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తన కిష్టమైన 

చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో 

నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను. ఎన్ని న్యూ 

 ఇయర్లు గతించి పోయినా, హృదయం, జీవితం క్రొత్తగా కాకపోతే అంతా వ్యర్ధమే. కానీ యేసు క్రీస్తు 

రక్తము చేత శుద్ధి చేయబడి, ఆయనతో నీవు నిబంధన చేసుకొని, క్రొత్తగా జన్మించినట్లయితే న్యూ 

ఇయర్ రోజునేకాదు, 2023 అంతటిలోనూ, ఇంకా రానున్న అన్ని సంవత్సరాల్లోనూ, క్రొత్త జీవితమే! 

ఇది కేవలము విశ్వాసము చేత జరిగే ప్రక్రియ. ఆత్మలో జరిగే అద్భుతం! కానీ నీవు దానికి సిద్ధంగా 

ఉండాలి. నీ హృదయం తెరవడానికి నీవు సిద్ధంగా ఉండాలి. అప్పుడే ఆయన సమస్తమును 

క్రొత్తవిగా చేయ శక్తిమంతుడు. కోట్లాది మందికి క్రొత్త హృదయమిచ్చాడు, నా కిచ్చాడు, 

నీకు కూడా ఇవ్వగలడు. విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు ప్రభువే మీకు విశ్వాసము 

అనుగ్రహించి, పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని పాపము గూర్చి ఒప్పించుగాక!

         ఈ విధంగా యేసు క్రీస్తు నందున్న వారు క్రొత్త స్వభావముతో జీవిస్తారు. ఆపో. పౌలు కొలస్సీ 

పత్రిక 3వ అధ్యాయములో వివరంగా బోధిoచిన క్రొత్త స్వభావమును క్షుణ్ణంగా అభ్యసించాలి. 5వ 

వచనము నుండి: కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును

అపవిత్రతను, కామాతురతను, దురాశనువిగ్రహారాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి. 

వాటివలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య 

జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు, కోపము

ఆగ్రహము, దుష్టత్వముదూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి. 

ఒకనితో ఒకడు అబద్ధ మాడకుడి;ఏలయనగా  ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడ 

మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున 

నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొని యున్నారు.” యేసు క్రీస్తులో 

ఉన్నవారికి ఈ క్రొత్త స్వభావము కలుగుతుంది. ఇది కూడా పరిశుద్ధాత్ముడు మీతో కలిసి పనిచేసి 

జరిగించే అద్భుతమైన ప్రక్రియ. అంతరంగములో మీ మనసు మారుతూ ఉంటుంది. క్రొత్తదనం 

ఎక్కువవుతూ ఉంటుంది. ఇంకా, ఇంకా, క్రమ క్రమముగా దేవుని ఆత్మ స్వరమునకు విధేయత 

చూపేకొలది క్రొత్త స్వభావము బలపడుతూ ఉంటుంది. ఈ క్రొత్త స్వభావమును యేసు క్రీస్తులో 

ఉన్నవారు ధరించుకున్నారని పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్నది. ఎఫెసీ 4:23 నుండి మీరే 

స్వయంగా చదివి ఆలోచించండి. అది మీరు మనస్ఫూర్తిగా అంగీకరించినపుడే కలుగుతుంది. 

మనము, మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు కలిసి క్రొత్త స్వభావమును ధరించుకుంటూ 

దానిలో  ఆనందిస్తూ  ఉంటాము. ఇది మీ అనుభవమా!

         ప్రియ శ్రోతలూ, క్రొత్త సంవత్సరముతో తృప్తి పడకండి, యేసు క్రీస్తు నామములో కలిగే క్రొత్త 

హృదయం, క్రొత్త జన్మ కోసం ఆరాటపడండి. మీరు ఆ విధంగా క్రీస్తు నందు ఉన్నవారైతే, క్రొత్త 

స్వభావమును సంతరించుకొని అను దినం రూపాంతరము చెందడానికి ముందుకు సాగండి!! 

దీనికి అవసరమైనంత మహా కృప ప్రభువే మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించుగాక!

 

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...