I కొరింథీ అధ్యయనం-32 10:16-22 ~రెండవ భాగం~(2)ప్రభువు బల్ల దగ్గర కలుసుకోవడం


 

I కొరింథీ అధ్యయనం-32   10:16-22

~రెండవ భాగం~ ప్రభువు బల్ల దగ్గర కలుసుకోవడం

గతించిన ఆదివారము, ఈ దినము ప్రభువు బల్లలో పాలుపొందారా? కొందరికిది అలవాటు కావచ్చు, మరికొందరికిది 

ఆచారము కావచ్చు. కొందరు కేవలం బల్లలో మాత్రము పాలు పొంది ఆరాధనలోనుండి వెళ్లిపోతూఉంటారు. మనమెలా 

అర్ధం చేసుకొనేది ముఖ్యం కాదు, ప్రియులారా, దేవుని సజీవమైన లేఖనము ఏమని బోధిస్తున్నది? అది 

ప్రాముఖ్యమైనది. గతించిన పాఠములో ఉదహరించిన మూడు లేఖన భాగములను మీరు చదివారా? ఈ పూట ఈ 

లేఖన  భాగముల ఆధారంగా పౌలు బోధనననుసరించి కొన్ని ధ్యానాంశములను నేర్చుకుందాం. 

         మొదటి ధ్యానాంశము: చొప్పించి చేర్చబడడం. I కోరింథీ 10:16-17 వచనాలు: 16. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు  రక్తములో పాలు పుచ్చుకొను టయేగదా? మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటయేగదా? 17. మన మందరము ఆ యొకటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము; రొట్టె యొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై యున్నాము”  ఇక్కడ కుటుంబమనే భావన మీకు కనిపిస్తుందా? “మనం దీవించు ఆశీర్వచనపు పాత్ర” అనే మాటలు పస్కా పండుగ సమయములో కుటుంబములోని వారందరూ ఒక్క చోట చేరి ఆ భోజనములో పాలు పొందుతారుకదా! నిర్గమ కాండము 12వ అధ్యాయములో మీరు జాగ్రతగా గమనించినట్లయితే, యూదుల సమాజములో కుటుంబపు వారందరూ చేరుతారు. అదివారు సాయంకాలము చేస్తూ ఉంటారు.

         అలాగే ప్రభువు బల్లలో పాలు పొందేటపుడు  క్రీస్తు రక్తము దేవుని కుటుంబములో మనలను ఐక్య పరుస్తుంది. “పాలు పుచ్చుకొనుట” అనగా చాలా దగ్గరి సంబంధం. అనగా దీని ద్వారా క్రీస్తు రక్తములో మనము భాగము పొందుతున్నట్లే! గింజలు అన్ని కలిసి ఒక్క రొట్టెగా ఏర్పడ్డట్టే, మనము యేసు ప్రభువునందు ఒక్కటిగా ఉంటాము. ఆ రొట్టెలో ఎన్నో గింజలు కలిసిపోయినట్టు మనమంతా ప్రభువులో కలిసిపోవాలి.  గింజలు ఒక్క రొట్టెగా మారినట్టే మనము ప్రభువులో ఒక్క శరీరములాగా ఉంటాము. కాబట్టి మన మొదటి ధ్యానంశము చొప్పించబడి, కలిసిఉండి దగ్గర చేర్చబడం. ఒక బల్లవద్ద కుటుంబపు వారందరూ కలిసి భోజనం చేసినట్లే, మనము ప్రభువు బల్లదగ్గర కలిసిపోతాము. ఒక ప్రఖ్యాత బైబిల్ పండితుడు ఏమని దీని విషయం బోధిస్తున్నాడో గమనించండి: గింజలు ఒక్కొక్కటి కలిసిపోయి పిండిగా మార్చబడి, దానినుండి ఒక్క రొట్టెగా చేయబడ్డప్పుడు గింజలు వేరు వేరు కావు గాని ఒక్కటే!

గోధుమ గింజలన్నీ కలిస్తీ కాని ఒక రొట్టె తయారుకాదుకదా! ఆ రొట్టెలో మనమంతా భాగము తీసుకున్నపుడు మనమంతా ఒక్కటిగా ఉంటాము. వేరు వేరు వ్యక్తులమైనా ప్రభువునందు ఒక్క కుటుంబముగా కలిసి ఐకమత్యంగా ఉండాలి. మనము ఒక్క రొట్టెలో భాగము తీసుకుంటున్నాము కాబట్టి మనమంతా ఒక్కటే! ప్రపంచములోని ఏ దేశములో చూసినా కలిసి ప్రభువు బల్లలో పాలుపొందడం ఐక్యతను, స్నేహభావమును సూచిస్తుంది.

         పౌలు బోధనలోని రెండవ ధ్యానాంశం, చొరబడం. 18-20 వచనాలు గమనించండి: 18. శరీరప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించినవాటిని తినువారు బలిపీఠముతో పాలివారుకారా? 19. ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా? 20. లేదు గాని, అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టము లేదు. ఇక్కడ ఆపో. పౌలు బలిపీఠం మీది బల్యర్పణ విషయం కాస్త ధృడంగా మాట్లాడడం గమనిస్తున్నాము. ఈ బలిపీఠం అక్కడ సేవ చేయడానికి నియమించబడ్డ వారికి చెందినది మాత్రమే. ఇశ్రాయేలు చరిత్రలో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. బలిపీఠం వద్ద సేవ చేయడానికి కొందరు మాత్రమే దేవుని చట్టం ద్వారా నియమించబడ్డారు. బలిపీఠం దగ్గర బలి అర్పించడానికి యాజక వంశమైన లేవీ గోత్రానికి చెందిన లేవీయులకు మాత్రమే దేవుడు అధికారమిచ్చాడు. ఇశ్రాయేలీయుల రాజులలో ఒకరాజు, అనగా ఉజ్జీయ బలి అర్పించడానికి పూనుకున్నపుడు, దేవుని కఠినమైన శిక్ష పొందాడు. తన జీవితాంతం కుష్టురోగిగా ఉంది, కడగా అపవిత్రంగా జీవించాడు. II దిన. 26:9. దేవుని పరిశుద్ధ బలిపీఠం దగ్గర లేవీ గోత్రీకులైన లేవీయులు తప్ప మరెవ్వరూ సేవ చేయడానికి వీలు లేదు.

         అలాగే ఇప్పుడు కూడా తిరుగుబాటు, వ్యతిరేకత చూపడానికి అనుమతి లేదు. విగ్రహారాధనకు, దానికి చెందిన వాటికి అనుమతి లేదు. అది క్రీస్తు శరీరములోనికి బలవంతంగా చొరబడడమే అవుతుంది. “సహవాసం” అనే మాటకు “పాలు పొందుట” అనే మాటకు ఒకే మాట మూలభాషలో వాడబడింది. 20వ వచనములో మనకు కనబడుతున్న “పాలివారవుట” అనే మాటకు సహవాసమని అర్ధం. ప్రభువు అతి పరిశుద్ధమైన బల్లలో విగ్రహారాధన చొరబడం ఊహించనుకూడలేనిది. మన రెండవ ధ్యానాంశం క్రీస్తు శరీరమును చెరిపేసే విగ్రహారాధన చొరబడడం. మరో సారి బైబిల్ పడితుల వివేచనను తెలుసుకుందాం. జాగ్రతగా వింటున్నారా, శ్రోతలూ? వారు, లేదా మీరు, ఆరాధనలో ఐక్యపరచబడ్డారు. ఆ విధంగా భావిస్తున్నారు. అదే రీతిగా మీరు విగ్రహాలయాలలో విగ్రహారాధన చేస్తున్న వారితో కలిసిపోయి, వారి  బలి ద్రవ్యాలలో పాలు పంచుకుటుంటున్నట్లయితే, వారితో ఐక్యపరచబడిఉన్నారనే అర్ధం. వారి నీచమైన అసహ్యమైన వాటిలో మీరు పాలు పంచుకుతున్నారన్నమాటే. జాగ్రత సుమీ! దేవుని ఉగ్రతకు చోటీయకండి.

         ఇక మూడవ ధ్యానాంశం, మినహాయించడం, బహిష్కరించడం అనే తలంపు. 21-22 వచనాలు: 21. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దయ్యముల బల్లమీదఉన్న దానిలోను కూడ పాలుపొందనేరరు. 22. ప్రభువునకు రోషము పుట్టించెదమా? ఆయన కంటె మనము బలవంతులమా?” 21వ వచనములో పౌలు ధృడంగా ఒక భేదమును ఏర్పాటు చేస్తున్నాడు. “మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు. ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దయ్యముల బల్లమీదఉన్న దానిలోను కూడ పాలుపొందనేరరు.” ఇది అసాధ్యం. మత్తయి సువార్త 6:24లో యేసు ప్రభువువారు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించును; లేదా యొకని పక్ష ముగానుండి యొకని తృణీకరించును.”  నీవు ఎవరికి చెంది ఉంటావో నిర్ణయించుకోవాలి, ప్రియ సోదరీ, సోదరుడా! “ప్రభువు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరారు” అని దేవుని పరిశుద్ధ గ్రంధం తేటపరుస్తుంది. ప్రభువు పాత్ర, ప్రభువు బల్ల దయ్యముల పాత్రను, దయ్యముల బల్లను బయట ఉంచుతుంది. ఒక విషయం నిర్మొహమాటంగా, నొక్కి చెప్పనివ్వండి, ప్రభువు దుష్టత్వమును సహించడు. ఆయనను వెంబడించే వారు, ఆయన సంఘములో ఉండేవారు, కూడా దుష్టత్వమును సహించకూడదు. మరోసారి వేదాంత ఈ మాటల గురించి పండితుని వ్యాఖ్యానం విందాం. దేవుని ప్రేమిండము నుండి మనలను దారి తొలగించే ఏవిధమైన జీవిత విధానమైనా, దయ్యముల బల్లతోనే సమానము. ఎందుకంటే అది ప్రభువు బల్లకు వ్యతిరేకమైన వాటిమీదికి మన మనసులను మళ్లిస్తున్నది. హద్దుకు మించి స్నేహితులనైనా, ఆస్తిపాస్తులనైనా, గౌరవఘనతలు ప్రేమించడమంటే, వాటిలో ఇదే విగ్రహారాధమైన స్వభావమున్నది. అది మన జీవితాల్లో జరిగితే, దేవుని ఉగ్రతక చూపకుండా ఉండడు! ఈనాడు ఈ అధ్యయనం వింటున్న మనమంతా ఈ ప్రశ్న వేసుకోవాలి. “హద్దుకు మించి వీటితో సంబంధాలు పెట్టుకొని దేవునికి రోషము పుట్టిస్తున్నామా?” వీటి వల్ల దేవునికి అసహ్యత కలిగించి, ప్రభువు ఉగ్రతకు ఎదురు పోతున్నామా?  సాధారణంగా చాలామంది క్రైస్తవ విశ్వాసులు హద్దుకు మించి ఒక స్నేహితుణ్ణి ప్రేమించినపుడు, కోపముతో ప్రభువు ఆ వ్యక్తిని తొలగిస్తాడు, లేదా ఒక ఆస్తిని ప్రేమించినట్లయితే దాన్ని అగ్నికి ఆహుతి చెయ్యొచ్చు. దేవుని విడిచిపెట్టి, ఒకవేళ లోకముతో కలిసిపోయి, దాని ఆర్భాటము, ఆట పాటలు, పాపపు పోకడలు మన జీవితాల్లో భాగమైతే, దేవుని కోపముతో ఆయన దర్శించి తన తీర్పులు పంపే అవకాశం చాలాఉన్నది. అప్పుడు మనలను ఆయన అణుస్తాడు, దానిద్వారా, పశ్చాత్తాపపడి తిరిగిరమ్మని పిలుస్తాడు. ప్రియ సోదరీ, సోదరుడా, ఈ మాటలు నా గురించే చెప్తున్నట్లుగా ఉన్నాయి, పాస్టర్ గారు, అంటున్నారా? ప్రభువు ఎదుట తగ్గించుకొని, క్షమాపణ వేడి, ఆయనతో సమాధానపడదాం, రండి ప్రార్థన చేద్దాం, మీరు నిజముగా పశ్చాత్తాపపడుతున్నట్లయితే, మీ బైబిల్ మీద చేయి వేసి ఉంచండి.

         ఈ మూడు ధ్యానాంశాలను జ్ఞాపకం చేస్తున్నాను.

1.       చొప్పించి చేర్చబడడం. మనము క్రీస్తు శరీరము, మనమంతా ఒక్కటే శరీరములోని అవయవములము.       

2.    చొరబడం. దయ్యములకర్పించిన బలులు చొరబడతాయి, జాగ్రతగా, అప్రమత్తంగా ఉండాలి.

3.    మినహాయించడం, బహిష్కరించడం. ప్రభువు బల్లలో పాలు పొందడమంటే, ప్రభువుతో సహవాసము, పాలుపంపులు పొందడం. కాబట్టి ప్రభువు పాత్రకు దయ్యముల పాత్రకు ఏ మాత్రము సహవాసముండదు. దేవుని శిక్షకు, కోపమునకు తలుపు తెరిచినట్టే.

ప్రార్థన:

 

 

 

 

 

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...