I కొరింథీ అధ్యయనం-31 10:16-22
ప్రభువు బల్ల దగ్గర కలుసుకోవడం ~మొదటి భాగం~
సహవాసానికి కిరీటము లాంటిది కలిసి భోజనం చేయడం. చాలమందికి కుటుంబపు భోజన బల్ల అంటే సంతోషకరమైన జ్ఞాపకాలు. మా కుటుంబములో అందరూ కలిసి భోజనము చేసే సమయము ఎంతో సంతోషకరమైన సమయం. అక్కడే అందరూ కలుసుకొని సహవాసము చేసే ఆనందదాయకమైన స్థలము.
ప్రభువు బల్ల అని క్రైస్తవులమైన మనము పిలిచే ఈ బల్లకు మూలాలు నిర్గమ కాండములో ఉన్నాయి. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు విమోచించబడిన సందర్భములో అది జరిగింది. నిర్గమకాండము 12:1-14 లో పస్కా బలి గురించి సుదీర్ఘంగా వ్రాయబడింది. ఈ లేఖన భాగము చదువుకుందాం, రండి రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి. “మోషే అహరోనులు ఐగుప్తుదేశములో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను. నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో-ఈ నెల దశమినాడు వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలక పోయినయెడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాని తీసికొనవలెను. ఆ గొఱ్ఱపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితినిబట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొఱ్ఱెలలో నుండి యైనను మేకలలో నుండియైనను దాని తీసికొనవచ్చును. ఈ నెల పదునాలుగవ దినమువరకు మీరు దాని నుంచు కొనవలెను; తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిని యిండ్లద్వారబంధపు రెండు నిలువు కమ్ములమీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదుకూరలతో దాని తినవలెను. దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను; దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు; ఉదయకాలమువరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలమువరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను. మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలు చేత పట్టుకొని, త్వరపడుచుదాని తినవలెను; అది యెహోవాకు పస్కాబలి. ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమందు సంచరించి, ఐగుప్తుదేశమందలి మనుష్యులలోనేగాని జంతువులలోనేగాని తొలి సంతతియంతయు హతముచేసి, ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను; నేను యెహోవాను. మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగగా దాని నాచరింపవలెను; తరతర ములకు నిత్యమైనకట్టడగా దాని నాచరింపవలెను.” ఇశ్రాయేలీయులకు వారి బానిసత్వపు దేశములో పస్కాబలి చివరి ఉత్సవము. అదే ఉత్సవం వారిని బానిసత్వమునుండి వాటి విమోచనను పండుగలాగా సంతోషించేలా చేసింది. దాని ద్వారా వారు దేవునికి సన్నిహితులై కట్టుబడి ఉన్నారు. వారి ద్వారపు కమ్మీలమీద ఉన్న రక్తము ఐగుపుత్తు బానిసత్వము నుండి విడుదల చేసింది, అదే వారిని దేవునికి కట్టుబడే బంధం వేసింది. ఇక ఆతరువాత ఈ ఉత్సవం, పండుగ వారి తరాలన్నింటిలో ఒక గొప్ప జ్ఞాపకర్త సూచనగా అయ్యింది. వారి పరిస్థితులనుబట్టి కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకున్నా, ప్రపంచములోని యూదులందరూ పస్కా పండుగను జరుపుకునేవారు.
యేసు క్రీస్తు ప్రభువు వచ్చిన తరువాత దేవుని ప్రత్యక్షత పరిపూర్ణమయ్యింది. ఆయన కన్య గర్భములో జన్మించి, పాపములేని పరిశుద్ధ శరీరముతో జన్మించాడు. ఏ పాపములో పడకుండా పరిశుద్ధమైన పరిపూర్ణతతో జీవించాడు. మానవులందరికి కోసం పరిపూర్ణమైన పరిశుద్ధ పరిహారముగా తన ప్రాణమును రక్తమునిచ్చాడు. ఇది విని, విశ్వసించేవారెవరైనా సరే, పాపమునుండి విమోచించబడ్డానికి అవకాశముంది. ప్రభువు తన జీవితపు చివరి దినములలో తన శిష్యులతో చివరి పస్కా పండుగను జరిపాడు. ఈ రెండు సంధార్భాల్లో, మోషే చెప్పిన ఆ మాటలకు, యేసు క్రీస్తు ప్రభువు చెప్పిన మాటలకున్న సంబంధమును మీరు తేటగా గమనించాలని ఆశిస్తున్నాను. ప్రభువు ఆ సందర్భంలో పలికిన నిత్య జీవపు మాటలు లూకా:22:7-20 వచనాల్లో వ్రాయబడినవి: “7. స్కాపశువును వధింపవలసిన పులియని రొట్టెల దినమురాగా. యేసు పేతురును యోహానును చూచి మీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మనకొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. 9. వారుమేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడుగగా 10. ఆయన ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించునప్పుడు నీళ్లకుండ మోసికొనిపోవుచున్న యొకడు మీకు ఎదురుగా వచ్చును; అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్లి 11. నేను నా శిష్యులతో కూడ పస్కాను భుజించుటకు విడిది గది యెక్కడనని బోధకుడు నిన్నడుగుచున్నాడని యింటి యజమానునితో చెప్పుడి. 12. అతడు సామగ్రిగల యొక గొప్ప మేడగది
మీకు చూపించును; అక్కడ సిద్ధ పరచుడని వారితో చెప్పెను. 13. వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. 14. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతోకూడ అపొస్తలులును పంక్తిని కూర్చుండిరి. 15. అప్పుడాయన నేను శ్రమపడకమునుపు మీతోకూడ ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. 16. అది దేవుని రాజ్య ములో నెరవేరువరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి 17. ఆయన గిన్నె ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిమీరు దీనిని తీసి కొని మీలో పంచుకొనుడి; 18. ఇకమీదట దేవుని రాజ్యము వచ్చువరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పు చున్నాననెను. 19. పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తు తులు చెల్లించి దాని విరిచి, వారి కిచ్చిఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను. 20. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టు కొనిఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన.” ఈ మాటలు వింటున్నపుడు ఈ రెండు లేఖన భాగాలకున్న సంబంధం అర్ధమవుతుందికదా! పస్కా బలిపశువు రక్తం ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వము నుండి విమోచించినట్లే, క్రీస్తు రక్తం మనలను మన పాపమునుండి విమోచించి, ఆ ప్రభువును సేవించడానికి మనకు కట్టుబాటు ఏర్పాటు చేసింది. జాగ్రతగా వింటున్నారా శ్రోతలూ! దానివల్ల ఆశీర్వచనాలు పొందింది మనమే! అమెన్!!
I కోరింథీ 10:16-22లో ఆపో. పౌలు ప్రభువుబల్ల గురించి చేసిన బోధన దాని గురించి మనము సవివరంగా గ్రహించడానికి ఉపయోగపడుతుంది. ఈ లేఖన భాగము జాగ్రతగా చదువుతూ గ్రంహించాలని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. “16. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొను టయేగదా? మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటయేగదా? 17. మన మందరము ఆ యొకటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము; రొట్టె యొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై యున్నాము. 18. శరీరప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించినవాటిని తినువారు బలిపీఠముతో పాలివారుకారా? 19. ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా? 20. లేదు గాని, అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించు చున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టము లేదు. 21. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దయ్యముల బల్లమీదఉన్న దానిలోను కూడ పాలుపొందనేరరు. 22. ప్రభువునకు రోషము పుట్టించెదమా? ఆయన కంటె మనము బలవంతులమా?” ఈ వాక్యభాగాలను మీరు మీ స్వంతగా క్షుణ్ణంగా చదవండి, మీకు వీలైనన్ని సార్లు చదవండి. దేవుని నిత్యజీవపు మాటలు ఆయన సత్యమును గ్రహించి మార్పు చెందడానికి వీలుగా, మనలో ప్రతి ఒక్కరికోసం, పరిశుద్ధాత్ముడు ఆశీర్వదించుగాక! అమెన్!!
No comments:
Post a Comment