I కొరింథీ అధ్యయనం-20 7:10-16
వివాహములో పరస్పర బాధ్యత
ఎటు తోచని స్థితిలో ఉన్నారా? ఇది ప్రతి ఒక్కరూ ఎదుర్కునే పరిస్థితే! సరిపడ్డంత విశ్వాసము, దానివల్ల కలిగే
విధేయత మీలో ఉంటే విజయము సాధ్యమే! విశ్వాసమునకు “కర్త” అనగా నీ విధేయతను బట్టి విశ్వాసమును నీలో
పుట్టించే శక్తి కలిగినవాడు యెసుక్రీస్తు ప్రభువు! హల్లెలూయ! ఈ స్థితిలో మీరు న్నట్లయితే మీ కోసం ప్రార్థిస్తాను, రండి
రేడియోకు దగ్గరగా వచ్చి నెమ్మదిగా, ప్రశాంతంగా కూర్చోండి. కానీ ఒక్కమాట! నేను మీకోసం ప్రార్థన చేసినంత
మాత్రాన కాదు గాని, మీరు దేవుని వాక్యమును చదివి, నమ్మి, విశ్వసిస్తే, విజయము కలుగుతుంది. హెబ్రీ 11
అధ్యాయము మీకు విశ్వాసము కలిగేవరకు చదువుతూనే ఉండండి. ప్రార్థన:
ప్రతి ఒక్కరూ వివాహము గురించి బైబిల్ పెట్టే ప్రమాణాలను జాగ్రతగా గ్రహించాలి. మనలో కొందరికి అవి
ఉన్నట్టు కూడా తెలియవు. కాబట్టి ఈ అధ్యయనాన్ని చాలా జాగ్రతగా వింటున్న మీరందరూ గ్రహించాలని మీకు
ప్రేమతో బోధిస్తున్నాము. ఆపో. పౌలు పరిశుద్ధాత్మునిచేత ప్రేరణపొంది విశ్వాసులకు I కోరింథీ 7:10-16లో బుద్ధిబోధన
చేస్తున్నాడు. ఈనాటి అంశం: వివాహములో పరస్పర బాధ్యత.
ఈ లేఖన భాగములో కొన్ని ప్రాముఖ్యమైన పరిశోధించే ఆలోచనలు ఉన్నవి. మొదటిది, ఎన్నడూ మారని
మూలసూత్రం I కోరింథీ 7:10వ వచనం: “మరియు పెండ్లియైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా, భార్య
భర్తను ఎడబాయకూడదు.” శ్రోతలూ, దేవుని మాటలు జాగ్రతగా వింటున్నారా? పౌలు కాదు, ప్రభువు ఇచ్చే ఆజ్ఞ: మూలసూత్రం, జీవించడానికి పద్ధతి, క్రమము. వివాహామంటే జీవింతకాలమంతా ఉండేది. భార్య భర్తలు ఒకరినొకరు
విడిచిపెట్టడానికి వీలులేదు. ఈ ఆజ్ఞ ఎంత స్పష్టంగా ఉండికదూ! వివాహామంటే వారి వ్యక్తిత్వాలలో అన్నీ భాగాల్లో
వారిద్దరూ, అంటే మీరిద్దరూ, ఐక్యమవ్వాలి. కేవల శరీరములో మాత్రమే కాదు. భార్యభర్తలు భావోద్వేగాల్లో, శరీరాల్లో,
ఆత్మీయజీవితములో, ఐక్యం కావాలి. వివాహబంధములో ఉన్న స్త్రీపురుషులు ఆత్మలో, మనసులో, శరీరంలో ఒక్కటి
కావాలి. ఒక వివాహము విజయవంతము కావాలంటే, భాగస్వాములు ఈ ప్రాముఖ్యసత్యమును గ్రహించాలి. మన
దేశములోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ ఆకాంక్ష, ఆసక్తి, ఆతురత శారీరక సంబంధము మీదనే ఉంచుతూ
ఉంటాము. ఇది సమతుల్యమైన వివాహముకాదు, దేవుని వాక్యానుసారామైన వివాహమూ కాదు. ఎన్నడూ మార్పు
లేని ఈ మూలసూత్రము వివాహమును కట్టుదిట్టం చేయవలసినబాధ్యతాసహితమైన సంబంధముగా తీర్చి దిద్దుతుంది.
క్రైస్తవ విశ్వాసులు ఈ విధంగా వివాహముగూర్చి ఆలోచించాలి. వివాహమును ఈ విధoగా ప్రణాళికతో
ఆలోచనాపూర్వకంగా చేసుకోవాలి, అది జీవితమంతా ఉండేదని గ్రహించి వివాహమును కట్టుకోవాలి. దేవుని ఈ
ప్రణాళికకు వ్యతిరేకంగా సాతాను ఈ మూలసూత్రామును నాశనం చేయాలని కుయుక్తితో ఎన్నో మోసకరమైన
పన్నాగాలు, ఎత్తుగడలు వేశాడు. ఇవి క్రైస్తవ విశ్వాసుల్లోకూడ జరుగుతూ ఉన్నాయి. ప్రియ సోదరీ సోదరులారా,
యవ్వన దంపతులారా, వివ్హహములో పరస్పర బాధ్యతను బైబిలును అనుసరించి నెరవేర్చాలంటే, ఈ మొదటి
మూలసూత్రమును అతి జాగ్రత్తగా చేయాలి.
రెండవ మూలసూత్రము ఎన్నడూ తప్పని, విఫలము కాని సలహా. ఆదేమమిటో తేలుసు కోవాలంటే, 11-16
వచనాలు చదవాలి. I కోరింథీ 7:11 -16. “ఎడబాసినయెడల పెండ్లిచేసికొన కుండవలెను; లేదా, తన భర్తతో సమాధాన
పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింప కూడదు. ప్రభువు కాదు నేనే తక్కినవారితో చెప్పునదేమనగా ఏ
సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య యుండి, ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడిన యెడల, అతడు ఆమెను
పరిత్యజింప కూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి, ఆమెతో కాపురముచేయ నిష్టపడినయెడల,
ఆమె అతని పరిత్య జింపకూడదు. అవిశ్వాసియైన భర్త భార్యనుబట్టి పరిశుద్ధ పరచబడును; అవిశ్వాసురాలైన భార్య
విశ్వాసియైన భర్తనుబట్టి పరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులై యుందురు, ఇప్పుడైతే వారు
పవిత్రులు. అయితే అవిశ్వాసియైనవాడు ఎడబాసిన ఎడబాయవచ్చును; అట్టి సందర్భములలో సహోదరునికైనను
సహోదరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచియున్నాడు. ఓ స్త్రీ, నీ భర్తను
రక్షించెదవో లేదో నీకేమి తెలియును? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియును?” గమనించారా,
ఈ లేఖనభాగము మొదట్లో పౌలు ఏమని చెప్పాడు? 10వ వచనములో “నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా,..”
అంటూ మొదలు పెట్టాడు. ఇప్పుడు 12వ వచనములో ఏమంటున్నాడు? “ ప్రభువు కాదు నేనే తక్కినవారితో
చెప్పునదేమనగా...”
దైవజనుడు, అపోస్తలుడు, పౌలు తన వ్యక్తిగత సూచనలు, సలహాలు, ఇస్తున్నాడు. శ్రోతలూ, గుర్తుంచు కోండి,
పౌలు గొప్ప మేధావి, దైవజ్ఞాని. ఆయన మాటలైనప్పటికీ, అవి దైవికప్రేరణచేత వ్రాశాడు, గనుక ఈనాడు మనము
కూడా విధేయత చూపాలి. ఈ మాటలు మనసులో భద్రం చేసుకొని ఎల్లప్పుడు నిలుపుకోవాలి. వివాహములో ఒకరు
అవిశ్వాసి అయినప్పటికీ ఏ విధంగా వివాహబంధాన్ని నిలబెట్టు కోవాలో పౌలు చదువరులను హెచ్చరిస్తున్నాడు. “ ఏ
సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య యుండి, ఆమె అతనితో కాపురము చేయనిష్టపడిన యెడల, అతడు ఆమెను
పరిత్యజింప కూడదు.” ఇది నిజమైన
సంఘటన. ఆ సంఘములో ఒక సహోదరుడు తన వివాహమయ్యాక సువార్తను విశ్వసించాడు. ఇప్పుడతడు ఏమి చేయాలి? ఈ ప్రశ్న సంఘములోని చాలమందికి వచ్చిందేమో! పౌలు వివాహ బంధమును కాపాడమని ఆలోచన చెప్పాడు. ఈ సూచన భర్త అయినా, భార్య అయినా, ఇద్దరికీ వర్తిస్తుంది. తన భార్య అవిశ్వాసి అయిన కారణంగా ఆమెభర్త ఆమెను విడిచిపెట్టనవసరము లేదు. అలాగే భార్య తన భర్తను అవిశ్వాసి అయిన కారణంగా విడిచిపెట్టనవసరము లేదు. గ్రీకు క్రొత్త నిబంధనలో సూచన ఇద్దరికీ ఒకే విధంగా ఉన్నది. వివాహము జీవితాంతముండే బంధమని పౌలు బోధించాడు. కానీ ఒక విశ్వాసి అవిశ్వాసిని వివాహము చేసుకోమని చెప్పలేదు. కోరింథీ సంఘానికి తాను వ్రాసిన రెండవ పత్రికలోని 6:14 చదివితే ఈ విషయం తేటపడుతుంది. “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము?” దీని అర్ధమేమిటి? ఒక విశ్వాసి అవిశ్వాసితో వివాహము చేసుకోవడాన్ని ఆయన ఒప్పుకోనూలేదు, సమర్థించలేదు. ఒక సహోదరుడైనా, సహోదరి అయినా, వివాహమయ్యాక తన భాగస్వామి మరుమనసు పొందినట్లయితే ఆలోచనాపూర్వకంగా వ్యవహరించి వివాహబంధాన్ని ఆ కారణాన తెంచకూడదు. కోరింథీ విశ్వాసులు విగ్రహారాధన నేపధ్యమునుండి వచ్చినవారు. వారికి యూదుల బోధగాని, క్రైస్తవ బోధగాని తెలియదు. ఈ రెండింటిలో వివాహానికి చాలా పవిత్రత ఉన్నది. అదుచేత వారికి వచ్చిన ప్రశ్న, ఇప్పుడేమి చేయాలి? ఎన్నడూ తప్పని, విఫలము కానీ ఈ పౌలు సూచనను ప్రతి ఒక్కరూ నెరవేర్చాలి. దానికి పౌలు ఇస్తున్న వివరణ గమనించండి: అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడుతుంది. అదేవిధంగా అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్యనుబట్టి పరిశుద్ధపరచబడతాడు. దాన్నిబట్టి వారికి పుట్టే పిల్లలు న్యాయసమ్మతమైన వారు. మూల భాష గ్రీకులో వ్యాకరణం దీన్ని ధృవీకరిస్తుంది.
మూడవ మూలసూత్రము, దుఃఖకరమైన ఎడబాటు. 15-16 వచనాలు: “అయితే అవిశ్వాసియైనవాడు ఎడబాసిన ఎడబాయ వచ్చును; అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచియున్నాడు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమి తెలియును? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియును?” అన్ని పరిస్థితులను గ్రహించిన దైవజనుడు మరో విషయంకూడా బోధిస్తున్నాడు. అవిశ్వాసి అయిన భాగస్వామి విడిపోవాలని పట్టుబడితే ఇక వేరే మార్గము లేదు. ఆలాంటి సందర్భాల్లో ఒక సహోదరుడైనా, సహోదరి అయినా వారికి నిర్బంధము లేదు. ఏదో ఒక బానిసలాగా ఉండాల్సిన అవసరము లేదు. దుఖము కలిగించినప్పటికీ వివాహమును కాపాడడానికి విశ్వాసి బానిసలాగా ఉండనవసరములేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, అన్ని ప్రయత్నాలు జరిగాక, ‘నీవిశ్వాసము విడిచిపెడ్తే కానీ నేను నీతో ఉండను’ అని అవిశ్వాసి అన్నట్లయితే, ఇక తప్పదు. విజ్జోడుగా ఉండే
వివాహబంధము కంటే యేసు క్రీస్తు ప్రభువుతో ఉండే సంబంధము విలువైనది. “అవిశ్వాసియైనవాడు ఎడబాసిన ఎడబాయ వచ్చును” అనగా స్వచ్చంధంగా, తనంతట తానే విడిపోవాలనుకుంటే పోనీయాలి. రె
అపోస్తలుని ఈ మాటలగూర్చి ఒక పండితుడు ఏమంటున్నాడో జాగ్రతగా విందాము. కోరింథులోని పరిస్థితులను క్షుణ్ణంగా అర్ధం చేసుకున్న పౌలు కొన్ని సందర్భాల్లో అవిశ్వాసి అయిన భాగస్వామి వివాహములో ఉండకపోవచ్చని గ్రహించాడు. ఆ సందర్భాల్లో విశ్వాసి, అవిశ్వాసిని వెళ్లిపోనీయవచ్చని బోధిస్తున్నాడు. రెండు కారణాలు పౌలు చూపిస్తున్నాడు. ఒకటి, అవిశ్వాసి విడిపోవడానికి నిశ్చయించు కున్న తరువాత విశ్వాసికి విడుదల ఉంటుంది. విడాకులు తీసుకోవడానికి, వివాహబంధములో లైంగిక పాపముంటే ఒక కారణము. రెండవ కారణము, ఈ విధంగా అవిశ్వాసి అయిన భాగస్వామి విడిపోవడానికి నిశ్చయించుకున్నపుడు మాత్రమే విడాకులు అను మతించబడ్డాయి. గ్రీకు మూలభాషలో విశ్వాసై అయిన సహోదరుడు గాని సహోదరి గాని ఒక బానిసలాగా ఉండనవసరములేదు. ఫిలిప్పీ 4:6,7 వచనముల్లోని బోధ ప్రకారము సమాధానముగా అవిశ్వాసి అయిన భాగస్వామితో జీవించగలిగితే ఫరవాలేదు. కానీ అవిశ్వాసిని బలవంతంగా ఉంచాలసిన అవసరములేదు. 16వ వచనములోని సత్యమేమిటంటే వివాహములో గొడవలు, కోర్టు కేసులు, కుమ్ములాటలకు అనుమతి లేదు. లేఖనముల బోధన ఏమిటి? వివాహమయ్యాక ఒక భాగస్వామి విశ్వాసిగా మారితే, ప్రభువు విశ్వాసి యొక్క జీవితము, సాక్ష్యము, ప్రేమను వాడుకొని అవిశ్వాసి అయిన భాగస్వామిని మార్పుచెందించవచ్చు. నిజానికి ఇది జరిగే అవకాశమున్నదని భావము.
వివాహములో పరస్పర బాధ్యతలను నెరవేర్చాలంటే, ఈ మూడు మూలసూత్రాలను నెరవేర్చాలి. 1. ఎన్నడూ మారని మూల సత్యము. వివాహము జీవితాంతముండవలసిన బంధము. దంపతులు ఆత్మ, మనసు, శరీరాల్లో ఐక్యం కావాలి.
2. ఎన్నడూ విఫలము కానీ సూచన. వివాహమయ్యాక ఒక భాగస్వామి విశ్వసిస్తే, విశ్వాసి అయిన భాగస్వామి ఇష్టాపూర్వకంగా కలిసి జీవించాలని కోరితే, కలిసి జీవించవచ్చు. విశ్వాసిని బట్టి అవిశ్వాసి పరిశుద్ధపరచబడతారు.
3.మూడవ మూలసూత్రము దుఃఖకరమైన ఎడబాటు. అవిశ్వాసి అయిన భాగస్వామి ఎంతమాత్రము విశ్వాసితో కలిసి జీవించడానికి ఇష్టపడకపోతే, విశ్వాసి బానిసగా ఉండాల్సిన అవసరము లేదు. కానీ కలిసి జీవించడానికి ఇష్టపడితే, సమాధానంగా ఉన్నట్లయితే, కలిసిజీవించవచ్చు.
ఈ గొప్ప సత్యములు మర్మములు, నెరవేర్చడానికి అవసరమైనంత మహా కృప మన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువు మనలో ప్రతి ఒక్కరికీ, ఒక్కొక్కరికీ సర్వసమృద్ధిగా అనుగ్రహించుగాక, అమెన్!
No comments:
Post a Comment