I కొరింథీ అధ్యయనం-6 2:6-10
మానవ జ్ఞానమునకు కలిగిన ఓటమి
మీలో ప్రతి ఒక్కరికీ శుభములు, వందనములు! పండుగలు వస్తూ ఉంటాయి, పోతూఉంటాయి. కానీ మన
హృదయములో క్రీస్తురక్షకుని ఆనందముంటే, సమాధానముంటే, అది ఎల్లప్పుడూ ఉంటుంది, ఒక్క పండుగ దినమే
కాదు. మీకు ఆ ఆనందం, సమాధానం కావాలని ఆశిస్తే క్రీస్తు ప్రభువునకు మీ హృదయం తెరవండి.
ఎంతో జ్ఞానము కలిగినవారని మీరనుకున్నవారు ఓడిపోయిన సంఘటనలు మీరు చూశారా? కారణం ఏమిటి?
బైబిల్ గ్రంధములో జవాబు ఉన్నది: I కొరింథీ 2:6-10 వచనములు జాగ్రతగా అధ్యయనం చేస్తే అప్పుడు
అర్థమవుతుంది.
“6. పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోక జ్ఞానము కాదు,
నిరర్థకులైపోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదుగాని
7. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి
ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను.
8. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసి యుండినయెడల మహిమాస్వరూపియగు
ప్రభువును సిలువ వేయక పోయియుందురు.
9. ఇందును గూర్చిదేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి
వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది.
10. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచి యున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని
మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.” ఇంతవరకు లేఖనభాగము.
ఎందుకు లోకపు జ్ఞానము ఓడిపోయిందో, ఆపో. పౌలు దానికారణాలు ఇక్కడ వివరిస్తున్నాడు. మొదటి
కారణం: దానిలోని శూన్యతను బట్టి అది నిర్వీర్యమైనది. 6వ వచనం “పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును
బోధించుచున్నాము, అది యీ లోక జ్ఞానము కాదు, నిరర్థకులైపోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు.”
మానవ జ్ఞానము పారుతూఉండే ద్రవము లాంటిది, గురి చేరామని ఎన్నడూ చెప్పలేము. గొప్ప జ్ఞానముతో నిండిన
ఒక యువకుడు ఏమన్నారంటే, “సత్యము తరిగిపోతున్న ఇంద్రధనుస్సు లాంటిది”. అది యధార్ధమైనది కాదు.
కానీ, సత్యము సమగ్రమైనది, సంపూర్ణమైనది. దానిలోనుండి మనము పొందగలిగినంత పొందుతూ
సాగిపోతాము. మానవ జ్ఞానము తాత్కాలికమైనదని మనము గ్రహించాలి. 10 సంవత్సరాలు దాటిపోతే అన్నీ
మారిపోతుంటాయి. విండోస్ అప్డేట్ అయినట్టే, 3G, 4G, 5G ఇలా మారుతున్నట్టే మానవ జ్ఞానము మారుతూనే
ఉంటుంది. మన కంప్యూటర్లు అన్నిగ్రంధాలను, ఎక్కడెక్కడి సమాచారామంతటినీ మన చేతివ్రేళ్లదగ్గరే ఉంచుతాయి.
క్లిక్ చేస్తే ఎంతో సమాచారం అందుబాటులో ఉన్నది. భూమి మీది నాలుగు దిక్కులలో ఉన్న అన్ని దేశాల్లో, రాజ్యాల్లో
జరుగుతున్నదంతా మనము తెలుసుకోవడానికి అవకాశమున్నది. కానీ గమనించండి, శ్రోతలూ, అది
సంపూర్ణమైనది కాదు, మారుతూ ఉంటుంది, అందుచేత అది శూన్యమైనదే! అందుకే ఆపో. పౌలు దాన్ని
“నిరర్థకమైనది” అంటూ ఉన్నాడు. కోతినుండి మానవుడు పరిణామము చెందాడనే విషయాన్ని ఇప్పుడు దాన్ని
ప్రతిపాదించినవారు సైతం వారు అబద్ధాన్ని నమ్మారని ఒప్పుకుంటున్నారు. కాబట్టి, ప్రియ శ్రోతలూ, ఆపో. పౌలు ఈ
లోకపు విద్యా, జ్ఞానము పనికిరానివని వాటి అంతం శూన్యమేనని స్పష్టంగా బోధిస్తున్నాడు.
లోకపు జ్ఞానము ఓడిపోవడానికి గల రెండవ కారణం: దాని వెనుక ఉన్న వక్రీకృత ఉత్సాహం. 7,8 వచనాలు:
“దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే
దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి
తెలిసి యుండినయెడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు.” ఈ రెండవ
కారణానికి ఆపో. ఇస్తున్న ఉదాహరణ క్రీస్తు ప్రభువు సిలువ సందర్భం. ప్రజలు గ్రహింపు లేనందుచేత రక్షకుణ్ణి
సిలువ వేశారు. వారు తమ మనసుల్లో ముందే ఆలోచింకుకుని ఉంచుకున్న దాన్ని బట్టి గొప్ప దేవుని సత్యం వారు
గ్రహించలేదు. వారి వేదాంతపు గ్రహింపునుబట్టి అది అసాధ్యమని అనుకున్నారు కాబట్టి యేసు క్రీస్తు ప్రభువును
సాధారణమానవుడు అనుకున్నారు. కాబట్టి ప్రభుత్వానికి, న్యాయస్థానాల పరిధిలో క్రీస్తు రక్షకుడు ఉన్నాడని వారు
భ్రమించారు. మతపరమైన అధికారములో క్రీస్తు ప్రభువు బలాత్కారoగా ఆక్రమించేవాడని అపోహపడ్డారు. పిలాతు
అనే పేరుగల రోమా న్యాయాధికారి నిరపరాధిని శిక్షిస్తున్నానని తానే స్వయంగా నిర్ధారించాడు. అది రోమా చట్టానికి,
యూదుల ధర్మశాస్త్రానికి విరుధ్ధమైన శిక్ష. ఆపో. కా. 2:22-24లో పెంతెకొస్తు దినాన ఆపో. పేతురు తన ప్రసంగంలో
కొన్నినిర్ఘాంతపోయే సత్యాలను పేర్కొన్నారు. “ఇశ్రాయేలువారలారా, యీ మాటలువినుడి. దేవుడు నజరేయుడగు
యేసుచేతఅద్భుతములను మహత్కార్య ములను సూచకక్రియలను మీ మధ్యను చేయించి, ఆయనను తనవలన
మెప్పుపొందినవానిగా మీకు కనబరచెను; ఇది మీరే యెరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన
భవిష్యద్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి.”
వారు నమ్మినదాన్నిబట్టి ఆపో. పేతురు వారితో మాట్లాడుతున్నాడు. పుట్టుకుంటివాణ్ణి స్వస్థపరచిన తరువాత
అ. కా. 3:12-17లో ఆయన ఏమన్నారో గమనించాలి. ఈ భాగాన్ని మీరు స్వయంగా చదివి గ్రహించాలి. అ. కా.
3:12-17. ముఖ్యంగా 14వ వచనం గమనించాలి. “మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి,….
జీవాధిపతిని చంపితిరి” ఈ లోకాధికారులు అజ్ఞానమునుబట్టి ఆవిధంగా చేశారని అపోస్తలులు పేతురు, పౌలు ఇద్దరు చెప్పారు. కాబట్టి అపోస్తలులిద్దరూ ఈ లోకపు జ్ఞానము వక్రీకృత ఉత్సాహముతో నిండినదని బోధిస్తున్నారు.
ఇక లోకపు జ్ఞానము ఓడిపోవడానికి గల మూడవవ కారణం: దాన్నిచుట్టూ గీతగీసినట్టుగా కొంతవరకే
పరిమితమైనది. 9,10 వచనాలు: “ఇందును గూర్చిదేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి
కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది. మనకైతే
దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచి యున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ
పరిశోధించుచున్నాడు.” మానవ జ్ఞానము తెలియగలిగినంతే తెలుపుతుంది, అంతకుమించి చేయలేదు.
శ్రోతలారా,ఈ విషయాన్ని మీ మనసుల్లో నాటనీయండి. దేవుని సత్యము సహేతుకమైనదే, కానీ అది సహేతుకతను
మించినది కూడా! అంటే అర్ధమేమిటి? దేవుని సత్యమును ఏ ఒక్కరూ దేవుడు బయలుపరిస్తే తప్ప తెలుసుకోలేరు.
దేవుని మనస్సు తెలియపరిస్తే తప్ప దేవుని సత్యమును మానవ మేధస్సు దానంతట అది తెలుసుకోలేదు,
గ్రహించనూలేదు. 9వ వచనములో ఈ సత్యము సుస్పష్టంగా ఉన్నది. “ఇందును గూర్చిదేవుడు తన్ను
ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గో
చరముకాలేదు” అనే
మాటలు 9వ వచనములో గమనించారా? కాబట్టి, దేవుని సత్యము, మానవ కంటికి కనపడదు, చెవికి వినపడదు,
హృదయానికి అర్ధం కాదు. ప్రియ స్నేహితుడా, సోదరీ, నీవు మానవ జ్ఞానము మీద ఆధారపడినట్లయితే, నీ కోసం
దేవుడు ఏమి సిద్ధపర్చి ఉంచాడో నీ కెన్నడూ అర్ధం కాదు. ఈ పరిమితమైన గీతను దాటాలంటే, నీవు నేను,
మనమంతా, పరిశుద్ధగ్రంధం బైబిల్లోని బోధించబడ్డ ప్రత్యక్షత, సత్యముమీద ఆధారపడాలి. మనకు ప్రభువు బైబిలును
అనుగ్రహించడములో ఉద్దేశ్యమదే! మరో విషయం గమనించాలి సుమా! ఆదాము హవ్వలు ఏదేను తోటలో దేవుని
మాటను ధిక్కరించినపుడు మహాఘోరం, మహా పాపము జరిగింది. ఈ భూమ్మీద ఏ దోషము, అపరాధము,
పాపము లేకుండా జీవించిన పరిశుద్ధుడు యేసు క్రీస్తు ప్రభువు ఒక్కడే! మిగతా అందరూ దోషులే! మనకందరికీ
ఆయనే ఆధారం! మానవ జ్ఞానము మనకు తోచిన నీతి, పాపము, సత్యము ఆలోచిస్తుంది, కాని అది
పరిమితమైనది. దాని చుట్టూరా అది దాటలేని గీత ఉన్నదని గ్రహించాలి. మనకు స్కూళ్ళలో, కాలేజీలలో,
యూనివర్శిటీలలో కనిపించే జ్ఞానం సత్యమును బోధించలేదు. ఎందుకంటే అది ఆధారపడేది లోపభూయిష్టమైన
మానవ జ్ఞానము మీద! కాబట్టి, ప్రియ శ్రోతలూ, మీలో ప్రతి ఒక్కరూ, పరిశుద్ధగ్రంధం బైబిల్ వద్దకు రమ్మని
అభ్యర్ధిస్తున్నాను. బైబిల్ గ్రంధం మాత్రమే దేవుని సత్యము, ఆయన జ్ఞానము, మానవ జ్ఞానమునకు మించిన
పరిశుద్ధత, జ్ఞానమును అనుగ్రహిస్తాయి. జీవితపు అతి ప్రాముఖ్యమైన ప్రశ్నలకు బైబిల్ గ్రంధం జవాబునిస్తుంది.
ముగింపులో మానవజ్ఞానం ఓడిపోవడానికి గల మూడు ముఖ్యకారణాలను, తెలుసుకుందాం:
1. 1. దానిలోని శూన్యతను బట్టి అది నిర్వీర్యమైనది.
2. 2. దాని వెనుక ఉన్న వక్రీకృత ఉత్సాహం.
3. 3. దాన్నిచుట్టూ గీతగీసినట్టుగా కొంతవరకే పరిమితమైనది.
దేవుని జ్ఞానమైన పరిశుద్ధ గ్రంధము బైబిల్ను ఆశ్రయించాడానికి అవసరమైనoత మహా కృప యేసు క్రీస్తు ప్రభువు
మనలో ప్రతి ఒక్కరికీ అనుగ్రహించుగాక! అమెన్!
No comments:
Post a Comment