రోమా పత్రిక బైబిల్ అధ్యయనం – 45 12:9-16 అనుదినజీవితానికి అనుభవపూర్వక నియమములు
గమనిక:
మీరు ఏ రీతిగా బైబిల్ అధ్యయనాల ద్వారా దీవెన, మేలు, హెచ్చరిక, ఆశీర్వాదం,
ఆత్మీయ అబివృద్ధి పొందుతున్నారో, కామెంట్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవి
కూడా వ్రాయండి. దేవుని కృప మీకు తోడుగా ఉండి బలపరచుగాక!
రోమా పత్రిక బైబిల్ అధ్యయనం – 44 12:4-8 అనేక సభ్యులు- ఒక్క సంఘము : అనేక ఆవయవములు – ఒక్క శరీరము
రోమా పత్రిక బైబిల్ అధ్యయనం – 43 12:1-3 దేవుని అంగీకారం పొందాలంటే ఎలా ఉండాలి?
గమనిక:
మీరు ఏ రీతిగా బైబిల్ అధ్యయనాల ద్వారా దీవెన, మేలు, హెచ్చరిక, ఆశీర్వాదం,
ఆత్మీయ అబివృద్ధి పొందుతున్నారో, కామెంట్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవి
కూడా వ్రాయండి. దేవుని కృప మీకు తోడుగా ఉండి బలపరచుగాక!
రోమా పత్రిక బైబిల్ అధ్యయనం – 43 12:1-3
దేవుని అంగీకారం పొందాలంటే ఎలా ఉండాలి?
Praise the Lord! బాగున్నారా? మీ కుటుంబములో శాంతి నెమ్మది ఉన్నాయా? మన చుట్టూ ఉన్న చాలా కుటుంబాలలో శాంతి సమాధానము, నెమ్మది, కనిపించని దుర్దినములలో మనము జీవిస్తున్నాము. యేసు క్రీస్తు ప్రభువుతో వ్యక్తిగత సoబంధం కలిగినవారు జీవిస్తున్న కుటుంబాలలో శాంతి నెమ్మది, సమాధానము నివసిస్తాయి. మరి మీ సంగతేమిటి? ప్రార్ధించుకుందాం, తలలు వంచండి: ఈ నాడు మన అంశం ‘దేవుని అంగీకారం పొందాలంటే ఎలా ఉండాలి?’ ఎంతో ప్రాముఖ్యమైన ప్రశ్న కదూ! ప్రతి నిజమైన యెసయ్య శిష్యునికి ఈ ప్రశ్న తరచూ మెదులుతూ ఉంటుంది. మన లేఖన భాగం రోమా 12:1-3. దేవుని వాక్యము ఆధారంగా ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకుందాం, మీ బైబిల్, నోట్ బుక్ పెన్ తెచ్చుకొని రేడియొకు దగ్గరగా వచ్చి కూర్చోండి. మీ బైబిల్ తెరిచారా?
రోమా 12: 1-3
1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది. 2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి. 3. తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అను గ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతివానితోను చెప్పుచున్నాను."
మొదటిగా, దేవుని అంగీకారం పొందాలంటే మన శరీరాన్ని దేవునికి లోపర్చి అర్పించాలి. ఇది శరీరానికి సంబంధించినది. మొదటి వచనములో చూచినట్లయితే దానికి ఆపో. పౌలు హెచ్చరిక ప్రకారము, దానికి ఆధారము దేవుని వాత్సల్యత. ఆయన మాటలు గమనించారా? “ సహోదరులారా, ....దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను.” దేవుని వాత్సల్యత, ప్రియులారా, ఎన్నో రీతులుగ, ఎన్నో రకాలుగా ఉంటుంది. నీవు, ప్రియ శ్రోతా, బ్రతికి ఉండడం, ఊపిరి పీల్చడం ఆయన వాత్సల్యతకు గుర్తు! అది ఆయన సంరక్షణలో, ఆయన భద్రతలో, ఆయన ఏర్పాటులో, ఆయన అనుగ్రహించే ప్రతి దీవెనలో భాగం. కాబట్టి ఆయన వాత్సల్యతను బట్టి, మనము దేవునికి మన శరీరాలను సమర్పించమని హెచ్చరిక! ఏ విధంగా మనము మన శరీరాలను సమర్పించాలో ఆపో. వివరిస్తున్నాడు. మన శరీరాలను సజీవయాగముగా అర్పించాలి, అనగా కొంచెం కాదు, ఒక భాగం కాదు, ఒక రోజు కాదు, ఎల్లప్పుడూ, సంపూర్ణంగా సమర్పించాలి. “సజీవయాగము” అనే సత్యమును లోతుగా ధ్యానిద్దాం. పాత నిబంధన కాలములో దేవుడు మోషే కిచ్చిన ధర్మశాస్త్రము ప్రకారం, వేర్వేరు బలులు చేయాలని నియమించబడింది. వాటిలో ఒకటి సర్వాంగ బలి. ఈ నియమం ప్రకారం ఒక జంతువును, అది ఏదైనా సరే, ఉన్నదున్నట్టు, మొత్తం జంతువునంతటినీ బలిపీఠం మీద ఉంచాలి. దేవుని మహిమార్ధం ఆ జంతువును సంపూర్ణంగా దహించాలి. ఆపో. ఈ సందర్భములో ఆ మాట వాడినాడు. దాని అర్ధం ఏమిటంటే, మనము ఈనాడు మన శరీరాలను సంపూర్ణంగా, సజీవంగా, సంతోషంగా దేవునికి సమర్పించాలి. ఏదీ దాచుకోకుండా! పౌలు భక్తుని మాటలను మనము జాగ్రతగా పరిశీలిస్తే, ఇది మనము దేవుని వాత్సల్యతకు స్పందించే సరియైన సేవ అని లేఖనముల భావన. “ఇట్టి సేవ మీకు యుక్తమైనది” అంటే అర్ధం ఇదే. ఇది మనము చేసినట్లయితే మనకెంత సంతోషం కలుగుతుంది కదూ! అది మనము చేసే కనీసధర్మమమని మనము గ్రహిస్తున్నమా? మనము సరిగా చేయవలసిన క్రియ మనము చేసినపుడు ప్రభువును సంపూర్ణంగా సేవించినవారమౌతాము. ప్రియులారా! మనము దేవుని చేత అంగీకరించబడడానికి ఇది మొదటి ప్రక్రియ. క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డ వారముగా, మన శరీరములను ఆయనకు అచ్చియున్నాము.
ప్రియులారా, రెండవది, దేవుడు మనలను అంగీకరించాలంటే, మనము మనసులను పరిశుద్ధపరచుకోవాలి. ఆపో. మనకిచ్చే హెచ్చరిక ఏమిటంటే, లౌకికమైన, తలంపులతో మనము జీవించడం సరికాదు. “ఈ లోక మర్యాదను అనుసరింపక” అంటూ గద్దించడం లేదా? ఈ లోకమునకు చెందిన విధానాలు, పద్ధతులు, మర్యాదలు దేవునికి చెందినవి కావని మనకు తెలుసు. ఈ లోకo దేవునికి చాలా దూరములో ఉంది. ఆపో. మరొక చోట ఈ లోకమంతా దుష్టునియందున్నదని స్పష్టపరిచాడు. దుష్టుడు అనగా సాతాను. వాడు దేవునికి ఎల్లప్పుడు విరోధి. వాడియందు ఉన్న లోకము దేవుని విరోధమైనది. మనము తల తలంపులను పరిశుధ్ధపరచుకోవాలని ఆపో. ఇక్కడ బోధిస్తున్నాడు. దేవుడు పరిశుధ్ధపరచిన మనసులు రూపాంతరం చెందుతాయి. అది సంపూర్ణమైనది, మొత్తంగా జరిగే రూపాంతర ప్రక్రియ. ఇది అత్యవసరం. మరొక చోట లౌకికమైన మనసు లేదా శరీరానుసారమైన మనసు దేవుని విరోధమైనదని, అది దేవునికి లోబడదని, ఆపో. మనకు బోధించాడు. కాబట్టి రూపాంతరం చెందడం, సంపూర్ణంగా, మొత్తంగా రూపాంతరం చేదడం అత్యవసరం. అనగా దేవుని వాక్యం చేత మనము మన మనసులను పరిశుధ్ధపరచుకోవడంతో ముడిపడిఉంటుంది. ఇప్పుడు 2వ వచనములో మనసును పరిశుద్ధపరచుకోవడం, రూపాంతరం చెందడం ద్వారా కలిగే ఫలితమేమిటో గమనించండి. “…..ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు” మన మనసులను పరిశ్దుధ్ధపరచుకోవడం వల్ల కలిగే ఫలితం మనము దేవునివలే మార్చబడం! అప్పుడు దేవునికి అనుకూలమనదేదో, ఉత్తమమైన దేవుని చితమేదో పరీక్షించగలుగుతాము. ఈ పరిశుధ్ధపరచబడదము దేవుని వాక్యము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా కలుగుతుంది. మనము దేవుని అంగీకారం, ఆమోదం పొందాలనుకుంటే మన మనసులు పరిశుధ్ధ పరచుకోవాలి. విమోచించబడ్డ ప్రజలుగా మనము మన తలంపులను, ఆలోచించే విధానమును మార్చుకోవాలి, సంపూర్ణంగా మార్చుకోవాలి. దేవుని తలంపులను మనము గ్రహించి, రూపాంతరమును బట్టి దేవుని తలంపులను కోరుకోవాలి. మనసులు పరిశుద్ధపరచుకోవడం ఎల్లప్పుడు జరిగే ప్రక్రియ, మనము వాత్సల్యవంతుడైన మన దేవునితో నడుస్తూ, మాట్లాడుతూ ఉన్నపుడు ఇది జరుగుతుంది.
మూడవది, మనము దేవుని అంగీకారం పొందాలంటే మన విశ్వాసం కొరతలేనిదిగా, సంపూర్ణంగా చేయబడాలి. 3వ వచనం మనలను మనం ప్రేమించుకోవడం అనే ప్రమాదమున్నదని హెచ్చరిస్తుంది. ఆపో. ఏది ఎలా బోధించాడో గమనించాలి. “తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక...” ఈ మాటల అర్ధమేమిటి? మనలని మనం ప్రేమించుకోవడం అంటే దిగజారిపోవడమే. తన్ను తాను ప్రేమించు కోవలసినంత కంటే ఎక్కువగా ప్రేమించుకునే వ్యక్తి తన దిగజారుడును గుర్తించలేకపోవచ్చు. అతడు దేవుని యెదుట ఎలాంటి స్థానములో ఉన్నాడో గ్రహించలేకపోతున్నాడు. కాబట్టి ఆపో. పౌలు మనము మన గురించి ఆలోచిoచుకోవలసిన దానికంటే ఎక్కువ ఆలోచించుకోవద్దని బుద్ధి చెబుతున్నాడు. ఈ ప్రమాదం ఎల్లపుడూ పొంచి ఉంటుంది సుమా! ఇక సరియైన ఆలోచన అనే ఒక విధి మనకున్నది. పౌలు భక్తుడు మనకు సవాలు విసురుతున్నాడు. “స్వస్థబుద్ధి” కలిగిఉండాలి. అంటే సరియైన రీతిగా, మానసికంగా బుద్ధికలిగినట్టుగా ఉండాలి. నీవు నీ విశ్వాసపు, ఆత్మీయ స్థాయి కంటే ఎక్కువగా ఆలోచించుకున్నట్లయితే అది నీ విశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. దేవుని వాక్యము ప్రకారము మనము బుద్ధిమంతులముగా, సరియైన రీతిగా ఆలోచించుకోవాలి. అది ఔన్నత్యం కలిగిస్తుంది. మనము ఎలగున్నమో, అలాగే దేవుడు చేసినప్పటికీ, మనలను ఒక్కొక్కరినీ, అద్వితీయంగా నిర్మించాడు. ఒకరు మరే ఇతర ఒకరిలాగా ఉండరు. మనము ఇతరులందరికీ వేరుగా ఉంటాము, ఏ ఒక్కరితో పోల్చబడలేము. అయినప్పటికీ మనకందరికీ అవే సమస్యలు, అవే ఇరుకులు, అవే శోధనలు ఉంటాయి. అయినా, మనము దేవుని క్రియద్వారా, ఆయన ఉద్దేశ్యం కోసం నిర్మించబడ్డాము. సరియైన ఆలోచన విధానము ఔన్నత్యం కలిగిస్తుంది. ఈ వచనములోని చివరి భాగం గమనించండి. “దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణప్రకారము…” దేవుడు మనకు ఒక్కొక్కరికి ఒక పరిమాణములో విశ్వాసమును ఇచ్చాడు. ప్రభువు మనలో ఒక్కొక్కరికీ ఒక పరిమాణములో విశ్వాసమును అనుగ్రహించాడు. విశ్వసించడానికి శక్తినిచ్చాడని అర్ధం. అనుగ్రహిoచబడిన ఈ విశ్వాసమును మనము పరిపక్వము లోనికి తెచ్చుకొని, దాని ప్రకారం అనుదినజీవితం జీవించాలి. విమోచించబడిన వారమైనందుచేత మనము దేవునిమీద ఆధారపడాలి. మనంతట మనకు శక్తి లేదు. మనంతట మనమే సంపూర్ణులము కాదు. ప్రభువు మానకనుగ్రహించిన విశ్వాసమును అభ్యాసము చేసుకుంటూ, ఆయనపైన ఆధారపడి మన విశ్వాసమును సంపూర్ణపరచుకోవాలి. ఇది ఎల్లప్పుడు చేస్తూనే ఉండాలి. ప్రియులారా, మనము దేవుని అంగీకారం పొందడానికి పధ్ధతులివి. మొదటిది, దేవునికి మన శరీరాలను సర్వాంగ దహనబలి వలె సంపూర్ణంగా సమర్పించుకోవడo. రెండవది, మన మనసులను పరిశుధ్ధపరచుకొంటూ దేవుని చిత్తమును చేయడం, మూడవది, దేవుడు మనకనుగ్రహించిన విశ్వాసపు పరిమాణమును దినదినము వృద్ధిచేసుకొంటూ సంపూర్ణపరచుకోవడం. సర్వకృపానిధీయగు దేవుడు మనలో ప్రతి ఒక్కరికికీ ఆయన అంగీకారం, ఆమోదముద్ర పొందడానికి కృప అనుగ్రహించుకాక! అమెన్!!
రోమా పత్రిక బైబిల్ అధ్యయనం – 42 11:25-36 నిబంధన యొక్క ముగింపు
రోమా పత్రిక బైబిల్ అధ్యయనం – 42 11:25-36
నిబంధన యొక్క ముగింపు
ఈ జీవితానికి అర్ధముందా? నేనుందుకు జీవిస్తున్నాను? నేనుందుకు పుట్టాను? ఎందుకు బ్రతుకుతున్నాను? ఈలాంటి ప్రశ్నలు నీలో కలిగాయా? మనలను సృష్టిoచిన దేవునికి ప్రతి ఒక్కరివిషయంలో ఉద్దేశ్యం, గురి ఉన్నది. ఒక మంటి కుండను చేసిన కుమ్మరి వానికి కుండను చేసేటప్పుడు ఎలా వాడుకోవాలో ఉద్దేశ్యం ఉండదా? మరి సర్వజ్ఞాని, అనంతజ్ఞాని, ప్రేమకు ప్రతిరూపమైన యేసు క్రీస్తు ప్రభువునకు నీ జీవితము కోసం ఉద్దేశ్యం తప్పనిసరిగా ఉంటుంది. ఆయనతో నీ సంబంధం తెగిపోయినందుచేత దేవుని ఉద్దేశ్యం తెలుసుకోలేక పోతున్నావు. ప్రభువుతో నీ సంబంధం బాగుపడ్డ తరువాత జీవితం ఎంతో సంతోషంగా, శాంతి, నెమ్మదితో నిండిఉంటుంది. ఆత్మహత్య తలంపులు విడిచిపెట్టండి, యేసుక్రీస్తు నిరీక్షణకర్త. మీరేదైనా పని చేస్తున్నట్లయితే కొంచెం సేపు ఆపి, మీ బైబిల్, నోట్ బుక్, పెన్ తెచ్చుకొని, ప్రశాంతంగా ఇలా రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి. (ప్రార్థన)
బైబిల్లో మనకు ప్రత్యక్షమయ్యే దేవుడు నిబంధన చేసే దేవుడు. అంటే, ఒడంబడిక, ఒప్పందం చేసేదేవుడు. ఆయన ఒప్పందాలను నెరవేర్చే దేవుడు. వాటికి షరతులు, నియమాలుంటాయి కదా? ఇది అత్యున్నతుడైన దేవునికి, మానవునికి మధ్య జరిగే నిబంధన, దేవుడు నిబంధన చేసినపుడు మానవుడు ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి. ఒప్పుకోవడమైనా, లేదా తిరస్కరించడమైనా! ఒప్పందం చేసుకున్నవారు నియమాలు ఉల్లంఘిస్తే, ఇక చెల్లదు. ఉల్లంఘించినవారికి అది వర్తించదు. కానీ నిబంధన మట్టుకు అలాగే ఉంటుంది. దేవుడు నిబంధన చేసినపుడు తప్పక నెరవేరుస్తాడు.
ఆపో. పౌలు రోమా పత్రిక 11:25-36 లో నిబంధన ముగింపు ఎలా ఉంటుందో బోధిస్తున్నాడు.
25 సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొన గోరు చున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను. 26. వారు ప్రవేశించునప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును; 27 నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు. 28. సువార్త విషయమైతే వారు మిమ్మునుబట్టి శత్రువులు గాని, యేర్పాటువిషయమైతే పితరులనుబట్టి ప్రియులై యున్నారు. 29. ఏలయనగా, దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. 30. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై యుండి, యిప్పుడు వారి అవిధేయతనుబట్టి కరుణింపబడితిరి. 31. అటువలెనే మీ యెడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణపొందు నిమిత్తము, ఇప్పుడు వారు అవిధేయులై యున్నారు 32. అందరియెడల కరుణ చూపవలెనని, దేవుడు అందరిని అవిధేయతాస్థితిలో మూసివేసి బంధించియున్నాడు. 33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు. 34. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? 35. ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొంద గలవాడెవడు? 36. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్.
దేవుని పరిశుద్ధ వాక్యమును జాగ్రతగా విన్నారుగదా! ఈ లేఖనభాగము నుండి మనము నేర్చుకునేది ఏమిటంటే, నిబంధన ముగింపు దేవుని ప్రకటనలచేత నిశ్చయం చేయబడ్డాయి. ఆ ప్రకటనలలో మొదటిది, దేవుడే తన ప్రేమను తెలియచేయడం. దేవుడు తన ప్రేమను వ్యక్తం చేయడం ద్వారా నిబంధన ముగింపు నిశ్చయమయ్యింది. 28వ వచనంలో ఆపో. దేవుడు పితరులను ఎలా ప్రేమించాడో బోధిస్తున్నాడు. “యేర్పాటువిషయమైతే పితరులనుబట్టి ప్రియులై యున్నారు.” దేవుడు ఇశ్రాయేలీయుల పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఎన్నుకుని ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలీయులు వారిని పితరులు అని పిలిచేవారు, ఇప్పుడు పౌలు వీరిగురించే మాట్లాడుతున్నాడు. మొదట దేవుడు అబ్రహాముతో నిబంధన చేసి, ఆ తరువాత ఇస్సాకుతో ఆ తరువాత యాకోబుతో పునరుద్ధరించాడు. దేవుడు తన నిబంధనను త్రోసివేయడు. వీరు దేవుని ప్రేమను పొందారు. దేవుడు పితరులను బట్టి వారి మీద ప్రేమను కనుబరుస్తున్నాడు. కానీ నిబంధన ముగించబడడం యూదేతరుల చేరికతో సంపూర్తి అవుతుంది. 25వ వచనములో ఉన్నట్టు “అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు” కలుగుతుంది. ఈ కాలము ముందుకు రానున్నది. శ్రోతలూ, గమనించండి, దేవునికి నిస్సందేహంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, కార్యాచరణ ఉన్నది. దాన్ని ఆయన నెరవేరుస్తూ ముగిస్తాడు కూడా! ఈ విషయం 29వ వచనములో ఆపో. స్పష్టపరుస్తున్నాడు. “దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాపడడు.” అంటే అర్ధమేమిటి? దేవుడు ఎప్పుడు కూడా మనసు మార్చుకోడు, ఆ అవసరo దేవునికి ఎట్టి పరిస్థితులలో ఉండదు. మనకర్ధమయ్యే రీతిగా చెప్పాలంటే, దేవుడు ఒక మార్గములో కొంత దూరం వెళ్ళినతరువాత అది డెడ్ ఎండ్ అని కానీ, బయటికి పోయే మార్గ ము లేదని కానీ, అనుకునే పరిస్థితి ఆయనకు ఎట్టి పరిస్థితులలో కలుగదు. దేవుడు ప్రయత్నమైతే చేసి చూద్దాం, అవుతే అవుతుంది, లేకపోతే లేదు అని అనుకునే ప్రసక్తే లేదు. ఇది చేసి చూద్దాం, ఇది ఫలించకపోతే, మరో ప్రయత్నం చేద్దాం, అనుకునే పరిస్థితులు ఎన్నడూ కలుగవు. అవును, శ్రోతలూ, దేవుడు తన పిలుపు విషయం, తన కృపావరముల విషయములో మార్పు చెందడు. నిబంధన ముగింపు దేవుని ప్రేమను తెలియపర్చడము ద్వారా నిర్దిష్టమయ్యింది. దేవుని ప్రేమలో మార్పు లేదు, హల్లెలూయ!
రెండవది, దేవుని కనికరము నిబంధన ముగింపును నిర్దిష్టపరుస్తున్నది. 30వ వచనములోని “వారి” అనే మాట యూదేతరులకు వర్తిస్తుంది. “మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై యుండి, యిప్పుడు వారి అవిధేయతనుబట్టి కరుణింపబడితిరి.” దేవుడు యూదేతరులకు కరుణ చూపాడు. ఆయన అందరికీ కరుణ చూపుతాడు. వారు దేవునికి చాలా దూరస్థులైనా వారిని కరుణించాడు. యూదులకున్న ఆధిక్యత, ప్రత్యేకత వారికి లేవు. సత్యదేవుని వారు తెలుసుకోలేదు, ఆయననుగూర్చిన అవగాహన వారికి లేవు. వారికి దేవుని ధర్మశాస్త్రము లేదు. అయినప్పటికీ, వారి అవిశ్వాసములోనే దేవుడు వారిదగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఆపో. చెబుతున్నదేమిటంటే వారు విశ్వాసముంచారు, అందుచేత వారు కనికరము పొందారు, హల్లెలూయ! ఇక 31వ వచనం అధ్యయనం చేద్దాం. “అటువలెనే మీ యెడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణపొందు నిమిత్తము, ఇప్పుడు వారు అవిధేయులైయున్నారు.” దేవునియందు విశ్వాసము ఉంచినటువంటి యూదుల సంబంధం పునరుధ్ధరించబడుతుంది. దేవుడు వారికి కనికరము చూపించినపుడు వారు పునరుధ్ధరించబడతారు. దేవుని కనికరం అనే అంశమంతటిలో 32వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. “అందరియెడల కరుణ చూపవలెనని, దేవుడు అందరిని అవిధేయతాస్థితిలో మూసివేసి బంధించియున్నాడు.” గమనించండి, శ్రోతలూ, ఏ రకమైన పక్షపాతం లేదు. ఆపో. పౌలు ఇతర చోట్లలో కూడా ఈ సత్యాన్ని బోధించాడు. దేవునికి యూదులైన, ఇతర ఏ జనమైన జాతి అయినా ఏ పక్షపాతము లేదు. ఎందుకనగా అందరూ ఏ భేదము లేకుండా దేవుని దృష్టిలో పాపముచేసి చెడిపోయినవారే! అందరి మీద కరుణచూపడానికి శక్తిగల దేవుడు అందరినీ అవిధేయతలో మూసివేశాడు. దేవుని కరుణా అపరిమితమైనది, హద్దులు లేనిది, క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీరెక్కడున్నా పరవాలేదు, ఎంతటి ఘోరపాపములో ఉన్నా ఫరవాలేదు, ఇప్పుడు ప్రభువు కరుణతో నిన్ను రక్షించడానికి, క్షమించడానికి, సిధ్ధంగా ఉన్నాడు. వారిలో నీవు కూడా ఉన్నావు!! నీవు దేవుని కరుణను ఇప్పుడే పొందవచ్చు!! దేవునికి స్తోత్రం!
మూడవది, దేవుని మహిమను ప్రకటించడము ద్వారా నిబంధన ముగింపు నిర్ధారించబడుతున్నది. ఈ నాలుగు వచనములు బైబిల్ గ్రంధములోని అత్యంత ఘనమైనవి, అద్భుతమైనవి, ఉన్నతమైనవి , లోతైనవి , విశాలమైనవి. దేవునిలో మార్పు ఉండదు. ఏ ఒక్కరూ ఆయన జ్ఞానమును తెలివిని గ్రహించలేరు, పసికట్టలేరు. లోకమందున్న వారందరి జ్ఞానము, తెలివితేటలు కలిపినా, దేవుని ఆశ్చర్యకరమైన అనంతజ్ఞానము ముందు శూన్యమే! అవును, ప్రియులారా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్య ములు;” దేవునికి సమస్తము తెలుసు, మనము దాచుకున్నవి, జరగున్నన్నవి, సమస్తమూ తెలుసు. ఆయనకు ఎవ్వరూ బోధించలేదు, ఆలోచన చెప్పనవసరము లేదు. ఆయన బయలు పరిస్తే తప్ప, దేవుని మనస్సును ఎవ్వరూ తెలుసుకోలేరు. అయనకు ఇది లేదు అని ఏదైనా ఇవ్వగలిగినవారెవ్వరూ లేరు. దేవుడు సమస్తమునకు పైగా ఉన్నవాడు. ఆయనకు ఇది చేయమని చెప్పగలిగినవారు లేరు. ఆయన నిత్యము ఉన్నవాడు. సర్వశక్తి సర్వాధికారం, సర్వ సార్వభూమాధికారం కలిగినవాడు. ఎల్లప్పుడూ జీవిస్తున్నవాడు. ఆయనకిది తెలియదు, నేను చెప్తాను అని అనగలిగినావారెవ్వరూ లేరు. ప్రియులారా, 36వ వచనం అన్నిటిని ఏవిధంగా సమీకరిస్తుందో గమనించారా? “ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగములవరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్.” శ్రోతలూ, గమనించండి, ఈ వచనములో మూడు అంశములు ఉన్నవి. మొదటిది ఆయన సృష్టికర్త; ఆయన మూలమును అంటే అర్ధం అది. ఆయనే సంరక్షకుడు; ఆయన నిమిత్తమును అంటే అర్ధం అది. ఆయనే అన్నిటినీ వినియోగించుకునేవాడు; ఆయన నిమితమును అంటే అర్ధం ఇది. ఆయన కోసమే సమస్తమును ఉన్నవి. ప్రియులారా, అందుచేత ఆయనకే సమస్తము చెందిఉన్నవి, సమస్తము ఆయన చేతిలో ఉన్నవి, ఆయన మహిమకోసమే సమస్తము ఉన్నవి. దేవుని మహిమ మనము గ్రహించలేననంత, ఊహించలేననంత గొప్పది. అందుకే కాబోలు ఆపో. ఆయన “తీర్పులెంతో శోధింప నెంతో అశక్యములు” అని నిర్ఘాంతపోయాడు. అవును, ప్రియ మిత్రమా, దేవుని మహామహిమ అంతా గొప్పది! కీస్తునందు ప్రియులారా, దేవుని ఈ గొప్ప ప్రకటనలు, ఆయన తన నిబంధనను ముగిస్తాడని మనలను ఒప్పించిఉండాలి. దేవుని ప్రేమగురించి ఆలోచించు. ఆయన కరుణ గురించి ఆలోచించు. దేవుని మహిమ గురించి ఆలోచించు. అప్పుడు ఆయన తన నిబంధనను ముగిస్తాడని నీవు నిర్ధారించుకోవచ్చు. దేవుడు తాను చేసిన నిబంధనను తప్పక నెరవేరుస్తాడు. నీవు ఆయన నిబంధనను నీ జీవితములో అంగీకరిస్తావా? దానికవసరమైనoత కృప ప్రభువు నీకనుగ్రహించుగాక! అమెన్!!
II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము
> II Cor-15 2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...
-
> ఇదే ఆడియో మెసేజ్ లింక్: ప్రభువు బల్లను సరిగా ఆచరించి అవలంబించడం -మొదటి భాగము I కోరింథీ-37 11:17-34 మీకందరి...
-
చాలా మంది వృద్ధులు పెద్ద అక్షరములే చదువగలిగినందు చేత పెద్ద అక్షరములు వాడుతున్నాము. దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు పొందండి. మీర...