రోమా పత్రిక అధ్యయనం - 29 8:18-27 మహిమకోసం సర్వత్రా మూలుగులు

 

  •  చాలా మంది వృద్ధులు పెద్ద అక్షరములే చదువగలిగినందు చేత పెద్ద అక్షరములు వాడుతున్నాము. 

    దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు  పొందండి.  మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో   వ్రాయండి,  మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం.  sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్  లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి. 

  • Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com. 

  • Or send a message by WhatsApp to 98663 41841


                           రోమా పత్రిక అధ్యయనం  - 29    8:18-27

మహిమకోసం సర్వత్రా మూలుగులు

 

     మీ శ్రమలు, బాధలు, వేదనలు, నిందలు, మిమ్మల్ని శాంతిలేకుండా చేస్తున్నాయా? అయితే ఈ 

సందేశము మీ కోసమే! రండి రేడియొ కు దగ్గరగా వచ్చి ఇలా ప్రశాంతంగా నెమ్మదిగా కూర్చోండి. మీ 

బైబిల్ నోట్బుక్ పెన్ కూడా తెచ్చుకుంటే ఇంకా మంచిది. బైబిల్ మీ గూటిలో, షెల్ఫ్ లో ఉన్నంత 

మాత్రాన జరిగేదేమీ ఉండదు. దేవుని సజీవమైన మాటలు మన హృదయాల్లో  నివసించాలి, అప్పుడే 

మనము శ్రమలను, వేదనలను, బాధలను జయించి విజయం పొందగలం. అందు చేత బైబిల్ 

తీసుకుని కూర్చోండి.

 

      ఆపో. పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము తెరవండి. 18వ వచనమునుండి 

చదువుకుందాము. బైబిల్లో క్రొత్త నిబంధనలో 138వ పేజ్. గమనిస్తున్నారా?

18. మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను.

19. దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది.

20. ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణకలదై,

21. స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను.

22. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచునున్నదని యెరుగుదుము.

23. అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము

24. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితివిు. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును?

25. మనము చూడనిదాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము.26. అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనముచేయుచున్నాడు.

27. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్దులకొరకు విజ్ఞాపనము చేయు చున్నాడు.

ఈ లేఖన భాగములో ఆపో. పౌలు సృష్టి అంతా మహిమ కోసం ఎదురు చూస్తుందని చెప్పడానికి కొన్ని ఋజువులను చూపిస్తున్నాడు. అవేమిటో తెలుసుకుందాం, సావధానంగా వినండి.  

మొదటిది, మూలిగే అనుభవము మహిమకోసమైన ఆశ, ఎదురుచూపులనును తెలుపుతుంది. పౌలు సృష్టి అంతా నశించిపోతున్నదని తెలియచెబుతున్నాడు. 20 వచనం చూడండి:  ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, …. మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను.”   సమస్త సృష్టి ఇష్టపూర్వకంగా కాక పోయినా, వ్యర్ధమైపోతున్నది. అందుకే శాస్త్రజ్ఞులు సృష్టిలో కలుగుతున్న మార్పులవిషయం అనేక కోణాల్లో తెలుపుతూ ఉన్నారు. ఇటీవలి కాలంలో భూమి మునుపటికంటే వేగంగా తిరుగున్నదని చెప్పడం విన్నాము కదా! సృష్టి దాసత్వమునుండి విడిపించబడాలని ఎదురు చూస్తున్నది. వ్యర్ధపరచబడుతుంది, అంటే నశించిపోతుంది, అని అర్ధం. శాస్త్ర పరిజ్ఞానం, పరిశోధనలు సమస్త సృష్టి క్రమ క్రమంగా చెడిపోతూఉందని, దాని జీవం, జీవనకాలం తగ్గిపోతుందని స్పష్టంగా చెబుతున్నాయికదా! 22వ వచనములో సృష్టి ఇంతవరకు విమోచన కోసం మూలుగుతున్నదని వ్రాయబడిఉన్నది. “సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచునున్నదని యెరుగుదుము.”  మూలగడం అంటే బాధలో, ఒక గర్భిణీ స్త్రీ ప్రసవించడానికి పడే వేదన లాంటిది. నొప్పులు తీయడములో ఎంత బాధ గర్భిణీ స్త్రీలు అనుభవిస్తారో, సృష్టి అంతా, అంత వేదన, బాధ అనుభవిస్తూ ఉన్నది. శ్రోతలూ, గమనిస్తున్నారా! మన చుట్టు ఉండే సమస్త సృష్టి రానున్న విమోచన, మహిమ కోసం ఆశతో ఎదురుచూస్తూ ఉంది. ఈ మూలుగులు మనము కూడా కొంతవరకు అనుభవిస్తూ ఉన్నాము. 

      రెండవది, ఈ మూలుగులలో ఉన్న నిరీక్షణ, ఆశ, ఎదురుచూపు మహిమకోసమే అని సూచోన! ఇది కేవలం బయట సృష్టిలోనే కాదు, మనలో కూడా ఈ మూలుగు ఉన్నది. ఎందుకంటే, పౌలు గారు “ మనలో మనము మూలుగుచున్నామ” అని 23ఆ వచనము చివర్లో అంటున్నాడు. బయటి మూలుగు కంటే లోపలి మూలుగు దుఃఖకరమైనది, బలమైనది. ఎందుకంటే బయట సృష్టిలో ఉండే మూలుగు కనిపిస్తుంది, కానీ అంతరంగంలో మనము అనుభవించే మూలుగులు లోపలే ఉంటాయికదా!

     మన శరీరములనుండి ఎప్పుడు విడుదల పొందుతామో అని ఎదురు చూస్తూ ఉన్నాము కాబట్టి, అంతరంగములోని మూల్గులు ఒక విధమైన వేచిచూచే మూలుగులు.  మనము పునరుధ్ధానము గూర్చి మాట్లాడుతున్నాము.   శ్రోతలూ, బోధపడుతుందా? జాగ్రతగా వింటున్నారా? ఈ మూలుగడం ఆశాజనకమైన మూలగడం, ఎందుకంటే పౌలు గారు “మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితివిు” అని 24వ వచనములో అంటూ ఉన్నారు. దాని వివరణ తెలుసుకోవాలి. కనిపించేదానికోసం, లేదా మన వద్ద ఇప్పటికే ఉన్నదానికోసం ఆశతో ఎదురుచూడము కదా? ఇంకా ఈ విమోచన పొందలేదు కనుక ఎప్పుడు పొందుతామో అని ఆశతో ఎదురు చూస్తున్నాము. కానీ తప్పనిసరిగా పొందుతాము అనే నిరీక్షణ మనలో ఉన్నది, హల్లెలూయా! 25వ వచనములో ఈ సత్య్యo ఎంత స్పష్టంగా ఉందో గమనించండి: “మనము చూడనిదాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము” కాబట్టి, ఇది నిరీక్షణతో ఎదురుచూచే మూలగడమంటే! ఆశతో, ఎదురు చూస్తూ వెచ్చిఉండడం. ఒకానొక రోజు ఇక నిరీక్షణ, ఎదురు చూపులు ఉండవు. అప్పుడు, అనగా, మహిమ శరీరాలు పొందినపుడు  ఈ విమోచన పొందుతాము. ఇప్పుడు మనకందరికీ ఎందుకోసం ఎదురుచూస్తున్నామో దేనికోసం ఎలా ఎదురు చూస్తున్నామో అర్ధమయిందా?

     ఇక మూడవది, ఈ మూలుగు ఎలా కనిపిస్తుందో గ్రహించాలి. ఎలా వ్యక్తీకరిస్తుందో గమనించాలి. అది బలహీనతగా కనిపిస్తుంది. ఆపో. అంటున్నదేమిటి? పరిశుద్ధాత్ముడు మన బలహీనతలలో సహాయము చేస్తున్నాడు. మనకు ఎలా ప్రార్ధించలో తెలియదు కనుక మన బలహీనతలలో, ఆత్మీయ కొరతలలో విడుదల కోసం మూలిగినట్టుగా ప్రార్థిస్తాము. మాటల్లో చెప్పలేని భావాలు మూలుగుల్లో ఉంటాయి. బాధలు, వేదనలు, మనలను క్రుంగదీస్తాయి. అప్పుడు మనము ప్రార్ధించలేని స్థితిలో ఉంటాము. అటువంటి సమయములో కేవలం అంతరంగంలోని మూల్గులే మన ప్రార్ధనగా ప్రభువు సన్నిధికి చేర్చేవాడు పరిశుధ్ద్ధాత్ముడు. మనము ఎంత ధన్యులమో తెలుసుకుంటున్నారా? మన ప్రభువైన యేసునకు స్తోత్రం!

26వ వచనం చూద్దామా?  “ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనముచేయుచున్నాడు.” హల్లెలూయా! దేవుని పరిశుధ్ధ నామమునకు మహా స్తోత్రం! మనము ప్రార్థన చేయలేక మూలుగుతున్నపుడు మన హృదయ వేదనను దేవునికి అర్థమయ్యే విధంగా, ఆలాటి భాషలో పరిశుధ్ద్ధాత్ముడు దేవునికి చేరవేస్తాడు. 27వ వచనం : “మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్దులకొరకు విజ్ఞాపనము చేయు చున్నాడు.” పరిశుధ్ద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు, ఆయనకు దేవుని మనసు తెలుసు. మన పట్ల దేవుని చిత్తం అయనకు తెలుసు. దేవుని శ్రేష్టమైన చిత్తానుసారంగా ఆయన మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత ధన్యత! ఎంత కృప! ఎంత అద్భుతమైన ప్రణాళిక మన దేవునిది!

    మన మూలుగులు రానున్న మహిమ కోసం మనము ఎదురు చూస్తున్నామని జ్ఞాపకం చేస్తున్నాయి. మన బలహీనమైన శరీరాలనుండి ఒకానొక రోజు విమోచన పొందుతామనే నిరీక్షణతో మూలుగుతూ ఉన్నాము. మనకు సహాయం చేసే పరిశుధ్ద్ధాత్ముడు మనతో, మనలో జీవిస్తూ మన వేదన, బాధ, శ్రమలు, నిందలు, అపనిందలు, అన్నింటినీ దేవునికి చేరవేస్తూ ఉన్నాడు! ఇక బాధ పడకండి, సరికదా! సంతోషించండి, ఆనందంతో జీవించండి. ఈ శ్రేష్టమైన సత్యము మన హృదయాల్లో నింపుకొనుటకు ప్రభువు మనకందరికీ సహాయం చేయుగాక! అమెన్!!  

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...