రోమా పత్రిక అధ్యయనం - 28 8:14-17 ఆత్మలో జీవించడం ఎలాగు?

  •  

    చాలా మంది వృద్ధులు పెద్ద అక్షరములే చదువగలిగినందు చేత పెద్ద అక్షరములు వాడుతున్నాము. 

  • దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు  పొందండి.  మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో   వ్రాయండి,  మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం.  sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్  లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి. 
  • Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com. 
  • Or send a message by WhatsApp to 98663 41841

 

                                                రోమా పత్రిక అధ్యయనం  - 28    8:14-17 

ఆత్మలో జీవించడం ఎలాగు?

     జీవితంలో మనమెదుర్కొనే సమస్యలు ఏదో ఒక రీతిగా, ఎవరి ద్వారానైనా పరిష్కారమైతే ఎంత బాగుండు! అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ అది మనమనుకున్నంత సులభంగా, త్వరగా, జరగదని మనకందరికీ తెలుసు. అవునా? అవి సర్వాధికారి అయిన యేసు క్రీస్తు ప్రభువునకు సంపూర్ణంగా తెలుసు, కాదు కాదు, ఆయన అనుమతి లేకుండా ఏదీ మనలను సమీపించనుకూడా లేదు. మరి పరిష్కారమెలా కలుగుతుంది? యెసయ్య వాటికన్నిటికీ సరియైన పరిష్కారం, సమాధానం చెప్పగల శక్తిమంతుడు. కానీ ఆయన పధ్ధతిలో, ఆయన వాక్కు ప్రకారం, ఆయన టైమ్లో జరుగుతాయి, అంతే కాదు, ఆయన వాటిని పంపించిన, లేదా అనుమతించిన ఉద్దేశ్యమును తప్పక నెరవేరుస్తాయి. ప్రియ శ్రోతలూ, నిరాశ పడకండి, దేవుని మార్గములో ప్రయాణం చేస్తే, ప్రభువు సమస్తమూ చక్క బెడతాడు. వాటన్నిటి కోసం ప్రార్ధించుకుందాం, తలలు వంచండి.

దేవుడు మనలను తనతో సహవాసం చేయడానికి సృష్టించాడు. మన స్వభావము, శరీరము, మనసు, ఆత్మ అనే మూడింటి కలయిక. దేవుడు ఆత్మ ఆయనను మనము ఆత్మలో ఆత్మ ద్వారా కలుసుకునే అవకాశం ఉంది. కానీ, దేవునితో మన సంబంధం పాపమునుబట్టి తెగిపోయింది. ఈ సంభంధం తిరిగి కలపడానికి యేసు క్రీస్తు ప్రభువే మార్గం. యోహాను సువార్త 14:6. కేవలం క్షణికులమైన మనకు నిత్యుడైన దేవునితో ఆత్మ ద్వారా సహవాసం చేసే అవకాశం ఉండడం ఎంతో గొప్ప ధన్యత!

ఈ పూట ఆత్మలోని జీవo గూర్చి ధ్యానిద్దాo, నేర్చుకుందాం, రండి, రేడియోకు దగ్గరగా వచ్చి నెమ్మదిగా, ప్రశాంతంగా కూర్చోండి. మనము శరీరంలో జీవిస్తున్నంతసేపు సంపూర్ణలము కాదు, అదే సమయంలో, ఆత్మలో జీవిస్తేనేకాని సంపూర్ణులము కాలేము. కాని, శ్రోతలూ, ఆత్మలోని జీవమును మనము అనుభవించాలనే ఈ సవాలును ఎదుర్కుందాము, దేవుని పరిశుద్ధమైన శక్తిగల మాటలు విందాము. రోమా 8:14-17.

         14 దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.
              15
ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొందితిరి.      ఆత్మ కలిగినవారమై మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము.
              16
మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు.             17 మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు   ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము.

ఈ నాలుగు వచనాల్లో నాలుగు గొప్ప దీవెనలు ఉన్నవి, ఆత్మలోని జీవమును గూర్చి ధ్యానిస్తూ వాటిని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను.

      మొదటిది, ఆత్మలోని జీవం దేవుని కుమారులకు కలిగే దీవెన. 14వ వచనం “దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.”  ఆత్మలో జీవించడం ఒక అనుచరుని జీవితం. ఆనగా అతడు పరిశుద్ధాత్మున్ని అనుసరించి జీవిస్తాడు. వింటున్నారా, శ్రోతలూ, మనము పరిశుద్ధాత్మున్ని వెంబడించి అనుసరించి జీవించినపుడే, ఆత్మలో జీవిస్తున్నామన్నమాట. మనము పరిశుద్ధాత్మను అనుసరించడం, ఆయన వెంట నడవడం నేర్చుకోవాలి. దేవుని కుమారుల యొక్క ఋజువు ఏమిటి అనగా పరిశుద్ధాత్ముని వెంట నడుస్తూ, అనుసరిస్తూ జీవించడం. మన ఇష్టామ్ వచ్చినట్టు జీవించడం దేవుని కుమారులని చెప్పడానికి ఋజువు కాదు. మనము వంటరిగా మనసుకు తూచినట్టు, స్నేహేతులు చెప్పినట్టు, బంధువులు చెప్పినట్టు, యజమానులు చెప్పినట్టు జీవించడం, దేవుని కుమారుల ఋజువు కాదు. గమనించండి, సోదరీ సోదరులారా, పరిశుధ్ద్ధాత్ముడు మనలను నడిపించడానికి శక్తిమంతుడు, సిద్ధంగా ఉన్నాడు, మనము, అనగా నీవు నేను ఆయన మాట వినడానికి దేవుని వాక్యం ద్వారా ఆయన హెచ్చరించే వాటిని హృదయ పూర్వకంగా గ్రహిస్తున్నామా లేదా అని ఆలోచించవలసిన ఘడియ వచ్చింది. దేవుని ఆత్మ అనగా, పరిశుధ్ద్ధాత్ముని చేత అనగా, దేవుని వాక్యము చేత నడిపించబడo ఎంత గొప్ప ధన్యత కదూ!  

     రెండవది, పరిశుద్ధాత్ముని చిత్తము దేవుని కుమారులను పరీక్షించే దీవెన.  15వ వచనమును అతి జాగ్రతగా పరీక్షించండి: “ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగినవారమై మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము.”  పరిశుధ్ద్ధాత్ముని చిత్తం ఏమిటంటే, మనలను పాపము, భయము, యొక్క దాసత్వమునుండి విడిపించడమే! ఆయన నిన్ను నన్ను పాపము దాస్యము నుండి విడిపించి కుమారులు కుమార్తెలుగా ప్రతిష్టిస్తాడు, పునరుధ్ధరిస్తాడు. ఆయన మనలను దేవుని కుటుంబములో చేరుస్తాడు.

      వింటున్నారా శ్రోతలూ, విశ్వసించిన వారిలో జీవిస్తున్నది, భయము కలిగించే ఆత్మ కాదు, దాసత్వములో ఉంచే ఆత్మ కాదు. మనలను దత్తత తీసుకున్న కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించే దేవుని యొక్క ఆత్మ. మనము దేవుని కుటుంబములో ఆయన కుమారులుగా ఉండడం పరిశుద్ధాత్ముని చిత్తము. దీని ద్వారా ఆయన మనకు సహవాసమిస్తాడు. అంటే ఏమిటో మీకు తెలుసా? పరలోకపు తండ్రి అయిన దేవునితో మాట్లాడ్డం మీకు తెలుసా? అబ్బా అనే మాటను గూర్చి తెలుసుకుందాము. అది హెబ్రీ లేదా అరమెయిక్ భాషలోని మాట. అది అతిప్రియమైన వారితో లేదా మనకు అర్ధమయ్యే భాషలో చెప్పాలంటే, కడుపున బుట్టిన వారు అని అర్ధం. స్వంత పిల్లలకు తండ్రితో ఉన్న సంభంధము. పరిశుద్ధాత్ముడు మనలను తన చిత్తము ద్వారా దేవుని స్వంత పి‌ల్లలుగా చేసి ఆయన కుటుంబములో చేర్చి ఆయనతో సహవాసము కలిగిస్తూ ఉన్నాడు. పరిస్ధుద్ధాత్ముని చిత్తమును అనుభవించడం ఎంతటి దీవెన కదూ!

     మూడవది, పరిశ్ద్ధాత్ముని యొక్క సాక్ష్యం దేవుని కుమారులని దృవపరిచి నిర్ధారిస్తుంది. లేదా ముద్రిస్తుంది అని చెప్పవచ్చు. 16వ వచనo: “ మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు.  పరిశుద్ధాత్ముడు మనము దేవుని పిల్లలమని, మన స్థితిని నిర్ధారిస్తాడు. బైబిల్ సాక్ష్యం గురించి ఏమని బోధిస్తుందో  మీకు తెలుసా? ఏ విషయమైనా ఇద్దరు, లేదా ముగ్గురి సాక్ష్యమును బట్టి దృవపరచబడుతుంది, సత్యమని నిర్ధారించబడుతుంది. పరిశుద్ధాత్ముడు మనతో బాటు సాక్ష్యమిచ్చినపుడు మనము దేవుని పిల్లలమని తేటపడుతుంది. అందు చేత మన సాక్ష్యం పరిశుద్ధాత్ముని సాక్ష్యముతో సరిగా ఉండేలా మనము చూసుకోవాలి. ఆయన మనము దేవుని పిల్లలమో కాదో తెలియచేస్తాడు. మనము దేవుని పిల్లలమో కాదో మనము నిశ్చయం చేసుకునే సమయం ఆసన్నమయ్యింది. ఈ కరోన క్లిష్ట సమయాల్లో ఎవరి జీవితం ఎంత వరకో తెలియదు. నాకు తెలిసిన చాలా మంది మరణించారు. గొప్ప గొప్ప వారని పేరు ప్రతిష్టలు కలిగిన వారు గతించి పోయారు. వారి పేరు ప్రతిష్టలు వారిని దేవునివద్దకు చేర్చవు. మరి నీ సంగతేమిటి? ఆలస్యం కాకముందే మీరు దేవుని కుమారుడు లేదా కుమార్తె అయ్యారో లేదో, సరిచూసుకోమని దేవుని సేవకునిగా, మీ శ్రేయోభిలాషిగా మీ కోసం ప్రార్థిస్తున్నవానిగా దేవుని సజీవమైన వాక్య వింటున్న మీఅందదరినీ ప్రేమతో హెచ్చరిస్తున్నాను.

     నాలుగవది, దేవుని కుమారులకు, కుమార్తెలకు, ఆయన పంచి ఇచ్చే దీవెన పరిశుధ్ద్ధాత్ముని ఐశ్వర్యం. అంటే ఏమిటి? 17వ వచనములో ఉంది: “మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము.”  దీనిలో 

చాలా లోతైన భావము ఉన్నది. దేవుని పిల్లలకు ఆయన వారసులుగా ఒక దైవిక హక్కు ఉంటుంది. దేవుడు తన 

కుటుంబములోనికి మనలను చేర్చాడంటే, మనము ఆయన యొక్క వారసులమౌతాము కదా! మనము దేవుని 

ఐశ్వర్యమునకు వారసులమౌతాము. అంతే కాదు, “క్రీస్తుతోడివారసులము” ఈ మాటను గమనించారా శ్రోతలూ? 

అంటే క్రీస్తు ప్రభువుతో బాటు మనము నిలబడి దేవుని వారసులముగా ఉన్నాము. క్రీస్తు ప్రభువు తండ్రి వద్దనుండి 

పొందిన మహిమలో మనకు భాగము ఉంటుంది. సోదరీ సోదరులారా, నిత్యత్వములోని ఈ ప్రక్కలో జీవిస్తున్న 

మనకెవ్వరికీ దీని అర్ధం, అనుభవం, తెలియదు.  ఒకానొక రోజు దీని అర్ధం అనుభవం ఆయన కుమారులకు 

కుమార్తెలకు అర్థమవుతుంది.

        కానీ, మనము ఆయనతో శ్రమపడినట్లయితేనే, ఆయనతో మహిమను పంచుకుంటాము. మన రక్షకుడు యేసయ్య తన శిష్యులతో అన్న మాటను జ్ఞాపకం చేసుకొందాము. “నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.” యోహాను సువార్త 16:7. ఎంత మహిమతో నిండిన వాగ్దానమిది! ఎంతటి ఐశ్వర్యం! ఎంతటి మహిమ! నీలో నిరీక్షణ ఆశ ఉందా? లేనట్లయితే ఇప్పుడే యేసు ప్రభువు అనుగ్రహించే పాప క్షమాపణ అనే వరమును పొందడానికి పరిశుధ్ద్ధాత్ముడు నీకు సహాయము చేయుగాక!


  • దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు  పొందండి.  మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో   వ్రాయండి,  మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం.  sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్  లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి. 
  • Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com. 
  • Or send a message by Whats App to 98663 41841 Or call to share your testimony. God Bless you and your family!!


 

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...