రోమా పత్రిక అధ్యయనం - 30 8:28-30 నీ జీవితంలో దేవుని ఉద్దేశ్యం

 

  • చాలా మంది వృద్ధులు పెద్ద అక్షరములే చదువగలిగినందు చేత పెద్ద అక్షరములు వాడుతున్నాము. 

    దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు  పొందండి.  మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో   వ్రాయండి,  మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం.  sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్  లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి. 

  • Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com. 

  • Or send a message by WhatsApp to 98663 41841


రోమా పత్రిక అధ్యయనం  - 30    8:28-30

నీ జీవితంలో దేవుని ఉద్దేశ్యం

 

     మీకందరికీ వందనాలు! బాగున్నారా? మీ కుటుంబపు వారందరూ ఆరోగ్యంగా ఉన్నారా? కరోన 

అనే తెగులు మన చుట్టూ ఉన్న క్లిష్టసమయంలో అజాగ్రత్తగా నిర్ల్కష్యధోరణిలో ఉండకండి. తగిన 

జాగ్రత్తలు తీసుకోవడం అన్ని రీతులుగా మంచిది. చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడంకంటే ముందే 

జాగ్రతగా ఉండడం శ్రేయస్కరం. వాక్సిన్ తీసుకున్నా, తీసుకోకపోయినా, జాగ్రత్తలు తీసుకోవడం ఎన్నో 

నష్టాలు, కష్టాలను అరికడుతుంది. మీ శ్రేయోభిలాషిగా మీ కోసం ప్రార్ధిస్తున్నవానిగా ఈ హెచ్చరిక 

మాటలు చెప్పాలనిపిస్తుంది.

       ఈనాటి మనా అంశం మన పట్ల దేవుని ఉద్దేశ్యం. మనలను నిర్మించింది, జన్మించేలా చేసింది 

మన సృష్టికర్త సజీవుడైన దేవుడు. ఆయనకు మనలను సృష్టించడంలో ఒక ఉద్దేశ్యం తప్పనిసరిగా 

ఉంటుంది. ఒక శాస్త్రజ్ఞుడు పరిశోధన చేసి ఏదైనా క్రొత్త వస్తువు లేదా ఔషధం, కనుక్కుంటే దాన్ని 

వాడడానికి ఒక ఉద్దేశ్యముంటుంది కదా! మరి సమస్తమునకు సృష్టికర్త అయిన దేవునికి నిన్ను నన్ను 

నిర్మించడం, సృష్టించడంలో తప్పనిసరిగా ఒక ఉద్దేశ్యముంటుంది. ఆయన ఇచ్చిన ఆదేశం పాటిస్తే 

ఆయన నిర్మించిన ఉద్దేశ్యం నెరవేర్చవచ్చు. దేవుడు మనలను సృష్టించిన ఉద్దేశములు ఏమిటో 

తెలుసుకుందాం. లేఖన భాగం రోమా పత్రిక 8:28-30. బైబిల్లోని క్రొత్త నిబంధనలో 138వ పేజ్. 

గమనిస్తున్నారా?

         28.  దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి,         మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.

            29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు      ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.

            30. మరియ ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని   నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.

మన కోసం దేవునికి ఉన్న మూడు ఉద్దేశ్యములను మీరు తెలుసుకుంటే మీ జీవితం ధన్యమవుతుంది. మీరు ముందుకు సాగి పురోగతి సాధించగలుగుతారు.

     మనలను ఉత్తేజపరచడం దేవుని మొదటి ఉద్దేశ్యము. 28వ వచనము చివరలో ఉన్న మాటలేమిటి? “యెరుగుదుము”. మనము తెలుసుకొనడo దేవుని ఉదేశ్యం అని గట్టిగా నమ్మండి. మనము అయోమయoగా, అజ్ఞానంగా జీవించడం దేవునికి ఇష్టములేదు. మనము తెలుసుకొని ఉండవలసినవాటిని ఆయన దాచిపెట్టడు. మనము తెలుసుకోవాలని ఆయన కోరుతున్నాడు. మనకోసం ఆయన ఉద్దేశ్యం ఏమిటో అది మనం తెలుసుకోవడం ఆయన ఉద్దేశ్యం. దేవుని ప్రేమించే వారికి సమస్తము మేలుకోసం జరుగుతాయని మనము తెలుకోవాలని దేవుడు ఉద్దేశించాడు. తెలుసుకోవడానికి ఈ ద్వారం ప్రేమతో ప్రభువు తెరిచాడు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానమునకు మూలమని బైబిల్ సెలవిస్తుంది. ఎక్కడెక్కడో వెతికి ఏదేదో చేసి జ్ఞానము సంపాదించాలని ప్రయత్నాలు చేస్తూఉంటారు కానీ, దేవునితో సంబంధం సరిచేసుకొనేవరకు దేవుని ఉద్దేశ్యం ఏమిటో నీకు తెలియదు. ఆ తరువాత పిలువబద్దవారి గురించి బైబిల్ బోధిస్తుంది. “ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి” అని స్పష్టంగా వ్రాయబడింది కదూ! తెలుసుకొనడానికి పిలువబడడo ఆధారం. మనము తెలుసుకోవాలి కాబట్టి దేవుడు మనలను తన ఉద్దేశ్యము కోసం పిలిచాడు. ప్రియ సోదరీ సోదరులారా, దేవుడు సర్వము నెరిగినవాడు. ఆయన తన స్వరూపములో మనల్ని సృష్టించాడు. మనము జీవితములో ఎదుర్కునే అనుభవములు ఆయనకు తెలియనివి కావు. ఈ విషయం మనము తెలుసుకోవాలి, అజ్ఞానములో ఉండకూడదు, అయోమయంగా జీవించకూడదు.      

     మనలను మార్పు చెందించి క్రొత్త స్వరూపము కలిగించడo దేవుని రెండవ ఉద్దేశ్యము. 28, 29 వచనాలు కలిపి చదువుకొని ధ్యానించాలి. 28వ వచనానికి 29వ వచనం కలపాలి. “ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.”  “ముందు ఎరిగెనో,” అనే మాటలు గమనించారా? దేవునికి ముందే తెలుసు. ఈ విషయమును మనము గ్రహించటానికి గట్టి ప్రయత్నం చేయాలి. దేవునికి సమస్తం తెలుసు. జరుగుతున్న అన్నిటిలో ఏది అసత్యమో, ఏది సత్యమూ దేవునికి తెలుసు. ఏమి జరగనున్నవో, అవి ఎలాగు జరగవచ్చునో దేవునికి ముందే తెలుసు. నీవు, నేను పుట్టక ముందే, మనమంతా ఆయనకు తెలుసు. అంతే కాదు, ఆయన ముందే నిర్ణయించాడు. ఏమని ముందే నిర్ణయించాడు? మనము తన కుమారుని స్వరూపములోనికి మార్చబడాలని. సృష్టిని సృష్టించక ముందే దేవుని అనంతమైన అసమానమైన, అద్భుతమైన జ్ఞానములో మనము ఏ విధంగా మార్పు చెందాలో, ఏ ఏ రీతులుగా మలచబడాలో, ఎవరి స్వరూపములోనికి మార్చబడాలో ముందే నిర్ణయించాడు. మనము యేసు క్రీస్తు ప్రభువు స్వరూపంలోనికి ఆయన ప్రణాళిక వేశాడు. “స్వారూప్యం గలవారమగుటకు” అనే మాటల్లో దేవుని ఉద్దేశ్యం ఎంత స్పష్టంగా ఉందో గమనించండి! అది కూడా యేసుక్రీస్తు ప్రభువు అందరిలో పెద్దవాడు, ఆయన తరువాత మనమందరం ఆయన లాగా ఉండాలని దేవుని ఉద్దేశ్యం. దేవుడు ఆదిలో ఆదామును సృష్టించినపుడు తన స్వరూపములో నిర్మించాడు. పాపమునుబట్టి ఆ శ్రేష్టమైన స్వరూపమును మనమంతా పోగొట్టుకున్నాము. ఇప్పుడు యేసు క్రీస్తుప్రభువు ద్వారా మనము ఆయన స్వరూపములోనికి మార్చబడడానికి శ్రేష్టమైన ఆధిక్యత మనకు కలుగుతున్నది! దేవునికి స్తోత్రం!! అవును, మనము యేసు క్రీస్తు ప్రభువు పోలికగా జీవించాలి! ఇది గొప్ప సవాలు!

      మనలను రూపాంతరం చెందించడం దేవుని మూడవ ఉద్దేశ్యము.  ముందుకు వెళ్ళి 30వ వచనం చదువుకుందాం. నాతో బాటు బైబిల్లో గమనించండి, బిగ్గరగా చదవండి. “మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.” తన పిలుపు ద్వారా మనలను రూపాంతరం చెందించడం దేవుని ఉద్దేశ్యము. I కొరింధీ పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనమునుండి కొన్ని వచనాలు చదివితే ప్రభువు బలవంతులను, గొప్పవారినికి పిలువలేదని వ్రాయబడింది. కానీ ఆయన మనలను పిలిచాడు. లోకములో బలవంతులు, గొప్పవారు, తమలో తామే గొప్ప వారనుకుంటారు. మాకు దేవుడు అవసరం లేదనుకుంటారు. కానీ మనము దేవుడు మనకు అవసరమనుకొని ఆయన పిలుపు వింటాము. ఆయన మనలను పిలిచినందు చేత మనకు ఆయనతో సహవాసమనే భాగ్యం దొరికింది.

     శ్రోతలూ, గమనించండి, దేవుడు మనలను పిలిచిన తరువాత నీతిమంతులుగా తీర్చడానికి సిద్ధపరుస్తాడు. అనగా యేసు క్రీస్తులో మనలను పరిశుద్ధులుగా చేస్తాడు. యేసు క్రీస్తునందు మనము విశ్వాసముంచినందు చేత మనకు నీతి అనుగ్రహించబడుతుంది. యెషయ ప్రవక్త బోధించినరీతిగా మన స్వనీతిఅనే మురికిగుడ్డ పేలికలను ఆయన పారవేసి, తన నీతిని మనకు అనుగ్రహించి పరిశుధ్దులుగా చేస్తాడు. ఆ తరువాత, మనలను మహిమ పరుస్తాడని లేఖనం సెలవిస్తున్నది. ఇది రూపాంతరం చెందించడంలోని గురి! దేవుడు మనలను తన స్వరూపములో సృస్ష్టించినందుచేత, మనము మహిమలోనికి రూపాంతరం చెందడం ఆయన ఉద్దేశ్యం. ఆపో. పౌలు కోరింథీయులకు రాస్తూ, మనము మహిమా నుండి మహిమలోనికి మార్చబడతామని చెప్పాడు. II కోరింథీ 3:18. అమెన్!

    సోదరీ సోదరులారా, దేవునికి మనపట్ల మూడు ఘనమైన దొడ్డ ఉద్దేశ్యాలు ఉన్నాయి. మనము ఉత్తేజపరచబడడం, ఒకటి. రెండవది, మనము మార్పు చెందడం, మూడవది రూపాంతరం చెందడం. ఈ మూడు ఉద్దేశ్యాలు మనలో ప్రతి ఒక్కరి జీవితములో సర్వ శక్తిమంతుడు అయిన దేవుడు నెరవేర్చుగాక! అమెన్!!   

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...