- చాలా మంది వృద్ధులు పెద్ద అక్షరములే చదువగలిగినందు చేత పెద్ద అక్షరములు వాడుతున్నాము.
- దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు పొందండి. మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్ లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి.
- Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com.
- Or send a message by WhatsApp to 98663 41841
క్రిస్మస్ ప్రత్యేక సందేశం - Dec.13, 2020
క్రిస్మస్ రానేవచ్చేసింది! క్రొత్త డ్రెస్సులు, పిండి వంటలు, డెకరేషన్, బంధు మిత్రుల రాకలు, అంతా కోలాహలం, సందడి. రకరకాల హడావిడి, ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవాలని మీరు ఎంతో ఆరాటపడుతూ ఉండవచ్చు. క్రిస్మస్ను ఒక పండుగ లాగా ఆచరించి కేవలం ఆ ఒక్క దినము ఉత్సాహంగా ఉబ్బి తబ్బిబవ్వడం, ఆతరువాత అప్పులపాలు కావడం, అప్పులు తీర్చలేక శాంతి నెమ్మది పోగొట్టుకొని, ఒకరిని మరొకరు నిందించుకుంటూ వాదోపవాదాలు పెట్టుకోవడం చాలా చోట్ల పరిపాటి. అది నిజమైన పండుగా కాదు, అలాంటి వారు నిజమైన క్రైస్తవులూ కారు. నిజమైన పండుగ అంటే ఎందుకోసం పండుగ చేసుకుంటున్నామో, ఎవరు దానికి కారణమో తెలిసి ఉండాలి. ఆ ఆనందం హృదయమునిండా, ఇంటినిండా, ఎల్లప్పుడు, ప్రతి రోజూ ఉండాలి. అది నిజమైన క్రిస్మస్!
__________________________________________________________________________
ఈ బైబిల్ అధ్యయనo మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే, www.sajeevanireekshana.org అనే ఈ websiteను దర్శించండి. రోమా పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి అధ్యయనాలన్ని ఇదే వెబ్సైట్ లో ఉన్నవి. సమయం తీసుకొని వినండి, చందవండి, దేవుని వాక్కు మన హృదయాలను బలపరుస్తుంది. నిర్జీవమును తొలగిస్తుంది. మీ బంధువులకు మీ స్నేహితులకు, సాటి విశ్వాసులకు పరిచయం చేయండి. ఇతర వివరాలకు 9866 341841 నంబర్ నకు ఫోన్ చేయండి.
____________________________________________________________________
ఇంతకూ క్రిస్మస్ అంటే ఏమిటి? దాదాపు ప్రతిఒక్కరికీ అది యేసు క్రీస్తు ప్రభువు పుట్టిన దినమని తెలుసు. కానీ చాలామందికి ఆయన ఎవరో, ఎందుకు పుట్టాడో ఆయన నేపధ్యo ఏమిటో తెలియదు. పలు పలు రీతులుగా ఊహించుకుంటూ ఉంటారు, ఎవరు ఏది చెప్తే అది నమ్మి అదే సత్యమనుకుంటారు. కానీ దేవుని పరిశుధ్ద గ్రంధం ఆయన ఎవరు, ఆయన నేపధ్యం ఏమిటి? ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడు, ఏమి చేశాడు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమిస్తుంది.
ఈ ప్రశ్నలకు సమాధానం దేవుని పరిశుధ్ధ బైబిల్ గ్రంధంనుండి తెలుసుకుందాం. రండి రేడియోకు దగ్గరగా వచ్చి ప్రశాంతంగా నెమ్మదిగా కూర్చోండి. ఇంతకు మీ బైబిల్ నోట్ బుక్, పెన్ తెచ్చుకున్నారా?
ఆయన సర్వసృష్టికి మూలాధారం. ఆపో. పౌలు పరిశ్దుద్ధాత్మ చేత ప్రేరేపించబడి కొలస్సీ పత్రికలో యేసు క్రీస్తు ప్రభువు ఎవరో స్పష్ఠంగా వివరించాడు. 1:15 చదువుకుందాం. మీ బైబిల్ తెరిచి చూడండి.
“15 ఆయన
అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.
16 ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను
అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.
17 ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.
18 సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.
19 ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు,
20 ఆయన సిలువరక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోక మందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి
అభీష్టమాయెను.”
ఒక్కొక్క అంశం పరిశీలన చేద్దాం.
1. మొదటిది, యేసు క్రీస్తు ప్రభువు మన కన్నులకు కనబడని సత్యమైన నిజమైన దేవుని
యొక్క స్వరూపం. దేవుడు మన కన్నులకు కనబడడు. శ్రోతలూ, మనము అంతా అల్పులము, పాపులము, అనే
విషయం మర్చిపోకూడదు. నిజానికి దేవునితో మన సంబంధం పుట్టుకతోనే తెగిపోయింది. పాత
నిబంధనలో దావీదు, క్రొత్త నిబంధనలో ఆపో. పౌలు పాపపు స్వభావము గురించి ఎంతో వేదన చెందారు.
కీర్తన 51:5లో దావీదు, “నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున
ధరించెను.” అని తన స్వభావమును గురించి పరిశుద్ధుడైన దేవునితో క్షమాపణ కోరాడు. రోమా 7:23,24
గమనించండి. “వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా
మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను
చెరపట్టి లోబరచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు
శరీరమునుండి నన్నెవడు విడిపించును?” శరీరము అంటే శరీర స్వభావము లేదా పాపపు స్వభాము.
పాపము అనే ఒక చట్టము మన శరీరాల్లో ఉన్నదని ఆపో. గ్రహించి వేదన చెందడం గమనిస్తున్నాం.
ఇటువంటి పాపపు స్వభాము కలిగిన మనము దేవుని కన్నులతో చూడలేము. యోహాను సువార్త
1:18లో “ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే
ఆయనను బయలు పరచెను.” అని లేఖనం సెలవిస్తున్నది. 1 యోహాను పత్రిక 4:12లో ఇదే సత్యం
వ్రాయబడిఉన్నది: “ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు;” మనమెన్నడు
చూడని, మహా పరిశుద్ధుడైన దేవుణ్ణి యేసు క్రీస్తు మనకు చూపించాడు.
నిన్ను నన్ను, సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్త యొక్క కనిపించే స్వరూపమే యేసుక్రీస్తు ప్రభువు.
ఫిలిప్పు అనే శిష్యుడు తండ్రిని మాకు చూపించు ప్రభువా? అని అడిగినప్పుడు ప్రభువు సమాధానం
ఏమిటి? “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు......” గ్రీక్ భాషలో “ఐకాన్” అనే మాట
వాడారు. కంప్యూటర్ వాడేవారికి తెలుసు. ఐకాన్ అంటే అందులో ఉన్నదానికి గుర్తు ఐకాన్. సత్య
దేవుని నిజ స్వరూపమే యేసుక్రీస్తు ప్రభువు.
రెండవది, ఆకాశము, భూమి అంతరిక్షం అందులో కనిపించేవన్నీ యేసు క్రీస్తు ద్వారా, ఆయనకోసం, ఆయనయందు సృష్టించబడినవి. లేఖనమును జాగ్రతగా బైబిల్ తెరిచి గమనిస్తేనే ఈ అద్భుత సత్యములు అర్ధం అవుతాయి. ఆయన సృష్టించిన వాటిలో అదృశ్యమైనవి కూడా ఉన్నవి. అంటే ఏమిటి? భూమి గర్భంలో మనకు కనిపించనివి, ఆకాశం పైన మనకు కనిపించనివి, మనుష్యుల ఆత్మలు, ఏవేవో చెప్పడానికి సమయం సరిపోదుగాని కనిపించేవి, కనిపించనివి అన్నీ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా సృష్టించబడినవి. అంతే కాదు, సింహాసనములు, అంటే ప్రభుత్వాలు, అందులో ఉండే అధికారులు, ఇంకో మాటలో చెప్పాలంటే, సమస్త అధికారము ఆయన హస్తగతమే! సృష్టించబడినదేదీ ఆయన లేకుండా కలుగలేదు. ఇదే సత్యము యోహాను సువార్త 1:2లో కనిపిస్తున్నది. “సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు”. యేసు క్రీస్తు ప్రభువు సృష్టించబడినవాడు కాదు. ఆయన సృష్టికి మాలాధారం. అంతే కాదు ఆయన సమస్త సృష్టికి వారసుడు, సృష్టి అంతటిమీద సర్వాధికారం కలిగిన వాడు. ప్రభువు తన పరిచర్యలో చేసిన అద్భుతములు దీనికి బలమైన ఉదాహరణలు.
3. మూడవది, ఆయన అన్నిటి కంటే ముందు ఉన్నవాడు 17వ వచనం. క్రిస్మస్ దినాన శరీరధారిగా
జన్మించినప్పటికీ, యేసుక్రీస్తు ప్రభువు ఆదినుండి ఉన్నవాడు, నిజానికి ఆది, అంతము ఆయనే! ప్రకటన
22:13లో ప్రభువు చెప్పిన మాటలు జాగ్రతగా గమనించండి: “నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను
కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను.” సోదరీ, సోదరులారా, యేసు రక్షకుడు ఎవరో మీరు
గ్రహించారా?
4. నాలుగవది, 17వ వచనం రెండవ భాగం. “ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.” అంటే
ఏమిటి? ఆయన లేనిది, ఆయన సెలవు లేనిది ఏది కూడా ఒక ఘడియ, ఏ విషయంలోనూ ముందుకు
సాగదు. సృష్టిననతటినీ నిలబెట్టేవాడు, సంరంక్షించేవాడు, ఆదుకొనేవాడు, భరించేవాడు ఆయనే!
5. అయిదవది, సంఘము విషయంలో ఆయనే సంఘమునకు శిరస్సు. శరీరానికంతటికీ శిరస్సే గదా
కీలకమైనది! అంటే నడిపించే నాయకుడు, ఆయన ప్రణాళిక ప్రకారం, యోచనలు, ఉద్దేశ్యముల కోసం
సంఘమును భద్రముగా కాపాడి, సంరక్షించేవాడు ఆయనే! సంఘములో అన్ని విషయాల్లో ఆయనకే
ప్రాముఖ్యత ఉండాలి. సంఘాన్ని నడిపించే నాయకులు, సంఘ పెద్దలు, సంఘకాపరులు ఆయనకు
లోబడి, ఆయన లేఖనముల ప్రకారము సంఘమును నడిపించాలి. అధికారదాహముతో సంఘములో
ప్రవర్తించకూడదు. జీవము గల దేవుని సంఘములో ఇష్టానుసారం ప్రవర్తించేవారికి ఆయనే తీర్పు
తీరుస్తాడు. మృతులలో నుండి లేచుటలో కూడా మొదటివాడు ఆయనే! మానవాళి అంతటిలో, గతమైనా,
భవిష్యత్తు అయినా, యేసు క్రీస్తు ప్రభువే చనిపోయి తిరిగిలేచిన వారిలో మొదటి వాడు, ఆయనే ఏకైక
దేవుడు.
6. ఆరవది, ఆయనలో సర్వసంపూర్ణత నివసిస్తుంది. దైవతము యొక్క సమస్త గుణ గణాలు,
శక్తియుక్తులు దేవుని శక్తియొక్క సంపూర్ణత యేసు క్రీస్తులో ఇమిడి ఉన్నవి. ప్రతిఅధికారముపైన
అధికారము సర్వాధికాము కలిగినవాడు ఆయనే! కొలస్సీ పత్రిక 2:9 గమనించండి: “దేవత్వము యొక్క
సర్వ పరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు నివసించుచున్నది” దేవుని యొక్క ప్రతి గుణగణము, శక్తి,
అధికారము, పరిశుధ్ద్ధత, సార్వభౌమాధికారము, నీతి న్యాయము, మహిమ ఘనత, సమస్తము యేసు
క్రీస్తులో ఉన్నవి! హల్లెలుయ! ఎవరు జన్మించారని మనము సంతోషిస్తున్నామో, సంబరపడుతోన్నామో,
ఆయన ఎంతటి గొప్పవాడో, ఎప్పటినుండి ఉన్నవాడో, ఆయన శక్తి, అధికారము, మహిమ, బలము,
ఏమిటో గమనించరా?
7. ఏడవది, ఆయన జన్మించింది మెస్సీయగా, అనగ రక్షకునిగా! ప్రభువు జన్మించిన సమయములో
దేవదూత ప్రకటించినదేమిటి? తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు
యేసు అను పేరు పెట్టుదువు” మత్త. 1:21
ప్రియ సోదరీ సోదరులారా, క్రిస్మస్ పండుగ చేసుకోవచ్చు. కానీ అది అర్ధ సహితoగా ఉండాలి. ఎందుకు
సంతోషిస్తున్నామో తెలిసి ఉండాలి. ఈ రోజుల్లో చాలా సంగతులు ఏ అర్ధం లేకుంగా ఆచారాలు చేయడం
గమనిస్తున్నాము. నిజమైన సంతోషం పండుగ రోజు, పండుగ కోసం, పండుగ ఉన్నంత సేపు ఉండదు.
అది హృదయములో యేసుక్రీస్తును కలిగియున్నవారికి ఎల్లప్పుడు, ప్రతి పరిస్థితుల్లో, ప్రతి రోజు,
ఉంటుంది. అది లేనప్పుడు పండుగ రోజు మాత్రమే, ఎంత సంతోషించినా, అది క్షణికమైంది.
యేసు క్రీస్తు సర్వాధికారి. సర్వసృష్టికర్త. సర్వములో సర్వము. సర్వమునకు వారసుడు. సర్వమునకు
మూలాధారం. అంతే కాదు సర్వమునకు విమోచన కర్త ఆయనే, మానవాళి ఈ భేధము లేకుండా
పాపములో మగ్గుతున్నది. సర్వ సృష్టి పాపపు శాపముతో మూలుగుతున్నది. ప్రతి మానవుని
రక్షించడానికి, పాపపు శాపమునుండి విమోచించడానికి దేవుడే మానవుడుగా జన్మించాడు. ఆయనే
యేసు క్రీస్తు.
ఆయన నీ పాపమునుండి నిన్ను విమోచిస్తేనే నిజమైన విమోచన. ఆయన జన్మించింది, సిలువ
మీద తన ప్రాణమర్పించి, రక్తము కార్చిoది, నీ కోసమే! నీ స్థానములో ఆయనే మరణించి, నీ
పాపమునకు పరిహారమునిచ్చి ప్రాయశ్చిత్తము చేశాడు. మూడవ నాడు మరణమును జయించి,
లేచిన పరిశుద్ధుడు యేసు క్రీస్తు. ఆయనను విశ్వసించి నీవు విమోచన పొందుతావా? అదే నిజమైన
క్రిస్మస్!!
ఈ బైబిల్ అధ్యయనo మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే, www.sajeevanireekshana.org అనే ఈ
websiteను దర్శించండి. రోమా పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి అధ్యయనాలన్ని ఇదే
వెబ్సైట్ లో ఉన్నవి. సమయం తీసుకొని వినండి, చందవండి, దేవుని వాక్కు మన హృదయాలను
బలపరుస్తుంది. నిర్జీవమును తొలగిస్తుంది. మీ బంధువులకు మీ స్నేహితులకు, సాటి విశ్వాసులకు
పరిచయం చేయండి. ఇతర వివరాలకు 9866 341841 నంబర్ నకు ఫోన్ చేయండి.
ఇంతవరకు మీరు చదివిన ఈ క్రిస్మస్ సందేశము ఆడియో కూడా ఇవ్వబడినది. లింక్ క్లిక్ చేసి వినండి, డౌన్లోడ్ చేసుకొనండి, ఇతరులకు షేర్ చేయండి.
No comments:
Post a Comment