క్రిస్మస్ ప్రత్యేక సందేశం - 2 December 20,2020

 

  • చాలా మంది వృద్ధులు పెద్ద అక్షరములే చదువగలిగినందు చేత పెద్ద అక్షరములు వాడుతున్నాము. 
  • దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు  పొందండి.  మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో   వ్రాయండి,  మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం.  sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్  లేదా వాట్సప్ 8143178111 ద్వారా నైనా తెలియచేయండి. 
  • Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com. 
  • Or send a message by WhatsApp to 8143178111

 

 

 

క్రిస్మస్ ప్రత్యేక సందేశం 

     ప్రియ శ్రోతలందరికీ క్రిస్మస్ శుభం, సంతోషం, సమాధానం, కలుగుగాక! మీరు, మీ ఇంటిల్లిపాది క్రిస్మస్ శుభం, సంతోషం, సమాధానం, ఆనందం నిండారుగా పొందడానికి ప్రభువు తన నిండైన కృపను అనుగ్రహించుగాక! యేసు క్రీస్తు ప్రభువు మెస్సీయగా అనగా రక్షకునిగా, విమోచకునిగా జన్మించాడు. ప్రభువు జన్మించడంవలన చీకటిలో మగ్గుతున్న గలిలయ ప్రాంతము ఒక్క సారిగా వెలుగులు విరజిమ్మింది.

మీ బైబిల్ నోట్ బుక్ పెన్, తెచ్చుకోవడం మరచిపోకండి.

బైబిల్ అధ్యయనo వినాలనుకుంటే, www.sajeevanireekshana.org అనే websiteను దర్శించండి.

యెషయ 9:1-7 చదువుకుందాం. మీ బైబిలో జాగ్రతగా గమనించండి:

  1. 1.        అయినను వేదనపొందిన దేశముమీద మబ్బు నిలువ లేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను 

  2. దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్రప్రాంతమును, అనగా 

  3. యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు.
     

  4. 2   చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద 

  5.      వెలుగు ప్రకా శించును.
     

  6. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు కోతకాలమున      

  7. మనుష్యులు సంతోషించునట్లు దోపుడుసొమ్ము పంచుకొనువారు సంతోషించునట్లు వారు నీ సన్నిధిని 

  8. సంతోషించుచున్నారు.
     

  9. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచియున్నావు వాని మెడను కట్టుకఱ్ఱను 

  10. వాని తోలువాని కొరడాలను విరిచియున్నావు.
     

  11. యుద్ధపుసందడిచేయు యోధులందరి జోళ్లును రక్తములో పొరలింపబడిన వస్త్రములును అగ్నిలో వేయబడి దహింపబడును.
     

  12. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
    7. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.

      

      దేవునికి స్తోత్రం! హల్లెలూయ! దేవుని మాటలలో నిజమైన జీవం, నిండైన సంతోషం, నిత్య 

నిరీక్షణ కనిపిస్తున్నందుచేత నేను దేవునికి స్తోత్రం చెబుతున్నాను. మీరు కూడా ఇది 

అనుభవిస్తున్నట్లయితే నాతో బాటు మీరు కూడా రెండు చేతులు పైకెత్తి, మన మహా దేవునికి, 

మనవిమోచకుడుగా జన్మించిన మెస్సీయ యేసు రక్షకుణ్ణి బట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి!!

     వేదనపొందిన దేశము అని జెబులూను, నఫ్తాలి ప్రాంతములను పిలుస్తున్నారు. ఎందుకు? 

 

     II రాజుల గ్రంధం 15:29 చదివితే అర్ధమవుతుంది. “ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో 

అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఈయోను పట్టణమును, ఆబేల్బేత్మయకా పట్టణమును,  

యానోయహు పట్టణమును, కెదెషు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును,  

గలిలయ దేశమును, నఫ్తాలీ దేశమంతయును పట్టుకొని అచ్చట నున్నవారిని అష్షూరు దేశమునకు 

చెరగా తీసికొని పోయెను.” దేవుడు తన ప్రజలు ఇశ్రయేలీయులను అష్శూరు రాజు చేతికి 

బానిసలుగా అప్పగించాడు. అక్కడ ఆరంభమైంది దేవుని తీర్పు. క్రమ క్రమంగా వారందరినీ దేవుడు 

బానిసత్వానికి అప్పగించాడు. ఇది చీకటికి, శత్రువుల బలాత్కారం, ఛీత్కారం, ఉక్కుపాదానికి 

ఆరంభం వారు అణచివేయ బడ్డారు. అందుకే ప్రభువు వారి మధ్యలో యేసు రక్షకుని యొక్క 

అద్భుత కార్యాలు, విమోచన సంఘటనలు, స్వస్థతలు, అపవాడినుండి విడుదల క్రియలు, 

క్షమాపణ క్రియలు చేశాడు. ఇవే మాటలు మత్తయి సువార్త 4:12 లో ఎత్తి రాయబడ్డాయి. మీ 

 బైబిల్లో గమనించండి: “యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి  నజరేతు 

విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్న హూమునకు 

వచ్చి కాపురముండెను.  ​జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న 

సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలును 

గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్నవారికి వెలుగు 

ఉదయించెను. అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరు నట్లు (ఈలాగు జరిగెను.)”  

ప్రవచనాల నెరవేర్పు జాగ్రతగా గమనించారా? 

     

      వారికేమి కలిగిందని లేఖనం సెలవిస్తున్నది? చీకటిలో నడిచే వారికి గొప్ప వెలుగు కలిగింది. 

యేషయ 9:2 జనమును ప్రభువు విస్తరింపచేశాడు. ఇది అబ్రహామునకు ప్రభువిచ్చిన వాగ్దానము 

యేసుక్రీస్తు జన్మ ద్వారా నెరవేర్పు. 3వ వచనo. ఆశ్చర్యమైన సంతోషం. ఎలాంటి సంతోషం, ఎంత 

సంతోషమని లేఖనం సెలవిస్తున్నది? 3వ వచనం గమనించండి: “వారి సంతోషమును 

వృద్ధిపరచుచున్నావు కోతకాలమున మనుష్యులు సంతోషించునట్లు దోపుడుసొమ్ము 

పంచుకొనువారు సంతోషించునట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు.” ఉత్సాహముతో 

నిండిన సంతోషమును ప్రభువు కలిగించాడు. ఇది క్రిస్మస్ ద్వారా కలిగింది. యేసుక్రీస్తు రక్షకుని 

ద్వారా కలుగుతుంది. ఇంకా చూస్తే, 4,5 వచనాల్లో విమోచన, విడుదల వాగ్దానం చేయబడింది. 

కట్లు తెంపబడ్డాయి. కాడి విరగొట్టబడింది. రోమా ప్రభుత్వపు కట్లనుండి కాదు, సైతాను కట్లు, 

బానిసత్వమునుండి యేసు క్రీస్తు ప్రభువు ద్వారా దేవునితో వారి సంభంధమును బాగు చేసుకొనే 

వారందరికి కలుగుతుంది.

 

మా   ఫోన్ నెంబర్ 8143178111. మళ్ళీ ఈ అధ్యయనాలు వినాలని ఆశిస్తే, www.sajeevanireekshana.org అనే ఈ websiteను దర్శించండి.  మీ బంధువులు స్నేహితులకు, తోటి విశ్వాసులకు, ఈ రేడియొ కార్యక్రమాన్ని పరిచయం చేయండి

 

      

యేసు క్రీస్తు ప్రభువు కపెర్నహోములో తన శక్తిగల పరిచర్య చేస్తూ వేలాది మందిని పాపపు 

బానిసత్వమునుండి విమోచించాడు. సాతాను చెరనుండి అనేకులను విడుదల చేశాడు.

తరతరాలనుండి క్రిస్మస్ దినాన చదివే వాక్యభాగము 6వ వచనములో ఉంది:  ఏలయనగా 

 మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద 

రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి 

సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును”  “ఏలయనగా” అనే మాటలో చాలా 

లోతైన కనెక్షన్ ఉన్నది. ఇంతవరకు మనము తెలుసుకున్న విడుదల, విమోచన, దేన్నిబట్టి 

 జరుగుతుంది? యేసుక్రీస్తు జన్మనుబట్టి. పరిశుధ్ద్ధుడైన దైవకుమారుని రాకనుబట్టి. “మనకు 

శిశువు పుట్టెను” అంటే అర్ధం మనకోసం పుట్టడాని అర్ధం. ఆయన రాజు, రాజులకు రాజు, 

సమస్తసృష్టికి కర్త, విమోచకుడు. ఆయనకున్న బిరుదులు గమనించండి, ఆశ్చర్యకరుడు

అద్భుతకార్యములు చేయ శక్తిమంతుడు. సువార్తల్లో ప్రభువు చేసిన అద్భుతములు వివరంగా 

ఉన్నవి. ఎవ్వరూ, ఎప్పుడు చేయని అద్భుతములు, చరిత్రలో ఎన్నడూ జరగని విడుదల, 

విమోచన క్రియలు యేసు క్రీస్తు ప్రభువు చేశాడు. ఆయన నీ జీవితములో కూడా చేయగల 

శక్తిమంతుడు. ఆలోచన కర్త. ఎటుతోచని పరిస్థితిలో, క్లిష్ట పరిస్థితుల్లో ఆయన చిత్తమును 

తెలియపరిచే కృపగలవాడు మనకోసం జన్మించి, మరణించి, పునరుధ్ధానుడై తండ్రి కుడిప్రక్కలో 

సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు ప్రభువు. బలవంతుడైన దేవుడు. యేసు క్రీస్తు ప్రభువు దేవుడని 

దీని అర్ధం. ఆయన శక్తి, మహిమ, ప్రభావము, సర్వాధికారము కలిగినవాడని అర్ధం. జనములు, 

రాజ్యములు వాటి అధికారులు ఆయన హస్తగతమే! ఆయన తన ప్రజలను బానిసలుగా 

అప్పగించాడు, ఆయనే, రాజులను, చక్రవర్తులను, ఆయనను ఎరుగని వారిని కూడా, తన 

“దాసులుగా” వాడుకొని వారిచేతనే తన ప్రజలను తిరిగి వారి దేశానికి తీసుకొని వచ్చి వారిని నాటి 

స్థిరపరిచాడు. ఆయనను ఆయన బలమును నీవు ఆశ్రయిస్తావా? నిత్యుడగు తండ్రి. యేసుక్రీస్తు 

రక్తము ద్వారా తండ్రితో తెగిపోయిన నీ సంబంధాన్ని బాగుపరచుకున్నట్లయితే, ఆయన నీకు 

విడువని, ఎడబాయని తండ్రిగా నిన్ను ప్రేమతో, కరుణతో, జాలి, వాత్సల్యతతో అక్కున 

చేర్చుకుంటాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రివద్దకు తిరిగివచ్చినప్పుడు కుమారుణ్ణి 

ఉన్నదున్నట్టు హృదయుములో చేర్చుకొని అక్కున చేర్చుకొని సంతోషముతో కుమారుని స్థానము 

తిరిగి ఇచ్చిన సంఘటన గుర్తుకు వస్తుందా? (లూకా సువార్త 15 అధ్యాయము 11వచనము నుండి 

 24వ వచనము వరకు చదవండి.) సమాధానమునకు కర్త, అధిపతి. ప్రస్తుతం లోకములో 

కరువైంది సమాధానమే! దానికి యెసయ్య కర్త, అనగా లేనిచోటకూడ కలిగించగల శక్తిమంతుడు. అధిపతి, అనగా 

సమాధానముపైన అధికారము కలిగినవాడు. ఆయన నీకివ్వగలడు.

    స్వయానా దేవుడే మానవుడుగా దిగివచ్చాడు. ఆయనే యేసు క్రీస్తు. అందుకే ఇంత సంతోషం, 

విడుదల, విమోచన, సమాధానము. నీవు నాతోబాటు హృదయపూర్వకంగా ఈ క్రింది ప్రార్ధన 

చేసినట్లయితే ఆయన ప్రతి ఒక్కరినీ, ఏ బేధభావము లేకుండా, ప్రేమిస్తున్నవాడు.

 

ప్రార్ధన: పరిశుద్ధుడవైన నా సృష్టికర్తవైన దేవా, నా పాపమును బట్టి నీతో నా సంబంధం తెగి 

పోయిందని తెలుసుకున్నాను. నా పాపమునుండి నన్ను విమోచిచడానికి మీ కుమారుడు 

యేసుక్రీస్తును లోకమునకు పంపించావని నమ్ముతున్నాను. ఆయన కార్చిన పరిశుద్ధ రక్తములో 

నా పాపమును కడిగి నన్ను పరిశుధ్ద పరచుమని యేసు రక్షకుని పేరట వేడుకుంటున్నాను తండ్రీ, 

అమెన్!   

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...