దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు పొందండి. మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్ లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి.
- Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com.
- Or send a message by WhatsApp to 98663 41841
మీ అందరికీ వందనాలు! ఎలా
ఉన్నారు? ఈ దినాల్లో చాలా వేదనలు, సమస్యలు, ఆందోళనలు మన హృదయాలను
కలచివేస్తున్నాయి. అన్నిటికీ మనము వెంటనే పరిష్కారం వెతుక్కోలేము. ఎంత ప్రయతించినా
విఫలమయ్యారా? నిరాశపడకండి! దేవుని మాటలు, జీవపు ఊటలు! ఇక ఈ దినపు దైవ సందేశం!
రోమా పత్రిక అధ్యయనం - 10 -- పాపము ఒక వ్యాధి
ప్రజలలో వ్యాధులు కలిగి అవి ఒక తెగులుగా వ్యాపించడం
జరుగుతూ ఉంటుంది. వేరు వేరు సమయాలలో ప్రపంచo లోని అనేక భాగాలలో అలాంటి తెగుళ్లు వ్యాపించoడo జరిగినది.
కొన్ని సంవత్సరాల క్రితం అలాంటి తెగుళ్లు కలిగినవి. ఈనాడు కూడా కలరా, కామెర్లు,
లాంటి వ్యాధులు తెగులు లాగా మారడం గమనిస్తూ ఉంటాం. వైద్య శాస్త్రం వీటిని అధ్యయనం
చేసి వాటి నియంత్రణ, మందులు తెలుసుకున్నది. వాటిని అరికట్టడానికి శక్తికలిగిన
మందులు కనుక్కున్నారు.
ఎక్కువ శాంతం వ్యాదులు దాదాపు స్థానికంగా ఉంటాయి. కొన్ని
వ్యాదులకంటే మరికొన్ని వ్యాదులు కొన్ని ప్రాంతములలో వ్యాపించే అవకాశం ఉన్నది. కానీ
ప్రపంచం అంతట ప్రబలిన వ్యాధి లేదా తెగులు ఏది లేదు. కానీ ఒక వ్యాధి ప్రపంచమంతటా
ప్రబలి ఉన్నది. అది ఇతర వ్యాధుల లాంటిది కాదు. అది శరీరానికి కలిగే వ్యాధి కాదు,
గాని ఆత్మకు కలిగే వ్యాధి. ఆత్మకు కలిగే ఈ వ్యాధి అప్పుడప్పుడు శరీరానికి
సోకే అవకాశముంది. అదే పాపమనే వ్యాధి. అది విశ్వమంతా వ్యాపించింది, ఒక ప్రాంతానికి
గాని, ఒక భూభాగానికి పరిమితమైనది కాదు.
ఇది ప్రపంచమంతటా ఉన్నది.
అపోస్థలుడు పౌలు రోమా. 3:9-20 లో పాపము ఎలాంటి రోగమో ఎలాగు అంతటా వ్యాపించిందో వివిరించాడు:
9. ఆలాగైన ఏమందుము? మేము
వారికంటె శ్రేష్ఠులమా? తక్కువవారమా? ఎంతమాత్రమును కాము. యూదులేమి గ్రీసుదేశస్థులేమి అందరును పాపమునకు
లోనైయున్నారని యింతకుముందు దోషారోపణ చేసియున్నాము.
11. గ్రహించువాడెవడును లేడు దేవుని
వెదకువాడెవడును లేడు
12. అందరును
త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు.
13. వారి
గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు; వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది
14. వారి నోటినిండ శపించుటయు పగయు
ఉన్నవి.
15. రక్తము చిందించుటకు వారి పాదములు
పరుగెత్తు చున్నవి.
16. నాశనమును కష్టమును వారి మార్గములలో
ఉన్నవి.
17. శాంతిమార్గము
వారెరుగరు.
18. వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.
19. ప్రతి నోరు
మూయబడునట్లును, సర్వలోకము దేవుని
శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న
వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైనవారితో చెప్పు చున్నదని యెరుగుదుము.
మిత్రమా,
పాపము ప్రపంచమంతటా ఉన్న వ్యాధి అని మీకు తెలియచేయాలని ప్రయత్నిస్తున్నాను. ప్రతి
ఒక్కరికి అది సోకింది, ఎవ్వరూ తప్పించుకోలేరు. మనము పాపముతోనే పుట్టాము. నీవు ఎక్కడ
నివసిoచినా, నీ కులం ఏదైనా నీ జీవితంలోని గతం ఏదైనా, నీ తల్లితండ్రులు
ఎవరైనా, పాపము అందరికీ సోకింది. ప్రపంచములోని ప్రతి ఒక్కరికీ పాపమనే వ్యాధి
సోకింది. నా స్నేహితులారా, ఇది అందరికీ సోకింది.
పాపము వ్యకిగతమైనది. పాపము నీలో, నాలో వ్యక్తిగతంగా వ్యాపించింది గనుక పాపము ప్రపంచమంతటా ప్రతి ఒక్కరికీ సోకిందనే సత్యమును మనము తప్పించుకోలేము. అది మనసును ప్రభావితం చేస్తుంది. అపొస్తలుడు 13, 14 వచనములలో దీన్ని వివరిస్తున్నాడు. “వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు; వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది. వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి.” దేవుని సృష్టి అంతటిలో మనమే సహేతుకమైన ఆలోచన శక్తి కలిగిన వారము. మాట్లాడగలిగిన ఆవయవము మనకున్నది. ఒక భాషను మనము గొంతుకతో పెదవులతో నాలుకతో మాట్లాడగలము. మాట్లాడడానికి మనకు ఈ ఆవయవములు ఉన్నవి, వాటి ద్వారా మనము ఒకరితో ఒకరము మాట్లాడగలము. మీతో మాట్లాడడానికి నేను వాటిని వాడుతున్నాను. ఆపో. పౌలు పాపిని గూర్చి మాట్లాడుతూ 14 వ వచనములో “వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి“ అని చెప్పారు. నా స్నేహితుడా, సోదరీ, పాపము వ్యక్తిగతమైనది, చాలా వ్యక్తిగతమైనది.
పాపము
మనసునే కాదు, భావజాలమును కూడా ప్రభావితం చేస్తుంది. దీనిని ఆయన ఈ విధంగా
వివరిస్తున్నాడు. “రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తు చున్నవి. నాశనమును
కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతిమార్గము
వారెరుగరు. రక్తము చిందించుటకు వారి పాదములు
పరుగెత్తుచున్నవి" అంటున్నపుడు ప్రజలు ఈ విధంగా పగతీర్చుకునే మాటలు, భావాలు
వెళ్లగక్కుతున్నారని అర్ధం. వారు ఎవరినైనా చంపడానికైనా, చివరికి చంపడానికైనా
వెళతారు. పాపము హృదయము లోని భావములను, తలంపులను కూడా ప్రభావితం చేస్తుంది.
పాపము
ఆ వ్యక్తిలో లోతుగా పాకి వ్యక్తిత్వమంత
నిండుతుంది. ఆ తరువాత అతని లేదా ఆమెలోఉన్న చిత్తశక్తి, అనగా నిర్ణయాలు తీసుకునే శక్తిని
పాపభరితంగా చేస్తుంది. ఎందుకనగా పౌలు మాటలు గమనిస్తే “శాంతిమార్గము వారెరుగరు”.
వారు శాంతిని నిరాకరించి దేవునిమీద తిరుగుబాటు చేస్తారు. “వారి కన్నుల యెదుట
దేవుని భయము లేదు”
నా స్నేహితుడా, సోదరీ, పాపము ఒక వ్యాధి. అది ఒక వ్యక్తిగతమైన బాధ, వేదన, శ్రమ. పపoచము లోని ప్రతి ఒక్కరినీ చెడగొట్టి, కలుషితం చేస్తూ ఉంది. పాపము వ్యక్తిగతమైనదని నీవు తప్పక గ్రహించాలి.
పాపము
పూడ్చలేనంత నష్టపరుస్తుంది. దేవుడు తన చట్టం ద్వారా మాట్లాడాడు. 19, 20 వచనాలు
చాలా ప్రాముఖ్యమైనవి. నా ప్రియ స్నేహితుడా, సోదరీ, ఆపో. పౌలు సరిగ్గా ఎలా దీన్ని
బోధిస్తున్నాడో గమనించాలి. “ప్రతి నోరు మూయబడునట్లును........ ధర్మశాస్త్రము
చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైనవారితో చెప్పుచున్నదని
యెరుగుదుము” పాపమంటే ఏమిటో మనకు తెలియచెప్పటానికి దేవుడు తన ధర్మశాస్త్రము ద్వారా మాట్లాడి ఉన్నాడు. మనము పాపము చేసి
ఉన్నామని చెప్పడానికి దేవుడు తన ధర్మశాస్త్రము ద్వారా మాట్లాడి ఉన్నాడు. ఎవ్వరూ తనకు ఎదురు
మాట్లాడలేని విధంగా ఆయన తన ధర్మశాస్త్రములో మాట్లాడి ఉన్నాడు. పాపపు వ్యాధి చేత మనమందరము శ్రమ, వేదన బాధ
అనుభవిస్తున్నాము.
కాబట్టి ఎదురు మాట్లాడే వీలు లేదు. దేవునికి ఎదురు మాట్లాడి
జవాబివ్వడం సాధ్యం కాదు. దేవుడు చెప్పిందంతా సంపూర్ణంగా కరెక్ట్ (correct) గనుక మనమేది చెప్పలేము. “ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము
దేవుని శిక్షకు పాత్రమగునట్లును...........” ఇది చెప్పడం భయమును పుట్టిస్తుంది కానీ
నేను బైబిల్ చెప్పింది చెప్పక తప్పదు. ఈ పాపమనే వ్యాధి ఎటువంటి స్వభావమంటే ప్రతి
ఒక్కరూ దేవుని ఆదేశము క్రిందికి వచ్చి పూడ్చలేని నష్టం, వేదన, బాధ అనుభవిస్తుంటాము.
దేవుడు తన మాటను వెనుకకు తీసుకోడు. ఆయన తన మాటను ప్రక్కకు పెట్టడు. ఆయన తన మాటను మార్చడు. కాబట్టి ప్రతి నోరు మూయబడుతుంది. ఎవ్వరూ ఒక్క మాట చెప్పలేరు, ప్రపంచమంతా దేవుని ఎదుట దోషులుగా నిలబడతారు.
దేవుడు మనకు ఒక్కటే అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఒక్కటే అవకాశం! “ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది” రోమా. 3:20 మనకున్న ఒకే ఒక్క అవకాశం ఏమిటనగా ధర్మశాస్త్రము విధించిన శిక్షను ఒప్పుకొని ఆయన ఏర్పాటు చేసిన మార్గములో జీవించడం. ధర్మశాస్త్రము విధించిన శిక్ష మరణం. కానీ ఆయన మనకు ఏర్పాటు చేసిన మార్గం జీవం.
పాపము పూడ్చలేనంత శ్రమ, బాధ వేదన కలిగించే వ్యాధి. దానికి
ఒక్కటే ఔషధం దేవుడు తన మహిమగల కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా చూపించే
కరుణ.
కాబట్టి, పాపమునకు ఇంత ఘోరమైన దుష్ఫలితాలు ఉన్నందుచేత మన
కోసం దేవుడు చేసిన ఏర్పాటును అంగీకరించి ఒప్పుకొనేవరకు మనము నిస్సహాయులము. పాపము
యొక్క గుణములు గమనిద్దాం. పాపము సార్వత్రికమైనది, ప్రపంచమoతట ఉన్నది. పాపము వ్యక్తిగతమైనది, పాపము
పూడ్చలేనంత నష్టం, బాధ వేదన కలిగిస్తుంది. ఇప్పుడు, పాపమునుండి విమోచనకోసం దేవుడు
తన కుమారుడు యేసు క్రీస్తులో ఏర్పాటు చేసినందుకు మనము సంతోషించాలి. దేవుడు నన్ను
రక్షించిన ఆ అద్భుతమైన దినమునుబట్టి నేనెంతో సంతోషిస్తున్నాను. నీవు కూడా ఈ అనుభవo పొందుదువు గాక!
ప్రార్ధన: ప్రేమగల పరిశుద్ధుడవైన తండ్రీ,
మా పాపము స్పష్టంగా మాకు కనిపిస్తున్నది. మీ వాక్యము మా పతనమును ఎత్తి చూపిస్తుంది. అయ్యో, ఎంతటి భయంకరమైన పాపములో,
శిక్షలో, శాపములో మేమున్నాము? మమ్మును
కరుణించండి. దయ చేసి మా పాపములనుండి
మమ్మును, విడిపించండి. మీ కుమారుని రక్తముతో పాపమును శుద్ధి చేయమని, పరమ
రక్షకుడు క్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటునాము తండ్రీ, ఆమెన్!
Praise god sir in the name of our lord Jesus Christ sir..!
ReplyDeleteI'm S.Raghuyel from Mothkur
I heard the message which you said really it is soo blessing to us sir., Thank you sir
9177546296
Good to hear from you.
Delete