రోమా పత్రిక అధ్యయనం-11 3:21-26 - క్షమాపణ ఉన్నది
- దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు పొందండి. మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్ లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి.
- Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com.
- Or send a message by WhatsApp to 98663 41841
Praise the Lord! మీరంతా క్షేమoగా ఉన్నారు గదూ! “సజీవ నిరీక్షణ” శ్రోతలందరి కోసం
ప్రార్ధిస్తూ ఉన్నాము. దేవుని వాక్యము మన హృదయములను తెప్పరిల్ల చేస్తుంది. నా
మట్టుకు నేను ఈ ధ్యానాల ద్వారా ఎంతో విశ్వాసములో బలపడుతున్నానని
సాక్ష్యమిస్తున్నాను. మీ సాక్ష్యం వినాలని ఆశిస్తున్నాను. ఇక వాక్య ధ్యానం లోనికి వెళ్దాం!
ఆపో. పౌలు రోమీయులకు
వ్రాస్తూ ప్రపంచమంత దోషభరితమైనదని, అందుచేత ప్రజలందరూ మరణపు శిక్ష క్రింద ఉన్నారని
తేట పరిచాడు. దేవుని మార్గమునకు బయట ఏ నిరీక్షణ ఆశ లేదు. దేవునికి వ్యతిరేకంగా
తిరుగుబాటు, వ్యతిరేకత జరిగినది. ఈ సత్యం మన క్రైస్తవ విశ్వాసమును ఇతర మతాలకు
భిన్నమైనదిగా చేస్తుంది. దేవునికి
వ్యతిరేకంగా తిరుగుబాటు చేయబడినా, మనము ఆయన వద్దకు తిరిగిరావడానికి ఆయన మార్గం
ఏర్పాటు చేసిఉన్నాడు. కేవలం బైబిల్లోనే క్షమాపణకు ఖచ్చితమైన నిశ్చయమైన మార్గం మనకు
కనిపిస్తున్నది. బైబిల్ క్షమాపణకు చూపించే పధ్ధతిలో వెళ్తేనే మనము క్షమించబడ్డామని
తెలుసుకోవచ్చు.
బైబిల్ తప్ప వేరే ఎక్కడ కూడా అందరూ పాపం చేసిఉన్నారనే దైవికమైన
తీర్పు కనిపించదు. దీన్ని బట్టి బైబిల్ ప్రత్యేకమైనది. బైబిల్ లో తప్ప వేరే ఎక్కడా
కూడా క్షమాపణ కనిపించదు. క్షమించబడవచ్చు అనే విషయం అందరికీ సంతోషము కలిగుస్తుంది,
అందరూ స్వాగతిస్తారు. క్షమాపణ ఒక అద్భుతమైన సత్యం.
ఆపో. పౌలు రోమీయులకు వ్రాసినపుడు వారికి క్షమాపణ ఉన్నది అని నిశ్చయపరిచాడు. దాని ఏర్పాటు, నిబంధనలు రోమా. 3:21-26 లో విశదపరిచాడు.
21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని
నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.
22. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.
23. ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.
24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు
చున్నారు.
25. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని
26. క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా
బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా
తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.
క్షమాపణ
పొందటానికి వీలు కల్పించే నిబంధనలు కేవలం అవసరమైనవి,
మాత్రమే దేవుడు ఏర్పాటు చేసిఉన్నాడు. ఆయనకు స్తోత్రం!
క్షమాపణ కోసం యేసు క్రీస్తు నందు విశ్వసించడం అనేది ఒక నిబంధన. దేవుని నీతి తేటగా ధర్మశాస్త్రము లోనూ, ధర్మశాస్త్రమునకు మించికూడా దేవుడు స్పష్టపరిచాడు అనే సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలిసిన అవసరత ఉన్నది. దేవుని నీతికి ధర్మశాస్త్రము, ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నాయని ఆపో. పౌలు మనకు చెబుతున్నాడు. ఇక్కడ సత్యమున్నది. దేవుని నీతి ధర్మశాస్త్రమునకు మించి, దాటి, ఉన్నది. అయినప్పటికి, దానికి ధర్మశాస్త్రము, ప్రవక్తలు సాక్ష్యామిస్తున్నాయి. ఇది మనకెలా తెలుసు? 22వ వచనంలో ఉన్న విషయమేమంటే “దేవుని నీతి… యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనది..”. ఇక్కడ ఒక పద్ధతి తెలుస్తుంది. నా స్నేహితుడా, సోదరీ, దేవుని మార్గము తప్ప వేరే మార్గము లేదు. అది యేసు క్రీస్తు నందు విశ్వసించుట.
ఈ విశ్వాసము అందరికీ అందుబాటులో ఉంది. ఏ
బేధము లేదు. 22వ వచనము ఏ బేధము లేదని ప్రకటిస్తుంది. “యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి” అది వర్తిస్తుంది. ఇది ప్రాముఖ్యం. ఇది ఎంత ప్రాముఖ్యమంటే నీవు దీన్ని
మనసులో భద్రంగా పట్టుకోవాలి, పెట్టుకోవాలి.
యేసు క్రీస్తు నందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరికీ క్షమాపణ సిద్ధపరచబడింది.
నీవు ఎక్కడ ఏ ప్రాంతములో ఉన్నా. నీ తల్లితండ్రులు ఎవరైనా, నీ నేపధ్యమేదైనా, బేధం
ఏమిలేదు. నీ జీవితపు పరిస్థితులు క్షమాపణకు నిన్ను దూరం చేయలేవు.
ఈ క్షమాపణ అసమానమైనది, అద్వితీయమైనది.
నీవు ఇతరులకోశం విశ్వసించలేవు, ఇతరులు నీ కోసం విశ్వసించలేరు. నీకోసం నీవే
విశ్వసించాలి. నీయంతట నీవే నీ కోసం
విశ్వశిస్తే, తప్పక క్షమాపణ పొందుతావు.
అవును, యేసు క్రీస్తు నందు విశ్వసిచుటద్వారా నీవు క్షమాపణ పొందగలవు. యేసు క్రీస్తునందు విశ్వసించడం ద్వారా క్షమాపణ పొందగల ఈ ఏర్పాటు, నిబంధన, విశ్వాసముంచాలని నిశ్చయించుకున్న ప్రతి ఒక్కరికీ ఉన్నది. ఈ సత్యం ఈ లేఖన భాగములో ఎంతో స్పష్టంగా ఉంది. కాబట్టి మనము యేసు క్రీస్తు నందు విశ్వసించడం వలన క్షమాపణ పొందడo దేవుడు చేసిన ఏర్పాటు అని స్పష్టంగా అర్ధం చేసుకోవాలి.
యేసు క్రీస్తు నందలి కృప చేత అనేది క్షమాపణ కోసం చేయబడిన మరొక ఏర్పాటు, నిబంధన. తరువాతి రెండు
వచనములలో రెండు గొప్ప ప్రకటనలు ఉన్నవి. 23 వ వచ్చనములో ఒక ప్రకటన ఉన్నది. “ ఏ
భేదమును లేదు;
అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.” వారి స్వేచ్చను బట్టి
ప్రతి ఒక్కరూ పాపము చేసిఉన్నారు. ఏ ఒక్కరూ వారి పాపమునుబట్టి దేవుణ్ణి
నిందించలేరు. ఎందుకనగా ప్రతి ఒక్కరూ వారి ఇష్టానుసారముగా పాపము చేసిఉన్నారు. ఆపో.
పౌలు అందరూ పాపము చేసి గురి తప్పి ఉన్నారని చెబుతున్నారు. దేవుడు మనలను తన మహిమకోసo సృష్టించాడు.
కానీ మనము ఆ మహిమను పొందలేకపోతున్నాము. మనమంతా పొందలేక పోతున్నాము, గురి తప్పిఉన్నాము, మనమంతా పాపము చేసిఉన్నాము. అది మొదటి ప్రకటన.
24వ వచనములో రెండవ
ఆశీర్వాదకరమైన ప్రకటన ఉంది. “ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి
విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు.” తనoతట తానే దేవుడు ఈ క్రియ చేసి విమోచనను ఏర్పాటు చేసిఉన్నాడు. ఏ ధర
నిర్ణయించకుండానే! ఉచితముగా నీతిమంతులుగా తీర్చి, ఏ ధర మనవద్ద అడగకుండానే, ఏ విలువ
చెల్లించకుండానే! దేవుడు తన కృప చేత క్రీస్తు యేసు నందున్న విమోచన నిచ్చి
నీతిమంతులుగా తీరుస్తాడు. ఇది ఎంత మహిమకరంగా ఉందికదూ! అది చేయవలసిన ఆగత్యత ఆయనకు
లేదు. ఆయన స్వంత ఇష్టపూర్తిగా మనకు రక్షణ ఏర్పాటు చేసిఉన్నాడు,
క్షమాపణ మనకు విస్తరింపచేసి ఉన్నాడు. క్రీస్తు యేసు నందున్న విమోచన ద్వారా కృప చేత
దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చుతాడు.
మిత్రమా, మరొక మార్గము లేదనే సంగతి నేను మీకు తప్పక మళ్ళీ చెప్పాలి. యేసు క్రీస్తు కృప చేత క్షమాపణ కోసం ఏర్పాటు అందరికీ అందుబాటులో ఉంది. దేవుడు చేసిన ఈ ఏర్పాటు అందరి కోసం.
క్షమాపణ కోసం చేయబడిన ఏర్పాటులలో మరొకటి యేసు క్రీస్తు రక్తం. ఈ ప్రశస్తమైన సత్యం ముందున్న వచనములలో తేటపడుతుంది. మొదటిగా ఇది అవసరమైనది: దేవుడు తన కుమారుడు యేసు క్రీస్తును నిర్దేశించాడు. దేవుడు ఆయనను తన రక్తము చేత ప్రాయశ్చిత్తం చేయడానికి నిర్దేశించాడు. యేసు ప్రపంచములోని అందరి పాపమును మోసుకొని వెళ్ళడానికి దేవుని గొర్రెపిల్లగా మారాడు.
ప్రాయశ్చిత్తము
అనే ఈ మాటను జాగ్రత్తగా పరీక్షించాలి. ప్రాయశ్చిత్తం అంటే అర్ధం ఏమిటి? ఒకవేళ అది
కఠిన మైన మాట అనుకోవచ్చు గనుక నన్ను
వివరించనీయండి. ప్రత్యక్ష గుడారములోని అతి పరిశుద్ధ
స్థలములో ఉండే కరుణాపీఠమునకు
ప్రాయశ్చితమునకు సంభంధం ఉంది. మోషే సీనాయి కొండపైకి ఎక్కి దేవునినుండి ఆదేశాలను
పొందాడు. ఆయన ఒక మందసమును నిర్మించాలని దేవుడు ఆదేశించాడు. అది దీర్ఘ
చతురస్రాకారంలో ఉండాలి. ఆయన అ మందసమునకు మూత చేయాలి. ఆ మూతను కరుణాపీఠం అని పిలిచారు. రెండు కెరూబులు ఒక్కొకటి
ఒక్కొక్క వైపున దాన్ని కమ్ముకోవాలి. సంవత్సరమునకొకసారి ప్రధాన యాజకుడు ఆ కరుణాపీఠం
మీద బలిరక్తం ఏడు సార్లు చిలకరించాలి. దేవుడు తన ప్రజల పాపమును కప్పివేయడానికి
రక్తమును అంగీకరిస్తాడాని ఈ క్రియకు అర్ధం. ఎందుకనగా ఆ కరుణాపీఠం క్రింద ఉన్న
మందసములో పాపమునుబట్టి ఉల్లంఘించబడిన దేవుని ఆజ్ఞలు ఉన్నవి.
రెండవ అంశము దాని ఉద్దేశ్యము. “ఆయన తన నీతిని కనువరచవలెనని పూర్వము చేయబడిన పాపములను ..” యేసు సిలువ మీద రక్తము కార్చి మరణించకముందు చేయబడిన ప్రతి పాపము ఆయన చిందించిన రక్తము ద్వారా క్షమించబడ్డాయి. ఇది మనం అర్ధం చేసుకోవడం ప్రాముఖ్యం. దేవుడు క్షమించడానికి ఒక్కటే మార్గము యేసు క్రీస్తు చిందించిన రక్తమే.
ఇంకా
చూస్తే, పాత నిబంధన లోని బలులు దేవుని చిత్తమునకు అనుగుణంగానే ఉన్నాయి. కానీ
ఆ జంతువుల బలులు కేవలం తాత్కాలికమైనవని లేఖనములు బోధిస్తున్నవి. అవి
సంపూర్ణమైనవి కావు. కల్వరి సీలువ మీద యేసు క్రీస్తు చిందించిన రక్తము
పరిపూర్ణమైనది, చివరిది. దేవుడు ఈనాడు పాపము క్షమించే మార్గమిది.
యేసు
రక్తము ఏర్పాటు అందరికోసం చేయబడింది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను
పొందలేకపోయారు. కాబట్టి, మిత్రమా, ఇది నీకోసం, నా కోసం.
క్షమాపణ
ఉన్నది, కానీ దేవుడు చేసిన ఏర్పాట్లు, నిబంధన ద్వారా మాత్రమే సాధ్యం. ఈ
ఏర్పాట్లు, నిబంధనలు ఏమిటనగా యేసునందు విశ్వసించడం ద్వారా, యేసు క్రీస్తు ప్రభువు కృప ద్వారా, యేసు రక్తము ద్వారా, ఆయన మన కోసం చేసిన ఈ క్రియ
సరిగ్గా సరిపోతుంది. మరి ఏ రక్తము వలన కాదు. నేను చేసేది ఏదైనగాని, దేవుని పరిశుధ్ధ నీతి ప్రమాణాలకు
సరిపోవు. మనకోసం ఆయన చేసిన దాన్ని మనము ఒప్పుకొని, అంగీకరించాలి.
నీ పాపము క్షమించబడాలని ఆశ పడుతున్నావా? నీవున్న చోటనే ప్రార్ధించు. నీ
స్వంత మాటలతోనే ప్రార్ధించు. యేసు క్రీస్తు ప్రభువు హృదయమును ఎరిగిన వాడు గనుక నీ
పాపమును తప్పక క్షమించి నిన్ను శుద్ధి చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు.
ప్రార్ధన: శాశ్వతమైన ప్రేమతో నిండిన తండ్రీ, మేమంతా పాపులమే. మా పాపము నుండి మేము ఏమి చేసినా విడుదల పొందలేము. అందుచేత మీ కుమారుడు యేసు క్రీస్తు పరిశుద్ధ బలిని ఏర్పాటు చేసి ఆయన సిలువ మీద కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా ప్రాయశ్చిత్తం చేసినందుకు వందనములు. సజీవ నిరీక్షణ శ్రోతలందరు, వారి పాపము నుండి క్షమాపణ పొందడానికి మీ పరశుద్ధాత్మ సహాయము అనుగ్రహించమని క్రీస్తు నామమున ప్రార్ధిస్తున్నాము తండ్రీ, ఆమెన్!!
No comments:
Post a Comment