సజీవ నిరీక్షణ రేడియో & ఉజ్జీవము, నిరీక్షణ పరిచర్య


ప్రియ స్నేహితులారా,

 
కోవిడ్ అప్పుడప్పుడే లోకములో వ్యాపిస్తున్న సందర్భములో ఈ రేడియోపరిచర్యను ప్రారంభించడానికి ప్రభువే స్వయంగా నడిపి౦చడాని నమ్ముతున్నాము. అక్టోబర్ 5, 2020 న రేడియోలో మొదటిసారిగా ఈ ఈ కార్యక్రమమును ప్రసారం చేశాము. గతములో "వేద పాఠశాల", "సత్యాన్వేషణ" కార్య క్రమాల్లో పరిశుద్ధ గ్రంధమును రేడియోలో బోధించిడానికి నా రక్షకుడు నాకు  కృపనిచ్చారు. 1980 నుండి   'యేసు క్రీస్తులోని నిరీక్షణ' సందేశముతో ఆ నాడు ఆరంభమైన   పరిచర్య ఇంతవరకు కొనసాగుతూ ఉన్నది. రోమా పత్రిక అంతటినీ వచనం వెంబడి వచనం అధ్యయనం చేశాము. ఈ అధ్యయనాలు సిధ్ధం చేస్తున్నపుడు నా స్వంత హృదయమును, ప్రభువు నన్ను తన ఆత్మ చేత ముట్టిన సమయాలు, సంధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రభువు నన్ను ఆ విధంగా గద్దించినందుకు నేను ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

  • రేడియోలో ప్రసారం చేయబడేటపుడు వినాలని ఆశించే వారు ప్రతి బుధవారం రాత్రి 8:15 నుండి 8:30 వరకు మీడియం వేవ్లో వినే అవకాశమున్నది.  మీ ఫోన్, లేదా లాప్టాప్ లేదా డెస్క్ టాప్  కంప్యూటర్ మీదకూడా వినవచ్చు.  రేడియోలో ప్రసారం చేసిన బైబిల్ అధ్యయనాలన్ని  ఈ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. లేదా మీ దగ్గర రేడియో ఉంటే రేడియోలో పైన చెప్పిన సమయములో మీడియం వేవ్  MW 340 మీటర్ బాండ్ మీద - 882 KHz మీద  వినవచ్చు.   మీ ప్రార్ధన అవసరతలు sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్  లేదా ఫోన్ చేసి కానీ, లేదా వాట్సప్ మీద కానీ  ఈ ఫోన్ నంబర్ : 81431 78111  మీద తెలియచేయండి. 
  • ఈ వెబ్సైట్ లో అనగా www.sajeevanireekshana.org రోమా పత్రిక అధ్యయనాలన్ని రోమా 1:1 నుండి ఉన్న అధ్యయనాలన్నీ మొత్తం 58 అధ్యయనాలు అందుబాటులో ఉన్నవి. I కొ రింథీ పత్రికలోని అధ్యయనాలు ఇంత వరకు రేడియోలో ప్రసారమైన అన్ని బైబిల్ అధ్యయనాలు ఆడియో రూపములో, ప్లస్ చదవడానికి వీలుగా కూడా సిద్ధoగా ఉన్నవి.
  • మీ స్నేహితులకు బంధువులకు, విశ్వాసులకు "సజీవ నిరీక్షణ" రేడియో కార్యక్రమమును గూర్చి తెలియచేయండి. ఈ వెబ్సైట్ ను పరిచయం చేయండి. ప్రభువు మిమ్ములను కరుణించు గాక!  

Rev. & Mrs. Vijay Bhaskar Singaogu


No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...