- దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు పొందండి. మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం.
- Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com.
- or send a message or WhatsApp to 8143178111
జ్ఞానము కలిగిన వారు బుధ్ద్ధిహీనులైనప్పుడు......
20 వ శతాబ్దములో
జ్ఞానము క్రొత్త పుంతలు తొక్కి విప్లవాత్మకంగా మారిందని ప్రజలు అంటూ
ఉంటారు. నిజమే. విశ్వంలో మన చుట్టూ ఉన్నవాటిని మనం తెలుసుకొని మనకు మునుపు తెలియని
క్రొత్త రహస్యాలు ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాం. ఇంకా చూస్తే, ఈ నాడు అంతరిక్షంలో జరుగుతున్న
ప్రయాణాలు చూడండి. ఇప్పుడు కలుగుతున్న అణుశక్తి దాని ఉత్పత్తి గూర్చి
ఆలోచించండి.
కొన్ని పరిశోథనలు మనము గ్రహించలేనంత గొప్పవి. జ్ఞానముతో
తెలుసుకొన్నవాటిని భాధ్యతతో వినియోగించడం మనం గుర్తుంచుకోవాలి. మనము
నేర్చుకొన్నవాటికి, తెలుసుకొన్నవాటికి, మనo భాధ్యత వహించాలి. మనం తెలుసుకొని,
నేర్చుకొన్నవాటిని భాధ్యతలేని పధ్ధతిలో ఉపయోగిస్తే కలిగే ఫలితం గందరగోళం,
అధ్వాన్నం,
దీని కారణం ఏమిటంటే, మానవ హృదయం అపవిత్రమైనది. దేవుని పరిశుధ్ధ గ్రంధం దీన్ని స్పష్టంగా బోధిస్తుంది. మానవులకు ఇంత జ్ఞానము కలిగినప్పటికీ, వారు అప్పుడప్పుడు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తుంటారు. దేవుని పరిశుధ్ధ వాక్యము గమనిద్దాం, రోమీయులకు వ్రాసిన పత్రిక, 1:18-23 ధ్యానించి ఎప్పుడు జ్ఞానము కలిగినవారు బుద్ధ్ద్ధిహీనులుగా ఎలా మారారో తెలుసుకుందాం.
18. దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది.
19. ఎందుకనగా దేవునిగూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను.
20. ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.
21. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి.
22. వారి అవివేకహృదయము అంధకారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.
23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి.
నా స్నేహితుడా, సోదరీ, సత్యముపట్ల కొన్ని ధోరణులు, వైఖరి కలిగిఉండడం
చేత జ్ఞానులు బుధ్ధి హీనులు అవుతారు. ఆపో. పౌలు రోమీయులకు వ్రాసిన పత్రికలో వాటిలో
కొన్నింటిని ఎత్తి చూపించాడు.
సత్యమును క్రిందకు అదిమి ఒత్తిపట్టినందుచేత జ్ఞానులు బుద్ధ్ద్ధిహీనులైపోతారు ఈ లేఖన భాగంలో దేవుని కోపం పరలోకమునుండి బయలు పరచబడిందని బైబిల్ గ్రంధం మనకు తెలియచేస్తుంది. దేవుని కోపం నిజమైనది. అది బయలు పరచబడింది. మానవుల చెడుతనం మీద, భక్తిహీనత మీద దేవుని కోపం బయలుపరచబడింది. మనమిది తప్పక గమనించాలి. దేవుని ప్రేమ ఎంత నిజమో, దేవుని కోపం అంతే నిజమని తెలుసుకొని గమనించాలి.
దేవుడు తనంతట తాను దాచుకోలేదు. సత్యమును
తొక్కిపట్టే మనుషులలో దేవునిగురించి తెలుసుకొనడానికి వీలైనవన్నీ కనిపిస్తున్నాయని ఈ లేఖన భాగం
తెలుపుతుంది. ఆయనను తెలుసుకోవడం సాధ్యమే. ఆయన ప్రత్యక్ష పరచబడ్డాడు. ఆయన తనంతట
తానే కనుపరచుకున్నాడు.
గమనించండి, సత్యమును క్రిందకు
అదిమి ఒత్తిపట్టినందుచేత జ్ఞానులు బుద్ధ్ద్ధిహీనులైపోతారు. క్రిందకు ఒత్తి పట్టుట అంటే, సత్యమును మూసిపెట్టుట.
వారు సత్యమును దాచిపెడతారు. అది బయటికి పొక్కకుండా చేస్తారు. జ్ఞానము కలిగిన వారు
దాన్ని ఒత్తి పట్టటం ద్వారా, జ్ఞానము బయటికి
పొక్కకుండా దాచిపెట్టటం ద్వారా బుద్ధ్ద్ధిహీనులవుతారు.
లేఖనం 18వ వచనంలో ఏమంటుందో
గమనించాలి. “దుర్నీతిచేత సత్యమును అడ్డగించు”. సత్యమును అడ్డగించడం అంటే ఇదే అర్ధం. జ్ఞానము
కలిగిన వారు సత్యమును ఒత్తిపట్టేస్తే, అదిమిపట్టినట్టు చేస్తే,
బుద్ధిహీనులవుతారు. సత్యము పట్ల ఉండే తప్పుడు వైఖరులలో ఇదొకటి.
సత్యమును నిరాకరించి, నిర్లక్ష్యం చేయడం ద్వారా జ్ఞానము కలిగినవారు బుద్ధిహీను లు అవుతారు. అదృశ్యుడైన అనగా కనబడని దేవుని గుణగణములు ఆయన చేసిన సృష్టి ద్వారా తెలుసుకోవచ్చని బైబిల్ గ్రంధం ఇక్కడ దృవపరుస్తుంది. ఎందుకనగా దేవుడు సమస్తమును, అన్నింటినీ సృష్టించాడు. మనము చుట్టూ కలయచూచి, ఈ విశ్వమంతటినీ, అందులో ఉన్నవాటిని గమనిస్తాము. మనము మన చుట్టూ ఉన్న వాటిని పరీక్షించి చూస్తాము. సృష్టించబడిన వాటినన్నింటిని చూస్తాము. కనిపించిన వాటినిబట్టి, కనిపించని దేవుణ్ణి, ఆయన గుణగణములను మనము
తెలుకోవాలని ఆపో. పౌలు హెచ్చరిస్తున్నాడు. కనిపిస్తున్న వస్తువులను చూసి,
కనిపించని దేవుని గొప్పదనమును, శక్తిని, ఆయన సృజనాత్మకను గ్రహించవచ్చు.
మన ప్రపంచమును ఇక వేరే ఏ ఆధారంగా వివరించలేము. దేవుడు వాటిని
సృష్టించాడు. ఆయన నిత్యమైన శక్తి, దైవత్వము సృష్టి ద్వారా తెలుస్తున్నది. ఎంత
బలంగా కనిపిస్తున్నదంటే, ఎంత ఖచ్చితంగా తెలుస్తున్నదంటే, ఆ జ్ఞానులు దేవుని
సత్యమును నిరాకరించి, నిర్లక్ష్యం చేసేవారు, ఏ సాకు దేవుని ఎదుట చెప్పలేరు.
ఈ లేఖనం 21 వ వచనంలో ఆ మనుషులు చేసే దానికి కారణం ఏమిటో చెబుతుంది. “వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు.” దేవుని మార్పులేని చట్టం మనుషులకు ఆయన సత్యమును బోధిస్తుంది. దేవుని ఉనికిని మనుషులు నిరాకరించి నిర్లక్ష్యం చేయవచ్చు. కానీ ఆయన సత్యమును నిరాకరించి నిర్లక్ష్యం చేసినట్లయితే వారు దేవునికే శత్రువులవుతారు.
21వ వచనం లోని మిగతా భాగమును చూడండి. “కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేకహృదయము అంధకారమయమాయెను” దేవుని సత్యమును నిరాకరించి నిర్లక్ష్యం చేయడం దోషం. ఎందుకనగా దాని ఫలితాలు కఠినమైనవి. దేవుడు సృష్టించిన వాటిని గమనించడం ద్వారా ఆయన నిజమైన దేవుడని, సజీవుడనే సత్యము స్పష్టమవుతుంది. కానీ జ్ఞానము కలిగినవారు, ఈ సత్యమును నిరాకరించి లెక్క చేయక బుధ్ధి హీనులవుతారు. ఎందుకనగా వారు జ్ఞానము కలిగినవారమని అనుకొంటూ ఊహించుకుంటూ ఉంటారు, నిజానికి వారు బుద్ధ్ద్ధిహీనులు. కాబట్టి సత్యముపట్ల ఇది మరొక తప్పుడు వైఖరి. సత్యమును నిరాకరించి లెక్క చేయక పోవడం దోషం. అది జ్ఞానులను బుధ్ధి హీనులుగా చేస్తుంది.
జ్ఞానము కలిగినవారు
సత్యమును వక్రీకరించినందు చేత బుధ్ధి హీనులవుతారు ఈ మూడు వైఖరుల యొక్క పురోగతి లేదా వరుసక్రమం మీరు గమనించాలని ఆశిస్తున్నాను.
జ్ఞానము కలిగినవారు సత్యమును ఒత్తిపట్టినందు చేత బుధ్ధి హీనులవుతారు. జ్ఞానము
కలిగినవారు సత్యమును నిరాకరించినందుచేత బుధ్ధి హీనులవుతారు. వారు ఇంకొక్క అడుగు
ముందుకు వేసి సత్యమును వక్రీకరిస్తారు.
మనుషులు వారి మనసులను వారికి
న్యాయాధిపతిగా ఉంచుతారు. 22 వ వచనం ప్రకారము ఈ జ్ఞానులు జ్ఞానముకలిగినవారమని
చెప్పుకుంటారు, కానీ వారు బుధ్ధిహీనులయ్యారు. జ్ఞానము కలిగినవారు బుధ్ధిహీనులు
కావడం ఈ సందేశములోని మూల పాఠము. మిడిమిడి జ్ఞానం లేదా కొంచెము జ్ఞానం కలిగిఉండడం ప్రమాదకరమని చెబుతూ ఉందారు.
ఎందుకనగా కొంచెము జ్ఞానము కలిగినవారు, చాలా సార్లు, వారికి తెలిసినదాని కంటే
ఎక్కువ తెలుసు అనుకుంటారు.
కానీ దేవుని జ్ఞానంతో మన జ్ఞానమును పోలిస్తే, తప్పనిసరిగా మనమంతా బుధ్ధి హీనులమే! సమస్త జ్ఞానము కలిగినవాడు దేవుడే!! కానీ తాము జ్ఞానులమని చెప్పుకొంటూ బుద్ధ్ద్ధిహీనులైన ఈ మనుషులు సత్యమును ఎంత వక్రీకరిస్తారంటే దేవుని స్థానంలో మరొకరిని పెడతారు. దీనిని పౌలు 23 వ వచనంలో వివరిస్తున్నాడు. “వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి.” ఈ విధంగా మనిషి శాశ్వతమయిన, అక్షయమైన దేవుని మహిమను మార్చి వేసి, ఆ సత్యమును వక్రీకరించి, నశించి పోయే మనుషుల స్వరూపములో, పక్షుల రూపములో, జంతువుల రూపములో, నాలుగుకా ళ్ళ జంతువుల స్వరూపములో, ప్రాకు పురుగుల రూపములో వారి స్వంత విగ్రహములను చేసుకొంటారు.
ఇది ఎలా ఉంటుందో మనము చూసి ఉంటాము.
మనుషులు సత్యమును వక్రీకరించినపుడు ఇక అది సత్యమే కాదు కదా! సత్యం పలుచన
చేయబడలేదు, పాడు చేయబడలేదు, వక్రీకరించబడలేదు. సత్యం ఎల్లపుడూ సత్యం గానే ఉంటుంది. కాబట్టి జ్ఞానము కలిగినవారు సత్యమును
వక్రీకరించినపుడు వారు బుధ్ధి హీనులవుతారు, అని మనం చెప్పవచ్చు. ఇక వారి వద్ద
సత్యమే లేదు.
జ్ఞానులు సత్యమును
ఒత్తిపట్టినపుడు, లేదా అడ్డగించినపుడు బుధ్ధి హీనులవుతారు, వారు దాన్ని బయటికి
రాకుండాఅడ్డుకుంటారు. జ్ఞానులు సత్యమును నిరాకరించి నిర్లక్ష్యం చేసినపుడు బుధ్ధి
హీనులవుతారు. సత్యమేదో వారికి తెలిసినప్పటికీ దాన్ని ఒప్పుకొనకుండా, మరలిపోయి
నిర్లక్ష్యం చేసినపుడు వారు సత్యమును ఒప్పుకోవడానికి ఇష్టపడటం లేదని అర్ధం.
జ్ఞానులు సత్యమును వక్రీకరించినపుడు వారు బుధ్ధి హీనులై, సత్యమును మార్చివేస్తారు.
ప్రియ మిత్రమా , దేవుని పరిశుధ్ధ వాక్యములో సత్యము మన కోసం ఉన్నది. మనము దాన్ని నమ్మి గ్రహించి ఒప్పుకొనినపుడు జ్ఞానులమవుతాము. ఇది విశ్వాసము ద్వారా తెలుసుకుంటాము. ఇదే పరలోకమునకు మార్గము. నీవు ఈ మార్గములో జీవించాలని ఆశిస్తున్నవా? లేదా సత్యమును వక్రీకరిస్తున్నావా? సత్యమును సత్యముగా గ్రహించే కృప సత్యవంతుడైన పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించుగాక!
ప్రార్ధన: మిక్కిలి ఘనుడవు, మహోన్నతుడవైన పరమ తండ్రీ, మీ సత్యము తెలియచేయటానికి
మీరు సృష్టించిన సృష్టిని బట్టి వందనములు. సత్యమును సత్యముగానే ఒప్పుకునే దీనమనసు
మాకు అనుగ్రహించండి. సృష్టిని పూజించక సృష్టికర్తవైన నిన్ను ఘనపరచుటకు, నీ
శక్తిని మహిమను గ్రహించే కృపను మా శ్రోతలకు అనుగ్రహించమని ప్రియ రక్షకుడు క్రీస్తు
నామములో వేడుకుంటున్నాము, తండ్రీ!
ఆమెన్!!
No comments:
Post a Comment