I కొరింథీ-68 15:35-44
పునరుధ్ధానములోని వింతైన ప్రశ్నకు సమాధానం
రేడియో వద్దకువచ్చిన ప్రతి ఒక్క శ్రోతకు, మీరేవయసువారైనా, ఏ ప్రాంతపువారైన, ఏ కులమైన, ఏ మతమైనా, ఒక్కొక్కరికీ శుభములు, వందనములు! బాగున్నారా? మీ క్షేమ సమాచారం, ప్రార్థన మనవి, ఏదైనా, మీరు పంచుకోవాలని ఆశిస్తీ, ఫోన్ చయండి, మెసేజ్ పెట్టండి. గతించిన కొన్ని వారాలుగాI కొరింథీ 15వ అధ్యాయాన్ని అధ్యయనము చేస్తున్నాము కదా! యేసు క్రీస్తు ప్రభువు పునరుధ్ధానము ఒక చారిత్రక సత్యమని పరిశుద్ధ గ్రంధం బైబిల్ బోధిస్తున్నది. బైబిల్ బోధించేవన్నీ సత్యమే, కాని వాటిని అంగీకరించి దానికి తగినట్టుగా మన జీవితాల్లో మార్పులు చేసుకోవడానికి విశ్వాసము అవసరం.
__________________________________________________________________________________
తర్కించి, వివాదాస్పదంగా ఆలోచిస్తే, విశ్వసించలేము. విశ్వాసము చాలా బలమైన శక్తి. నమ్మలేనివి నమ్మడానికి విశ్వాసం అవసరం. విశ్వాసము తర్కము, వివాదమును దాటి ముందుకు పోతుంది. _________________________________________________________________
తర్కించి, వివాదాస్పదంగా ఆలోచిస్తే, విశ్వసించలేము. విశ్వాసము చాలా బలమైన శక్తి. నమ్మలేనివి నమ్మడానికి విశ్వాసం అవసరం. విశ్వాసము తర్కము, వివాదమును దాటి ముందుకు పోతుంది. ఈ దినాన్న I కొరింథీ 15:35-44 వచనాలు అధ్యయనం చేసి “వింతైన ప్రశ్నకు సమాధానం” తెలుసుకుందాము. రండి రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి. ముందుగా లేఖన భాగము చదువుదాము. 35. అయితే మృతులేలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురని యొకడు అడుగును. 36. ఓ అవివేకీ, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రదికింపబడదు గదా. 37. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమగింజయైనను సరే, మరి ఏ గింజయైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. 38. అయితే దేవుడే తన చిత్తప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. 39. మనుష్య మాంసము వేరు, మృగమాంసము వేరు, పక్షి మాంసమువేరు, చేప మాంసము వేరు.తనకు తాను గొప్పవాడనని అనుకునే ఒక మేధావి పౌలును ఒడిస్తానని అనుకున్నాడు. ఆనాడు అతడు, ఈనాడుకూడా అలాటివారు, ఇదే ప్రశ్న అడుగుతునారు. ఏమిటది? చనిపోయిన వారు ఎలా లేస్తారు? ఏ శరీరంతో తిరిగి లేస్తారు? ఈ ప్రశ్నతో అపో.పౌలు కుప్ప కూలిపోతాడని అతడనుకున్నాడు. ఈ ప్రశ్నలు సమంజసమైనవే! మనకు తెలిసినంతవరకు పునరుధ్ధానమైన శరీరము ఎలాగుంటుందో మనకు తెలియదు, మనము చూడలేదు. మరెలా దీన్ని నిరూపిస్తాము? చనిపోయినవాళ్లు ఏ విధాగా తిరిగి సజీవులౌతారు? వారికి ఎలాంటి శరీరము ఉంటుంది? దీనికి సమాధానం అపో. పౌలు దీటుగా ఇస్తున్నాడు. గమైనిస్తున్నారా? విత్తనానికి మొక్కకు తేడా ఉంటుందా? మీలో వ్యవసాయం చేసేవారు చాలమందే ఉంటారని నా అభిప్రాయం. ప్రభువైన దేవుడు ఆదిలో సృష్టిని సృష్టించినపుడు, ఏమన్నాడు? ఆది. 1:11 గమనించండి: “దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకార మాయెను.” దేవుని అద్భుతమైన సృష్టిలో ఉన్న ఒక విత్తనమును మీరు తీసుకొని దాన్ని భూమిలో విత్తుతారు, కొద్ది రోజుల్లో మొక్కై మొలిచి త్వరలో అది మహావృక్షమౌతుంది. అవునా? ఆ చిన్ని వితనములో నుండి ఇంత పెద్ద వృక్షము ఎలా వచ్చిందో మనకు తెలుసా? ఇంకాస్త ముందుకు అపో. పౌలు సాగిపోతూ మాంసం చాలా రకాలుగా ఉంటుందని తెలియ చెబుతున్నాడు. మనుష్యుల మాంసం, జంతువుల మాంసం, చేపల మాంసం, పక్షుల మాంసం. ఇన్ని రకాల మాంసము సృష్టిలో ఉన్నప్పుడు మరెన్నో రకాల మాంసము సృష్టికర్త చేయగలడా? లేదా? ఆలోచించండి. కాబట్టి ఈ ప్రశ్న వింతైన ప్రశ్న. ఇన్ని రకాల మాంసములు దేవిని అద్భుతమైన సృష్టిలో ఉన్నపుడు ఈ అనుమానం కొట్టి పారేయాల్సిందే! చిన్న వితనములోనుండి వృక్షము, మళ్ళీ దానిలో నుండి విత్తనాలు ఇదెంత అద్భుతం? శ్రోతలూ, జాగ్రత్తగా గమనించండి, పునరుధ్ధానములో దేవుని ప్రజలకు కలిగే శరీరం వేరే రకమైనది, పాపము చేత నిండిన ఈ లోకములో ఉన్నప్పుడు, పాపమునుబట్టి సైతాను అధికారములో ఉన్న ఈ లోకములో ఇన్ని రకాల శరీరాలు ఉన్నప్పుడు, మరో క్రొత్తరకమైన శరీరము మనకివ్వడం దేవునికి అసాధ్యమా? ఇంతవరకు మన కళ్ళతో మనము చూడనంత మాత్రాన పునరుధానములో ఉండే శరీరము విషయం ఊహ పోహలు అవసరం లేదు. ఎవరినైతే పౌలు “అవివేకీ” అని సంబోధిస్తూ త్రోసి పారేస్తున్నాడో, ఆ వ్యక్తి గురించి ఒక బైబిల్ పండితుడు ఎలా వ్యాఖ్యానిస్తున్నాడో తెలుసుకుందామా? జాగ్రతగా వినండి మరి!! ఎందుకు ఇది బుద్ధిహీనతగా అవుతుందంటే, మనము అనుదినము కళ్ళతో చూసే ప్రతి మాంసములో ఇన్ని రకాలు కళ్ళకు కనిపిస్తున్నపుడు, ఈలాంటి సమంజసము కాని అభ్యంతరం లేవనెత్తడం బుద్ధిహీనత కాక మరేమవుతుంది? ఏ రకమైన శరీరాము పునరుధ్ధానములో కలుగుతుందో ప్రస్తుతం మన కళ్ళకు కనిపించనంత మాత్రాన, మన కళ్ళకు ఇప్పుడు కనిపిస్తున్న ఇన్ని రకాలైన శరీరాలు ఉన్నాయన్న సత్యమును త్రోసిపుచ్చలేము కదా? ఒకవేళ మానమెప్పుడూ ఒక చిన్న విత్తనం భూమిలో విత్తి అది త్వరలో కుళ్ళిపోయి అందులోనుండే ఒక లేత మొక్క, అది మెల్ల మెల్లగా పెరిగి పెద్దై పెద్ద వృక్షముగా మారడం చూడకపోతే ఈలాంటి ప్రశ్నలు ప్రశ్నలు రావడం సహజమే! ఇవేవి చూడని వ్యక్తికి ప్రశ్నలు రావడం సహజమే! ఎందుకంటే అతడు విత్తనం భూమిలో చీకిపోవడం, అందులోనుండే నిండు జీవము కలిగిన మొక్క మొలవడం చూశాడు కాబట్టి, ఈలాంటి గొప్ప సంగతులు జరుగుతాయని నమ్ముతాడు. అందుచేత అపో. పౌలు కొత్త విషయం ప్రస్తావించడం మనము గమనించాలి. రెండవ అంశము, న్యాయమైన తగినట్టి సలహా. I కొరింథీ 15:40-44 చదువుకుందాం. 40 మరియు ఆకాశవస్తు రూపములు కలవు, భూవస్తురూపములు కలవు; ఆకాశ వస్తురూపముల మహిమ వేరు, భూవస్తురూపముల మహిమ వేరు. 41 నూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమవేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమనుబట్టి యొక నక్షత్రమునకును మరియొక సక్షత్రమునకును భేదముకలదు గదా 42 మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును; 43 ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలహీనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును; 44 ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరముకూడ ఉన్నది. అపో. ఇంకా వివరిస్తూ, వేరు వేరు వేరు రూపములు, వాటి మహిమను గూర్చి వివరిస్తున్నాడు. ఆకాశ వస్తువులు, భూమికి చెందిన వస్తువులు. వేటికి చెందిన గుణము, మహిమ వాటికి ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గురించి ప్రస్తావిస్తున్నాడు. సూర్యుని ప్రకాశము, వెలుతురు, మహిమ వేరు. మన శాస్త్రజ్ఞులు దాదాపు 15 కోట్ల కిలోమీటర్ల దూరమునుండి సూర్యుని విషయం కొంత తెలుసుకోలిగారు. వాళ్ళు తెలుసుకున్నది చాలా తక్కువే! ఒక్క విషయం మాత్రం తెలిసింది. సూర్యుని నుండి భూమి కొన్ని డిగ్రీల దూరం జరిగితే మనమంతా గడ్డ కట్టుకుపోతాము. కాస్త దగ్గరికి జరిగితే, మాడి మాసిబొగ్గైపోతాము. చంద్రునిలో వేరైనా మహిమఉందని లేఖనములు బోధిస్తున్నాయి. ఖగోళ శాత్రజ్ఞులు చంద్రమండలం వెళ్ళ్తున్న సంగతి మనకు తెలుసు. అదో వింత అనుభూతి. అక్కడ చేరిన వ్యక్తి “మానవాళికి ఇదొక ముందడుగు” అన్నాడట! వాళ్లనుకున్నవి అక్కడ వాళ్ళకు కనపడలేదు గాని, కొన్ని ఆసక్తికరమైనవి చూశారట! ఇక నక్షత్రాలకు వేరే మహిమ ఉందని పౌలు వర్ణించడం గమనించారా? ఒక నక్షత్రానికి ఉన్న మహిమ మరో నక్షత్రానికి ఉండదు. “నాసా” అనే సంస్థ ఇంకా ఇతర గ్రహాల గురించి తెలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా, అంతు పట్టడం లేదు. ఈ విధమైన వర్ణనలతో అపో. పౌలు 42వ వచనములో అంటున్న మాటలేమిటి? “మృతుల పునరుత్థానమును ఆలాగే” నశించిపోయే విత్తనము ఏ విధంగా భూమిలో విత్తబడిన తరువాత చనిపోయి అందులోనుండే క్రొత్త జీవము ఎలా పుట్టుకొస్తుందో, అలాగే పునరుధ్ధానములో కూడా ఈ శరీరము భూమిలో పాతిపెట్టిన తరువాత, కుళ్ళిపోయి మళ్ళీ అందులోనుండే నశించిపోని శరీరం పుట్టుకొస్తుంది! హల్లెలూయ! యేసు క్రీస్తు అద్భుతమైన సృష్టికర్త కదూ! ఘనత లేని శరీరముగా మరణము తరువాత విత్తబడుతుంది. మహిమతో తిరిగిలేస్తుంది! బలహీనతలతో పూడ్చిపెట్టబడుతుంది. గొప్ప బలముతో తిరిగి లేస్తుంది. ఇది ఎంతటి అద్భుతం గమనిస్తున్నారా? మనమంతా పులకించవలసినంత సంతోషకరమైన సువార్త! సాధారణమైన స్వాభావికమైన శరీరము విత్తబడుతుంది, ఆత్మీయ శరీరముతో తిరిగి లేస్తుంది. మట్టి శరీరం, దీనమైనది, నశించిపోయేశ్వభావము గల ఈ శరీరము ఘనత లేనిది, బలహీనమైనది, పునరుధ్ధానమైన తరువాత అత్యంత అద్భుతమైన శరీరముగా మహిమతో, ఘనతతో, శక్తితో ఆత్మీయమైన శరీరముగా తిరిగిలేస్తుంది! ప్రియ సోదరీ, సోదరులారా, ఈ నిరీక్షణ మీకు ఉన్నదా? లేనట్లయితే, మీ విశ్వాసమును పరీక్షించుకొని పటిష్టపరచుకోండి. హృదయమును ప్రభువునందు దిట్టపరచుకోండి. ఒకవేళ యేసు క్రీస్తు ప్రభువుతో మీకు సంబంధం ఇంకా లేకపోయినట్లయితే, విశ్వాసముతో ఆయనను ఇప్పుడే సమీపించండి. ప్రార్థన:
> II Cor-15 2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...
No comments:
Post a Comment