I కోరింథీ-63 15:12-19
అసాధ్యమైనవాటికి పరిష్కారం - నకిలీ స్థానాలు
మనమంతా అనేక అపోహల్లో జీవిస్తూ ఉంటాము. వాటిల్లో ఒకటి, మరణించే వారందరు దేవుని వద్దకు
వెళతారు అని భ్రమిస్తూ ఉంటాము. దేవుడు అత్యంత పరిశుద్ధుడు. పాపులమైన మనకు దేవుని పరిశుద్ధత గురించి
ఎంత మాత్రం తెలియదు. పాపులమైన మనము దేవుని వద్దకు చేరలేము. దేవుడు ఏర్పాటు చేసిన ఒకేఒక మార్గము
అత్యంత పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువు. ఆయన ద్వారా, ఆయన రక్తపు ప్రాయశ్చిత్తము ద్వారా మన
పాపములకు పరిహారము చేసుకుంటే, అప్పుడు దేవుని వద్దకు చేరగలము. మీకీ ఆసక్తి ఉన్నట్లయితే మీరే స్వయంగా
యేసు క్రీస్తు ప్రభువునకు మీ పాపములు క్షమించమని దానిద్వారా, దేవునితో సంబంధం కలిగించమని అడగవచ్చు.
మీ కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన:
I కొరింథీ పత్రిక 15:12-19 వచనాలు అధ్యయనం చేసి అసాధ్యమైన వాటిని ఎలా పరిష్కరించుకోవాలో
తెలుసుకుందాం.
కొన్ని నకిలీ స్థానాలను అపో. పౌలు చూపిస్తూ, వాటి ద్వారా అసాధ్యాలకు పరిష్కారము చూపుతున్నారు.
జాగ్రతగా వినాలి, లేనట్లయితే మీరు అపార్థమైన చేసుకోవచ్చు, లేదా అపోహలోనైనా పడవచ్చు.
మొదటి స్థానము, నకిలీ ప్రతిపాదన లేదా ప్రమేయము.12, 13 వచనల్లో ఈ విషయం స్పష్టంగా ఉన్నది.
12. క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని యెట్లు చెప్పుచున్నారు?
13. మృతుల పునరుత్థానము లేనియెడల, క్రీస్తుకూడ లేపబడి యుండలేదు.
నకిలీ ప్రతిపాదన ఏమిటనగా పునరుధ్ధానమనేది అసలు లేదు. ఇది సాధారణమైనది. లోకములో ఎవరు
మరణించినవారు తిరిగి బ్రతకడం చూడలేదు. ఆ మాటకొస్తే యేసు క్రీస్తు ప్రభువు మరణమయ్యాక తిరిజగి లేస్తున్న
సమయములో ఎవరు చూడలేదు. సరిగ్గా లేచే సమయములో ఎవరు చూడలేదు కాబట్టి కొందరు పునరుధ్ధానమే
లేదన్నారు. ప్రభువు లేచిన సమయములో ఎవరు చూడనంత మాత్రాన లేవలేదు అని చెప్పలేము. ప్రభువు
మృతదేహాన్ని చూస్తే తప్ప ఆయన లేవలేదు అని చెప్పలేము. అంతే కాదు, జాగ్రతగా తరచి చూస్తే, ప్రభువు
జీవించినట్టు ఎవరైన ఈ లోకములో జీవించారా? ఎవరు ఎప్పుడు మరణించినతరువాత మరలా జీవించనoత మాత్రాన
అసలు మరణము తరువాత జీవితము లేదు అని చెప్పలేము. ఎప్పుడైతే పునరుధానమే లేదు అని చెప్పినపుడు
యేసు క్రీస్తు ప్రభువు పునరుధ్ధానుడు కాలేదు అని చెప్పవలసి వస్తుంది. యేసు క్రీస్తు ప్రభువు పునరుధ్ధానుడు
కాలేదు అని చెప్పినపుడు మనము చేసే బోధ వ్యర్ధమే, మన విశ్వాసము కూడా వ్యర్ధమే, శూన్యమే అవుతుంది. అదే
నిజమైతే మనము గాలికోసం ప్రయాసపడుతున్నట్టే, మన ఆయాసము, శ్రమ, హింసించబడడం, అంతా వృధాప్రయాసే
అవుతుంది.
గమనించండి శ్రోతలూ, మన విశ్వాసము అతి ప్రాముఖ్యమైనది. యేసు క్రీస్తు ప్రభువు తిరిగి లేస్తున్న
సమయములో ఎవరు చూడలేదు. దేవుని దూత ఆ పెద్ద రాయి దొర్లించాడు. ప్రభువు శిష్యులు మన ప్రియ రక్షకుడు,
విమోచకుడు యేసు క్రీస్తును ప్రభువును కళ్ళారా చూచారు. తమ చేత్తో పట్టుకున్నారు. ఆయన మాటలు విన్నారు,
ఆయన పెట్టిన భోజనము తిన్నారు. ఆయనతో నడిచారు, ఆయనతో మాట్లాడారు. అవును, ప్రభువు పునరుధ్ధానుడై
తిరిగి లేచిన తరువాత, అపోస్తలులు ప్రభువును చూచారు. వారు నమ్మారు. అంతే కాదు, దానిబట్టి, ప్రభువు కోసం
తమ ప్రాణాలు అర్పించారు. ఒక శిష్యుడు యోహాను మాటలు జాగ్రతగా గమనించండి. I యోహాను పత్రిక 1:1-2.
“జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి
కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. 2. ఆ జీవము ప్రత్యక్షమాయెను;
తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవ మునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని
మీకు తెలియ పరచుచున్నాము.” ఈ మాటలు ఆయన యేసు క్రీస్తు ప్రభువు గురించి చెబుతున్నాడు. కాబట్టి మన
విశ్వాసము లేఖనములమీద, వాటిలోని సత్యము మీద ఆధార పడినపుడు నిశ్చలంగా, నిశ్చయంగా, నిటారుగా
ఉంటుంది. హల్లెలూయ!
రెండవ స్థానము ఏమిటి? నకిలీ వాగ్దానము. 14నుండి 18 వచనాల్లో ఈ విషయము దాగి ఉన్నది.
14. మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే.
15. దేవుడు క్రీస్తును లేపెనని, ఆయననుగూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము గదా?
మృతులు లేపబడనియెడల దేవు డాయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము.
16. మృతులు లేపబడని యెడల క్రీస్తుకూడ లేపబడలేదు.
17. క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు.
18. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి.
పౌలు అంటున్నదేమిటంటే, పునరుధ్ధానమే లేకపోతే మేము చేసే బోధ అంతా శూన్యమే. మేము చెప్పిన
సాక్ష్యము అబద్ధ సాక్ష్యమవుతుంది. పునరుధానమే లేకపోతే అసలు బోధ, సత్యము లేదు. ఇంత ప్రయాస పడి
సముద్రాలు దాటి, కాళ్లీడ్చుకుంటూ ఊరు ఊరు తిరిగి సువార్త ప్రకటించడం ఎందుకు? పౌలు రోమా సామ్రాజ్యమంతటా
తిరిగే అవసరమే లేదు. పునరుధ్ధానమే లేకపోతే, ఎన్నో దెబ్బలు తిని, ప్రయాణాల్లో ఎదురీది, దొంగలు, దోచుకునేవారి
బారినపడి దేవుని వాక్యం బోధించడమెండుకు? లక్షల రూపాయలు ఖర్చుపెట్టి రేడియోలో దేవుని వాక్యం
బోధించడమెందుకు? పునరుధ్ధానమే లేకపోతే యేసు క్రీస్తు ప్రభువు తిరిగి లేవనట్టే అవుతుంది. పునరుధ్ధానమే
లేకపోతే మన పాపములకు క్షమాపణ ఉండదు. ఒక్క సారి ఆలోచించండి, పునరుధ్ధానమే లేకపోతే, తరతరాలుగా
యేసు క్రీస్తు ప్రభువును ప్రపంచములోని అన్ని జాతులు, దేశాలు, జనాలు, తెగగలవారు వారి పాపములోనే ఉన్నట్టు.
అప్పుడు వాగ్దానము నకిలీ అయినట్టే. పునరుధ్ధానమే లేకపోతే నేను అబద్ధ సాక్షినవుతాను అంటున్నాడు పౌలు. ఈ
లేఖన భాగము విషయము ఒక గొప్ప భక్తుడు చెప్పిన మాటలు జాగ్రతగా వినండి. ఈ లేఖన భాగము యేసు క్రీస్తు
ప్రభువు మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి మరణించాడు. మన స్థానములో మనకు బదులుగా
మరణిoచాడు. పౌలు బోధించిన గొప్ప సత్యములలో ఇది ప్రాముఖ్యమైనది. ఈ సత్యము మీదనే కొరింథీ సంఘము
ఆధారపడి ఉంది. మన రక్షణకు, పాప క్షమాపనకు యేసు క్రీస్తు ప్రభువు పునరుధ్ధానము మూలాధారం.
మూడవ స్థానము నకిలీ భక్తి ఆరాధన. 19వ వచనం.
19. ఈ జీవితకాలముమట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యు లందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము.
పునరుధ్ధానమే లేకపోతే లోకములోని అందరికంటే మనము దౌర్భాగ్యులమే! ఎందుకు? మరణము తరువాత
ఇక నిత్య జీవమే లేదు. యేసు క్రీస్తు ప్రభువుతో సరియైన సంబంధం లేనివారు ప్రభువు ద్వారా ఈ శరీరానికి
సంబధించిన దీవెనలు, ఆశీర్వాదాలు కోరుకుంటూ ఉంటారు. ప్రభువు శరీరములో మనము ఉన్నoత కాలము మన
అవసరాలు తీరుస్తాడు, ఆరోగ్య విషయములో కరుణా చూపిస్తాడు. నిజమే, కానీ ప్రభువు ద్వారా కేవలం ఈ జీవిత
విషయములో మనము నిరీక్షణ పొందిఉంటే, అది సరిపోతుందా? యేసు క్రీస్తు ప్రభువు మనకు నిత్యజీవము
నివ్వడానికి పునరుధ్ధానుదయ్యాడు. అవును, ప్రభువు పునరుధ్ధానుడైనందు చేత మనకు కేవలo ఈ లోకములోనే
కాదు, మరణము తరువాత ఆయన మనలను లేపి తనతో బాటు తన సన్నిధిలో కూర్చుండబెట్టుకుంటాడు. మనము
మన విశ్వాసమును కాపాడుకొని ఆయన లేఖనముల ప్రకారము విధేయతో, వినయముతో, విశ్వావముతో స్థిరముగా
ప్రభువును వెంబడించినట్లయితే ఆయన నీకు భోజనము వడ్డించి నిన్ను ఘనపరుస్తాడు. “అంత్య దినమున వానిని
లేపుదును” అని యోహాను సువార్తలో వాగ్దానము చేశాడు. లూకా సువార్తలో 12:37లో ప్రభువు ఏమి వాగ్దానము
చేశాడో గమనించండి: “ప్రభువు వచ్చి యే దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు; అతడు
నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి, తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా
చెప్పుచున్నాను.” ప్రియ సోదరుడా, సోదరీ, ప్రభువు పునరుధానుడు కావడమే కాదు, ఆయన రాజులకు రాజుగా,
ప్రభువులకు ప్రభువుగా, సర్వాధికారిగా, సర్వలోక న్యాయాధిపతిగా త్వరగా వస్తున్నాడు. నీవు కుడివైపున ఉంటావా,
ఎడమవైపున ఉంటావా, గొర్రెలతో ఉంటావా, మేకలతో ఉంటావా? ప్రభువుతో ఉంటావా? బయట ఎడ్పు, పండ్లు కోరికే
నిత్య నరకములో ఉంటావా? నిర్ణయం నీదే!!
> II Cor-15 2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...
No comments:
Post a Comment