I కోరింథీ-47 13:1-3
ప్రేమ సమానం చేస్తుంది
మీరంతా బాగున్నారా? మీరు వ్యక్తిగతంగా సజీవ నిరీక్షణ రేడియో అధ్యయనాల ద్వారా, ఏ విధంగా
మార్చబడుతున్నది వివరంగా పంచుకోవడానికి వెనుకడుతున్నారా? అయితే మీ ఆత్మీయ సంపూర్ణతను
సరిచూసుకోవాలి. ఉన్నదున్నట్టు యదార్ధంగా మీ వ్యక్తిగత అనుభవము పంచుకున్నపుడే, అది సాక్షమవు తుంది.
ధైర్యం తెచ్చుకొని పంచుకోండి. అడ్రెస్ కోరుతూ మెసేజ్ పెట్టండి. అడ్రెస్ పంపిస్తాము. పార్ధించుకుందాం, తలలు వంచండి.
ఈ నాటి మన ధ్యానాంశం ప్రేమ సమానం చేస్తుంది. I కోరింథీ 13:1-3
1. మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును.
2. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.
3. బీదలపోషణకొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి నను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు.
పౌలు జీవించినా దినాల్లో ప్రేమ అనే మాటకు మూడు మాటలు వాడేవారు. మొదటిది, “ఇరాస్”. అనగా చాలా
నీచమైనది. శారీరకమైనది, లైంగికపరమైనది. రెండవది, “ఫిలియాస్” అనగా కుటుంబములో ఉండే అప్యాయతతో
నిండిన ప్రేమ. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, తల్లితండ్రులు పిల్లల మధ్య ఉండే అప్యాయమైన ప్రేమ. ఇక మూడవది
“అగాపే”. ఈ ప్రేమ యోహాను 3:16లో వివరించబడిన ప్రేమ. ఇది అత్యున్నతమైన ప్రేమ. “దేవుడు లోకమును ఎంతో
ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు
ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” ఆగాపే ప్రేమ తనంతట తానే
చూపించే ప్రేమ. తిరుగుగా ఏదీ ఆశించని ప్రేమ. ఈ ప్రేమతో చేసే మేలునకు తిరిగి మేలు చేయాలని, లేదా ఇంకేదైనా
చేయాలని ఆశించినటువంటి ప్రేమ. ఆపో. యోహాను దీని విషయం వ్రాస్తూ స్పష్టంగా వివరించాడు. I యోహాను 4:19 “ఆయనే మొదట మనలను ప్రేమించేను గనుక మనము ప్రేమించుచున్నాము.” ఇదే సత్యమును ఆపో. పౌలు రోమా పత్రిక 5:7,8 వచనాల్లో బోధించాడు. “నీతిమంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును. 8. అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.”
పరిశుద్ధగ్రంధం బైబిల్ అంతటిలో చాలా ప్రాముఖ్యమైన, సత్యమును బోధించే అధ్యాయమును మనమంతా ఈ పూట ధ్యానిస్తున్నాము. ఒక ప్రాముఖ్యమైన దైవజనుడు ఈ ప్రేమ గురించి ఏమని బోధిస్తున్నాడో, గమనించండి: “అన్ని తరములలో, కాలములలో, దేవుని సంఘమునకు గొప్ప స్ఫూర్తినిచ్చే అధ్యాయమిది. పరిశుధ్ధ గ్రంధం బోధించే ఈ ప్రేమను సరిగ్గా సంఘము అర్ధము చేసుకొని, దాని వల్ల పాఠాలు నేర్చుకొని ఉంటే ఎంత గొప్ప మార్పు సంఘములో కలిగి ఉండేది. ఇది ఒక అద్భుతమైన పాట! పాడుకునే కీర్తన! క్రైస్తవ ప్రేమను ఘనపరుస్తూ గొప్ప స్ఫూర్తినిచ్చే ఉదయ కిరణాలలాంటి చైతన్యముతో, రెక్కలు కట్టుకుని ఎగిరిపోయే అనుభూతిని ఆపో. పౌలు ఈ అధ్యాయములో పొంది ఉంటాడు.
ఈ లేఖనభాగమును జాగ్రతగా గమనించి చూస్తే, ఉన్నతమైన పురుషులు, ఉన్నతమైన స్త్రీలు, క్రింది స్థాయి పురుషులు, కింది స్థాయి స్త్రీలు అంటూ ఉండరు. అందరూ సమానమే! హల్లెలూయ! పౌలు భాషలు అని ప్రస్తావిస్తున్నపుడు, మనము మాట్లాడే వేరు వేరు భాషలు అని అర్ధం. మొదటి వచనము అర్ధం ఏమిటి? మనుషుల భాషలు, దేవదూతల భాషలు, ఇంకా ఎన్నెన్ని భాషలు నేను మాట్లాడినా, అవి కంచు తాళపు మోతలాగే ఉంటుంది. భాషలనేవి మానవులకు మాత్రమే ఉండే గొప్ప వరము. దేవుని సృష్టి అంతటిలో భాషతో భావాలు, తలంపులు, సత్యములు పంచుకునేది మానవ జాతి ఒక్కటే! ఈ భూమి మీద వేలాది భాషలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో వారి సరిహద్దుల్లోనే ఎన్నో భాషలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంధం బైబిల్ ప్రకారము ఆది. 11 లో మానవ జాతి దేవుని చేరడానికి ఒక ఎత్తైన గోపురం కట్టే సమయములో భాష అనే మాట వాడబడింది. అప్పుడు దేవుడు భాషలు తారుమారు చేయాలని నిశ్చయించుకున్నాడు. అలాగే చేశాడు. నోవాహు జలప్రళయము తరువాత, షీనారు మైదానములో బాబేలు అనే చోట ఇది జరిగింది. ఇక్కడ పౌలు మనుషుల భాషలలొ, దేవదూతల భాషల్లో మాట్లాడే విషయమును ప్రస్తావిస్తున్నాడు. మనకు తెలిసినంతమటుకు, ప్రతి మానవ గుంపునకు ఒక భాష ఉంటుంది. కానీ దేవదూతలకు భాష ఉందా? అవి నిజమైన భాషలా? పరిశుద్ధ గ్రంధం బైబిల్లో దేవదూతలు మనుషులను దర్శించినపుడు వారితో మనుషుల భాషలో మాట్లాడినట్టు మనము చదువుతున్నాము. అవునా? ఒక చిన్న ఉదాహరణ చూడాలనుకుంటే, యోహోషువ 5వ అధ్యాయము తెరవండి. 13-15 వచనములు. “13. యెహోషువ యెరికో ప్రాంతమున నున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా, దూసిన కత్తి చేత పట్టుకొనియున్న ఒకడు అతని యెదుట నిలిచియుండెను; యెహోషువ అతనియొద్దకు వెళ్లి, ‘నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధులపక్షముగా నున్నవాడవా?’ అని అడుగగా 14. అతడు ‘కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి యున్నాననెను’. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారము చేసి నా యేలినవాడు తన దాసునికి సెలవిచ్చునదేమని అడిగెను. 15. అందుకు యెహోవా సేనాధిపతి నీవు నిలిచియున్న యీ స్థలము పరిశుద్ధమైనది, నీ పాద రక్షలను తీసి వేయుమని యెహోషువతో చెప్పగా యెహో షువ ఆలాగు చేసెను.” దూత మరియమ్మ దగ్గరికి వచ్చి ఆమె రక్షకునికి జన్మ నివ్వబోతుందని చెప్పినపుడు లూకా మొదటి అధ్యాయములో ఉన్నట్టుగా ,ఆమె తన స్వంత భాషలో ఆమెతో మాట్లాడాడు. అది హెబ్రీ భాష అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. అంచేత దేవదూతలు మానవుల భాషలు మాట్లాడారు అని నిర్దిష్టంగా చెప్పవచ్చు. వారికి మనలాగా వారి స్వంత భాష ఉందో లేదో మనము చెప్పలేము. కానీ అపో. చెబుతున్న సత్యమేమిటంటే, ప్రేమ లేకపోయినట్లయితే, ఎన్ని భాషలు ఎంత మాట్లాడినా, అన్నీ గణ గణ మోగే కంచులాంటిదే! కంచు, తాళము ఈ రెండు వాయిద్యాలు, రాగము పలికే వాయిద్యాలు కాదు, కేవలము శబ్దము చేసే వాయిద్యాలు. ఈ వాయిద్యాలకు రాగము, సౌమ్యత లేనట్టే, ప్రేమ లేకపోతే, భాషలన్నీ పనికిరానివనే చెప్పక తప్పదు. రెండవ వచనం. “ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.” మర్మములు, జ్ఞానమును గూర్చి పౌలు మాట్లాడుతున్నపుడు వేదాంతపరమైన మర్మములు, వేదాంతపరమైన జ్ఞానము గూర్చి మాట్లాడుతున్నాడు. ఈ జ్ఞానమును పారమార్ధికమైన జ్ఞానము. అనగా అది భూసంబంధమైనది కాదు. మానవులు వెతికి, పరిశోధించి పట్టుకునేది.
జ్ఞానము విషయము ఆలోచించేటపుడు ఒక సంగతి మనసులో ఉంచుకోవాలి. మనము ఎంత జ్ఞానము సంపాదించి తెలుసుకుంటామో, మనకు తెలియనిది, సంపాదించ వలసినది ఇంకా చాలా ఉంది అని గ్రహిస్తాము. తరాల తరబడి మనకు బోధించిందేమిటి? జ్ఞానము ఎక్కువ అవుతూ ఉంటుంది. ప్రతి పది సంవత్సరాలకు జ్ఞానము రెండింతలు అవుతుందని చెబుతూ ఉంటారు. పరిశోధన వలన జ్ఞానము క్రొత్తవాటిని తెలుపుతూ ఉంటుంది. ఇది మనకు ఆశ్చర్యంగా, అద్భుతంగా అనిపిస్తుంది. ఎంతమాత్రము మనకు తృప్తినివ్వని జ్ఞానము సంపాదించుకుంటూ పోదామా? లేదా ప్రేమతో నిండి మన తోటి సహోదర సహోదరీలను ఆ ప్రేమతో సంపాదించుకుందామా?
ఆ తరువాత పౌలు “కొండలను పెకలించగల పరిపూర్ణ విశ్వాసము” గూర్చి ప్రస్తావించాడు. నిస్సందేహంగా ఈ విశ్వాసము ఆవగింజ కంటే పెద్దే! మత్తయి. 17:20లో మన ప్రభువు ఆవగింజంత విశ్వాసముoటే, కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడాలి అంటే పడిపోతుందని సెలవిచ్చారు. పౌలు అంటున్నదేమిటి? అంతటి పరిపూర్ణ విశ్వాసము నాకుంటే, వ్యర్ధమే! మూడవ వచనం. “బీదలపోషణకొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను...” అంటే ఏమిటి? పేదలకు ఆహారం పెట్టడం కావచ్చు. మన చుట్టూరా ఎంతో అవసరత ఉన్నది. ఎంతో మంది నిరాశ్రయులు ఉన్నారు. ఇల్లు వాకిలి లేక, సహాయములేక ఎందరో ఉన్నారు. మనము ఎంత మందికి ఎన్ని విధాలుగా సహాయము చేసిన, ప్రేమ లేకపోతే అంతా వ్యర్ధమే. “కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను...” అంటున్నాడు కదా! హతా సాక్షిగా ప్రాణమివ్వడానికి సిద్ధంగా ఉన్న కూడా, ప్రేమ లేకపోతే అంతా వ్యర్ధమే. అవును, ప్రేమ సమానం చేస్తుంది. దేనిలోనైనా, ఎంత చేసినా, ఏమి చేసినా, ప్రేమ లేకపోతే అంతా శూన్యమే, వ్యర్ధమే.
ప్రియ సోదరీ, సోదరులారా, యేసు క్రీస్తు ప్రభువును రక్షకునిగా ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరికి, అనగా ఏ గ్రామములో ఉన్నా, ఏ కులమునకు చెందిన వారైనా, ఏ డినామినేషన్ వారైనా, యేసు క్రీస్తు ప్రబువు చూపిన ప్రేమ వారికి నీవు, నేను పంచి ఇవ్వాలి. ఇది పరీక్ష సమయం. మన క్రియలలో, తలంపులలో, మాటలలో, కన్నులలో, ప్రస్ఫుటంగా ప్రేమ కనిపించకపోతే, ప్రేమ హృదయములో లేకపోతే, అంతా పనికిమాలిన జీవితమే! ప్రార్థన:
No comments:
Post a Comment