I కోరింథీ-43 12:12-20
శరీరము ఒక్క ఆత్మ చేత ఐక్యపరచబడుతుంది, వర్గీకరించబడింది
ఒక జంక్షన్ లో ఉన్నపుడు ఎటు పోవాలో తెలియదు కదా! అప్పుడు సరియైన ఆలోచన, బుద్ధి, ఉపదేశం అవసరం.
ఎవరివైపు చూద్దాం? దేన్ని ఎంచుకుందాం? దేవుని వాక్యములో సరియైన ఉపదేశం ఉన్నది. సంఘము బలమైనదైతే,
సరియైనదైతే సంఘములో కూడా ఉపదేశం అందుబాటులో ఉండాలి. సంఘము అని మనము పిలుస్తున్న మాట
మూల భాష గ్రీక్ లో “ఎక్క్లేసియా”. దాని అర్ధం: “బయటికి పిలువబడిన ప్రజలు” దేవుని వాక్యప్రకారం ఉన్న సంఘమైతే
అక్కడ లోకములో ఎక్కడ లేని బంధం, ప్రేమ, పరిశుద్ధత ఉండాలి. కానీ సంఘములోనికి వచ్చే ప్రతి ఒక్కరికీ ఈలాంటి
అవగాహన ఉండదు. దీన్ని బట్టి సంఘములో ఎన్నో విభజనలు, కుట్రలు, కుతంత్రములు, రాజకీయాలు, అధికార
దాహము, మొదలైన చీడ పురుగులు ఆనాటి కోరింథీ సంఘములో ప్రవేశించినట్టు ఈ నాటి సంఘములో కూడా
ప్రవేశించాయి. సంఘములోని ప్రజలు ప్రభువును విడిచిపెట్టి మనుషులను పట్టుకొని వారికి నమ్మకంగా ఉండదాన్ని
పౌలు దీటుగా విమర్శించాడు.
ఒక ముఖ్య ప్రకటన: చదువు లేనందున, లేదా మరే కారణము చేతనైనా పరిశుద్ధ గ్రంధం బైబిల్
చదవలేకపోతున్నారా? ఆది కాండం నుండి ప్రకటన వరకు, వినాలని ఆశపడుతున్నారా? మీ కోసం “ఆడియో
బైబిల్” అనే చిన్న ఉపకరణం అందుబాటులో ఉన్నది. దీనికి అదనంగా, ఈ ఉపకరణములో రోమా పత్రిక
అధ్యయనాలన్నీ మెమొరీ కార్డ్ లో పొందుపరచబడ్డవి. కావలసినవారు ఉదయం 10 నుండి సాయంత్రం 6 లోపల
ఫోన్ చేసి వివరాలు తెలుసుకోగలరు. ముగింపులో ఫోన్ నంబర్ ఇవ్వబడుతుంది.
1 కోరింథీ 12: 12-14 వచనాల్లో క్రీస్తు శరీరమును ఐక్యపరచ డానికి తీసుకుంటున్న కొన్ని చర్యలను ధ్యానిద్దాం, రండి
రేడియోకు దగ్గరగా వచ్చి మీ బైబిల్ నోట్ బుక్ పెన్ తో బాటు కూర్చోండి.
“12. ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవ యవములన్నియు అనేకములైయున్నను ఒక్కశరీరమై యున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు.
13. ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితివిు.మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతివిు.
14. శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది.
శరీరము ఒక్క ఆత్మతో ఐక్యపరచబడిందని మనమంతా తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. భౌతిక శరీరాన్ని చక్కని పోలికగా ఉపయోగించి పౌలు ఈ అద్భుతమైన ఆత్మీయ సత్యమును బోధిస్తున్నాడు. ఒకే శరీరములో అవయవములు వేరు వేరైనా ఎన్నో అవయవాలున్నట్టే సంఘమానే క్రీస్తు యేసు శరీరములో భిన్నత్వములో ఏకత్వము ఉన్నది. శరీరము పనిచేసే విధానం చాలా ఆశ్చర్యమైనది. వైద్యశాస్త్రము ప్రకారం గర్భములో ఒక అతి సూక్షమైన, అనగా కంటికి ఏ మాత్రం కనబడని జీవకణం శరీరము ఎదిగిన తరువాత కొన్ని లక్షల రెట్లు అభివృద్ధి చెందుతుంది. లక్షల కోట్ల కణజాలాలు ప్రతి నిమిషం మరణించి వాటి స్థానములో క్రొత్త జీవ కణాలు పుడతాయని విజ్ఞానశాస్త్రము చెబుతుంది. అద్భుతమా? కాదా? ఈలాటి కణజాలాల సమ్మేళనమే మన శరీరము! పౌలు జీవించిన దినాల్లో ప్రస్తుతము అందుబాటులో ఉన్న విజ్ఞానం అందుబాటులో లేకపోయినా, ఆయన పరిశుద్ధాత్ముని ప్రేరణచేత ఎంత అద్భుతమైన సత్యమును చెప్పాడో గమనిస్తున్నారా, శ్రోతలూ? అది మానవశరీరమైనా, క్రీస్తు శరీరమైన సంఘమైనా, ఎంత విచిత్రమైన అద్భుతమైన సంగతి కదూ!
యేసయ్య శరీరము పరిశుద్ధాత్ముని చేత ఐక్యపరచబడుతుంది. సంఘములోనికి అందరూ ఒకే రీతిగా ఐక్యపరచబడి ఉంటారని 13వ వచనము తేటపరుస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యము. ఎన్నో మార్గాలు లేవు! ఒక్కటే మార్గము! హల్లెలూయ! దేవుని వద్దకు చేరడానికి ఎన్నో మార్గాలున్నాయని చెప్పే వారు శుద్ధతప్పు చెబుతున్నారు. ఒక్కడే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన మాత్రమే మనలను సంఘములో ఐక్యపరుస్తాడు. మన నేపధ్యం, అనగా గత జీవితము ఏదైనా, జీవితవిధానం, వైఖరి ఏదైనా, యూదుడైనా, గ్రీకువారైనా, అంతా ఒక్కటే, సమానమే, అని లేఖనముల బోధన. బానిసలు, స్వేచ్చగలిగినవారు, క్రీస్తులో అందరూ ఒక్కటే, సమానమే! మనము ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ అంతస్తు అయినా, యేసయ్య సంఘములో అంతా ఒక్కటే! ఇక్కడ కులాలు లేవు, హెచ్చుతగ్గులు లేవు. అందరూ ఎక్కడి వారైనా, ఏ నేపధ్యపు వారైనా, ఏ భేదము లేకుండా యేసయ్య సంఘమందు ఒక్కటే! ఇది అర్ధం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. ముఖ్యంగా వివాహాల విషయములో ఈ భేదాభిప్రాయాలు ఉన్నవి. ఈ సత్యము దయచేసి బహుశ్రద్ధగా ఆలకించి దేవుని వాక్యమునకు మనమంతా లోబడి జీవించాలి. అపోహలు, అభిప్రాయాలు దేవుని వాక్యమునుబట్టి మార్చబడాలి.ప్రియ సోదరీ, సోదరులారా, సంఘములో మనము యేసయ్య శరీరములో అవయవములము గా మార్చబడుతున్నాము. ప్రభువు శరీరములోనికి మనమంతా ఒక్కడే ఆత్మ ద్వారా బాప్తిస్మము పొందాము. మనమంతా ఒక్క అవయవము కాదు గాని ఒక్క శరీరమని ఆపో. పౌలు స్పష్టంగా బోధిస్తు న్నాడు. ఈ సత్యము ఏ జాతి వారికైనా, ఏ దేశపు వారికైనా, ఏ భాషకు చెందిన వారికైనా వర్తిస్తుంది. ఒక్కడే పరిశుద్ధాత్ముడు అందరినీ ఐక్యపరుస్తున్నాడు.
రెండవ చర్య లేదా క్రియ ఒకే దేవుని చేత సంఘము వర్గీకరించబడింది. 15-20 వచనాలు:
“15. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంతమాత్రమున శరీరములోనిది కాక పోలేదు.
16. మరియునేను కన్ను కాను గనుక శరీరము లోనిదానను కానని చెవి చెప్పినంత మాత్ర మున శరీరములోనిది కాకపోలేదు.
17. శరీరమంతయు కన్నయితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసన చూచుట ఎక్కడ?
18. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములో నుంచెను.
19. అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ?
20. అవయవములు అనేకములైనను శరీర మొక్కటే.
వైఖరి శరీరములోనుండి ఆయయవమును వేరు చేయదు. పౌలు ఇస్తున్న ఉపదేశమేమిటి? చెయ్యి నేను కాలు కానుగనుక శరీరములో భాగము కాను అని చెప్పలేదు. దీన్నిబట్టి అది శరీరములో భాగము కాకుండా ఉండదు. ఈ భేదము, భేదభావము సరయనది కాదు. తాను ఏది కాదో అది కావాలని ఆశ పడ్డందున, దాని పని మారదు, దాని స్థానము మారదు. చెవి నేను కన్ను కాదుకాబట్టి శరీరములో లేను అని చెప్పలేదు. ఈ రెండు ఉదాహరణల చేత దేవుడు శరీరమును ఎలా విభాగించాడో, వర్గీకరించాడో మనమంతా తెలుసుకోవాలని పౌలు అరాటపడుతున్నాడు. కాలు వేరు. చేయి వేరు. చెవి వేరు. కన్ను వేరు. వేరుగా ఉన్నంత మాత్రాన శరీరములో భాగము కాకుండా ఉండదు.
శరీరములోని అతి సాధారణమైన భావనను మనకు నేర్పించాలని పౌలు ఉద్దేశం. యెసయ్య శరీరములో కందారు నేను వాళ్లలాగా ఉంటే బాగుండేదికదా! అనుకుంటారు, వాళ్లలాగా పాడడమో,బోధించడమమో, చేస్తే బాగుండు అనే భావన కొందరిలో కలుగుతుంది. మీలో కూడా ఉందా? ఈర్షనుబట్టి, అసూయనుబట్టి అలా అనుకుంటూ ఉంటారు. ప్రియ సోదరీ, సోదరులారా, ఒక్కొకరికి ప్రభువు ఏ పని ఇస్తే ఆ పని నమ్మకంగా శక్తివంచన, అహంకారము లేకుండా, దీనమనసుతో చేయండి, ప్రభువు నిన్ను మెచ్చుకుంటాడు.
ఇక పౌలు మరొక విపరీతమైన సంగతి చెప్పడం చూస్తున్నాము. శరీరమంతా కన్నాయితే ఎలా ఉంటుంది? ఇలా జరిగితే ఏమవుతుందో ఒక్క సారి ఆలోచించండి. అలాగయితే ఇక వినడo ఎలా సాధ్యం? శరీరమంతా వినడమే అయితే, ఇక వాసన చూసేది ఎలా సాధ్యం? శరీరములో అవయవాలు దేవుని జ్ఞానము ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. మీ శరీరము గురించే ఆలోచించండి. మీ చేయి ఎన్నో పనులు చేస్తుంది. మీ కన్నులు ముఖపు ముందు భాగములో అమర్చబడ్డాయి. మీ చెవులు తలకు ఇరువైపుల అంర్చబడ్డాయి. అంతా వినడమే అయితే ఇక వాసన చూడడమెలా సాధ్యం? అవును, ప్రియులారా, శరీరము వేరు వేరు అవయవములతో, చక్కని అమరికతో మేలైన పనులు చేయడానికి వీలుగా, మన సృష్టికర్త అమర్చినందు చేత శరీరము పని చేస్తుంది. అందుచేతనే మీరీ బైబిల్ అధ్యయనం వినగలుగుతున్నారు. కోటానుకోట్ల జీవ కణాలు సమ్మిళితమై ఒక శరీరముగా ఎలా మారుతుందో, ఆత్మీయ జీవితములో కూడా వేరు వేరు విశ్వాసులు, ఏ భేదము లేకుండా ఒక్క సంఘముగా జీవించాలి. అన్నీ భేదాలు మర్చిపోయి, ప్రేమ, దయ, జాలి, పరిశుద్ధత, ఐక్యత, క్షమాపణలతో యెసయ్య సంఘము అభివృద్ధి చెందాలి. అదే ప్రభువు శ్రేష్టమైన ప్రణాళిక. మన ప్రణాళికలన్నీ విడిచిపెట్టి దేవుని ప్రణాళిక ప్రకారం సంఘములో, కుటుంబములో, మార్కెట్ లో అన్నీ వేళల, అన్ని సమయాల్లో జీవించడానికి అవసరమైనంత శక్తి, జ్ఞానము, సర్వ సమృద్ధి గా ప్రభువు కృప తానే మంకందరికీ అనుగ్రహించుగాక! అమెన్!!
No comments:
Post a Comment