I కొరింథీ అధ్యయనం-8 3:1-9 శరీర స్వభావమనే పెను విపత్తు

I కొరింథీ అధ్యయనం-8 3:1-9 

శరీర స్వభావమనే పెను విపత్తు 

 

        మీరు ఏదైనా దేవుని సంఘములోని సహవాసములో ఉన్నారా? అయితే జాగ్రత్తగా వినండి. ఇక్కడి సంఘములో 

మీకు సభ్యత్వము ఉన్నదేమో గాని, పరలోకములో చేర్చబడే సంఘములో ఉంటామో లేదో పరీక్షించుకోవాల్సిన ఘడియ 

వచ్చింది. పరలోకములో చేర్చబడే సంఘములో ఉండేవారికి దేవుని పరిశుద్ధ గ్రంధం బైబిల్ ప్రకారం కొన్ని అర్హతలు 

ఉండాలి. ఒకటి, యేసు క్రీస్తు ప్రభువును వ్యక్తిగతంగా, అనగా స్వేచ్ఛగా ఇష్టపూర్వకంగా తన పాపమునుండి విడిపించే 

రక్షకుడని నమ్మి ఆయనకు జీవితంను సమర్పించిన వ్యక్తి అయి ఉండాలి. ఇది మారుమనసు, రక్షణ, నూతన జన్మ, 

పైనుండి జన్మించడం తిరిగి జన్మించడం ఇలా ఎన్నో పేర్లు ఉన్నవి. కానీ బాప్తిస్మం అనుకోకండి, అది ఒక గుర్తు మాత్రమే. 

రెండు, క్రొత్త జీవితం జీవిస్తూఉండాలి. యేసు ప్రభువునకు విధేయతోనే ఇది సాధ్యం. నిజానికి, క్రొత్త జన్మ ఫలితమే క్రొత్త 

జీవితం. మూడు, ఇతరులతో క్రొత్త సంబంధం కలిగిఉండడం. ఒక బంధం, దగ్గరి సంబంధం, శరీరములోని ఐక్యత 

ఉంటుంది. 

            సంఘమును ఎక్లేసియా అని గ్రీకు భాషలో పిలిచారు, అనగా అర్ధం “బయటికి పిలువబడినవారు”. కానీ ప్రస్తుతం 

సంఘాల్లోఉండేవారిలో ఎక్కువ శాతం వారు కూర్చున్నస్థలమును వెచ్చగా చేసేవారే! వారిని నిర్వీర్యమైన సంఘస్తులని 

పిలవవచ్చు. I కోరింథీ 3:1-9లో ఆపో. పౌలు వారిని క్రీస్తునందు పసిపిల్లలని సంబోధించాడు. సీసాతో పాలుతాగే 

పసివారు,  లేదా స్పూంతో ఆహారం తినబెట్టించుకునే చిన్న పిల్లలు వారు. వారిని శరీర సంబంధులు అనవచ్చు, శరీరపు 

స్వభాము ప్రకారము జీవించే మరుగుజ్జువారు అనవచ్చు. వీరు వారి ఆత్మీయ జీవితములో ముందుకు సాగినవారుకారు. 

I కోరింథీ 3:1-9 ఆధారంగా శరీరస్వభావములోని పెను ప్రమాదం, ఉప్పెన ఏమిటో, దానిలో క్రియలు ఏమిటో ఈ పూట 

మనము జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం, రండి రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి. 

1. సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేక పోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, మీతో మాటలాడవలసివచ్చెను. 2. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితినిగాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీరసంబంధులై యుండుటవలన ఇప్పుడును మీరు బలహీనులై యున్నారు కారా? 3. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా? 4. ఒకడు నేను పౌలు వాడను, మరియొకడునేను అపొల్లోవాడను, అని చెప్పునప్పుడు మీరు ప్రకృతిసంబంధులైన మనుష్యులు కారా? 5. అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి 6. నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి  కలుగజేసిన వాడు దేవుడే 7. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు. 8. నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును. 8. నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును. 9. మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు. శరీర స్వభావము అనే విపత్తు నుండి కలిగే ఘోరమైన కార్యాలను ఆపో. పౌలు బోధిస్తున్నాడు.    

మొదటి కార్యం, శరీరస్వభాము లేదా పాపపు స్వభావము ఎదుగుదలను భంగము చేస్తుంది. మొదటి రెండు వచనాలు గమనించండి: “సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో 

మాటలాడలేక పోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, మీతో 

మాటలాడవలసివచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితినిగాని 

అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీరసంబంధులై యుండుటవలన ఇప్పుడును మీరు బలహీనులై 

యున్నారు కారా?” ‘ఒకవేళ శరీర సంబంధులైన క్రైస్తవులు ఉంటారా?’ అనుకోవచ్చు. అవును, క్రైస్తవ విశ్వాసులు శరీర 

సంబంధులుగా ఉంటారు. వారు క్రీస్తునందు పసివారు.  ఎదుగవలసినవారు, వారి ఎదుగుదల భంగము 

చేయబడినది. పౌష్టిక ఆహారం తీసుకోలేరు. సత్యమును ఒప్పుకునే స్థితిలో వారు లేరు. శరీర స్వభావము ఎదుగుదలను 

భంగపరుస్తుంది. శరీర సంబంధులైన విశ్వాసులు సంఘానికి ఏ రీతిగా ఉపయోగపడరు. ఏ సేవకు వారు ఉపయోగ 

పడరు. వారి మీద ఏ పని కోసం ఆధారపడలేము. ఆత్మీయ సంగతులలో వారు బలహీనులు. సంఘపు వనరులను 

వారు వాడుకుంటారు, గాని వనరులను ఎక్కువ చేయరు. వారు సంఘానికి భారమౌతారు, గాని బలము నిచ్చేవారు 

కారు. వారివిషయం ఎక్కువ శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది, గాని వారి వల్ల ఏ పని, ఏ పరిచర్య కాదు. వారి గురించి వారు 

చాలా  గొప్పగా ఊహించుకుంటారు, కొన్ని పనులు చేపట్టాలని ఎంతో ఆసక్తి చూపినట్టే అగపడతారు, కానీ, ఏ గట్టి పనులు 

చేయలేరు. పిల్లలకు ఏ పని మీద శ్రద్ధ లేనట్టుగానే, వీరికి ఆత్మీయ సంగతులలోశక్తి, సఫలత, నిలుకడ ఉండదు. శరీర 

స్వభావము ఎదుగుదలను భంగం చేస్తుంది. ప్రియ స్నేహితుడా, సోదరీ, ఇవన్నీ నాలో ఉన్నాయి, అన్నీ నాగురించే 

చెబుతున్నట్టుగా ఉంది, అను కుంటున్నారా? దీనమనసుతో ప్రభువును వేడుకొని ఎదుగుటకు ప్రభువు మీకు తన కృప 

ననుగ్రహించుగాక! రెండవ కార్యము శరీర స్వభావము పార్టీలను, గుంపులను, ఏర్పాటు చేస్తుంది. 3,4 వచనాలు 

గమనించండి: “మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు 

కారా? ఒకడు నేను పౌలు వాడను, మరియొకడునేను అపొల్లోవాడను, అని చెప్పునప్పుడు మీరు ప్రకృతిసంబంధులైన 

మనుష్యులు కారా?” శత్రుత్వము, వ్యతిరేకత, శరీర సంబంధులక నైజము. కొన్ని సంఘాల్లో ప్రజలు 

సామూహికత్వమును చేస్తూ ఉంటారు. సంఘము ఒక కంపెనీ అన్నట్టుగా అబద్ధములతో, జగడాలు చేసి పైకి రావాలని 

చూస్తూ ఉంటారు. పైకి రావటానికి ఎవరినైనా అణగతొక్కుతారు, ఎంతైనా బాధ పెడతారు. ఇది చాలా దుఃఖకరమైన 

సంగతి. సంఘములలో కొందరు అసూయ, భేదాలు, కులతత్వము మొదలైనవి పెంచి పోషిస్తారు. ఆపో. 3వ వచనములో 

ఏమంటున్నాడో గమనించండి: “ మీలో అసూయయు కలహమును ఉండగా...” శరీర స్వభావమునకు ఇది ఋజువు. 

ఎవరైనా, అసంతృప్తిగా ఉన్నట్లయితే వారిని తనవైపు అయస్కాంతము ఆకర్షించినట్టు ఆకర్షించి ఒక పార్టీ తయారు 

చేస్కుంటారు. పాస్టర్ విషయం గుసగుస లాడుకుంటారు. దీనివల్ల సంఘం ఎదగదు. శరీర స్వభావము ఎదుగుదలను 

భంగము చేసి, పార్టీలను, గుంపు రాజకీయాలను కలుగచేస్తుంది. సంఘములో శ్రేష్టమైనవారు కలహానికి కారకులు కారు. 

క్రీస్తుప్రభువునకు దూరంగా ఉండి, ఆయనలో “ఆత్మ” ఫలము ఫలించని వారికి ఈ గుంపు రాజకీయాలు ఇష్టమైనవి. 

నిజముగా ఆత్మీయ జీవితములో ఫలిస్తున్నవారికి ఈలాటివి ఇష్టముండవు. ప్రియ శ్రోతలూ, ఎదుగుదలను భంగపరిచే 

వాటన్నింటినీ విసర్జించుదాం. ఇవి సంఘానికి చీడ పురుగులు. ప్రభువునకు ఎంతమాత్రం ఇష్టము లేనివి. 

దాదాపు ప్రతి సంఘములో ఈలాంటి వారు ఉంటారేమో అనిపిస్తుంది. మూడవ కార్యము, శరీర స్వభావము 

సంఘపుగురిని నాశనం చేస్తుంది, రూపు మాపుతుంది. 5-9 వచనాలు గమనించండి: “అపొల్లో ఎవడు? పౌలెవడు? 

పరిచారకులే గదా. ఒక్కొ క్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపొల్లో 

నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు 

పోయువానిలోనైనను ఏమియులేదు. నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన 

కష్టముకొలది జీతము పుచ్చుకొనును. నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన 

కష్టముకొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును 

దేవుని గృహమునై యున్నారు.” ఒక్కొక్కరు ఒక్కొక్క నాయకుణ్ణి అంటిపెట్టుకొను ఉండడం సంఘము యొక్క 

కేంద్రీయఉద్దేశ్యము, గురిని నాశనం చేస్తుంది. 1:12వ వచనములో పౌలు అపోలో, పేతురుల గురించి ప్రస్తావించాడు. 

సంఘములోని వారు ఒకరికి ఒకరు విరోధులై కలహములపాలైనపుడు బయటికి విస్తరించే అవకాశం ఉండదు. ఆ 

మాటల్లోని బలమును గమనించండి, పౌలైన, అపోలో అయిన, ఇంకెవరైనా, నీవైన, నేనైనా, అంతా దేవుని గృహములో, 

ఆయన వ్యవసాయభూమిలో పనిచేసేవారమే! అంతే కాదు, ఒక్కొక్కరు వారికి ఇవ్వబడ్డ పని చేస్తారుతప్ప గొప్పదనమేమీ 

లేదు. నాటే వాడు పౌలు అయితే, నీళ్ళు పోసేవాడు అపోల్లో. ఎవరి పని వారిది. ఒక్కొక్కరిపట్ల దేవునికి ఒక్కొక్క 

ఉద్దేశ్యమున్నది. గమనించండి, శ్రోతలూ, ఎవరు వారికి ఇవ్వబడినట్టుగా ఏ పని చేసినా, ప్రాముఖ్యమైనది వృద్ధి కలగడం, 

అది ఎవ్వరూ చేయలేరు. ప్రభువు ఒక్కడే!, హల్లెలూయ! “ నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే.” అన్న 

మాటలను అతి జాగ్రతగా, మనసు కేంద్రీకరించి గమనించాలని మీలో ప్రతి ఒక్కరికీ మనవి చేస్తూఉన్నాను. ఈలాటి 

ఐక్యతాభావము ప్రభువిచ్చే జీతమునిస్తుంది. దేవుని ఉద్దేశ్యమును నెరవేర్చడానికి ఒక్కటే మనసుతో ఒక్కటే 

ఉద్దేశ్యముతో దీనమనసుతో ప్రభువు నిన్ను సంఘములో ఎక్కడ ఉంచితే అక్కడ క్రీస్తుకోసం పని చేయాలి. ఐక్యత 

మాత్రమే ఫలితములను, దేవుని మెప్పును, అంగీకారమును, ఆమోదముద్రను అనుగ్రహిస్తుందని దయచేసి 

జ్ఞాపకముంచుకొందాం! చివరలో పౌలు భక్తుడు “మేము దేవుని జతపనివారమై యున్నాము” అని బోధిస్తున్నాడు. 

ప్రియ శ్రోతలూ, శరీరస్వభావము సంఘపు ఉద్దేశ్యమును నశింపచేస్తుంది. కానీ, సంఘపు ఉద్దేశ్యమును దానిలో నీవు 

చేయడానికి ప్రభువు నీకిచ్చిన పనిని నీవు దీనమనసుతో, ఇతరులతో ఐక్యతతో నమ్మకమైన పనివానిగా చేయడానికి 

ఇష్టపడితే శరీర స్వభావమును నీవు నశింపచేస్తావు. ఇది నీ ఇష్టమా? అప్పుడు మనము దేవుని వ్యవసాయము, 

ఆయన తోట, ఆయన గృహము గా మార్చబడతాము. 

         క్రీస్తునందు ప్రియ సోదరీ, సోదరుడా, శరీరస్వభావము సంఘపు ఉద్దేశ్యమును నాశనము చేస్తుంది. కానీ 

ఆత్మీయమైన స్వభావము సంఘమును కట్టుతుంది. ప్రత్యేకించి సంఘములో భాగముగా ఉన్న నిజమైన మారుమనసు 

పొందిన విశ్వాసులతో దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతున్నది. నీ మట్టుకు నీవు నీ పనిని, జాగ్రతగా దేవునికి 

ఇష్టమైన రీతిగా నమ్మకముగా ఐక్యతతో దీనమనసుతో చేయటానికి సిద్ధంగా ఉండు! సర్వాధికారి, సంఘమునకు శిరస్సు 

అయిన యేసు క్రీస్తు ప్రభువే తన కృపతో మనలో ప్రతి ఒక్కరినీ బలపరచుగాక! అమెన్!! 

 

 

 

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...