రోమా అధ్యయనం – 56 16:1-16 దేవుని కుటుంబం

 

రోమా అధ్యయనం – 56   16:1-16 

దేవుని కుటుంబం

     ఇంత కఠినమైన సమస్యలు ఎదుర్కోవడం అవసరమా? ఇవి ఏవి లేకుండా ఉంటే ఎంత బాగుండును? 

అనుకొంటున్నారా?ఇవన్నీ దేవునినుండి కలిగినవే, ఆయన సెలవు లేకుండా, మీరు విశ్వాసి అయితే  మీ

జీవితములోనైనా, నా జీవితములోనైనా ఏదీ కలుగదు. అంతే కాదు, వీటి ద్వారా, దేవుడు పరీక్షిస్తూ ఉండవచ్చు. 

లేదా ఏదో ఒక పాపము, అవిధేయత, తిరుగుబాటులో మనమున్నపుడు క్రమశిక్షణలో పెట్టి బాగు చేసేందుకు 

వాటిని అనుమతించి ఉండవచ్చు. ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని  

దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి.” హెబ్రీ 12:6  

ప్రభువు ప్రేమను గమనించి, అంగీకరించి ఆయన చేతుల్లో మలచబడుటకు అవసరమైనంత కృప 

మీకనుగ్రహించుగాక! 

     రేడియోద్వారా మనము కలుసుకుంటున్నా, మనమంతా క్రీస్తునందు సహోదర సహోదరీలము, గనుక ఒక్క 

కుటుంబము. ఏ కులమునుండి, ఏమతమునుండి వచ్చాము అనే విషయము అనవసరమైనది. ఏ ప్రాంతము, ఏ 

కుటుంబమునాకు చెందినవారము అనేది ఏ మాత్రం లెక్కలోకి రాదు.   రోమా 16:1-16లో ఆపో. పౌలు ఆయనకు 

ప్రియులైన దేవుని కుటుంబపు వారి జాబితా ఇచ్చాడు. రోమా 16:1-16.

            1. కెంక్రేయలో ఉన్న సంఘపరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని, పరిశుద్ధులకు        తగినట్టుగా ప్రభువు నందు చేర్చుకొని,

         2. ఆమెకు మీవలన కావలసినది ఏదైన ఉన్నయెడల సహాయము చేయవలెనని ఆమెనుగూర్చి     మీకు సిఫారసు చేయుచున్నాను; ఆమె అనేకులకును నాకును సహాయురాలై యుండెను.
         3. క్రీస్తు యేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును, ఆకులకును నా వందనములు చెప్పుడి.

         4. వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు, వారి         యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి; నేను మాత్రము కాదు అన్యజనులలోని          సంఘములవారందరు వీరికి కృతజ్ఞులై యున్నారు.

5. ఆసియాలో క్రీస్తుకు ప్రథమఫలమైయున్న నా ప్రియుడగు ఏపైననెటుకు వందనములు. 6. మీకొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు.   

7. నాకు బంధువులును నా తోడి ఖైదీలునైన అంద్రొనీకుకును, యూనీయకును వందనములు; వీరు అపొస్తలులలో ప్రసిద్ధి కెక్కినవారై, నాకంటె ముందుగా క్రీస్తునందున్నవారు.

         8. ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లీయతునకు వందనములు.

         9. క్రీస్తునందు మన జత పనివాడగు ఊర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు.

         10. క్రీస్తు నందు యోగ్యుడైన ఆపెల్లేకు వందనములు. అరిస్టోబులుఇంటివారికి వందనములు.

         11. నా బంధువుడగు హెరోది యోనుకు వందనములు. నార్కిస్సుఇంటి వారిలో   ప్రభువునందున్న వారికి వందనములు.

         12. ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు. ప్రియురాలగు     పెర్సిసునకు వందనములు; ఆమె ప్రభువు నందు బహుగా ప్రయాసపడెను.

         13. ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు; అతని తల్లికి వందనములు; ఆమె       నాకును తల్లి.

         14. అసుంక్రితుకును, ప్లెగో నుకును, హెర్మే కును, పత్రొబకును, హెర్మాకును వారితో కూడనున్న సహోదరులకును వందనములు.

         15. పిలొలొగు కును, యూలియాకును, నేరియకును, అతని సహోదరికిని, ఒలుంపాకును      వారితోకూడ ఉన్న పరిశుద్దులకందరికిని వందనములు.

         16. పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు చేయుడి. క్రీస్తుసంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి.

    ఈ మనుషుల జాబితాలో కొన్ని గుంపులు ఉన్నాయి. వాటిని గమనించి క్షుణ్ణంగా ధ్యానిద్దాం,

    దేవుని కుటుంబములో కొందరు ప్రియులైన వారిని పౌలు గుర్తిస్తున్నాడు. 3వ వచనములో ఆకుల, ప్రిస్కిల్ల ఉన్నారు. వారు ప్రియులైన దంపతులు. మీరు బైబిల్లో గమనిస్తే వారిద్దరి పేర్లు ఒకరి పక్కన మరొకరు పేరు తప్పక వ్రాయబడి ఉంటుంది. దాన్ని బట్టి మనకు తెలిసిందేమిటంటే వీరిద్దరు ప్రేమతో నమ్మకమైనజంటగా జీవిస్తూ దేవుని ప్రేమతో ఐక్యతతో ప్రభువును సేవించారు. పౌలులాగా వీరు కూడా డేరాలు కుట్టేవారు. ఆయన క్షేమం, భద్రతో కోసం వారి ప్రాణాలైన అర్పించడానికి వెనుకాడలేదు. 5వ వచనం చూడండి, “ఆసియాలో క్రీస్తుకు ప్రథమఫలమైయున్న నా ప్రియుడగు ఏపైననెటుకు వందనములు.” మనము కొంచెం లోతుగా ఆలోచిస్తే, ఈయన అపోస్తలునికి చాలా ప్రశస్తమైన వాడైయుంటాడు. ఎందుకంటే ఆసియ నుండి అకయకు వచ్చి ఇప్పుడు మొదటి విశ్వాసిగా ప్రధమ ఫలముగా ఉన్నాడు. 8వ వచనం. “ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లీయతు” అని వ్రాయబడింది. 9వ వచనములో స్టాకు తనకు ప్రియుడని చెబుతూ ఉన్నాడు. ఈయన గూర్చి మనకేదీ తెలియదు. 12వ వచనం గమనించండి,  “ప్రియురాలగు పెర్సిసునకు వందనములు; ఆమె ప్రభువు నందు బహుగా ప్రయాసపడెను.” ఇది ఒక స్త్రీ పేరు. ఒకవేళ ఆమె వ్యాపారస్థురాలై ఉండవచ్చు. ప్రభువు కోసం చాలా ప్రయాస పడిఉండవచ్చు. వీరంతా పౌలు భక్తునితో దగ్గరి సంబంధం కలిగినవారు.

         రెండవ గుంపు తోటి పనివారు. మొదటి వచనములో మొదటి పేరు ఉన్నది. ఫీబే. ఆమెను పౌలు భక్తుడు “మన సహోదరి” అని సంబోధిస్తూ ఉన్నాడు. ఆమె ప్రభువు కుటుంబములో సహోదరి. అది శారీరక కుటుంబము కాదు, గాని ప్రభువు కుటుంబము. ఆమె పేరుకు “ప్రకాశించుట” అని అర్ధం. ఆమె కెంక్రేయ అనే ఊల్లోని సంఘములో పరిచారకురాలు. ఈ ఊరు కోరింథు పట్టణానికి ఎంతో దూరములో లేదు. పౌలు ఈ పత్రిక వ్రాసినపుడు కోరింథులో ఉండిఉండవచ్చు. ఆమె యోగ్యురాలు. ఎంత యోగ్యురాలంటే ఆమెకు ఇతరులు సహాయం చేయవలసిఉన్నది. ఇక్కడ మరోసారి ఆకుల ప్రిస్కిల్లలు ఉన్నారు. సహాయకులలో వీరు కూడా ఒకరు. అపోల్లో ఎఫేసికి వచ్చినపుడు ఆయనకు క్రీస్తు మార్గమును వీరే లోతుగా బోధించారు. వీరిద్దరు పౌలుభక్తునికి జతపనివారు. 6వ వచనములో మరియ కనిపిస్తున్నది. ఆమె “బహుగా ప్రయాస” పడిందని చెబుతున్నాడు. ఆమె ఏ రీతిగా ప్రయాస పడిందో మనకు తెలియదు. ఆమెకు ఆతిధ్యమిచ్చే వరముండవచ్చు, వారి ఊళ్ళో ఉన్నపుడు పౌలు భక్తునికి ఆతిధ్యమిచ్చిఉండాలి.  12వ వచనములో త్రుపైనా, త్రుఫోసా అనే సహోదరీలు ఉన్నారు. వారు కూడా నమ్మకమైనపనివారే!

         పౌలు తన జతపనివారిని మెచ్చుకుంటున్నాడు. తాను వంటరిగా లేడని, వారినిబట్టి బలము కలిగిందని మెచ్చుకుంటున్నాడు. పౌలు వంటరివాడు కాదనే సంగతి మనము క్షుణ్ణంగా గ్రహించాలి. ఆయనతో కలిసి పనిచేసినవారు ఉన్నారు. కాబట్టి తన పరిచర్య, పనిలో వారు చూపిన శ్రద్ధ ఆసక్తినిబట్టి వారిని మెచ్చుకొని కృతజ్ఞత చూపుతున్నాడు.

         దేవుని కుటుంబములో మూడవ గుంపు సంఘములు. మొదటిగా కెంక్రేయ లోని సంఘము విషయం వ్రాశాడు. ఆ సంఘములో ఫీబే సేవకురాలు, సహోదరి. ఈ ఊరు కోరింథు పట్టణానికి 10/12 కిలోమీటర్ల దూరమే. ఆయన కోరింథీ పట్టణములో పరిచర్య చేసిన సమయములో ఈ సంఘము స్థాపించబడి ఉండాలి. అ.కా. గ్రంధములో చూస్తే పౌలు కోరింథీలో ఒకటిన్నర సంవత్సరాలు పరిచర్య చేసినట్టు, అ తరువాత కూడ మరి కొంత కాలం అక్కడ గడిపినట్టు అర్థమవుతుంది. కోరింథీయులు కొందరు తూర్పు తీరములో ఉండే కెంక్రేయకు వెళ్ళిఉండాలి. అ.కా. 18:18 లో పౌలు ఎఫెసు వెళ్తూ అక్కడ ఆగినట్టు ఉన్నది. ఆయన కోరింథీని దాటి వెళ్తున్నపుడు అక్కడ ఆగి, ఆ సంఘములో పరిచర్య చేశాడు. 4వ వచనములో అన్యజనులలోని సంఘముల” ప్రస్తావన ఉన్నది. ఆపో. పౌలు అన్యజనులకు అపోస్తలుడు అనే విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి. తనగురించి అలాగే చెప్పుకున్నాడు, అలాగే పిలుచుకున్నాడు కూడా! ఆయన చిన్న ఆసియా ప్రాంతము గుండా గ్రీసు వెళ్ళి అ రోమా సామ్రాజ్యమంతట సంచరించి, మొదట యూదులకు, తరువాత యూదేతరులకు సువార్తను  అందించి, సంఘాలు స్థాపించాడు. ఇక్కడ పౌలు భక్తు అన్యజనులలోని సంఘములవారందరు ఆకుల ప్రిస్కిల్లకు కృతజ్ఞతలు చెబుతున్నారని వ్రాశాడు. 5వ వచనములో వారింట్లో ఉన్న సంఘము గూర్చి ఉన్నది. ఇలాటి ఇంటిసంఘాలు రోమా సామ్రాజ్యములో చాలా ఉండేవి. రోమ్ పట్టణం చాలా పెద్దది, అక్కడ ఎన్నో ఇంటి సంఘాలు ఉండిఉండాలి. ఆకుల ప్రిస్కిల్ల, విశ్వాసుల సహవాసముకోసము వారింటిని తెరిచారు. 15వ వచనములో కొందరు పరిశుద్ధులగురించి ప్రస్తావిస్తున్నాడు. వారు పిలొలొగు, యూలియా, నేరి, అతని సహోదరిక, ఒలుంపా. వారితో ఉన్న పరిశుద్ధులు. ఒకవేళ వారి ఇంటిలో మరో ఇంటిసంఘము ఉండవచ్చు. 16వ వచనము. క్రీస్తు సంఘములన్నీ, అనగా దేవుని సంఘములన్నీ వందనములు చెబుతూఉన్నాయి. రోమా సామ్రాజ్యమంతట ఆయన సంఘాలు స్థాపించాడు, వారే క్రీస్తు సంఘములంటే! రోమ్ పట్టణం  పశ్చిమభాగాన ఈ ఊరు ఉన్నది. అది సువార్త అందిన ప్రాoతానికి సరిహద్దులో ఉన్నది. ఈ విధంగా పౌలు తన జతపనివారు, స్నేహితులకు వందనాలు చెప్పి, వారిని త్వరలో చూస్తాననే నిరీక్షణతో ఉన్నాడు. 27గురి పేర్లు ఉన్నవి. వీరంతా దేవుని కుటుంబo. వారి గురించి ఎంతో సంతోషముతో వారు నిజమైన విశ్వాసులని నమ్మి వారికి శుభములు, వందనములు చెప్పాడు. దేవుని విశాలమైన కుటుంబములోని నిజమైన సహోదర, సహోదరీలకు సరియైన రీతిగా స్పందించాడు. మన సంఘాల్లో ఇలాటి ప్రేమ ఉండేలా ప్రభువే స్వయంగా మనకందరికీ సహాయము చేయుగాక! అమెన్!!

రోమా అధ్యయనం – 55 15:22-33 సహవాసములో ఉండే ఆనందం

 

రోమా అధ్యయనం – 55   15:22-33 

సహవాసములో ఉండే ఆనందం

       రేడియోవద్ద ఆశతో కూర్చోన్న ప్రతి ఒక్కరికీ, శుభములు, వందనములు. మీ ఎదుట ఉంటే మీతో షేక్ హాండ్ చేసి 

దగ్గరి సహవాసములో, మీలో ప్రతి ఒక్కరినీ ముఖాముఖి చూచే కృపను ప్రభువు అనుగ్రహించా లని ఎంతో 

ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మీకు కూడా ఇలాంటి భారము ఉన్నట్లయితే భారంగా ప్రార్థించండి. మీరు 

ప్రార్దిస్తున్నట్లయితే, ఆ విషయం మాకు తెలియచేయండి. ఈ విషయాలన్నింటికోసం మనమంతా కలిసి 

ప్రార్ధించుకుందాం, ఏ మారుమూల గ్రామములో, అడవి ప్రాంతాల్లో, ఏ కొండ కోనల్లో, ఏ పట్టణములో లేదా మహా 

నగరములో ఎక్కడ ఉన్నా, మన ప్రభువు యేసు క్రీస్తు మనతో ఉన్నాడు, మన మొఱలు అలకిస్తున్నాడు. 

హల్లెలూయ!  దైవ చిత్తమయితే మనమంతా ఒక చోట కలిసికొని సహవాసములో పాల్గొని పార్ధించే అవకాశము 

ప్రభువు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాము.

            చాలాకాలం క్రిందట బెత్లేహేమునకు వెలుపల కొండ ప్రాంతములలో గొర్రెలకాపరుల వద్దకు దేవుని దూత 

వచ్చి, ‘రక్షకుడు పుట్టి యున్నాడు, ఈ మహాసంతోషకరమైన శుభవార్త మీకు తెచ్చాను అని చెప్పినపుడు నిజంగానే 

గొప్ప సంతోషం కలిగింది. కానీ ప్రస్తుతం ప్రపంచమంతా బాధలతో, వేదనలతో, నిండిపోతున్నది. కరోన వైరస్ అందరికీ 

భయము, ఆందోళన, ఆర్ధిక ఇబ్బందులు, నిరుద్యోగం, కట్టుబాట్లు కడగండ్లు కలిగించింది. ఎందుకు ఇంత వేదన, శ్రమ, 

బాధ, హింస ఉన్నది? సమాధానం చాలా సులభం. సంతోషం యేసు క్రీస్తులో ఉన్నది. ఆయనలో మాత్రమే ఆనందం 

 దొరుకుతుంది. దేవుని దూత చెప్పింది అదే కదా! రక్షకుడు మహా సంతోషాన్ని కలిగిస్తాడు.

             

        యేసు క్రీస్తు ప్రభువులో మనము సహవాసము అనుభవిస్తుంటే సంతోషం కలుగుతుంది. ఆపో. పౌలు రోమా 

15:22-33 లో సహవాసములో  ఎలా సంతోషించవచ్చో బోధించాడు.

            22. హేతువుచేతను మీయొద్దకు రాకుండ నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను.

         23. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనుక, అనేక                   సంవత్సరములనుండి మీయొద్దకు రావలెనని మిక్కిలి అపేక్షకలిగి,

         24. నేను స్పెయిను దేశమునకు వెళ్లునప్పుడు మార్గములో మిమ్మును చూచి, మొదట మీ                సహవాసమువలన కొంత మట్టుకు సంతృప్తిపొంది, మీచేత అక్కడికి సాగనంపబడుదునని          నిరీక్షించుచున్నాను.  

         25. అయితే ఇప్పుడు పరిశుద్ధులకొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్లుచున్నాను.

         26. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ          వారును అకయవారును కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి.

         27. అవును, వారిష్టపడి దానిని చేసిరి; వారు వీరికి ఋణస్థులు; ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలి వారై యున్నారు గనుక శరీరసంబంధమైన విషయములలో     వీరికి సహాయముచేయ బద్ధులై యున్నారు.

         28. ఈ పనిని ముగించి యీ ఫలమును వారికప్పగించి, నేను, మీ పట్టణముమీదుగా        స్పెయినునకు ప్రయాణము చేతును.

         29. నేను మీయొద్దకు వచ్చునప్పుడు, క్రీస్తుయొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని          యెరుగుదును.

         30. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలోనుండి తప్పింపబడి     యెరూషలేములో చేయవలసియున్న యీ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును,

         31. నేను దేవుని చిత్తమువలన సంతోషముతో మీయొద్దకు వచ్చి, మీతో కలిసి విశ్రాంతి      పొందునట్లును,

         32. మీరు నాకొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని, మన ప్రభువైన   యేసు క్రీస్తును బట్టియు, ఆత్మవలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

         33. సమాధానకర్తయగు దేవుడు మీకందరికి తోడై యుండును గాక. ఆమేన్‌.

       సువార్తలో ఉండే సహవాసమును మనము ఆనందించాలంటే కొన్ని పరిస్థితులు అవసరం.  

మొదటిది, సువార్తలోని సహవాసములో సంతోషించాలంటే మన ఉద్దేశ్యము యొక్క ఐక్యతను అలవాటు గా ఆకళింపు చేసుకోవాలి. ఆపో. ఎలా బోధిస్తున్నాడో పరీక్షిద్దాం. 23వ వచనము గమనించండి. “అనేక సంవత్సరములనుండి మీయొద్దకు రావలెనని మిక్కిలి అపేక్షకలిగి, ఉన్నానంటున్నాడు. రోమ్ పట్టణములో ఉన్న తన సహోదరులను ముఖాముఖి చూడాలని ఆశించాడు. వారితో ఉండే సహవాసముకోసం తపన పడ్డాడు. ఆయన నిర్విరామ కృషి చేశాడు. ఆ చుట్టుపట్ల ప్రాంతములలో తాను వెళ్లవలసిన స్థలములు లేవు గనుక వారి వద్దకు వెళ్లాలని ఆశపడ్డాడు. వారితో ఉండి వారికి సువార్తను బోధించాలని కోరుకుంటున్నాడు. తన బావిష్యత్ ప్రణాళిక పంచుకున్నాడు. ఆయన స్పెయిన్ దేశం వెళ్లాలనే ఉద్దేశ్యముతో ఉన్నాడు. మార్గమధ్యలో వారితో కొంత సమయం గడపాలని ఆశపడుతున్నాడు. ఎందుకు ఈ విషయాలు వారికి వ్రాస్తున్నాడు? తన ఉద్దేశ్యముతో వారు కూడా ఏకమనసుతో ఉండాలని. ఈ విధంగా పౌలు వారితో ఉండాలని, సహవాసము చేయాలని, సహవాసములో ఆనందించాలనీ, ఆరాటపడు తున్నాడు గదా! వీటన్నిటిద్వారా, తన ఉద్దేశ్యముతో వారు ఏకమనసు కలిగిఉండాలని వారిని కోరుతున్నాడు. ప్రియ సోదరులారా, ఈలాంటి పరిస్థితులు మనకు సహవాసములో ఆనందము కలిగిస్తాయి. మనము ఉద్దేశ్యములో ఏకీభవిస్తే, దేవుడు సహవాసపు ఆనందమును మనకనుగ్రహిస్తాడు.

         సువార్త సహవాసములో ఆనందించడానికి రెండవ పరిస్థితి కార్యాచరణలో ఐక్యత ఉండాలి. యెరూషలేములోని పరిశుద్ధులకు పరిచర్య చేయాలని ఆశిస్తున్నాడు. మాసిడోనియ, ఆకయ ప్రాంతాల్లో ఉండే విశ్వాసులు యెరూషలేములోని పెద విశ్వాసులకు చందా పంపిస్తున్నారు. ఆపో. పౌలు ఈ కానుకను వారికి అందిస్తున్నాడు. ఈ కార్యాచరణ యూదులను, అన్యజనులను ఐక్యపరుస్తుంది గనుక దీనిలో రోమా విశ్వాసులు కూడా ఏకమనసుతో ఉండాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాడు. మాసిదోనియా, ఆకయ లోని విశ్వాసులు అన్యజనులై ఉండవచ్చు. వారు, యెరూషలేములోని యూదులు ఒకరి అవసరాలు మరొకరు తీర్చడము ద్వారా  కార్యాచరణలో ఐక్యపరచబడ్డారు.

         యూదుల ద్వారా కలిగిన ఆత్మీయ ఆశీర్వాదములలో, అనగా సువార్తలో, యూదులు కాని అన్యజనులు భాగము పొందినందుచేత, యెరూషలేములోని పేదవారైన యూదుల ఆర్ధిక కొరతలను తీర్చడానికి  అన్యజనులకు బాధ్యత ఉన్నది, అని ఆపో. పౌలు బోధన. వీరు సువార్తను ఇస్తున్నారు, వీరు వారికి ఆర్ధిక చేయూతనిస్తున్నారు. ఎంత ఐక్యత కదూ! యెరూషలేములో పౌలు భక్తుడు ఈ పరిచర్య ముగించిన తరువాత రోమా సంఘమును దర్శించి, వారి చేత స్పెయిన్ వెళ్లడానికి సాగనంపాలని కోరుతున్నాడు. కార్యాచరణలో ఐక్యత అంటే ఇదే! వారి వద్దకు వెళ్ళేటప్పుడు క్రీస్తు సువార్త యొక్క సంపూర్ణ ఆశీర్వాదముతో వస్తానని సాక్ష్యమిస్తున్నాడు. కార్యాచరణలో ఐక్యతో ఉన్నపుడే క్రీస్తు సువార్త యొక్క సంపూర్ణ ఆశీర్వాదము కలుగుతుంది. పౌలు అడిగిన ఈ ఐక్యత సహవాసములో ఆనందము నిస్తుంది. ఈలాటి ఐక్యత కలిగే పరిస్థితులు మనము కల్పించినపుడు సహవాసములో ఆనందముంటుంది. ప్రియ సోదరులారా, మీరు నేను ఈ కార్యాచరణలో పాలుపంచుకుంటున్నాము. ఈ కార్యాచరణలో మనము పంచుకుంటున్నాము కాబట్టి మనకు సహవాసములో ఆనందమున్నది.

         సహవాసములో ఆనందమునకు మూడవ పరిస్థితి, ప్రార్ధనలోని ఐక్యత ఆకళింపు చేసుకోవాలి ఆపో. పౌలు ఈ పత్రిక ముగింపులో రోమా విశ్వాసులను ప్రార్థించమని గట్టి విజ్ఞప్తి చేస్తున్నాడు. 32వ వచనం చివరలో ఏమంటున్నాడు?మిమ్మును బతిమాలుకొనుచున్నాను.” ఈ మాట చాలా బలమైన మాట. బ్రతిమాలడమంటే  దీనంగా విజ్ఞప్తి చేయడం. యాచించడం. “మీరు నాకొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని, మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టియు, ఆత్మవలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలుకొనుచున్నాను” “పోరాడుచు” అనే మాటకు  గ్రీక్ లో వాడబడిన మాటకు అర్ధం “వేదనపడుట”

         ప్రార్థన సమయం ఆడుకునే సమయం కాదు, ప్రియులారా! ప్రార్థన అంటే వేదనతో ప్రసవవేదన లాంటిది. ప్రార్థన అంటే పని చేయడం. ఆపో. ఇలాటి ప్రార్ధనలో ఐక్యతను కోరుకుంటున్నాడు. దీంట్లోనుండి సహవాసపు సంతోషం వస్తుంది. ప్రత్యేకంగా ప్రార్థించమని వారిని కోరాడు. మొదటి అంశము యూదయలోని అవిధేయులచేతిలోనుండి తాను విడిపించబడుట. వారు అవిశ్వాసులు. ఇది ముఖ్యమైన అంశము. మనము, ప్రతి దేవుని సేవకుడు, విశ్వాసి అవిశ్వాసుల చేతిలోనుండి విడిపించబడాలని ప్రార్థించాలి. రెండవ ప్రార్ధనాంశం అంశం యెరూషలేములో తాను చేసే పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరం చేయడం. మూడవ ప్రార్ధనాంశం 31వ వచనములో ఉన్నది. “నేను దేవుని చిత్తమువలన సంతోషముతో మీయొద్దకు వచ్చి, మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును, ప్రార్ధనలో ఐక్యత సహవాసపు సంతోషాన్నిస్తుంది. పౌలు భక్తుడు వారినడిగినట్లే ఈనాడు నేను మీలో ప్రతి ఒక్కరినీ అడుగుతున్నాను. ఈ రకంగా ఐక్యతతో మనమంతా ప్రార్ధించినపుడు సహవాసములోని ఆనందము కలుగుతుంది. ఒకానొకరోజు మనమంతా ముఖాముఖి కలిసి ప్రార్థించే కృప ప్రభువు అనుగ్రహించవచ్చు. ఈ మూడు పరిస్థితులు మనము నెరవేరిస్తే సహవాసపు ఆనందం దొరుకుతుంది. ఏమిటవి? 1. ఉద్దేశ్యములో ఐక్యత, 2.కార్యాచరణలో ఐక్యత 3.ప్రార్ధనలో ఐక్యత. ఇంత గొప్ప సహవాసపు ఆనందం మనమంతా పొందటానికి, ఈ పరిస్థితులు నెరవేర్చడానికి యేసు ప్రభువు తన మహా కృపను మనలో ప్రతి ఒక్కొరికి సమృద్ధిగా అనుగ్రహించుగాక! అమెన్!!

 

 

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...