సజీవ నిరీక్షణ - 2022 క్రొత్త సంవత్సర బైబిల్ సందేశం --- క్రొత్త సంవత్సరంలో క్రొత్త జీవం

 

సజీవ నిరీక్షణ - క్రొత్త సంవత్సర బైబిల్ సందేశం

 క్రొత్త సంవత్సరంలో క్రొత్త జీవం

     దేవునికి స్తోత్రం! తన కరుణనుబట్టి మనలో ప్రతి ఒక్కరినీ, ఒక్కొక్కరినీ క్రొత్త సంవత్సరములో జీవించడానికి 

అనుమతించిన మన రక్షకుడు ప్రభువు యేసు క్రీస్తు వారికి మన అందరిపక్షంగా కృతజ్ఞతాస్తోత్రములు 

చెల్లిస్తున్నాను. ప్రభువు మన గత జీవితమును లెక్కలోనికి తీసుకున్నపుడు మనము జీవించడానికి అర్హులము 

కాము. కానీ ప్రభువు తన అత్యంత కృప వాత్సల్యతనుబట్టి, మనము మంటివారమని జ్ఞాపకము చేసుకొని మనకు 

క్రొత్త సంవత్సరం బహుమానముగా ఇచ్చాడు. ఆయనకే నిత్యము, యుగయుగములకు మహిమ, ఘనత, స్తోత్రం 

కలుగును గాక, అమెన్! ఇలా రేడియోకు దగ్గర్గా వచ్చి కూర్చోని ప్రార్థనలో నాతో విశ్వాసముతో ఏకీభవించండి:

ప్రార్దించుకుందాం తలలువంచండి: ప్రార్థన

     క్రొత్త బట్టలు, క్రొత్త బండి, క్రొత్త వస్తువులు ఏవైనా ఇష్టపడని వారులేరు అంటే అతిశయోక్తికాదేమో! సృషిలోనే 

సృష్టికర్త అయిన దేవుడు క్రొత్తదనమును ఉంచాడు. ప్రతి పండు క్రొత్తదే, ప్రతి ఆకు క్రొత్తదే, క్రొత్తది ఏది రావాలన్నా, 

పాతది మరణించాలి, దాంట్లోనుండి క్రొత్తది రావాలి, అది సృష్టికర్త చేసిన సృష్టిక్రమము.

      పాపము వలన కలిగిన శాపము, మరణము మనలో ప్రతి ఒక్కరిని ఏ తారతమ్యము లేకుండా, పక్షపాతము లేకుండా, నిత్య నాశనము, నరకకము లోనికి నెట్టేసింది. మనమిప్పుడు జీవిస్తున్న లోకము అనుక్షణము నశిశ్తున్నలోకము. సంపూర్ణంగా ఉడిగిపోయి పనికిరానిదిగా మారి కాల్చబడే ఘడియలు రానున్నవి. పేతురు రెండవ పత్రిక 3:10-13 లో ఉన్న మాటలను మీకు జ్ఞాపకం చేయాలని ఆశ పడు తున్నాను. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును. ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు, దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను. అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టు చున్నాము; వాటియందు నీతి నివసించును.” క్రొత్త భూమి క్రొత్త ఆకాశములు అన్న మాటలను గమనించారా, శ్రోతలూ? అవును, ఈ భూమి పైనున్న ఆకాశములు నశించిపోయినపుడు క్రొత్త భూమి క్రొత్త ఆకాశములను ప్రభువు సృష్టిస్తాడు. అక్కడ ఉండేది నీతి మాత్రమే, పాపమునకు శాపమునకు తావు లేదు. ఎవరు వాటిలో నివసిస్తారు? దేవునితో తెగిపోయిన వారి సంబంధమును ఎవరు సరిచేసుకుంటారో, వారే! ఎవరి జీవితమును వారంతట వారే మార్చుకోలేరు. ధన పిపాసి జక్కయ్యను ధనమోసము నుండి, మగ్దలేనే మరియను ఏడు దయ్యములనుండి, సమరయ స్త్రీని వ్యభిచారమునుండి ఇలా కోట్లాదిమందిని రక్షించిన యేసు క్రీస్తు ప్రభువే జీవితములను మార్చగలడు. క్రొత్త సృష్టిగా చేయబడినవారే, క్రొత్త భూమి క్రొత్త ఆకాశములలో యేసు క్రీస్తు ప్రభువుతో నిత్యము జీవిస్తారు. రెండవ కోరింథీ పత్రిక 5:17లో క్రొత్త సృష్టి గురించి వ్రాయబడింది. “కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో, క్రొత్తవాయెను.” ప్రియ స్నేహితుడా, సోదరీ, నీవు యేసు క్రీస్తులో జీవించేంతవరకు నీ జీవితం మార్చబడదు. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగినయెడల కీడు చేయుటకు అలవాటుపడిన మీరును మేలు చేయవల్లపడును.” యిర్మీయ 13:23. పాపపు అలవాట్లు మారవు, చెడు వ్యసనాలు విడిచిపెట్టలేము. కానీ యేసు క్రీస్తులో ఉంటే ఆయనే క్రొత్త హృదయము కలిగించి క్రొత్త సృష్టిగా నిన్ను చేయగలడు. విశ్వాససహితమైన బాప్తిస్మము ద్వారా వారు యేసు క్రీస్తుతో మరణించి తిరిగి లేస్తారు. వారు దేవుని కుమారులు కుమార్తెలు అవుతారు.  ఆ విధంగా యేసుక్రీస్తులో ఉన్నవారిని ప్రభువు తన పరిశుధ్ధాత్మతో ముద్రిస్తాడు. పరిశుద్ధాత్ముడు వారిలో జీవిస్తాడు.

     ఇంతవరకు మనము నేర్చుకున్న ఈ క్రొత్త సృష్టి వెంటనే జరగకపోవచ్చు. మనిషి హృదయం చాలా కఠినమైనది. పాపమునకు బానిసగా ఉంటుంది గనుక జీవిత విధానం, జీవనశైలి, ప్రవర్తన, నడవడి, వెంటనే సంపూర్ణంగా మారకపోవచ్చు. ఈ విషయం మనకు పౌలు పత్రికలలో స్పష్టంగా బోధించబడింది. కోరింథీ సంఘములో అనేకరకమైన విశ్వాసులు పలు రకాలైన పాపమునకు బానిసలుగా ఉన్నట్టు తెలియవచ్చింది. గలతీ సంఘములో ఇంకా ధర్మశాస్త్రమును ఆశ్రయించిన విశ్వాసులు కనబడుతున్నారు. మరి కొన్ని చోట్ల సంఘములలోని విశ్వాసులు పాపమునకు బానిసలై ఉన్నందుచేత పౌలు భక్తుడు వారి స్వభావాలు క్రొత్త స్వభావాలుగా మారాలని గట్టిగా హెచ్చరించాడు. ఎఫెసీ పత్రికలో ఆయన ఇచ్చిన హెచ్చరికను పరిశీలిద్దాం. 5:22నుండి గమనించండి: “కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడివారై, నీతియు యధార్ధమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను.”   చిత్తవృత్తి అనగా మనము ఆలోచించే పద్ధతి, పరిస్థితులకు, చుట్టూ ఉన్న వారికి స్పందించే వైఖరి. ఒక వ్యక్తి యేసు క్రీస్తులో ఉన్నప్పటినుండి అతని ఆలోచన, ప్రవర్తన, నడవడి, మాట, క్రియ అన్నీ మార్చబడతాయి. అవి పరిశుధ్ద్ధాత్ముడు జరిగించే ప్రక్రియ. క్రొత్త సంవత్సరములో క్రొత్త స్వభావమును పొందాలనే ఆశ, ఆతురత, ఆలోచన ఉన్నట్లయితే అదే నిజమైన “New Year”! సంవత్సరాలు దొరలిపోతూనే ఉంటాయి, కానీ క్రొత్త స్వభావము కలుగుతున్నదా? లేదా? అని ఆలోచించుకొని సరిచూసుకోవటం అవసరం. క్రొత్త సంవత్సరములో క్రొత్త జీవము మీరు కావాలని కోరుకుంటున్నారా? మీ జీవితముతో ప్రవర్తనతో విసికి పోయారా? నిరాశ పడకండి. యేసు క్రీస్తు మీ పాత జీవితమంతటినీ క్రొత్తదిగా చేయగల శక్తిమంతుడు. ఆయన ఒక్కడే తన పరిశుధ్ధ రక్తమును నీ పాపములన్నిటి కోసం కార్చి ప్రేమతో ప్రాణమిచ్చిన పరమ రక్షకుడు. ఆయన చేతిలో నీ జీవితమును పెట్టగలిగే విశ్వాసము నీకున్నట్లయితే నీకు క్రొత్త హృదయం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ స్వభావమును తన వాక్యము చేత, తన పరిశుద్ధాత్మ బలము చేత క్రొత్త స్వభావముగా అనుదినము మార్చగల శక్తిమంతుడు ఆయనే!



 

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...