చాలా మంది వృద్ధులు పెద్ద అక్షరములే చదువగలిగినందు చేత పెద్ద అక్షరములు వాడుతున్నాము.
దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు పొందండి. మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్ లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి.
Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com.
Or send a message by Whats App to 98663 41841
రోమా పత్రిక అధ్యయనం-35 9: 25-33
దేవుని నీతి యొక్క అత్యున్నత ప్రామాణికత
జీవితం ఎంతో భారంగా గడుస్తుంది గదూ! గతoలో ఎన్నడూ చూడని క్రూరత్వము, అమాను షత్వము,
స్వార్ధము, కిరాతకత్వము, భయము, ఆందోళన 21వ శతాబ్దంలో చూస్తున్నాము. కరోనవైరస్ తెగులు భూమిమీద
విజృంభిచినప్పటినుండి ప్రపంచమంతటా చాలా పెద్ద మార్పులు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచము
మునుపాటిలాగా ఇకనుండి ఉండదని ఒక్కమాటలో చెప్పవచ్చు. ఈలాటి పరిస్థితులలో మనకు నెమ్మది ఎలా
దొరుకుతుంది? కేవలం దేవునివాక్యము ద్వారానే! మరో మాట, ప్రతిదినం క్రమం తప్పక 3 అధ్యాయాలు బైబిల్
చదువుతున్నారా? ఈ విషయంలో గట్టి పట్టుదలతో చదవండి. రండి, రోమా పత్రిక అధ్యయనంలో ఇంకొక్క అడుగు
ముందుకు వేద్దాం. రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి. ముందుగా ప్రార్ధించుకుందాం.
కొందరిని చూచినపుడు, ‘వీరు మంచివారు’ అంటూ ఉంటాం. అవునా? కారణం ఏదో ఒక మంచి పని, నీతి క్రియ
వారు చేసిఉంటారు. మరి దేవుని నీతి ప్రమాణాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? మన
నీతి ప్రమాణాలు చాలా తక్కువస్థాయిలో ఉన్నవని మనము గ్రహించాల్సిన సమయం అసన్నమయ్యింది. ఈనాటి
రోమాపత్రిక అధ్యయనంలో ఈ విషయం ప్రశాంతంగా అధ్యయనం చేద్దాం. రోమా 9:25-33.
25ఆప్రకారము– నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు, పేరు
పెట్టుదును.౹ 26 మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని యేచోటను వారితో చెప్పబడెనో, ఆ
చోటనే జీవముగల దేవుని కుమారులని వారికి పేరుపెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు.
27మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి, క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక
ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండినను శేషమే రక్షింపబడునని౹ 28యెషయాయు
ఇశ్రాయేలునుగూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు.
29మరియు యెషయా ముందు చెప్పినప్రకారము– సైన్యములకు అధిపతియగు ప్రభువు, మనకు
సంతానము శేషింపచేయకపోయినయెడల సొదొమవలెనగుదుము, గొమొఱ్ఱాను పోలియుందుము.
30-31అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని, అనగా విశ్వాసమూలమైన
నీతిని పొందిరి; అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును
అందుకొనలేదు,౹ 32వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల
మూలముగానైనట్లు దానిని వెంటాడిరి.
33–ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో సాప్థిచుచున్నాను; ఆయనయందు
విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి, తొట్రుపడిరి.
దేవుని నీతిమంతత్వము యొక్క అత్యున్నత ప్రమాణమును కొన్ని ప్రాముఖ్యమైన అంశములను బట్టి మనము
గ్రహించవచ్చు.
దేవుని నీతియొక్క అత్యున్నత ప్రామాణికతను గ్రహించడానికి కీలకమైన అంశాలలో మొదటిది, శేషము.
హొషేయ ప్రవక్త చేస్తున్న ఫిర్యాదు ఏమిటో గమనిద్దాం. హొషేయ 1:9,10, 2:23 వచనాలను పౌలు గారు
ఉంటంకిస్తూ అవి ఏలాగు నెరవేరతాయో బోధిస్తున్నాడు. “నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, ప్రియు రాలు
కానిదానికి ప్రియురాలనియు, పేరు పెట్టుదును” దేవుని ప్రజలు నమ్మకద్రోహులైనందు చేత ప్రవక్త ఇలా
అంటున్నాడు. వారికి తెలిసినదానికి వారు విధేయత చూపలేదు. దేవుడు వారికి తన కృపచేత ధర్మశాస్త్రము
నిచ్చాడు. ఆయన తన చట్టమును, న్యాయమును వారికి స్పష్టంగా తెలియచెప్పినప్పటికీ దాన్ని పాటించలేదు.
అయినా కూడా దేవుడు వారిని చేర్చుకొని మునుపటి ఆదరణ చూపిస్తూ ఉన్నాడు. 26 వ వచనం గమనించండి,
“మీరు నా ప్రజలు కారని యేచోటను వారితో చెప్పబడెనో, ఆ చోటనే జీవముగల దేవుని కుమారులని వారికి
పేరుపెట్టబడును.” దేవుని కరుణ వారిని సమీసపిస్తుంది. ఈ రాత్రి నిన్ను కూడా దేవుని కరుణ ఈ అధ్యయనం
ద్వారా సమీపిస్తుంది. దేవుడు తన ప్రేమనుబట్టి వారిని అక్కున చేర్చుకొని, మునుపటిస్థితిలో ఉంచాడు. ఆ
కరుణనుబట్టి ఒక శేషమును ప్రభువు రక్షించాడు. శేషము అంటే ఏమిటి? వారందరిలో కొందరు, లేదా ఒక చిన్న
భాగము మాత్రమే. 29 వ వచనం ప్రకారం, ప్రభువు జోక్యం చేసు కున్నాడు. “సైన్యములకు అధిపతియగు ప్రభువు,
మనకు సంతానము శేషింపచేయకపోయినయెడల సొదొమవలెనగుదుము, గొమొఱ్ఱాను పోలియుందుము.” అంటే
ఏమిటి?
దేవుడు ఇశ్రాయేలీయులను సమూల నాశనం చేయలేదు. ఒక చిన్న భాగాన్ని విత్తనము లాగా దాచిపెట్టాడు,
కాపాడాడు. ప్రభువు ఒకవేళ కాపాడి ఉండకపోతే, ఇశ్రాయేలీయులు ఇతర జనములు,
జాతులలాగాసమూలంగానశించిపోయేవారు. అబ్రహాము దినాల్లో
సోదొమ, గోమొర్రా పట్టణాలను
మొలకలతో సహా అగ్ని గంధకములతో ప్రభువు కాల్చివేశాడో, గుర్తుకొస్తుందా? సోదరీ సోదారులారా, యేసు క్రీస్తును
హృదయంలో రక్షకునిగా, జీవితానికి ప్రభువుగా, యజమానిగా చేసుకున్న వారు ఈ శేషములో ఉంటారు.
నీవున్నావా? నిర్ధారణ చేసుకో!
రెండవది, దేవుని అత్యున్నత నీతి ప్రమాణాలలో యూదేతరులను, అనగా యూదులు కాని వారిని, ఈ
శేషములో చేర్చడం దేవుని ప్రణాళికలో ఉంది. 31వ వచనం “అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని
అన్యజనులు నీతిని, అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి;” యూదులు కాని వారంతా ఈ రకానికి చెందుతారు.
ఇశ్రాయేలీయులుతప్ప మిగతా వారందరూ ఆన్యులే. శ్రోతలూ, గమనించండి, అద్వితీయ సత్యదేవుడు,
ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమైనట్టు ఏ ఇతర జనమునకు ప్రత్యక్షం కాలేదు. యూదేతరులు దేవుని ప్రత్యక్షతకు
బయట ఉన్నారు. వారు విగ్రహారాధకులు. అయినప్పటికీ విశ్వాసము చేత వారు దేవుని అమూల్యమైన రక్షణను
పాపక్షమాపణను పొందారు. ఆపో. కా. గ్రంధములో అది మనకు స్పష్టంగా బోధపడుతుంది. కాని, లోపల ఉన్న
ఇశ్రాయేలీయులు దేవుని ప్రత్యక్షతను చూచి కూడా, దేవుని నీతిని పొందలేదు. ఎందుకు? వారు దేవుని మార్గము,
పద్ధతి లో కాకుండా వేరే మార్గము, పద్ధతిలో నడిచారు. అదేమిటి? వారి విశ్వాసము వారి క్రియలమీద
ఆధారపడింది. ఈనాడు కూడా, ఎందరో పేరుకు మాత్రమే విశ్వాసులు, నామకార్ధ క్రైస్తవులు కానుకలు ఇవ్వడo మీద,
ఆచారాల మీద, పండుగలు ఆచరించడం మీద, విశ్వాసము లేకపోయినా, ఆచారరీతిగా ప్రభువుబల్లలో, పాలు
పొందడం మీద ఆధారపడుతూ ఉంటారు. దేవుని పరిశుద్ధ గ్రంధం ఇచ్చే హెచ్చరిక ఏమిటంటే, విశ్వాసము మీద
మాత్రమే ఆధారపడి రక్షింపబడ్డవారు వారు ఈ శేషములో ఉంటారు. మరి నీ సంగతేమిటి?
దేవుని నీతియొక్క అత్యున్నత ప్రమాణమును గ్రహించడానికి కీలకమైన మూడవ అంశం “అడ్డురాయి”. 33వ
వచనం: “ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో సాప్థిచుచున్నాను;” ఇశ్రాయేలీయులు దేవుని
ప్రత్యక్షతను చూచినా కూడా, తడబడ్డారు. పొరబడ్డారు. ఎందుకు? తప్పుడు సమాచారము నమ్మారు. వారు
ధర్మశాస్త్రమును నమ్మి ఇది, అది, మరొకటి చేస్తే సరిపోతుందని భావించి తప్పుత్రోవకు తొలిగిపోయారు,
తప్పిపోయారు. యేసు క్రీస్తు ప్రభువును “అడ్డుబండ” అని ఎందుకు పిలుస్తునారు? ఈ వచనాన్ని యెషయ 8:14,
26:16: మత్తయి 21:43-44 తో పోల్చి ధ్యానించాలి. యేసు ప్రభువును ఎక్కువశాతంయూదులు ఒప్పుకోలేదు,
నమ్మలేదు, అంగీకరించలేదు. ఆయన దైవ కుమారుడని నమ్మలేదు. ఆయన భూమి మీదికి వచ్చి, సిలువమీద
మరణించి పాపమునకు పరిహారము చెల్లించినపుడు కూడా వారు ఆయనను నమ్మనందుచేత ఆయనే వారికి
అడ్డుబండగా అయ్యాడు. క్రియలు చేయడం అవసరమే, కానీ అవి రక్షణ మారుమనసు పొందిన తరువాత వస్తాయి.
ముందుగా నీ పాపము పరిహరించబడిందా లేదా నిర్ధారణ చేసుకోవాలి. ప్రియ సోదరీ, సోదరుడా, దేవుని నీతి అ
త్యున్నతమైన నీతి. నీవు నేను ఆ స్థాయిని ఎప్పటికీ అందుకోలేము. పాపమునకు ప్రాయశ్చిత్తము యేసు క్రీస్తు
పరిశుద్ధమైన రక్తమే! మరేదీ పనికి రాదు. నీవు నేను చేసే దానధర్మాలు, మంచి పనులు, నీతి క్రియలు, మురికి
పేలికలే! ఒక వ్యక్తి యేసు క్రీస్తును హృదయపూర్వకంగా విశ్వసించినపుడు ఒక ఎక్స్ఛేంజి జరుగుతుంది. ఒక మా
ర్పిడి. యేసు క్రీస్తు ప్రభువు ఆ వ్యక్తి పాపమoతటినీ తన వద్దకు తీసుకొని, తన నీతిని బదులుగా ఇస్తాడు. నీ నీతి ఎం
త పనికిరాని నీతో నీవు గ్రహిస్తే తప్ప అది చేయలేవు. కానీ యేసు ప్రభువును నిజముగా, మనసారా రక్షాకునిగా
హృ
దయములో చేర్చుకుంటే, ఆయనకు జీవితాన్ని అప్పగిస్తే, ఆ విశ్వాసము రాయిలాగా బలంగా నిలుస్తుంది, అట్టి
వారికి కలవరము ఉండదు. “ఆయనయందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు” నీవు అంత్య దినమున,
తీర్పుదినమున సిగ్గుపడవలసి వస్తుందేమో. ఇప్పుడే సరిచేసుకుంటే మంచిది. నీ నీతి స్వనీతా? దేవుని నీతా?
దేవుని అత్యున్నతమైన నీతిని యేసు క్రీస్తు ద్వారా పొంది రూపాంతరం పొందే కృప ప్రభువు మనకందరికీ
అనుగ్రహిచుగాక! అమెన్!!
No comments:
Post a Comment