చాలా మంది వృద్ధులు పెద్ద అక్షరములే చదువగలిగినందు చేత పెద్ద అక్షరములు వాడుతున్నాము.
దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు పొందండి. మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్ లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి.
Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com.
Or send a message by Whats App to 98663 41841
ఈస్టర్ బైబిల్ అధ్యయనం
Happy Easter !! He Is Risen !!
మీకందరికీ ఈస్టర్ శుభములు! మీరంతా క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారా? ఎవరైనా వేదనలో ఉన్నట్లయితే దేవుని
సహాయం కోరుకుందాం. మీ ధైర్యం విడిచి పెట్టకండి, దేవుని కృపకు మించింది ఏదీ లేదు. బాధలు, చింతలు,
భయములు మిమ్ములను క్రుంగదీస్తున్నాయా? నిరాశపడకండి! ప్రార్థన చేద్దాం, రండి, రేడియోకు దగ్గరగా వచ్చి
ప్రశాంతంగా కూర్చోండి.
ప్రార్థన:
పండుగలు ఎక్కువ మట్టుకు ఆచారరీతిగానే జరిగిపోతున్నాయనడం సత్యదూరం కాదు. ఆచారం కంటే అర్ధం
ప్రాముఖ్యం. మీరేమంటారు? క్రీస్తు ప్రభువులవారి పునరుధాము నకు అర్ధం ఏమిటో మనము తెలుసుకోవడానికి
అవసరమయ్యే లేఖన భాగ్యమును ముందుగా చదువుకుందాం. I కొరింథీ 15:12 -26.
12 క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరుమృతుల
పునరుత్థానము లేదని యెట్లు చెప్పుచున్నారు?
13. మృతుల పునరుత్థానము లేనియెడల, క్రీస్తుకూడ లేపబడి యుండలేదు.
14. మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే.
15. దేవుడు క్రీస్తును లేపెనని, ఆయననుగూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము గదా? మృతులు
లేపబడనియెడల దేవు డాయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా
అగపడుచున్నాము.
16. మృతులు లేపబడని యెడల క్రీస్తుకూడ లేపబడలేదు.
17. క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు.
18. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి.
19. ఈ జీవితకాలముమట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యు లందరి కంటె
దౌర్భాగ్యులమై యుందుము.
20. ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు.
21. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను.
22. ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.
23. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రది కింపబడుదురు.
24. అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.
25. ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.
26. కడపట నశింపజేయబడు శత్రువు మరణము.
మొదట, మనము ఆలోచించ వలసిన విషయం. చనిపోయినవారు మళ్ళీ బ్రతుకుతారా? మనము ఎవరినీ
మళ్ళీ బ్రతికినవారిని చూడలేదు. అంత మాత్రాన బ్రతకరు అనుకోవడం సరియైనది కాదు. మనకు అన్ని విషయాల్లో
ప్రామాణికమైనది బైబిల్ గ్రంధం. పాత, క్రొత్త నిబంధనలలో పునరుధానమును గూర్చి బైబిల్ ఏ అనుమానము
లేకుండా ఏమి జరుగబోతుందో సెలవిస్తుంది. దానియేలు 12:2 “ మరియు సమాధులలో నిద్రించు అనేకులు
మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా
హేయులగుటకును మేలుకొందురు.” అనేకులు అంటే కొందరు అని అర్ధం కాదు. మరణాన్ని బైబిల్ నిద్ర అని
పిలుస్తుంది, అందులోనే తిరిగి బ్రతుకుతారు అనే అర్ధం ఇమిడిఉంది. క్రొత్త నిబంధనలో మన ప్రభువు యేసుక్రీస్తు
వారు స్వయాన చెప్పిన మాటలు గమనించండి. “దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున
సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు
చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.” పునరుధ్ధానము తప్పనిసరిగా జరుగబోతుంది.
అప్పుడు తీర్పు కూడా జరుగబోతుంది. ఆ తీర్పులో యేసు క్రీస్తు ప్రభువు నందు నిలుకడగా, విశ్వాసముతో అంతం
వరకు జీవించినవారే నిర్దోషులుగా తీర్చబడతారు. శిక్ష, అనగా నిత్య నరకం తప్పించుకుంటారు.
యేసు క్రీస్తు ప్రభువు తిరిగిలేచినందు చేత మానవజాతి అంతా ఏ తారతమ్యము లేకుండా తిరిగి లేస్తారు. యేసు
క్రీస్తు ప్రభువు ప్రధమ ఫలం. 20వ వచనం. “ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలోనుండి
లేపబడియున్నాడు.” ఆ సమయంలో తీర్పు జరుగబోతుంది. యేసు క్రీస్తు ప్రభువే న్యాయాధిపతి. వారి పాపములు
క్రీస్తు రక్తములో శుద్ధి చేసుకున్నవారందరు నిత్య జీవములోనికి, ఆయన నీతిని కాకుండా స్వనీతిని ఆశ్రయించిన
వారందరూ నిత్య నరకాగ్నిలో ప్రవేశిస్తారు. నీవెక్కడుంటావో నీకు తెలుసా? ఈ రోజే నిర్ధారణ చేసుకో!
క్రీస్తు పునరుధ్ధానం క్రైస్తవ విశ్వాసానికి పునాది రాయిలాంటిది. పునరుధ్ధానము లేనిది సువార్తకు అర్ధమే లేదు.
పునరుధ్ధానం సువార్తకు కేంద్ర బిందువు. క్రీస్తు వారు మరణించి తిరిగిలేచినoదుచేత ఆయన సిలువ మరణానికి
విలువ కలిగింది. అందరిలాగా క్రీస్తు ప్రభువు తిరిగిలేవకుండా ఉంటే ఆయన దైవత్వం అమవుతుంది? పునరుధ్ధానo
ఆయన దైవత్వాన్ని నిరూపించింది. ఇంకా ఎందుకు అనుమానిస్తున్నారు? నీ జీవితానికి నిజమైన అర్ధం ఇచ్చేవాడు
ఆయనే! ఆయన సమాధిని గెలిచినవాడు. ఆయన ఒక్కడే!
క్రీస్తు పునరుధ్ధానము మనలను నిరీక్షణతో నింపుతుంది. జీవించే వారందరూ ఏదో ఒక నిరీక్షణతో జీవిస్తారు. ఏదో ఒక
ఆశతో జీవిస్తూఉంటారు. కానీ పునరుధ్ధానమునుబట్టి మన నిరీక్షణ కేవలం ఈ లోకమునకు పరిమితం కాదని
రుజువు చేసింది. మరణం తరువాత జీవమే లేకపోతే జీవితానికే అర్ధం లేదు. యేసు క్రీస్తు ప్రభువు లేకుండా
మరణించిన వారoదరూ నిత్య నరకాగ్ని పాలవుతారు. మరి కొందరు మరణించిన తరువాత దేవుని వద్దకు
చేరుతామని భ్రమించి చివరకు నిత్యనరకాగ్ని వారికి సిద్ధంగా ఉన్నదని తెలియక మరణించారు. యేసు క్రీస్తు ప్రభువు
పునరుధ్ధానము మరణము తరువాత నిత్యత్వo ఉందని నిరూపించింది. అది ఇప్పుడున్న జీవితంలాంటిది కాదు.
అది మహిమ శరీరంతో మహిమలో జీవించే జీవితం. పాపరహితమైన పరిశుధ్ధ జీవితం. ఆ సంతోషం నిత్య సంతోషం,
ఈ లోకములో దొరికే క్షణికమైన సంతోషం కాదు. భౌతికమైన వస్తువులవల్ల దొరికే నిమిత్తమాత్రమైనది కాదు.
యేసు క్రీస్తు ప్రభువు సర్వాధికారి అని ఆయన పునరుధ్ధానo రుజువు చేసింది. అందరిలాగే ఆయనకూడ తిరిగి లేచి
ఒక్కసారి 500 మందికి కనబడకుండా ఉంటే, ఆయన సర్వాధికారి అని రుజువయ్యేదికాదు. ఆపో. పౌలు 24వ
వచనములో మరో ప్రాముఖ్యమైన సత్యమును తేటపరుస్తున్నాడు. “అటుతరువాత ఆయన సమస్తమైన
ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము
అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.” గమనిస్తున్నారా, శ్రోతలూ? పునరుధ్ధానము యేసు క్రీస్తు
విజయమును, అధికారమును నిర్ధారించింది. ఈ లోకములో అన్యాయపు తీర్పుతో వేధించబడే వారు చాలామంది
విశ్వాసులు, యేసయ్య ప్రియ కుమారులు, కుమార్తెలు ఉన్నారు. వారికి ఇది ఎంతటి ధైర్యం కలుగచేస్తుoది కదూ!
నీవు అన్యాయపు తీర్పుతో బాధ పడుతూ కుమిలిపోతున్నావా? పునరుధ్ధ్ధానుడై తండ్రి కుడి ప్రక్కలో పరిశుధ్ధమైన
సింహాసనముపైన కూర్చున్న యేసు క్రీస్తును చూడు! ధైర్యం తెచ్చుకో!
అందరూ లోలోపల భయపడే ఒక శత్రువు మరణం. ఎవ్వరికీ మరణమంటే ఇష్టముండదు. కానీ క్రీస్తు పున
రుధ్ధానము ద్వారా ఆయన మరణమును జయించాడు. పౌలు ఎంతో ధైర్యముతో అనే మాటలు వినండి: I కోరింథీ
15:54-56. “ విజయమందు మరణము మ్రింగివేయబడెను….ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ
ముల్లెక్కడ?...” యేసు క్రీస్తు ప్రభువు మరణమనే చివరి శత్రువును పునరుధ్ధానమునుబట్టి జయించాడు.
హల్లెలూయా! నీవు మరణపు పడక మీద ఉన్నవా? ఇపుడైనా నీ పాపమును యేసు క్రీస్తు ప్రభువు సన్నిధిలో
ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఆయన పరిశుధ్ధ రక్తములో నీవు శుద్ధి చేయబడితే, మరణమును జయించిన ప్రభువు
నిన్ను కూడా మరణభయమునుండి విడిపించి, నిత్య జీవములో చేర్చ శక్తి శక్తిమంతుడు! నీవు సిధ్ధమా!
No comments:
Post a Comment