రోమా పత్రిక అధ్యయనం-37 10: 5-13 దేవుని విశిష్టమైన ఆహ్వానం

  • చాలా మంది వృద్ధులు పెద్ద అక్షరములే చదువగలిగినందు చేత పెద్ద అక్షరములు వాడుతున్నాము. 

    • దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు  పొందండి.  మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో   వ్రాయండి,  మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం.  sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్  లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి. 

  • Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com. 

  • Or send a message by Whats App to 98663 41841

 

 

రోమా పత్రిక అధ్యయనం-37   10:5 -13

     దేవుని వాక్యం క్రమంగా వింటున్న మీ అందరికీ శుభములు. సర్వాధికారియైన దేవుని రెక్కల నీడ 

మీకు తోడుగా నుండుగాక! మీరంతా క్షేమంగా ఉన్నారా? “దేవుని వాక్యం చాలా బాగుంది” అని 

కొందరు అంటూ ఉన్నారు. కానీ ఎందుకు బాగుంది? అని అడిగితే, ఏ విషయంలో బాగుగా ఉన్నట్టు 

అనిపిస్తుందో చెప్పలేకపోతే అది నిజమైన ఒప్పుదల కాదు. “వింటున్న మాటలన్నీ నా కోసమే 

అనిపించింది” అని మరి కొందరు అంటారు. మరి ‘ఏ మాట, ఏ విషయంలో నీ కోసమే అనిపించింది’ అని 

ప్రశ్నిస్తే, చెప్పకుండా  దాటవేస్తూ ఉంటారు. సోదరీ సోదరులారా, దేవుని వాక్యం నీలో నిజముగా పని 

చేసినట్లైతే, యదార్ధముగా ఉన్నదున్నట్టు చెప్పడం నిజమైన దీనత్వమునకు గుర్తు.  ఫోన్ 9866 

341841 మీద మీ ప్రార్థన మనవులు, మీకు దేవుని వాక్యం ఏ విషయంలో ఏ విధంగా సహాయపడిందో, 

కాస్త స్పష్టంగా, విపులంగా, యధార్ధంగా పంచుకొనండి. 

 

      ఈ నాటి మన అంశం, దేవుని విశిష్టమైన ఆహ్వానం. ఆహ్వానమంటే అందరికీ ఇష్టమే. ఆహ్వానాలు   

ఒక సందర్భానికి రమ్మని పిలిచేవి. అవునా? అది ఎప్పుడు ఎవరు, దేనికి, ఎక్కడికి ఏ హోదాలో ఆహ్వా

నిస్తున్నారో స్పష్టంగా ఉంటుoదికదూ? సర్వాధికారి అయిన దేవుని నుండి మనలో ప్రతి ఒక్కరికీ 

ప్రత్యేకమైన, వ్యక్తిగతమైన ఆహ్వానమున్నది. అనాదికాలమునుండి ప్రభువు తన రక్షణ ఏర్పాటును 

గూర్చి, ఆహ్వానము పలుకుతూనేఉన్నాడు. ఆనాటి రోమాసామ్రాజ్యమంతట దేవుని ఆహ్వానమును 

ఇచ్చిన ఆపో. పౌలు ఆ సంగతిని రోమా పత్రికలో స్పష్ట పరిచాడు. లేఖనమును చదువుకుందాం. 

రోమా. 10:5-13:

 

5 ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెర వేర్చువాడు దానివలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు.

 

6 అయితే విశ్వాసమూలమగు నీతి యీలాగు చెప్పుచున్నది. ఎవడు పరలోకములోనికి ఎక్కి పోవును?  

అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు;

 

7 లేకఎవడు అగాధములోనికి దిగిపోవును? అనగా క్రీస్తును మృతులలోనుండి పైకి తెచ్చుటకు అని నీవు 

నీ హృదయములో అనుకొనవద్దు.

 

8 అదేమని చెప్పుచున్నది? వాక్యము నీయొద్దను, నీ నోటను నీ హృదయములోను ఉన్నది; అది 

మేము ప్రకటించు విశ్వాసవాక్యమే.

 

9 అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ 

హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.

 

10 ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో 

ఒప్పుకొనును.

 

11 ఏమనగా, ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది.

 

12 యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు 

ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు.

 

13 ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును.

 

     ఈ అద్భుతమైన లేఖన భాగములో దేవుని ఆహ్వానమును మనము అంగీకరించడానికి ఏమి  

షరతులు ఉన్నాయో తెలుసుకోవచ్చు.  

 

     దేవుని ఆహ్వానమును అంగీకరించడానికి ఉండే మొదటి షరతు ఏమిటంటే, ధర్మశాస్త్రము పెట్టే  

 నియంత్రణ.

 

     ప్రభువు ధర్మశాస్త్రమునిచ్చినపుడు మనకు కొన్ని హద్దులు నియమించాడు. ఇశ్రాయేలీయులు 

ఏవి చేయతగినవో ఏవి చేయకూడనివో స్పష్టంగా తెలియచేశాడు. ఏవి చేయాలని ప్రభువు నిర్దేశించాడో, 

ఏవి వారు చేయతగదో, చాలా జాగ్రతగా స్పష్టపరిచాడు.

 

     ఒక్కసారి ధర్మశాస్త్రమునిచ్చిన తరువాత దేవుని చట్టమునకు, న్యాయమునకు, వారు విధేయత 

చూపాలని ఆశించాడు. అవును, దేవుడు విధేయతను నిర్దేశించాడు. 5వ వచనం గమనించండి:

 “ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెర వేర్చువాడు దానివలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు.” 

కానీ ధర్మశాస్త్రమునకు కొన్ని పరిమితులు ఉన్నాయి. అవేమిటి? ధర్మశాస్త్రము చెప్పేంది చేయకపోతే, 

ధర్మశాస్త్రం ఆదేశించింది నెరవేర్చకపోతే, తీర్పు, శిక్ష తప్పదు. శ్రోతలూ, జాగ్రతగా వింటున్నారా? వారు 

చేసిన పాపమునకు తగినట్టుగా బలి అర్పించాలని ప్రభువు ఆదేశించాడు. బలులు కూడా 

ధర్మశాస్త్రములో భాగమే. కానీ అవి పరిమితిని దాటిపోలేవు. ధర్మశాస్త్రమును ఆచరించేవారికి ఒక కొరత 

ఉంది. ఆ కొరతను విశ్వాసము తీర్చింది. ధర్మశాస్త్రము, విశ్వాసము ఈ రెండూ పనిచేసే పద్ధతులు 

వేరు. తన ఆజ్ఞలు ఏమిటో మనము తెలుసుకోవడానికి దేవుడు ధర్మశాస్త్రము ఇవ్వడం అవసరం. కానీ 

మనకు నీతిని అనుగ్రహించాడానికి దానికి శక్తిలేదు. ఎందుకనగా, ధర్మశాస్త్రమును నెరవేర్చిన 

వారెవ్వరూ లేరు. కాబట్టి, దేవుని ఆహ్వానమును మనము అంగీకరించడానికి మొదటి షరతు 

ధర్మశాస్త్రము పెట్టే నియంత్రణ అని మనము తెలుకుంటున్నాము. బోధపడిందా, శ్రోతలూ?

 

     దేవుని ప్రత్యేకమైన ఆహ్వానమును అంగీకరించడానికి రెండవ షరతు విశ్వాసమును ఒప్పుకోవడం .  

ధర్మశాస్త్రము చేయలేనిది విశ్వాసము చేస్తుంది. హృదయములో ఉండే నిజమైన క్రియాశీలక 

విశ్వాసము. ధర్మశాస్త్రము నిర్దేశించింది హృదయము చేయాలనుకున్నా చేయలేదు. దాన్ని 

విశ్వాసము అనుగ్రహిస్తుంది. 8వ వచనం చివరిభాగం చదువుదాం. క్రొత్త నిబంధనలో 140వ పేజ్. 

మేము ప్రకటించు విశ్వాసవాక్యమే.” ఏమిటది? “వాక్యము నీయొద్దను, నీ నోటను నీ 

హృదయములోను ఉన్నది;” మన నోట్లో నుండి వచ్చే మాటలు మన హృదయపు ఒప్పుకోలు అయి 

ఉండాలి. క్రియల ద్వారా, అనగా, ఆచారాల ద్వారా, దాన ధర్మాలు మొదలైన క్రియల ద్వారా నీతి 

పొందలేము. కానుకలివ్వడం ద్వారా, అర్ధరహితంగా, అనాలోచితంగా, ఆచారముగా ప్రభువు బల్లలో 

పాలుపొందడం, ఈలాటి ఏక్రియలైనా, విశ్వాసమునకు సరికావు. విశ్వాసము అత్యవసరము.

 

      9,10 వచనాల్లో ఈ సత్యం చాలా స్పష్టంగా ఉంది. “యేసు, ప్రభువని నీ నోటితో ఒప్పుకొని,  

దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు 

రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ 

కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.” ధర్మశాస్త్రము ఏది నిర్దేశించిందో, దాన్ని మనకు 

ఇవ్వలేకపోయింది. కానీ విశ్వాసము దీన్ని సమకూర్చింది. ఏమిటా ఒప్పుకోలు? యేసుక్రీస్తు నీకు 

ప్రభువని ఒప్పుకోవాలి. నీవు ఒప్పు కున్నపుడు ఆయన నీ జీవితo మీద సంపూర్ణమైన అధికారం 

పొందుతాడు. నియంత్రిస్తాడు. అంతే కాదు, ఆయన మరణము నుండి తిరిగిలేచాడని, పౌలు మాటల్లో 

చెప్పాలంటే, తండ్రి ఆయనను లేపాడని ఒప్పుకోవాలి. ఆయన మరణం ఎంత ప్రాముఖ్యమూ, ఆయన 

పునరుధ్ధానo అంత ప్రాముఖ్యం. నీవు నేను ఈ ఒప్పుదలతో జీవించడం తప్పనిసరి. 10వ వచనంలో 

స్పష్టంగా ఉంది కదూ? హృదయములో నమ్మింది నోటితో ఒప్పుకోవాలి. ప్రియ సోదరీ, సోదరులారా, ఈ 

కార్యక్రమం మొదట్లో చెప్పిన విషయం జ్ఞాపకమొస్తుందా? దేవుని వాక్యముద్వారా పరిశుద్ధాత్ముడు 

నీలో కలిగిస్తున్న మార్పు నీ నోటితో చెప్పడం అవసరం. “రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును” 

అనే మాటలు లేఖనములో ఉన్నవే! హృదయములో విశ్వసించడం అంతరంగ పురుషునిలో జరిగే 

క్రియ. నోటితో ఒప్పుకోవడమంటే హృదయములో నీవు నమ్మినదేమిటో అదే నోటితో యధార్ధంగా 

చెప్పడం. 

 

      దేవుని అత్యంత విలువైన ఆహ్వానమును అంగీకరించడానికి రెండవ షరతు విశ్వాసమును 

ఒప్పుకోవడం.


     ప్రభువు ప్రత్యేకమైన ఆహ్వానమును అంగీకరించడానికి మూడవ షరతు ప్రభువు ఇచ్చే పిలుపు.     

శ్రోతలూ, గమనించండి. ఇప్పుడు అధ్యయనం చేసే మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. 11వ వచనం. 

“ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది” ఈ ప్రత్యేకమైన 

ఆహ్వానము ఏ భేదము లేకుండా అందరికీ ఇవ్వబండింది. “ఎవడును” అనే మాటల్లో ఉన్న అర్ధం 

గమనించారా? ఆ మాటలో నీవు కూడా ఉన్నావు. నీవెరవైనా! యేసు క్రీస్తునందు నిజముగా 

విశ్వాసముంచు వారెవ్వరూ సిగ్గుపడరు.

 

     12వ వచనంలో ఏ బేధము లేదని లేఖనం నొక్కి చెబుతున్నది. ఆపో. యూదులు గ్రీకులు అనే 

రెండు గుంపులను పోల్చి చూపిస్తున్నాడు. ఈ పోలికలో ప్రపంచమంతా ఉన్నది. ఏ తారతమ్యము 

లేదు. “ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు 

ఐశ్వర్యవంతుడై యున్నాడు.” దేవునికి స్తోత్రం! ఆహ్వానం అందరికీ ఉన్నా, అనుభవించే వారు కొందరే! 

వారెవరు? విశ్వ సించినవారు మాత్రమే! 13వ వచనంలో ఆపో. అంటున్నదేమిటి? ప్రభువు 

నామమునుబట్టి ప్రార్థన చేయు వాడెవడోవాడు రక్షింపబడును.” ఏ బేధము లేదు. ఆయనకు 

 మొరపెట్టేవారందరికీ కృప చూపగల మహా గొప్పదేవుడు. ఆయనకు క్షమాపణ అడిగేవారే 

రక్షింపబడతారు. యేసు నామములో క్షమాపణ, విమోచన కోసం ప్రార్థించే వారే రక్షింపబడతారు.

 

     మహాదేవుని శ్రేష్టమైన ఈ ఆహ్వానములోని ప్రాముఖ్యమైన భాగమిది. ఈ ఆహ్వానానికి నీవు  ప్రతి 

స్పందించే వరకు దాని గొప్పదనమును మహిమను నీవు ఆస్వాదించలేవు, అనుభవించలేవు. దేవుని 

అతిశ్రేష్టమైన ఈ ఆహ్వానమును నీవు గ్రహించావా? ఈ మూడు షరతులు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. 

మొదటిది, ధర్మశాస్త్రపు నియంత్రణ. అది నీవు ఏది చేయాలో ఏది చేయగూడదో సెలవిస్తుంది. 

రెండవది, విశ్వాసముతో ఒప్పుకొననడం. ఏమని విశ్వసించడం? యేసు క్రీస్తును నీ రక్షకునిగా, 

ప్రభువుగా నమ్మే క్రియాశీలక ఒప్పుకోలు. హృదయపూర్యకమైన ఒప్పుకోలు. ఆయన మరణము, 

పునరుధ్ధానమును నీ జీవితానికి అన్వయించుకోవడం. మూడవది, ప్రభువు ఇచ్చిన పిలుపు “ఎవరైనా”! అందులో నీవు నేను ఉన్నాము.

 

 

 దేవుని ఈ అతి శ్రేష్టమైన ఆహ్వానమును నీవు 

అంగీకరిస్తావా? తిరస్కరిస్తావా? నిర్ణయం నీదే!   

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...