చాలా మంది వృద్ధులు పెద్ద అక్షరములే చదువగలిగినందు చేత పెద్ద అక్షరములు వాడుతున్నాము.
దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు పొందండి. మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్ లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి.
Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com.
Or send a message by Whats App to 98663 41841
రోమా పత్రిక అధ్యయనం-33 9: 6-13
దేవుని ప్రణాళికకు ఉండే పునాదులు
మీరంతా బాగున్నారా? జీవితపు ఒడుదుడుకులు, ఎత్తుపల్లాలు, కష్ట సుఖాలు, మిమ్మల్ని కుదించి
వేధిస్తూఉన్నాయా? బాధలతో నీరసించి పోయారా? నిరాశ పడకండి, యేసుక్రీస్తునకు నిరీక్షణకర్త అని
పేరుంది. రోమా పత్రికలోని 15 అధ్యాయము 13వ వచనములో శ్రేష్టమైన వాగ్దానము ఉన్నది. మీ
బైబిల్ తెరవండి, నాతో బాటు చదవండి: “కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ
గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసముద్వారా సమస్తానందముతోను
సమాధానముతోను మిమ్మును నింపును గాక.” ఎంత అద్భుతమైన దేవుడు యేసయ్య! నిరాశలో
కూరుకుపోయినవారిలో సహితము నిరీక్షణను పుట్టించగలిగిన మహిమగల శక్తిమంతుడు. ఆయనకు
ప్రార్థన చేసి మొరపెట్టుకుందాం, రండి, రేడియోకు దగ్గరగా వచ్చి ప్రశాంతంగా నెమ్మదిగా కూర్చోoడి, మీ
బైబిల్ నోట్ బుక్ పెన్ తెచ్చుకొనండి.
రోమా పత్రిక 9వ అధ్యాయము 6-13 వరకు చదువుకుందాం, మీ బైబిల్లో గమనించండి, మీకు
వీలుగా ఉంటే, నాతోబాటు చదవండి:
6 అయితే దేవునిమాట తప్పి పోయినట్టు కాదు; ఇశ్రాయేలు సంబంధులందరును ఇశ్రా యేలీయులు
కారు.
7 అబ్రాహాము సంతానమైనంత మాత్రముచేత
అందరును పిల్లలు కారు గానిఇస్సాకువల్లనైనది
నీ సంతానము అనబడును,
8 అనగా శరీరసంబంధులైన
పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని యెంచ బడుదురు.
9 వాగ్దానరూపమైన వాక్యమిదే, మీదటికి ఈ
సమయమునకు వచ్చెదను; అప్పుడు శారాకు కుమారుడు
కలుగును.
10 అంతేకాదు; రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను
ఒకనివలన గర్భవతియైనప్పుడు,
11 ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచు వాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము,
12 పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందేపెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని
ఆమెతో చెప్పబడెను.
13 ఇందునుగూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి యున్నది.
మనము చేసే నిర్ణయాలను బట్టి సంగతులు, సంఘటనలు ఉంటాయి. క్రొత్త నాయకులు
అధికారము చేపట్టినపుడు ముందు చేయబడిన వాటిని మార్చుతూ ఉంటారు. కుడి యెడమల మధ్య
భేదం ఉన్నట్లే, మానవుని పట్ల దేవుని ప్రణాళికలో కొన్ని హద్దులు దేవుడు పెట్టాడు. దేవుడు కొన్ని
పునాదులమీద ఆధారపడి అలా చేశాడు. ఆ పునాదులేమిటో ఈ పూట బైబిల్ అధ్యయనం చేసి
తెలుసుకుందాం.
మొదటి పునాది దేవుని వాక్యం. దేవుని వాక్యం ఈ మధ్యగీత ఎంత ఖచ్చితమైoదో తెలుపు తుంది.
దేవుని వాక్యం చాలా శక్తివంతమైనది. దానికి అర్ధము ఉన్నది. 6వ వచనములో ఆపో. ఏమంటు
న్నాడోగమనించారా? “దేవునిమాట తప్పి పోయినట్టు కాదు” మరో మాటలో చెప్పాలంటే దేవుడు అర్ధం
లేని మాటలు, శక్తి లేని మాటలు చెప్పడు అని గ్రహించాలి. దేవుని ఏ మాటకూడ తప్పిపోదు. ఆయన
ఏ మాటకూడా ఉపయోగము లేకుండా ఉండదు. దేవుని ఏ మాటకూడ అర్ధము లేకుండా ఉండదు.
దేవుని ప్రతి మాట స్పష్టంగా ఉంటుంది, ఆయన మాట చెప్పినపుడు ప్రభువు చెప్పిన ఉద్దేశ్యం
తప్పనిసరిగా నెరవేరుతుంది. దేవుని ఈ మధ్యగీత యొక్క పునాది దేవుని మాట. ఆ మాటలు
స్పష్టంగా ఉంటాయి. అవి నిశ్చయమైనవి. ఉదాహరణకు 8వ వచనం గమనించండి.
“శరీరసంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానo…” ఈ
మాటలు దేవుడు చెప్పినపుడు అర్ధం, ఉద్దేశ్యం లేకుండా చెప్పలేదు. ఆయన అబ్రహాము, శారాలకు
వారి ముసలివయసులో కుమారుణ్ణి కంటారని చెప్పినపుడు, నిజంగా అది జరుగుతుందని ఆయన
ఉద్దేశ్యం. సాధారణంగా దంపతులు పిల్లలు కనే వయసు కాకపోయినా, అది నిశ్చయం. 9వ
వచనములో ఏమున్నది? “మీదటికి ఈ సమయమునకు వచ్చెదను; అప్పుడు శారాకు కుమారుడు
కలుగును.” స్నేహితుడా, సోదరీ, దేవుడు ఈ మాటలు చెప్పి, చెప్పింది చెప్పినట్టే, నిశ్చయంగా,
స్పష్టంగా నెరవేర్చినందుచేత దేవుడు చెప్పిన మాటలన్నీ తప్పనిసరిగా నెరవేర్తాయని మనము
నిస్సందేహంగా నమ్మవచ్చు. దేవుని మధ్యగీత ఆయన నిశ్చయమైన మాట మీద ఆధారపడి
ఉంటుంది, హల్లెలూయ!
రెండవ పునాది, దేవుని వాగ్దానము ఆ మధ్యగీత యొక్క ఉద్దేశ్యమును బలపరుస్తుంది. సోదరీ
సోదరులారా, ఇప్పుడు జాగ్రతగా చదవాలి, గ్రహించాలి. అపోస్తలుడు శరీరసంబంధులైన పిల్లలు దేవుని
పిల్లలు కారు అని తేటపరుస్తున్నాడు. మనము ఆదికాండము 16వ అధ్యాయమును చూచి
అబ్రహాము శారాలు వారికి పిల్లలు లేనపుడు ఈ ప్రశ్నకు ఏ విధంగా సమాధానమిచ్చారో
తెలుసుకుందాం. దానికి వారు ఏర్పాటు చేసుకున్న స్వంత
ప్రయత్నం ఏమిటంటే హాగరు అనే ఆమె
దాసి ద్వారా పిల్లలను కనడం. ఇది దేవుని ప్రణాళికకు వ్యతిరేకం, విరుధ్ధం. అందుకే హాగరు పిల్లలను
శరీరసంబంధులని పిలుస్తూ ఉన్నారు.
కానీ వాగ్దానపు పిల్లలు కూడా ఉన్నారు. ఆదికాండము 17లో దేవుడు శారాను దర్శించాడు.
సాధారణoగా పిల్లలు కనేవయసు వారిద్దరు దాటిపోయినా, దేవుడు వారికో వాగ్దానం చేశాడు. “మీదటికి
ఈ సమయమునకు వచ్చెదను; అప్పుడు శారాకు కుమారుడు కలుగును.” పుట్టిన బాలుడు ఒక
అద్భుతరీతిగా జన్మించినవాడు. వారిద్దరు భౌతికంగా, శారీరక రీతిగా పిల్లలు కనే అవకాశం ఎంత
మాత్రము లేదు. ఆ వయసు దాటిపోయారు. వారు విశ్వాసమునందు బలహీనులు కాకుండా దేవుని
నమ్మారని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు వారి విశ్వాసమును ఘనపరచి తన వాగ్దానమును
నెరవేర్చాడు. దేవుని మధ్యగీత దేవుని వాగ్దానముమీద ధృడంగా నిలుస్తుంది. సోదరీ, సోదరులారా,
మీరు, నేను దేవుని వాగ్దానము యొక్క బలమును, శక్తిని ఆశ్రయిద్దామా?
మూడవ పునాది దేవుని ఉద్దేశ్యం. అబ్రహాము, ఇస్సాకు అనే మన పితరుల చరిత్రను గమనించి
చూస్తే, ఇస్సాకు భార్య రిబ్కాకు కూడా సంతానం కలుగలేదు. ఇస్సాకు ఈ పరిస్థితిలో వేదన చెంది
తనభార్య రిబ్కా గర్భమును తెరవమని ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన ప్రార్థన విని
కవలపిల్లనిచ్చాడు. ఇద్దరూ కుమారులే! ఆమె గర్భంలో పిల్లల పెనుగులాట కనిపించింది. ఆమె
ఆందోళనతో దేవునికి మొరపెట్టింది. 12వ వచనం ప్రకారం దేవుడు ఆమెతో మాట్లాడాడు. తన సంకల్పం
ప్రకారమే పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని దేవుడు సెలవిచ్చాడు. వారు పుట్టి పెద్దయ్యాక
రెండు జనములుగా గర్భంలోనే పెనుగులాటలాగా ఒక జనము మరొక జనము, ఒకరిమీద మరొకరు
పోరాడుతారని ప్రభువు సెలవిచ్చాడు. గమనించoడి, శ్రోతలూ, దేవుడు వారిమధ్య గీత గీశాడు. మనలో
ఈ విధంగా ఎందుకు జరగాలి అనే ప్రశ్న రావచ్చు. మనము దేవుని ప్రశ్నించలేము. మధ్యగీత దేవుని
ఉద్దేశ్యం మీద ధృడముగా నిలిచిఉన్నది. అది దేవుడు నిశ్చయించింది. తన భవిష్యద్జ్ఞానము ప్రకారము
తన పరిశుధ్ధ చిత్త ప్రకారము దేవుడు సమస్తము జరిగిస్తాడని మనము తెలుకోవాలి. దేవునికి
సమస్తము తెలుసు, అనగా జరగగలిగినవి, జరుగుతున్నవి. ఆయన తన భవిష్యద్ జ్ఞానమును, తన
పరిశుద్ధ చితమును బట్టి ఏది జరగాలో నిర్ణయిస్తాడు. ఆయన మధ్యగీత తన వాక్కు మీద, ఆయన
వాగ్దానం మీద, ఆయన ఉద్దేశ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ అద్భుత సత్యం నీ జీవితానికి, నా
జీవితానికి కూడా వర్తిస్తుంది. యేసు క్రీస్తు ప్రభువు మరణమును జయించి తిరిగి సజీవుడైన తరువాత
ఉద్ఘాటించిన సత్యమేమిటో తెలుసా? “పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము
ఇయ్యబడియున్నది...” ఆయన సర్వసార్వభౌమ అధికారం క్రింద మన జీవితాలను ఉంచినట్లయితే
ప్రభువు నిత్యమైన, పరలోక రాజ్యములోనికి మనలను చేర్చగల శక్తియంతుడు. ఈ భూమ్మీద జీవించే
దినములలో తన చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చగల సర్వాధికారి! ఆయన చేతుల్లో నీ జీవితాన్ని
పెట్టగలిగే కృప ప్రభువు నీకనుగ్రహించుగాక! అమెన్!!
No comments:
Post a Comment