చాలా మంది వృద్ధులు పెద్ద అక్షరములే చదువగలిగినందు చేత పెద్ద అక్షరములు వాడుతున్నాము.
దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు పొందండి. మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్ లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి.
Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com.
Or send a message by Whats App to 98663 41841
రోమా పత్రిక అధ్యయనం - 32 9:1-5
ఇశ్రాయేలును గూర్చిన పౌలు తలంపులు
సమస్యలనుబట్టి అలిసిపోయారా? పరిస్థితులు మీ శాంతి సమాధానమును దొంగిలిస్తున్నాయా?
యేసు క్రీస్తు సమాధానమునకు కర్త. అనగా సమాధానము లేనప్పుడు ఆయన పుట్టించగల
శక్తిమంతుడు. దేవుడు శూన్యములోనుండి మన కంటికి కనిపిస్తున్న సమస్తము, కనిపించని వాటిని
కూడా సృష్టించిన శక్తిమంతుడు. ఆయన నీలో సమాధానమును శాంతిని పుట్టించగల కర్త. ఆయనకు
నీ జీవితాన్ని అప్పగిస్తావా? కరోన వైరస్ విషయంలో అలసత్వంగా ఉండకండి, తగిన జాగ్రతలు
తీసుకోవడంద్వారా పెద్ద పెద్ద ఉపద్రవాలు తప్పించుకోవచ్చు. ఇక ప్రార్ధించుకుందాం, తలలువంచండి.
ప్రార్థనలో నాతో ఏకమనస్సు కలిగిన వారు, చివరలో అమెన్ అని స్పష్టంగా చెప్పండి.
ప్రతి ఒక్కరికీ దాచుకున్న సంగతులు ఉంటాయి. స్వంత విషయాలైన, కుటుంబ విషయాలైన
కావచ్చు. ఏదో ఇక సమయములు అవి చెప్పక తప్పదు. ఆపో. పౌలు రోమా 9,10,11 అధ్యాయాల్లో
అదే చేస్తూ ఉన్నాడు. ఆయన నిష్టగల యూదుడు. తన ప్రజలైన ఇశ్రాయేలీయులపట్ల దేవునికి ఉన్న
రక్షణ ప్రణాళికను పరిశుద్ధాత్ముని జ్ఞానవివేచనలచేత పౌలు గారు గ్రహించారు. వారిని విమోచించే
రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువు గురించి వారికి చెప్పాలని ఎంతో ఆసక్తితో పనిచేశాడు. ఇశ్రాయేలు పట్ల
పౌలు తలంపులు అనే ఈ అంశము రోమా 9:1-5 లో ఉన్నది. అది ఈ పూట అధ్యయనం చేద్దాం, రండి
రేడియోకు దగ్గరగా వచ్చి, మీ బైబిల్ నోట్ బుక్, పెన్ తెచ్చుకొని కూర్చోండి. రోమా 9 మొదటినుండి
చదువుకుందాం.
1 నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవు.
2 క్రీస్తునందు నిజమే చెప్పు చున్నాను, అబద్ధమాడుట
లేదు.
3 పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్య మైనయెడల,
దే హసంబంధులైన నా సహోదరుల
కొరకు నేను క్రీస్తునుండి వేరై శాపగ్రస్తుడనై యుండ గోరుదును.
4 వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు
నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును
అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి.
5 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో
పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి
నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్.
ఈ కొద్ది మాటలలో ఆపో.పౌలు తన తలంపులలోని లోతైన భావాన్ని తెలపడం చాలా అద్భుతంగా ఉంది.
మొదటి తలంపు ఆయన తన వేదనను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఆయన మనసులోని మాటను
స్పష్టంగా చెబుతూ ఆయన సత్యమే చెబుతున్నాడని మనము తెలుసుకోవాలని ఆరాట
పడుతున్నాడు. “క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు.” అని రెండవ వచనములో
చెప్పడం గమనించారా? పాత నిబంధనలోని మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏదైనా సత్యమని నిర్ధారణ
చేయడానికి ఇద్దరు లేక ముగ్గురు సాక్ష్యముండాలి. ఇక్కడ క్రీస్తు ప్రభువుది ఒక సాక్ష్యం. రెండవది తన
మనస్సాక్షి. అందుచేత ఇద్దరు సాక్షుల ఆధారంగా సత్యమని నిశ్చయమయ్యింది.
పౌలు తన భావాలను, బయట పెడుతున్నాడు. పెద్ద వేదన ఆయనలో ఉన్నది. ఆ వేదనను
మనతో పంచుకుంటున్నాడు. “నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు
కలవు.” మొదటి వచనం. ఈ వేదన, దుఖము హృదయము నిండా ఉన్నప్పటికీ ఇంతవరకు
ఎప్పుడూ చెప్పలేదు. దానిబట్టి ఆయన హృదయం భారంగా దుఖముతో నిండిపోయింది.
ఆపో. కార్యముల గ్రంధం చదివితే, పౌలు గారు తన సౌవార్తిక ప్రయాణాల్లో మొదట అక్కడ ఉండే
సమాజమందిరానికి వెళ్లారు. అక్కడ సమాజమందిరముంటే, మొదట అక్కడికే వెళ్ళేవారు. తాను
వెళ్ళిన ప్రతి చోట యూదులకు పరిచర్య చేశాడు. సమాజమందిరము లేని ఊళ్లలో అక్కడ ఉన్న
ప్రార్ధనస్థలానికి వెళ్ళేవాడు. ఫిలిప్పీ పట్టణంలో అలాగే చేశాడు కదా! నదీతీరములో ప్రార్థన జరిగే
స్థలముందని తెలిసి అక్కడ తన భారము పంచుకోవాలని, మాట్లాడాలని అక్కడికి వెళ్ళాడు. తన
హృదయ భారమును, తీరని వేదనను పంచుకోవడానికి అక్కడికి వెళ్ళాడు. ప్రతి చోట, ఎల్లప్పుడు
సమాజ మoదిరానికి వెళ్ళాడు. సమాజమందిరమంటే యూదులు ప్రార్ధనకోసం చేరే మందిరం.
యెరూషలేములో ఆయన బంధించబడ్డపుడు న్యాయాధిపతి ముందు సాక్ష్యామిస్తూ పౌలు అన్న
మాటలేమిటో తెలుసా? “నేను నేటివరకు కేవలము మంచి మనస్సాక్షిగల వాడనై దేవునియెదుట
నడుచు కొనుచుంటినని” చెప్పాడు. అవును, సోదరీ సోదరులారా, ఆపో. పౌలు తన మిక్కటమైన
వేదనను, మనోదుఖమును పంచుకున్నాడు. ఆయనకు హృదయములో మానని, తీరని వేదన, ఎంతో
దుఖము ఉన్నవి.
రెండవ తలంపు , పౌలు గారు తన ఆశను గూర్చి పంచుకుంటున్నాడు.
బలమైన కోరికఆయనలో ఉంది. 3వ వచనములో ఆ బలమైన కోరిక ఏమిటో తేటగా వ్రాయబడింది. “
సాధ్యమైనయెడల, దేహసంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తునుండి
వేరై శాపగ్రస్తుడనై
యుండగోరుదును.” ఇది ఎంతటి ప్రగాఢమైన కొరికో మీరు గమనిస్తున్నారా? ఈలాటి కోరిక నా
మట్టుకు నేను కోరలేను. నేను క్రీస్తునుండి ఎట్టి పరిస్థితులలో వేరు కావడానికి ఇష్టపడను. దేవుడు
మనలను అందరినీ వేరు వేరు రీతులుగా చూస్తాడు. జాగ్రత్తగా గమనిస్తే, నిర్గమకాండములో మోషే
చేసినట్టు పౌలు చేస్తూ ఉన్నట్టు అర్థమవుతుంది. నిర్గమ కాండము 32:32 లో వ్రాయబడిన
సంఘటన జ్ఞాపకమొస్తుందా? ఇశ్రాయేలు ప్రజలు బoగారు దూడను చేసుకొని ఆరాధించినపుడు, అది
బహు భయంకరమైన పాపమని మోషే గమనించాడు. ఆయన దేవుని వద్దకు తిరిగి సీనాయి కొండ
మీదికి వెళ్ళి “అయ్యో, నీవు వారి పాపమును పరిహరించితివా, లేనియెడల నీవు వ్రాసిన నీ
గ్రంధములోనుండి నా పేరు తుడిచివేయుమని బతిమాలుకొనుచున్నాననెను.” మోషే పౌలు చేస్తున్నది
దాదాపు ఒకే రీతిగా ఉన్నాయా? పౌలునకు బహు బలమైన కోరిక ఉన్నది. పౌలు క్రీస్తులోనుండి వెరై
శాపగ్రస్తునిడిని అయిన పరవలేదని అంటూ ఉనాడు. మోషే నా పేరు జీవగ్రద్ధములో నుండి
తుడిచేపెట్టమని అడుగుతూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు మోషేతో ఏమన్నారో తెలుసా? నన్ను
వెంబడించని వారి పేరులు తుడిచిపెడతాను గాని నీ పేరును కాదు, అని ప్రభువు చెప్పాడు. ఆపో. పౌలునకు ప్రగాఢ వాంఛ ఉన్నది. ఆయన “ దేహసంబంధులైన నా సహోదరులు” అంటూ ఉన్నాడు.
దేహసంబంధులు అనగా రక్తసంబంధులు అని అర్ధం. నా స్వంత
కుటుంబం, బంధువర్గం అని పౌలు
భావన. వారి గురించి ఎంతో బాధ పడుతూ ఉన్నాడు., వేదన చెందుతూ ఉన్నాడు. వారి గురించి ఏదైనా
చేయాలనే తపన, ఆరాటం ఆయనలో ఉంది. అది మనతో పంచుకుంటూ ఉన్నాడు. పౌలు గారు ఈ వాంఛను తన
జీవితమంతటిలో అనుభవించాడు. ఆయన యేసు క్రీస్తు ప్రభువు నుండి దమస్కుకు వెళుతున్నపుడు
విన్నమాటలు ఎన్నడూ మరిచిపోలేదు. ఆయన అగ్రిప్ప రాజు ముందు తన గురించి తాను
చెప్పుకుంటున్నపుడు, “ఆకాశమునుండి కలిగిన ఆ దర్శనమునకు
నేను అవిధేయుడను” కాలేదు
అని సాక్ష్యామిచ్చాడు. పౌలునకు కలిగిన ఈ ప్రగాఢ వాంచను మనము స్పష్టముగా అర్ధము
చేసుకోగలుగుతున్నాము.
మూడవ తలంపు, పౌలు గారు తన వివేచనను గూర్చి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. 4,5
వచనాలు జాగ్రత్తగా పరీక్షించాలి. ఇవి చాలా ముఖ్యమైనవి. ఇశ్రాయేలీయులకు గొప్ప పిలుపు ఉన్నది.
ఈ నాలుగు వచనల్లో ఎనిమిది ముఖ్యమైన అంశములు ఉన్నవి. వారికి చెందినవి: 1.
స్వీకృతపుత్రత్వము లేదా దత్తపుత్రత్వము. అనగా కుమారుని స్థితి. 2 మహిమ వారికి చెందింది.
అరణ్యములో ప్రత్యక్ష గుడారములోనూ, ఆ తరువాత కట్టడిన దేవుని పరిశుద్ధ మందిరములోనూ,
దేవుని స్వయంసన్నిధిగాఉన్న “షెకీనా” మహిమను దేవుడు వారికి అను గ్రహించాడు. 3. నిబంధనలు.
బైబిల్ గ్రంధంలో ఎనిమిది నిబంధనలు ఉన్నవి, వాటిలు ఐదు ఇశ్రాయేలీయులతో దేవుడు చేశాడు. 4.
ధర్మశాస్త్రము. ప్రపంచములోని అందరికీ పరిశుద్ధప్రామాణికంగా ఉన్న దేవుని ధర్మశాస్త్రము
వారికివ్వబడింది. 5. ఆరాధన క్రమము, పద్ధతులు, అనగా బలుల ద్వారా దేవుని సేవించడం వారికే
ఇవ్వబడింది. 6. వాగ్దానములు వారికి ఇవ్వబడ్డాయి. 7. పితరులు వీరువారు. మన పితరులు అనగా
విశ్వాసపు మార్గములో మనకు ముందూ నడిచినవారు అందరూ ఇశ్రాయేలీయులే! 8. అన్నింటికంటే
ప్రాముఖ్యమైనది, యేసు రక్షక్షుని రాకను గూర్చిన వాగ్దానము. ఇది వారికి, వారిద్వారా ఇవ్వబండింది.
ఇది దేవుని అతి ప్రత్యేకమైన వాగ్దానము. సోదరీ సోదరులారా, పౌలు గారి ప్రగాఢ వాంఛ ఎవరికోసం?
తన స్వంత జాతి, కుటుంబం, రక్త సంబంధులైన ఇశ్రాయేలీయులకోసం. వారి రక్షణ కోసం. మరి నీ
ప్రజలకోసం, నీ కుటుంబం కోసం, నీ రక్తసంబంధుల కోసం వారి రక్షణ కోసం నీకు ఈ ప్రగాఢ వాంఛ
ఉందా!
No comments:
Post a Comment