రోమా పత్రిక అధ్యయనం 24 7: 7 -14 ధర్మశాస్త్రపు ఉద్దేశ్యం ఏమిటి?

  •  

    చాలా మంది వృద్ధులు పెద్ద అక్షరములే చదువగలిగినందు చేత పెద్ద అక్షరములు వాడుతున్నాము. 

  • దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు  పొందండి.  మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో   వ్రాయండి,  మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం.  sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్  లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి. 
  • Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com. 
  • Or send a message by WhatsApp to 98663 41841

 

రోమా పత్రిక అధ్యయనం 24 - 7:7-14

ధర్మశాస్త్రపు ఉద్దేశ్యం ఏమిటి?

     కష్టాలు, బాధలు, వేదనలు మిమ్మల్ని క్రుంగదీస్తున్నాయా? అవి లేనిది జీవితం ఎవ్వరికీ సాగదు. వంటరిగా ఉంది, నాకేవ్వరు లేరు అనుకుంటున్నారా? వంటరిగానే, అన్నీ వేదనలు, హింసలు, బాధలు, అపనిందలు భరించి, చివరకు సిలువమరణమును సహితం భరించి, మరణమును జయించిన యెస్కుక్రీస్తు ప్రభువు నీతో అంటున్న మాటలేమిటో వినండి: మత్తయి సువార్త. 11:28. "ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును."

     దేవుని తలంపులకు మన తలంపులకు భూమికి ఆకాశానికి ఉన్నo  దూరమని బైబిల్ గ్రంధం యేషయ గ్రంధం 55:8,9 వచనాల్లో తేటపరుస్తున్నది.  అయినప్పటికీ, దేవుడు తన తలంపులను బైబిల్ గ్రంధంలో తెలియచేసాడు. ఇది ఆశ్చర్యమా? కాదా?? అంచేత దేవుని తలంపులు ఏమిటో తెలుసు కోవాలంటే బైబిల్ గ్రంధం జాగ్రతగా క్రమంగా చదవాలి. ప్రతి రోజు 3 అధ్యాయాలు, ఆది వారం అనగా ప్రభువు దినాన్న 5 అధ్యాయాలు క్రమం తప్పకుండా చదివేతే, 2021 చివరి దినానికి మీరు బైబిల్ చదవడం సాంతం ముగుస్తుంది. ఈరోజే ఆరంభించవచ్చుకదా!?

       ఒక ఉద్దేశ్యము లేకుండా దేవుడు ఏదీ చేయలేదు. ఇది ఎందుకు చేశారు?’ అని దేవుణ్ణి అడగినపుడు నాకు తెలియదు అనే సమాధానం దేనికికూడా రాదు. మనము చాలా సార్లు నాకు తెలియదు అని చెప్తూ ఉంటాము. దేవుడు ఎందుకు ధర్మశాస్త్రము ఇచ్చాడు?’ అనే ప్రశ్న నీవు అడుగవచ్చు. అది మంచి ప్రశ్న. దానికి సమాధానం ఈ నాటి అధ్యయనంలో తెలుసుకుందాం, రండి. బైబిల్, నోట్ బుక్, పెన్ తెచ్చుకొని, రేడియోకు దగ్గరగా వచ్చి, ప్రశాంతంగా కూర్చోండి. లేఖన భాగం రోమా. 7:7-14లో ధర్మశాస్త్రపు ఉద్దేశ్యం ఏమిటో అధ్యయనం చేద్దాం. మీ బైబిల్లో గమనించండి:

     7 కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగా         ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పనియెడల దురాశయన ఎట్టిదో నాకు        తెలియకపోవును.౹

 8అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసికొని సకలవిధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము       లేనప్పుడు పాపము మృతము.౹ 

9 ఒకప్పుడు నేను ధర్మశాస్త్రములేకుండ జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము  వచ్చెను; నేనైతే చనిపోతిని.౹

 10అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను.౹

 11ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువుచేసికొని నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను.౹

12కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై              యున్నది.౹

 13 ఉత్తమమైనది నాకు మరణకర మాయెనా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు              మరణము కలుగజేయుచు, పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞమూలముగా     అత్యధిక పాపమగు నిమిత్తము, అది నాకు మరణకరమాయెను.౹

 1 4ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినై    యున్నాను.౹ 

      పాపమును ప్రభావితము చేసే కొన్ని నిర్దిష్టమైన కార్యాలను ధర్మశాస్త్రము యొక్క ఉద్దేశ్యము నెరవేరుస్తుంది.

     మొదటిది, ధర్మశాస్త్రము పాపమును నిర్వచిస్తుంది.   ఏదిదోషమో ధర్మశాస్త్రము ఎత్తిచూపిస్తుంది. దురాశ అంటే ఏమిటో తెలిసింది ధర్మశాస్త్రము ఆశింపవద్దు అని తెలిపినపుడే అని ఆపో. పౌలు తేటపరుస్తున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రము ఆశించడము పాపము అని నిర్వచించింది. అవును, బైబిల్ ఏది దోషమో తెలియచేస్తుంది. ఇంకా విపులీకరిస్తూ ఆశించవద్దని ధర్మశాస్త్రము ఆజ్ఞాపించినందుచేత పాపము దాని వాడుకొని తనలో రకరకాల దురాశలు పుట్టిoచిందని పౌలు విశదీకరిస్తున్నాడు.

     పలు రకాలైన, దురాశలు, పాపములు, దోషములు ఏమిటో ధర్మశాస్త్రము చూపిస్తుంది. శ్రోతలూ, గమనించండి, ధర్మశాస్త్రము హద్దులు, పరిమితులు, చూపిస్తుంది. ఎక్కడ మనము హద్దు దాటకూడదో నిర్దేశిస్తుంది, హద్దులు చూపుతుంది. ఏది తప్పో ఏది రైటో మధ్యలో గీత గీస్తుంది. కొన్ని సరియైన తలంపులు, క్రియలు, మరికొన్ని చెడు తలంపులు, క్రియలు ఉన్నవి. రెంటి మధ్యలో ధర్మశాస్త్రము గీతగీసి హద్దులు చూపిస్తుంది. నిజానికి, పాపమంటే ఏమిటో నిర్వచించి, ఏది దుష్తత్వమో, పాపమో, ఏది నీతిసహితమైనదో, సరియైనదో ధర్మశాస్త్రము నిర్వచిస్తుంది. కాబట్టి, ధర్మశాస్త్రము పాపమును ఎత్తి చూపిస్తూ, ఏది సరియైనదో, ఏది దోషమో తేటపరుస్తుంది.

     రెండవది, ధర్మశాస్త్రము పాపమును కనిపెట్టి వెలుపలికి తీస్తుంది. పాపపు కోరికలు, ఆశలు హృదయాల్లో రేకెత్తించి మేల్కొల్పడం ద్వారా ధర్మశాస్త్రము పాపమును కనిపెడుతుంది. ఫలానిది పాపము అని తెలిసినపుడు అదే చేయాలని హృదయం కోరుతుంది, అవునా, శ్రోతలూ? జాగ్రతగా వింటున్నారా?

9వ వచనము గమనించండి: ఒకప్పుడు నేను ధర్మశాస్త్రములేకుండ జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని.౹ ఆపో. పౌలు చెబుతున్నదేమిటంటే, నేను ఆజ్ఞను విన్నపుడు, ఆజ్ఞ దేనిని నిషేధించిందో అదే చేయాలనే దురాశ నాలో కలిగింది.’. ఇది మీ అనుభవం కూడానా?

     ఇంకా ముందుకు ఏమని చెబుతున్నాడు? పాపము తనను మోసపుచ్చింది. ధర్మశాస్త్రము ఆయనలోని,

అమాటకొస్తే, నీలోని, నాలోని, పాపమును వెలికి తీసి, దురాశలు పుట్టించి, చివరకు మోసపుచ్చింది. పాపము ఒక మోసము. అవును, ప్రియ సోదరీ, సోదరుడా! సైతాను ఉపయోగించే బలమైన ఆయుధం మోసం. వాడు మన తల్లి హవ్వతో అదే చేశాడు. దేవుడు ఏ చెట్టు పండు తిన్నపుడు మరణిస్తారని హెచ్చరించాడో, అదే పండు తింటే వారు “చావనే చావరు” అని మోసగించాడు.

     గమనించండి, శ్రోతలూ, పాపము మనలను మోసగించి, పాపమంటే ఏమిటో చూపించడమే కాకుండా, అది మరణమును తెస్తుంది. 10వ వచనములో ఆపో. పౌలు బోధ ఏమిటి? జీవమివ్వ గలిగిన ఆజ్ఞ మనకు మరణము కలిగిస్తుందని మోసపోతున్నాము. కాబట్టి, పాపమును కనిపెట్టిన ధర్మశాస్త్రము నామీద నీమీద మరణశాసనమును విధించింది.

     మూడవది, ధర్మశాస్త్రము పాపమును నిర్ధారణ చేస్తుంది. ఆపో.పౌలు అంటున్నదేమిటి? ధర్మశాస్త్రము పాపము కాదు. 12వ వచనము ప్రకారము  “ధర్మశాస్త్రము పరిశుధ్ధమైనది, ఆజ్ఞ కూడ పరిశుద్ధ మైనదియు నీతిగలదియు ఉత్తమమైనది”   ధర్మశాస్త్రములో ఏ తప్పు లేదు. మనము తప్పులో ఉన్నాము, ఎందుకనగా మనము ధర్మశాస్త్రమును ఉల్లంఘిస్తున్నాము. ధర్మశాస్త్రము ఏది తప్పు అని నిర్ధారణ చేస్తుందో దాన్నే మనము చేస్తున్నాము. 13వ వచనములో బలమైన వ్యత్యాసము బోధపడుతుంది. “ఉత్తమమైనది నాకు మరణకర మాయెనా? అట్లనరాదు.”  ధర్మశాస్త్రము పాపము యొక్క ఉద్దేశ్యమును నిర్ధారిస్తూఉండగా పాపము “అత్యధిక పాపము” గా మారింది. సమస్యను పరిష్కరించుకోవాలంటే, ముందు సమస్య ఏమిటో తెలుసుకోవాలికదా? ధర్మశాస్త్రము పాపమును నిర్దిష్టపరిచి మనoతట మనమే పాపము అనే సమస్త్యను పరిష్కరించుకోలేమని అది తెలుపుతున్నది.

  ఇంకా ముందుకు వెళ్దామా? 14వ వచనం. “ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను.” ఈ వ్యత్యాసమును గమనించండి. ఒకప్రక్కలో ధర్మశాస్త్రమున్నది. అది పరిశుధ్డమైనది, నీతిగలది, ఉత్తమమైనది. మరోవైపున మనమున్నాము. పాపపు స్వభావము, శరీర దౌర్బల్యాలు, బలహీనతలు, పాపమునకు అమ్మబడినవారము. మనకు పాపము నుండి విడుదల పొందే మార్గము ఉందా? ఆపో. పౌలు ఈ పరిస్థితిలో మన అవసరత చూపిస్తున్నాడు. ధర్మశాస్త్రములో  పరిశుధ్ధమైన దేవుని ఆజ్ఞలు ఉన్నవి. ధర్మశాస్త్రపు ఉద్దేశ్యము పాపమును నిర్ధారించడం. కాబట్టి, ఆయనతో తెగిపోయిన మన సంబంధాన్ని బాగు చేయడానికి, దేవుడు ధర్మశాస్త్రమును ఇవ్వడం అవసరమైంది.

    ధర్మశాస్త్రము పాపమును నిర్వచిస్తుంది. పాపమును కనిపెట్టి ఎత్తి చూపిస్తుంది, నిర్దిష్టపరుస్తుంది. వీటిని బట్టి మనము యేసు క్రీస్తును ఆశ్రయించి నమ్మి ఆశ్రయించి ఆయనద్వారా దేవుడు మనకోసం చేసిన ఏర్పాటును గ్రహించాలి. ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. ఆయన మనలో జీవించినపుడు తన పరిశుద్ధ ధర్మశాస్త్రపు నెరవేర్పును దేవుడు మనలో చూస్తాడు.

దేవుని మార్గములో నడుస్తావా? లేదా నీకు తోచిన మార్గములో నడుస్తావా??   

 

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...