- దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు పొందండి. మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్ లేదా
- వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి.
- Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com.
- Or send a message by Whats App to 98663 41841
రోమా పత్రిక అధ్యయనం 25 - 7:15-25
పాపముతో సంఘర్షణ
సంఘర్షణలు సహజమే, ఎక్కడైనా, ఎవరితోనైనా, ఏ విషయంలోనైనా జరుగుతూనే ఉంటాయి. పాపము, నీతి మధ్యలో ఉండే సంఘర్షణ దాదాపు అందరికీ తెలిసిందే! హృదయములో సరిగ్గా జీవించాలని కోరిక ఉంటుంది, అదే సమయoలో దోషము, అపరాధము చేయమని మరో స్వరం వినిపిస్తూనే ఉంటుంది. అటువైపులాగుతూనే ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు, ప్రతి ఒక్కరూ ఈ సంఘర్షణను అనుభవిస్తూ ఉంటారు. అపరాధము చేసి అ తరువాత బాధపడుతూ చింతించడం మనoనదరికీ పరిచయమే. అలాగే మంచి, నీతి చేసి దాన్నిబట్టి సంతోషించడం కూడా జరుగుతుంది. సరైనది చేయాలని ఎక్కువ ఆశ ఉన్నపుడు మనము ఎక్కువ కష్టమును అనుభవిస్తాము, ఎందుకనగా సంఘర్షణలో ఎవరిది పై చేయిగా ఉందో తెలుస్తుంది.
“నేను సరైనది చేయాలనుకున్నాను గదా, ఎందుకు దోషము చేస్తున్నాను?” అని నిన్ను నీవు ప్రశ్నించవచ్చు. పౌలు రోమీయులకు పత్రిక వ్రాసినపుడు పరిశుద్ధ్ద్ధాత్ముని చేత నడిపించబడి, పాపముతో సంఘర్షణ, పోరాటమును వివరించాడు. లేఖన భాగం రోమా 7:15-25.
ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను.౹ 16ఇచ్ఛయింపనిది నేను చేసినయెడల ధర్మశాస్త్రము శ్రేప్ఠమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను.౹ 17కావున ఇకను దానిచేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు.౹ 18నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు.౹ 19నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడుచేయుచున్నాను.౹ 20నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు.౹ 21కాబట్టి మేలుచేయగోరు నాకు కీడుచేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది.౹ 22 అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని౹ 23 వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపెట్టి లోబరచుకొనుచున్నది.౹ 24 అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?౹ 25 అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?౹ 25 మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను కాగా మనస్సు విషయములో నేను దైవనియమమునకును, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనై యున్నాను.”
“నేను రైట్ చేయాలనుకుని కూడా ఎందుకు అపరాధం చేస్తున్నాను” అనే ప్రశ్నకు పౌలు మాటలనుండి జవాబును వెతుకుదాము, రండి, బైబిల్ నోట్ బుక్ పెన్ తెచ్చుకొని, రేడియొకు దగ్గరగా వచ్చి ప్రశాంతంగా కూర్చోండి. పాపముతో మనకున్న ఈ సంఘర్షణను గూర్చి పౌలు ప్రావీణ్యపు పరిజ్ఞానమును బోధిస్తున్నాడు.
మొదటిది, పాపపు మూలాలు ఈ సంఘర్షణ యొక్క పరిజ్ఞానమునిస్తుంది. ఈ మూలాలు మన అంతరంగంలో ఉన్నవి. అవి మన స్వభావములో భాగమే! అది మన నైజం. మనము వాటితోనే పుట్టాం గనుక వాటిని మార్చడానికి మనకు శక్తిలేదు. యేసుక్రీస్తు ప్రభువు వద్దకు వచ్చినపుడే అవి మార్చబడతాయి.
ఆపో. నేను మంచిది చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను అని వాపోతున్నాడు. నేను అసహ్యించుకుంటున్నదే చేస్తున్నాను. దీన్నిబట్టి ధర్మశాస్త్రము నన్ను ఖండింస్తుంది కూడా. ధర్మశాస్త్రము మేలు, కీడు, మంచి, చెడు, పాపము పరిశుధ్ధత నాకు బోధిస్తుంది గనుక దాన్ని ఇష్ట పడుతున్నాను.
పాపపు మూలాలు మన స్వభావము, ఆత్మలో లోతుగా నాటుకొని ఉంటాయి. ఈ మూలాలు మన చిత్తశక్తిని సంకల్పమును ధిక్కరిస్తాయి. అయినా, తన శరీరస్వభావము చెప్పిందే తాను చేస్తున్నానని అంటున్నాడు. ఆయన అంటున్నదేమిటంటే చేయాలనే కోరిక ఉంది కానీ, అది నేను చేయలేక పోతున్నాను. తాను చేయాలనుకున్నది, చేయాలని కోరేది చేయాలంటే ఏం చేయాలి? 18వ వచనం రెండవ భాగం గమనించండి: “మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు.” పాపపు మూలాలు సంకల్పించేశక్తిపై దాడిచేసి నిర్వీర్యం చేస్తున్నాయి. ప్రియ స్నేహితుడా, సోదరీ, పాపపు మూలాలు తప్పించుకొనగలిగినవారు ఎవ్వరూలేరు. శ్రోతలూ, మీరు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా?
రెండవది, పాపపు ఫలితాలు ఈ సంఘర్షణ లోని పరిజ్ఞానమును కలిగిస్తాయి. పాపపు ఫలితాలoటే ఎవరికి ఇష్టముండదు. నేను చేయదలచుకున్నది చేయలేను. నేను చేయనిష్టపడనిది చేసినపుడు, నేను చేయొద్దనుకున్నది చేసినపుడు అది చేసింది నేనుకాదు గాని, నాలోనివసించే పాపమే! కీడు, పాపము, దుష్టత్వము చేయడమే జరుగుతున్నది. ఇది ఒక నియమం లేదా చట్టమని పౌలు భావన. కీడు, పాపము నాపైన ఆధిపత్యం వహిస్తుంది. నేను ఇష్టపడని క్రియలు, చర్యలు నేను చేస్తున్నట్టు గమనిస్తున్నాను. పాపపు ఫలితాలు మనకిష్టముండవు. అంతరంగ పురుషుడు దేవుని విషయాలను ఇష్టపడతాడు. 22వ వచనం గమనించండి. “అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను” సరిగ్గా నేను చేయాలనుకున్నది ఇదే! నా ఆశ కూడా ఇదే. కానీ, “వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్నధర్మశాస్త్రముతో పోరాడుచు”న్నదని పౌలు గమనించాడు. ఇక్కడ శరీరపుస్వభావము ఆత్మతో చేస్తున్న సంఘర్షణ, శరీరస్వభావము మనసుతో చేస్తున్న సంఘర్షణ కనిపిస్తున్నది. నేను చేయాలని ఇష్టపడినది, నేను చేయాలని కోరేది నా అవయములలో ఉన్న నియమము చేత జయింపబడ్డాయి. “అది నన్ను లోపరచుకొనుచున్నది.” ఆపో. పాపముచేత బంధించబడ్డానని వాపోతున్నాడు. పాపము యొక్క వేదనభరితమైన ఫలితమిది.
ప్రియ శ్రోతలారా, పాపపు ఫలితములను ఎవ్వరూ తప్పించుకోలేరు. నారు నాటి పైరు కోసినంత ఖచ్చితంగా ఈ ఫలితాలు వస్తాయి. పాపపు మూలాలనుండి పాపపు ఫలితాలు కలుగుతాయి, తప్పని సరిగా కలుగుతాయియి. ఇది మన సంఘర్షణలో భాగం. కానీ విడుదలకు గొప్ప అవకాశముంది. ఇదే ఆఖరి మాటకాదు. హల్లెలుయః, దేవునికి స్తోత్రం!!
మూడవది, ఈ సంఘర్షణ నుండి విడిపించబడడానికి కావాల్సిన పరిజ్ఞానం పాపమునుండి విడిపించ బడడమే! ఆపో. ఎంతో క్రుంగిపోయినట్టు గమనిస్తున్నాము. 24వ వచనములో ఆయన ప్రశ్న గమనించండి: “అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?”” “దౌర్భాగ్యుడు” అంటే దిక్కుమాలినవాడని, దరిదృడని అర్ధం. ఇంతటి ఘోర పరిస్థితిలో చిక్కుకున్న నాకు ఎలా కలుగుతుంది విడుదల? ఎవరు నన్ను రక్షిస్తారు? ‘విడిపించుట’ అనే మాటకు, మునిగిపోతున్నవాణ్ణి కాపాడడం, లేదా ఒక కారు ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తిని రక్షించడము, లేదా ఒక క్రూర జంతువు నోటఉన్న మనిషిని రక్షించడం అని అర్ధం. ఎవరు నన్ను విడిపించగలరు? ఎవరు నాకు స్వేచ్చనివ్వగలరు? నాకు నేను సహాయం చేసుకోలేని స్థితిలో ఉన్నాను అనే వేదన కనిపిస్తున్నది.
కానీ, శ్రోతలూ, సంతోషకరమైన విడుదల ఉన్నది. 25వ వవచనం ఏమంటుంది? “మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను” ప్రియ సోదరీ, సోదారుడా, విడిపించగలవారు ఒక్కరే! పాపము నుండి రక్షించ గలవారు ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కరే! అవును, ఆయన చేయగలరు. ఆయన విడిపించగల శక్తిమంతుడు. ఆయన శరీరధారిగా వచ్చాడు, ఆయన పాపము లేని అతి పరిశుద్ధ జీవితం జీవించాడు. అందుచేత ఘోరమైన, దిక్కుమాలిన దౌర్భాగ్యమైన స్థితినుండి రక్షించగలడు. మన ప్రభువైన యేసుక్రీస్తుద్వార, దేవునికి మహిమ కలుగుగాక! “మనస్సు విషయములో నేను దైవనియమమునకును, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనై యున్నాను.” శరీరము పాపముచేయడానికి ప్రేరేణ నిస్తున్నప్పటికీ, యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఉన్న శక్తి, విజయము నివ్వగలదు.
ఇంకెన్నాళ్ళు ఈ సంఘర్షణలో పాపపు ఫలితములకు బానిసగా ఉంటావు? ఇంతవరకు కలిగిన నష్టము, బాధ, వేదన, అవమానము, అపజయము చాలు! యేసు రక్తములోని పరిశ్దుద్ధతను ఆయన నామములోని శక్తిని ఆశ్రయించి, విజయమునుండి విజయమునకు నిన్ను నడిపించడానికి శక్తిమంతుడు ఆయనే!
No comments:
Post a Comment