- దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు పొందండి. మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్ లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి.
- Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com.
- Or send a message by WhatsApp to 98663 41841
రోమా పత్రిక అధ్యయనం -14
అబ్రహాము విశ్వాసపుటడుగులలో......
జీవితం అతిభారంగా సాగుతుందా? ఎంతో విసుగు, విరక్తి చెందుతూ ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదు అని
ఆలోచిస్తున్నారా? అది దేవుడు మెచ్చేది కాదు. దేవుడు
అందుకు నిన్ను
సృష్టించలేదు. వీటన్నిటికంటే శ్రేష్ఠమైన
మార్గముంది. సత్యవంతుడైన దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో హద్దులు లేని ప్రేమతో
ప్రేమిస్తున్నాడు. ఆయనే యేసు క్రీస్తు. ఆయన మాటలు విందాం, రండి. రేడియొకు దగ్గరగా వచ్చి ప్రశాంతంగా
కూర్చోండి. మీ ఇంట్లో బైబిల్ ఉన్నట్లయితే, తీసుకొని, ఒక నోట్ బుక్, పెన్ కూడా తెచ్చుకోండి.
ఎవరైనా ముందు నడుస్తుంటే,
వారి వెనకాలే నడవడం మoచిందనిపిస్తుంది. విశ్వాసజీవితంలో మనకు
ముందు నడిచిన అబ్రహామును చూచి, ఆయన అడుగుజాడలేమిటో తెలుసుకుందాం.
ఈనాటి మన అంశం: అబ్రహాము
విశ్వాసపుటడుగులలో....
రోమా
పత్రిక 4:6-12లో ఆపో. పౌలు అబ్రహాము విశ్వాసపుటడుగులలో నడవడాన్ని గురించి
వ్రాశాడు. దేవుని పరిశుద్ధ లేఖనం గమనించండి: రోమా. 4:6-12
6. ఆ ప్రకారమే క్రియలు
లేకుండ దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదుకూడ
చెప్పుచున్నాడు.
7. ఏలాగనగా తన అతిక్రమములకు
పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.
8. ప్రభువు చేత నిర్దోషియని
ఎంచబడినవాడు ధన్యుడు,
9. ఈ ధన్యవచనము
సున్నతిగలవారినిగూర్చి చెప్పబడినదా సున్నతిలేనివారినిగూర్చికూడ చెప్పబడినదా? అబ్రాహాము యొక్క విశ్వాసమతనికి నీతి అని యెంచబడెననుచున్నాము గదా?
10. మంచిది; అది ఏ స్థితి యందుఎంచ బడెను? సున్నతి కలిగి యుండినప్పుడా సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగియుండినప్పుడు
కాదు, సున్నతి లేనప్పుడే.
11. మరియు సున్నతి
లేనివారైనను, నమ్మినవారికందరికి అతడు
తండ్రి యగుటవలన వారికి నీతి
ఆరోపించుటకై, అతడు సున్నతి పొందకమునుపు, తనకు కలిగిన
విశ్వాసమువలననైన నీతికి ముద్రగా, సున్నతి అను గురుతు పొందెను.
12. మరియు సున్నతి గలవారికిని తండ్రియగుటకు, అనగా సున్నతిమాత్రము పొందినవారు గాక, మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసముయొక్క
అడుగుజాడలనుబట్టి నడుచుకొనినవారికి తండ్రి అగుటకు, అతడు ఆ గురుతు పొందెను.
అబ్రహాము విశ్వాసపుటడుగులలో మనము కూడా నడవడానికి కొన్ని విషయాలను జాగ్రతగా పరిశీలించాలి.
మొదటిది, ప్రతి
ఒక్కరికీ విశ్వాసముతో నడవాలని ఆశ ఉంటుంది.
దావీదు వివరించిన నీతిమంతత్వము పొందాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. క్రియలను బట్టి
కాకుండా ఎవరికి దేవుడు నీతిని ఆపాదించి నీతిమంతునిగా తీరుస్తాడో ఆ ధన్యత్వము దావీదుకు
తెలుసు. అందరూ ఆశించే నీతిమంతత్వము దేవుడు మాత్రమే చేయగలిగినది.
క్రియలనుబట్టి
కాకుండా నీతిని ఆపాదించడానికి దేవుని దగ్గర మార్గముంది. కీర్తన 32:1లో
దావీదు పలికిన మాటలను ఆపో. పౌలు ఇక్కడ ఉటంకిస్తున్నాడు. అవేమిటంటే, “తన అతిక్రమములకు
పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు......ధన్యుడు.” నీతిమంతులు
కావాలని కోరుకొనేవారు క్షమాపణ కోరుతారు. క్షమాపణ కోరుకునేవారందరికీ అది
అవసరం.
దేవుని
యెదుట మనమందరము క్షమాపణ పొందవలసినవారమని మనము గ్రహించాలి. నీతిమంతులుగా తీర్చడం
ఆయన చేసే క్రియ. ప్రతి ఒక్కరి హృదయపు అంతరంగంలో దేవునితో సరియైన సంబంధం
కలిగిఉండాలనే ఆశ ఉంటుంది. స్వంతగా చేసే ఏ ప్రయత్నముకూడా ఈ ఆశను నెరవేర్చదు. దేవునితో
తెగిపోయిన సంబంధమును బాగు చేయడానికి సరిపోయినంత నీతిమంతత్వము మీకు కానీ, మరెవరికైనా లేదు. క్షమాపణ దేవుని క్రియ. ప్రతి
హృదయంలో క్షమాపణ పొందే ఆశ ఉంటుంది. ఆ కోరికే మనలను అబ్రహాము విశ్వాసపుటడుగులలో
నడిచేలా చేస్తుంది.
రెండవది,
విశ్వాసపుటడుగులలో నడవడానికిగల సందిగ్ధత అందరిలో ఉంది. జీవితపు మార్గములో
నిర్ణయాలు తెసుకోవలసిన సమయాలు ఉన్నవి. ఏ విధంగా పాపమునుండి విముక్తి, విమోచన పొందగలమనేది అందరి ఆలోచనల్లో ఉంది. ఆపో. 9వ
వచనంలో ఒక ప్రశ్న లేవదీస్తున్నాడు: “ఈ ధన్యవచనము సున్నతిగలవారినిగూర్చి
చెప్పబడినదా సున్నతిలేనివారినిగూర్చికూడ చెప్ప బడినదా?” సున్నతి యూదులను సూచిస్తున్నది. సున్నతి
లేనివారు అంటే యూదులు కానివారు అందరరూ, నీవు, నేను. ఏ స్వంత ప్రయత్నాలు పాపమును
కడిగివేయవు, దేవునితో తెగిపోయిన సంబంధాన్నితిరిగి కలపలేవు. మనకు పాపమునుండి విమోచన పొందే మార్గము తెలియదు కాబట్టి మనము నిర్ణయం తీసుకోవలసిన
స్థానములో ఉన్నాము. మనకు వివేచన అవసరం. ఎటు వెళ్లాలో అనే ఈ ప్రశ్నను
ఎదుర్కోవడానికి మనకు దేవుని సహాయం అవసరం. ఇది సందిగ్ధావస్థ. ఏమి చేయాలి? ఎలా చేయాలి??
ఆపో. 9వ
వచనం చివరలో దీనికి సమాధానం చెబుతున్నాడు. “అబ్రాహాము యొక్క విశ్వాసమతనికి నీతి
అని యెంచబడెననుచున్నాము గదా?” విశ్వాసము వల్లనే నీతి కలుగుతుంది. అబ్రహామునకు నీతి లేదు.
అబ్రహాము దేవునిలో విశ్వాసము ఉంచినపుడు దేవుడు ఆ విశ్వాసమును నీతిగా ఎంచాడు.
అబ్రహాము తన క్రియలచేత పొందలేని నీతి,
పరిశుద్ధత, పాపక్షమాపణ విశ్వాసము ద్వారా పొందాడు. అబ్రహాము నీతిమంతత్వము
యొక్క బాధ్యత అంతా విశ్వాసము మీదే ఉంచాడు.
ఈ సందిగ్ధత
అందరూ ఎదుర్కుంటారు. ఏమి చేయాలి? నీతిమంతత్వము, పాపక్షమాపణ ఎలా పొందాలి? అనే ప్రశ్నలు అందరికీ
వస్తూఉంటాయి. ప్రస్తుతం నీవు అదే ప్రశ్నతో సతమవుతూ ఉన్నావేమో! అబ్రహాము మనకు
నేర్పిస్తున్నాడు. ఎవ్వరూ వంటరిగా, ఎవరి సహాయము లేకుండా ఈ
సందిగ్ధతకు సమాధానం కనుక్కోలేరు గనుక మనము క్షుణ్ణంగా పరిశీలించాలి.
నా స్నేహితుడా, సోదరీ, ఎవ్వరూ తనంతట తానే నీతిని సంపాదించుకోలేరు. అది దేవుని ద్వారానే సాధ్యం. ఆయన ఏర్పరచిన రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా, నీ పాపమoతటికీ ప్రాయశ్చిత్తం చేయబడింది. అది పరిహరించబడుతుంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మినట్టు మనము కూడా విశ్వాసమును అభ్యసిస్తే, అప్పుడు ఈ సందిగ్ధతనుండి మనము బయటపడవచ్చు. ఎందుకంటే దేవుడు మన పక్షాన తన క్రియ చేస్తాడు.
మూడవది, ప్రతి ఒక్కరూ విశ్వాసము వలన జీవించవలసిన ఆజ్ఞ
ఉన్నది. అబ్రహాం గురించి ఏమని చెప్పబడిందంటే, “అతడు సున్నతి
పొందకమునుపు, తనకు
కలిగిన విశ్వాసమువలననైన నీతికి ముద్రగా, సున్నతి అను గురుతు పొందెను.” హృదయపు అంతరంగంలోని అనుభవానికి బయటికి కనిపించే గుర్తే సున్నతి. తన
విశ్వాసమునకు దేవుడు ముద్ర వేయడానికి అబ్రహాము ఏమి చేయాలో దేవుడు ఆయనకు బోధించి, చూపించి, ఆజ్ఞాపించాడు. అంతరంగములోని
విశ్వాసమే ఆ ముద్ర.
అప్పుడు అబ్రహాము విశ్వసించే వారందరికి
తండ్రి అయ్యాడు. “సున్నతిలేని వారైనను,…వారికి నీతి ఆరోపించుటకై”, అనే మాటలు 11వచనములో గమనించండి.
విశ్వాసము వలన నీతి ఆరోపించబడడం ప్రపంచమంతటికి చెందినది. వ్యక్తిగతమైనదే కాదు, సార్వత్రికమైనది కూడా. నమ్మేవారందరూ, అనగా మనలో నమ్మే వారందరూ పొందవచ్చు. అబ్రహాము తనవిశ్వాసము వలన పొందిన ఈ
నీతిని, నీవు కూడా విశ్వసిస్తే పొందగలవు. యూదుడైన, యూదుడుకానివాడైనా, ఇది భూమిమీద ఉన్నవారందరికీ కానుక.
అంచేత యూదుడైన, యూదుడుకానివాడైనా, అంతా
ఒక్కటే! “సున్నతిలేని వారైనను, నమ్మినవారికందరికి
అతడు తండ్రి యగుటవలన వారికి నీతి ఆరోపించుటకై,” అనే
మాటలను గమనించారా? ఇప్పుడు 12వ వచనం గమనిద్దాం. “మరియు
సున్నతిగలవారికిని తండ్రియగుటకు, అనగా
సున్నతిమాత్రము పొందినవారుగాక, మన తండ్రియైన అబ్రాహాము
సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసముయొక్క అడుగు జాడలనుబట్టి
నడుచుకొనినవారికి తండ్రి అగుటకు....” అని రాయబడిoది.
సూచనలు పాటిస్తే ఎవరైనా అబ్రహాము అడుగుజాడలలో నడవవచ్చు. కానీ, దానికి దేవుడు అవసరం. ఆయన నీ పక్షంగా క్రియ
చేయాలి.
అబ్రహామును ఆయన విశ్వాసపుటడుగులు ఎక్కడికి
నడిపించాయో, ఆ అడుగులలో మనము నడిస్తే, అక్కడికి మనలను కూడా నడిపిస్తాయి. నీతి పొందడానికి,
లేదా పాప క్షమాపణ పొందడానికి మార్గం విశ్వాసము. కాబట్టి,
వీటి విషయం ఆలోచంచండి. దేవునితో మంచి సంబంధం కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
ప్రతి ఒక్కరికీ ఉన్న సందిగ్ధత ఏమిటంటే, దానికోసం ఏమి చేయాలి? ప్రతి ఒక్కరి కర్తవ్యం ఏమిటంటే, విశ్వాసము ద్వారా
నీతి లేదా పాపక్షమాపణ పొందవచ్చు. ఇప్పుడే నీవు అబ్రహాము విశ్వాసపుటడుగులలో నడవవచ్చు.
అప్పుడు నీవు దేవునితో మంచి వ్యక్తిగత సంబంధం పొందగలవు. అట్టి విశ్వాసం
విశ్వాసమునకు కర్తమాత్రమే కాదు, దానిని కొనసాగించగల
శక్తిమంతుడు ప్రభుయేసు మనకందరికీ అనుగ్రహించు గాక!
ప్రార్ధన: విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించే శక్తి గలిగిన యేసు ప్రభువా, మమ్మును కరుణించండి. మీ అమూల్యమైన వరము విశ్వాసము. అది మా శ్రోతలకు, విశ్వాసము కావాలని బలమైన నిజమైన ఆశ కలిగిన ప్రతి ఒక్కరికీ అనుగ్రహించండి. అంత్య దినము వరకు విశ్వాసమును కాపాడుకోవడానికి అనుదినము సహాయము చేయండి, బలహీనమైన విశ్వాసము కలిగినవారిని బలపరచుటకు కృప నివ్వండి. కష్టములలో, శోధనలలో, వేదనలలో, బాధలలో, శ్రమలలో హింసలు అనుభవిస్తున్న వారి విశ్వాసము పోగొట్టుకోకుండా దయ చూపుమని క్రీస్తు ప్రభువు నామములో వేడుకుంటున్నాము తండ్రీ, అమెన్!
మేము మీ కోసం ప్రార్ధించాలని కోరుతున్నారా? అనగా మీరు ప్రార్ధించకుండా ఉంటే, మేము మీకోసం ప్రార్ధిస్తామని చెప్పడము లేదు. మీరు మీ కోసం ప్రార్ధిస్తున్నట్లయితే, మీతో బాటు, మీ కోసం మేము కూడా ప్రార్ధిస్తామని చెబుతున్నాను. అలాగే మీరు మా కోసం ప్రార్ధించాలని మనవి చేస్తూ ఉన్నాను. మీ ప్రార్ధన మనవులు పంచుకోవడానికి సంకోచించకండి. ఒక వేళ మీరు ప్రార్ధన చేయడం తెలియని వారైతే, మీరు ప్రభువుతో సంబంధం సరిచేసుకోవడం అత్యవసరం. దాని కోసం మేము ప్రార్ధించగలము. ఫోన్ నంబర్, ఏ-మెయిల్ అడ్రెస్ పైన ఇవ్వబడినవి. ------ప్రభువు పాద దాసుడు పాస్టర్ విజయ్ భాస్కర్
No comments:
Post a Comment