- దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు పొందండి. మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్ లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి.
- Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com.
- Or send a message WhatsApp to 8143178111
తప్పించుకోవడం అసాధ్యం (రోమా 2:1-11)
నేరస్తులు, దుండగులు తప్పించుకోలేనంత మంచి భద్రత కలిగిన జైళ్లను ప్రపంచంలోని ప్రతి
ప్రభుత్వం ఏర్పాటు బహుశ చేస్తుండవచ్చు. అలాంటి వ్యక్తులు ఏ మాత్రం తప్పించుకోనంత జాగ్రత్తలు చేస్తుంటారు.
అప్పుడప్పుడు వారిలో కొందరు క్రూరమైన నేరస్థులు తప్పించుకోవడానికి ప్రయత్నం
చేస్తారు, కొందరు తప్పించుకుంటారు కూడా!
ప్రపంచంలోని వేరు వేరు పట్టణాలలో కొన్ని
రోడ్లమీద ఒకవైపే ప్రయాణం చేయవలసిఉంటుంది. వాటిని వన్-వే -ట్రాఫిక్ అంటారు. ఆ రోడ్డు
మీద ఒకవైపు మాత్రమే ప్రయాణం చేయవచ్చు. రోడ్డు చివరివరకు వెళ్ళిన తరువాత అదే రోడ్డు
మీద వెనుకకు రావడానికి అనుమతి లేదు. వన్ వే రోడ్లపైన ఒకవైపే వెళ్ళవలసి ఉంటుంది.
జీవితo దాదాపు సంపూర్ణ భద్రత కలిగిన జైల్ లాంటిది, ఎందుకంటే జీవించక తప్పదు. జీవితo వన్ వే రోడ్డు లాంటిది, ఎందుకంటే గతించిన సమయం తిరిగిరాదు. వన్ వే రోడ్లు ఒకవైపే ప్రయాణం చేస్తాయి. జీవితంలో కొన్ని అంశాలను, భాగాలను మార్చలేము. ఒక్కటే ఫలితము ఉంటుంది. దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేశాడు. దేవుని ఆజ్ఞలు, చట్టములు ఖచ్చితమైనవి, భద్రపరచబడినవి, కాబట్టి మనము వాటిని అర్ధం చేసుకొని దేవుని తీర్పును, మనము తప్పించుకోలేమని అర్ధం చేసుకోవడం చాలా అవసరం.
పౌలు గారు పరిశుద్ధాత్మ నడిపింపు చేత రోమీయులకు దేవుని తీర్పు విషయం వ్రాసినపుడు,
ఆయన దేవుని తీర్పు తప్పించుకోవడం అసాధ్యం అనే విషయమును
స్పష్టపరిచాడు. లేఖన భాగము రోమా. 2:1-11 లో ఈ విషయం మీరు కనుగొంటారు.
1.
కాబట్టి తీర్పు తీర్చు
మనుష్యుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై
యున్నావు. దేనివిషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే
నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు; ఏలయనగా తీర్పు
తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? 2.
అట్టి కార్యములు చేయువారిమీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని
యెరుగుదుము. 3. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు
వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? 4. లేదా, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక,
ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా? 5. నీ కాఠిన్యమును, మార్పు
పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను
సమకూర్చు కొనుచున్నావు. 6. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల
చొప్పున ప్రతిఫలమిచ్చును. 7. సత్ క్రియను ఓపికగా చేయుచు,
మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును. 8. అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక
దుర్నీతికి లోబడువారిమీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. 9. దుష్క్యార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట
యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, శ్రమయు వేదనయు కలుగును. 10.
సత్ క్రియచేయు ప్రతివానికి, మొదట యూదునికి
గ్రీసుదేశస్థునికికూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. 11.
దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసినవారందరు
ధర్మశాస్త్రము లేకయే నశించెదరు; 12. ధర్మశాస్త్రము
కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు.
దేవుని తీర్పును తప్పించుకోవడం అసాధ్యమని చెప్పడానికి
ఉన్న మార్పులేని కారణాలు ఈ లేఖన భాగములో ఉన్నవి:
దేవుని తీర్పు తప్పించుకోవడం అసాధ్యం ఎందుకనగా దేవుని తీర్పు తప్పక కలుగుతుంది. తీర్పు తీర్చడం దేవుని స్వభావము. దేవుడు సత్యవంతుడు గనుక ఆయన తీర్పు కూడా సత్యం ప్రకారమే జరుగుతుంది. వ్యక్తిగతమైన సాకులు చెప్పి తప్పించుకోలేమని అపొస్తలుడు వ్రాస్తున్నాడు. ఎందుకనగా మనము ఇతరులకు తీర్పు తీర్చేటప్పుడు మనము కూడా అదే పాపములో ఉన్నాము. మనము ఒక విషయంలో దోషులమైయుండి ఇతరుకు అదే విషయములో తీర్పుతీర్చినపుడు, మనము మనమీదనే దోషారోపణ చేసుకుంటునట్టే అవుతుంది. ఎందుకనగా మనము అదే పాపము విషయము దోషులముగా ఉన్నాము గదా!
ఇంకా తప్పించుకోలేనిది ఏమిటనగా దేవుని తీర్పు తప్పనిసరిగా జరుగుతుంది, నిత్యం నిలుస్తుంది. దేవునితీర్పు సత్యమైనదని నేను చెప్పాను. ఆయన సత్యం ఖచ్ఛితమైనది, మనమందరం ఆయన సత్యము క్రిందికి రావలసిఉంటుంది. 2వ వచనమును పరీక్షించండి. “అట్టి కార్యములు చేయువారిమీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని యెరుగుదుము.” తప్పించుకోలేము.
3వ వచనం ప్రకారం తప్పించుకోవడం అసాధ్యం. ఎందుకనగా ఎవరైనా ఒకవిషయం గురించి ఇతరులకు తీర్పుతీరుస్తూ దాని విషయములో వారే దోషులైనపుడు దేవుని న్యాయతీర్పును తప్పించుకోలేరు. కాబట్టి దేవుని న్యాయతీర్పు సత్యమని, సరియైనదని తెలుసుకున్నాము గనుక దేవుని న్యాయతీర్పు తప్పించుకోవడం అసాధ్యం. మీరిది తప్పనిసరిగా అర్ధంచేసుకోవాలని నేను కోరుతున్నాను. దేవుని న్యాయతీర్పు తప్పనిసరి, ఖచ్చితం, తప్పించుకోలేనిది. నీవు కూడా దేవుని న్యాయతీర్పు తప్పించుకోలేవు.
దేవుని న్యాయతీర్పు నీతిగలిగినది గనుక తప్పించుకోవడం అసాధ్యం. వ్యక్తిగతంగా
ఎవరికి వారు పరీక్షించుకుంటే సరిపోదు. దేవుడు మంచివాడు, కృపకలిగినవాడు. కానీ
దేవుడు తన మనసు మార్చుకోడు. 4వ వచనం ప్రకారం “ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా?” దేవుడు ఊరుకోడు, మనసు మార్చుకోడు. నీవు దేవునితో
ఆడుకోలేవు. నీవు దేవుని నుండి ముఖము తిప్పుకొని నీవు ఆయన న్యాయతీర్పు తప్పించుకోలేవు.
కానీ ఆయన మంచితనము మనలను పాశ్చాత్తాపమనకు నడిపిస్తుంది. దేవుడు కృపామయుడు
కాకపోయినట్లయితే, కరుణగలవాడు కాకపోయినట్లయితే, ఎప్పుడో మానవజాతిని
హతమార్చి ఉండేవాడు. తన తీర్పునుబట్టి ఎప్పుడో నశింపచేసిఉండేవాడు. కానీ దేవుడు
కృపగలవాడు గనుక ఆయన మంచివాడు గనుక సహనశీలి, దీర్ఘశాంతుడు గనుక ఆయన ఇంకా ఎదురు చూస్తున్నాడు. ప్రతి
ఒక్కరూ మారుమనస్సు పొందే వరకు తన తీర్పును ఆపుతున్నాడు.
కానీ 5వ వచనములో చెప్పినట్టు “దేవుని న్యాయమైన
తీర్పు బయలుపరచబడు దిన”ము తప్పక వస్తుంది. నా స్నేహితుడా, సోదరీ, ఆ దినము దేవుని
న్యాయ తీర్పును బయలు పరుస్తుంది. దేవుని న్యాయతీర్పు నీతిసహితమైనది. సమస్తమైన
దుష్టత్వమునకు ఆయన తీర్పు తీర్చనున్నాడు.
ఎవరి క్రియల ప్రకారం వారికి తీర్పు తీర్చుతాడు. దేవుడు నీతిమంతుడు గనుక ఆయన
తీర్పు తీర్చగలడు, తీర్పు తీర్చుతాడు.
కాబట్టి తప్పించుకోవడం అసాధ్యం. దేవుని న్యాయతీర్పు
నీతిమంతత్వం గలది, న్యాయం ప్రకారం చేసేదే, గనుక తప్పించుకోవడం అసాధ్యం. మళ్ళీ చెబుతున్నాను, దేవుని న్యాయతీర్పు నీతి
ప్రకారం జరిగేది గనుక తప్పించుకోవడం అసాధ్యం.
దేవుని తీర్పులో
పక్షపాతము లేదు గనుక తప్పించుకోవడం అసాధ్యం. దీని అర్ధం ఏమిటి అనగా దేవుడు
ఒకరి స్థాయి లేదా అంతస్థును గాని, లేదా మంచి క్రియలు చేసినందువలన గాని పక్షపాతం
చూపడు. ఎవరికి ఆయన కృప చూపుతాడో 7 వ
వచనంలో వ్రాయబడిఉంది. “సత్ క్రియను ఓపికగా చేయుచు,
మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును.” మార్పు
చెందిన జీవితం కలిగిన ప్రతి ఒక్కరినీ
దేవుడు ఘనపరచి వారికి అమరత్వమును, నిత్య జీవమును అనుగ్రహిస్తాడు.
6వ వచనములో ప్రతి ఒక్కరికీ దేవుడు వారి క్రియలనుబట్టి ప్రతిఫలం ఇస్తాడని ప్రకటించబడుతూ ఉంది. వ్యక్తిగత పాపము, దుష్టత్వమైనా, లేదా వ్యక్తిగత మారుమనసు అయినా, దానిని లెక్కలోకి తీసుకుంటాడు. ఎవరైతే కలహ ప్రియులుగా ఉంటారో, అనగా దేవుని సత్యమునకు విధేయత చూపకుండా, ఆక్రమము, దుష్టత్వములో జీవిస్తారో వారికి ఉగ్రత, కోపము, శ్రమలు వేదన దేవునినుండి ఇవ్వబడతాయి. ఎవ్వరికీ మినహాయింపు లేదు, ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎవ్వరూ బయట ఉండరు. ఇందులో ఏమాత్రం పక్షపాతము ఉండదు. యూదుడయినా, యూదుడు కానీ వారైనా, ప్రతి ఒక్కరికీ ఇందులో భాగము ఉంటుంది. “సత్ క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును.” అపవిత్రoగా , అన్యాయంగా జీవించే ప్రతి ఒక్కరికీ ఉగ్రత, వేదన విధించబడుతుంది.
దేవుని తీర్పు పక్షపాతము లేనిది. ఆయన మనుషుల ముఖములను బట్టి తీర్పుతీర్చడు. అనగా దేవుడు ఎవ్వరినైనా ముఖము చూచి లెక్కచేయడని దాని అర్ధమని నేను భావిస్తున్నాను. అవును, ఎందుకనగా దేవుడు బయటికి కనిపించేదాన్ని చూడడు. దేవుడు హృదయమును చూస్తాడు. అందుకే పక్షపాతము లేనివాడు. దేవుని తీర్పులు పక్షపాతము లేనివి. ఎవ్వరూ కూడా దేవుని దగ్గర 'నీవు నా విషయం అనుకున్నది, తెలుసుకున్నది నిజము కాదు,' అని చెప్పలేరు. దేవుని తీర్పు పక్షపాతము లేనిది గనుక తప్పించుకోవడం అసాధ్యం.
ప్రతిఒక్కరూ దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతారు. దేవుని న్యాయతీర్పునుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. కారణాలు స్పష్టంగా ఉన్నవి: ఆయన తీర్పులు సత్యం, ఖచ్చితం. ఆయన తీర్పులు నీతిగలిగినవి, ఆయన తీర్పులు పక్షపాతము లేనివి.
దీనికి పరిష్కారం, మిత్రమా, యేసు క్రీస్తువైపు నీవు మళ్లుకొని మారు మనసు పొందడడం ద్వారా పొందగలవు. అప్పుడు నీవు తీర్పు గురించి భయపడే అవసరం ఉండదు. నీవు దేవుడు ఉన్నాడని నమ్మి, గ్రహించి, ఆయన నీ సమస్యలను పరిష్కరించ గలడని గ్రహిస్తున్నావా? అట్టి కృప ప్రభువు నీకనుగ్రహించు గాక!
No comments:
Post a Comment