ఈస్టర్ సందేశము - 17-03-2022

 

ఈస్టర్ సందేశము - 17-03-2022 

       ప్రియ శ్రోతలందరికీ ఈస్టర్ శుభములు! పండుగ సంతోషంగా చేసుకున్నారా? కొన్ని కుటుంబాల్లో, కొందరి 
 
జీవితాల్లో దుఖం, వేదన, బాధ, అలుముకొని ఉండవచ్చు. మీ గురించి ఎక్కువ భారము ఉన్నది. మేము 
 
ప్రార్ధించినప్పుడల్లా, మీ కోసమే ఎక్కువ ప్రార్థిస్తున్నాము. మీ గురించి మాకెలా తెలుసు అనుకుంటున్నారా? జీవితపు 
 
అనుభవము, నాలుగు దశబ్ధాల పరిచర్య నేర్పిన పాఠాలివి. మీ దుఖం, ప్రార్థన మనవులు, మాతో పంచుకుంటే, తప్పక 
 
మీ కోసం ప్రార్థిస్తాము. 
 
       యేసు క్రీస్తు ప్రభువు మరణము గురించి బోధించే సందర్భాల్లో ఎక్కువ మార్లు అదే చోట ప్రభువు పునరుధ్ధానము 
 
గూర్చి బోధించడం గమనార్హం. ప్రభువు మరణించి అలాగే సమాధిలో లేడని, ఆయన సజీవుడుగా లేచి ఆయనకు 
 
అత్యంత ఆప్తులైన శిష్యులకు, ఒకేసారి 500 మందికి కంపించారని దేవుని వాక్యం తేటగా బోధిస్తున్నది. “లేఖనముల 
 
ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము 
 
మూడవదినమున లేపబడెను. ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను. అటుపిమ్మట ఐదు 
 
వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్కసమయమందే కనబడెను.” చరిత్రలో చాలామంది యేసు క్రీస్తు ప్రభువు 
 
పునరుధ్ధానమును నమ్మకుండా అది అసత్యమని నిరూపించే ప్రయత్నం చేశారు. వారిలో అనే పేరు గాంచిన వాడు లీ 
 
స్ట్రోబెల్. ‘చికాగో ట్రిబ్యునల్’ న్యూస్ పేపర్లో విలేఖరి, చట్టమును క్షుణ్ణంగా అధ్యయనం చేసిన నాస్తికుడు లీ స్ట్రాబెల్. ఒక 
 
జర్నలిస్ట్ గా ఎన్నో విషయాలను సంఘటనలు విమర్శనాత్మకంగా పరిశీలించి, పరిశోధించిన స్ట్రాబెల్ కొద్ది రోజుల్లోనే 
 
యేసు ప్రభువు సజీవుడుగా లేవలేదు తేల్చేస్తానని అనుకుని ఆరంభించిన పరిశోధన ఏ విధంగా ముగిసిందో తెలుసా, 
 
శ్రోతలూ? దాదాపు 21 నెలలు బైబిల్ గ్రంధమంతటినీ పరిశోధించిన తరువాత తేలిన ఫలితార్ధం: యేసు క్రీస్తు ప్రభువు 
 
తప్పనిసరిగా సజీవుడుగా తిరిగిలేచాడని రుజువులతో సహా అతడే చూపించి, హృదయపూర్వకంగా నమ్మి, ఆ 
 
తరువాత ఆయన తన పరిశోధన అంతటినీ ఒక పుస్తకంగా ముద్రించాడు. దానిగూర్చి ‘న్యూ యార్క్ టైమ్స్’ లో 
 
ప్రస్తావించబడింది. ఆయన ఇప్పటికీ బ్రతికి ఉన్నాడు. ఒక పాస్టర్ గా ఇంకా అనేకరీతులుగా ప్రభువు సేవకుడుగా 
 
పరిచర్య చేస్తున్నాడు. హల్లెలూయ! యేసుక్రీస్తు ప్రభువు పునరుధ్ధానo ఇప్పటికే నిరూపించబడ్డ సత్యం. మన 
 
విశ్వాసమునకు లోకములో ఏ విశ్వాసమునకు లేని గొప్పదనమును, ఔన్నత్యమును సమకూర్చి, నిరాశలో 
 
కూరుకుపోయిన వారికి సహితం నిరీక్షణను ఆశను క్రీస్తు పునరుధ్ధానo అనుగ్రహిస్తుంది. వారే దైవమని చెప్పుకున్న 
 
వారు, వేలాదిమంది శిష్యులు కలిగిన వారు చరిత్రలో ఉన్నారు. వారెవ్వరూ తిరిగి సజీవులు కాలేదు, ఎవరికీ 
 
కనిపించలేదు. ఈ నాడు క్రైస్తవ విశ్వాసులముగా, యేసు క్రీస్తు ప్రభువు శిష్యులముగా మనమంతా అతిశయించడానికి 
 
ఆనందముతో మన రక్షకుని గూర్చి చెప్పడానికి క్రీస్తు పునరుధ్ధానము మంచి అవకాశం. ప్రభువు తిరిగి లేచినందుచేత 
 
మనo సిగ్గు పడడానికి, భయపడడానికి కారణము లేదు. నీవు యేసు క్రీస్తు ప్రభువును నీ స్వంత రక్షకునిగా 
 
అంగీకరించావా? ఆయన నీ పాపములన్నింటినీ శుద్ధి చేసి క్షమించి వాటినుండి నిన్ను విడిపించాడని, 
 
విమోచించాడాని నీవు ధృడముగా నమ్ముతున్నావా? అయితే ధైర్యంగా నీ రక్షకుని గూర్చి సాక్షం చెప్పు. నీ 
 
సంభాషణలో ఆయన గూర్చి, ఆయన మహిమను గూర్చి చెప్పు. ఆయన అధికారము గూర్చి, పరిశ్దుద్ధత, శక్తి గూర్చి 
 
నీకు అవకాశము దొరికిన ప్రతిచోటా, బంధువులలోనైనా, స్నేహితులమధ్యలోనైనా, తోటి విశ్వాసులమధ్యలోనైనా, 
 
నీతోబాటు పనిచేసేవారైనా, ప్రతి ఒక్కరికీ చెప్పు. ఇది శుభవార్త, యేసు క్రీస్తు ప్రభువు సైతానును, మరణమును, 
 
లోకమును, శరీరమును జయించిన శుభవార్త. 
        
        ప్రభువు మరణించిన తరువాత శిష్యులు దుఖముతో, వంటరితనముతో, ఓటమితో ప్రజలకు భయపడి 
 
దాక్కున్నారు. కానీ ప్రభువు లేచాడని నమ్మిన తరువాత, ఆయన పరలోకానికి ఆరోహణమైనతరువాత ఎంతో ధైర్యంగా 
 
సాక్ష్యమిచ్చారు. అ. కా. 4:18-20 “మీరు యేసు నామమునుబట్టి యెంతమాత్రమును మాటలాడకూడదు, 
 
బోధింపనుకూడదని వారికాజ్ఞాపించిరి. అందుకుపేతురును యోహానును వారినిచూచి దేవుని మాట వినుటకంటె మీ 
 
మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి; మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని 
 
వారికి ఉత్తరమిచ్చిరి;” 33వ వచనం “అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి 
 
సాక్ష్యమిచ్చిరి”. అవమానమైనా, దూషణలైనా, వెలివేతలైనా, మరేదైనా పునరుధ్ధానుడై, సజీవుడుగా, తండ్రి 
 
కుడిప్రక్కలో మనకోసం విజ్ఞాపనచేస్తున్న మన రక్షకుని గూర్చి సాక్ష్యామిద్దామా? క్రీస్తు పునరుధ్ధానo ఆయనలో 
 
జీవిస్తున్నవారికి కొన్ని ప్రత్యేకమైన దీవెనలు ఇచ్చింది. అవేమిటో క్లుప్తంగా ధ్యానిద్దాం.
 
 
      1. యేసు క్రీస్తు ప్రభువు విజయము పొందిన రక్షకుడు, విమోచకుడు గనుక ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరికీ 
 
విజయమిస్తాడు. మరణమును జయించి సజీవుడైనందుచేత మనమంతా మరణమును జయించడానికి 
 
మార్గము ఏర్పడింది. మరణానికి భయపడని వారెవరూ లేరు. మరణము తరువాత నిత్య జీవమూ, నిత్య నరకమో 
 
ఎదుర్కోవాలి గనుక మరణమునకు ముందే దాని విషయం ఆలోచించాలి. “మరణముయొక్క బలముగలవానిని, 
 
అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు 
 
లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.” హెబ్రీ 2:15. మరణ భయము 
 
నుండి మనలను విడిపించి విమోచించడానికి యేసు క్రీస్తు ప్ర భువు మరణపు బలము కలిగిన సైతానును సిలువలో 
 
నశింపచేసి పునరుధానము ను బట్టి జయించాడు. హల్లెలూయ! అందుకే ప్రభువు తనయందు విశ్వాసముంచిన 
 
వాడు “ఎన్నటికిని చనిపోడు” అని యోహాను సువార్తలో చెప్పాడు. మరణ సమయము ఎప్పుడు ఎవరికి వస్తుందో 
 
తెలియదు గనుక ఆ భయము నుండి ఇప్పుడే విడుదల పొంది ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగినా, నిత్యజీవము 
 
యేసుక్రీస్తు ప్రభువు తో గడుపుతావో లేదో ఇప్పుడు నిశ్చయం చేసుకుంటే మంచిది. 
 
        2. క్రీస్తురక్షకుని పునరుధ్ధానము శాంతి సమాధానాలు అనుగ్రహిస్తాయి. ప్రభువు మరణించిన తరువాత శిష్యులు 
 
భయముతో తలుపులు వేసుకొనిఇంట్లో ఉన్న సమయంలో ఏమి జరిగిందో చూడండి: “ఆదివారము సాయంకాలమున 
 
శిష్యులు యూదులకు 
 
భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసి కొనియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు 
 
సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా 
 
శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసుమరల మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను 
 
పంపినప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను.” యోహాను సువార్త 20:19-21. 
 
గమనించండి శ్రోతలూ, ప్రభువును చూచిన తరువాత వారి స్పందన ఏమిటి? సంతోషం! మీరు ఏ విధమైన బాధలో, 
 
ఇబ్బందిలో, కఠిన శ్రమల్లో, నిందల్లో సంతోషాన్ని పోగొటుకున్నారా? మీ ప్రభువు, నా ప్రభువు సజీవుడు! 
 
సదాకాలము!! దీన్ని బట్టి సంతోషించండి. అంతే కాదు, ప్రభువు రెండు సార్లు, సమాధానము ననుగ్రహించాడు. 
 
ప్రభువు మాట ఒకటే సారి చాలు. కానీ మనలాంటి బలహీనులకు, నమ్మకం కల్గించడానికి ప్రభువు తన కరుణనుబట్టి 
 
రెండు మార్లు నిలుకడ, నిబ్బరం కలిగించే తన సమాధానమును అనుగ్రహిస్తున్నాడు, ఈ నాడు నమ్మితే నీకు, నాకు కూడా! 
      
        3. క్రీస్తు పునరుధ్ధానము నిత్యజీవమును నిర్ధారించింది. పరిశుద్ధ గ్రంధం బైబిల్, పాత క్రొత్త నిబంధనలలో 
 
మరణం తరువాత జీవమున్నదని, అది కూడా శరీరములో జీవిస్తామని స్పష్టంగా బోధిస్తున్నది. యోబు 19:26 
 
“అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాతఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును. ఈలాగు 
 
 
నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నామట్టుకు నేనే చూచెదను.మరి ఎవరును 
 
కాదు నేనే కన్నులార ఆయననుచూచెదను.” “శరీరముతో” అనే మాటలను జాగ్రతగా గమనించండి. మరణము 
 
తరువాత ఏమి జరుగబోతుందో ఎవరికీ తెలియదు అనుకుంటూ ఉంటారు. బైబిల్ గ్రంధం ఈ విషయం స్పష్టంగా 
 
బోధిస్తున్నది. కొందరు మరణము తరువాత జంతువులుగానో, పక్షులుగానో, మళ్ళీ జన్మిస్తారని నమ్ముతారు. కొందరు 
 
గ్రీక్ తత్వవేత్తలు శరీరం పాపిష్టిదని, ఆత్మ పవిత్రమైనదని, మరణము తరువాత శరీరము కుళ్లిపోతుంది గాని ఆత్మ ఏదో 
 
ఒక దేవుడు అనబడుతున్న శక్తితో కలిసిపోతుందని నమ్ముతారు. ఎవరికి తోచినట్టు వారు చెబుతారు. అన్ని ప్రశ్నలకు 
 
సమాధానం దేవుని మాటలు పరిశుధ్ద గ్రంధం బైబిల్ బోధిస్తున్నది. మరణము తరువాత జీవితమున్నది. యేసు క్రీస్తు 
 
ప్రభువు పునరుధ్ధానమే దీనికి రుజువు. దానియేలు 12:2లో ఉన్న లేఖనము యేసు క్రీస్తు ప్రభువు స్వయానా 
 
యోహాను సువార్త 5:28,29లో చెప్పిన మాటలు ఒకటే అర్ధమిస్తాయి. అవును, ప్రియ శ్రోతలూ, మరణము తరువాత 
 
శారీరక పునరుధ్ధానము ఉన్నది. ఆ తరువాత తీర్పు ఉన్నది. వారి పాపములోనే, పాపస్వభావములోనే 
 
మరణించినవారికి తిరిగి లేవడం తప్పదు, తీర్పు తప్పదు. నిత్య నరకం తప్పదు. యేసు క్రీస్తు ప్రభువును రక్షకునిగా, 
 
ప్రభువుగా వారి జీవితాల్లో గ్రహించి, ఆయనలో ఆఖరి క్షణం వరకు విశ్వాసములో పటిష్టంగా జీవించినవారు తిరిగి లేచి 
 
మహిమలో ప్రభువుతో నితత్వము నిత్య సంతోషము, సమాధానము, ఆనందములో నిత్యజీవములో ఉంటారు. 
 
ప్రభువును తిరకస్క రించిన వారు నిత్య నరకం, నిత్య శిక్ష తప్పించుకోలేరు. ప్రియ శ్రోతలూ, అవకాశం 
 
జారవిడుచుకోకండి, ఇప్పుడే ప్రభువు యేసును మీ రక్షకునిగా ప్రభువుగా అంగీకరించoడి. దానికి మీకవసరమైనంత 
 
కృప ప్రభువే అనుగ్రహించుగాక! అమెన్!!

మట్టలాదివారము/శుభ శుక్రవారము 10-03-2022 సిలువ మరణమే ఎందుకు!

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...