రోమా పత్రిక బైబిల్ అధ్యయనం – 48 13 8-14 దేవుని ప్రేమ అనే చట్టం

 గమనిక: మీరు ఏ రీతిగా బైబిల్ అధ్యయనాల ద్వారా దీవెన, మేలు, హెచ్చరిక, ఆశీర్వాదం, ఆత్మీయ అబివృద్ధి పొందుతున్నారో, కామెంట్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవి కూడా వ్రాయండి. దేవుని కృప మీకు తోడుగా ఉండి బలపరచుగాక!

రోమా పత్రిక బైబిల్ అధ్యయనం – 48   13 8-14  

దేవుని ప్రేమ అనే చట్టం

     ప్రియ సజీవనిరీక్షణ శ్రోతలందరికీ నిండారుగా శుభములు, వందనములు! సర్వశక్తుడైన మన దేవుడు 

మనoదరినీ కరుణించి దర్శించుగాక! ప్రేమ కోసం ఆశించనివారు ఎవరూ ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో! ప్రేమ 

అనే మాట చాలా అపార్థం చేసుకోబడుతున్నమాట. దేవుని స్వభావము, గుణగణములలో అత్యంత ప్రాథమికమైనది 

ఆయన ప్రేమ. కానీ ప్రస్తుత ప్రపంచం ప్రేమ అనే మాటను కేవలం శరీరానికి సంబంధించినట్టుగా చిత్రీకరిస్తున్నారు. 

దేవుని ప్రేమ శరీరానికి చెందినది కాదు, అది శరీరం, మనసు, ఆత్మలకు చెందిన పరిపూర్ణమైన ప్రేమ. 

అయోగ్యమైనవారము, ఎంతో అవసరతలో ఉన్నటువంటి తన సృష్టములైన మనమీద ఆయనకు నిరంతరముండే 

ప్రగాఢమైన శ్రద్ధ పరిపూర్ణుడైన దేవుని ప్రేమ ద్వారా తేటగా తెలుస్తున్నది. కానీ ప్రియ శ్రోతలూ, ఆయన ప్రేమకు 

కొన్నిహద్దులు ఉన్నవి. దేవుని ప్రేమకు ఆయన పరిశుద్ధతకు, సర్వమునెరిగిన ఆయన సంకల్పము అనే ఒక 

హద్దుఉన్నది. అందుకే ఆయన ప్రేమ అనే చట్టము అని దీన్ని పిలుస్తున్నాము. ఇది అర్ధం చేసుకోవడం కాస్త కష్టమే, 

కానీ ఈ నాటి లేఖనభాగo రోమా 13:8-14ను జాగ్రతగా ధ్యానిస్తే సాధ్యమే. కాబట్టి, రండి, ఇలా రేడియొకు దగ్గరగా 

వచ్చి మీ మనసులను కేంద్రీకరించి సావధానంగా వినండి: రోమా 13:8 నుండి.

  8. ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్పమరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు.

9. ఏలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి.

10. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.
11. మరియు  మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళయైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది.

12. రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించు కొందము.

13. అల్లరితోకూడిన ఆటపాటలైనను మత్తయిననను లేకయు, కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను  లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము.

14. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి.

     ఈ లేఖనభాగములో దేవుని ప్రేమ చట్టము మన జీవితాలమీద ఎలాంటి ప్రభావము, ఫలితము చూపిస్తుందో ఆపో. పౌలు భోధిస్తున్నాడు.

మొదటిది, ప్రేమ ధర్మశాస్త్రమును సంగ్రహపరుస్తుంది. మనము ఎవ్వరికీ ఏ విషయములోనూ అప్పు ఉండకూడదని ఆపో. హెచ్చరిస్తున్నాడు. అంచేత ప్రేమించడమే మనము అందరికీ తీర్చవలసిన రుణం లాంటిది. జాగ్రతగా, వింటున్నారా, శ్రోతలూ? ఆ తరువాత “పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు.” అని ఆపో. బోధిస్తున్నాడు. ఆ తరువాత మోషే ధర్మశాస్త్రములోని నాలుగు ఆజ్ఞలను ఆయన ఎత్తి చూపించాడు. అవి ప్రేమకు సంబంధించినవి. వాటిని మీ బైబిల్లో గమనించండి: “వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు”. ఈ ఆజ్ఞలు మానవులమైన మనము ఒకరితో మరొకరికి ఉండే సంబంధమునకు చెందినవి. ఇప్పుడు మీ బైబిల్లోని మూడవ గ్రంధం లేవీయకాండము తీయండి. అక్కడ ఈ అజ్ఞల నెరవేర్పు గమనిస్తాo. లెవీయకాండంలో  27 అధ్యాయాలున్నాయి. అక్కడ దేవుడు మోషేకు ఈ ఆజ్ఞలను జాగ్రతగా వివరించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఈ ఆజ్ఞలను అర్ధం చేసుకొని వాటిని అనుదినజీవితములో జీవించడమే ప్రేమ అనే చట్టమును నెరవేర్చడమని పౌలు బోధిస్తున్నాడు. దేవుని ఇతర ఆజ్ఞలన్నీ ఈ ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉన్నాయి. ఆ ఆజ్ఞ అది? నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను. ఈ ఆజ్ఞ లేవీయ. 19:18లో వ్రాయబడిఉన్నది. దాని సారాంశముగా 10వ వచనములోని మాటలను అతి స్పష్టంగా బోధిస్తున్నాడు. “ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగియుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే”.  ప్రభువునందు ప్రియులారా, ధర్మశాస్త్రము ప్రేమను ఒక్క ఆజ్ఞలో ఏ విధంగా క్రోడీకరించిందో గమనిస్తున్నారా? అదే : “నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమంపవలెను.”  దీనినిబట్టి దేవుని ధర్మశాస్త్రమును సమీక్షించడంలో దేవుని ప్రేమ ఎలా మన జీవితాలను ప్రభావితం చేస్తుందో తెలుసుకుంటున్నమా? లేదా??

     రెండవది, ప్రేమ సమయమును వివరిస్తుంది. పౌలు సమయము యొక్క ప్రాముఖ్యతను బాగా ఎరిగినవాడు. ఆయన “రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది” అంటూ ఉన్నాడు. నిద్ర మేలుకునే వేళ అయ్యింది. చాలా మంది నిద్రమత్తులో జోగుతూ ఉన్నారు. నిద్రపోతూ ఉండే వారు ఏమీ చేయలేరు. ప్రేమ సమయముతో ముడిపడి ఉన్నది గనుక మనము నింద్రనుండి మేలుకొమ్మని పౌలు బలమైన హెచ్చరికనిస్తూ ఉన్నాడు. ఎందుకనగా మన రక్షణ, విమోచన ఇంతకుముందుకంటే ఇప్పుడు దగ్గరలో ఉన్నది. లేఖనమేమని సెలవిస్తుందో గమనించారా?మనము విశ్వాసులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది.” మన రక్షణ ఒక్కొక్క దినము గడిచే కొలది ఇంకాస్త దగ్గరికి వస్తున్నది. 12వ వచనం. “రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది”  రాత్రి గడిచిపోతూనే ఉన్నది. లేఖనాల్లో పాపము రాత్రితో చీకటితో పోల్చదడినది. రాత్రి చీకటి గనుక ప్రజలు వారి దుష్ట క్రియలు, పాపపు అలవాట్లు చీకటిలో చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. రాత్రి సమయంలో ఎవ్వరికీ కనబడరు గనుక వారు చేయదలచిన చీకటి క్రియలు, పాపపు ఉద్దేశ్యాలు చీకటిలో చేయాలని ప్రయత్నం చేస్తూఉంటారు. రాత్రి చీకటి పాపముతో ముడిపడిఉంది. కానీ ఆపో. బోధిస్తున్నదేమిటంటే, “పగలు సమీపముగా ఉన్నది” కాబట్టి రాత్రికి చెందిన పాపపు క్రియలను విడిచిపెట్టి పగటికి చెందిన వెలుగు క్రియలను చేయాలి. చీకటికి చెందిన ప్రతి ఒక్కటి, అది ఎంత చిన్నదైన, పెద్దద్దైన, పారవేసి వెలుగును దాని క్రియలను గాఢంగా ప్రేమతో హత్తుకోవాలి. ఎందుకనగా ప్రేమ కాలముతో ముడిపడిఉంది. క్రీస్తునందు ప్రియులారా, పౌలు అందిస్తున్న ఈ హితబోధను మనలో ప్రతి ఒక్కరూ అనుసరిస్తే ఎంత బాగుండేది! గతజీవితపు చీకటిక్రియలను విసర్జించే సమయం వచ్చేసింది. పగటికి చెందిన వెలుగు ఆయుధములను ధరించే సమయం ఇప్పుడే! రేపు కాదు.

     మూడవది, ప్రేమ యేసు ప్రభువును వ్యక్తీకరిస్తుంది. శ్రోతలూ, గమనిస్తున్నారా? యేసు ప్రభువుతో మన నడకను ప్రేమ నియంత్రణ చేస్తుంది అని పౌలు భక్తుడు బోధిస్తున్నాడు. మనము నిజాయితీగా యధార్ధతతో జీవించాలి. దీని అర్ధం ఏమిటంటే వేషధారణ లేకుండా యోగ్యమైన రీతిగా అనగా మనము నడవవలసిన రీతిగా మనము జీవించాలి. నీవు నేను ఎలాంటివారమని చెప్పుకుంటామో, లోలోపల అనుకుంటామో  బయటికి మనము ఎలా కనిపిస్తామో అనిపిస్తామో, అలాగే అంతరంగంలో కూడా వుండాలి. చీకటి క్రియలు విడిచిపెట్టి నిజాయితీగా, మంచి అనిపించే పద్ధతిలో ప్రవర్హించాలి. ఏది నోటితో చెప్తామో దాన్ని నెరవేర్చే రీతిగా జీవించాలి.

     చీకటి క్రియలలోని మూడు జతలను పౌలు భక్తుడు ఇక్కడ బోధిస్తున్నాడు. ఇవి 13వ వచనములో ఉన్నవి. మొదటి జత: అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే చాలా ప్రొద్దుపోయాక రాత్రికాలములో చేసి విందు వినోదాలు, చిందులు విందులు. ప్రియ శ్రోతలూ, ఇవి వెంటనే మానేయండి. మత్తు పానీయాలు సేవించడం విడిచిపెట్టండి. సారా, బ్రాండీ డ్రగ్స్ మొదలైనవి ఏ రూపములోనైనా సేవించకండి, వాటికి దూరంగా పారిపొండి. రెండవ జత ఏమిటి? కామవిలాసములు, పోకిరిచేష్టలు. కామవిలాసము అంటే అక్రమమైన చెడ్డ లైంగిక సంబంధాలు. పోకిరిచేష్టలు అంటే హద్దులు దాటిన స్త్రీవ్యామోహము. లైంగిక సంబంధాలలో అపవిత్రతను, కామాతురతను చంపివేయాలి. ఇక మూడవ జత: కలహము, మత్సరము. కలహము అంటే జగడ మాడడం. కొందరు ఇతరులతో కలిసి జీవించడానికి కష్టపడుతూ ఉంటారు. ఎప్పుడూ, ఏదో ఒక విషయములో జగడ మాడుతూ ఉంటారు. మత్సరమంటే అసూయ, శతృత్వం. యేసయ్యలో ప్రేమతో నడిచేవారికి చీకటి క్రియలతో సంబంధం లేదు గనుక వాటిని వదిలిపెట్టండి. ఇది ఎలా చేయాలో 14వ వచనం విశదీకరిస్తుంది. ప్రభువైన యేసు క్రీస్తును “ధరించు” కోవడమే మార్గము. ప్రభువు ఈ మూడు జతల చీకటి క్రియలకు వ్యతిరేకి. ప్రేమ చట్టమునందు జీవించేవారికి శరీర దురాశలు, కామపు దురాశ, దాని వల్ల కలిగే కోరికలు నెరవేర్చుకోవడానికి ఆలోచించుకునే మనసు, సమయం ఉండదు. ప్రేమ యేసు ప్రభువును ఎలా వ్యక్తీకరిస్తుందో గమని స్తున్నారా? దుస్తులు ధరించినట్టుగానే యేసు ప్రభువును ధరించుకోవాలి. ఆయన ప్రేమ నియమాలను బట్టి జీవించాలి. దేవుని ప్రేమ చట్టము మన జీవితాల్లో పనిచేయడానికి అనుమతించాలి. అప్పుడు ధర్మశాస్త్రమును నెరవేర్చడమంటే మన పొరుగువారిని ప్రేమించడమనే సత్యమును తెలుసుకుంటాం. ప్రేమ చట్టము కాలమునకు అనుగుణంగా జీవిస్తూ రాత్రికాలపు పాపపు క్రియలను విసర్జించి పగటి వెలుగు క్రియలు చేయాలని పూనుకుంటాం. యేసు ప్రభువును వెంబడించి  ఆయనలాగ మనము జీవించడానికి ముందుకు సాగుతాం. ఈ గొప్ప మార్పు మన జీవితాల్లో కలిగించడానికి అవసరమైనంత కృప ప్రభువు  మనలో ప్రతి ఒక్కరికీ అనుగ్రహించుగాక! అమెన్!!       

 

“సజీవ నిరీక్షణ” - క్రిస్మస్ సందేశము - దేవుడే మానవుడుగా జన్మించవలసిన అవసరత ఏమిటి?

 గమనిక: మీరు ఏ రీతిగా బైబిల్ అధ్యయనాల ద్వారా దీవెన, మేలు, హెచ్చరిక, ఆశీర్వాదం, ఆత్మీయ అబివృద్ధి పొందుతున్నారో, కామెంట్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవి కూడా వ్రాయండి. దేవుని కృప మీకు తోడుగా ఉండి బలపరచుగాక!

“సజీవ నిరీక్షణ” - క్రిస్మస్ సందేశము 26 December 2021

దేవుడే మానవుడుగా జన్మించవలసిన అవసరత ఏమిటి?

     “సజీవ నిరీక్షణ” శ్రోతలందరికీ, ఒక్కొక్కరికీ, ప్రతి ఒక్కరికీ ప్రేమ పూర్వకమైన క్రిస్మస్ 

శుభములు! మీరు, మీ ఇంటిల్లిపాది యేసు క్రీస్తు ప్రభువు అనుగ్రహించే రక్షణ, నిరీక్షణ, పాప 

క్షమాపణ, విజయం, విడుదల నిండారుగా పొందాలనేదే మా ప్రార్థన, ప్రగాఢ వాంఛ! మీ 

అందరికోసం ప్రతి దినము తప్పక ప్రార్థిస్తున్నాము. మీరు కూడా ఈ 

పరిచర్య కోసం ప్రార్థించమని మనవి చేస్తూఉన్నాను. 

    

     క్రిస్మస్ పండుగను మనమెందుకు ఆచరిస్తున్నాము? ఆ దినాన దేవుని ఏకైక కుమారుడు యేసు 

క్రీస్తు ప్రభువు మానవుడుగా జన్మించినాడు. పరమ తండ్రి లోకరక్షకునిగా ఆయనను పంపించాడని 

లేఖనము సెలవిస్తున్నది. కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మానవ శరీరము 

ధరించవలసిన అవసరత ఏమిటి అనే ప్రశ్నకు సమాధానాలు ఈ పూట అధ్యయనం చేద్దాం, 

రండి, రేడియొకు దగ్గరగా వచ్చి కూర్చోండి.

      

    ఈ భయంకరమైన పాపపు మానవలోకములో దేవుడే ఎందుకు మానవుడుగా జన్మించాలి? ఇక 

వేరే ఏ మార్గం లేదా? పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువు మానవడుగా జన్మించి దేవుని గొర్రె పి‌ల్లగా 

మన పాపమునకు పరిహారము చెల్లిస్తే తప్ప మనలను నిత్య నరకమునుండి రక్షించేవారెవ్వరూ 

లేరు. కానీ మానవునిగానే ఎందుకు? ఒక దేవదూతలాగా జన్మిస్తే సరిపోదా? ముమ్మాటికీ సరిపోదు. 

ఆయన మానవునిగానే జన్మించాలని, జన్మిస్తాడని, లేఖనములు ఆదికాండము నుండి ప్రకటన 

వరకు అతి స్పష్టంగా బోధిస్తున్నవి. 

     మొదటిది, దేవుడు మానవునిగా జన్మించడానికి కారణము I కోరింథీ 15:21లో వ్రాయబడింది. 

“మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుధ్ధానమును 

కలిగెను.” ఆదాము ద్వారా కలిగిన మరణము దేవుడే మానవుడుగా జన్మిస్తే తప్ప మన పాపము, 

శాపము, మరణము, నరకము నుండి మనకు విమోచన కలుగదు. దేవుడు ప్రేమామయుడు, అదే 

సమయములో న్యాయవంతుడు కూడా. ఆయన న్యాయమును బట్టి పాపమునకు శిక్ష విధించక 

మానడు. కానీ నీ మీద ఉన్న ప్రేమను బట్టి నిన్ను శిక్షించడు. దేవుని ప్రేమ, న్యాయము రెండింటి 

నెరవేర్పు క్రిస్మస్ ద్వారానే  సాధ్యమయ్యింది.


            దేవుడే మానవుడుగా జన్మించిన రెండవ కారణము, దేవుని పరిపూర్ణమైన ప్రేమను నీకు, 

నాకు వ్యక్తం చేయడo. 

            “... దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు 

మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.” గమనిస్తున్నారా శ్రోతలూ? ప్రేమ రుజువైతే తప్ప 

అది ప్రేమ కాదు. ప్రత్యక్షoగా, అనగా కన్నులకు కనబడేట్టుగా చూపించిందే నిజమైన ప్రేమ. 

దేవుడు “అగాపే” ప్రేమను యేసు క్రీస్తును లోకమునకు మానవునిగా పంపించడములో 

రుజువయ్యింది. ఎవరి ప్రేమను నీవు కన్నులారా, చూడకపోయినా, దేవుని ప్రేమ యేసు క్రీస్తులో 

ప్రత్యక్షంగా కనిపిస్తుంది.

     

        దేవుడే మానవుడుగా జన్మించిన మూడవ కారణము, మనలను మరణ భయము అనే 

దాసత్వమునుండి విడిపించడం. హెబ్రీ 2:15 “జీవితకాలమంతయు మరణభయము చేత 

దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో 

పాలివాడాయెను. దేనికి భయపడక పోయినా మరణానికి భయపడని వారు లేరు. మరణము 

తరువాత ఉండే నిత్యత్వమునకు మరణము ద్వారా ప్రవేశము కలుగుతుంది. యేసు క్రీస్తు ప్రభువు 

మరణమును తన పునరుధ్ధానములో జయించినందు చేత ఆయనలో మరణించినవారు జీవ 

పునరుధ్ధానములో ప్రవేశిస్తారు. 

     

        దేవుడే మానవుడుగా జన్మించిన నాలుగవ కారణము, మన శోధనలలో మనలను అర్ధం 

చేసుకొని మనకు సహాయము చేయడం. హెబ్రీ పత్రిక 2;16-18 : ఏలయనగా ఆయన 

ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రాహాము 

సంతాన  స్వభావమును ధరించుకొనియున్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము 

కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల 

ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు 

కావలసివచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయ 

గలవాడై యున్నాడు.” యేసు క్రీస్తు ప్రభువు మన ప్రధాన యాజకుడు. ఆయన మన పాపములకు 

పరిహారముగా తన పరిశుద్ధ రక్తమిచ్చి, మనలను తనకోసం సంపాదించుకొని, మనలను 

విమోచించాడు. అంతే కాదు, మన అనుదిన శోధనలలో మనకు సహాయము చేయడానికి ఆయన 

మానవునిగా దిగివచ్చాడు. ఆయన స్వయంగాను, తన పరిశుధ్ధాత్మ ద్వారాకూడ, మనము 

అనుదినం, ప్రతిక్షణం, ప్రతి విషయములో సహాయం చేయదానికి సంసిధ్ధంగా ఉన్నాడు. 

మనలాగా  శోధించబడినప్పటికీ, శోధనలన్నిటినీ గెలిచిన విజయశీలి. హల్లెలూయ! దేవునికి 

స్తోత్రం!!

     దేవుడే మానవుడుగా జన్మించిన అయిదవ కారణము, I యోహాను పత్రిక 3:8లో ఉన్నది. రెండవ 

భాగము. మీ బైబిల్లో గమనించండి కలర్ పెన్సిల్తో గుర్తు పెట్టుకోండి. : “అపవాది యొక్క క్రియలను 

లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్ష మాయెను.”  "లయపరచుటకే" అనేమాటలో ఉన్న 

ఉధ్ఘాటనను గమనించాలి.  మన శత్రువు సైతానును వాని క్రియలను నశింపచేసి మనకు 

వాని శక్తులపైన విజయము అనుగ్రహించడానికి దేవాదిదేవుడు యేసు క్రీస్తు మానవుడుగా 

జన్మించాడు. విజయము పొందనివాడు విజయమెలా అనుగ్రహించగలడు? అవును! యేసు 

ప్రభువు సైతాను సమస్త శక్తులపైన విజయమును సంపాదించాడు. ఆయనే మనకు అపవాది 

శక్తులపైన విజయము నివ్వగలవాడు. ప్రతి శోధనలో పాపములో నుండి మనలను 

విమోచించడానికి పరమును విడిచి భూమి మీదికి మానవునిగా దిగివచ్చిన రక్షకుడు. యేసుక్రీస్తు 

ప్రభువు “నశించిన దానిని వెదికి రక్షించడానికి” జన్మించిన మనుష్య కుమారుడు.  ప్రియ 

శ్రోతలూ, ప్రతి ఒక్కరూ, ఏ  మతమైనా, ఏ కులమైనా, ఏ అంతస్తునకు చెందినవారైనా, 

నశించినవారే. యేసు క్రీస్తునకు బయట దేవుని ఉగ్రత, నిత్య నరకం, మరణభయం, ఆందోళన, 

చింత, దిగులు, కోపం, ఆవేశం, అజ్ఞానం. కాని యేసు క్రీస్తు నందు దేవుని విమోచన, రక్షణ, నిత్య 

జీవం, నెమ్మది, శాంతి సమాధానాలు, జ్ఞానము, నిరీక్షణ ఉన్నవి. మీరు ఏది ఎంచుకుంటారో, 

దీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకొనండి, నిత్య జీవమును ఎంచుకునే శక్తి, కృప, సహాయము 

ప్రభువు మనకందరికీ అంగ్రహించుగాక! అమెన్!!  

మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7-11 ఆధారంగా ఈ సందేశం ఇవ్వబడుతున్నది. 

      7. ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును.

    8. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.

   9. మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి   పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.

   10. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.

   11. ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింప బద్ధులమై యున్నాము.

   12. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండలేదు; మన మొకనినొకడు ప్రేమించిన యెడల దేవుడు మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును.

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...