రోమా పత్రిక అధ్యయనం 1 - రోమా. 1:1-7 దావీదు సంతానం

https://drive.google.com/file/d/15P4WPeh9bhEm28pwi5WfGBpKdBiSGISQ/view?usp=drive_link
  • దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు  పొందండి.  మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో   వ్రాయండి,  మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. 
  • Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@mail.com. 
  • or send a message by WhatsApp to 8143178111


రోమీయులకు వ్రాసిన పత్రిక

సందేశము 1- దావీదు సంతానము


     క్రైస్తవ్యం ఇతర  మతాలకు భిన్నమైనదనే విషయం మీకు చెప్పాలి. చాల మతాలు ఉన్నవి కానీ క్రైస్తవ్యం ప్రపంచపు మతాలకు భిన్నమైనది. మన విశ్వాసము బయలు పరచబడిన విశ్వాసము. అది మనుషుల యోచనల వలన కలిగినది కాదు, కానేకాదు. మనము దేనిని విశ్వాసించాలో దేవుడు బైబిల్లో స్పష్టపరిచాడు. ఈ సందేశమే మావద్ద ఉన్నది.

     మన విశ్వాసమునకు కేంద్ర బిందువు దేవుని కుమారుడు నజరేయుడైన యేసునందు విశ్వాసముంచడం. ఆయన కన్య మరియకు జన్మించాడు. ఇది నా విశ్వాసమునకు పునాది. నీవు క్రైస్తవుడవు అయినట్లయితే నీ విశ్వాసమునకు కూడా అదే పునాది.

     పౌలు రోమ్ లో ఉన్న సంఘమునకు వ్రాసిన పత్రికలోని మొదటి అధ్యాయము మొదటి ఏడు వచనములలో యేసు దావీదు సంతానము అనే విషయమును వివరించాడు. అది క్రైస్తవ విశ్వాసమునకు పునాది. ఇదిగో ఇవి దేవుని మాటలు, జాగ్రత్తగా చదవండి: 

1. యేసు క్రీస్తు దాసుడును, అపొస్తలుడుగా నుండుటకు పిలువబడినవాడును

2. దేవుని సువార్తనిమిత్తము ప్రత్యే కింపబడినవాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి (శుభమని చెప్పి) వ్రాయునది

3. మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగు గాక, 4. దేవుడు  తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన సువార్తను రిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తలద్వారా ముందు వాగ్దానముచేసెను

5. యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూ పింపబడెను

6. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయనద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితివిు

7. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తువారుగా ఉండుటకు పిలువబడి యున్నారు.

     ఈ లేఖన భాగములో పౌలు భక్తుడు దావీదు సంతానము అయిన యేసు ప్రధానమైన  స్థానములో ఉన్నాడో కొన్ని నిర్భంధించే వాస్తవాల ద్వారా  వివరిస్తున్నాడు. ఈ విషయములు అతి జాగ్రత్తతో గమనించాలి:

ఆయన ప్రవక్తల గ్రంధములలో వాగ్దానము చేయబడినవాడు  అనే సత్యము చరిత్రలో ప్రధానమైన  స్థానములో ఉన్నది. మానవ చరిత్రలో ఆది నుండి ఇది సత్యమే. మీరు ఆదికాండము మూడవ అధ్యాయము 15 వ వచనము వరకు  వెళ్ళండి. ఆదికాండము బైబిల్లోని మొదటి గ్రంధము. అక్కడ 3 వ అధ్యాయము 15 వ వచనములో ఆయన స్త్రీ సంతానమును పంపిస్తానని వాగ్దానము చేసి ఉన్నాడు. ఆ తరువాత ఆది. 12:3 లో దేవుడు అబ్రహాముతో, ఆయన సంతానము ద్వారా భూమి మీద ఉన్న ప్రతి కుటుంబమును ఆశీర్వదిస్తానని  వాగ్దానము చేసిఉన్నాడు. అలాగే, మోషే గారి అయిదవ  గ్రంధము ద్వితీ. కాండములోని  18:16 వచనము లో మోషే గారు దేవుడు తన లాంటి ఒక  ప్రవక్తను పుట్టిస్తానని వాగ్దానము చేసిఉన్నాడు.

     అవును, ఆయన పురాతన మానవ చరిత్రనుండి వాగ్దానము చేయబడి ఉన్నాడు, ఇంకా ముందుకు సాగి పోదాం. దావీదు కాలములో లిఖించబడిన II  సమూయేలు 7:16లో నాతాను ప్రవక్త దావీదుతో, తన సింహాసనముమీద కూర్చుని రాజరికం చేయడానికి నిత్యం, నిరంతరం, ఒకరిని లేపుతానని దేవుడు వాగ్దానము చేసిఉన్నాడు. ఆహా  ఇది ఎంత అద్భుతం కదూ!

     89 వ కీర్తన 35-37 లో దావీదు దేవుని స్తుతించడం  గమనిస్తాము. తన నడుములోనుండి జన్మించే వారిలో ఒకరు  పరిశుద్ధుడుగా ఉంటాడని, ఆయన తన సింహాసనము మీద ఆసీనుడై రాజరికం చేస్తాడని చెప్పబడిన  వాగ్దానమును బట్టి స్తుతించాడు. ఇంకా ఉంది. తరువాత వచ్చిన ప్రవక్తలలో యిర్మీయా 23:5,6 లో దేవుడు తనకోసం ఒక చిగురును పుట్టిస్తానని చేసిన వాగ్దానము ఉన్నది. ఇదే  అంశము యిర్మీ. 33:15 లో కూడా ఉన్నది.

     ఆ తరువాత యెషయా 11:10 లో యెషయాప్రవక్త  జనములకు ఒక గొప్ప సూచన ఇవ్వడం గురించి ప్రస్తావించి ఉన్నాడు. అదే యెష్షయి వేరు నుండి పుట్టిన  "చిగురు".  ప్రవక్తల గ్రంధములలో “దావీదు సంతానము” ఏ విధంగా వాగ్దానము చేయబడ్డాడో దాని గురించి నేను మాట్లాడుతున్నాను, ప్రియ మిత్రమా!  ప్రవక్తల గ్రంధాల్లో “దావీదు సంతానము” గురించిన వాగ్దానములలో ఇవి కొన్ని మాత్రమే! ఇవి ఒప్పుకొన తగిన సత్యములని మీముందు ఉంచుతున్నాను.

     ఆయన శక్తితో దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు అనే సత్యము క్రైస్తవ విశ్వాసములో ప్రాముఖ్యమైనది. ఈ లేఖన భాగము ప్రకారము శరీరరీతిగా చూస్తే  ఆయన దావీదు సంతానము.  4 వ వచనములో “దేవుడు తనకుమారుడును మన ప్రభువునైన .... యేసుక్రీస్తు శరీరమునుబట్టి దావీదు సంతానముగాను” అని వ్రాయబడిన మాటలు గమనించాలి. అంటే ఆయనకు ఒక కుటుంబపు వరుస, నేపధ్యం ఉన్నవి. అవును, సువార్తలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నవి. ఆయన కుటుంబపు నేపధ్యం, వరుసలు చాలా చోట్ల స్పష్టంగా చెప్పడం  జరిగగింది . బైబిల్ గ్రంధంలో ఆయన మరియ గర్భంలో జన్మించాడని వ్రాయబడింది. “దావీదు సంతానం” అయిన ఈయన కుటుంబ వరుస, నేపధ్యం బైబిల్ గ్రంధంలో స్పష్టంగా నిర్వచించబడినది.

     దాని కంటే ఎక్కువగా, శరీరరీతిగ ఆయన దావీదు సంతానము అనే సత్యమునకు మించి, ఆయన దేవుని కుమారుడు అని ప్రకటించ బడ్డాడు. అవును, ఈ సత్యమును, దయచేసి 5 వ వచనములో గమనిద్దాం. “మృతులలో నుండి పునరుద్ధ్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి ప్రభావము (శక్తి) చేత దేవుని కుమారుడుగా నిరూపించబడెను.”  “పరిశుద్ధ్ధమైన ఆత్మనుబట్టి” అనే మాటలకు ఆయన పాపము లేనివాడు అనే అర్ధమని నేను వేదపారాయణం ద్వారా తెలుసుకున్నాను. ఆయన ఎన్నడు కూడా ఏ పాపము చేయలేదు గనుక “మృతులలోనుండి పునరుద్ధ్ధానుడై పరిశుధ్ధ  ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు.  ఆయన జన్మ ఎంత అద్భుతమైనదో, అలాగే ఆయన చనిపోయి తిరిగి సజీవుడుగా  లేవడం కూడా అంత అద్భుతమైనది! అందుచేత చనిపోయినప్పటికినీ శక్తి చేత తిరిగి జీవించి ఉన్నాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడుగా ప్రకటించబడ్డాడు. స్నేహితులారా, ఆయన సజీవుడై తిరిగి లేచిన ఈ సత్యము శక్తివంతమైన సత్యము.

     యేసయ్యకు ఉన్న ప్రాముఖ్య స్థానము యొక్క నెరవేర్పును బట్టి శాంతి సమాధానము పొందటానికి ఆయనను నమ్మి, గ్రహించాలి.  ఈ విషయం స్పష్టమవుతున్నది. ఆయనను గ్రహించకుండా నీవు శాంతి సమాధానాలు పొందలేవు. 7 వ వచనంలో ఆపో. పౌలు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికోసం సమాధానమును  కోరుకుంటున్నాడు. వారు పరిశుద్ధులు. అవును, పరిశుద్ధుడు అయిన దేవుడు వారిని, మనలను కూడా పరిశుద్ధులుగా ఉండాలని పిలుస్తూ ఉన్నాడు. ఇది ఎంత గొప్ప విషయం కదూ! కాబట్టి , శాంతి, నెమ్మదితో ఉండడానికి, శాంతి నెమ్మది పొందడానికి, ఆయనను విశ్వసించి, నీ జీవితంలోనికి గ్రహించి, జీవించాలి.

      ఇంకా చూ స్తే, వారు విశ్వాసమునకు విధేయులైనట్టు  పౌలు 6వ వచనంలో ప్రస్తావించడం గమనించాను. “సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు” అన్న మాటలను గమనించారా? వారిలో రోమీయులు కూడా ఉన్నారు. అవును, మిత్రమా, యేసుక్రీస్తును నమ్మి, గ్రహించి జీవించడం శాంతి నెమ్మది పొందడానికి చాలా అవసరం. మన అవసరానికి ఇదే దేవుడు చేసిన ఏర్పాటు. ఇది నాకిష్టమైంది. మన అవసరమునకు దేవుడు చేసిన ఏర్పాటు!

     దేవుని శాంతి నెమ్మది, పొందటానికి మనము కూడా పిలువబడి, ఏర్పాటు  చేయబడ్డాము. ఉదాహరణకు, 2 వ వచనం గమనించండి. “రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధ్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికి .... మన తండ్రి యైన దేవుని నుండియు ప్రభువైన యేసు క్రీస్తు నుండియు కృపాసమాధానములు మీకు కలుగుగాక!”

     శాంతి సమాధానము పొందాలంటే నీవు ఆయనను గ్రహించి, జీవించాలి. ఇది సత్యం. దేవుని శాంతి సమాధానము ఎంతో ఆదరణ కలిగించి విషయమే, కానీ అది పొందటానికి నీవు, ప్రియ మిత్రమా, “దావీదు సంతానం ” అయిన యేసు క్రీస్తును విశ్వసించి గ్రహించి జీవించాలి.    

     ఇప్పుడు, ప్రియ మిత్రమా,   “దావీదు సంతానం” యేసు  క్రీస్తు అని స్పష్ట పరిచే ఈ నిర్భందించే సత్యములను ఒప్పుకొని నమ్మాలి : ఆయన ప్రవక్తల గ్రంధములలో వాగ్దానము చేయబడ్డాడు; ఆయన శక్తితో ప్రకటించబడ్డాడు; శాంతి నెమ్మది పొందటానికి ఆయనను విశ్వసించి, గ్రహించి జీవించాలి. 

     విశ్వాసముతో స్పందించు, నీవు కూడా దేవుని సమాధానము, శాంతి పొందగలవు! అట్టి విశ్వాసము ప్రభువు తన ఆత్మ ద్వారా నీకు అనుగ్రహించుగాక! 

పార్ధన: సర్వసృష్టికర్త వైన పరలోకపు తండ్రీ, నీవు జగత్పునాది వేయకముందే  నేను శాంతి నెమ్మది పొందటానికి ఏర్పాటు చేసినందుకు వందనములు.  మీరు ముందు చేసిన ప్రవచనములు, వాగ్దానము  ప్రకారము యేసుక్రీస్తు  ప్రభువును  "దావీదు సంతానము" గా పంపించినందుకు వందనములు. ఆయన ద్వారా నాకు నెమ్మది, శాంతి, సమాధానము అనుగ్రహించడానికి నేను ఆయనను గ్రహించి, విశ్వసించి  జీవించగల కృప నిమ్మని క్రీస్తు పేరట ప్రార్ధిస్తున్నాను పరమ తండ్రీ, అమెన్!   

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...