యేసయ్యా .. నీ ప్రేమ ఎంతో గొప్పది.. రక్షకుడు యేసు క్రీస్తు స్వచ్చమైన ప్రేమను గూర్చిన పాట

ఈ పాటతో రేడియో లో రేడియో కార్య క్రమమును ఆరంభిస్తున్నాము. రేడియోలో సమయము లేనందున ఇక్కడ పాట అంతటిని అందిస్తున్నాము. ఎంతో మంది హృదయాలను అదరిస్తున్న సర్వాధికారి అయిన సత్య దేవుని స్వచ్చమైన ప్రేమను గూర్చిన పాట! పరిశుద్ధ గ్రంధం బైబిల్ లో మనకు కనిపించే ప్రేమ, కల్వరి సిలువలో మనకు కనిపించే ప్రేమ. ఎన్నడూ వాడిపోని మారిపోని "అగాపే" ప్రేమ! వినండి, మీ స్నేహితులతో బంధువులతో సంఘస్తులతో, మీకిష్టమైన వారితో షేర్ చేయండి! 
  రచన, స్వరకల్పన: పాస్టరమ్మ శ్రీమతి సుకన్య భాస్కర్ సింగపోగు 

రోమా పత్రిక అధ్యయనం -3 - 1:14-17 సువార్త నీ కోసమే!

 
  • దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు  పొందండి.  మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో   వ్రాయండి,  మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. 
  • Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com. 
  • or send a message or WhatsApp to 8143178111 

రోమా పత్రిక అధ్యయనం-3   

 సువార్త నీకోసమే!


     ఒక్కొక్క ప్రజ కోసం ఒక మతం  ప్రత్యేకించి ఉందని కొంతమంది భావిస్తారేమో 

అనిపిస్తుంది. “నా  మతం నాకుంది” అని వారు అంటారు. ఒకవేళ నీ మతం 

నీకుండవచ్చు.  అంతే కాదు, కొన్ని దేశాలలో కొన్ని మతాలు పుట్టి ఆ దేశాలలో 

అభివృద్ధి చెంది ఉండవచ్చు, అక్కడి ప్రజలకు అవి చెంది ఉండవచ్చు.

     అనేక ప్రజానీకానికి వారి వారి మతాలు ఉన్నప్పటికీ, క్రైస్తవ్యం అందరికోసం ఉంది 

నేను చెప్పగలను. అవును, ఆమెన్, క్రైస్తవ్యం అందరికోసం ఉన్నది. సత్యవంతుడైన 

దేవుడు తన కుమారుని మానవ జాతి అంతటి కోసం రక్షకుడుగా ఏర్పాటు 

చేసినందుచేత ఆయన అది అందరికోసం,  అన్నిచోట్ల, ప్రతి ఒక్కరి కోసం చేశాడు. 

దాన్నిబట్టి సువార్త అందరికోసం అని నేను చెప్పగలుగుతున్నాను.


     ఆపో. పౌలు రోమీయులకు ఒక ఉత్తరం రాసినపుడు ఆయన సువార్త అందరికోసం 

అని ఖచ్చితంగా చెప్పాడు. పరిశుద్ధ లేఖన భాగం రోమీయులకు వ్రాసిన పత్రిక, 1:14-17 

గమనించండి. దేవుని మాటలను జాగ్రతగా గమనిద్దాం:    

14. గ్రీసుదేశస్థులకును గ్రీసుదేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను ఋణస్థుడను.

15. కాగా నావలననైనంతమట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను.

16. సువార్తను గూర్చినేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.

17. ఎందుకనిననీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంత కంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది.

     ఆపో. పౌలు గారి ఈ మాటలనుండి సువార్త లోని కొన్ని అంశాలను మీకు 

చూపించాలి. వాటిద్వారా సువార్త నీ కోసమే అని అర్ధం చేసుకుంటావని ఆశిస్తున్నాను. 

అవును, ఆమెన్!

     సువార్త నీ కోసమే అని చూపించే అంశాలలో మొదటిది సువార్త సార్వత్రికమైనది

అంటే ప్రపంచమంతటికీ చెందినది. అది ఒక అప్పు లాంటిది అని పౌలు గారు 

భావించారు. 14 వ వచనంలో “నేను ఋణస్థుడను” అంటున్నాడు. ఆయనను 

దమస్కు మార్గమలో యేసు ప్రభువు పిలిచినపుడు పౌలు ఒక ఋణస్థుడయ్యాడు. 

అక్కడ యేసయ్య ఆయనను కలిసి “నీవు నన్ను ఎందుకు హింస పెడుతున్నావు?” 

అని అడిగాడు. ఆయన తన హృదయమును ప్రభువునకు సమర్పించిన తరువాత  

పౌలు ఋణస్థుడయ్యాడు. ఎందుకంటే ప్రభువు ఆ భాధ్యతను పౌలు పైన ఉంచాడు. 

వెళ్ళి సువార్తను  బోధించాలని ప్రభువు ఆయనకు భారము పెట్టినందుచేత ఆపో. పౌలు 

దానిని ఒక ఋణముగా భావించి ఆ భాధ్యతను చేపట్టినాడు.

     ఆయన ఇప్పుడు 14వ వచనంలో “నేను గ్రీసు దేశస్థులకును, గ్రీసు దేశస్థులు 

కానివారికిని .. ఋణస్థుడను” అంటున్నాడు. అవును, గ్రీసు దేశస్థులకు, ఇంకా గ్రీసు 

దేశస్థులు కానివారికి కూడా! "జ్ఞానులకును, మూఢులకును”. మరో మాటలో 

చెప్పాలంటే అందరికీ, ప్రతి ఒక్కరికీ, ఎవరికైనా  నేను సువార్త ఇవ్వడానికి 

ఋణస్థుడను  అని చెబుతున్నాడు. పౌలు ప్రపంచమతoటికి  తాను ఋణస్తుడనని 

భావించాడు.

     పౌలు జీవించిన కాలంలో ప్రజల మనసులలో కేవలం రెండు రకాల ప్రజలు 

ఉండేవారు. వారిని గ్రీకులు, గ్రీకు దేశస్థులు కానివారు అని పిలిచేవారు. సమాజంలో 

అందరికంటే గొప్ప వారు గ్రీకు వారు. మిగతా ప్రజలందరూ వారికంటే తక్కువ వారు. 

ప్రస్తుతం రెండు రకాల ప్రజలు ఉన్నారు. ఒకవేళ ధనికులు, బీదవారు అనుకోవచ్చు. 

ఆ దినాలలో జ్ఞానులు, మూఢులు అని పిలిచేవారు. తెలివికలిగిన వారికి, తెలివిలేని 

వారికి  తాను సువార్త ప్రకటించవలసిఉన్నది. ఈ విధంగా గ్రీకులు, గ్రీకులు కానివారు, 

జ్ఞానులు, మూఢులు, అని చెప్పడంలో పౌలు ఎవ్వరినీ విడిచిపెట్టలేదు. అందరి 

విషయం ఆయన భాధ్యతను తీసుకున్నాడు.


     ఎందుకనగా సువార్త సార్వత్రికమైనది. ఎప్పుడైతే మనము సువార్త సార్వత్రికమైనది 

అని అంటున్నామో అప్పుడు అందులో నీవు కూడా ఉన్నావు. ఇది నీ కోసమే, మిత్రమా! 

ఇది ప్రపంచమంతటికీ చెందింది గనుక ఎవ్వరూ విడిచిపెట్ట బడలేరు. ఆయన “గ్రీకు 

దేశస్థులకును, గ్రీకు దేశస్థులు కానివారికిని, జ్ఞానులకును, మూఢులకును నేను 

ఋణస్థుడను” అని చెప్పినందుచేత ఈ విషయమును అపో. పౌలు ఖచ్ఛితoగా 

తేటపరుస్తున్నాడు.


      సువార్త నీ కోసమే అనే దానిలో రెండవ అంశము అది ముఖ్యమైనది, విశేషమైనది

ఆపో. పౌలు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు, ఆయన స్వంత మాటల్లో చెప్పాలంటే, 

“నావలననైనంతమట్టుకు రోమాలోని మీకును సువార్తప్రకటించుటకు సిద్ధముగా 

ఉన్నాను”  అది ప్రత్యేకమైనది, విశేషమైనది. పౌలు తన సంసిద్ధతను తెలియచేశాడు. 

నేను దేవునితో వివాదం పెట్టుకోలేను. నోటిమాట గాని, బోధించడం గాని, దేవుడు 

ఏర్పాటు చేసిన సువార్తను బోధించే విధానమని బైబిల్ అతి స్పష్టంగా చెబుతుంది. 

నేనిప్పుడు మీతో చేస్తున్నది అదే! నేను మీకు ఇప్పుడు సువార్త బోధిస్తున్నాను. నేను 

ప్రస్తుతం మీతో నోటిమాట ద్వారా చేస్తున్నాను. మీరు చదువుతున్న ఈ మాటలతో 

మీదగ్గరికి వచ్చాను. అప్పుడు పౌలు ఇదే చేయడానికి సిధ్ధంగా ఉన్నానన్నాడు . 

“రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను” అన్నాడుగదా! 

అంటే దీనిని ప్రత్యేకమైన విశేషమైన సువార్త ప్రకటనగా చేశాడన్నమాట! ఆయన రోమ్ 

లోని ప్రజల పట్ల ప్రత్యేక శ్రధ్ధ చూపినాడు.


     పౌలు దినాలలో రోమ్ ఎలా ఉండేదో ఇప్పుడు మీకు వివరించాలనుకుంటున్నాను. 

పౌలు దినాలలో రోమ్ ఎలాగుండేది? ఎలాంటి పట్టణం? ఓ, అది చాలా పెద్ద ముఖ్యమైన 

పట్టణం సుమా! రోమా సామ్రాజ్యానికి ముఖ్యపట్టణం. ఆనాటి నాగరిక సమాజానికి,  రోమా 

సామ్రాజ్యానికంతటికీ అదే ముఖ్య పట్టణం అనిచెప్పవచ్చు. ఆ దినాలలో అన్ని 

మార్గాలు రోమ్ పట్టణం చేరతాయి అనే నానుడి ఉండేది. “All Roads Lead to Rome” 

అనే ఇంగ్షీషు సామెత అప్పుడే పుట్టింది. అంతే కాదు, రోమాచక్రవర్తి కుటుంబము, వారి 

పరివారము అంతా అక్కడే నివసించేవారు. అధికారులు, రాజరికపు కుటుంబాలు, 

అందరూ రోమ్ లో నివసిoచేవారు. అది వ్యాపారానికి కేంద్రం, రాజకీయాలకు కేంద్రం, 

మతానికి కూడా కేంద్రం. రోమా సామ్రాజ్యమoతటికీ అదే ముఖ్యమైన పట్టణం. వారంతా 

సువార్త వినవలసినవారని ఆయన భావించాడు. ఇతరులకు ఆయన సువార్త 

అందించినట్టే వీరికి కూడా సువార్త  బోధించాలనుకున్నాడు. అంటే సువార్త 

ప్రత్యేకమైనది, విశేషమైనది. సువార్త ప్రత్యేకమైనది, విశేషమైనది, అన్నప్పుడు, అది 

నీకు కూడా ప్రత్యేకమైనది, వ్యక్తిగతమైనది.


     సువార్త నీ కోసమే అనే దానిలో మూడవ అంశము అది వ్యక్తిగతమైనది.“సువార్తను 

గూర్చి నేను సిగ్గుపడువాడనుకాను” అని ఆపో. పౌలు అన్నారు. పౌలు దినములలో 

కొందరు సువార్తను హేళన , ఎగతాళి చేసిఉండవచ్చు. కొందరు సువార్తను దూషించి 

ఉండవచ్చు. "ఓ, సువార్తతో నాకేమీ అవసరం లేదు" అన్నవారు ఉండవచ్చు.  కానీ 

అపొస్తలుడు తెలుసుకున్న విషయం ఏమిటంటే సువార్త తన జీవితాన్నే 

మార్చివేసింది. తాను ఎలా మునుపు జీవించాడో  ఆయనకు బాగా తెలుసు. ప్రస్తుతం 

ఆయన ఎలా జీవిస్తున్నాడో అది కూడా ఆయనకు బాగా తెలుసు. నిజానికి, ఆయన ఒక 

ఇతర పత్రికలో “ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి” అని 

బోధించారు. క్రీస్తు ద్వారా నూతన సృష్టిగా క్రొత్త వ్యక్తిగా మార్చబడడంలో సిగ్గుపడేదేమీ 

ఉండదుగదా!


     క్రీస్తు సువార్తను గురించి తాను సిగ్గుపడడం లేదని పౌలు ఎందుకు అన్నాడంటే, 

“రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి”. ఆ శక్తి తన స్వంత జీవితంలో ఏమి చేసిందో 

ఆయన తెలుసుకున్నాడు. అది ఆయనను రక్షించి మార్చిన దేవుని శక్తి. అది 

ఎలాంటిదో 16 వ వచనంలో ఉన్న మాటలలో వివరిస్తున్నాడు: “నమ్ము ప్రతివానికి

మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై 

యున్నది”   


     ఇంకా చూస్తే, ఆయన 17 వ వచనంలో సువార్త దేవుని నీతి యొక్క ప్రత్యక్షత, లేదా 

ప్రకటన అని చెబుతూ  ఉన్నాడు. నేను మరొక మాట చెప్పాలి, అది మానవుని 

పాపమును కూడా ప్రకటిస్తుంది. ఆపో. పౌలు దేవుని  ఆ శక్తిని రుచి చూచిన వ్యక్తి. అది 

ఆయనకు వ్యక్తిగతమైన సువార్త. అది నీకు కూడా వ్యక్తిగతమైన సువార్త అని పౌలునకు 

తెలుసు. ఎందుకంటే,ఆయన 16 వ వచనంలో అంటున్నాడు. “నమ్ము ప్రతివానికి, 

మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై 

యున్నది”


     ఓ దేవునికి స్తోత్రం! ప్రియ మిత్రమా! ఇప్పుడే నేను నీకు చెప్పగలను, సువార్త 

వ్యక్తిగతమైనది, కాబట్టి అది నీకు  కూడా! నమ్మి విశ్వసించి గ్రహించే ప్రతీ ఒక్కరికీ 

కూడా!  దేవునికి స్తోత్రం, ఇది ఇంత వ్యకిగతమైనది!


     కాబట్టి, మిత్రమా, సువార్త నీ కోసమే, ఎందుకంటే అది సార్వత్రికమైనది, 

ప్రపంచమంతటికీ చెందింది. కాబట్టి అందులో నీవు కూడా ఉన్నావు. అది ప్రత్యేకంగా  

నీ కోసం, నీతో ఉన్న ఇతరులకు కూడా. నీవు నమ్మినట్లయితే ఇది నీకు వ్యక్తిగతమైనది. 

దేవునికి స్తోత్రం! 

ప్రార్ధన: పరిశుద్ధుడా, ప్రేమ గలిగిన తండ్రీ, సువార్తను బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము. పౌలు జీవితమును మార్చిన సువార్త మా అందరి జీవితాలను మార్చుటకు శక్తిగలిగనది.  నా జీవితమును సువార్త శక్తిచేత మార్పు చెందించoడి. ఇంతవరకు సువార్తను విన్న ప్రతి ఒక్కరూ మీ శక్తి చేత మార్చబడుటకు కృప చూపించుమని క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రీ, ఆమెన్!  

రోమా పత్రిక అధ్యయనం -2. మన ఉమ్మడి విశ్వాసం - రోమా 1: 8-13

 


  • దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు  పొందండి.  మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో   వ్రాయండి,  మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. 

  • Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com. 
  • or send a message by WhatsApp to 98663 41841

రోమీయులకు సందేశము 2 -  మన ఉమ్మడి విశ్వాసం

     మానవ జాతిగా మనకు చాలా సంగతులు సాధారణమే, ఒక్కటే. మనమంతా ఉమ్మడిగా ఎదుర్కొనేవి పుట్టుక, జీవితం, మరణం. ఇవన్నీ సాధారణమే, అంటే, మనమందరము వాటిని అనుభవిస్తాం. ఉమ్మడి అనుభవం అని దీన్ని అంటూ ఉన్నాం. 

      కొన్ని భిన్నమైనవి కూడా ఉన్నవి. మనమంతా ఒకే విధంగా కనిపించము. మనము వేరు  వేరు సంస్కృతులలో జీవించవచ్చు. కానీ మనలో చాలా సాధారణమైనవి కూడా ఉన్నవి.

     దేవుడు మనలను ప్రేమించినపుడు మనందరికీ పరస్పర అవసరాలు ఉంటాయని ఆయనకు తెలుసు అన్నవిషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మన అవసరం ఒక్కటే గనుక దేవుడు ఒక్కడే రక్షకుణ్ణి  ఏర్పాటు చేసిఉన్నాడు. మీరూ నేను, క్రీస్తునందు విశ్వాసముంచినపుడు, మన విశ్వాసము పరస్పరo, ఉమ్మడి విశ్వాసము  అవుతున్నది. అలాగే  ప్రతి ఒక్కరి విశ్వాసము కూడా! క్రైస్తవులందరి విశ్వాసము ఉమ్మడి విశ్వాసము. మన విశ్వాసము ఒక్కటే.

     రోమీయులకు 1:8-13 లో ఆపో. పౌలు బోధించిన విషయం మన పరస్పర విశ్వాసము . ఇవి  దేవుని మాటలు, జాగ్రత్తగా గమనిద్దాం :

8. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడు చుండుటనుబట్టి, మొదట మీ యందరినిమిత్తము యేసు క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను. 

9. ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండ మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తమువలన నాకు వీలుకలుగు నేమో అని, నా ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు, 

10. మిమ్మును గూర్చి యెడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. 

11. మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత, అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణపొందవలెనని 

12. ఆత్మసంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను. 

13. సహో దరురులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలోకూడ ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీయొద్దకు రానుద్దేశించితిని; గాని యిది వరకు ఆటంకపరచబడితిని; ఇది మీకు తెలియకుండుట నా కిష్టములేదు.

     గమనించండి, ఈ వచనాల ఆధారంగా మన పరస్పర విశ్వాసమునకుగల ప్రత్యక్ష రుజువులను కొన్నింటిని మీ ముందు ఉంచుతూ ఉన్నాను.  

     మన ప పరస్పర విశ్వాసము సాక్ష్యము ద్వారా తెలుస్తున్నది:  వారి విశ్వాసము సర్వ లోకములో తెలియవచ్చిందని, ఋజువయ్యిందని  ఆపో. పౌలు గారు చెప్పిఉన్నారు. 8వ వచనం గమనించండి. “మీ విశ్వాసము సర్వలోకములో ప్రచురము చేయబడుచుండుటచూచి, మొదట మీ యందరి నిమిత్తము యేసు  క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.” ఇతరులు మన విశ్వాసమును గమనించి చూస్తారు. రోమ్ లోని ఈ క్రైస్తవుల విశ్వాసమును గూర్చి అన్నిచోట్ల ఉన్న వారు గొప్ప సాక్ష్యము చెప్పి ఉండాలి. వారి విశ్వాసము దాచబడలేక పోయింది. అది తేటగా కనిపించింది.

     ఇంకా చూస్తే అది వ్యక్తిగతమైనది. మీ విశ్వాసము అప్పుగా తీసుకోలేనటువంటిదని ఆయన అంటున్నారు. ఒక షర్ట్  లేదా టవల్  అప్పు తీసు కున్నట్టు విశ్వాసమును అప్పుగా తీసుకోలేము. కొంత డబ్బు లేదా ఒక పనిముట్టు అప్పు తీసుకున్నట్టు విశ్వాసమును అప్పు తీసుకోలేము. లేదు, అది అది వ్యక్తిగతమైన విశ్వాసము. అది నీదే అవుతుంది. విశ్వాసము నీది కానట్లయితే నీవెన్నడూ పొందలేవు, అంతే.

     ఆ తరువాత అపొస్తలుడు ఇంకా మాట్లాడుతూ ఆయన తన దేవుణ్ణి  ఆత్మలో సేవిస్తున్నానని చెబుతున్నాడు. అది 9 వ వచనంలో కనిపిస్తున్నది. “ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి.” అవును, దేవుణ్ణి సేవిస్తున్న ప్రతి ఒక్కరి గూర్చి ఆయనకు బాగా తెలుసు. ఆపో. పౌలు నాకిది తెలుసు అని చెప్పగలిగాడు. నేను ఆత్మలో దేవుణ్ణి సేవిస్తున్నానానడానికి ఆయనే నాకు సాక్షి.

     కాబట్టి క్రైస్తవులుగా మన విశ్వాసమును మనము మన సాక్ష్యము ద్వారా తెలియపరుస్తాం. మన పరస్పర విశ్వాసము మన సాక్ష్యము ద్వారా బహిర్గతం అవుతుంది. ఈ రోమీయులకు చాలా కీర్తి ఉన్నది. వారు ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్నారు. వారున్న ప్రతి చోట వారి విశ్వాసము గూర్చి తెలిసింది. వారి సాక్ష్యం వారి విశ్వాసమును రుజువు చేసింది, దానికి సాక్ష్యాధారాలు చూపించింది.

     మన పరస్పర విశ్వాసము ప్రార్ధన ద్వారా తెలుస్తున్నది.  వారు ఒకరికోసం  మరొకరు ప్రార్ధన చేస్తున్నారు. వారిని తన ప్రార్ధనలలో జ్ఞాపకం చేయడం  ఎప్పుడూ మానలేదని  ఆపో. పౌలు గారు చెబుతున్నారు. 9 వ వచనం చూశారా? “నా ప్రార్ధనల యందు ఎల్లప్పుడు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను.” అని ఆయన చెప్పడం గమనించాలి. ఆపో. పౌలు ప్రత్యేకించి వారికోసం ప్రార్ధనచేశాడని  నేను నమ్ముతున్నాను. తన సహోదర సహోదరిలైన రోమ్ విశ్వాసులకోసం ఆయన ప్రత్యేకమైన వాటికోసం, ఖచ్చితమైన వాటి కోసం ప్రార్ధించి ఉండాలి. ఆయన వాళ్ళ కోసం ప్రార్ధించాడు.

     ఆయన వారి వ్యక్తిగతమైన అవసరతల కోసం, అలాగే తన అవసరాల కోసం ప్రార్ధిస్తూ ఉన్నాడు. ఆయన 10 వ వచనంలో ఏ విధంగా నైన,  మీ వద్దకు వచ్చి  మిమ్ములను చూడడానికి రావాలని ఆశపడుతున్నాని చెప్పాడు. మీ దగ్గరికి వచ్చి మిమ్ములను చూడడానికి మంచి ప్రయాణము దేవుని చిత్తానుసారముగా కలగాలని ఆశపడుతున్నానని తేటగా చెబుతున్నాడు.

     పౌలు ప్రార్ధనలోని ఒక సంగతి మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. ఆయన దేవుని చిత్తానుసారంగా ప్రార్ధిస్తున్నాడు. మిత్రమా, ఇది చాలా  ప్రాముఖ్య మైనది. విశ్వాసం, పరస్పర విశ్వాసం, ప్రార్ధన ద్వారా తెలియ పర్చబడింది. కానీ పరస్పర విశ్వాసం దేవుని చిత్తానుసారమైన ప్రార్ధన ద్వారా బయలుపడింది. ఇది ఎంత ప్రాముఖ్యమో  గమనిస్తున్నారా ? దేవుని చిత్తానుసారంగా మంచి ప్రయాణం  తనకు కలగాలని  ఆయన కోరుకుంటున్నాడు. ఒక వ్యక్తిగత అవసరం  గురించి పార్ధిస్తున్నాడు, కానీ ఒక వ్యక్తిగత అవసరత కోసం దేవుని చిత్తం అనుగుణంగా ప్రార్ధిస్తున్నాడు.

     క్రైస్తవులుగా మనం ఒకరి కోసం మరొకరు ప్రార్ధించవచ్చు. ఇప్పుడు నా గురించి ఆలోచిస్తున్నపుడు నా  కోసం మీరు ప్రార్ధిస్తున్నారని నేను ఆశిస్తున్నాను. ఆపో. పౌలు అలాంటి మనవి చేసినట్టు, నేను కూడా ఈ మనవి చేస్తున్నాను. మీరు నా కోసం ప్రార్ధించాలని కోరుతున్నాను, నేను మీ కోసం ప్రార్ధించాలని ఆశిస్తున్నాను. మీ ప్రార్ధన మనవులు, అంశములు ఏమిటో  మాకు తెలియచేయండి. మా కోసం, మన “సజీవ నిరీక్షణ” రేడియో  పరిచర్య కోసం ప్రార్ధించండి. మన పరస్పర విశ్వాసము ఒకరి కోసం ఒకరము ప్రార్ధించడం ద్వారా బయలు పరచుకుందాం. కాబట్టి నా కోసం ప్రార్ధించమని కోరుతున్నాను.

     మన పరస్పర విశ్వాసము సహవాసము ద్వారా అనుభవిస్తున్నాము. ఇది నా కెంతో ఇష్టమయిన సంగతి. ఇది అద్భుతమైనది. ఆపో. పౌలు వారిని చూడాలని ఆశ పడుతున్నట్టు చెప్పాడు కదూ! “మీరు స్థిరపడవలేనని .. ఆత్మ సంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును  చూడను మిగుల అపేక్షించుచున్నాను.” (11 వ) ఆయన వారిని బలపరచి, స్థిరపరచాలని ఆశిస్తూ ఉన్నాడు, వారి చేత ఆయన కూడా బలపరచబడాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన వారితో సహవాసము చేయాలని ఆశించాడు, వారి పరస్పర విశ్వాసము ఆ సహవాసములో తెలుస్తున్నది. వారి క్రైస్త జీవితం, విశ్వాసములో వారు వర్ధిల్ల డానికి, వారిని స్థిరపరచడానికి ఒక కృపావరం వారికి ఇవ్వాలని ఆశించాడు.

     ఆ తరువాత  ఆదరణ కోసం ఆరాటపడ్డాడు. 12 వ వచనంలో “మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణ పొందవలేనని” ఆశపడుతున్నట్టు తెలియచేస్తున్నాడు. పౌలు వారితో ఉండి, ఆదరణ ఒకరినుండి  మరొకరు పొందాలని, ఆలాటి  ఫలము పొందాలని ఆశించాడు.

     అవును గదా! మన పరస్పర విశ్వాసము సహవాసములో అనుభవిస్తాము. విశ్వాసము ఇతర విశ్వాసులతో ఉండాలని, వారి  సహవాసములో ఉండాలని, కలిసి ప్రభువును ఆరాధించాలని కోరుకుంటుంది. విశ్వాసము ఇతరులను బలపరుస్తుంది, కృపావరము ఇవ్వాలని కోరుకుంటుంది, ఇతరులు విశ్వాసములో బలంగా ఉండాలని కోరుకుంటుంది. ఇతరులను బలపర్చి స్థిరపర్చాలని కోరుకుంటుంది. అవును, క్రైస్తవులముగా మనము పరస్పర విశ్వాసమును బట్టి ఒకరితో ఒకరము సహవాసములో సంతోషిస్తామనేది ఎంత ఆదరణ కలిగించే సత్యం కదూ!

     మనము సహవాసములో ఉండడానికి మీతో కలవాలని నేను ఎంతో ఆశించాను. పౌలు వారిని చూడాలని ఎంతో ఆశించానని చెప్పాడు.  మనందరము ఒక్కసారి ఒక చోట కలిసి సహవాసము చేస్తే  ఎంత బాగుంటుందో అని నేను ఆశించాను.  మనము మహిమ లో ప్రవేశించినప్పుడు అది తప్పని సరిగా జరగనుంది. అప్పుడు మనకు మంచి, దగ్గరి సహవాసము, మహిమాలోని సహవాసము నిత్యసహవాసము ఉంటుంది. మన పరస్పర విశ్వాసము సహవాసములో బయలుపడుతుంది.

     మన పరస్పర విశ్వాసము మన సాక్ష్యము ద్వారా మన ప్రార్ధనల ద్వారా, మన సహవాసము ద్వారా రుజువు కానుంది. నీవు క్రైస్తవుడవు అయితే, పౌలు ఏమి బోధిస్తున్నాడో నీకు అర్ధం అవుతుంది. నీవు క్రైస్తవుడవు కానట్లయితే, యేసు క్రీస్తు నందు విశ్వాసముంచమని  నిన్ను ప్రేమతో ఆర్ధిస్తున్నాను, అప్పుడు నీవు కూడా పరస్పర విశ్వాసము యొక్క దీవెనలు అనుభవించ గలుగుతావు. అట్టి కృప ప్రభువు నీకనుగ్రహించు గాక!      

          ప్రార్ధన: నా జీవదాతా, పరలోకపు తండ్రీ, విశ్వాసము ఎంత బలమైనదో ఎంత శ్రేష్టమైనదో మీ వాక్యము ద్వారా తెలుసుకున్నాను. అది బహిర్గతమయ్యే సాక్ష్యము, ప్రార్ధన, సహవాసము ఎంత బలమైనవో తెలుసుకున్నాను. నా విశ్వాసమును గూర్చి ఇతరులతో సాక్ష్యామివ్వడానికి శక్తినివ్వండి, ఇతరులతో కలిసి పార్ధించడానికి ప్రేరణ కలిగించండి, సహవాసము చేయడానికి మార్గము తెరవండి. కరోన తెగులును బట్టి, మా సహవాసము పరిమితమైపోయింది. కృప చూపి, విశ్వాసము కలిగిన వారమందరము సహవాసము చేయడానికి మార్గము కలిగించమని మా రక్షకుడు యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రీ, అమెన్!   


రోమా పత్రిక అధ్యయనం 1 - రోమా. 1:1-7 దావీదు సంతానం

https://drive.google.com/file/d/15P4WPeh9bhEm28pwi5WfGBpKdBiSGISQ/view?usp=drive_link
  • దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు  పొందండి.  మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో   వ్రాయండి,  మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. 
  • Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@mail.com. 
  • or send a message by WhatsApp to 8143178111


రోమీయులకు వ్రాసిన పత్రిక

సందేశము 1- దావీదు సంతానము


     క్రైస్తవ్యం ఇతర  మతాలకు భిన్నమైనదనే విషయం మీకు చెప్పాలి. చాల మతాలు ఉన్నవి కానీ క్రైస్తవ్యం ప్రపంచపు మతాలకు భిన్నమైనది. మన విశ్వాసము బయలు పరచబడిన విశ్వాసము. అది మనుషుల యోచనల వలన కలిగినది కాదు, కానేకాదు. మనము దేనిని విశ్వాసించాలో దేవుడు బైబిల్లో స్పష్టపరిచాడు. ఈ సందేశమే మావద్ద ఉన్నది.

     మన విశ్వాసమునకు కేంద్ర బిందువు దేవుని కుమారుడు నజరేయుడైన యేసునందు విశ్వాసముంచడం. ఆయన కన్య మరియకు జన్మించాడు. ఇది నా విశ్వాసమునకు పునాది. నీవు క్రైస్తవుడవు అయినట్లయితే నీ విశ్వాసమునకు కూడా అదే పునాది.

     పౌలు రోమ్ లో ఉన్న సంఘమునకు వ్రాసిన పత్రికలోని మొదటి అధ్యాయము మొదటి ఏడు వచనములలో యేసు దావీదు సంతానము అనే విషయమును వివరించాడు. అది క్రైస్తవ విశ్వాసమునకు పునాది. ఇదిగో ఇవి దేవుని మాటలు, జాగ్రత్తగా చదవండి: 

1. యేసు క్రీస్తు దాసుడును, అపొస్తలుడుగా నుండుటకు పిలువబడినవాడును

2. దేవుని సువార్తనిమిత్తము ప్రత్యే కింపబడినవాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి (శుభమని చెప్పి) వ్రాయునది

3. మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగు గాక, 4. దేవుడు  తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన సువార్తను రిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తలద్వారా ముందు వాగ్దానముచేసెను

5. యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూ పింపబడెను

6. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయనద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితివిు

7. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తువారుగా ఉండుటకు పిలువబడి యున్నారు.

     ఈ లేఖన భాగములో పౌలు భక్తుడు దావీదు సంతానము అయిన యేసు ప్రధానమైన  స్థానములో ఉన్నాడో కొన్ని నిర్భంధించే వాస్తవాల ద్వారా  వివరిస్తున్నాడు. ఈ విషయములు అతి జాగ్రత్తతో గమనించాలి:

ఆయన ప్రవక్తల గ్రంధములలో వాగ్దానము చేయబడినవాడు  అనే సత్యము చరిత్రలో ప్రధానమైన  స్థానములో ఉన్నది. మానవ చరిత్రలో ఆది నుండి ఇది సత్యమే. మీరు ఆదికాండము మూడవ అధ్యాయము 15 వ వచనము వరకు  వెళ్ళండి. ఆదికాండము బైబిల్లోని మొదటి గ్రంధము. అక్కడ 3 వ అధ్యాయము 15 వ వచనములో ఆయన స్త్రీ సంతానమును పంపిస్తానని వాగ్దానము చేసి ఉన్నాడు. ఆ తరువాత ఆది. 12:3 లో దేవుడు అబ్రహాముతో, ఆయన సంతానము ద్వారా భూమి మీద ఉన్న ప్రతి కుటుంబమును ఆశీర్వదిస్తానని  వాగ్దానము చేసిఉన్నాడు. అలాగే, మోషే గారి అయిదవ  గ్రంధము ద్వితీ. కాండములోని  18:16 వచనము లో మోషే గారు దేవుడు తన లాంటి ఒక  ప్రవక్తను పుట్టిస్తానని వాగ్దానము చేసిఉన్నాడు.

     అవును, ఆయన పురాతన మానవ చరిత్రనుండి వాగ్దానము చేయబడి ఉన్నాడు, ఇంకా ముందుకు సాగి పోదాం. దావీదు కాలములో లిఖించబడిన II  సమూయేలు 7:16లో నాతాను ప్రవక్త దావీదుతో, తన సింహాసనముమీద కూర్చుని రాజరికం చేయడానికి నిత్యం, నిరంతరం, ఒకరిని లేపుతానని దేవుడు వాగ్దానము చేసిఉన్నాడు. ఆహా  ఇది ఎంత అద్భుతం కదూ!

     89 వ కీర్తన 35-37 లో దావీదు దేవుని స్తుతించడం  గమనిస్తాము. తన నడుములోనుండి జన్మించే వారిలో ఒకరు  పరిశుద్ధుడుగా ఉంటాడని, ఆయన తన సింహాసనము మీద ఆసీనుడై రాజరికం చేస్తాడని చెప్పబడిన  వాగ్దానమును బట్టి స్తుతించాడు. ఇంకా ఉంది. తరువాత వచ్చిన ప్రవక్తలలో యిర్మీయా 23:5,6 లో దేవుడు తనకోసం ఒక చిగురును పుట్టిస్తానని చేసిన వాగ్దానము ఉన్నది. ఇదే  అంశము యిర్మీ. 33:15 లో కూడా ఉన్నది.

     ఆ తరువాత యెషయా 11:10 లో యెషయాప్రవక్త  జనములకు ఒక గొప్ప సూచన ఇవ్వడం గురించి ప్రస్తావించి ఉన్నాడు. అదే యెష్షయి వేరు నుండి పుట్టిన  "చిగురు".  ప్రవక్తల గ్రంధములలో “దావీదు సంతానము” ఏ విధంగా వాగ్దానము చేయబడ్డాడో దాని గురించి నేను మాట్లాడుతున్నాను, ప్రియ మిత్రమా!  ప్రవక్తల గ్రంధాల్లో “దావీదు సంతానము” గురించిన వాగ్దానములలో ఇవి కొన్ని మాత్రమే! ఇవి ఒప్పుకొన తగిన సత్యములని మీముందు ఉంచుతున్నాను.

     ఆయన శక్తితో దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు అనే సత్యము క్రైస్తవ విశ్వాసములో ప్రాముఖ్యమైనది. ఈ లేఖన భాగము ప్రకారము శరీరరీతిగా చూస్తే  ఆయన దావీదు సంతానము.  4 వ వచనములో “దేవుడు తనకుమారుడును మన ప్రభువునైన .... యేసుక్రీస్తు శరీరమునుబట్టి దావీదు సంతానముగాను” అని వ్రాయబడిన మాటలు గమనించాలి. అంటే ఆయనకు ఒక కుటుంబపు వరుస, నేపధ్యం ఉన్నవి. అవును, సువార్తలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నవి. ఆయన కుటుంబపు నేపధ్యం, వరుసలు చాలా చోట్ల స్పష్టంగా చెప్పడం  జరిగగింది . బైబిల్ గ్రంధంలో ఆయన మరియ గర్భంలో జన్మించాడని వ్రాయబడింది. “దావీదు సంతానం” అయిన ఈయన కుటుంబ వరుస, నేపధ్యం బైబిల్ గ్రంధంలో స్పష్టంగా నిర్వచించబడినది.

     దాని కంటే ఎక్కువగా, శరీరరీతిగ ఆయన దావీదు సంతానము అనే సత్యమునకు మించి, ఆయన దేవుని కుమారుడు అని ప్రకటించ బడ్డాడు. అవును, ఈ సత్యమును, దయచేసి 5 వ వచనములో గమనిద్దాం. “మృతులలో నుండి పునరుద్ధ్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి ప్రభావము (శక్తి) చేత దేవుని కుమారుడుగా నిరూపించబడెను.”  “పరిశుద్ధ్ధమైన ఆత్మనుబట్టి” అనే మాటలకు ఆయన పాపము లేనివాడు అనే అర్ధమని నేను వేదపారాయణం ద్వారా తెలుసుకున్నాను. ఆయన ఎన్నడు కూడా ఏ పాపము చేయలేదు గనుక “మృతులలోనుండి పునరుద్ధ్ధానుడై పరిశుధ్ధ  ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు.  ఆయన జన్మ ఎంత అద్భుతమైనదో, అలాగే ఆయన చనిపోయి తిరిగి సజీవుడుగా  లేవడం కూడా అంత అద్భుతమైనది! అందుచేత చనిపోయినప్పటికినీ శక్తి చేత తిరిగి జీవించి ఉన్నాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడుగా ప్రకటించబడ్డాడు. స్నేహితులారా, ఆయన సజీవుడై తిరిగి లేచిన ఈ సత్యము శక్తివంతమైన సత్యము.

     యేసయ్యకు ఉన్న ప్రాముఖ్య స్థానము యొక్క నెరవేర్పును బట్టి శాంతి సమాధానము పొందటానికి ఆయనను నమ్మి, గ్రహించాలి.  ఈ విషయం స్పష్టమవుతున్నది. ఆయనను గ్రహించకుండా నీవు శాంతి సమాధానాలు పొందలేవు. 7 వ వచనంలో ఆపో. పౌలు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికోసం సమాధానమును  కోరుకుంటున్నాడు. వారు పరిశుద్ధులు. అవును, పరిశుద్ధుడు అయిన దేవుడు వారిని, మనలను కూడా పరిశుద్ధులుగా ఉండాలని పిలుస్తూ ఉన్నాడు. ఇది ఎంత గొప్ప విషయం కదూ! కాబట్టి , శాంతి, నెమ్మదితో ఉండడానికి, శాంతి నెమ్మది పొందడానికి, ఆయనను విశ్వసించి, నీ జీవితంలోనికి గ్రహించి, జీవించాలి.

      ఇంకా చూ స్తే, వారు విశ్వాసమునకు విధేయులైనట్టు  పౌలు 6వ వచనంలో ప్రస్తావించడం గమనించాను. “సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు” అన్న మాటలను గమనించారా? వారిలో రోమీయులు కూడా ఉన్నారు. అవును, మిత్రమా, యేసుక్రీస్తును నమ్మి, గ్రహించి జీవించడం శాంతి నెమ్మది పొందడానికి చాలా అవసరం. మన అవసరానికి ఇదే దేవుడు చేసిన ఏర్పాటు. ఇది నాకిష్టమైంది. మన అవసరమునకు దేవుడు చేసిన ఏర్పాటు!

     దేవుని శాంతి నెమ్మది, పొందటానికి మనము కూడా పిలువబడి, ఏర్పాటు  చేయబడ్డాము. ఉదాహరణకు, 2 వ వచనం గమనించండి. “రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధ్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికి .... మన తండ్రి యైన దేవుని నుండియు ప్రభువైన యేసు క్రీస్తు నుండియు కృపాసమాధానములు మీకు కలుగుగాక!”

     శాంతి సమాధానము పొందాలంటే నీవు ఆయనను గ్రహించి, జీవించాలి. ఇది సత్యం. దేవుని శాంతి సమాధానము ఎంతో ఆదరణ కలిగించి విషయమే, కానీ అది పొందటానికి నీవు, ప్రియ మిత్రమా, “దావీదు సంతానం ” అయిన యేసు క్రీస్తును విశ్వసించి గ్రహించి జీవించాలి.    

     ఇప్పుడు, ప్రియ మిత్రమా,   “దావీదు సంతానం” యేసు  క్రీస్తు అని స్పష్ట పరిచే ఈ నిర్భందించే సత్యములను ఒప్పుకొని నమ్మాలి : ఆయన ప్రవక్తల గ్రంధములలో వాగ్దానము చేయబడ్డాడు; ఆయన శక్తితో ప్రకటించబడ్డాడు; శాంతి నెమ్మది పొందటానికి ఆయనను విశ్వసించి, గ్రహించి జీవించాలి. 

     విశ్వాసముతో స్పందించు, నీవు కూడా దేవుని సమాధానము, శాంతి పొందగలవు! అట్టి విశ్వాసము ప్రభువు తన ఆత్మ ద్వారా నీకు అనుగ్రహించుగాక! 

పార్ధన: సర్వసృష్టికర్త వైన పరలోకపు తండ్రీ, నీవు జగత్పునాది వేయకముందే  నేను శాంతి నెమ్మది పొందటానికి ఏర్పాటు చేసినందుకు వందనములు.  మీరు ముందు చేసిన ప్రవచనములు, వాగ్దానము  ప్రకారము యేసుక్రీస్తు  ప్రభువును  "దావీదు సంతానము" గా పంపించినందుకు వందనములు. ఆయన ద్వారా నాకు నెమ్మది, శాంతి, సమాధానము అనుగ్రహించడానికి నేను ఆయనను గ్రహించి, విశ్వసించి  జీవించగల కృప నిమ్మని క్రీస్తు పేరట ప్రార్ధిస్తున్నాను పరమ తండ్రీ, అమెన్!   

కరోన వ్యాధి/తెగులు అందరినీ భయపెడుతున్నది, అంత మాత్రాన మీరు భయపడనవసరం లేదు.

https://drive.google.com/file/d/1oCbf7C8U9tLJCF6qD0SAf3PLyUX8Xa-B/view?usp=sharing

మనందరికీ సంబంధించిన ప్రాముఖ్యమైన విషయము గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. 

ఈనాటి మన అంశం కరోన వైరస్ లేదా కోవిడ్ -19 అనే వ్యాధి లేదా తెగులు

మనకు అర్ధం కావాలని వ్యాధి అని అంటున్నాము, కానీ దీనికి సరయిన పేరు తెగులు. వ్యాధికి తెగులుకు భేదమున్నది. 1.  వ్యాదులు ఎన్నో ఉన్నవి: కానీ తెగుళ్లు  కొన్ని మాత్రమే. 1. వ్యాధులు ఎల్లప్పుడూ ఉంటాటయి: తెగుళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. 3. దాదాపు ప్రతి వ్యాధికి ఏదో ఒక విధమైన మందు లేదా ఔషధము ఉంటుంది. కానీ తెగులుకు ఔషధము లేదు. కానీ వాక్సిన్  లేదా టీకా మందు కనిపెడతారు.  4. అంటువ్యాధులు తప్ప, సాధారణమైన వ్యాదులు వ్యాపించవు : కానీ తెగుళ్లు విపరీతమైన వేగంగా వ్యాపిస్తాయి. 5.  అన్ని వ్యాధులు ప్రాణాంతకములు కాదు: కానీ తెగుళ్లు ప్రాణాంతకములు, అంటే ప్రాణమును తేసివేస్తాయి. ఈ విషయములను కరోన వైరస్ అనే తెగులుకు అన్వయించుకుంటే, ఇవన్నీ నిజమే అనిపిస్తుందా?

కరోన ధృవీకరించిన కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను:  మొదటిది, సర్వ సృష్టి కర్త అయిన దేవుడు పరిశుద్ధ్ధుడు. ఆయన పాపమును శిక్షించే వాడు. మోషే కాలములో ఐగుప్తులోనికి ఆయన పంపిన తెగుళ్ళ విషయం మీకు తెలిసిఉండవచ్చు.  దేవుడు పంపించిన తెగులు మళ్ళీ దేవుడే తీసివేశాడు, ఇతరులవల్ల  కాలేదు. అవి దేవుని “తీర్పులు” అని పరిశుధ్ధ గ్రంధం బైబిల్ సెలవిస్తున్నది. ఇశ్రాఏలీయులను కూడా దేవుడు వారి ఆవిధేయతను బట్టి, ఆవిశ్వాసమును బట్టి, “మెడ వంచని”తనమును బట్టి కోపముతో తెగుళ్ళతో శిక్షించాడు. దేవునిలో పక్షపాతము లేదు.  రోమా. 2:11. దేవుడు ఒక్కడే, ఆయన పరిశుద్ధతను ఎల్లప్పుడూ, ప్రతి సమయములో చాటుకుంటాడు. ప్రభువు తన పరిశుద్ధత విషయంలో రాజీపడడు. దేవుడు ఒక్కడే తన సృష్ఠి అంతటినీ ప్రభావితం చేయగలడు.  

రెండవది, మనము కేవలము క్షణికులము మాత్రమే. మరో మాటలో చెప్పాలంటే, మరణము ఎప్పుడైనా, ఎవరికైనా, ఎలాగయిన కలుగవచ్చు. కరోన కావచ్చు, మరేదైనా అనారోగ్యం, ప్రమాదం, ఊహించనిది ఏదైనాజరగవచ్చు.  అన్నీ సవ్యంగా సాగిపోతుంటే, మనము మంటివారమని మర్చిపోతూ విర్రవీగుతూ ఉంటాం. కరోన మనము క్షణికులమని జ్ఞాపకం చేసింది. పేద, ధనిక:  పండితుడు, పామరుడు అంతా సమానమని దృవీకరించింది. దేశము, జాతి, రంగు, భాష, కులము, మతము అనే ఏ బేధము లేకుండా అందరికీ మరణం ఎంత అకస్మాత్తుగా సంభవించగలదో కరోన మనకు గుర్తు చేసింది.

మూడవది, కరోన యుగాంతమును సూచిస్తుంది. కరోన వచ్చిన తరువాత అందరిలో ఏమి జరుగబోతుంది అనే ఓ ప్రశ్న కలుగుతుంది. ఇది దేనికి సూచన అని అందరూ ఆలోచిడం మొదలు పెట్టారు. ఏ మందు లేనిది కరోన: అరికట్టడమొక్కటే మార్గము. దాని లక్షణాలు, పనిచేసే పధ్ధతి, వ్యాపించే పధ్ధతి, టీకా, ఇతర విషయాలు కనుక్కునేలోపే విపరీతంగా వ్యాపించింది. తన రెండవ రాకడ  గురించి హెచ్చరిస్తున్న  స్సందర్భములో ప్రభువు చెప్పిన మాటలు జాగ్రత్తగా అలకించండి: లూకా  సువార్త 21:11.  “మరియు ఆయన వారితో ఇట్లనెను: జనము మీదికి జనము రాజ్యము మీదికి రాజ్యము లేచును; అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరువులును తటస్థించును, ఆకాశమునుండి మహా భయోత్పాతములును గొప్ప సూచకములును పుట్టును.”  ప్రియ స్నేహితుడా, సోదరీ, గమనించారా? సృష్టి కర్త అయిన దేవుడు యేసు క్రీస్తు  ప్రభువు ద్వారా లోకమంతటికీ, అంటే, నీకు నాకు, ప్రతి ఒక్కరికీ, న్యాయతీర్పు చేయబోతున్నాడు. కనిపించే ప్రతి ఒక్కటీ నశించి పోయే సమయం త్వరలో వస్తున్నది. కరోన దానికి ఒక చిన్న సూచన. ఇంకా రాబోయే మహా శ్రమలు, తీర్పులు, తెగుళ్లు, ప్రకటన గ్రంధంలో స్పష్ట చేయబడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ లోకం, భూమి, ఆకాశము, పంచభూతాలు, నాశనము చేయబడి, దేవుడు క్రొత్త భూమి క్రొత్త ఆకాశములను  సృష్టించి, తన రాజ్యము నిర్మిచ బోతూ ఉన్నాడు. దయచేసి మీ బైబిల్ తెరవండి. మీ వద్ద లేకపోయినట్లయితే తీసుకురండి. ఒక్క సారి, నాతో బాటు చదవండి:  పేతురు వ్రాసిన రెండవ పత్రిక 3 వ అధ్యాయము, 8 వ వచనము నుండి చదువుకుందాం. మీరు కూడా నాతోబాటు, చదవండి: “ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరములవలెను, వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు అలస్యమని ఎంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు  గాని ఎవడును నశింపవలెనని యిచ్చయిoపక, అందరూ మారుమనస్సు పొందవలేనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతము గలవాడైయున్నాడు. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహా ధ్వనితో గతించిపోవును, భూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు, దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, భూతములు మహా వేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు ఆగమనము కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధ ప్రవర్తనతోనూ, భక్తితోను, ఎంతో జాగ్రత్తగల వారైయుండలెను. అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటియందు నీతి నివసించును.”  ఇది భూమి ఆకాశముల భవిష్యత్తు. అనగా నీవు నేను ప్రతి దినము జీవించే భౌతిక జీవనానికి ఆధారము. ప్రభువు యేసుక్రీస్తు త్వరగా వస్తున్నారు! సిద్ధపడదామా? కరోన ఈ ప్రాముఖ్యమైన సత్యమును నిర్ధారిస్తున్నది.

ఇక కరోనాను  మనము ఎలా ఎదుర్కోవాలి అనే విషయం ఆలోచిద్దాం. నిజమైన విశ్వాసి పరిశుద్ధ గ్రంధం బైబిలలోని సత్యములను గ్రహిస్తాడు గనుక ఇవి వింతగా అనిపించవు. మరోమాటలో చెప్పాలంటే వీటికోసం ఎదురు

చూస్తాడు. మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వీటి గురించి ముందే మనలను సిద్ధపరిచాడు. ప్రభువు ఒలీవల కొండ మీద శిష్యులకు చేసిన ప్రసంగము మత్తయి సువార్త 24 వ అధ్యాయము, మార్కు సువార్త 13 వ అధ్యాయము, లూకా సువార్త 21 వ అధ్యాయములలో ఉన్నది.  జాగ్రత్తగా చదవండి, ధ్యానించండి. దేవుని యందు నిజమైన విశ్వాసము లేని వారికి ఇవి క్రొత్తగా, వింతగా, భయానకంగా ఉంటాయి. చాలా మంది యేసుక్రీస్తును రక్షకునిగా  విశ్వసించరుగాని, ఒక మేలు చేసే వానిగా, కోరినది ఇచ్చే వానిగా భావిస్తారు. అది దేవుని వాక్యములో ఎక్కడా లేదు. ప్రభువులో జీవించడం ఒక అనుభవం, ఒక సంబంధం. అది ఒక పిలుపు. ఆ పిలుపుని విని, స్పందించి, పిలవబడిన చోటికి వచ్చి, పిలువబడిన పనిని చేసినవారే నిజమైన విశ్వాసులు. చిన్న పిల్లలు తాతయ్య, నానమ్మ దగ్గర ఏదో దొరుకుతుందని వచ్చినట్టు చాలామంది క్రైస్తవులు అని పిలవబడుతూ చలామణి అవుతున్నవారు, ఆరాధన స్థలమునకు వచ్చేది ఈ ఉద్దేశ్యముతోనే. ప్రియ సోదరీ సోదారులారా, కరోన మనలను మేలు కొలుపు తున్నది. దేవునితో నీ సంబంధఏమిటో, ఎందుకో, ఎలాంటిదో పరీక్షించుకోవాలి. లాక్ డౌన్ అందుకు చాలా మందికి అనుకూలంగా మారింది. ఆయనను వెంబడించే వారు లోకమునకు ఉప్పుగా, వెలుగుగా ఉండాలని ప్రభువు నిర్దేశించాడు. దానికిది మంచి సమయం కాదా? మన నిజమైన విశ్వాసమును చూపించే సమయమిదే! పరిసయులలాగా ప్రదర్శించుకోవడం కాదు, ప్రభువునకు  నిజమైన శిష్యులుగా జీవించే మంచి అవకాశమిది! సాక్ష్య మిచ్చే అద్భుత సమయం!  మన విశ్వాసమును, ధైర్యమును ప్రజలు చూచినపుడు, దేవునికి మహిమ కలుగుతుంది. ఆదిమ అపొస్తలులు, విశ్వాసులు, పరిశుద్ధాత్మ పూర్ణులై ధైర్యముతో, విశ్వాసముతో, ఐక్యతతో పరిశుద్ధతతో దీనమనసుతో దేవుని రాజ్యమే గురిగా జీవించారు, మరణించారు. వారేనాడు మరణమునకు భయపడలేదు. సోదరీ సోదారులారా, మన సంగతేమిటి?

 మరి ఎలాటి జాగ్రత్తలు తీసుకోవాలి? భయము ఉన్నవారు జాగ్రత్తలు తీసుకుంటారు, మాకెందుకు? అనేవారు కొందరు ఉన్నారు. భయము లేని వారు జాగ్రత్తలు తీసుకుంటారా? అవును, ముమ్మాటికీ తీసుకోవాలి. దయచేసి జాగ్రత్తగా వినండి. కొన్ని ప్రత్యేకమైన పరిస్తితులలో, సందర్భాలలో ప్రభువు కొందరిని అద్భుతరీతిగా కాపాడాడు. మంచి ఉదాహరణలు: సింహాపు బోనులో దానియేలు, అగ్నిగుండంలో షడ్రకు, ఆయన స్నేహితులు. దీర్ఘంగా ఆలోచించండి, లోతుగా ధ్యానించండి. అవి ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు జరిగాయో గ్రహిస్తే మంచిది. విశ్వాసము ఉన్నపుడు జాగ్రత్తలు తెసుకోవాలా? తప్పనిసరిగా. అందరిలాగా మనము కూడా పనిచేసుకునే బ్రతుకుతామా? అవును. కానీ మనము చేసే పని దేవుని కోసము చేస్తూన్నమనే విశ్వాసముతో చేస్తాము. కొలస్సీ 3:22, 23 జాగ్రత్తగా చదివి, లోతుగా ధ్యానించండి. మనము కూడా అందరిలాగానే జీవించాలి, కానీ ప్రియమైన దేవుని పిల్లలగా జీవించాలి. జాగ్రత్త తీసుకోవడం అన్ని రీతులుగా మంచిది. బాధ్యత గలిగిన పౌరుడు, దేవుని కుమారుడు, లేదా కుమార్తె గా జీవిస్తున్నామన్నమాట! మరో ప్రాముఖ్యమైన విషయం: జాగ్రత్తలు తెసుకొనని వారు దేవునిని శోధిస్తున్నారు. మన ప్రభువు మత్తయి 4:7 లో సాతానుతో చెప్పిన మాటను గుర్తుంచుకోండి, “ప్రభువైన నీ దేవుని శోధింపవలదు”.  జాగ్రత్తలు తీసుకోకుండా ఉండేవారు, నాకు కరోన రాదులే అనే నిర్లక్ష్యం చేస్తున్నవారన్న మాట. లేదా నన్నెందుకు దేవుడు కాపాడడు? అని దేవుని శోధించే వారన్న మాట.  

జాగ్రత్తలు తీసుకోవటానికి మరో ప్రాముఖ్యమైన కారణము ఏమిటంటే మన అజాగ్రత్త వలన ఇతరులకు ఈ కరోన తెగులు సోకే ప్రమాదమున్నది. చాలా మందికి కరోనసోకి ఉండవచ్చు, కానీ లక్షణాలు కనిపించక పోవచ్చు. అలాంటి వారి ద్వారా వృద్ధులు, బలహీనులు, రోగనిరోధక శక్తిలేనివారు, దీర్ఘకాలిక అనారోగ్యం కలిగిన వారు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు కరోన బారిన పడవచ్చు. లేదా మీకు తెలియకుండానే, ఇతరులకు మీరు కరోనాను వ్యాపించేలా చేయవచ్చు.      

కరోన వైరస్ వచ్చినప్పటినుండి ఎన్నో మార్పులు మన జీవన విధానంలో చేసుకుంటున్నాము కదూ! చేతులు కడుక్కోవలసిన విధానంలో కడుక్కుంటేనే మన చేతులకు మనకు తెలియకుండా అంటుకున్న ఈ భయానకమైన క్రిమినుండి మనం తప్పించుకోవచ్చు, ఇతరులను తప్పించవచ్చు. ఒక పరిశోధన ఏమి చెబుతున్నాడో విన్నప్పుడు నేను ఆశ్చర్య పడ్డాను. మనము సరియైన పధ్ధతి లో చేతులు కడిగినపుడు, మనకు తెలియకుండా మనలను అంటుకున్న కరోన క్రీమీయొక్క శక్తి తగ్గిపోతుంది, తెగులు శోకదు, ఇతరులకు ప్రాకదు.  మాస్క్ పెట్టుకుంటేనే, మనము ఇతరుల తుంపరలనుండి తప్పించు కోవచ్చు. ఇతర మనుషులకు మనకు కనీసం రెండు గజాల దూరము ఉంటేనే మనకు భద్రత ఉంటుంది. వారికి మేలు చేసిన వారమవుతాము. ఇవన్నీ మనము తీసుకోవలసిన కనీస జాగ్రత్తలు.  ఇతరులు పాటించినా, పాటించక పోయినా, మీరు, నేను తప్పక ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. నా మట్టుకు నేను ఇతరులు దగ్గరికి రావాలని ప్రయత్నిస్తున్నపుడు, నేనే నాలుగు అడుగులు వెనుకకు వెళుతున్నాను. ముగింపులో, రోమా 8:31-39 చదవాలని ఆశ ఉన్నది, కానీ మీరు స్వయంగా చదవాలని కోరుతున్నాను. దేవుని అనంతమైన అసమానమైన మారని ప్రేమనుండి మనలను ఏది వేరు చేయదు.  ఎంతో ప్రాముఖ్యమైన రోమా పత్రిక వచనవెంబడి వచనబైబిల్ సత్యాల పఠన ఆరంభిస్తున్నాము. మీ బైబిల్, నోట్ బుక్, పెన్ తెచ్చుకోవడం మరవకండి.  మీ బంధువులు, స్నేహితులకు తెలియచేయండి.

 ప్రార్ధించుకుందాం :

ప్రేమామూర్తివైన పరలోకపు తండ్రి, కరోన వైరస్ నీ ఆజ్ఞతోనే ఈ లోకానికి వచ్చింది. అది ఎందుకు వచ్చిందో, దాన్ని బట్టి మేము ఏమి నేర్చుకోవాలో తెలియచేసినందుకు వందనములు. బలమైన విశ్వాసము మీ వాక్యము ద్వారా పొందడానికి మాకు శ్రద్ధ పుట్టించoడి. కరోన అనే తెగులు నుండి మేము తప్పించుకోవడానికి, ఇతరులను తప్పించడానికి ప్రతి జాగ్రత్త తీసుకోవడఅవసరమని నేర్చుకున్నాం. డానికవసరమైన మీ కృప మాకందరికి విస్తరింప చేయమని, ప్రియ రక్షకుడు క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రీ! ఆమెన్!!  

మా వాట్సప్ నంబర్  :98 66 34 18 41.

మా టెలిఫోన్ నంబర్: 98663 41841. 

ఇ-మెయిల్ అడ్రెస్: sajeevanireekshana@gmail.com

అడ్రెస్:

సజీవ నిరీక్షణ, పాస్టర్ విజయ్ భాస్కర్ సింగపోగు,

3-125/6, ఎన్. ఐ. ఎన్. కాలనీ, బోడుప్పల్,

హైదరాబాద్-500092

మీ ప్రార్ధన అవసరతలు, మాకు తెలియచేయండి, మీ కోసం ప్రార్ధిస్తాము. రోమా పత్రిక నుండి ఇవ్వబడిన ఈ సందేశముల చిన్న పుస్తకము పొందాలని కోరినట్లయితే మమ్ములను వాట్సప్, లేదా, మెసేజ్ లేదా ఇ-మెయిల్ లేదా ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి. సర్వశక్తి మంతుడైన దేవుడు మిమ్మును తన కృపతో దర్శించు గాక!   


ఈ ఆడియో మెసేజ్ ఇక్కడ వినండి:

https://drive.google.com/file/d/1OHqZAKxyznOg_Da56sh5hcCQqX5QdWOs/view?usp=sharing


  • దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు  పొందండి.  మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో   వ్రాయండి,  మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. 
  • Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@mail.com. 
  • or send a message by WhatsApp to 98663 41841
  • తగు జాగ్రతలు తీసుకుంటూ విశ్వాసములో స్థిరముగా ఉన్నట్లయితే నీవు ఆ భయమునుండి విడుదల పొందవచ్చు. ఇక చదవండి:   


మనందరికీ సంబంధించిన ప్రాముఖ్యమైన విషయము గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. వచ్చే కార్యక్రమం నుండి రోమా పత్రిక వచనం వెంబడి వచనం బైబిల్ అధ్యయనం, పారాయణం చేయబోతూవున్నాము.

ఈనాటి మన అంశం కరోన వైరస్ లేదా కోవిడ్ -19 అనే వ్యాధి లేదా తెగులు

మనకు అర్ధం కావాలని వ్యాధి అని అంటున్నాము, కానీ దీనికి సరయిన పేరు తెగులు. వ్యాధికి తెగులుకు భేదమున్నది. 

1. వ్యాదులు ఎన్నో ఉన్నవి: కానీ తెగుళ్లు  కొన్ని మాత్రమే. 

2. వ్యాధులు ఎల్లప్పుడూ ఉంటాటయి: తెగుళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. 

3. దాదాపు ప్రతి వ్యాధికి ఏదో ఒక విధమైన మందు లేదా ఔషధము ఉంటుంది: కానీ తెగులుకు ఔషధము లేదు. కానీ వాక్సిన్  లేదా టీకా మందు కనిపెడతారు.  

4. అంటువ్యాధులు తప్ప, సాధారణమైన వ్యాదులు వ్యాపించవు : కానీ తెగుళ్లు విపరీతమైన వేగంగా వ్యాపిస్తాయి. 

5. అన్ని వ్యాధులు ప్రాణాంతకములు కాదు: కానీ తెగుళ్లు ప్రాణాంతకములు, అంటే ప్రాణమును తేసివేస్తాయి. ఈ విషయములను కరోన వైరస్ అనే తెగులుకు అన్వయించుకుంటే, ఇవన్నీ నిజమే అనిపిస్తుందా?

కరోన ధృవీకరించిన కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను:  మొదటిది, సర్వ సృష్టి కర్త అయిన దేవుడు పరిశుద్ధ్ధుడు. ఆయన పాపమును శిక్షించేవాడు. మోషే కాలములో ఐగుప్తులోనికి ఆయన పంపిన తెగుళ్ళ విషయం మీకు తెలిసిఉండవచ్చు. దేవుడు పంపించిన తెగుళ్ళు మళ్ళీ దేవుడే తీసివేశాడు, ఇతరులవల్ల  కాలేదు. అవి దేవుని “తీర్పులు” అని పరిశుధ్ధ గ్రంధం బైబిల్ సెలవిస్తున్నది. ఇశ్రాయేలీయులను కూడా దేవుడు వారి ఆవిధేయతను బట్టి, ఆవిశ్వాసమును బట్టి, “మెడ వంచని”తనమును బట్టి కోపముతో తెగుళ్ళతో శిక్షించాడు. దేవునిలో పక్షపాతము లేదు. రోమా. 2:11. దేవుడు ఒక్కడే, ఆయన పరిశుద్ధతను ఎల్లప్పుడూ, ప్రతి సమయములో చాటుకుంటాడు. ప్రభువు తన పరిశుద్ధత విషయంలో రాజీపడడు. దేవుడు ఒక్కడే తన సృష్ఠి అంతటినీ ప్రభావితం చేయగలడు.  

రెండవది, మనము కేవలము క్షణికులము మాత్రమే. మరో మాటలో చెప్పాలంటే, మరణము ఎప్పుడైనా, ఎవరికైనా, ఎలాగయిన కలుగవచ్చు. కరోన కావచ్చు, మరేదైనా అనారోగ్యం, ప్రమాదం, ఊహించనిది ఏదైనా   జరగవచ్చు. అన్నీ సవ్యంగా సాగిపోతుంటే, మనము మంటివారమని మర్చిపోతూ విర్రవీగుతూ ఉంటాం. కరోన మనము క్షణికులమని జ్ఞాపకం చేసింది. పేద, ధనిక:  పండితుడు, పామరుడు: అంతా సమానమని దృవీకరించింది. దేశము, జాతి, రంగు, భాష, కులము, మతము అనే ఏ బేధము లేకుండా అందరికీ మరణం ఎంత అకస్మాత్తుగా సంభవించగలదో కరోన మనకు గుర్తు చేసింది.

మూడవది, కరోన యుగాంతమును సూచిస్తుంది. కరోన వచ్చిన తరువాత అందరిలో ఏమి జరుగబోతుంది అనే ఓ ప్రశ్న కలుగుతుంది. ఇది దేనికి సూచన అని అందరూ ఆలోచిడం మొదలు పెట్టారు. ఏ మందు లేనిది కరోన: అరికట్టడమొక్కటే మార్గము. దాని లక్షణాలు, పనిచేసే పధ్ధతి, వ్యాపించే పధ్ధతి, టీకా, ఇతర విషయాలు కనుక్కునేలోపే విపరీతంగా వ్యాపించింది. తన రెండవ రాకడ  గురించి హెచ్చరిస్తున్న  స్సందర్భములో ప్రభువు చెప్పిన మాటలు జాగ్రత్తగా గమనించండి: లూకా  సువార్త 21:11.  “మరియు ఆయన వారితో ఇట్లనెను: జనము మీదికి జనము రాజ్యము మీదికి రాజ్యము లేచును; అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరువులును తటస్థించును, ఆకాశమునుండి మహా భయోత్పాతములును గొప్ప సూచకములును పుట్టును.”  ప్రియ స్నేహితుడా, సోదరీ, గమనించారా? సృష్టి కర్త అయిన దేవుడు యేసు క్రీస్తు  ప్రభువు ద్వారా లోకమంతటికీ, అంటే, నీకు నాకు, ప్రతి ఒక్కరికీ, న్యాయతీర్పు చేయబోతున్నాడు. కనిపించే ప్రతి ఒక్కటీ నశించి పోయే సమయం త్వరలో వస్తున్నది. కరోన దానికి ఒక చిన్న సూచన. ఇంకా రాబోయే మహా శ్రమలు, తీర్పులు, తెగుళ్లు, ప్రకటన గ్రంధంలో స్పష్టo  చేయబడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ లోకం, భూమి, ఆకాశము, పంచభూతాలు, నాశనము చేయబడి, దేవుడు క్రొత్త భూమి క్రొత్త ఆకాశములను  సృష్టించి, తన రాజ్యము నిర్మిచబోతూఉన్నాడు. దయచేసి మీ బైబిల్ తెరవండి. ఒక్క సారి, నాతో బాటు చదవండి:  పేతురు వ్రాసిన రెండవ పత్రిక 3 వ అధ్యాయము, 8 వ వచనము నుండి చదువుకుందాం. “ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరములవలెను, వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు అలస్యమని ఎంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు  గాని ఎవడును నశింపవలెనని యిచ్చయిoపక, అందరూ మారుమనస్సు పొందవలేనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతము గలవాడైయున్నాడు. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహా ధ్వనితో గతించిపోవును, భూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు, దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, భూతములు మహా వేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు ఆగమనము కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధ ప్రవర్తనతోనూ, భక్తితోను, ఎంతో జాగ్రత్తగల వారైయుండలెను. అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటియందు నీతి నివసించును.”  జాగ్రత్తగా  ! గమనించారా?   క్రీస్తు త్వరగా వస్తున్నారు! సిద్ధపడదామా? కరోన ఈ ప్రాముఖ్యమైన సత్యమును నిర్ధారిస్తున్నది.

ఇక కరోనాను  మనము ఎలా ఎదుర్కోవాలి అనే విషయం ఆలోచిద్దాం. నిజమైన విశ్వాసి పరిశుద్ధ గ్రంధం బైబిల్లోని సత్యములను గ్రహిస్తాడు గనుక ఇవి వింతగా అనిపించవు. మరోమాటలో చెప్పాలంటే వీటికోసం ఎదురు

చూస్తాడు. మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వీటి గురించి ముందే మనలను సిద్ధపరిచాడు. ప్రభువు ఒలీవల కొండ మీద శిష్యులకు చేసిన ప్రసంగము మత్తయి సువార్త 24 వ అధ్యాయము, మార్కు సువార్త 13 వ అధ్యాయము, లూకా సువార్త 21 వ అధ్యాయములలో ఉన్నది.  జాగ్రత్తగా చదవండి, ధ్యానించండి. దేవుని యందు నిజమైన విశ్వాసము లేని వారికి ఇవి క్రొత్తగా, వింతగా, భయానకంగా ఉంటాయి. చాలా మంది యేసుక్రీస్తును రక్షకునిగా  విశ్వసించరుగాని, ఒక మేలు చేసే వానిగా, కోరినది ఇచ్చేవానిగా భావిస్తారు. అది దేవుని వాక్యములో ఎక్కడా లేదు. ప్రభువులో జీవించడం ఒక అనుభవం, ఒక సంబంధం. అది ఒక పిలుపు. ఆ పిలుపుని విని, స్పందించి, పిలవబడిన చోటికి వచ్చి, పిలువబడిన పనిని చేసినవారే నిజమైన విశ్వాసులు. చిన్న పిల్లలు తాతయ్య, నానమ్మ దగ్గర ఏదో దొరుకుతుందని వచ్చినట్టు చాలామంది క్రైస్తవులు అని పిలవబడుతూ చలామణి అవుతున్నవారు, ఆరాధన స్థలమునకు వచ్చేది ఈ ఉద్దేశ్యముతోనే. ప్రియ సోదరీ సోదారులారా, కరోన మనలను మేలు కొలుపు తున్నది. దేవునితో నీ సంబంధo ఏమిటో, ఎందుకో, ఎలాంటిదో పరీక్షించుకోవాలి. "మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచు కొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి; మీరు భ్రష్టులు కానియెడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే యెరుగరా?" లాక్ డౌన్ అందుకు చాలా మందికి అనుకూలంగా మారింది. ఆయనను వెంబడించే వారు లోకమునకు ఉప్పుగా, వెలుగుగా ఉండాలని ప్రభువు నిర్దేశించాడు. దానికిది మంచి సమయం కాదా? మన నిజమైన విశ్వాసమును చూపించే సమయమిదే! పరిసయ్యులలాగా ప్రదర్శించుకోవడం కాదు, ప్రభువునకు  నిజమైన శిష్యులుగా జీవించే మంచి అవకాశమిది! సాక్ష్య మిచ్చే అద్భుత సమయం!  మన విశ్వాసమును, ధైర్యమును ప్రజలు చూచినపుడు, దేవునికి మహిమ కలుగుతుంది. ఆదిమ అపొస్తలులు, విశ్వాసులు, పరిశుద్ధాత్మ పూర్ణులై ధైర్యముతో, విశ్వాసముతో, ఐక్యతతో పరిశుద్ధతతో దీనమనసుతో దేవుని రాజ్యమే గురిగా జీవించారు, మరణించారు కూడా! వారేనాడు మరణమునకు భయపడలేదు. సోదరీ సోదారులారా, మన సంగతేమిటి?

 మరి ఎలాటి జాగ్రత్తలు తీసుకోవాలి? 'భయము ఉన్నవారు జాగ్రత్తలు తీసుకుంటారు, మాకెందుకు?' అనేవారు కొందరు ఉన్నారు. భయము లేని వారు జాగ్రత్తలు తీసుకుంటారా? అవును, ముమ్మాటికీ తీసుకోవాలి. దయచేసి జాగ్రత్తగా గమనించండి! కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో, సందర్భాలలో ప్రభువు కొందరిని అద్భుతరీతిగా కాపాడాడు. మంచి ఉదాహరణలు: సింహాపు బోనులో దానియేలు, అగ్నిగుండంలో షడ్రకు, ఆయన స్నేహితులు. దీర్ఘంగా ఆలోచించండి, లోతుగా ధ్యానించండి. అవి ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు జరిగాయో గ్రహిస్తే మంచిది. విశ్వాసము ఉన్నపుడు జాగ్రత్తలు తెసుకోవాలా? తప్పనిసరిగా. అందరిలాగా మనము కూడా పనిచేసుకునే బ్రతుకుతామా? అవును. కానీ మనము చేసే పని దేవుని కోసము చేస్తూన్నమనే విశ్వాసముతో చేస్తాము. కొలస్సీ 3:22, 23 జాగ్రత్తగా చదివి, లోతుగా ధ్యానించండి. మనము కూడా అందరిలాగానే జీవించాలి, కానీ ప్రియమైన దేవుని పిల్లలగా జీవించాలి. జాగ్రత్త తీసుకోవడం అన్ని రీతులుగా మంచిది. బాధ్యత గలిగిన పౌరుడు, దేవుని కుమారుడు, లేదా కుమార్తె గా జీవిస్తున్నామన్నమాట! మరో ప్రాముఖ్యమైన విషయం: జాగ్రత్తలు తెసుకొనని వారు దేవునిని శోధిస్తున్నారు. మన ప్రభువు మత్తయి 4:7 లో సాతానుతో చెప్పిన మాటను గుర్తుంచుకోండి, “ప్రభువైన నీ దేవుని శోధింపవలదు”.  జాగ్రత్తలు తీసుకోకుండా ఉండేవారు, నాకు కరోన రాదులే అనే నిర్లక్ష్యం చేస్తున్నవారన్న మాట. లేదా నన్నెందుకు దేవుడు కాపాడడు? అని దేవుని శోధించేవారన్న మాట.  

జాగ్రత్తలు తీసుకోవటానికి మరో ప్రాముఖ్యమైన కారణము ఏమిటంటే మన అజాగ్రత్త వలన ఇతరులకు ఈ కరోన తెగులు సోకే ప్రమాదమున్నది. చాలా మందికి కరోనసోకి ఉండవచ్చు, కానీ లక్షణాలు కనిపించక పోవచ్చు. అలాంటి వారి ద్వారా వృద్ధులు, బలహీనులు, రోగనిరోధక శక్తిలేనివారు, దీర్ఘకాలిక అనారోగ్యం కలిగిన వారు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు కరోన బారిన పడవచ్చు. లేదా మీకు తెలియకుండానే, ఇతరులకు మీరు కరోనాను వ్యాపించేలా చేయవచ్చు.      

కరోన వైరస్ వచ్చినప్పటినుండి ఎన్నో మార్పులు మన జీవన విధానంలో చేసుకుంటున్నాము కదూ! చేతులు కడుక్కోవలసిన విధానంలో కడుక్కుంటేనే మన చేతులకు మనకు తెలియకుండా అంటుకున్న ఈ భయానకమైన క్రిమినుండి మనం తప్పించుకోవచ్చు, ఇతరులను తప్పించవచ్చు. ఒక పరిశోధన ఏమి చెబుతున్నదో తెలుసుకున్నప్పుడు నేను ఆశ్చర్య పడ్డాను. మనము సరియైన పధ్ధతిలో చేతులు కడిగినపుడు, మనకు తెలియకుండా మనలను అంటుకున్న కరోన క్యొక్రిమియొక్క శక్తి తగ్గిపోతుంది, తెగులు శోకదు, ఇతరులకు ప్రాకదు.  మాస్క్ పెట్టుకుంటేనే, మనము ఇతరుల తుంపరలనుండి తప్పించు కోవచ్చు. ఇతర మనుషులకు మనకు కనీసం రెండు గజాల దూరము ఉంటేనే మనకు భద్రత ఉంటుంది. వారికి మేలు చేసిన వారమవుతాము. ఇవన్నీ మనము తీసుకోవలసిన కనీస జాగ్రత్తలు. ఇతరులు పాటించినా, పాటించక పోయినా, మీరు, నేను తప్పక ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. నా మట్టుకు నేను ఇతరులు దగ్గరికి రావాలని ప్రయత్నిస్తున్నపుడు, నేనే నాలుగు అడుగులు వెనుకకు వెళుతున్నాను. ముగింపులో, రోమా 8:31-39 చదవాలని ఆశ ఉన్నది, కానీ మీరు స్వయంగా చదవాలని కోరుతున్నాను. దేవుని అనంతమైన అసమానమైన మారని ప్రేమనుండి మనలను ఏది వేరు చేయదు. 

ప్రార్ధించుకుందాం :

ప్రేమామూర్తివైన పరలోకపు తండ్రి, కరోన వైరస్ నీ ఆజ్ఞతోనే ఈ లోకానికి వచ్చింది. అది ఎందుకు వచ్చిందో, దాన్ని బట్టి మేము ఏమి నేర్చుకోవాలో తెలియచేసినందుకు వందనములు. బలమైన విశ్వాసము మీ వాక్యము ద్వారా పొందడానికి మాకు శ్రద్ధ పుట్టించoడి. కరోన అనే తెగులు నుండి మేము తప్పించుకోవడానికి, ఇతరులను తప్పించడానికి ప్రతి జాగ్రత్త తీసుకోవడo అవసరమని నేర్చుకున్నాం. దానికవసరమైన మీ కృప మాకందరికి విస్తరింప చేయమని, ప్రియ రక్షకుడు క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రీ! ఆమెన్!!   

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...