II Cor-15 2~~12-17 Part 1
క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము
శ్రోతలూ, బాగున్నారా? ప్రస్తుత ప్రపంచములో ఎన్నో శ్రమలు, వేదనలు, తీరని బాధలు,
రోగాలు, ఇంకా ఎన్నో మీలో ప్రతి ఒక్కరినీ ఏదో ఒకటి బాధ పెడుతూ ఉండవచ్చు. ఇది యేసు
క్రీస్తు ప్రభువు 2000 ఏళ్ల క్రితమే చెప్పారు. ప్రభువు చెప్పింది ఆయనను వెంబడించే శిష్యులకు.
యోహాను సువార్త 16:33 “లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి,
నేను లోకమును జయించి యున్నాననెను.” మీరు యేసు క్రీస్తు ప్రభువును వెంబడిస్తూ, ఆయన
వాక్యమునకు విధేయత చూపేవారైతే ఈ వాగ్దానము మీకు వర్తిస్తుంది. ప్రార్థన:
సెంట్లో నుండి ఎంత చక్కని సువాసన వస్తుందో మనకు తెలుసు. ఎక్కడైనా సుగంధ ద్రవ్యాలు,
వాటికి సంబంధీచిన నూనెలు ఉన్నట్లయితే వాటి సువాసన ఆ ప్రాంతమంతా వ్యాపిస్తుంది.
అవునా? ఒకవేళ మీరు నేను ఆలాటి సుగంధ ద్రవ్యాలు, లేదా వనమూలికలు అని పరిశుద్ధ
గ్రంధం బైబిల్లో ఎక్కడైనా ఉందా? అవును యేసు క్రీస్తును జీవితములో, హృదయములో
కలిగినవారు సువాసనను వెదజల్లుతూ ఉంటారని పరిశుద్ధగ్రంధం బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది.
ఈ నాటి మన ధ్యానంశo
“క్రీస్తుప్రభువు సువాసనను వెదజల్లుదాం! ” - లేఖన భాగము II కొరింధీ 2:12-17 మొదటి భాగము
ఈ లేఖన భాగము క్రీస్తు ప్రభువు సువాసనను ఎట్టి పరిస్థితుల్లో మనము వెదజల్లుతామో స్పష్టంగా
వ్రాయబడింది.
క్రీస్తు సువాసనను మనము వెదజల్లే మొదటి పరిస్థితి: చింత వ్యాకులముతో నిండిన పరిస్థితులు.
విడ్డూరంగా వుందికదూ! అపో. పౌలు గురించి మనకు అర్థమయ్యే విషయం ఏమిటి? ఆయన తన
“సమస్తమును” అవును, నూటికి నూరుపాళ్లు, సర్వస్వము, అప్పగించుకున్నాడు. ఏ
పరిస్థితుల్లోనైనా, శ్రమపడ్డానికి నిర్ణయించుకున్నాడు. చివరకు క్రీస్తు ప్రభువు కోసం
మరణించడానికైనా సంసిధ్ధంగా ఉన్నాడు. అదే సమయములో ఆయన కొరింధీ సహోదరులు,
సహోదరిలను మిక్కటంగా ప్రేమించాడు. అయినా ఆయన మనలాంటి మానవుడు. కాబట్టి
ఆయనకూడ అలిసిపోయాడు, సంకటపడ్డాడు. విసుగు చెందాడు, నిరుత్సాహపడ్డాడు. మన
ముందున్న లేఖనభాగపు మొదటి వచనాల్లో, ఆయన చేతకానంత ఆందోళన చెందడం
గమనిస్తున్నాము. ఆయనకు ప్రస్తుతం త్రోయలో సువార్త కోసం తెరచిన ద్వారము వద్ద ఉన్నాడు.
అ. కా. 16వ అధ్యాయము ప్రకారము ఈ ద్వారము మునుపు మూయబడింది. ఈ
ద్వారములోప్రవేశించడానికి ఎంతో సంతోషముతో ఉన్నాడేమో అని మనమంకుంటాం. కాని,
అలా జరగలేదు. తరువాత ఈ ద్వారములో ఆయన ప్రవేశించి పనిచేశాడనుకోండి. అయినా
కొరింధీ సంఘపు చింత ఆయనను ఎంత వేధిస్తుందoటే, అక్కడ ఆపని విడిచిపెట్టి తీతును
వెదకడానికి మాసిదోనియా వెళ్ళాడు.
శ్రోతలూ, పరిశుద్ధ గ్రంధములో మనము గమనించే వ్యక్తులలో మానవ బలహీనతలు
కనిపించినపుడు మనము సంతోషించాలి. వారి విజయాలు, అపజయాలు, మనకు పాఠాలుగా
ఉన్నాయి. అపో. పౌలును మనము చూచినపుడు ఆయన ఎంతో ఆత్మీయమైన బలవంతుడని,
లేదా అసలు మానవ బలహీనత లేనివాడేమో అనుకుంటాం. అది నిజము కాదు, ప్రియులారా!
యాకోబు పత్రికలో ఏలియా గురించి ఏమని వ్రాయబడింది? ఆయన మనవంటి స్వభాము
గలవాడు. ఈ మాటలు పౌలుకు కూడా వర్తిస్తాయి. ఈ పరిస్థితుల్లో ఆయన తన ఆందోళనకు
లోనయ్యాడు. ఒకవేళ త్రోయలోని మంచి ద్వారములో ఆయన అంతగొప్ప పరిచర్య
చేయలేకపోయాడేమో. కాస్త ఓపిక పడితే ఆయన పడిన ఆందోళన అనవసరమని మనకు ఇట్టే
అర్థమవుతుంది.
ఒక దినాన ఒక తల్లితండ్రులకు వారి కుమారునికి రోడ్డు మీద ఆక్సిడెంట్ అయిందని
తెలిసింది. అంబులెన్స్ లో అతణ్ణి తీసుకెళుతున్నారని కూడా చెప్పారు. ఇక వారి ఆందోళనకు
అంతులేదు. మీరైన నేనైనా ఆస్థానములో ఉంటే ఎంత భయం, ఆందోళన, పడతామో
మనకందరికి తెలుసు. కాని, తలుపు దాటి బయటికి వెళ్ళేముందు వారిద్దరు, ప్రార్థన చేసి ప్రభువు
సహాయము కోరి, ఆయనకు పరిస్థితిని అప్పగించి బయలుదేరారు. వెళుతూ ఉండగా ఆ భర్త
భార్యకు
చిన్న సలహా ఇచ్చాడు. “మనమిద్దరము ఆందోళనతో గాభరా పడుతూ ఉన్నట్లయితే,
క్రీస్తుప్రభువు
మన హృదయాల్లో లేనట్టే అవుతుంది.” ‘గాభరా, విస్మయం, అనుమానమునకు తావిస్తే, మనము
క్రీస్తు రక్షకుణ్ణి నమ్మనట్టే అవుతుంది,’ అని వారిద్దరు మాట్లాడుకున్నారు. "దేవుడు లేని వారికి
భేదమేముంటుంది?" అని భార్య అన్నది . ఇలా వారు మాట్లాడుకొని, ఒకరినొకరు ధైర్యపరచుకొని నిమ్మళంగా
అక్కడికి వెళ్లారు. ప్రియులారా, వారు క్రీస్తు సువాసనను వెదజల్లారు.
2016వ సంవత్సరములో నేను కాలు జారి బాత్రూమ్ బయట చాలా దారుణంగా
బండలమీద క్రిందపడ్డాను. దాని దెబ్బకు పెద్ద యెముక విరిగిoది. ముక్క
చెక్కలయ్యుంటుందేమో అనుకున్నాను. కాని ప్రభువు మహాకృపను బట్టి వెంట్రుకంత గ్యాప్
మాత్రమే ఎముకలో కలిగింది. డాక్టర్ సర్జరీ, చేయాలన్నారు. మీ వయసులో దానంతట అదే
అతుక్కొక పోవచ్చు అన్నారు. డాక్టర్ డిశ్చార్జ్ చేసి, పంపించడానికి ఒప్పుకోలేదు. రోగి రికార్డు బుక్ లో "ఈయన నా మాట వినడం లేదు" అని డాక్టర్ వ్రాసి పంపాడు. నా భార్య, పిల్లలు నన్ను ప్రోత్సహించి, "విశ్వాసమునకు తావిచ్చి,
బెడ్ రెస్ట్ తీసుకోమని" నన్ను చాలా ధైర్యపరచి ప్రోత్సహించారు.
ఎంతో జాగ్రతలు నా విషయం తీసుకున్నారు. నా భార్య చాలా కరుణతో జాగ్రత్తలు, శ్రద్ధ తీసుకున్నారు. బెడ్ రెస్ట్ లోనే 2 నెలలు ఉంచారు. ఆ తరువాత ఎక్స్‌రేలో ఎముక
అతుక్కున్నట్టుగా నిర్ధారణ అయింది. 60 ఏళ్లపైబడ్డ వయసులో సాధారణంగా అతుక్కొలేని పెద్ద
ఎముక అతుక్కుంది. ప్రభువు కనికరము చూపాడు.
మనకందరికి వేరు వేరు పరిస్థితుల్లో వేరు వేరు సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. క్లిష్ట
పరిస్థితులు అకస్మాత్తుగా ఎదురవుతాయి. సమస్యలు, సందేహాలు, బాధలు, నిందలు,
అపనిందలు, ఆందోళనలు, శ్రమలు, హింసలు, ఈలాటివి ఎదుర్కొనని వారు ఎవ్వరూ లేరు. ఎలా
ఎదుర్కుంటున్నాం అనేది ముఖ్యమైన సంగతి. ఎదుర్కొలేక కుప్పకూలిపోయినవారు
చాలామంది
ఉన్నారు. ఆ లిస్ట్ లో మీరు ఉన్నారా? ఆత్మహత్య ఒక్కటే మార్గమని తలంచుతున్నావా? నిరాశ
పడకండి, లేచి భోజనం చేయండి, ప్రభువు మీతో ఉన్నాడు. “నిన్నెన్నడును విడువను,
ఏమాత్రము ఎడబాయను” అని వాగ్దానము చేసిన యేసయ్య సజీవుడు. నీతో ఇప్పుడు తన
పరిశుధ్ద్ధాత్ముని ద్వారా మాట్లాడుతున్నాడు. చాలామంది 'మాకోసం ప్రార్థన చేయండి' అంటూ ఫోన్
చేస్తున్నారు. మీకోసం తప్పనిసరిగా ప్రార్థన చేస్తాము, చేస్తున్నాము. కానీ మాకంటే ఎక్కువగ,
బలముగా, దైవికశక్తితో ప్రార్థించే వారు ఇద్దరు ఉన్నారు. మీ బైబిల్లో గమనించండి. రోమా పత్రిక
8వ
అధ్యాయము 26వ వచనము గమనించండి. “అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి
సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన
చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ
తానే మన పక్షముగా విజ్ఞాపనముచేయుచున్నాడు. మరియు హృదయములను
పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని
చిత్తప్రకారము పరిశుద్దుల కొరకు విజ్ఞాపనము చేయు చున్నాడు.” పరిశుధ్ద్ధాత్ముడు విజ్ఞాపన
చేస్తున్నాడు, ఇక నేనెందుకు ప్రార్థన చేయడం అనుకోవడం బుద్ధిహీనత. నీవు చేస్తున్న ప్రార్థన
ఎలా చేయాలో, కొన్ని విపత్కర పరిస్థితుల్లో, ఆందోళనకరమైన పరిస్థితుల్లో నీకు తెలియదు, గనుక
ఆయన, అనగా పరిశుధ్ద్ధాత్ముడు నీ కోసం, మూలుగులతో అనగా వేదనతో, బాధతో
మూలిగినట్టుగా
విజ్ఞాపన చేస్తున్నాడు. అంతే కాదు, ఆయన, అనగా పరిశుధ్ద్ధాత్ముడు దేవుని చిత్తానుసారంగా
విజ్ఞాపన చేస్తాడు. అనగా నీవు అవసరం అనుకునేది ఆయన దృష్టిలో, అనంత జ్ఞానములో
అవసరం కాకపోవచ్చు. చాలామంది, పరిశుద్ధాత్ముని "అది" సంబోధిస్తుంటారు. అది సరికాదు.
ఆయన తండ్రితో, యేసు క్రీస్తు ప్రభువుతో సరిసమానుడు. ఇక రెండవవారు ఎవరు? జాగ్రతగా
గమనించండి. 34వ వచనం చివరిభాగం. “మృతులలోనుండి లేచినవాడును, దేవుని
కుడిపార్శ్వమున ఉన్నవాడును, మనకొరకు విజ్ఞాపనముకూడా చేయువాడును.... " ఆయనే! ప్రియులారా, మనకొరకు విజ్ఞాపన చేసే రెండవవారు స్వయానా యేసు క్రీస్తు ప్రభువు!
హల్లెలూయ! ! ఇక నీజీవితములో ఏ కొరత ఉండదు. అంటే అన్ని దొరికిపోతాయని అపార్థం చే
సుకోకండి. దేవుని దృష్టిలో పరలోకపు మహాభాగ్యం, పాప క్షమాపణ, విమోచన, తండ్రి కుమార, పరిశుధ్ధాత్మల
సహవాసము. ఇంకా ఈవిధమైన ఆత్మీయ దీవెనలు ఎన్నెన్నో ముఖ్యమైనవి ఉన్నవి. లేఖనములు వాగ్దానము చేసిన దేవునిశాపము, దేవుని తీర్పు నుండి విమోచన, నిత్య జీవము, నిత్య
ఆనందము, పాపముమీద, పాపస్వభావము మీద విజయము, ఇవి అత్యంత ప్రాముఖ్యమైనవి. ఎఫెసి పత్రికలో ఉన్నట్టు “పరలోకవిషయములలో ఆత్మ
సంబంధమైన ప్రతి ఆశీర్వాదము” యేసుక్రీస్తు ద్వారా మనకు అవసరం. వీటిచేత అన్నిపరిస్థితులలో మీరు, నేను క్రీస్తు
సువాసన ప్రతిచోట వెదజల్లుతూ ఉంటాం. ఇంటా, బయట, బజారులో దేవుని మందిరములో,
కష్టములో, సుఖములో, నీతో ఉంటాడు. నీవు నమ్మితే ఇప్పుడు నీతో ఉన్నాడు. అట్టి కృప త్రియేక దేవుడు మనలో ప్రతి ఒక్కరికీ అనుగ్రహించుగాక!
అమెన్!
> II Cor-15 2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...